APJ Abdul Kalam
-
నిబద్ధతను గుర్తించడమూ నిబద్ధతే!
రాష్ట్రపతి పదవిని అలంకరించిన ఆర్. వెంకట్రామన్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్‌లు (APJ Abdul Kalam) ఆ స్థితికి చేరడానికి ఎంతటి అర్హులో చెప్పే అరుదైన సంఘటన ఇది. 1983లో అబ్దుల్ కలామ్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ)లో డైరెక్టర్‌గా విధులు నిర్వహించే రోజుల్లో రక్షణ మంత్రిగా ఆర్. వెంకట్రామన్ (R. Venkataraman) ఉన్నారు. దేశ సంరక్షణ కోసం స్వదేశీ రీసెర్చ్ ద్వారా క్షిపణులు, ఉపగ్రహాల నిర్మాణం చేపట్టాలని భారత ప్రభుత్వం ‘మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కమిటీ’ని నియమించింది. ఇందులో కలామ్ అధ్యక్షునిగా, ఐదుగురు అనుభవజ్ఞులైన సైంటిస్టులు సభ్యులుగా ఉన్నారు. త్రివిధ దళాలకు ఉపయోగపడే క్షిపణులు, ఉపగ్రహాల నిర్మాణానికి కావలసిన బడ్జెట్ వివరాల నమూనా (బ్లూ ప్రింట్) తయారు చేసే బాధ్యత ఈ కమిటీకి అప్పజెప్పింది రక్షణ శాఖ. పలు చర్చలు, తర్జన భర్జనలు జరిపిన అనంతరం, కమిటీ పది సంవత్సరాల కాలవ్యవధి, రూ. 390 కోట్ల బడ్జెట్‌తో ఒక డ్రాఫ్ట్ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసింది.రక్షణ మంత్రి, త్రివిధ దళాల ముఖ్య అధి కారుల సమావేశంలో కలామ్ తమ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను వివరించారు. మంత్రి దశల వారీగా కాకుండా ‘సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం’ (ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ ప్రోగాం)ను అతి తక్కువ సమయంలో తయారు చేసే పద్ధతిలో ప్లాన్ తీసుకురావలసిందిగా కోరారు. అది విని సైంటిస్టులు దీనికి కొంత వ్యవధి కావాలని కోరారు. ‘లేదు, లేదు; రేపు సాయంత్రం కేబినెట్ కమిటీ మీటింగు జరగబోతోంది, అందులో మీ ప్రాజెక్టు రిపోర్టు ఉంచాల్సి ఉంటుంది’ అని, మరుసటి రోజు ఉదయం తనను కలవాల్సిందిగా కోరారు వెంకట్రామన్. కలామ్, కమిటీ సభ్యులూ ఆఫీసు చేరుకుని ఆలస్యం చేయకుండా ఆ పనిలో రాత్రంతా తల మునకలయ్యారు. ఎప్పుడు తెల్ల వారిందో తెలీనేలేదు. మొత్తానికి మంత్రి కోరినట్టుగానే రిపోర్టు తయారు చేశారు.ఉదయం ఇంటికెళ్ళి బ్రేక్‌ఫాస్ట్ టేబిల్ దగ్గర కూర్చున్నాక గుర్తుకొచ్చింది కలామ్ గారికి, ఆరోజు జుమ్మేరాత్; ఆయన అన్న కూతురు జమీలాది ‘నిఖా’ అన్న సంగతి! అదీ ఢిల్లీలో కాదు, దక్షిణాది రామేశ్వరంలో! వృత్తి ఒత్తిడి రీత్యా కుటుంబ బాధ్యతలు విస్మరించడం ఎంతవరకు సబబు? ఇది ఆయన మనసును కలచి వేసింది. కాని ఇవ్వాళ, ఆమె పెళ్లికి తను హాజరు కాలేని నిస్సహాయ పరిస్థితి! బ్రేక్‌ఫాస్ట్ పూర్తి చేసుకుని, తన టీమ్‌తో సౌత్ బ్లాక్ చేరుకుని, రాత్రి సవరించిన ప్రాజెక్టు రిపోర్టును మంత్రి వెంకట్రామన్కి చూపించారు డాక్టర్ కలామ్. దాన్ని సావధానంగా వీక్షించి తను సూచించిన విధంగానే తయారవటంతో హర్షం వ్యక్తం చేస్తూ ఆయన, ‘ఇలాంటి క్లిష్టమైన జాబ్ మీతోనే సాధ్య పడుతుంది అనే నమ్మకంతోనే మిమ్మల్ని డీఆర్డీఓ డైరెక్టర్‌గా నియమించా కలామ్‌జీ’, అని నవ్వుతూ ఆయన భుజం తట్టి, ఇక వెళ్దాం అన్నట్టు కుర్చీలో నుండి లేచి నిలుచున్నారు వెంకట్రామన్. తోటి సభ్యులు ఛాంబర్ నుండి వెళ్ళే ముందు డాక్టర్ అరుణాచలం (టీం సభ్యుడు) మంత్రి గారితో, ‘ఇవ్వాళ సాయంత్రం రామేశ్వరంలో కలామ్ అన్నగారి అమ్మాయి పెళ్ళి’ అనటంతో, కలామ్ వైపు ఆశ్చర్యంగా నఖశిఖ పర్యంతం చూశారు మినిస్టర్. కాసేపటికి తేరుకుని, తన పర్సనల్ సెక్రటరీని పిలిచి అర్జంటు సూచనలు కొన్ని చేశారు. ఢిల్లీ విమానా శ్రయం నుండి మద్రాసుకు ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ మరో గంటలో వెళ్లనుంది. కావలసిన బ్యాగేజ్‌తో రామేశ్వరం చేరుకోవటానికి వెంటనే ఎయిర్పోర్ట్ చేరుకోవలసిందిగా కలామ్‌కు చెప్పారు మంత్రి పీఏ. ఈసారి ఆశ్చర్యంలో మునగటం డాక్టర్ కలామ్ వంతైంది.విమానం మద్రాసు రన్ వేపై దిగినవెంటనే ప్రక్కనే ఆయన కోసం వేచి ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ఆయన్ని తీసుకుని మదురైకి బయలుదేరింది. అక్కడ ఎయిర్‌ఫోర్స్ కమాండెంటు తన వాహనంలో ఆయన్ని రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లారు. మదురైనుండి రామేశ్వరం బయల్దేరే ట్రెయిన్‌ను కలామ్ వచ్చే వరకు ఆపాలని, ఉదయమే రాష్ట్రపతి కార్యాలయం నుండి మదురై రైల్వే డివిజనల్ సూపరింటెండెంట్‌కు సూచనలు అందాయి. అంతే... కలామ్ రావటంతో ఆయనను రిసీవ్ చేసుకుని ట్రెయిన్లో కూర్చో బెట్టారు రైల్వే ఉన్నత అధికారులు. 175 కి.మీ. దూరం రామేశ్వరం. చదవండి: డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశారు!ఆ ట్రెయిన్ మూడు గంటల్లో గమ్యం చేరటంతో జమీలా పెళ్ళి ముహూర్తానికి చేరుకున్నారు కలామ్ సాబ్. అనుకోని ఆయన రాకతో ఆ కుటుంబంలో సంతోషం రెండింతలైంది. ఉదయం ఢిల్లీ ఎయిర్‌పోర్టు చేరుకునే ముందు, తన సహచరుడు డాక్టర్ అరుణాచలం ‘గత ఆరు నెలలుగా మీరు చేసిన కష్టానికి ప్రతిఫలం ఇది’ అన్న మాటలు జ్ఞప్తికి వచ్చాయి కలామ్‌కు. ఎంతనిజం! తన వృత్తి పట్ల చూపిన నిబద్ధతకు రక్షణమంత్రి బహుశా ఇది తనకు ఇచ్చిన బహుమతి కాబోలు అనుకున్నారు కలామ్ సర్. తర్వాత కాలంలో వీరిద్దరూ రాష్ట్రపతి పీఠం అధిరోహించటం గమనార్హం!- జిల్లా గోవర్ధన్ వ్యాసకర్త మాజీ పీఎఫ్ కమిషనర్, ముంబై (డాక్టర్ అబ్దుల్ కలామ్ ఆత్మ కథ ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ ఆధారంగా)(జనవరి 27న మాజీ రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ వర్ధంతి) -
కలాం జయంతి: నివాళులర్పించిన వైఎస్ జగన్
తాడేపల్లి, సాక్షి: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం శాస్త్రవేత్త, రాష్ట్రపతిగా ఎన్నో సేవలు అందించారని ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. ‘‘అబ్దుల్ కలాం వినయం, ముందుచూపు, విజ్ఞానం, విద్య మీద ఉన్న అచంచలమైన అంకితభావం లక్షలాది మంది హృదయాలలో చెరగని ముద్ర వేసింది. కలాం జీ వారసత్వం మానవాళికి ఆశాజ్యోతిగా భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది’’ అని అన్నారు.Remembering Dr. A.P.J. Abdul Kalam Ji on his birthday! A scientist and a revered President his humility, vision, wisdom and unwavering dedication to education have left an indelible mark in the hearts of millions . Kalam Ji’s legacy continues to be a beacon of hope for humanity…— YS Jagan Mohan Reddy (@ysjagan) October 15, 2024 చదవండి: మీరే కదా బాబూ.. లిక్కర్ మాఫియా సూత్రధారి, పాత్రధారి: వైఎస్ జగన్ -
రాష్ట్రపతి భవనంలో మిస్సైల్ మ్యాన్!
అదృష్ట దేవత ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో ఎవరూ ఊహించలేరు. భారత ప్రభుత్వం ప్రిన్సిపల్ సైంటిఫిక్ సలహాదారుగా, ఢిల్లీలో విధులు నిర్వహిస్తున్న ‘మిస్సైల్ మ్యాన్’ ఆవుల్ ఫకీర్ జైనులుబ్దీన్ (ఏపీజే) అబ్దుల్ కలాం, 71వ ఏట, విశ్రాంత జీవితం కోసం డిసెంబర్ 2001లో చెన్నై చేరుకున్నారు. హాబీ కోసం అన్నా యూనివర్సిటీలో పార్ట్ టైం ప్రొఫెసర్ వర్కు ఎంచుకున్నారు ఆయన. ఆ రోజు (జూన్ 10, 2002) సాయంత్రం 5 గం.లు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఛాంబర్లో ల్యాండ్ ఫోన్ ఆగకుండా మ్రోగటంతో, స్టాఫ్ విసుగుతో ఫోన్ ఎత్తి తమిళంలో, ‘హలో, యారదు’(ఎవరది) అని ప్రశ్నించటంతో, ‘దిస్ ఈజ్ ఫ్రమ్ పీఎంఓ ఆఫీస్, ఢిల్లీ. ప్రధాని కలాం సర్‌తో మాట్లాడాలి, పిలవండి’ అని అవతలి గొంతు వినిపించింది. పీఎంఓ మాట విని భయంతో, ‘సార్, క్లాసులో పాఠం బెబుతున్నారు. అది అవగానే కబురు చేస్తాను సార్’ అన్నాడు ఆఫీసు క్లర్కు. ఆరు గంటలకు, లెక్చర్ ముగించిన కలాం వరండాలో నడుస్తున్నది చూసి, వైస్ ఛాన్సలర్ ఏ. కళానిధి ఆయనకు ఎదురెళ్లి ఆతృతగా, ‘సార్ ఢిల్లీ నుండి మెసేజ్, ప్రధాని మీతో అర్జంటుగా మాట్లాడాలట’ అని అన్నాడు. ఆశ్చర్యంతో కలాం కనుబొమ్మలు ముడివడ్డాయి. ‘ఏమై ఉంటుందబ్బా?’ అనుకుంటూ వీసీ ఆఫీసు రూం కెళ్ళి, పీఎంఓకు ఫోన్ చేశారు. లైన్లో ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి! ‘హలో కలాం సర్, హౌ ఈజ్ యువర్ అకాడమిక్ లైఫ్?’ అన్న ఆయన ప్రశ్నకు, ‘ఇట్ ఈజ్ వెరీ వండర్ఫుల్ సార్’ కలాం జవాబు. ‘ఇక అది వదలి, మీరు నా కోసం ఢిల్లీ రావలసి ఉంటుంది’ అంటూ గట్టిగా నవ్వారు ప్రధాని. సడన్‌గా జోకులు పేల్చి ఎదుటి వారిని తికమక పెట్టడం అటల్జీకి వెన్నతో పెట్టిన విద్య. ‘వింటున్నారా కలాంజీ’ మళ్ళీ ప్రశ్న. ‘యస్ సార్.’ ‘ఇవాళ మధ్యాహ్నం జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ మీటింగులో రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి మీ పేరును ప్రస్తావించారు. మీ సమ్మతి కోసమే ఎదురుచూస్తున్నాము.’ ఊహించని పీఎం ప్రతిపాదనకు ఎటూ తోచలేదు కలాంజీకి. ‘ఆలోచించుకోవటానికి కొంత వ్యవధి ఇవ్వండి సార్‘ అని మాత్రం అనగలిగారు. ‘మీరు జస్ట్ ఓకే అనండి, రాష్ట్రపతి భవనంలోకి తీసుకెళ్ళే బాధ్యత నాది; ఫర్లేదు, రాత్రి 8.30 గంటల వరకూ మీకు సమయం ఉంది. ఆలోచించుకోండి; నో మాత్రం అనొద్దు ప్లీజ్’ అంటూ ఫోన్ పెట్టేశారు ప్రధాని. విషయం విని వైస్ ఛాన్సలర్ కళానిధి సంతోషం పట్టలేక కలాం చేయి అందు కుని, ‘అభినందనలు సార్’, అని అన్నారు. కలాం గారి మిత్ర బృందంలో ఈ వార్త అదే రాత్రి సుడిగాలిలా వెళ్ళింది. అందరిదీ ఓకే మాట... ‘వెతుక్కుంటూ వచ్చిన ఈ అవకాశాన్ని వదలుకోవద్దు’ అని. ఇక రాత్రి 8.45 గంటలకు ప్రధాని కార్యాలయం నుండి మళ్ళీ కాల్. ప్రధాని ప్రపోజల్‌కు ‘యస్’ అన్నారు కలాం.13వ త్రిశంకు లోక్ సభలో బీజేపీకి దక్కిన సీట్లు కేవలం 182. బహుళ పార్టీల మద్దతుతో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం వాజ్‌పేయి నేతృత్వంలో కత్తి మీది సాములా కొనసాగుతోంది. రాష్ట్రపతి ఎన్నికకు బీజేపీ అభ్యర్థికి ఎలెక్టోరల్ కాలేజీలో సరిపోను సంఖ్యా బలం కూడా లేదు అప్పటికి. ఐదు పదుల అలుపెరుగని పార్లమెంటరీ అనుభవం ఆయనది. అదే ఆత్మ విశ్వాసంతో, రాజకీయాలకు అతీతంగా ఉన్న ప్రఖ్యాత సైంటిస్టు, ఏపీజే కలాం పేరును రాష్ట్రపతి పదవికి అధికారికంగా ప్రకటించారు. తనదైన శైలిలో చక చక పావులు కదిపి, ప్రతిపక్షంలోని సీనియర్ నాయకులు శరద్ పవార్, ములాయం సింగ్, లాలూ యాదవ్ లను సంప్రదించి, కలాం అభ్యర్థిత్వాన్ని సుగమం చేశారు వాజ్‌పేయి. ఎన్డీఏ నాయకుల సమక్షంలో జూన్ 18న అబ్దుల్ కలాంతో నామినేషన్ వేయించారు. రెండు రోజుల తర్వాత కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిసి, కలాంకు కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడా సంపాదించి, జూలై 25న 11వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం జరిపించి తీరారు ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి. చివరిగా, దేశ ప్రథమ పౌరునిగా అబ్దుల్ కలాం పేరును ఎన్డీఏ తెరపైకి తెచ్చిన ఘనత మన తెలుగు ఐఏఎస్ అధికారి ఎస్వీ ప్రసాద్‌దే అన్న విషయం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. అప్పట్లో అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమ్రంతికి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ప్రసాద్... కలాం పేరు రాష్ట్రపతి పదవి కోసం సూచించారు. ఎన్డీఏ కన్వీనర్ హోదాలో ఉన్న నాటి ఏపీ సీఎం... వాజ్‌పేయికి ఈ ప్రతిపాదన చేశారు. జిల్లా గోవర్ధన్ వ్యాసకర్త విశ్రాంత పీఎఫ్ కమిషనర్, ముంబై ‘ 98190 96949(‘టర్నింగ్ పాయింట్స్, ఎ జర్నీ త్రూ ఛాలెంజెస్’ అనేఅబ్దుల్ కలాం గ్రంథం ఆధారంగా...) -
నన్ను ప్రశంసించడానికి కాల్ చేస్తే.. రాంగ్ కాల్ అని పొరబడ్డా : సుధామూర్తి
‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత, రచయిత, రాజ్యసభ ఎంపీ, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య సుధామూర్తి తాజాగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. మాజీ రాష్ట్రపతి దివంగత డా. ఏపీజే అబ్దుల్ కలాం నుంచి తనకు పోన్ వస్తే రాంగ్ కాల్ అంటూ ఆపరేటర్‌కి చెప్పిన సంగతిని ప్రస్తావించారు. నిజానికి తన భర్త నారాయణ మూర్తికి ఉద్దేశించిన కాల్ ఏమో అనుకుని పొరపాటు పడ్డానని చెప్పారు. ఆ తరువాత విషయం తెలిసి చాలా సంతోషించానని ఆమె పేర్కొన్నారు.Once I received a call from Mr. Abdul Kalam, who told me that he reads my columns and enjoys them. pic.twitter.com/SWEQ6zfeu4— Smt. Sudha Murty (@SmtSudhaMurty) June 25, 2024 విషయం ఏమిటంటే..ఎక్స్ వేదికగా సుధామూర్తి దీనికి సంబంధించిన ఒక ఆడియో క్లిప్‌ను షేర్ చేశారు. ఇందులో అబ్దుల్ కలామ్ నుంచి తనకు ఫోన్ వచ్చినప్పుడు ఏం జరిగిందో వివరించారు. ‘ఐటీ డివైడ్' పేరుతో సుధామూర్తి ఒక కాలమ్ నడిపేవారు. దీన్ని అబ్దుల్ కలాం క్రమం తప్పకుండా చదివేవారట. అంతేకాదు ఈ రచనను బాగా ఆస్వాదించేవారు కూడా. ఇదే విషయాన్ని స్వయంగా ఆమెకు చెప్పేందుకు అబ్దుల్ కలాం ఫోన్ చేశారు. అయితే రాష్ట్రపతి భవన్ నుంచి తనకు ఫోన్ కాల్ వస్తే ‘రాంగ్ కాల్’ అని (ఆపరేటర్‌కి) తాను సమాధానం ఇచ్చానని సుధామూర్తి వెల్లడించారు. తన భర్త నారాయణమూర్తికి చేయబోయి తనకు చేశారేమో అనుకున్నానని, అందుకే అలా చెప్పినట్టు ఆమె పేర్కొన్నారు. అయితే ‘‘లేదు లేదు.. ఆయన (అబ్దుల్ కలాం) ప్రత్యేకంగా మీ పేరే చెప్పారు’ అని ఆపరేటర్ చెప్పడంతో ఆశ్చర్యపోవడం ఆమె వంతైంది. తాను కాలమ్‌ని చదివి ప్రశంసించడానికి కలాం ఫోన్ చేశారని తెలిసి చాలా సంతోషించాననీ, చాలా బావుందంటూ మెచ్చుకున్నారని సుధా మూర్తి ప్రస్తావించారు. ఈ సందర్బంగా కలాం నుంచి పౌరపురస్కారం అందుకుంటున్న ఫోటోని కూడా ఆమె పోస్ట్ చేశారు. కాగా రచయితగా పరోపకారిగా సుధామూర్తి అందరికీ సుపరిచితమే. బాల సాహిత్యంపై పలు పుస్తకాలు రాశారు. కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో ఆమె సాహిత్యానికి పలు అవార్డులు కూడా దక్కాయి. 73 ఏళ్ళ వయసులో సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం లభించింది. ఇంకా అత్యున్నత పౌరపురస్కారాలైన పద్మశ్రీ (2006), పద్మ భూషణ్ (2023) కూడా ఆమెను వరించాయి. కాగా ఈ ఏడాది ప్రారంభంలో సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. -
నిజాయితీకి నిలువుటద్దం కలాం: ఆ చెక్కను జిరాక్స్ తీసి, ఫ్రేమ్ కట్టించి
న్యూఢిల్లీ: ‘ఇతరులు ఇచ్చే కానుకలు, బహుమానాల వెనుక స్వార్థపూరిత కారణం ఉండొచ్చు. మన నుంచి ఏదో ఒకటి ఆశించి ఇలాంటివి ఇస్తుంటారు. అది స్వీకరించే ముందు ఈ విషయం ఆలోచించాలి’.. ప్రఖ్యాత సైంటిస్ట్, భారతరత్న, దివంగత రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం బాల్యంలోనే తన తండ్రి వద్ద నేర్చుకున్న పాఠమిది. ఈ పాఠాన్ని జీవితాంతం ఆయన ఆచరించారు. విలువలకు, నిజాయతీకి మారుపేరైన అబ్దుల్ కలాం ఇతరుల నుంచి ఏనాడూ కానుకలు ఆశించలేదు. ఎవరైనా ఇలాంటివి ఇస్తే దాని ధర ఎంతో తెలుసుకొని చెక్కు లేదా డబ్బులు పంపించేవారు. మిస్సైల్ మ్యాన్ కలాం గొప్పతనాన్ని తెలియజేసే మరో సంఘటన వెలుగులోకి వచి్చంది. కలాంకు సంబంధించిన ఈ ఉదంతాన్ని ఐఏఎస్ అధికారి ఎం.వి.రావు తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. 2014లో కలాం ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘సౌభాగ్య వెట్ గ్రైండర్’ అనే సంస్థ ఆయనకు ఒక గ్రైండర్‌ను బహూకరించింది. దాన్ని స్వీకరించడానికి ఆయన తొలుత అంగీకరించలేదు. చివరకు బలవంతం మీద స్వీకరించారు. ఆ మరుసటి రోజే దాని ధర తెలుసుకొనేందుకు తన సహాయకుడిని మార్కెట్‌కు పంపించారు. తర్వాత తన వ్యక్తిగత బ్యాంకు ఖాతా నుంచి చెక్కును సౌభాగ్య సంస్థకు పంపారు. చెక్కును ఆ సంస్థ నగదుగా మార్చుకోకపోవచ్చన్న అనుమానం ఆయనకు వచ్చింది. తన బ్యాంకు ఖాతా నుంచి నగదు డెబిట్ అయ్యిందో లేదో కనుక్కున్నారు. కాలేదని తెలిసింది. గడువులోగా నగదుగా మార్చకోకపోతే గ్రైండర్‌ను వెనక్కి ఇచ్చేస్తానని సౌభాగ్య సంస్థకు కలాం సమాచారం పంపారు. ఇక చేసేది లేక ఆ సంస్థ ఆ చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేసి, డబ్బులు తీసుకుంది. అబ్దుల్ కలాం ఇచ్చిన చెక్కును జిరాక్స్ తీసి, ఫ్రేమ్ కట్టించి భద్రంగా దాచుకుంది. ఎం.వి.రావు షేర్ చేసిన పోస్టుపై నెటిజన్లు సోషల్ మీడియాలో అభినందనల వర్షం కురిపిస్తున్నారు. కలాం వ్యక్తిత్వాన్ని గుర్తుచేసుకుంటున్నారు. -
విజయసాయిరెడ్డికి సన్సద్ రత్న అవార్డు
సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి ‘సన్సద్ రత్న’(పార్లమెంటరీ రత్న) అవార్డుకు ఎంపికయ్యారు. 2023 ఏడాదిగానూ సన్సద్ రత్న అవార్డు విజేతల లిస్ట్‌ను ప్రకటించారు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. ఇందులో వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ తరపున రవాణా, పర్యాటకం, సాంస్కృతిక వ్యవహారాల స్టాండింగ్ కమిటీకి అధ్యక్షత వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. సన్సద్ రత్న అవార్డుకు ఎంపికైన ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ ద్వారా అభినందనలు తెలియజేశారు. జ్యూరీ కమిటీ ఈఏడాదికిగానూ పదమూడు మంది ఎంపీలతో పాటు 2 పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలకు, 1 లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులను ప్రకటించింది. ఇందులో.. సీపీఐ(ఎం) సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యులు టీకే రంగరాజన్‌కు ఈ ఏడాది ఏపీజే అబ్దుల్ కలాం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును ప్రకటించారు. Congratulations to the MP colleagues who will be conferred the Sansad Ratna Awards. May they keep enriching parliamentary proceedings with their rich insights. https://t.co/IqMZmLfC1l — Narendra Modi (@narendramodi) February 22, 2023 పార్లమెంట్లో సభ్యుల పనితనానికి గౌరవసూచీగా ఈ అవార్డులను అందిస్తున్నారు. ఐఐటీ మద్రాస్ సహకారంతో.. సన్సద్ రత్న అవార్డులను 2010 నుంచి అందిస్తున్నారు. దేశ మాజీ రాష్ట్రపతి, సైన్స్ మేధావి ఏపీజే అబ్దుల కలాం సూచన మేరకు.. ఆయన గౌరవార్థం ఈ అవార్డులను ఇవ్వడం ప్రారంభించారు. తొలి ఎడిషన్ చెన్నైలో జరగ్గా.. ఆయన స్వయంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు కూడా. సంసద్ రత్న అవార్డులను భారత ప్రభుత్వం అందించదు. అయినప్పటికీ జ్యూరీలో మాత్రం ప్రభుత్వంలో వ్యక్తులను చేరుస్తున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రాం మేఘ్ వాల్.. సన్‌సద్‌రత్న అవార్డుల జ్యూరీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే.. కేంద్ర ఎన్నికల సంఘం మాజీ చైర్మన్ టీఎస్ కృష్ణమూర్తి సహ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. పార్లమెంట్లో సభ్యులు అడిగే ప్రశ్నలు, ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్స్ బిల్లులు, ప్రారంభించిన చర్చలు, హాజరు, వినియోగించిన నిధులు మొదలైన అంశాల ఆధారంగా జ్యూరీ అవార్డులకు విజేతలను ఎంపిక చేస్తుంది. సభ్యుల పనితీరు డేటా PRS లెజిస్లేటివ్ రీసెర్చ్ అందించిన సమాచారం ఆధారంగా పరిగణనలోకి తీసుకుంటుంది జ్యూరీ. ఇప్పటిదాకా 90 మంది పార్లమెంటేరియన్లకు ఈ అవార్డులను అందించారు. తాజాది 13వ ఎడిషన్ కాగా.. మార్చి 25వ తేదీన న్యూఢిల్లీలో అవార్డుల ప్రదాన కార్యక్రమం జరగనుంది. -
అబ్దుల్ కలాం దేశానికి స్ఫూర్తిదాయకం
సాక్షి, అమరావతి: యువత కలలు కనాలి.. ఆ కలలను సాకారం చేసుకునేందుకు కష్టపడాలి.. అన్న కలాం మాటలు ఈ దేశానికి స్ఫూర్తి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మేన్, భారతరత్న, ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి అంటూ ట్వీట్ చేశారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో .. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఏపీజే భారతరత్న అబ్దుల్ కలాం జయంతిని ఘనంగా నిర్వహించారు. కలాం చిత్రపటానికి వైఎస్సార్సీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ, వైఎస్సార్పీపీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకుడు లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహరరెడ్డి, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు షేక్ ఆసిఫ్, కొమ్మూరి కనకారావుమాదిగ, అడపాశేషు, వెంకటనారాయణ, వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా డాక్టర్స్‌సెల్ అధ్యక్షుడు డాక్టర్ మహబూబ్ పాల్గొన్నారు. -
ఆరు చొక్కాలు.. నాలుగు ప్యాంట్లు.. ఒక జత షూ
దేశ ప్రథమ పౌరుడి హోదాలో కూడా అతి సామాన్య జీవితాన్ని గడిపి ఈ తరానికి స్ఫూర్తిగా నిలిచిన మహానుభావుడు అబ్దుల్ కలామ్. రాష్ట్రపతిగా (2002–2007) కలామ్‌కి ఎంత గొప్ప వ్యక్తి దగ్గర్నుంచి ఉత్తరం వచ్చినా, ఎంత చిన్న వ్యక్తి దగ్గర్నుంచి అభినందన వచ్చినా.. స్వయంగా తానే వారికి జవాబు రాసి పంపేవారట. అభినందనలకు కృతజ్ఞతలూ తెలిపేవారట. వినయం, విజ్ఞత, ఔదార్యం ఆయనకు పుట్టుకతోనే అబ్బిన గుణాలు. కలామ్ రాష్ట్రపతిగా పదవీ స్వీకారం చేసిన వెంటనే అంతకుముందు తను చేసిన ఉద్యోగం తాలూకు సేవింగ్స్ అన్నింటినీ ‘పురా’ (ప్రొవైడింగ్ అర్బన్ ఎమినిటీస్ టు రూరల్ ఏరియాస్) అనే ట్రస్టును స్థాపించి దానికి రాసిచ్చేశారు. పట్టణ సౌకర్యాలను గ్రామాల్లోనూ అందుబాటులోకి తేవడం పురా పని. కలామ్ సంపాదించిన ప్రతి పైసా ఆ ట్రస్ట్‌కే వెళ్లింది. చనిపోయే నాటికి కలామ్ దగ్గరున్న ఆస్తి.. 25 వందల పుస్తకాలు, ఒక చేతి గడియారం, ఆరు చొక్కాలు, నాలుగు పాంట్లు, ఒక జత షూ మాత్రమే! సామాన్యుడికి కూడా ఇంతకన్నా ఎక్కువ ఆస్తే ఉంటుంది కదా. కలామ్ ఎప్పుడు ఎక్కడ ఉపన్యాసం ఇచ్చినా అందులో ‘తిరుక్కురల్’ అనే పుస్తకంలోని సూక్తులను తప్పకుండా ప్రస్తావించేవారు. నేడు ఆయన వర్ధంతి. 2015 జూలై 27న షిల్లాంగ్‌లోని ఐఐఎంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రొఫెసర్ కలామ్ హటాత్తుగా ప్రసంగం మధ్యలో గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆరా హౌస్ ముట్టడి 1857 సిపాయిల తిరుగుబాటు ప్రస్తావన రాగానే మొదట ఢిల్లీ, లక్నో, కాన్పూర్ పేర్లు స్ఫురిస్తాయి. బిహార్ పేరు తక్కువగా వినిపిస్తుంది. బ్రిటిషర్ల అధీనంలోని ప్రాంతాలను స్వాధీనం చేసుకునేందుకు దేశంలో పలు ప్రాంతాల్లోని భారతీయ సిపాయిలు, స్థానిక జమీందారులు తిరుగుబాట్లు చేశారు. ఆ వరుసలో అదే ఏడాది బిహార్ ప్రాంతంలో జూలై 27 జరిగిన ‘ఆరా హౌస్ ముట్టడి’ కూడా చరిత్రాత్మకమైనదే. దుర్భేద్యమైన ఆ భవంతిలో ఉన్న ఈస్టిండియా కంపెనీ, బ్రిటిష్ అధికారులను తరిమికొట్టేందుకు కున్వర్సింగ్, బాబు అమర్‌సింగ్, హరేకృష్ణసింగ్, రంజిత్‌సింగ్ అహిర్ అనే తిరుగుబాటు నాయకుల నేతృత్వంలో ముట్టడి జరిగింది. ఆగస్టు 3 వరకు జరిగిన ఆ 8 రోజుల పోరాటంలో చివరికి బ్రిటిష్ వారే గెలిచినప్పటికీ భారతీయులు వీరోచితంగా పోరాడి చరిత్రలో నిలిచిపోయారు. ముఖ్యంగా కున్వర్ సింగ్! బిహార్, భోజ్‌పూర్‌జిల్లా జగ్దీశ్‌పూర్‌లోని రాజకుటుంబానికి చెందిన కున్వర్ సింగ్ తన 80 ఏళ్ల వయసులో ఈ ఆరాహౌస్ ముట్టడిని నడిపించారు! (చదవండి: మేరీ కోమ్ విల్‌పవర్ పంచ్) -
అత్యధిక మెజారిటీతో గెలిచిన రాష్ట్రపతి ఎవరో తెలుసా?
దేశానికి 15వ రాష్ట్రపతిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగుస్తుంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ నిర్వహించింది. 21న ఓట్ల లెక్కింపు జరిగింది. ద్రౌపది ముర్ము తన ప్రత్యర్థి యశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన రాష్ట్రపతి ఎన్నికలపై విహంగ వీక్షణం.. స్వతంత్ర భారత తొలి రాష్ట్రపతిగా డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ సేవలు అందించారు. రెండు పర్యాయాలు రాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక వ్యక్తి ఆయనే కావడం విశేషం. అంతేకాదు అత్యధిక మెజారిటీతో గెలిచిన రికార్డు కూడా ఆయన పేరిటే ఉంది. కాగా, 1950 జనవరి 26న రాజేంద్రప్రసాద్‌ను రాష్ట్రపతిగా ఎన్నికైనట్టు రాజ్యాంగం ధ్రువీకరించింది. కేంద్ర ఎన్నికల సంఘం 1952లో తొలిసారిగా నిర్వహించిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. స్వతంత్ర భారత మొట్ట మొదటి ఉప రాష్ట్రపతిగా పనిచేసిన ప్రముఖ తత్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్.. 1962లో రెండో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. జాకిర్ హుస్సేన్ 1967లో మూడవ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. దురదృష్టవశాత్తు పదవీలో ఉండగానే 1969, మే 3న ఆయన కన్నుమూశారు. జాకిర్ హుస్సేన్ మరణంతో 1969లో జరిగిన ఎన్నికల్లో వరాహగిరి వేంకటగిరి నాలుగో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రెండో ప్రాధాన్య ఓట్లతో గెలిచిన తొలి రాష్ట్రపతిగా ఆయన చరిత్ర కెక్కారు. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్.. భారత ఐదో రాష్ట్రపతిగా పనిచేశారు. పదవిలో ఉండగానే 1977, ఫిబ్రవరి 11న మరణించారు. ఏకగ్రీవంగా రాష్ట్రపతి పదవిని దక్కించుకున్న ఘనత నీలం సంజీవరెడ్డికి దక్కింది. 1977 నాటి ఎన్నికల్లో పోటీలో ఉన్న 37 మందిలో సంజీవరెడ్డి నామినేషన్ మినహా మరెవరిదీ చెల్లకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జ్ఞానీ జైల్ సింగ్ 1982లో దేశానికి 7వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. దేశ ప్రథమ పౌరుడిగా ఎన్నికైన ఏకైక సిక్కుగా ఆయన ఖ్యాతికెక్కారు. ఆర్. వెంకట్రామన్ దేశానికి 8వ రాష్ట్రపతిగా సేవలు అందించారు. ఆయన హయాంలోనే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల శకం ఆరంభమైంది. శంకర్‌దయాళ్ శర్మ 1992లో దేశానికి 9వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఆయన ఉపరాష్ట్రపతిగానూ సేవలు అందించారు. దేశానికి తొలి దళిత రాష్ట్రపతి కేఆర్ నారాయణన్. కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన మొదటి ప్రెసిడెంట్‌గా గుర్తింపు పొందారు. ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు. 1998 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి పదవిలో ఉండి ఓటు వేసిన మొదటి రాష్ట్రపతిగా ఖ్యాతికెక్కారు. భారతదేశపు మిస్సైల్ మ్యాన్‌గా పేరుగాంచిన ఏపీజే అబ్దుల్ కలాం దేశానికి 11వ రాష్ట్రపతిగా విశేష సేవలు అందించారు. ప్రజల రాష్ట్రపతిగా మెలిగిన ఆయన రాష్ట్రపతి కార్యాలయాన్ని సామాన్యులకు చేరువ చేశారు. రాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించిన తొలి మహిళ ప్రతిభా పాటిల్. అంతకుముందు ఆమె రాజస్థాన్ గవర్నర్‌గా పనిచేశారు. రాష్ట్రపతి పనిచేసిన కాలంలో ఆమె పలు రకాల విమర్శలు ఎదుర్కొన్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ప్రణబ్ ముఖర్జీ దేశానికి 13వ రాష్ట్రపతిగా 2012లో ఎన్నికయ్యారు. దేశ అత్యున్నత పురస్కారం పొందిన ఆరుగురు రాష్ట్రపతుల్లో ఆయన ఒకరు. ప్రణబ్ హయాంలోనే రాష్ట్రపతి భవన్ ట్విటర్ ఖాతా ప్రారంభమైంది. దేశానికి రెండో దళిత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. అంతకుముందు బిహార్ రాష్ట్రానికి గవర్నర్‌గా ఆయన పనిచేశారు. ఈ ఏడాది జూలై 24తో రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది. (క్లిక్: భారత పౌరసత్వం వదులుకుంటున్న ప్రవాసులు!) -
చైతన్య భారతి: అగ్ని విహాంగం
అబ్దుల్ కలామ్ 2015 జూలై 27న షిల్లాంగ్‌లోని ఐ.ఐ.ఎం.లో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మధ్యలోనే హఠాత్తుగా కుప్పకూలిపోయారు. 84 ఏళ్ల ఆయన శరీరం నుంచి ఆత్మ అంతరిక్షానికేగింది. అంతరిక్షానికే ఎందుకంటే.. అది ఆయన మనసుకు నచ్చిన సాంకేతిక ప్రదేశం. రామేశ్వరం దీవిలోని ఒక తమిళ ముస్లిం కుటుంబంలో జన్మించిన ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ భారతదేశ సర్వ స్వతంత్ర గణతంత్ర రాజ్యానికి 11 వ రాష్ట్రపతి కావడానికి సుదీర్ఘ పయనమే సాగించారు. ఇంటర్మీడియట్ పరీక్ష తర్వాత ఇంజనీరింగ్‌లో చేరడంపై సలహా ఇచ్చేవారెవరూ లేకపోవడంతో ఆయన బి.ఎస్.సి. చదివారు. విమానాన్ని నడపాలనే ఉబలాటంతో ఏరోనాటికల్ ఇంజనీర్ అయ్యారు. కానీ, భారత వైమానిక దళంలో పైలట్ ఉద్యోగం ఆయనకు తృటిలో తప్పిపోయింది. అయినా, రక్షణ ఏరోనాటికల్ వ్యవస్థలో యంత్ర విహంగాలకు ఆయన సన్నిహితంగా మసలుతూ వచ్చారు. అంతరిక్ష పరిశోధనా జాతీయ కమిటీ 1960ల ప్రారంభంలో ఏర్పాటవడంతో ఆయన జీవితంలో మొదటి మలుపు వచ్చింది. దాని కింద ప్రతిభావంతులైన ఏరోనాటికల్ ఇంజనీర్ల బృందాన్ని సృష్టించారు. అదే ఆ తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గా రూపాంతరం చెందింది. ఒక స్వల్పకాలిక శిక్షణా కార్యక్రమం కోసం అమెరికా వెళ్లడం కలాం జీవితాన్ని ఇంకో మలుపు తిప్పింది. ఆయనకు విక్రమ్ సారాభాయ్, సతీశ్ ధావన్ వంటి మహామహుల ఆశీర్వాదాలు కూడా లభించాయి. ప్రతిభావంతులైనవారు ఇంకా అనేకమంది ఉన్నా ఉపగ్రహ వాహక నౌక ప్రాజెక్టు నాయకత్వ బాధ్యతలకు ఆయనను ఎంపిక చేశారు. ఒక దశాబ్దంపాటు పడిన కఠిన శ్రమ భారతదేశం అంతరిక్ష పరిశోధనల్లో – 1980లలోని ఎస్.ఎల్.వి.–3 ప్రయోగంతో – సఫలం అయ్యేలా చేసింది. ఆయనను 1981లో పద్మభూషణ్ వరించింది. క్షిపణి నిర్మాణ సామర్థ్యాలను స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసే బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించారు. కలామ్‌కు 1990లో పద్మవిభూషన్ లభించింది. దేశాన్ని 2020 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మలచడం గురించి కూడా కలామ్ అప్పట్లో ఒక పథకాన్ని రూపొందించారు. తేలిక రకం యుద్ధ విమానం ప్రాజెక్టును రూపుదిద్దిన ఘనత కూడా కలామ్‌దే. ఆయన 1997లో భారతరత్న అయ్యారు. ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. 2002లో అప్పటి పాలక ఎన్.డి.ఎ. ప్రభుత్వం కోరడంతో ఆయన రాష్ట్రపతిగా నిలబడి, ఆ పదవికి ఎన్నికయ్యారు. ఇక కలామ్ ఆత్మకథ ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ పుస్తకం ప్రతులు అత్యధికంగా అమ్ముడయ్యాయి. కలాం శాకాహారి. వివాహం చేసుకోలేదు. వ్యకిగత ఆస్తులు, సంపదలు ఏమీ లేవు. – అరుణ్ తివారీ, ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ పుస్తక సహ గ్రంథకర్త (చదవండి: చైతన్య భారతి: అణుశక్తిమాన్) -
నోట్లపై గాంధీ బొమ్మ బదులు.. ఆర్బీఐ క్లారిటీ
ముంబై: కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీకి బదులుగా వేరే ముఖాలను చూడబోతున్నామంటూ గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. నోట్లపై గాంధీ ముఖం బదులు.. రవీంద్రనాథ్ ఠాగూర్, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఫొటోలతో కొత్త కరెన్సీ నోట్లను ముద్రించనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ కథనాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్పందించింది. సోమవారం మధ్యాహ్నం ఆర్బీఐ ఓ కీలక ప్రకటనను జారీ చేసింది. దీనికి సంబంధించి తమ వద్ద ఎలాంటి కొత్త ప్రతిపాదన లేదని ఆర్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ యోగేశ్ దయాళ్ ఆ ప్రకటనలో తెలిపారు. అంతేకాదు ట్విటర్లోనూ ఈ విషయంపై ఓ క్లారిటీ ఇచ్చింది ఆర్బీఐ. RBI clarifies: No change in existing Currency and Banknoteshttps://t.co/OmjaKDEuat — ReserveBankOfIndia (@RBI) June 6, 2022 ఇదిలా ఉంటే.. కరెన్సీ నోట్లలో మరిన్ని మేర సెక్యూరిటీ ఫీచర్ల ఏర్పాటుకు సంబంధించి ఐఐటీ ఢిల్లీ రిటైర్డ్ ప్రొఫెసర్, ఎలక్ట్రోమాగ్నటిక్ ఇన్స్ట్రుమెంటేషన్ నిపుణుడు దిలీప్ సహానికి గాంధీ సహా ఠాగూర్,కలాం ఫొటోలను ఆర్బీఐ పంపిందని, కరెన్సీ నోట్లపై గాంధీ ఫొటో స్థానంలో ఠాగూర్, కలాం ఫొటోల ముద్రణకు సంబంధించి ఆయన నుంచి నివేదిక కోరిందని కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో వాటిపై వివరణ ఇచ్చిన యోగేశ్ దయాళ్ ఆ వార్తలను ఖండించారు. -
మరోసారి సత్తా చాటిన ‘అగ్ని–5’
సాక్షి, విశాఖపట్నం: అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన అగ్ని–5 క్షిపణి ప్రయోగం మరోసారి విజయవంతమైంది. ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్‌లో బుధవారం రాత్రి 7.50 గంటలకు ఈ ప్రయోగం నిర్వహించినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ క్షిపణి నిర్దేశిత పూర్తి దూరం ప్రయాణించి లక్ష్యాన్ని ఛేదించినట్లు ఒక ప్రకటనలో తెలియజేశాయి. 5,000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలపై అలవోకగా విరుచుకుపడే సామర్థ్యం అగ్ని–5 క్షిపణి సొంతం. ఇప్పటివరకూ అగ్ని–5ని ఏడుసార్లు ప్రయోగించారు. ప్రతిసారీ విజయవంతంగా లక్ష్యాన్ని చేరుకున్నట్లు రక్షణ శాఖ ప్రకటించింది. దేశంలో మొట్టమొదటి, ఏకైక ఖండాంతర క్షిపణి అగ్ని–5ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) సిద్ధం చేసింది. -
అబ్దుల్ కలాంకు సీఎం జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. 'సమగ్రతకు, విజ్ఞానానికి అబ్దుల్ కలాం ప్రతిరూపం. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి ఎనలేని సేవలు అందించిన డాక్టర్ అబ్దుల్ కలాం జీవితం కోట్ల మందికి ఆదర్శనీయం. లక్ష్య సాధనకు కృషి చేసే యువతకు ఆదర్శవంతంగా, స్పూర్తి దాతగా ఉంటారు' అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. Remembering the missile man, former President and Bharat Ratna Dr #APJAbdulKalam on his Jayanthi. Kalam ji is the epitome of integrity, wisdom & benevolence whose life inspires millions to dream & achieve. — YS Jagan Mohan Reddy (@ysjagan) October 15, 2021 -
‘దేశ ప్రజలకు అబ్దుల్‌కలాం ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తారు’
సాక్షి, న్యూఢిల్లీ: దేశం బలోపేతానికి అబ్దుల్‌కలాం తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం 90వ జయంతి వేడుకలను పురస్కరించుకొని ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. ‘దేశాన్ని సమర్థవంతంగా మార్చేందుకు అబ్దుల్‌కలాం కృషి చేశారు. దేశ ప్రజలకు అబ్దుల్‌కలాం ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తారు’ అని ప్రధాని మోదీ ట్విటర్లో పేర్కొన్నారు. मिसाइल मैन के रूप में विख्यात देश के पूर्व राष्ट्रपति डॉ. एपीजे अब्दुल कलाम जी को उनकी जयंती पर सादर नमन। उन्होंने अपना जीवन भारत को सशक्त, समृद्ध और सामर्थ्यवान बनाने में समर्पित कर दिया। देशवासियों के लिए वे हमेशा प्रेरणास्रोत बने रहेंगे। pic.twitter.com/Pn2tF73Md6 — Narendra Modi (@narendramodi) October 15, 2021 -
అబ్దుల్ కలాంకు సీఎం జగన్ నివాళి
సాక్షి, అమరావతి: నేడు దివంగత రాష్ట్రపతి, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ యావత్ భారత్ ఘన నివాళులు అర్పిస్తోంది. ఏపీజే అబ్దుల్ కలాం 6వ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనను స్మరించుకున్నారు. ఈ మేరకు ట్విటర్లో స్పందించారు. అబ్దుల్ కలాం భారత్‌లోని అత్యంత ప్రఖ్యాతిగాంచిన వారిలో ఒకరని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనను ఎంతోమంది ఆరాధించారని గుర్తుచేసుకుంటూ హృదయపూర్వకంగా నివాళులు అర్పించారు. దేశానికి మాజీ రాష్ట్రపతి కలాం చేసిన కృషి వెలకట్టలేనిదని, ఆయన సేవలు చిరస్మరణీయమని సీఎం జగన్ పేర్కొన్నారు. One of the eminent luminaries of India, admired around the world! Humble tribute to Bharat Ratna #APJAbdulKalam, former President of India, on his death anniversary. His enormous contribution to the nation will be remembered forever. — YS Jagan Mohan Reddy (@ysjagan) July 27, 2021 -
కలాం సింప్లిసిటీకి ఎగ్జాంపుల్ ఈ ఘటన
ఎంతోమంది గాంధీ పేరు పెట్టుకున్నా, గాంధీజీకి నిజమైన వారసుడు ఏపీజే అబ్దుల్ కలాం!. ఇద్దరి మధ్య ఎన్నో సారూప్యతలున్నాయి. అందుకు ఉదాహరణలుగా నిలిచిన కొన్ని ఘటనలు ఉన్నాయి. కలాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు వారి కుటుంబ సభ్యులు, బంధువులంతా రాష్ట్రపతి భవన్లో కొన్ని రోజుల పాటు ఉండగా వారి భోజన, వసతి ఖర్చులన్నీ కలాం లెక్కకట్టి చెల్లించారు. గాంధీ తన కుటుం బంతో సహా దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు వచ్చేస్తున్నప్పుడు మిత్రులు, అభిమానులు కస్తూర్బాకు నగలను బహుమతులుగా ఇచ్చారు. ‘ఇవి నా కష్టార్జితం కాదు. కావున ఇవి సమాజానికే ఉపయోగపడాలి’ అని దక్షిణాఫ్రికా లోనే ఒక ట్రస్టును ఏర్పరచి, దానికే వాటిని గాంధీ ఇవ్వడం జరిగింది. కలాం డీఆర్డీఓ డైరెక్టరుగా ఉన్నప్పుడు ఆయనకు వీణ నేర్చుకోవాలనిపించింది. ఒక సామాన్య ఉద్యోగి భార్య (కళ్యాణి) చిన్న పిల్ల లకు ఇంట్లోనే వీణ నేర్పిస్తోందని తెలిసి, కలాం వెళ్లారు. ఈ వయసులో మీకెందుకు వీణ అంటూనే నెలకు వంద రూపాయల ఫీజు అని చెప్పి, విద్యార్థులతో కలసి కూర్చోమంది. ఒక రోజు ఇంటి దగ్గర పనిమీద ఇంటికివచ్చిన ఉద్యోగి తన ఇంట్లో కలాంను చూశాడు. అప్పుడు విషయం తెలిసిన కళ్యాణి మీరు ముందే మాకు ఈ విషయం చెప్పి ఉంటే మేమే మీ ఇంటికి వచ్చి రోజూ చెప్పేవాళ్ళం, ఫీజు కూడా తీసుకునే వాళ్ళం కాదు అని బాధపడుతుంటే– ‘అందుకే నేను మీ ఆయనకు తెలియ కుండా వచ్చి నేర్చు కుంటున్నాను. విద్యార్థి ఎంత గొప్పవాడైనా టీచర్ దగ్గర శిష్యుడిగానే ఉండాలన్నారు కలాం. సంస్కృతం కష్టం అని గాంధీ అందరు పిల్లల్లాగే తలచి పెర్షియన్ భాష క్లాసులో కూర్చుంటే, కృష్ణశంకర పాండ్యా అనే సంస్కృత ఉపాధ్యాయుడు ‘సంస్కృతం నేర్చుకోవడంలో ఏదైనా కష్టముంటే నా దగ్గరకు రా’ అన్నారు. ఆ రోజు పాండ్యా వద్ద సంస్కృతం నేర్చుకొని ఉండకపోతే భగవద్గీత లాంటి ఆధ్యాత్మిక గ్రంథాలను చదవగలిగేవాడిని కాదన్నారు గాంధీ. కలాంను విశాఖపట్నం జిల్లా చోడవరం తీసుకొచ్చి సుమారుగా 10 వేల మంది విద్యార్థులకు ప్రత్యక్షంగా ఆయన ప్రసంగం వినిపించాలని ‘కల’గన్నాను. కానీ ఆయన ఆరోగ్యం క్షీణిం చడంతో అది ‘కల’గానే మిగిలిపోయింది. ఎప్పుడూ ‘కలలు’ వాటి సాకారం గురించి మాట్లాడే ఆయన నా ‘కల’ మాత్రం సాకారం కాకుండానే భగవంతుడిలో లీనమైపోయారు. నేడు అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా.. ఆచార్య ముర్రు ముత్యాలునాయుడు, మాజీ ఉపకులపతి, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, రాజమహేంద్రవరం ఈ–మెయిల్: mnaidumurru@gmail.com -
Indian Defence Sector: మన ‘రక్షణ’కు అవరోధాలెన్నో!
రక్షణ మంత్రిత్వ శాఖ ఈమధ్య విడుదల చేసిన పత్రంలో రక్షణ రంగంలో ప్రవేశపెట్టిన 20 రకాల సంస్కరణలను పొందుపరిచారు. సాధారణంగా జాతీయ భద్రత పేరిట ఇలాంటివి బాహాటంగా వెల్లడించే సంప్రదాయం మన దేశంలో లేదు. ఈసారి రక్షణ శాఖ ఇందుకు భిన్నమైన మార్గాన్ని అనుసరించటం స్వాగతించదగ్గది. ఇందులో రెండు కీలకమైన అంశాలున్నాయి. రక్షణ రంగానికి ఆత్మ నిర్భరత తీసుకురావటం, రక్షణ రంగ పరిశోధనలను సంస్కరించటం. దేశీయ విధానాల ద్వారా మన సాయుధ దళాల అవసరాలను తీర్చేందుకే ఈ రెండింటినీ ఉద్దేశించారు. అదే సమయంలో మన దేశాన్ని రక్షణ సామగ్రి తయారీ రంగ కేంద్రంగా రూపొందించటం కూడా ఈ సంస్కరణల ధ్యేయం. రక్షణ రంగంలో స్వావలంబన గురించి, ఆ లక్ష్య సాధన గురించి దశాబ్దాలుగా అనేక ప్రభు త్వాలు మాట్లాడటం మనకు తెలియనిదేమీ కాదు. కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం పరిపాలించినా ఈ లక్ష్యం గురించి ఘనంగా చెప్పడం ఎప్పటినుంచో మనం చూస్తున్నదే. కానీ విచారకరమైన విషయమేమంటే అంతర్జాతీయంగా ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశాల జాబితాలో ఈనాటికీ మనది రెండో స్థానం. మాటలకు దీటుగా చేతలు ఉండటం లేదని ఈ పరిస్థితి తెలియజెబుతోంది. రక్షణ, పరిశోధన రెండూ రక్షణ మంత్రిత్వశాఖ ఛత్రఛాయలో ఉంచటం సరైందికాదని ఎప్పటినుంచో అనేక మంది నిపుణులు సూచిస్తున్నారు. కానీ ఎవరూ పట్టించు కోలేదు. పాశ్చాత్య దేశాల్లో ఈ నమూనా ఎక్కడా అమల్లో లేదు. మంచిదేగానీ... ఈ సందర్భంగా నేను రెండు ఉదాహరణలు ఇవ్వద ల్చుకున్నాను. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల రక్షణ నవీకరణ సంస్థ(డీఐఓ)కింద రక్షణ రంగంలో ఉత్కృష్టమైన సృజనాత్మకతను ప్రోత్సహించటానికి ఉద్దేశించిన ఐడెక్స్‌కు బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నట్టు ప్రకటించారు. రక్షణ రంగంలో కొత్త ఆలోచనలతో ముందుకొచ్చేవారిని, రక్షణ, ఎయిరో స్పేస్ రంగాల్లో సాంకేతికతను అభివృద్ధి చేసేవారిని ప్రోత్సహించటానికి తగిన వ్యవస్థను ఏర్పాటు చేయటం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. ఈ చొరవ వెనకున్న స్ఫూర్తి కొనియా డదగినది. అయితే డీఐఓ సైతం రక్షణ మంత్రిత్వశాఖలోని రక్షణ ఉత్పత్తి విభాగంకింద పనిచేస్తుందని చెప్పటం కొంత నిరాశ కలిగిస్తుంది. బ్యూరోక్రసీ మన దేశంలో ఎలా పనిచేస్తుందో ఎవరికీ తెలియనిది కాదు. ఇక కాగ్, సీబీఐ, సీవీసీ వగైరా సంస్థల నీడ సరేసరి. ప్రయోగశాలలు, సాంకే తిక రంగంలో కొత్త పుంతలు తొక్కే సంస్థలు మేధోపరమైన కృషిలో నిమగ్నమవుతాయి. నిబంధనలు, సంప్రదాయాల పేరుచెప్పి వాటికి అడ్డంకులు సృష్టిస్తే అవి ఎప్పటికీ ఎదగ లేవు. విభిన్నంగా ఆలోచించటం, ఎలాంటి ఇబ్బందుల నైనా, అవరోధాలనైనా ఎదుర్కొనటానికి సిద్ధపడటం వంటి గుణాలు సృజనాత్మక పరిష్కారాలకు దోహదపడతాయి. కానీ డీఐఓను ప్రభుత్వ విభాగం పరిధిలో ఉంచితే ఇవెలా సాధ్యం? రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) పరిధిలో, అది అందజేసే నిధులతో అత్యాధునిక రక్షణ సాంకేతి కతలను అభివృద్ధి కోసం కృషిచేస్తున్న సంస్థలు చాలా వున్నాయి. అయినా మన దేశానికి ఒక కొత్త నవీకరణ సంస్థ అవసరం వున్నదని రక్షణ శాఖ భావించిందంటేనే ఆ సంస్థల పని తీరు ఎలావున్నదో అర్థం చేసుకోవచ్చు. విక్రమ్ సారాభాయ్ విలువైన సూచన దేశీయంగా హెచ్ఎఫ్–24 యుద్ధ విమానాన్ని అభివృద్ధి చేయాలని 50వ దశకంలో అప్పటి ప్రధాని నెహ్రూ సూచించారు. ఆ తర్వాతే 1956లో హిందూస్థాన్ ఏరోనాటికల్ సంస్థ(హెచ్ఏఎల్) ఆవిర్భవించింది. ఆ యుద్ధ విమానం 1967లో వైమానిక దళ సర్వీసులోకి ప్రవేశించింది. 1970లో భారత అంతరిక్ష రంగ పితామ హుడు విక్రమ్ సారాభాయ్ అణు శక్తి, అంతరిక్ష రంగం, ఎర్త్ సైన్సు, ఎయిరోనాటికల్ రంగాలకు ప్రత్యేక కమిషన్‌లుండాలని, ఇవన్నీ శాస్త్ర, సాంకేతిక రంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేయాలని పాలనారంగ సంస్కరణల కమిషన్‌కు సూచించారు. ఆయన ఎంతో ముందు చూపుతో చేసిన ఆ ప్రతిపాదనను ఆనాటి ప్రభుత్వం ఆమోదించింది. అది కార్యరూపం దాల్చాక ఆ రంగాలన్నీ ఎన్నో విధాల అభివృద్ధి సాధించాయి. కానీ ఎయిరోనాటిక్స్ రంగం ఎదుగూ బొదుగూ లేకుండా మిగిలి పోయింది. ఎందుకంటే ఆ ఒక్క రంగం మాత్రం రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండిపోయింది. కనుకనే ఇన్ని దశాబ్దాలు గడిచినా రక్షణ రంగ దిగుమతులు మన దేశానికి తప్పడం లేదు. అందుకోసం వేలాది కోట్ల రూపాయలు వ్యయం చేయవలసి వస్తోంది. ఇన్ని దశాబ్దాలవుతున్నా ప్రభుత్వాల సారథులు దీనిపై తగిన దృష్టి సారించలేక పోయారు. వీగిపోయిన ప్రతిపాదన దేశానికి వైమానిక రంగ విధానం ఎంతో అవసరమని 1994లో ఏపీజే అబ్దుల్ కలామ్ రాష్ట్రపతిగా వుండగా ఎయిరోనాటికల్ సొసైటీ ప్రతిపాదించింది. వర్తమాన కాలంలో ఈ రంగంలో జరిగే సాంకేతికాభివృద్ధి రక్షణరంగానికి, దేశ భద్రతకు దోహదపడుతుందని, మన దేశం అంతర్జాతీయ భాగస్వామ్యం పొందటానికి ఉపయోగపడుతుందని, అందువల్ల ఆర్థికంగా కూడా దేశానికి లాభదాయకమని ఆ ప్రతిపాదన సూచించింది. పౌరవిమానయాన రంగం, సైనిక విమాన రంగాలమధ్య ఎన్నో సారూప్యతలుంటాయి. ఎయిరోనాటిక్స్‌ను ప్రోత్సహిస్తే దేశ భద్రతతోపాటు లాభదాయకమైన వ్యాపారం చేయటానికి కూడా అవకాశం వుంటుంది. అంతేకాదు... వైమానిక రంగంలో అంతర్జాతీయంగా మనదైన ప్రత్యేక ముద్ర వుంటుంది. కానీ విచారకరమైన విషయమేమంటే ఈ ప్రతిపాదన ఉన్నతాధికార వర్గం ధర్మమా అని వీగిపోయింది. దీనికి మరింత మెరుగులు దిద్ది, మార్పులు చేర్పులు చేసి 2004లో మరోసారి ప్రతిపాదించారు. దానికి కూడా అదే గతి పట్టింది. ప్రభుత్వ నిర్ణయాలపై, విధానాలపై సౌత్ బ్లాక్ పట్టు ఎంతగా వుంటుందో ఈ స్థితి తెలియజేస్తుంది. ఆ బ్లాక్‌లో వేరే మంత్రిత్వ శాఖల సచివాలయాలతోపాటు రక్షణ మంత్రిత్వ శాఖ సచివాలయం కూడా ఉంటుంది. రక్షణ పరిశ్రమ రంగంలో నవీకరణను ప్రోత్సహిం చటానికి ఒక సంస్థ అవసరమున్నదని ఇన్నేళ్ల తర్వాత ఎన్డీఏ ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి నాయకత్వం భావించటం నిజంగా హర్షించదగ్గ పరిణామం. ఈ విషయంలో గతం తాలూకు అనవసర భారాన్ని వదల్చు కోవాలని చూడటం కొత్త ఆశల్ని రేకెత్తిస్తోంది. ప్రభుత్వ ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది గనుక భారత వైమానిక రంగానికి ఇకముందైనా సరైన స్థానం దక్కాలని, ప్రస్తుత సానుకూల వాతావరణంలో అది అన్ని రకాలుగా లబ్ధి పొందాలని అందరమూ ఆశించాలి. అసలు మన జాతీయ భద్రతా వ్యవస్థలో సృజనాత్మక దృక్పథం పెంపొందాలంటే పూర్తి స్థాయి పాలనా రంగ సంస్కరణలు చాలా చాలా అవసరమని ప్రభుత్వ పెద్దలు గుర్తించాలి. –ఎయిర్ మార్షల్ బ్రిజేష్ జయల్(రిటైర్డ్) రక్షణ రంగ వ్యాఖ్యాత (‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో) చదవండి: చైనాతో ప్రతిష్టంభన నేపథ్యంలో రక్షణ మంత్రి లద్దాఖ్ పర్యటన హిందీభాషకు దక్షిణ వారధి పీవీ -
‘మిస్సైల్ మ్యాన్’కి సీఎం జగన్ నివాళి
సాక్షి, అమరావతి : మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 89వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ‘భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం కోట్లాదిమందికి స్ఫూర్తిదాయకం. మిస్సైల్ మ్యాన్‌గా, ప్రజల ప్రెసిడెంట్‌గా గుర్తింపు తెచ్చుకున్న అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నాను అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. Bharat Ratna Dr. APJ Abdul Kalam's story of persistence, ability, and sheer courage is a guiding light to millions who dare to dream and work towards its fulfillment. My humble tributes to the 'People's President', the legendary Missile Man on his birth anniversary. — YS Jagan Mohan Reddy (@ysjagan) October 15, 2020 దేశానికి ఎనలేని సేవ చేశారు : మోదీ అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఒక శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి ఆయన చేసిన ఎనలేని సేవ చేశారని కొనియాడారు. ఆయన జీవితం కోట్లమందికి స్ఫూర్తిదాయకం అన్నారు. ఈమేరకు ఓ అబ్దుల్ కలాంకు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా అబ్దల్ కలాంకు నివాళులర్పించారు. ‘డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఒక విజనరీ లీడర్, దేశ ఖ్యాతిని అంతరిక్షం వరకూ తీసుకువెళ్లారు. ఆయన నిరంతరం ఆత్మనిర్భర్ భారత్ కోసం తపించేవారు. విద్య, శాస్త్ర రంగాల్లో కలాం సేవలు నిరుపమానం. ప్రేరణదాయకం’ అని ట్వీట్ చేశారు. Tributes to Dr. Kalam on his Jayanti. India can never forget his indelible contribution towards national development, be it as a scientist and as the President of India. His life journey gives strength to millions. pic.twitter.com/5Evv2NVax9 — Narendra Modi (@narendramodi) October 15, 2020 -
భారతీయతకు ప్రతిరూపం
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అసమాన ప్రతిభ కనబర్చి, ‘భారత రత్నం’గా భాసించిన ఎ.పి.జె. అబ్దుల్ కలాం భారతీయతకు నిలువెత్తు ఉదాహరణ. ఇతర మతాల పట్ల సామరస్య ధోరణితో ఉండడం తండ్రి నుండి ఆయనకు అబ్బింది. ‘గొప్పవారికి మతం స్నేహితులను అందించే ఒక మార్గం. అల్పులకు మతం ఘర్షణలకు ఒక కారణం’ అనేవారు కలాం. ఆధ్యాత్మికత కలాం జీవితమంతా ఆయనతో పాటే కొనసాగింది. ‘ట్రాన్సిడెన్స్: మై స్పిరిచ్యువల్ ఎక్స్పీరియెన్సెస్ విత్ ప్రముఖ్ స్వామీజీ’ పుస్తకంలో తన ఆధ్యాత్మిక యాత్రను వివరించారు. స్వామి నారాయణ సంప్రదాయానికి చెందిన ప్రముఖ్ స్వామీజీని తన ఆధ్యాత్మిక గురువుగా ఆయన భావించేవారు. న్యూఢిల్లీలో 2001 జూన్ 30న మొదటిసారి స్వామీజీని కలిసినప్పుడే కలాం ఆయనపట్ల ఆకర్షితులయ్యారు. ఆ తర్వాతి సంవత్సరం సెప్టెంబరులో అక్షరధావ్‌ుపై ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు, ఆ దాడికి పాల్పడిన ఉగ్రవాదులతో సహా అందరూ క్షేమంగా ఉండాలని ప్రముఖ్ స్వామీజీ ప్రార్థించడం కలాంను కదిలించింది. దేవుడి కక్ష్యలోకి తనను ప్రవేశ పెట్టిన మహిమాన్వితుడిగా స్వామీజీని ఆయన పేర్కొన్నారు. ఐదు అంశాల్లో అభివృద్ధి వల్ల దేశం పురోగమిస్తుందని కలాం భావించేవారు. 1. వ్యవసాయం, ఆహారం. 2. విద్య, వైద్యం. 3. సమాచార సాంకేతికత. 4. విద్యుత్తు, రవాణా, మౌలిక వసతులు. 5. క్లిష్టమైన సాంకేతిక విషయాల్లో స్వావలంబన. వీటికి ప్రముఖ్ స్వామీజీ ఆరో అంశాన్ని చేర్చారు. నేరం, అవినీతిలతో కల్మషమైన ప్రపంచానికి ఆధ్యాత్మికతను అందజేయడం. ఇదే కలాం ఆధ్యాత్మిక దృక్కోణమైంది. లీడ్ ఇండియా కార్యక్రమం కలాం ఆశయాలకు అద్దం పట్టింది. యువతలో ఉత్తమ ఆలోచనలను పాదుకొల్పడం దీని ముఖ్య ఉద్దేశ్యం. దీంట్లో భాగంగా వేలాది విద్యార్థులను స్వయంగా కలిసి, సంభాషించారు. కలాం నేర్పిన జీవన మంత్రాన్ని మరోసారి విద్యార్థులు, యువత గుర్తుకు తెచ్చుకోవాలి. (నేడు అబ్దుల్ కలాం 89వ జయంతి) -డా. రాయారావు సూర్యప్రకాశ్‌రావు ‘ మొబైల్ 94410 46839 -
బయోపిక్ నం 3
దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ జీవితం ఆధారంగా రెండు సినిమాలకు సంబంధించిన ప్రకటనలు ఇప్పటికే వచ్చాయి. నిర్మాత అనిల్ సుంకరతో కలసి, అభిషేక్ ఆర్ట్స్ బ్యానర్ అధినేత అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత జగదీష్ దానేటి, జానీ మార్టిన్ దర్శకత్వంలో ఇండో–హాలీవుడ్ చిత్రంగా కలామ్ బయోపిక్ తీస్తున్నట్టు ప్రకటించారు. కలామ్గా అలీ నటిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కలామ్ జీవితంపై సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు కలామ్‌పై సినిమా తీసే రైట్స్ మా దగ్గరే ఉన్నాయి మరెవ్వరూ సినిమా తీయడానికి వీల్లేదు అని అభిషేక్ ఆర్ట్స్ సంస్థ›పేర్కొంది. దాంతో ఆసక్తి ఏర్పడింది. -
అలీ @ కలామ్
భారతరత్న, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ బయోపిక్ హాలీవుడ్లో తెరకెక్కుతోంది. కలామ్ పాత్రను నటుడు అలీ పోషిస్తున్నారు. పప్పు సువర్ణ నిర్మాణంలో జగదీష్ దానేటి, జానీ మార్టిన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆదివారం ఢిల్లీలో విడుదల చేశారు. ‘‘సినీ జీవితంలో అత్యంత సంతృప్తిని ఇచ్చిన పాత్ర ఇది. కలామ్గారితో ఫొటో దిగితే చాలనుకున్నాను. ఆయన బయోపిక్‌లో నటించే అవకాశం రావడం నా అదృష్టం’’ అన్నారు అలీ. ‘‘అలీగారికి ఇది 1,111వ చిత్రం. ఈ పాత్రకు ఆయన సరిగ్గా సరిపోయారు’’ అన్నారు జగదీష్ దానేటి. -
అబ్దుల్ కలాం ఫిక్స్
దేశం గర్వించే శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జీవిత కథను తెరమీదకు తీసుకువస్తున్న విషయం తెలిసిందే. అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇందులో కలాం పాత్రను పోషిస్తున్నట్టు బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ ప్రకటించారు. ‘కలాం పాత్రలో నటించడం నా అదృష్టం’ అని ట్వీట్ చేశారాయన. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారో అనే విషయాన్ని చిత్ర యూనిట్ ఇంకా ప్రకటించలేదు. -
వైద్యులు రోగుల పాలిట దేవుళ్లు: ఏపీ గవర్నర్
-
వైద్యులు రోగుల పాలిట దేవుళ్లు: ఏపీ గవర్నర్
సాక్షి, కర్నూలు: మాజీ రాష్ట్రపతి, భారత ఆటమిక్ ఎనర్జీ సాధికారతకు విశేష కృషి చేసిన శాస్త్రవేత్త డా. ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాన్ని కర్నూలు మెడికల్ కాలేజీలో ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డా. ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాన్ని అవిష్కరించడం.. ఎంతో సంతోషంగా ఉందని బిశ్వభూషన్ హరిచందన్ అన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీ నుంచి ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా.నాగేశ్వరరెడ్డి లాంటి ఎంతో మంది ప్రముఖ డాక్టర్లు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు పొందారని గవర్నర్ తెలిపారు. మహాత్మాగాంధీజీ కూడా నిరుపేదలకు సేవలు అందించడానికి డాక్టర్ కావాలనుకున్నారని ఆయన గుర్తు చేశారు. వైద్యులు రోగుల పాలిట దేవుళ్లు లాంటివారని దేశం, సమాజం, నిరుపేదల గురించి వారు ఆలోచించి నిస్వార్థంగా, త్యాగ నిరతితో పనిచేయాలని సూచించారు. నిరుపేదల ఆరోగ్యం కోసం డాక్టర్లు కృషి చేయాలని బిశ్వభూషన్ హరిచందన్ పిలుపునిచ్చారు. కర్నూలు మెడికల్ కాలేజ్ అలుమ్ని విద్యార్థులు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సెంటినరీ సెలెబ్రేషన్స్ సందర్భంగా 5 రోజుల్లో రికార్డు స్థాయిలో రూ.12 లక్షల సభ్యత్వ నిధిని సేకరించి గవర్నర్‌కు అందించారు. గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ను కర్నూలు మెడికల్ కాలేజ్ అలుమ్ని విద్యార్థులు ఘనంగా సన్మానించారు. దీంతోపాటు కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ ఎంపీ ల్యాడ్స్ పథకం కింద రూ.30 లక్షలతో ఏర్పాటు చేసిన మూడు త్రాగునీటి ఆర్ఓ ప్లాంట్లు, రూ.49 లక్షలతో తాండ్రపాడు జిల్లాపరిషత్ పాఠశాలలోని ఇండోర్ స్టేడియంలో నిర్మించిన ఉడన్ కోర్టును గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ప్రారంభించారు. పంచలింగాలలో రూ.28 లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను గవర్నర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, కాటసాని రాంభూపాల్ రెడ్డి, తోగూరు ఆర్థర్, కంగాటి శ్రీదేవి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్, కేఎంసీ ప్రిన్సిపల్ డా. చంద్ర శేఖర్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. రాంప్రసాద్, కేఎంసీ అలుమ్ని విద్యార్ధులు పాల్గొన్నారు. -
పేరు మార్పుపై సీఎం జగన్ సీరియస్
సాక్షి, అమరావతి : మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం పేరిట అందజేస్తున్న ప్రతిభా పురస్కారాల పేరు మార్పుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన దృష్టికి రాకుండా పేరు మార్చడంపైన సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. ప్రతిభా పురస్కారాల పేరు మారుస్తూ ఇచ్చిన జీవోను రద్దు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రతిభా పురస్కారాలకు యథాతథంగా అబ్దుల్ కలాం పేరునే పెట్టాలని సూచించారు. అలాగే ప్రభుత్వం అందజేసే అవార్డులకు దేశంలోని మహానీయులు పేర్లు కూడా పెట్టాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. మహాత్మ గాంధీ, జ్యోతిరావ్ పూలే, అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్ వంటి మహానీయుల పేర్లతో అవార్డులు ఇవ్వాలని సూచించారు. -
అబ్దుల్ కలాంకు నివాళులర్పించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 88వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. పెద్ద కలలను కనడమే కాక వాటిని ఎలా సాకారం చేసుకోవాలో దేశానికి నేర్పిన మహా మనిషికి వినయపూర్వక నివాళి. మిస్సైల్ మ్యాన్‌గా, ప్రజల ప్రెసిడెంట్‌గా గుర్తింపు తెచ్చుకున్న భారతరత్న అవార్డు గ్రహీతకు ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. My humble tribute to the man who taught an entire nation how to dream big and achieve goals. Remembering the Missile Man of India, People's President and Bharat Ratna Dr A.P.J Abdul Kalam on his birth anniversary.#APJAbdulKalam 🇮🇳 — YS Jagan Mohan Reddy (@ysjagan) October 15, 2019 కలాంకు నివాళులర్పించిన ప్రధాని మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ది ఇండియాగా గుర్తింపు తెచ్చుకున్న మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 88వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ‘21వ శతాబ్ధికి చెందిన భారత్ ఎలా ఉండాలో కలాం కలలు కన్నారు... దాన్ని నిజం చేసేందుకు తన వంతు కృషి చేశారు. ఆయన జీవితం దేశ పౌరులందరికి ఆదర్శం. ఆయన జయంతి సందర్భంగా వినయపూర్వక నివాళి అర్పిస్తున్నాను’ అన్నారు మోదీ. కలాం చేసిన సేవలకు గాను దేశం ఆయనకు సెల్యూట్ చేస్తుందన్నారు మోదీ. -
అబ్దుల్ కలాంకు సీఎం జగన్ నివాళి
సాక్షి, అమరావతి : దివంగత మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. భారత శాస్త్రసాంకేతిక రంగాల్లో ఆయన కృషి మరువలేనిదని అన్నారు. కలాం నడిచిన బాట, ఆయన పద్ధతులు లక్షలాదిమందికి స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు. అబ్దుల్ కలాం బోధనలు ఇప్పటికి కూడా ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తున్నాయని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. My humble tribute to the Missile man of India, former President Sri #APJAbdulKalam ji on his death anniversary. His enormous contribution in the field of science and technology will always be remembered. Kalam ji's teachings continue to inspire millions. 🙏 — YS Jagan Mohan Reddy (@ysjagan) July 27, 2019 -
కలాం అప్పుడే దాని గురించి చెప్పారు
న్యూఢిల్లీ: భారత రత్న, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మృతిచెందడానికి నెల రోజుల ముందు, పునర్వినియోగ క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సిందిగా తనకు సూచించారని డీఆర్డీవో చైర్మన్ సతీశ్ రెడ్డి తాజాగా చెప్పారు. కలాం చనిపోయే నాటికి సతీశ్ రెడ్డి రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారుగా ఉన్నారు. తాను ఆ బాధ్యతలు చేపట్టిన తర్వాత కలాంను కలవడానికి ఆయన నివాసానికి వెళ్లినప్పుడు కలాం ఈ సలహా ఇచ్చారని సతీశ్ రెడ్డి తెలిపారు. ‘క్షిపణులు వాటి పే లోడ్‌ను ప్రయోగించిన అనంతరం మళ్లీ వెనక్కు వచ్చి, ఇంకో పే లోడ్‌ను తీసుకెళ్లేలా ఉండాలి. అలాంటి సాంకేతికత అభివృద్ధి చేయండి’ అని కలాం తనకు సూచించారని సతీశ్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. -
తెరపైకి కలాం జీవితం
సినీ పరిశ్రమలో ప్రస్తుతం బయోపిక్‌ల హవా నడుస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా మరో బయోపిక్ తెరపైకి వచ్చింది. భారతరత్న అవార్డు గ్రహీత, భారత మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త మౌలానా అబ్దుల్‌కలాం ఆజాద్ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. డ్రీమ్ మర్చెంట్స్ ఐఎన్‌సీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకేఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర, అభిషేక్ అగర్వాల్ ఈ బయోపిక్‌ను నిర్మించనున్నారు. ‘‘కలాంగారి నేతృత్వంలో 11 మే 1998లో న్యూక్లియర్ పవర్ టెస్టు సక్సెస్ అయ్యింది. ఆయన బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నాం అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం. ప్రతి కథలో ఓ హీరో ఉంటాడు’’ అని నిర్మాత అభిషేక్ అగర్వాల్ ట్వీటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 1931లో తమిళనాడులోని రామేశ్వరంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన ఎన్నో కష్టాలను ఎదర్కొని జీవితంలో అత్యున్నత శిఖరాలకు చేరుకున్నారు. 2015లో కలాం కన్నుమూసిన సంగతి తెలిసిందే. -
తెరపైకి కలాం జీవితం
ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్లో బయోపిక్‌ల ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. తాజాగా మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం బయోపిక్ వెండితెరకు రానుందని టాక్. బాలీవుడ్ నిర్మాత అభిషేక్ అగర్వాల్, టాలీవుడ్ నిర్మాత అనిల్ సుంకర కలిసి ఈ ప్రాజెక్టును పలు భాషల్లో (తెలుగులోనూ) నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇందులో కలాం పాత్రలో హీరో అనిల్ కపూర్ నటించనున్నారని భోగట్టా. 1931 అక్టోబర్ 15న రామేశ్వరంలో జన్మించిన కలాం 2015 జులై 27న మృతి చెందారు. 2002 నుంచి 2007 వరకు ఆయన భారత రాష్ట్రపతిగా ఉన్నారు. కలాం జీవితంపై రచయిత రాజ్ చెంగప్ప రాసిన ‘వెపన్స్ ఆఫ్ పీస్’ బుక్ ఆధారంగా కథ రెడీ చేశారట. కాగా, 1980లో బాపు దర్శకత్వంలో వచ్చిన ‘వంశవృక్షం’ అనే తెలుగు చిత్రంలో నటించారు అనిల్. దాదాపు 38ఏళ్ల తర్వాత మరోసారి ఆయన నటించే తెలుగు సినిమా కలాం బయోపిక్ అవుతుంది. ఇంకా ఈ చిత్రానికి దర్శకుడు ఖరారు కాలేదు. -
కాలాన్ని చేజార్చుకోకండి!
విద్యార్థులుగా మీరున్న ఈ వయసు బాగా పటుత్వంతో కూడుకున్నది. ఇప్పుడు మీరు బాగా చదవగలరు. మీరు శ్రద్ధతో వినగలుగుతున్నారు. చక్కగా విషయాలను ఆకళింపు చేసుకోగలుగుతున్నారు. కొన్ని కొన్ని విషయాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. ఎక్కువసేపు కూర్చోగలరు. అన్నిరకాల వాతావరణాలను తట్టుకునే శక్తి ఉంటుంది. అదే ఒక వయసు దాటిన తరువాత మీకు ఇప్పటి శక్తి ఉండదు. ఇకపైన మనం ఈ పంథాలో ప్రయాణం చేయాలని అనుకోగలుగుతున్నప్పడు మీకు ఆమేరకు అవకాశాలు కూడా ఉంటాయి. మీరు తప్పులు చేసినా వాటిని దిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. దానిని బంగారు భవిష్యత్తుగా మార్చుకోగలరు. కానీ ఈ అవకాశాలన్నీ దాటిపోయిన తరువాత, తలపండిపోయిన తరువాత, 70 ఏళ్ళు పైబడిన తరువాత ‘ఇది చెయ్యాలి’ అని అనుకుంటే అదంత సులభసాధ్యం కాదు. వెళ్ళిపోయిన కాలం తిరిగి రాదు. అలా బాధపడాల్సిన అవసరం మీకు రాకుండా ఉండాలంటే కాలం విలువను తెలుసుకోవాలి. దాని గొప్పదనాన్ని గుర్తించాలి. దానిని సద్వినియోగం చేసుకోవాలి. అలా కావాలంటే ఎప్పడు ఏది చేయాలో అప్పడు అది చేయడం అలవాటు కావాలి. అలవాటు అంటే అలవాటే. దానికి నిరంతరం జాగ్రత్త అవసరం.ఏ సమయంలో ఏది అందుకోవాలో అది అత్యంత శ్రద్ధతో అందుకోవాలి. అంటే – ఆవు పాలు పిండే వ్యక్తి రెండు మోకాళ్ళ మధ్యలో పాల బిందె పెట్టుకుని అవు పొదుగు దగ్గరి సిరములను లాగుతున్నప్పుడు వచ్చే సన్నటి పాలధార నేరుగా బిందెలోనే పడేటట్లు దాని మీద ఎలా దృష్టి పెడతాడో, నేలపాలు కాకుండా ఎలా చూసుకుంటాడో అలా సమయాన్ని విద్యార్థులు ఒడిసి పట్టుకోవాలి.ఒకప్పుడు అంటే తొలి దశలో సచిన్ టెండూల్కర్ తన ఆటమీద ఎంత శ్రద్ధ పెట్టేవాడంటే, ఏ ఒక్క క్షణాన్ని కూడా వృథా చేసేవాడు కాదు. శిక్షణకు వెళ్ళడానికి తెల్ల దుస్తులు తప్పనిసరి. అది అతని దగ్గర ఒకే జత ఉండేది. ఎక్కడో బస్సెక్కి ఎక్కడికో వెళ్ళాలి. పొద్దున్నంతా ఆటలో శిక్షణ తీసుకుని మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చినప్పుడు ముందుగా తన తెల్ల దుస్తులు ఉతికి ఆరేసుకునేవాడు. సాయంకాలానికి అవి వేసుకుని మళ్ళీ ఆటలో సాధనకు బయల్దేరి వెళ్లేవాడు. అతని జీవితం వడ్డించిన విస్తరి కాదు. సమయాన్ని వృథా చేసుకోకుండా అంత కఠోర సాధన చేసాడు కాబట్టే భారతరత్న కాగలిగాడు. కాలాన్ని సద్వినియోగం చేసుకున్నవారిని మాత్రం కాలం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది. అబ్దుల్ కలాంగారు ఆఖరి క్షణాల్లో కూడా కళాశాలలో వేదిక ఎక్కి పిల్లలతో మాట్లాడుతూ తనకు స్పృహ తప్పుతోందని తెలిసి, ఆఖరి మాటవరకు కూడా శరీరాన్ని ఊన్చుకుని తరువాత కిందకు జారిపోయాడు.కె.ఎల్.రావుగారని లబ్దప్రతిష్ఠుడైన ఇంజనీరు ఉండేవారు. ఆయన దగ్గరకు ఒక మంత్రిగారు ఫలానా సమయానికి వస్తానని చెప్పి ఆ తరువాత ఎప్పడో వచ్చాడు. ఆయనకోసం రావుగారు తన పనులన్నీ వాయిదా వేసుకుంటూ చాలాసేపు చూసాడు. తరువాత వచ్చిన మంత్రిగారితో చర్చించి పంపేసారు. అదేమంత్రిగారు తరువాత పనిబడి ‘‘నేను ఫలానా సమయానికి వస్తున్నాను మీతోపనుంది’’ అన్నప్పుడు...‘‘చెప్పిన సమయానికి వస్తే నేను మీతో మాట్లాడగలను. ఆ సమయం దాటితే నేను మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉండలేను’’ అని తన కాలం ఒక మంత్రిగారి కాలం కంటే ఎంత విలువయిందో నిర్మొహమాటంగా చెప్పేసాడు. నిన్న తప్పిపోయిన తరగతులు మళ్ళీ రావు. స్వతంత్ర జీవితంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్న విద్యార్థులుగా మీకు ఏ ఒక్క క్షణం కూడా జారిపోవడానికి వీల్లేదు. -
అభివృద్ధే అసలైన నివాళి
♦ దేశ ప్రగతికి ఉడుతలా పాటుపడదాం ♦ అబ్దుల్ కలాం స్మారక మండపం ప్రారంభోత్సవంలో ప్రధాని పిలుపు శ్రీరాముని కాలంలో రామేశ్వరంలోనిర్మించిన వారధికి ఉడుత చేసిన సాయంలా అందరం కలిసి దేశాభివృద్ధికి పాటుపడదామని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ‘‘దేశంలోని 125 కోట్ల జనాభా ప్రగతిపథం వైపు ఒక అడుగువేస్తే 125 కోట్ల అడుగులు ముందుకు సాగినట్లు అవుతుంది. అబ్దుల్ కలాంకు, అమ్మకు అదే మన శ్రద్ధాంజలి’’ అన్నారు. రామేశ్వరం సమీపం పెయికరుబూరులో గురువారం మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్‌కలాం స్మారక మండపాన్ని ప్రధాని జాతికి అంకితం చేశారు. అనంతరం విజ్ఞాన కేంద్రాన్ని, గ్రంథాలయాన్ని పరిశీలించారు. కలాం విగ్రహాలు, చిత్రాలను తిలకించి పులకించారు. ఆ తర్వాత కాసేపు కలాం కుటుంబ సభ్యులతో గడిపారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశం అభివృద్ధి చెందినపుడే భారతరత్న, మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్‌కలాంకు అసలైన నివాళి అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. రామనాథ పురం జిల్లా రామేశ్వరం సమీపం పెయికరుబూరులో నిర్మించిన అబ్దుల్‌కలాం స్మారక మండపాన్ని ప్రధాని మోదీ గురువారం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కలాం ద్వితీయ వర్ధంతి సభలో ఆయన ప్రసంగించారు. యువతరంలో మార్పు రావాలని అబ్దుల్ కలాం ఆశించేవారని, తమ ప్రభుత్వం ఆయన ఆశయాల సాధనకు అంకితం అవుతూ అనేక పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. ఉద్యోగాల కోసం యువత పరుగులు పెట్టకుండా ఉద్యోగావకాశాలను కల్పించే విధంగా పథకాలను రూపొందించామని అన్నారు. ఈ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సహకరిస్తోందని చెప్పారు. సముద్రంలో చేపల వేట సమయంలో మత్స్యకారుల కష్టాలకు పరిష్కారంగా కేంద్రం అనేక పథకాలు ప్రవేశపెడుతోందని మోదీ తెలిపారు. ముఖ్యంగా నడి సముద్రంలో చేపల వేటకు వెళ్లే జాలర్లు ఎన్ని కష్టాలు పడుతున్నారో తనకు తెలుసని, అందుకే గ్రీన్ కారిడార్ పథకాన్ని ఈరోజు ప్రారంభించుకున్నామని తెలిపారు. రామాభిరాముని చరిత్రలో రామేశ్వరం ప్రస్తావన కూడా ఉండడం వల్ల ఆయోధ్య–రామేశ్వరం మధ్య రైలు సేవలను నేటి నుంచి అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. అలాగే ధనుష్కోటికి రహదారిని నేడు ప్రారంభించిన్నట్లు ఆయన చెప్పారు. చెన్నై, మదురై, కోయంబత్తూరు నగరాలను స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చి రూ.900 కోట్లను మంజూరు చేశామని ప్రధాని తెలిపారు. అలాగే అమృత్ పథకాన్ని రామేశ్వరం, తిరునెల్వేలి, నాగర్‌కోవిల్, మదురై నగరాల్లో అమలు చేస్తున్నామని అన్నారు. తమిళనాడులోని 8లక్షల మందికి ఇళ్లు కావాలని రాష్ట్రం చేసిన ప్రతిపాదనకు కేంద్రం సుముఖంగా ఉందని చెప్పారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జీవించి ఉండి ఉంటే మణిమండపాన్ని చూసి ఎంతో మెచ్చుకునేవారని ఆయన అన్నారు. ఈ శుభతరుణంలో ఆమె లేకపోవడం బాధాకరమని అన్నారు. భౌతికంగా మన మధ్య లేకున్నా ప్రజలందరి హృదయాల్లో కలాం చిరస్థాయిగా నిలిచిపోయారని కేంద్ర మాజీ మంత్రి వెంకయ్యనాయుడు తన ప్రసంగంలో పేర్కొన్నారు. కచ్చదీవులను భారత్ స్వాధీనం చేసుకోవడం ద్వారా తమిళ మత్స్యకారుల ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రధాని మోదీకి సీఎం ఎడపాడి తన ప్రసంగంలో విజ్ఞప్తి చేశారు. కలాం..సలాం అబ్దుల్ కలాం గుణగణాలను ప్రస్తుతిస్తూ ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు రాసిన కలాం.. సలాం గీతాన్ని దేశం నలుమూలల నుంచి ఒకేసారి ఐదు కోట్ల మంది విద్యార్థులతో కలిసి మోదీ కూడా పాడారు. అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చేసింది. ఆటో సవారీ ఉచితం అబ్దుల్ కలాం వర్ధంతిని పురస్కరించుకుని చెన్నైకి చెందిన వీరాభిమాని కలైయరసన్ గురువారం ఉచిత సవారీ నిర్వహించాడు. ఉదయం 7గంటల నుంచి రాత్రి వరకు తన ఆటో ఎక్కిన ప్రయాణికుల నుంచి చార్జీ వసూలు చేయకుండా కోరినచోట దింపాడు. ‘నేను వదిలేసి వెళ్లిన పనులను పూర్తిచేయండి విద్యార్థులారా’ అనే అబ్దుల్ కలాం నినాదాన్ని ఆటో వెనుక పోస్టర్‌గా అంటించుకుని ప్రచారం చేశాడు. తన సేవలను గురించి కలైయరసన్ మాట్లాడుతూ, ఆటో సవారీతో రోజుకు రూ.700 సంపాదిస్తా, ఇందులో రూ.250 యజమానికి, రూ.200లు పెట్రోలుకు పోగా రూ.250 తనకు మిగులుతుందని తెలిపాడు. కలాం ఒక మంచి మనిషి, ఈ దేశానికి ఎంతో చేశాడు, ఆయన వర్ధంతి, జయంతి రోజుల్లో గత మూడేళ్లుగా ఉచిత సేవలు అందిస్తున్నానని, ఇక కూడా కొనసాగిస్తానని తెలిపాడు. కలాం కుటుంబంతో కాసేపు.. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం కుటుంబసభ్యులతో ప్రధాని మోదీ కొద్దిసేపు గడిపారు. కలాం సోదరుడు ముత్తుమీరాన్ మరైక్కాయర్ తది తర సభ్యులతో కలిసి కూర్చుని క్షేమ సమాచా రాలు తెలుసుకున్నారు. వారి చిన్నారిని ఒడిలో కూర్చునబెట్టుకుని మురిపెంగా ముద్దులాడా రు. మోదీకి కుటుంబసభ్యులంతా ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం మదురై విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్‌రావు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, మంత్రులు స్వాగతం పలికారు. ప్రధానితోపాటూ కేంద్ర మాజీ మంత్రి వెంకయ్యనాయుడు వచ్చారు. మదురై నుంచి ఆర్మీ హెలికాప్టర్లో స్మారక మందిరానికి చేరుకున్నారు. అదే హెలికాప్టర్లో గవర్నర్ విద్యాసాగర్‌రావు, సీఎం ఎడపాడి సైతం వచ్చారు. 11.30 గంటలకు స్మారక మండపాన్ని, కలాం ఆలోచనలకు అద్దం పట్టేలా రూపొందించిన కలాం విజన్ 2020 సంతోష్ వాహిని ప్రచార రథాన్ని ప్రధాని ప్రారంభించారు. అనంతరం కలామ్ ద్వితీయ వర్ధంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ గ్రీన్‌బెల్ట్ కారిడార్ పథకం కింద నడిసముద్రంలో చేపలవేట నిమిత్తం ప్రాజెక్టు అనుమతి ప్రతిని మత్య్సకారులకు అందజేశారు. దేశంలోని రెండు ఆధ్యాత్మిక కేంద్రాలైన రామేశ్వరం–అయోధ్య మధ్య రైలు సేవలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వేదికపై నుంచే ప్రారంభించారు. రూ.55 కోట్లతో నిర్మించిన రామేశ్వరం–ధనుష్కోటి జాతీయ రహదారిని ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్‌రావు, సీఎం పళనిస్వామి, కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, పొన్ రాధాకృష్ణన్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, కేంద్ర మాజీ మంత్రి వెంకయ్యనాయుడు, తమిళనాడు మంత్రులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై పాల్గొన్నారు. ప్రధాని మోదీ మధ్యాహ్నం 2.40 గంటలకు మదురై నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. -
అభివృద్ధి భారతం.. కలాం కల
దానిని సాకారం చేసేందుకు కలసికట్టుగా కృషి చేద్దాం - దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు - రామేశ్వరంలో కలాం స్మారకం ప్రారంభం - కలాం సమాధి వద్ద నివాళులర్పించిన ప్రధాని - జయలలిత లేనిలోటు స్పష్టంగా తెలుస్తోందన్న మోదీ సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న 2022 నాటికి అభివృద్ధి భారతాన్ని చూడాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కలలుగన్నారని, ఆయన కలలను నిజం చేసేందుకు మనందరం కలసికట్టుగా కృషి చేద్దామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘ప్రస్తుతం దేశంలో 125 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఒక్కో అడుగు ముం దుకేస్తే.. దేశం 125 కోట్ల అడుగులు ముందుకువెళుతుంది’’అని ప్రధాని పేర్కొన్నారు. గురువారం భారతరత్న, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం రెండో వర్ధంతి సందర్భంగా తమిళనా డులోని రామేశ్వరం సమీపంలోని పేయికరుం బూరులో కలాం భౌతికకాయాన్ని ఖననం చేసి న చోటనే నిర్మించిన స్మారక మండపాన్ని ప్రధా ని జాతికి అంకితం చేశారు. కలాం సమాధి వద్ద పుష్పగుచ్ఛాన్ని ఉంచి నివాళులర్పించారు. మాది చేతల ప్రభుత్వం.. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మోదీ మాట్లాడుతూ.. కలాం కలలుగన్న అభివృద్ధి భారతాన్ని నిజం చేసేం దుకు కేంద్రం ప్రారంభించిన వివిధ అభివృద్ధి పథకాలైన.. స్టాండప్ ఇండియా లేదా స్టార్టప్ ఇండియా, అమృత్ సిటీస్ లేదా స్మార్ట్ సిటీస్, స్వచ్ఛభారత్ ప్రాజెక్టులు చాలాదూరం ప్రయాణించాల్సి ఉందన్నారు. కలాం స్మారకంతో రామేశ్వరానికి మరింత శోభ, ప్రతిష్ట చేకూరిం దని, యువత, పర్యాటకులు రామేశ్వరాన్ని, కలాం స్మారకాన్ని సందర్శించాలని మోదీ కో రారు. ‘‘కలాం అంతిమయాత్రలో పాల్గొన్నపు డే స్మారకంపై మాటిచ్చా. నేడు అది నిలబెట్టుకున్నా. రెండేళ్ల వ్యవధిలో అద్భుతమైన స్మారక నిర్మాణాన్ని పూర్తి చేయడం ద్వారా మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని నిరూపించా’’అని మోదీ పేర్కొన్నారు. స్ఫూర్తిప్రదాత కలాం.. కలాం ఇప్పటికీ కోట్లాది మంది ప్రజల్లో స్ఫూర్తి నింపుతున్నారని మోదీ అన్నారు. యువతను, విద్యార్థులను కలాం అమితంగా ఇష్టపడేవా రని, వారి కోసమే స్టాండప్, స్టార్టప్ స్కీముల ను ప్రారంభించామని, యువతకు ఎటువంటి గ్యారంటీ లేకుండా రుణాలు ఇచ్చేందుకు ముద్రా బ్యాంకును ఏర్పాటు చేశామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకుని పనిచేస్తే.. కొత్త భారతదేశాన్ని, కొత్త తమిళనాడును చూడవచ్చన్నారు. రామేశ్వరం నుంచి ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు వెళ్లే వీక్లీ రైలును ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రారంభించారు. కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, సీఎం కె.పళనిస్వామి, కేంద్ర మంత్రులు పొన్ రాధాకృష్ణన్, నిర్మలాసీతారామన్, ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎం.వెంకయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. స్మారకం.. ప్రత్యేకం..: కలాం స్వగ్రామం పేయికరుంబూరులో తమిళనాడు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో కలాం స్మారకాన్ని నిర్మించారు. రూ.15 కోట్లతో నిర్మించిన ఈ స్మారకానికి కలాం తన జీవితకాలంలో ఎక్కువ శాతం గడిపిన డీఆర్డీవోనే రూపకల్పన చేసింది. కలాం శాస్త్రవేత్తగా ఉన్న సమయంలో రూపొందించిన మిస్సైళ్లు, రాకెట్ల నమూనాలను ఇందులో ఏర్పాటు చేశారు. కలాం వీణ వాయించే విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. కలాంకు చెందిన 900 పెయింటింగ్‌లు, 200 అరుదైన ఛాయాచిత్రాలను ఉంచారు. అమ్మ ఆశీస్సులు ఉంటాయి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని కలాం స్మారకం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘‘జయలలిత మరణం తర్వాత తమిళనాడులో నేను పాల్గొన్న భారీ కార్యక్రమం ఇదే. ఆమె లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. అమ్మ(జయలలిత) లేకపోయినా.. తమిళనాడు సమగ్ర వికాసానికి ఆమె ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని నేను నమ్ముతున్నాను’’అని మోదీ వ్యాఖ్యానించారు. కలాం.. సలాం.. అబ్దుల్ కలాం గుణగణాలను ప్రస్తుతిస్తూ ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు రాసిన కలాం.. సలాం గీతాన్ని దేశం నలుమూలల నుంచి ఒకేసారి ఐదు కోట్ల మంది విద్యార్థులతో కలసి మోదీ పాడారు. అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసింది. కలాం కుటుంబంతో కొంతసేపు కలాం కుటుంబ సభ్యులతో ప్రధాని మోదీ కొద్దిసేపు గడిపారు. కలాం సోదరుడు ముత్తుమీరాన్ మరైక్కాయర్ తదితర సభ్యులతో కలసి కూర్చుని క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. వారి చిన్నారిని ఒడిలో కూర్చోబెట్టుకుని మురిపెంగా ముద్దులాడారు. -
కలామ్ స్మారక మందిరం ప్రారంభం
►కలాం.. కలకాలం! చెన్నై: మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలామ్ స్మారక మండపాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. రామేశ్వరం జిల్లా పేయ్‌కరుంబులో రూ.15 కోట్లతో నిర్మించిన కలాం స్మారక మండపాన్ని గురువారం ఉదయం 11.30 గంటలకు ప్రధాని ఆవిష్కరించారు. కలాంను పేయ్‌కరుంబులో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఖననం చేసిన విషయం తెలిసిందే. అదే స్థలంలో రూ.15 కోట్లతో ఈ స్మారక మండపాన్ని నిర్మించారు. అబ్దుల్ కలాం రెండో వర్ధంతి సందర్భంగా మోదీ ఈ మండపాన్ని ఆరంభించారు. అలాగే కలామ్ కుటుంబసభ్యులతో ఆయన ముచ్చటించారు. అంతకు ముందు కలామ్ సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. ఆ తర్వాత ‘కలాం...సలాం’ అంటూ రూపొం దించిన గీతాన్ని ప్రధాని మోదీ సహా దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది విద్యార్థులు ఒకేసారి ఆలపించారు. ‘కలాం విషన్ 2020 సంతోష్ వాహినీ’ ప్రసార వాహనాన్ని ప్రారంభించారు. 12.25 గంటలకు రామేశ్వరం–అయోధ్య ఎక్స్‌ప్రెస్ రైలు సేవలను, రామేశ్వరం నుంచి ధనుష్కోటికి రూ.55 కోటత్లో నిర్మించిన జాతీయ రహదారిని ఆరంభించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, నితిన్ గడ్కరి, పొన్ రాధాకృష్ణన్, నిర్మలా సీతారామన్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, సీఎం ఎడపాడి పళనిస్వామి, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. చరిత్ర ఎరుగని బందోబస్తు ప్రధాని మోదీ రాక సందర్భంగా రామేశ్వరం జిల్లాలో తమిళనాడులో గతంలో ఎన్నడూ ఎరుగని రీతిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉచ్చిపుళ్లి విమానాశ్రయం నుంచి రామేశ్వరం వరకు జాతీయ రహదారి పొడవునా వేలాది మంది పోలీసులు బందోబస్తు పాటిస్తున్నారు. బుధ, గురువారాల్లో సముద్రంలో చేపలవేటకు మత్య్సకారులను అనుమతించలేదు. భారత నౌకాదళం, సముద్రతీర గస్తీదళం సైతం సముద్ర తీరంపై నిఘా పెట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. రాష్ట్రపతిగా పదవీ విరమణ తరువాత సైతం భావిభారత పౌరులను తీర్చిదిద్దేందుకు అవిశ్రాంతగా పాటుపడ్డారు అబ్దుల్‌కలాం. మేఘాలయ రాష్ట్రం షిల్లాంగ్‌లో 2015 జూలై 27వ తేదీన జరిగిన ఒక సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ వేదికపైనే ఆయన కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచారు. భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలు సైతం కలాం మృతికి కన్నీళ్లు పెట్టాయి. అబ్దుల్‌కలాం జన్మించిన రామేశ్వరం పేయ్ కరుంబులో ఆయన భౌతికకాయాన్ని ఖననం చేశారు. ఆయన ఆశయాలను ప్రతిబింబించేలా నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రూ.50 కోట్లతో స్మారక మండపాన్ని నిర్మించనున్నట్లు ప్రధాని మోదీ అదేరోజు ప్రకటించారు. ప్రముఖ కట్టడాల స్ఫూర్తితో.. స్మారక మండప నిర్మాణ పనులను డిఫెన్స్ రీసెర్చ్, డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) పర్యవేక్షణలో సాగాయి. ప్రస్తుతం తొలిదశగా రూ.15 కోట్లతో మణిమండపం, రూ.10 కోట్లతో పరిసరాల్లోని నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మండప నిర్మాణానికి అవసరమైన అపురూపమైన వస్తువులను దేశం నలుమూలల నుంచి (కేరళ మినహా) తెప్పించారు. ప్రధానమైన ప్రవేశ ద్వారాలను తంజావూరు శిల్పులు తీర్చిదిద్దారు. స్థానిక పనివారితోపాటు బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నిర్మాణ రంగ నిపుణుల సేవలను వినియోగించారు. వీరుగాక కొత్త ఢిల్లీ నుంచి 500 మంది పనివారిని రప్పించారు. దేశంలోని అనేక ప్రముఖ కట్టడాల స్ఫూర్తితో దీని నిర్మాణం చేపట్టారు. అబ్దుల్ కలాం జీవితంలోని ప్రధాన ఘట్టాలను అక్కడ పొందుపరిచారు. అద్భుతమైన గ్రంథాలయం, విజ్ఞాన కేంద్రం పేపర్ బాయ్‌గా జీవితం ప్రారంభించి భార త ప్రథమ పౌరుడి స్థాయి వరకు తన జీవనగమనంలో అన్నింటా తన బాధ్యతలకు వన్నెతెచ్చారు కలాం. అంతరిక్ష శాస్త్రవేత్తగా ఆయన చేసిన సేవలు నేటికీ మరువలేనివి. అందుకే అన్నింటిలోకి ఆయన ఇష్టపడే అంతరిక్ష ప్రయోగాలకు గుర్తుగా ఫొటో మ్యూజియంలో రాకెట్ నమూనాలను ఉంచారు. ఆయనలోని కళాకారుడిని పరిచయం చేసేలా కలాం రూపొందించిన చిత్ర లేఖనాలను అమర్చారు. ప్రాంగణం పరిసరాల్లో పచ్చదనం ఉట్టిపడుతోంది. డీఆర్డీవో కార్యాలయం నుంచి పర్యవేక్షించేలా 24/7 పనిచేసేలా సీసీ కెమెరాలను అమర్చారు. రెండోదశలో అబ్దుల్‌కలాం వినియోగించిన పుస్తకాలతో కూడిన గ్రంథాలయం, విజ్ఞాన కేంద్రం, ఆడిటోరియం నిర్మిస్తారు. కలాం వర్ధంతి రోజు జూలై 27, జయంతి రోజైన అక్టోబర్ 15వ తేదీన ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. -
ఘనంగా కలాం జయంతి వేడుకలు
శంషాబాద్: జిల్లాలోని నర్కుడా లీడ్ ఇండియా భవన్ లో శనివారం మాజీ రాష్ట్రపతి, భారతరత్న స్వీర్గీయ అబ్దుల్ కలాం 85వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఇండియా భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కలాం కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయనకు ఘన నివాళులు అర్పించి, కలాం నిరాడంబర జీవితాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లీడ్ ఇండియా చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, ప్రధానకార్యదర్శి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టెక్నాలజీతో సమస్యలకు చెక్!
‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ పిలుపు * పరిశోధనల్లో యువత ఉత్సాహంగా భాగస్వాములవ్వాలి * సృజనాత్మకతకు సరైన గుర్తింపునిస్తాం.. న్యూఢిల్లీ: దైనందిన సమస్యలకు సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కారాలను కనుగొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆదివారం మాసాంతపు ‘మన్ కీ బాత్’లో ఆయన పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, నష్టం, రియో ఒలింపిక్స్, పంద్రాగస్టు వేడుకలు, ఇటీవలి దక్షిణాఫ్రికా పర్యటన వంటి అంశాలపై మాట్లాడారు. ‘భారత్ చాలా సమస్యలను ఎదుర్కొంటోంది. దైనందిన జీవితంలో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. వీటికి టెక్నాలజీతో పరిష్కారం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యలకు సాంకేతిక పరిష్కారం కోసం యువత పరిశోధనలు చేయాలి’ అని పిలుపునిచ్చారు. సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు, వివిధ పరిశోధనల ద్వారా ఉపాధి కల్పనకోసం ఉద్దేశించిన ‘అటల్ ఇనోవేషన్ మిషన్’ను గుర్తుచేశారు. దైనందిన సమస్యల పరిష్కారానికి రూపొందించే సాంకేతికతకు సరైన గుర్తింపునిస్తామన్నారు. 21వ శతాబ్దిలో నవభారత నిర్మాణానికి ఈ పరిశోధనలు చాలా అవసరమని, ఈ దిశగా విజయం సాధించటమే మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు ఇచ్చే అసలైన నివాళి అని పేర్కొన్నారు. ‘వచ్చే తరం కోసం సృజనశీలురను తయారుచేయాలి. అందుకే కేంద్ర ప్రభుత్వం అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌ను ప్రారంభించింది. ఈ ల్యాబ్‌లను ఏర్పాటు చేసుకున్న పాఠశాలలకు రూ. 10 లక్షలు ఇవ్వటంతో పాటు ఐదేళ్లపాటు దీని నిర్వహణకు సంబంధించిన ఖర్చును కేంద్రమే భరిస్తుంది’ అని తెలిపారు. సృజనాత్మకతను ప్రోత్సహించే ‘అటల్ ఇంక్యుబేషన్’ కార్యక్రమం కోసం రూ. 10 కోట్ల నిధిని సమకూర్చామన్నారు. వరద బాధితులకు సాయం.. ‘మొన్నటివరకు కరువుతో ఆందోళన చెందాం. ఇప్పుడు పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల వరదలతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. వరదల ప్రభావం ఉన్న రాష్ట్రాలతో కలసి కేంద్రం పనిచేస్తోంది. బాధితులకు సాయం అందించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం’ అని మోదీ అన్నారు. నెలకోరోజు ఉచితంగా పనిచేయరూ! ప్రసవాల్లో చిన్నారుల మరణాలను తగ్గించాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. పేద గర్భిణుల కోసం ప్రభుత్వాసుపత్రుల్లో ప్రతినెలా 9వ తేదీన ఉచిత చెకప్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేయని స్త్రీవైద్య నిపుణులు కూడా ఒకరోజు ఈ కార్యక్రమం కోసం కేటాయించాలని కోరారు. ఇందుకోసం లక్షల మంది డాక్టర్లు కావాలన్నారు. రియో ఒలింపిక్స్‌లో భారతీయ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘గెలుపోటములను పక్కన పెడితే ఒలింపిక్స్ వంటి ప్రతిష్టాత్మక క్రీడల్లో పాల్గొనటమే చాలా గొప్ప విషయం. అందువల్ల మనదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులను అభినందించాలి’ అని అన్నారు. క్విట్ ఇండియా 75 ఏళ్ల సంబరాలు 70వ స్వాతంత్య్ర దినోత్సవంతోపాట ఆగస్టు 8న ‘క్విట్ ఇండియా ఉద్యమ’ 75వ వార్షికోత్సవాలను ప్రజలంతా పండుగలా నిర్వహించాలన్నారు. ఆ చిత్రాలను మోదీ యాప్ ద్వారా తనకు పంపించాలన్నారు. ఎర్రకోట నుంచి ఆగస్టు 15న చేయనున్న ప్రసంగంలో చేర్చాల్సిన అంశాలపై ప్రజల నుంచి సలహాలను మోదీ ఆహ్వానించారు. దక్షిణాఫ్రికా పర్యటనలో గాంధీ జీవితంతో ముడిపడిఉన్న ప్రాంతాల్లో పర్యటించటంతో పలు కార్యక్రమాల్లో పాల్గొనటం ఆనందాన్ని కలిగించిందన్నారు. ఇటీవలే పార్లమెంటు ఆమోదించిన ‘కాంపా’ చట్టాన్ని ప్రస్తావిస్తూ.. అభివృద్ధి పేరుతో అడవులకు జరుగున్న నష్టాన్ని పూరించేందుకు రూ.40 వేల కోట్లను వివిధ రాష్ట్రాలకు పంచుతున్నట్లు మోదీ తెలిపారు. అటవీకరణను ప్రజా ఉద్యమంలా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. వర్షాకాలంలో ప్రబలే డెంగ్యూ వంటి వ్యాధుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలని మోదీ సూచించారు. కాగా, మన్ కీ బాత్‌లో కశ్మీర్ పరిస్థితుల గురించి కూడా ప్రధాని మాట్లాడి ఉంటే బాగుండేదని.. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా అన్నారు. ‘ఇటీవల నెలకొన్న పరిణామాలతో 50 మంది చనిపోయినా.. లెక్కలేనంత మంది గాయపడినా మోదీకి ఇవేం పట్టటంలేదు’ అని ట్విటర్లో విమర్శించారు. వారణాసిలో సోనియా రోడ్ షో వారణాసి: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అప్పుడే వేడెక్కుతోంది. ప్రధానిమోదీ నియోజకవర్గం వారణాసి నుంచి కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. మంగళవారం పట్టణంలో రోడ్ షో నిర్వహించనున్నారు. 8 కి.మీ. సాగే ఈ షోకి వేలాదిగా కార్యకర్తలు, అభిమానులు తరలివస్తారని భావిస్తున్నారు. -
అబ్దుల్‌కలాం మాటలను స్ఫూర్తిగా తీసుకోవాలి
రామన్నపేట కలలు కనండి వాటిని సాకారం చేసుకోవాలని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం చెప్పిన మాటలను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని శ్రీహిందూ కళాశాలల చైర్మన్ డాక్టర్ పనకంటి భాస్కర్‌రావ్ తెలిపారు. ఏపీజే అబ్దుల్‌కలాం ప్రథమ వర్ధంతిని బుధవారం మండలకేంద్రంలోని శ్రీహిందూడిగ్రీ జూనియర్కళాశాలల్లో, క్రిష్ణవేణిహైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తన మేధాశక్తితో దేశఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన ఘనత కలాంకు దక్కుతుందని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ టి.చంద్రశేఖర్, వైస్‌ప్రిన్సిపాల్ వి.దేవేందర్‌రావ్, సయ్యద్, సుధాకర్, నర్సింహ, శ్రీను, వెంకటేష్, మహేష్, ప్రభాకర్, జా‘నేశ్వరి, ముజాహిద్, మల్లికార్జున్, వెంకటేశ్వర్లు, మమత, శాంతి, క్రిష్ణవేణిహైస్కూలు ప్రధానోపాధ్యాయులు మణి, నరేందర్‌రెడ్డి, రమేష్, రాంబాబు, రశీద్, నరేష్‌లు పాల్గొన్నారు. -
కలాం మార్గంలో నడవడమే ఉత్తమ శ్రద్ధాంజలి
హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ప్రధమ వర్దంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో కలాం మాటలను గుర్తుచేసుకున్నారు. 'మనల్ని బలంగా తయారుచేయటం కోసమే కష్టాలు వస్తాయి అని కలాంగారు చెప్పారు. తన ఆలోచనలు, చర్యలతో ఆయన దేశాన్ని బలోపేతం చేశారు. అతడి మార్గంలో నడవడమే ఉత్తమమైన శ్రద్ధాంజలి' అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. Abdulkalamji said difficulties come to strengthen us. He inspired a Nation with his thought & action. To tread his path is the best tribute.— YS Jagan Mohan Reddy (@ysjagan) 27 July 2016 -
అబ్దుల్ కలాం కాంస్య విగ్రహం ఆవిష్కరణ
రామేశ్వరం: భారత మాజీ రాష్ట్రపతి, దివంగత ఎపిజె అబ్దుల్ కలాం కాంస్య విగ్రహాన్ని కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, మనోహర్ పారికర్ బుధవారమిక్కడ ఆవిష్కరించారు. అలాగే రామేశ్వరంలో ఆయన పేరిట నిర్మించే స్మారక కేంద్రానికి వారు శంకుస్థాపన చేశారు. కలాం స్మారక చిహ్నంగా ఓ లైబ్రరీని, మ్యూజియంను సైతం నిర్మించనున్న విషయం తెలిసిందే. మరోవైపు కలాంకు దేశప్రజలు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలాంను గుర్తు చేసుకున్నారు. ఆయనను భౌతికంగా కోల్పోయినా, కలాంను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని ఆమె అన్నారు. -
కలామ్‌కు విగ్రహం
గాజువాక: భారతీయ క్షిపణి పితామహుడు, భారతరత్న, మాజీ రాష్ట్రపతి దివంగత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తిని తన మదినిండా నింపుకున్న స్థానిక ట్వింకిల్ స్కూల్ కరస్పాండెంట్ ఏకంగా కలామ్ విగ్రహాన్ని తయారు చేయించారు. మిసైల్ మ్యాన్ మొదటి వర్థంతి సందర్భంగా దాన్ని తన పాఠశాల ఆవరణలో బుధవారం ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేశారు. విద్యార్థులంటే కలామ్‌కు అత్యంత ఇష్టమన్న విషయం తెలిసిందే. అందువల్ల ఆయన స్ఫూర్తిని ప్రతిరోజూ విద్యార్థులకు తెలిసేలా చేయడం కోసం పాఠశాల ప్రవేశ ద్వారం వద్ద విగ్రహాన్ని ప్రతిషి్ఠంచేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికోసం మూడు అడుగుల ఎల్తైన పీఠం నిర్మించారు. ఆరు అడుగుల విగ్రహాన్ని రూపొందించారు. ప్రతిషి్ఠంచిన తరువాత ఇది తొమ్మిది అడుగుల ఎత్తులో కనిపిస్తుంది. దీనికోసం స్టీల్, సిమెంట్, మార్బుల్ పౌడర్‌ను ఉపయోగించినట్టు పాఠశాల కరస్పాండెంట్ దొడ్డి శ్యామ్ తెలిపారు. ఇది జిల్లాలోనే తొలి విగ్రహమని పేర్కొన్నారు. గుడి కడదామనుకున్నా... ‘విశాఖ జిల్లాలో కలామ్ తనకు అరుదైన గుర్తింపును ఇచ్చారని శ్యామ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘మా స్కూల్‌కు వచ్చి గంటా రెండు నిమిషాలు మా విద్యార్థులతో గడిపారు. మా స్కూల్‌కు వచ్చారు కాబట్టి ఆయన జ్ఞాపకాలను శాశ్వతంగా ఉంచుకోవడం కోసం ఈ ప్రయత్నం చేశాను. ఆయన రగిలించిన స్ఫూర్తిని విద్యార్థులందరిలోను రోజూ నింపడానికి ఈ ప్రయత్నం చేశాను. గురువు (కలామ్)కు గుడి కడదామనుకున్నాను. ప్రస్తుతానికి పరిస్థితులు అనుకూలించలేదు. ఆలస్యమైనా ఆలయం మాత్రం కడతాను. ఆయన పేరుమీద 50 మంది పేద విద్యార్థులను చదివిస్తున్నాను. దీనికోసం ఎవరివద్దా ఏ విధమైన సహకారం తీసుకోవడంలేదు. తమిళనాడులో స్మారక స్థూపం కడతామని ప్రకటించి కూడా కట్టకుండా వదిలేశారు. ఇది చాలా బాధగా ఉంద’ని శ్యామ్ పేర్కొన్నారు. -
కలాం విగ్రహ ఏర్పాట్లు సందర్శించిన ప్రత్యేక బృందం
రామేశ్వరంః మాజీ రాష్ట్రపతి, దివంగత ఎపిజె అబ్దుల్ కలాం కాంస్య విగ్రహాన్ని రామేశ్వరంలో ప్రతిష్టించనున్నారు. జూలై 27న జరగనున్న విగ్రహ స్థాపనకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు రక్షణ మంత్రిత్వశాఖ, ఇండియన్ కోస్ట్ గార్డు అధికారులతో కూడిన బృందం ఆ ప్రదేశాన్ని సందర్శించింది. రక్షణ మంత్రిత్వశాఖ, ఇండియన్ కోస్ట్ గార్డు అధికారులు రామేశ్వరంలో పర్యటించారు. మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాం కాంస్య విగ్రహం ఏర్పాటుకోసం జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. మాజీ రాష్ట్పపతి మొదటి వర్థంతి సందర్భంలో జూలై 27న ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు రక్షణ మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. అదే ప్రాంతంలో కలాం స్మారక చిహ్నంగా ఓ లైబ్రరీని, మ్యూజియం ను సైతం నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే సిబ్బందికోసం హౌసింగ్ క్వార్టర్స్ ను కూడా నిర్మించనున్నట్లు వెల్లడించారు. పర్యవేక్షణ బృందంతోపాటు మండపం కోస్ట్ గార్డ్ కమాండర్ రామ్మోహన్ రావు, అబ్దుల్ కలాం మేనల్లుడు షేక్ సలీం కూడా హాజరై విగ్రహ ఏర్పాటు పనులను పరిశీలించారు. -
కలాంకు ఇదేనా మర్యాద!
చెన్నై : మనిషి ఉన్నంత వరకే విలువ..అన్న నాడికి అద్దం పట్టే రీతిలో భారత రత్న అబ్దుల్ కలాం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు ఉంది. స్మారక కేంద్రానికి స్థల కేటాయింపులో సాగుతున్న అలసత్వాన్ని బట్టి చూస్తే, ఇదేనా ఆ మహనీయుడికి ఇచ్చే మర్యాద అన్న ఆవేదన ప్రతి ఒక్కరి మదిలో మెదలక మానదు. రాష్ర్ట ప్రభుత్వ అలసత్వంపై కేంద్ర బృందం సైతం అసహనం వ్యక్తం చేసింది. ‘కలలు కనండి.... వాటిని సాకారం చేసుకోండి.. ఏపీజే అబ్దుల్ కలాం పిలుపునకు స్పందించిన వాళ్లు దేశ విదేశాల్లో కోట్లల్లో ఉన్నారు. భారతరత్నగా, మాజీ రాష్ట్రపతిగా, మిస్సైల్ మ్యాన్‌గా పేరు గడించిన ఈ నిరంతరం ఉపాధ్యాయుడు గత ఏడాది జూలై 27న శాశ్వత నిద్రలోకి వెళ్లారు. అల్లంత దూ రాలకు వెళ్లినా, ఆయన సందేశాలు, పి లుపు శాశ్వతం. అందుకే ఆయన అంటే పట్టభద్రులు, యువత, విద్యార్థిలోకాని కి అమితాభిమానం. అయితే, పాలకుల్లో ఆ అభిమానం, గౌరవం కన్పించడం లే దని చెప్పవచ్చు. మనిషి ఉన్నంత వరకే విలువ...తదుపరి...అన్న నానుడికి అద్దం పట్టే రీతిలో వ్యవహారాలు సాగుతున్నాయని చెప్పవచ్చు. తాను పుట్టిన గడ్డ రామేశ్వరంలోని తేకరంబు వద్ద శాశ్వత నిద్రలో కలాం ఉన్నారు. ఆ ప్రదేశంలో స్మారక మండపం, ఎగ్జిబిషన్, విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తామని పాలకులు ప్రకటించారు. ఇందుకు తగ్గ హామీని కలాం సొదరుడు మహ్మద్ ముత్తు మీరాన్‌కు ఇచ్చారు. అయితే, పనులన్నీ నత్తనడకే. పర్యాటక, ఆథ్యాత్మిక కేంద్రం గా ఉన్న రామేశ్వరానికి వచ్చే ప్రతి ఒక్కరూ కలాం సమాధిని సందర్శించి వెళ్తున్నారు. అయితే, అక్కడ సౌకర్యాలు అంతంత మాత్రమే. ఇప్పుడిప్పుడే ప్రహరీ నిర్మాణాలు, కంచె ఏర్పాటు పనుల్ని ముగించారు. ఇనుప కమ్మిలను ఏర్పాటు చేసి బయటి నుంచి కూడా జనం సమాధిని వీక్షించేందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసి ఉన్నారు. సమాధి మీద ఎండ పడకుండా ఓ షెడ్డును నిర్మించారు. అంతటితో తమ పని ముగిసినట్టే అన్నట్టుగా పాలకుల తీరు స్పష్టం అవుతున్నాయి. ఇదేనా మర్యాద : కలాం భౌతికంగా అందర్నీ వీడి మరో రెండు వారాల్లో ఏడాది కావస్తున్నది. అయినా, ఇంత వరకు కలాం స్మారక మండపం, విజ్ఞాన కేంద్రం, కలాంకు సంబంధించిన వస్తువుల ప్రదర్శన శాల, చిన్న పిల్లల పార్కు పనులు అడుగైనా ముందుకు సాగ లేదు. విజ్ఞాన కేంద్రం తదితర పనులకు రూ. 60 కోట్లను కేంద్రం కేటాయించినట్టు సంకేతాలు ఉన్నా, అందుకు తగ్గ పనులు చేపట్టేందుకు స్థలం సమస్య నెలకొని ఉన్నది. కలాం సమాధి ఉన్నప్రదేశం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది. కలాం కోసం రాష్ట్ర ప్రభుత్వం 1.5 ఎకరాల స్థలాన్ని గతంలో కేటాయించింది. ఈ స్థలంలోనే ప్రస్తుతం ఆ మహనీయుడు శాశ్వత నిద్రలో ఉన్నారు. అయితే, స్మారక మండపం, విజ్ఞాన కేంద్రం, ఇతర నిర్మాణాలకు తగ్గ స్థలం సమస్య నెలకొని ఉన్నది. ఈ స్థలాన్ని కేటాయించాలంటూ మూడు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినా, రాష్ట్ర పాలకుల్లో స్పందన కరువైనట్టుంది. అసెంబ్లీ ఎన్నికలు అడ్డొచ్చినా, మళ్లీ అమ్మ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావస్తున్నది. అయినా, ఇంత వరకు స్థల కేటాయింపు విషయంగా ఎలాంటి నిర్ణయం వెలువడ లేదు. దీంతో ఏడాదిలోపు పనుల్ని ముగించి తీరుతామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ వర్గాలకు రాష్ర్ట ప్రభుత్వ తీరు అసహనాన్ని రేకెత్తిస్తున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఎం మోహన్, ఆర్కే కౌహలాల్, మహేంద్రలతో కూడిన బృందం కలాం సమాధి పరిసరాల్ని మంగళ, బుధవారం పరిశీలన జరిపారు. అక్కడ ఇప్పటి వరకు సాగిన, సాగుతున్న పనుల్ని పరిశీలించి, స్థల కేటాయింపులో జాప్యంపై ఆ బృందం అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. -
డాక్టర్ అబ్దుల్ కలాం నేషనల్ స్కూల్ ప్రారంభం
హైదరాబాద్ : తన చివరి క్షణం వరకు విద్యార్థులతో మమేకమైన భారతరత్న, దివంగత డాక్టర్ అబ్దుల్ కలాం స్ఫూర్తితో కలాం నేషనల్ స్కూల్‌ను ప్రారంభిస్తున్నట్లు మెథడిస్ట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గిరిధర్ ఆకుల అన్నారు. సోమవారం కళాశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. డాక్టర్ కలాం రచించిన వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకాన్ని తల్లిదండ్రులు చదివి పిల్లలకు వివరించాలన్నారు. ‘డెవలప్ యువర్ సెల్ఫ్ అండ్ డెవలప్ ద నేషన్’ అన్న ఆయన మాటలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులను డాక్టర్ గిరిధర్ ఆకుల సన్మానించారు. స్కూల్ చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అక్బర్ పాల్గొన్నారు. -
కలామ్ పార్టీ!
చెన్నై, సాక్షి ప్రతినిధి: దివంగత రాష్ట్రపతి అబ్దుల్‌కలామ్ పేరుతో పార్టీ వెలిసింది. ‘ అబ్దుల్‌కలాం విజన్ ఇండియా పార్టీ’ పేరున కలాం సలాహాదారుడైన పొన్రాజ్ పార్టీని స్థాపించారు. అయితే పార్టీ ఏర్పాటుపై కలాం బంధువులు అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత రాష్ట్రపతుల వరసలో ప్రత్యేక స్థానాన్ని పొందిన అబ్దుల్ కలామ్‌కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఐదేళ్లపాటు భారత రాష్ట్రపతి హోదాలో అనేక రాజకీయ పార్టీలతో మెలిగినా ప్రత్యేకమైన శైలిని చాటుకునేవారు. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి అన్ని పార్టీల నేతలను ఆకట్టుకున్నారు. వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అబ్దుల్‌కలామ్‌ను ఇష్టపడుతారు. అంతరీక్ష శాస్త్రవేత్తగా మేధావులను, తత్వవేత్తగా యువతను, భావి భారత పౌరులకు మార్గదర్శిగా విద్యార్థిలోకాన్ని ఆలరించారు. విద్యార్థిలోకమైతే అబ్దుల్‌కలామ్‌ను అపురూపమైన వ్యక్తిగా ఆరాధిస్తారు. నేటి యువతను మేల్కొలుపుతూ, ఉత్తేజపరుస్తూ కలామ్ ఇచ్చిన సందే శాలు అన్నీఇన్నీ అని లెక్కకట్టలేం. విద్యార్థిలోకంతోనే చివరి వరకు గడపాలని అబ్దుల్ కలామ్ ఆశించారు. ఆయన ఆశించినట్లుగానే మేఘాలయా రాష్ట్రం షిల్లాంగ్‌లో గత ఏడాది జూలై 27వ తేదీన విద్యార్థుల నుద్దేశించి ప్రసంగిస్తూ తుదిశ్వాస విడిచారు. కలామ్ మృతి వార్తతో యావత్ప్రపంచం కదిలిపోయి కన్నీరుపెట్టింది. తమిళనాడులోని రామేశ్వరానికి చెందిన వ్యక్తి కావడంతో రాష్ట్ర ప్రజలంతా విషాదంలో మునిగిపోయారు. చిన్నారులు సైతం టీవీల ముందు కూర్చుని ఆయన అంత్యక్రియలను అశ్రునయనాలతో తిలకించారు. రామేశ్వరంలో అబ్దుల్‌కలామ్‌కు అంత్యక్రియలు జరిగినచోట స్మారక మండపం నిర్మించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కలామ్పేరుతో రాజకీయ పార్టీ : అబ్దుల్‌కలామ్ గతించి ఇంకా ఏడాది కూడా కాక మునేపే ఆయన పేరుతో పార్టీ ఆవిర్భావం కావడం సంచలన వార్తగా మారింది. కలామ్ సలహాదారుగా వ్యవహరించిన పొన్రాజ్ ‘అబ్దుల్ కలామ్ విషన్ ఇండియా పార్టీ’ అనే పేరున పార్టీని స్థాపించారు. సదరు పొన్రాజ్ ఆదివారం ఉదయం రామేశ్వరానికి వచ్చిన కలామ్ అంత్యక్రియలు నిర్వహించిన చోట నివాళులర్పించారు. అదే ప్రాంగణంలో ఉన్న వేదికపైకి వెళ్లి పార్టీ బోర్డును ఆవిష్కరించారు. ఆ తరువాత కలామ్ సోదరుడు మహ్మమద్ ముత్తుమీర ఇంటికి వెళ్లి ఆశీర్వాదం పొందేందుకు ప్రయత్నించారు. అయితే ముత్తుమీరను కలిసే అవకాశం దక్కక పోవడంతో కొందరు బంధువులను మాత్రం కలిశారు. కలామ్ పేరుకు కళంకం ఏర్పడకుండా వ్యవహరించాలని పొన్‌రాజ్‌కు బంధువులు సూచించారని తెలిసింది. పార్టీ ఏర్పాటుపై ముత్తుమీర వ్యాఖ్యానిస్తూ, తన సోదరుడు పార్టీలకు అతీతమైన వ్యక్తి, అతని ఫొటోను పెట్టుకుని రాజకీయం చేయడం బాధాకరమని అన్నారు. కలామ్ మనుమడు షేక్ సలీమ్ మాట్లాడుతూ, తమ తాత పేరుతో పార్టీ నెలకొల్పడం ఆయన వ్యక్తిగత అభీష్టమని, ఇందులో కలామ్ బంధువులకు ఎవ్వరికీ సంబంధం లేదని స్పష్టం చేశారు. కలామ్ ఎప్పుడు రాజకీయల పట్ల ఆసక్తి చూపేవారు కాదని అన్నారు. -
కలాం పార్టీ ఆవిర్భావానికి కసరత్తు
భారత రత్న, మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరుతో రాజకీయ పార్టీ ఆవిర్భవించేనా..? అన్న ప్రశ్న రాష్ట్రంలో బయలు దేరింది. ఇందుకు తగ్గ కసరత్తుల్లో ఆయన సహాయకుడు వి పొన్రాజ్ నిమగ్నమైనట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అభిప్రాయ సేకరణలో పొన్రాజ్ సాక్షి, చెన్నై : కలలు కనండి...వాటిని సాకరం చేసుకోండి అన్న అబ్దుల్ కలాం పిలుపుకు స్పందించిన యువత రాష్ట్రంలో లక్షల్లో ఉన్నారు. భారతరత్నగా, మాజీ రాష్ట్రపతిగా, మిస్సైల్ మ్యాన్‌గా పేరు గడించిన ఈ నిరంతరం ఉపాధ్యాయుడు శాశ్వత నిద్రలోకి వెళ్లినా, ఆయన సందేశాలు, పిలుపు శాశ్వతం. ఆయన అంటే పట్టభద్రులు, యువత, విద్యార్థిలోకానికి అమితాభిమానం. ఇదే అభిమానం ప్రస్తుతం రాజకీయ పయనానికి దారి తీసే అవకాశాలు కన్పిస్తున్నాయి. రాష్ట్రంలో ఏళ్ల తరబడి సాగుతున్న ద్రవిడ పార్టీల పాలనకు చరమ గీతం పాడి మార్పునకు వేదికగా కలాం పేరుతో రాజకీయ పార్టీ ఆవిర్భావానికి కసరత్తులు జరుగుతున్నాయి. ఇందుకు తగ్గ కసరత్తుల్లో అబ్దుల్ కలాం సహాయకుడు పొన్రాజ్ నిమగ్నమైనట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. కలాం పార్టీ : అబ్దుల్ కలాంకు సహాయకుడిగా ఏళ్ల తరబడి పొన్రాజ్ వ్యవహరిస్తూ వచ్చారు. ప్రస్తుతం కలాం మిషన్ ఇండియా ఇయక్కం ఏర్పాటు చేసి కలాం ఆశయ సాధన దిశగా ముందుకు సాగుతున్నారు. అలాగే, మరో సహాయకుడు ఆర్ సేతురామన్ యునెటైడ్ 2020 ఇయక్కంతో ముందుకు సాగుతున్నారు. కలాం కలల సాకారం లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఈ ఇయక్కంలను రాజకీయ పార్టీగా మార్చేందుకు తగ్గ కసరత్తులు సాగుతున్నట్టుగా సంకేతాలు వస్తున్నాయి. ఇందుకు అద్దం పట్టే రీతిలో విరుదునగర్ వేదికగా యువత, విద్యార్ధి, పట్టభద్రులు ఏకమై సమావేశంలో అభిప్రాయల సేకరణలో పడ్డారు. కలాం పేరుతో రాజకీయ పార్టీ ఆవిర్భావానికి తగ్గ కసరత్తుల్లో నిమగ్నం అవుతూ ఈ అభిప్రాయ సేకరణ సాగుతుండటం గమనార్హం. ఈ విషయంగా పొన్‌రాజ్‌ను ఓ మీడియా కదిలించగా, కలాం ఆశయ సాధనకు ఓ వేదికగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని పలువురు సూచిస్తున్నారని వ్యాఖ్యానించారు. యువత, విద్యార్థి లోకం, పట్టభద్రులు మార్పును ఆశిస్తున్నారని, కొత్త నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. అయితే, రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఆ దిశగా అడుగులు మాత్రం వేసి ఉన్నామని చెప్పడం గమనార్హం. -
కలాం నివాసాన్ని విఙ్ఞాన కేంద్రంగా చేయాలన్న ఆప్
ఢిల్లీ: దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఢిల్లీలో నివసించిన ఇంటిని విఙ్ఞాన కేంద్రంగా మార్చాలని ఆప్ డిమాండ్ చేసింది. రాష్ట్రపతి పదవీ కాలం ముగిసిన అనంతరం కలాం 10 రాజాజీ మార్గ్‌లో నివాసమున్నారు. అయితే ప్రస్తుతం ఈ నివాసాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మకు కేటాయించారు. దీనిపై ఆప్ నేత, ఢిల్లీ పర్యాటక శాఖ మంత్రి కపిల్ మిశ్రా మాట్లాడుతూ.. హుటాహుటిన ఆ ఇంటిని ఓ మంత్రికి కేటాయించాల్సిన అవసరం ఏముందనీ.. కలాం నివాసమున్న ఇంటిని ఆయన స్మారకార్ధం విఙ్ఞాన కేంద్రంగా మార్చాలని అన్నారు. తమిళనాడులోని రామేశ్వరానికి మాత్రమే కలాంను పరిమితం చేసేలా ఆయనకు సంబంధించిన వస్తువులు, పుస్తకాలు, ఇతర కలాం ఙ్ఞాపకాలను అక్కడికి తరలించడం సరికాదని మిశ్రా అభిప్రాయపడ్డారు. కలాం నివాసాన్ని ఆయన గౌరవార్థం ఢిల్లీలో పర్యాటక స్థలంగా మార్చాలని ఆప్ భావిస్తున్నట్లు మిశ్రా తెలిపారు. -
రామేశ్వరంలో కలాం స్మారక నిర్మాణం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి కాకముందే ఏపీజే అబ్దుల్ కలాం భారతరత్నంగా గుర్తింపు పొందారని, ఆయన ఎల్లప్పుడూ సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండేవారని, కలాం జీవితం భారతీయులందరికీ స్ఫూర్తిదాయకమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడారు. ప్రజా రాష్ట్రపతిగా నిలిచిన కలాం జ్ఞాపకార్థం ఆయన జన్మించిన రామేశ్వరంలో స్మారకం నిర్మిస్తామని, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 84వ జయంతి సందర్భంగా గురువారం ఢిల్లీలో డీఆర్డీవో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. డీఆర్డీవో భవన్లో కలాం విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. ‘ఏ సెలబ్రేషన్ ఆఫ్ డాక్టర్ కలాం లైఫ్’ పేరిట ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను మోదీ ప్రారంభించారు. కలాం స్మారకార్థం రూపొందించిన పోస్టల్ స్టాంప్‌ను కూడా ప్రధాని ఆవిష్కరించారు. -
కలాం, కిష్టారెడ్డిలకు నివాళి
సాక్షి, హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ఇటీవల మృతి చెందిన నారాయణ్‌ఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డిలకు శాసనసభ, శాసనమండలి నివాళులు అర్పించాయి. అసెంబ్లీ, మండలి వర్షాకాల సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు రెండు సభలు ప్రారంభంకాగానే సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. పలువురు సభ్యులు మాట్లాడిన అనంతరం ఈ తీర్మానాలను ఆమోదించిన అసెంబ్లీ, మండలి 29వ తేదీకి వాయిదాపడ్డాయి. శాసనసభలో ఉదయం సభ ప్రారంభం కాగానే కలాం మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కలాం సేవలను కేసీఆర్ కొనియాడారు. ‘‘నిరుపేద కుటుంబం నుంచి వచ్చి రాష్ట్రపతి పదవిని అధిరోహించిన మేధావి కలాం. నిరంతరం దేశ ప్రయోజనాల కోసం పనిచేశారు. హైదరాబాద్‌తో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. డీఆర్డీఎల్కు కలాం పేరు పెట్టాలని కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కేంద్రానికి సూచించాను. ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేస్తునా..’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశ భద్రతకు కలాం చేసిన సేవలు ఎనలేనివని కాంగ్రెస్ పక్ష నేత జానారెడ్డి అన్నారు. ఆయన జీవితం నుంచి అందరూ స్ఫూర్తి పొందాలన్నారు. కలాం స్ఫూర్తితో తెలంగాణను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. కలాం మరణం యావత్‌జాతికి తీరని లోటని బీజేఎల్పీ నేత లక్ష్మణ్ అన్నారు. మహోన్నత వ్యక్తిత్వంతో అందరినీ కదిలించిన కలాం పేరును డీఆర్డీఎల్కు మాత్రమే పరిమితం చేయకుండా మెట్రోరైలుకు కూడా పెట్టి హైదరాబాద్‌తో ఉన్న అనుబంధాన్ని శాశ్వతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పక్ష నేత పాయం వెంకటేశ్వర్లు సూచించారు. ఏదైనా యూనివర్సిటీకి కలాం పేరు పెట్టాలని సీపీఐ సభ్యుడు రవీంద్రకుమార్ కోరారు. మంత్రి ఈటల, ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ సభ్యులు రసమయి బాలకిషన్, శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్ సభ్యులు మల్లు భట్టివిక్రమార్క, సంపత్‌కుమార్, రాజేందర్‌రెడ్డి (టీడీపీ), కిషన్‌రెడ్డి (బీజేపీ), పాషాఖాద్రి (మజ్లిస్), సున్నం రాజయ్య (సీపీఎం) తదితరులు కలాం సేవలను కొనియాడారు. కలాం మృతిపట్ల శాసనమండలిలో సంతాప తీర్మానాన్ని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రవేశపెట్టారు. విద్యార్థులు, యువతకు, అన్ని రంగాల వారికి కలాం స్ఫూర్తి ప్రదాతగా నిలిచిపోయారని పేర్కొన్నారు. పీఎస్ఎల్వీ రూపకల్పనలో, పృథ్వీ, అగ్ని క్షిపణులు, పోఖ్రాన్ అణుపరీక్షల నిర్వహణలో కలాం కీలకపాత్రను పోషించారని మండలి చైర్మన్ స్వామిగౌడ్ చెప్పారు. హైదరాబాద్ ఎంతో అనుబంధమున్న కలాం పేరును ఏదైనా కొత్తగా స్థాపించే ఐఐటీ, ఐఐఐటీ వంటి సంస్థకు పెట్టాలని విపక్షనేత షబ్బీర్‌అలీ సూచించారు. భారతజాతికి గొప్ప అదృష్టంగా కలామ్ లభించారని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. సయ్యద్ అమీన్ జాఫ్రీ (ఎంఐఎం), రామచంద్రరావు (బీజేపీ), పొంగులేటి సుధాకర్‌రెడ్డి (కాంగ్రెస్) తదితరులు కలాం సేవలను కొనియాడారు. -
ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు
కలాంకు పలువురు నేతల నివాళి న్యూఢిల్లీ: 69వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని శనివారం ప్రజలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. త్రివర్ణ పతాకాలు ఎగరేసి, దేశభక్తి గీతాలు ఆలపించి స్వాతంత్య్ర సమరయోధుల సేవలను గుర్తు చేసుకున్నారు. పలు రాష్ట్రాల రాజధానుల్లో ముఖ్యమంత్రులు జాతీయజెండాలను ఆవిష్కరించి, తమ రాష్ట్రాలను అభివృద్ధి బాట పట్టిస్తామని చెప్పారు. ఉగ్రవాద దాడులను అరికట్టేందుకు భద్రతా సిబ్బంది గట్టి చర్యలు తీసుకోవడంతో వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. మావోయిస్టులు ఇచ్చిన బహిష్కరణ పిలుపును ప్రజలు లెక్కచేయకుండా వేడుకల్లో పాల్గొన్నారు. పాక్ వ్యవస్థాపకుడు జిన్నా ప్రతిపాదించిన ద్విజాతి సిద్ధాంతాన్ని తమ రాష్ట్రం తిరస్కరించిందని జమ్మూ కశ్మీర్ సీఎం ముఫ్తీ మొహమ్మద్ సయీద్ అన్నారు. కేంద్రం బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ రాష్ట్ర సీఎం నితీశ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఇస్రో మహిళా శాస్త్రవేత్తకు కలాం అవార్డు ఇటీవల మరణించిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు కూడా పలువురు నేతలు పంద్రాగస్టు సందర్భంగా నివాళి అర్పించారు. కలాం పేరుతో తమినాడు ఏర్పాటు చేసిన అవార్డును తొలిసారి ఇస్రోకు చెందిన మహిళా శాస్త్రవేత్త ఎన్.వలర్మతికి సీఎం జయలలిత అందజేశారు. అవార్డు కింద స్వర్ణపతకం, రూ.5 లక్షలు ప్రదానం చేశారు.బిహార్‌కు కలాం చేసిన సేవలను ప్రతిబింబించే శకటాన్ని పట్నాలో జరిగిన పరేడ్‌లో ప్రదర్శించారు. దేశ న్యాయవ్యవస్థకు ఉన్న స్వతంత్రతను కాపాడుకోవడానికి జడ్జీలు, న్యాయవాదులు ఏకతాటిపైకి రావాలని భారత ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్. దత్తు ప్రపంచవ్యాప్తంగా మువ్వన్నెల రెపరెపలు వాషింగ్టన్: స్వాతంత్య్ర వేడుకలు అమెరికా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోని భారత ఎంబసీల్లోనూ ఘనంగా జరిపారు. వందలాది భారతీయులు, వారి స్నేహితులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ఎంబసీలో హైకమిషనర్ టీసీఏ రాఘవన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అమెరికాలో 38వేల మందితో పరేడ్ పంద్రాగస్టు సందర్భంగా అమెరికాలోని ఎడిసన్ నగరంలో 38వేల మందితో నిర్వహించిన భారీ పరేడ్ అందరినీ ఆకట్టుకుంది. రెండు కిలోమీటర్ల పొడవున సాగిన పరేడ్‌లో డజన్ల కొద్దీ బృందాలు మార్చ్ఫాస్ట్ నిర్వహించగా, 20 శకటాలను ప్రదర్శించారని ఇండియా వెస్ట్ పత్రిక ఓ కథనంలో తెలిపింది. ఎడిసన్‌లో ప్రారంభమైన ఈ పరేడ్ ఉడ్‌బ్రిడ్జ్ పట్టణం సమీపంలోని ఇండియా స్క్వేర్ వద్ద ముగిసింది. న్యూజెర్సీలోని 100కుపైగా సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఎడిసన్, ఉడ్‌బ్రిడ్జ్ మేయర్లతోపాటు పలువురు భారత ప్రముఖులు ఇందులో పాలుపంచుకున్నారు. -
ఇక సెలవంటూ...
రామేశ్వరం : మహామనిషి మహాభినిష్క్రమణం. బంధువులు, అభిమానులు, అనుచరులు కడసారి వీడ్కోలు పలకగా ఈ లోకం నుంచి శాశ్వతంగా సెలవు తీసుకున్నారు. బంధువులు, అభిమానులు, అనుచరులు తరలి రాగా మిస్సైల్ మ్యాన్‌కు భారతావని వీడ్కోలు పలికింది. ముద్దుబిడ్డను మాతృభూమి శోకతప్త హృదయంతో సాగనంపింది. సొంతగడ్డపైనే తన అంతిమ సంస్కరాలు పూర్తి కావాలన్న కలాం ఆకాంక్ష మేరకు ఆయన సొంత గడ్డపైనే అంత్యక్రియలు జరిగాయి. కలాం అంత్యక్రియలకు వీవీఐపీలతో పాటు రాజకీయ, శాస్త్ర-సాంకేతిక రంగ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, తమిళనాడు గవర్నర్ రోశయ్య, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హాజరయ్యారు. కేరళ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పన్నీరు సెల్వం హాజరు కాగా ఆయనతో పాటు పలువురు మంత్రులు, పలువురు కేంద్రమంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు కలాం అంత్యక్రియలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మిస్సైల్ మ్యాన్‌కు తుది నివాళులు అర్పించారు. కలాం భౌతికాకాయం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు. ఆ తర్వాత త్రివిధ దళాలు గౌరవ వందనం సమర్పించాయి. ఆ తర్వాత ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆ ప్రక్రియ ముగిసిన తర్వాత కలాం పార్థివ దేహాన్ని ఖననం చేశారు. మరోవైపు రామేశ్వరం జనసంద్రమైంది. కలాంను చివరిసారిగా చూసేందుకు తరలివచ్చిన అభిమాన గణంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. అంతకు ముందు జరిగిన కలాం అంతిమయాత్రలో వేలాదిమంది పాల్గొన్నారు. రోడ్డుపై బారులు తీరిన జనం ...కలాం సలామ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. -
సైనిక లాంఛనాలతో కలాం అంత్యక్రియలు
మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో గురువారం పూర్తయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా కలాం భౌతికకాయానికి తుది నివాళులు అర్పించారు. త్రివిధ దళాలు కూడా కలాంకు వీడ్కోలు పలికాయి. అంతకు ముందు కలాం నివాసం నుంచి ఆయన అంతిమయాత్ర అశ్రు నయనాల మధ్య కొనసాగింది. దారి పొడవునా వేలాదిమంది అభిమానులు, ప్రజలు కలాంకు నివాళులు అర్పించారు. మరోవైపు సామాన్య ప్రజలు కూడా అంత్యక్రియలు నిర్వహించే ప్రాంతానికి తండోపతండాలుగా చేరుకున్నారు. కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, పారికర్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్, కేరళ ముఖ్యమంత్రి,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తమిళనాడు గవర్నర్ రోశయ్య, విజయ్ కాంత్, సీఎం రమేష్ తదితరులు అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ప్రారంభమైన కలాం అంతిమ యాత్ర
రామేశ్వరం : మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంతిమ యాత్ర ప్రారంభమైంది. గురువారం ఉదయం సైనిక లాంఛనాలతో యాత్ర మొదలైంది. కలాం అంత్యక్రియలు తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో పేక్కరుంబు గ్రామంలో ఆయన బంధువులు ఎంపిక చేసిన స్థలంలో నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ఇస్లాం సంప్రదాయంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. మరోవైపు కలాం అంత్యక్రియల్లో పాల్గొనేవారి కోసం మధురై నుంచి రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ఇక కలాం అంత్యక్రియలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. అలాగే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. -
సోనియాపై కలాం అభ్యంతరం వదంతే
మన్మోహన్ సింగ్ వెల్లడి న్యూఢిల్లీ: 2004 లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రధానిగా కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ ప్రమాణ స్వీకారం చేయడానికి కలాం విముఖత తెలిపారని వస్తున్న వార్తలు వట్టి వదంతులేనని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. ఎవరు ప్రధాని అవుతారనని ఆయన అడగలేదని ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రధాని కావడం మెజారీటీ ఉన్న పార్టీ హక్కని అన్నారు. సోనియా పాస్‌పోర్టు, ఇతర వివరాలను కలాం అడిగారన్న వార్తలు శుద్ధ అబద్ధాలన్నారు. ఆనాడు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కాంగ్రెస్‌లో, యూపీఏలో జరిగిన పరిణామాల గురించి కలాంకు తెలుసన్నారు. 2005లో అమెరికాతో భారత్ కుదుర్చుకున్న అణు ఒప్పందానికి కలాం మద్దతిచ్చారని అన్నారు. ఒప్పందం జాతిప్రయోజనాలకు ముఖ్యమని కలాం ఎస్పీ నేత ములాయంకు చెప్పారన్నారు. -
నేడు కలామ్ అనంత యానం!
పృథ్వీయాప తేజోవాయురాకాశములారా..! ఇతడు మీ పుత్రుడు. తన శస్త్రాలకు మీ పేర్లే పెట్టుకున్న మీ ప్రియ భక్తుడు. తన పాంచ భౌతిక దేహమును మీకు సమర్పిస్తున్నాడు. గైకొని ధన్యులు కండు. అభ్ర మాలికలారా! అడ్డు తొలగండి... ఇతని ప్రయాణ పథము శుభ్రజ్యోత్స్న వలె కాంతులీనవలె. ఓ చందమామా! ఇతడు నీ మేనల్లుడు. నీకంటే చల్లనివాడు. అనంతయానానికి పయనమైనాడు. పున్నమి ఘడియలు ప్రవేశించకున్నా సరే, పూర్ణేందు రూపం దాల్చి దారి చూపు. దివిజాంగనలారా! దోసిట సౌగంధికా పుష్పాలతో నిలిచి ఉండండి. పూలవాన కురిపించదగిన పుణ్య చరితుడితడు. మీ చెంతకు వస్తున్నాడు. రామేశ్వరానికి చేరిన కలాం పార్థివ దేహం * ప్రత్యేక విమానంలో మదురైకి, అక్కడి నుంచి హెలికాప్టర్లో తరలింపు * ఢిల్లీ నుంచి వెంట వచ్చిన వెంకయ్య, పారికర్ * నేడు పూర్తి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు * పేక్కరుంబు గ్రామంలో ఉదయం 11 గంటలకు నిర్వహణ రామేశ్వరం/న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, ‘మిస్సైల్ మ్యాన్’ అబ్దుల్ కలాం సొంతగడ్డ శోక జనసంద్రమైంది.. తమ ముద్దుబిడ్డను చివరిసారిగా చూసుకునేందుకు వేల సంఖ్యలో ప్రజానీకం కన్నీటితో పోటెత్తింది. కలాం పార్థివదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం బుధవారం ఆయన స్వస్థలమైన రామేశ్వరానికి తీసుకువచ్చారు. తొలుత ఢిల్లీ నుంచి తమిళనాడులోని మదురైకి ప్రత్యేక వాయుసేన విమానంలో తీసుకువచ్చారు. అక్కడ రాష్ట్ర గవర్నర్ కె.రోశయ్య.. కలాం భౌతిక కాయం వద్ద పుష్పగుచ్ఛముంచి నివాళి అర్పించారు. తర్వాత కలాం భౌతిక కాయాన్ని హెలికాప్టర్ ద్వారా రామేశ్వరానికి పది కిలోమీటర్ల దూరంలోని మండపం ప్రాంతానికి చేర్చారు. కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, మనోహర్ పారికర్ తదితరులు ఢిల్లీ నుంచి కలాం పార్థివ దేహం వెంట వచ్చారు. మరో కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ వారితో కలిశారు. అప్పటికే మండపం ప్రాంతానికి తమిళనాడు సీఎం జయ సూచన మేరకు పలువురు మంత్రులు, డీఎంకే నేత ఎంకే స్టాలిన్, నటుడు విజయ్‌కాంత్, కలాం కుటుంబ సభ్యులతో పాటు వేలాది మంది అభిమానులు, ప్రజలు అక్కడికి చేరుకున్నారు. హెలికాప్టర్ దిగగానే పెద్దసంఖ్యలో అభిమానులు అటువైపు తోసుకురాగా.. భద్రతా సిబ్బంది వారిని నిలువరించారు. అనంతరం కలాం పార్థివ దేహాన్ని ఒక సైనిక వాహనంపై ఉంచి రోడ్డు మార్గంలో రామేశ్వరానికి తరలించారు. ఈ సందర్భంగా పది కిలోమీటర్ల మార్గం పొడవునా ప్రజలు పెద్ద సంఖ్యలో ఇరువైపులా నిలబడి నివాళి అర్పించి, కలాం రామేశ్వరానికి అందించిన సేవలను కొనియాడారు. కలాం పార్థివ దేహాన్ని రాత్రి 8 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచి.. అనంతరం ఇక్కడి పళ్లివాసల్ వీధిలోని ఆయన పూర్వీకుల ఇంటికి తరలించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంత్యక్రియలకు ప్రముఖులు.. గురువారం రామేశ్వరంలో జరుగనున్న కలాం అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నట్లు కేంద్ర మంత్రి వెంకయ్య చెప్పారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరవుతారని పేర్కొన్నారు. ఇక తన ఆరోగ్య పరిస్థితి బాగోలేనందున కలాం అంత్యక్రియలకు హాజరుకాలేకపోతున్నానని సీఎం జయలలిత బుధవారం ప్రకటించారు. కలాం అంటే తనకు ఎంతో గౌరవమని, తన తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడుగురు మంత్రులను పంపుతున్నట్లు చెప్పారు. కలాం అంత్యక్రియలకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేరళ సీఎం ఊమెన్‌చాందీ తదితర సీఎంలు హాజరు కానున్నారు. దేశం ఒక రత్నాన్ని కోల్పోయింది: మోదీ దేశం ఒక అమూల్యమైన రత్నాన్ని కోల్పోయిందని ప్రధాని మోదీ బుధవారం తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. ‘ప్రజలు ఎంతగానో ప్రేమించే, ఆరాధించే వ్యక్తి ఆయన. ప్రపంచం నుంచి ఆయన కొంతే తీసుకున్నారు. తాను మాత్రం అంతా ఇచ్చారు. పరిస్థితులకు ఆయన ఎప్పుడూ లొంగిపోలేదు. భారత రక్షణ రంగానికి ఆయనే హీరో. అణు, అంతరిక్ష రంగాల్లో విజయాలతో మన దేశం గర్వపడేలా చేశారు..’ అని తెలిపారు. కాగా కలాం విజ్ఞానం దేశానికి ఎంతో మేలు చేసిందని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ప్రపంచ నేతల నివాళి వాషింగ్టన్: కలాం మృతికి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా పలు దేశాల అధినేతలు ఘనంగా నివాళి అర్పించారు. కలాం లక్షలాది భారతీయులకు స్ఫూర్తినిచ్చారని, ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారని కొనియాడారు. కలాం కిందిస్థాయి నుంచి దేశ నాయకుడిగా ఎదిగారని, అమెరికన్ల తరఫున ఆయనకు నివాళి అర్పిస్తున్నానని ఒబామా చెప్పారు. ఆయన భారత్, అమెరికాల మధ్య అంతరిక్ష రంగంలో సహకారాన్ని పెంచారని కొనియాడారు. కలాం భారత్, రష్యాల అనుబంధానికి కృషి చేశారని పుతిన్.. రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. కలాం మృతికి శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే, సింగపూర్ అధ్యక్ష ప్రధానులు టోనీ టాన్ కెంగ్ యామ్, లీ సీన్ లూంగ్‌లు కూడా నివాళి అర్పించారు. వివిధ దేశాధినేతలు కలాం సేవలను కొనియాడారు. అధికార లాంఛనాలతో.. చెన్నై, సాక్షి ప్రతినిధి: కలాం అంత్యక్రియలు తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో పేక్కరుంబు గ్రామంలో ఆయన బంధువులు ఎంపిక చేసిన స్థలంలో నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ఇస్లాంసంప్రదాయంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. కలాం స్మారక మండపం: కలాం జ్ఞాపకాలు చిరస్థాయిగా నిలిచిపోయేలా రామేశ్వరంలో భారీ స్మారక మం డపం నిర్మించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. పేక్కరుంబు గ్రామంలో కలాం పార్థివదేహాన్ని ఖననం చేస్తున్న స్థలానికి సమీపంలో ఉన్న 1.32 ఎకరాల ప్రభుత్వ భూమిలో మండపం నిర్మిస్తారు. -
గొప్ప మేష్టారు
జీవన కాలమ్ కలామ్ వేదిక మీద నిలబడితే ఉపాధ్యాయులయిపోతారు. తన ముందున్న వాళ్లని తన వాళ్లుగా చేసుకునే ఆత్మీయత ఉపాధ్యాయుడిది. నాకనిపించేది - పెద్ద పెద్ద అంతర్జాతీయ వేదికల్లోనూ ఆయన ఉపాధ్యాయుడే అయిపోతారు. గొల్లపూడి శ్రీనివాస్ ఫౌండే షన్ సభలకి ముగ్గుర్ని ఆహ్వా నించాలని తాపత్రయ పడేవా ళ్లం - పి.వి. నరసింహారావు, శివాజీ గణేశన్, అబ్దుల్ కలా మ్. అనారోగ్యం కారణంగా నరసింహారావు గారు రాలేక పోయారు. శివాజీ గణేశన్ అవ కాశం ఇవ్వకుండానే వెళ్లిపో యారు. ఒక యువకుని కలల్ని మృత్యువు అర్ధంతరంగా తుంచేయడం ఆయన్ని స్పందింపజేస్తుందని భావిస్తూ మాజీ రాష్ట్రపతిని సంప్రదించాం. వారిని కలవ డానికి నేను వెళ్లలేకపోయాను. పిల్లలు వెళ్లారు. మా కృషిని అభినందిస్తూనే ముందుగా ఒప్పుకున్న కార్యక్రమాల కారణంగా రాలేకపోయారు. అది మా దురదృష్టం. జీవితంలో అవసరాల్ని అతి విచిత్రంగా కుదించు కున్న ఆయన గురించి ఎన్నో కథలున్నాయి. అన్నా విశ్వ విద్యాలయంలో ఆయన ఒక చిన్న గదిలో ఉండేవారట - ఒక పూర్తి ఇంటిని తీసుకోగలిగినా, ఆయనకి వంట చేసే తమిళుడు - ఆయన భోజనం గురించి చెప్పేవాడు. వెర్త కుళంబు, చారు, వడియాలు - ఇంతే ఆహారం. ఆయనకి ఒక సహాయకుడు ఉండేవాడు. ఏనాడూ తన బనీను, అండర్ వేర్ అతనికి ఉతకడానికి ఇచ్చేవారు కారట. రాష్ట్రపతి భవనంలోకి ఒక బ్రీఫ్‌కేసుతో వచ్చి ఆ బ్రీఫ్ కేసుతోనే తిరిగి వెళ్లారని చెప్తారు. తుంబా అంతరిక్ష పరిశోధన కేంద్రంలో ఒక సైం టిస్టు పని చేసేవాడు. పొద్దుట ఆఫీసుకి వెళ్తే ఏ రాత్రికో ఇంటికి వచ్చేవాడు. ఒక రోజు భార్య తడబడుతూ చెప్పింది. పిల్లలు ఊళ్లో ఎగ్జిబిషన్‌కి వెళ్లాలనుకుంటున్నా రని. సైంటిస్టు బాధపడిపోయాడు. ఆ రోజు త్వరగా ఇం టికి వస్తాననీ, పిల్లల్ని సిద్ధం చేసి ఉంచమని చెప్పాడు. ఆఫీసుకి వెళ్లి బాస్‌తో ఆ విషయం చెప్పాడు. నిరభ్యం తరంగా వెళ్లమని అన్నాడాయన. తీరా పనిలో పడ్డాక రాత్రి 8 గంటలకి ఆ విషయం గుర్తుకొచ్చింది. తుళ్లి పడ్డాడు. భార్యకిచ్చిన మాట తప్పాడు. సిగ్గుపడుతూ ఇంటికి వచ్చాడు. పిల్లలు కనిపించలేదు. ‘పిల్లలేరీ?’ అని అడిగాడు భార్యని. మీ బాస్ వచ్చి ఎగ్జిబిషన్‌కి తీసుకెళ్లా రని చెప్పింది. ఆ బాస్ పేరు అబ్దుల్ కలామ్. తన ఉద్యోగంలో ఆయన రెండేసార్లు సెలవు పెట్టా రట. ఆయన తండ్రి పోయినప్పుడు. తల్లి పోయిన ప్పు డు. పొద్దున్నే భగవద్గీత చదువుకుంటారు. 18 గంటలు ఉద్యోగం. రుద్రవీణ వాయిస్తారు. ఆయన రామ భక్తుడి నని ఆయనే చెప్పుకున్నారు. ఆయన్ని ఒక ఇంటర్వ్యూలో ప్రశ్న అడిగారు: ‘‘మీ దృష్టిలో నాయకత్వ లక్షణాలు ఏమిటి?’’ అని. ఆయన చెప్తూ ‘‘నేనింతవరకూ సూర్యుని చుట్టూ 76 సార్లు తిరి గాను (అంటే వయస్సు 76 సంవత్సరాలు) నేను మరిచి పోలేని విషయం ఒకటుంది. శ్రీహరికోట నుంచి మొద టి ఉపగ్రహాన్ని ప్రయోగించినప్పుడు ఒక సాంకేతిక లోపం వచ్చింది. అయినా ప్రయోగించవచ్చని నేను నిర్ణ యం తీసుకున్నాను. ఆ ప్రయోగం విఫలమయింది. అం దరూ విమర్శించారు. వెంటనే పత్రికా సమావేశం జర గాలి. మా డెరైక్టర్ సతీష్ ధావన్ ‘‘నేను పత్రికా సమా వేశంలో మాట్లాడుతాను’’ అన్నారు. విమర్శల్ని సూటిగా ఎదుర్కొన్నారు. రెండో ప్రయోగం విజయవంతమ యింది. నన్ను పిలిచి ‘‘పత్రికా సమావేశంలో నువ్వు మాట్లాడు’’ అన్నారు. ఇది గొప్ప పాఠం. మంచి నాయ కుడు వైఫల్యానికి బాధ్యతని ధైర్యంగా తీసుకుంటాడు. విజయాన్ని తన అనుయాయులతో పంచుకుంటాడు’’. ‘‘మీలో పూడ్చుకోలేని పెద్ద లోపమేమిటి?’’ అని ఓ తెలివైన పాత్రికేయుడు అడిగాడట. కలామ్ నవ్వి ‘‘నాకు చేతకాని ఒకే ఒక్క విషయం - రాజకీయం’’ అన్నారట. కలామ్ వేదిక మీద నిలబడితే ఉపాధ్యాయులయి పోతారు. ఆయన ఉపన్యాసం పాఠం చెప్తున్నట్టు ఉం టుంది. తన ముందున్న వాళ్లని తన వాళ్లుగా చేసుకునే ఆత్మీయత ఉపాధ్యాయుడిది. నాకనిపించేది - పెద్ద పెద్ద అంతర్జాతీయ వేదికల్లోనూ ఆయన ఉపాధ్యాయుడే అయిపోతారు. విచిత్రంగా ప్రేక్షకులు మొదట ఆశ్చర్య పడి, ఆయన మాటలకు ఆనందపడి - తమకు తెలియ కుండానే విద్యార్థులయిపోతారు. చిన్న పిల్లల్లాగ చప్ప ట్లు కొడతారు. నాకు చాలా ఇష్టమయిన, ఆయన చెప్పిన గొప్ప సూక్తులలో ఒకటి: ‘‘వైఫల్యం నువ్వు కిందపడినప్పుడు కాదు. వైఫల్యం నువ్వు కిందపడి లేవడానికి ప్రయత్నం చెయ్యనప్పుడు’’. ఒక మత్స్యకారుల కుటుంబంలో పుట్టి, అంతులేని పేదరికాన్ని అనుభవించి (ఆయన తల్లి వీలయినంత కిరసనాయిలు ఆదా చేసేవారట - కలామ్ రాత్రివేళల్లో చదువుకోడానికి కలసి వస్తుందని!) కేవలం స్వశక్తితో పద్మశ్రీ అయి, పద్మభూషణ్ అయి, పద్మవిభూ షణ్ అయి, భారతరత్న అయి, ఈ దేశానికి రాష్ర్టపతి అయి, దేశ, విదేశాలలో 40 విశ్వవిద్యాలయాలలో గౌర వ డాక్టరేట్లను అందుకున్న అతి సామాన్య జీవితాన్ని గడిపిన మేష్టారు తప్ప ఈ మాటని ఎవరూ చెప్పలేరు. ఒక వ్యక్తి గొప్పతనం అతని అవసానం చెప్తుందం టారు. అంతిమ క్షణాలలో తనకి అత్యంత ఆత్మీయులైన యువతతో ప్రసంగిస్తూనే వేదిక మీదే తనువు చాలిం చడం అతను సిద్ధ పురుషుడని చెప్పడానికి గొప్ప నిదర్శనం. గొల్లపూడి మారుతీరావు -
కలాంకు ఘనంగా నివాళులు
-
రామేశ్వరానికి కలాం భౌతికకాయం తరలింపు
న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పార్థీవ దేహాన్ని తీసుకుని ప్రత్యేక విమానం బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి మధురైకి బయల్దేరింది. కలాం భౌతికకాయంతో సైనిక వాహనం ఈరోజు ఉదయం 7 గంటలకు.. ఆయన నివాసం 10 రాజాజీ మార్గ్ నుంచి పాలం చేరుకుంది. ఈ ప్రత్యేక విమానంలో కలాం పార్థివదేహాంతో పాటు కేంద్రమంత్రులు మనోహర్‌పారికర్, వెంకయ్యనాయుడు బయల్దేరి వెళ్లారు. అక్కడి నుంచి వైమానికదళ హెలికాప్టర్లో కలాం పార్థివదేహాన్ని రామేశ్వరం తీసుకెళతారు. అక్కడ బుధవారం సాయంత్రం 7 గంటల వరకూ ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఉంచుతారు. గురువారం ఉదయం 11 గంటలకు రామేశ్వరంలోని ఆయన స్వస్థలంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. కలాం అంత్యక్రియలకు ప్రధానమంత్రి మోదీతో పాటు పలువురు ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరు కానున్నారు. -
సెక్యూరిటీ గార్డుకు కలాం కృతజ్ఞతలు
షిల్లాంగ్: కలాం షిల్లాంగ్‌లో గుండెపోటుతో కుప్పకూలిపోవడానికి కొన్ని నిమిషాల ముందు తనకు భద్రత కల్పించేందుకు రిస్క్ తీసుకున్న సెక్యూరిటీ గార్డుకు కృతజ్ఞతలు తెలిపారు. కలాం సహాయకుడు సృజన్ ఈ సంగతి తెలిపారు. సోమవారం గువాహటి నుంచి షిల్లాంగ్‌కు బయల్దేరిన కలాంకు స్పెషల్ ఆపరేషన్ టీవ్ దారి వెంబడి భద్రత కల్పించింది. కలాం పక్కన పాల్ కూడా ఉన్నారు. వారి వాహనం ముందు వెళ్తున్న ఓపెన్ జిప్సీ వాహనంలో ముగ్గురు భద్రతా సిబ్బంది ఉన్నారు. వారిలో ఎస్ఏ లపాంగ్ అనే గార్డు తుపాకీ పట్టుకుని జిప్సీలో నిల్చున్నాడు. అతన్ని కూర్చోమనాలని కలాం తన పక్కనున్న వారికి చాలాసార్లు చెప్పారు. కలాం వాహనం నుంచి రేడియో మెసేజ్ కూడా పంపారు. ఫలితం లేకపోయింది. షిల్లాంగ్ చేరుకున్న తర్వాత కలాం.. లపాంగ్‌ను పిలిపించుకున్నారు. ఎందుకు పిలుస్తున్నారో అని లపాంగ్ భయపడ్డాడు. తర్వాత కలాం అతన్ని ‘నీ విధి బాగా నిర్వహించావ’ని కరచాలనంతో అభినందించి, కృతజ్ఞత తెలపడంతో నోరెళ్లబెట్టాడు. ‘నా వల్ల అన్నిగంటల పాటు నువ్వు ఇబ్బంది పడినందుకు సారీ. అలసి పోయావా? ఏమైనా తింటావా?’ అని మాజీ రాష్ట్రపతి అతనితో అన్నాడు. ‘సర్, మీ కోసం నేను ఆరుగంటలపాటు నిలబడేందుకు కూడా సిద్ధం’ అని లపాంగ్ ఆయనతో చెప్పాడు. -
నా హీరో నన్ను వీడిపోయారు...
‘‘ఏంటోయ్ నువ్వు బాగానే ఉన్నావా?’ ఆయన నాతో అన్న చివరి మాటలు.. అంతలోనే ఆయన నన్ను విడిచి వెళ్లిపోతారని అనుకోలేదు. నా జీవితంలో ఇంతకంటే దుర్దినం మరొకటి రాదేమో.. నా గురువు, మార్గదర్శకుడు, మిత్రుడు, తండ్రిలాంటి వాడు ఒక్క మాటలో చెప్పాలంటే నా హీరో నన్ను వీడిపోయారు..’ కలాం సలహాదారు.. చివరి క్షణాల్లో ఆయన వెంటే ఉన్న సృజన్‌పాల్ సింగ్ ఆవేదన ఇది. కలాంతో తన చివరి ప్రయాణ జ్ఞాపకాలను సృజన్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఆ జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే.... ‘‘అప్పుడే 8 గంటలైపోయింది ఆయనతో చివరగా మాట్లాడి.. నిద్ర రావటం లేదు.. జ్ఞాపకాలు ముప్పిరిగొంటున్నాయి. కన్నీళ్లు ఆగడం లేదు. గువాహటి విమానంలో మాకు కేటాయించిన సీట్లలో కూర్చోవటంతో జూలై 27 మధ్యాహ్నం 12 గంటలకు మా ప్రయాణం ప్రారంభమైంది. కలాం 1ఏ సీట్లో కూర్చున్నారు. నేను 1సీ నంబర్ సీట్లో కూర్చున్నాను. సర్ ముదురు రంగు ‘కలాం సూట్’ను ధరించారు. సూట్ కలర్ చాలా బాగుందని ప్రశంసించాను. కానీ అదే ఆయన ధరించే చివరి సూట్ అవుతుందనుకోలేదు. చల్లని వాతావరణంలో రెండున్నర గంటల ప్రయాణం. నాకు ఏదైనా సమస్యలంటే పడదు. వాటిని ఎదుర్కోవటంలో ఆయన మాస్టర్. విమానంలో నేను చలితో వణికిపోతే.. ఆయన విమానం కిటికీ తీసి ఇప్పుడు నీకెలాంటి భయం ఉండదు అనేవారు. గువాహటిలో ల్యాండ్ అయ్యాక షిల్లాంగ్ ఐఐఎంకు కారులో వెళ్లటానికి మరో రెండున్నర గంటల ప్రయాణం. ఈ దీర్ఘమైన ప్రయాణాలలోఅయిదు గంటలు ఆయనతో మాట్లాడాను.. చర్చించాను. ఆయనతో ప్రతి ప్రయాణం.. ప్రతి చర్చా ఒక ప్రత్యేకమైందే. ఈ ప్రయాణంలో జరిగిన చర్చ మరీ ప్రత్యేకమైంది. పంజాబ్‌లో ఉగ్రవాదుల దాడిపై కలాం ఆందోళన వ్యక్తం చేశారు. షిల్లాంగ్ ఐఐఎంలో మాట్లాడాల్సిన ‘జీవించటానికి అనుకూల గ్రహంగా భూమి’ అన్న విషయంపై చర్చించాం. హింస, కాలుష్యం, నిర్లక్ష్యం మరో 30 ఏళ్లు ఇలాగే కొనసాగితే.. మనం భూమిని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆయన అన్నారు. ‘‘పార్లమెంట్ సమావేశాలు తరచూ ప్రతిష్టంభనకు గురవుతున్నాయి.. ఇది సరికాదు. అభివృద్ధి రాజకీయాల కోసం పార్లమెంటు సజావుగా సాగేలా క్రియాశీలక మార్గాలు కనుక్కోవాలి. షిల్లాంగ్ ఐఐఎం విద్యార్థులకు ఈ అసైన్మెంట్ ఇస్తా’’నని కలాం అన్నారు. ఉపన్యాస మందిరానికి చేరుకున్న తరువాత విద్యార్థులను వేచి చూడనివ్వవద్దు అనటంతోనే నేను వెంటనే ఆయనకు మైక్ సెట్ చేశాను. మైక్ పిన్ చేయటంతోనే ‘‘ఏంటోయ్ నువ్వు బాగానే ఉన్నావా?(ఫన్నీ గయ్! ఆర్ యూ డూయింగ్ వెల్?) అన్నారు. ఈ మాట కలాం అన్నారంటే ఆయన స్వరం తీరును బట్టి చాలా ఆర్థాలు ఉంటాయి. నువ్వు బాగా చేశావని కావచ్చు.. ఏదో మిస్సయ్యావనీ కావచ్చు.. ఈ మాట అనగానే నేను నవ్వుతూ ‘యస్’ అన్నాను.. ఆయన ప్రసంగం రెండు నిమిషాలు సాగింది. నేను ఆయన వెనుకే కూర్చున్నా.. ఒక వాక్యం తరువాత ఆయన నుంచి ఒక సుదీర్ఘమైన నిట్టూర్పును విన్నాను. నేను ఆయన్ను చూస్తూనే ఉన్నా.. ఆయన ఒక్కసారిగా పడిపోయారు. వెంటనే ఆయన్ను పట్టుకుని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించాం. ఒక చేతిలో ఆయన తల పట్టుకున్నాను. ఆయన చేతులు నా చేతి వేళ్లను గట్టిగా పట్టుకుని ఉన్నాయి. ఆయన ఒక్కమాట మాట్లాడలేదు. నొప్పి ఉన్నట్లు కనిపించలేదు. మూడు వంతులు మూసుకుని.. నన్నే చూసిన ఆ కళ్లను నేనెప్పటికీ మరచిపోలేను. అయిదు నిమిషాలలో ఆసుపత్రికి తరలించాం.. మరి కొన్ని నిమిషాల్లో భారత క్షిపణి పితామహుడు వెళ్లిపోయినట్లు తెలిపారు. నేను ఆయన పాదాలకు చివరి నమస్కారం చేశాను. కలాం ఒకసారి నన్నోమాట అడిగారు. నిన్ను ప్రజలు ఎలా గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటావు..అని.. అదే ప్రశ్నను నేనాయన్ను అడిగాను.. ‘రాష్ట్రపతిగానా, శాస్త్రవేత్తగానా, రచయితగానా, క్షిపణి పితామహుడిగానా, ఇండియా 2020గానా, టార్గెట్ 3బిలియన్గానా..? అని ఆయన ఒకే మాట చెప్పారు. ‘టీచర్‌గా’ అని. ఆయన అనుకున్నట్లుగానే ఆయన తుది ప్రయాణం టీచర్‌గానే విద్యార్థులకు బోధన చేస్తుండగానే సాగిపోయింది. మనిషి వెళ్లిపోయాడు. కానీ ఆయన మిషన్ కొనసాగుతుంది. లాంగ్‌లివ్ కలాం. మీకు రుణపడిన విద్యార్థి సృజన్పాల్సింగ్ -
సమానంగా చూసేవారు
జ్ఞాపకాలను నెమరువేసుకున్న రాష్ట్రపతిభవన్ సిబ్బంది న్యూఢిల్లీ: సువిశాలమైన, 340 గదులున్న రాష్ట్రపతి భవన్లో కలాం ఐదేళ్లు ఉన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో అక్కడి సిబ్బందిపై చెరగని ముద్ర వేశారు. తాను దేశ ప్రథమ పౌరుడు... అయినా అటెండర్ నుంచి మొదలుకొని అందరినీ సమానంగా చూడటం కలాం గొప్పతనం. నిజానికి రాష్ట్రపతి భవన్లో ప్రొటోకాల్ చాలా పకడ్బందీగా అమలవుతుంది. ఎవరూ రాష్ట్రపతికి ఎదురుపడకూడదు. ఆయన పిలిస్తే తప్పితే... ఆయనున్న వైపు వెళ్లకూడదు. ఏది ఉన్నా సెక్రటరీలు చెబుతారు. మిగతా సిబ్బంది వాళ్లు చెప్పింది చేయాలంతే. అయితే కలాం ఇవేవీ పట్టించుకునేవారు కాదు. భద్రతా వలయాన్ని దాటుకొని సిబ్బంది క్వార్టర్ల వైపు వెళ్లేవారు.పిల్లలతో ముచ్చటించేవారు. ఆయన హయాంలో రాష్ట్రపతి భవన్లో పిల్లల సందడే ఎక్కువ. ఎంతటి వీవీఐపీలు ఉన్నా సరే... కలాం చిన్నారుల కోసం సమయం కేటాయించేవారు. ఫలానాది వండమని చెప్పలేదు.. ‘కలాం దక్షిణాది ఆహారాన్ని ఇష్టపడేవారు. అయితే ఫలానా వంటకం చేయమని ఐదేళ్లలో ఆయన ఏ రోజూ కోరలేదు. ఆయన భోజనంలో రెండు వంటకాలే ఉండేవి. ఎప్పుడైనా మూడో డిష్ సిద్ధం చేస్తే... ఏంటీ విశేషం... ఈ రోజు ఏదైనా పండగా?‘ అని అడిగేవారని రాష్ట్రపతి భవన్లో 31 ఏళ్లుగా వంటమనిషిగా పనిచేస్తున్న అహ్మద్ చెప్పారు. ‘వంటకాల్లో ఉప్పు ఎక్కువైనా ఏనాడు పల్లెత్తు మాట అనలేదు. పర్యటనలకు వెళ్లినపుడు ఎంత బిజీగా ఉన్నా... సిబ్బంది అంతా భోజనం చేశారా అని కనుక్కొనేవారు’ అని చెప్పారు. -
ఉరిశిక్షకు వ్యతిరేకం
న్యూఢిల్లీ: రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలంటూ కలాం ముందుకు 21 క్షమాభిక్ష పిటిషన్లు రాగా ఆయన ఒకదానిపైనే నిర్ణయం వెలువరించారు. దీనిపై విమర్శలొచ్చినా లెక్కచేయలేదు. ఆయన ఉరిశిక్షకు వ్యతిరేకం. ఉరిపై లా కమిషన్ తన అభిప్రాయం కోరగా ఆయన మరణదండనను ఎత్తేయాలన్నారు. రాష్ట్రపతిగా క్షమాభిక్ష పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడం క్షోభకు గురిచేసిందన్నారు. పెండింగ్‌లోని న్ని కేసులూ సామాజిక, ఆర్థిక పక్షపాతంతో కూడుకున్నవే తప్పితే, దోషులకు ప్రతీకారేచ్ఛ ఉన్నట్లు కనపడలేదన్నారు. ఉద్దేశపూర్వకంగా నేరం చేయని వారిని ఎక్కిస్తున్నామనే భావన కలిగిందన్నారు. 1990లో ఓ యువతిని బెంగాల్లో అపార్ట్మెంట్లోని లిఫ్ట్‌బాయ్ ధనుంజయ్ ఛటర్జీ రేప్ చేసి హత్య చేశాడు. ఈ కేసులో మాత్రం ఆయన ఛటర్జీ క్షమాభిక్ష పిటిషన్‌ను తోసిపుచ్చారు. -
ప్రవాస భారతీయుల సంతాపం
వివిధ రాష్ట్రాల్లో స్మృతి చిహ్నాల ఏర్పాట్లకు కృషి వాషింగ్టన్: కలాం మృతి పట్ల ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లోని ప్రవాస భారతీయులు, భారతీయ సంఘాలు తీవ్ర సంతాపం వ్యక్తంచేశాయి. కలాం నిరాడంబరత, నిగర్వశీలత, స్ఫూర్తినిచ్చే ఆయన వ్యక్తిత్వం ఆయనను అందరికీ ప్రీతిపాత్రుడిని చేశాయని కొనియాడాయి. భారత ముద్దుబిడ్డ అయిన కలాం నిజంగా ప్రజల రాష్ట్రపతి అని కీర్తించాయి. ‘మిసైల్ మ్యాన్’ కలాం ప్రపంచ ప్రజలకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటారని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల నివాళులర్పించారు. నార్త్ అమెరికా తెలుగు సొసైటీ, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా), ఇండియన్ నేషనల్ ఓవర్సీస్ కాంగ్రెస్ తదితర సంఘాలు కలాం మృతిపట్ల సంతాపం ప్రకటించిన సంస్థల్లో ఉన్నాయి. సింగపూర్ ప్రధాని లూంగ్ కూడా సంతాపం తెలిపారు. భారత అణు సామర్థ్యాలను పెంపొందించటంలో కలాం ఎంతో కృషి చేశారని అమెరికా మీడియా శ్లాఘించింది. పలు రాష్ట్రాల్లో కలాం స్మృతి చిహ్నాలకు ఏర్పాట్లు న్యూఢిల్లీ: కలాం స్మృతి చిహ్నాలను ఏర్పాటు చేసేందుకు పలు రాష్ట్రాలు కృషి మొదలుపెట్టాయి. బిహార్ సీఎం నితీశ్‌కుమార్.. కిసాన్‌గంజ్ వ్యవసాయ కళాశాలకు మంగళవారం డాక్టర్ కలాం పేరు పెట్టారు. మధ్యప్రదేశ్‌లో స్కూళ్లలో పాఠ్యాంశంగా కలాం జీవితచరిత్రను బోధించాలని నిర్ణయించినట్లు ఆ రాష్ట్ర సీఎం శివరాజ్‌సింగ్‌చౌహాన్ తెలిపారు. కలాంకు నివాళిగా ఆగస్టు 2న ఆదివారం కూడా విధులు నిర్వర్తించాలని కేరళ రాష్ట్ర మహిళాభివృద్ధి కార్పొరేషన్ నిర్ణయించింది. కలాం మృతిపై ఆర్ఎస్ఎస్ సంతాపం తెలిపింది కలాం ట్విటర్ ఖాతాను మిత్రులు ‘ఇన్ మెమొరీ ఆఫ్ డాక్టర్ కలాం’గా కొనసాగించనున్నారు. -
టీవీ కూడా లేదు.. రేడియో వినేవారు!
ఆయన దేశంలోనే అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పదవి అనుభవించారు. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న పొందారు. అయినా కూడా ఆయన నిరాడంబర జీవితం గురించి ఎంత చెప్పినా తక్కువే. కలాం ఇంట్లో టీవీ కూడా లేదట.. కేవలం ఆలిండియా రేడియో విని మాత్రమే ఆయన వార్తలు, విశేషాలు తెలుసుకునేవారట. ఈ విషయాన్ని గత 24 ఏళ్లుగా డాక్టర్ కలాం వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న హేరీ షెరిడన్ (53) చెప్పారు. సోమవారం మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో ఢిల్లీ నుంచి బయల్దేరేసరికి కలాం ఆరోగ్యం భేషుగ్గా ఉందని, మంగళవారం సాయంత్రం ఆయన తిరిగి రావాల్సి ఉందని అన్నారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఆయనకు ఆరోగ్యం బాగోలేదని, కళ్లు తిరిగి పడిపోయారని ఫోన్ వచ్చిందని తెలిపారు. కాసేపటికే మరో ఫోన్ వచ్చిందని, మిలటరీ వైద్యులు కలాం మరణించినట్లు ప్రకటించారని షెరిడన్ భోరుమన్నారు. డీఆర్డీఓలో రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారుగా కలాం చేరినప్పుడే ఆయన వద్ద సెక్రటరీగా షెరిడన్ చేరారు. ఉదయం 6.30 గంటల నుంచి రేడియో వినడంతో ఆయన దినచర్య ప్రారంభం అయ్యేదని, అర్ధరాత్రి 2 గంటల వరకు మేలుకుని ఉండేవారని చెప్పారు. ప్రతిరోజూ తప్పనిసరిగా ఈమెయిల్స్ మాత్రం చూసుకునేవారన్నారు. దాదాపు ప్రతివారం ఏదో ఒక సెమినార్‌కు వెళ్లి వచ్చేవారట. -
కలాం విడిచి వెళ్లిన పాద ముద్రలు కూడా...
(వెబ్ సైట్ ప్రత్యేకం) రామేశ్వరం...గల్ఫ్ ఆఫ్ మున్నార్‌లో 53 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉన్న చిన్నదీవి. సముద్ర మట్టానికి కేవలం 30 అడుగుల ఎత్తులో ఉంది. షిల్లాంగ్... ఈశాన్య భారతంలో ఉన్న మేఘాలయ రాజధాని.. సముద్ర మట్టానికి 5003 అడుగుల ఎత్తులో ఉంది. రెండింటి మధ్య దూరం 3,317 కిలోమీటర్లు.. ఎక్కడో రామేశ్వరంలో సాదాసీదా కుటుంబంలో పుట్టి మనసున్న మనిషిగా ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదగడం ఎందరికి సాధ్యం. సముద్రపు అలలతో ఆడుకున్న లేలేత వేళ్లు భారతదేశం గుండెలపై చేయి వేసుకుని నిశ్చంతగా నిద్రపోయేందుకు భరోసానిచ్చే క్షిపణులను తీర్చిదిద్దాయి. రామేశ్వరం ఇసుకు తీరాల్లో కదలాడిన పాదాలు భారతదేశ అణ్వస్త్ర పటంపై చెరగని ముద్రల్నీ వేశాయి. అమాయకపు చిరునవ్వు చెరగని ఆ మోము ఒక తరం యువతలో ఆలోచనల్ని రేకెత్తించే ప్రశ్నల్ని సంధించింది. రామేశ్వరమైనా రాష్ట్రపతి భవన్ అయినా అదే సామాన్య మానవుడిగా బ్రతకడం ఎందరికి సాధ్యం. ప్రజలను ముఖ్యంగా భావి భారత పౌరులను ఎక్కువగా చేరుకోవాలని, వారి చురుకైన మెదళ్లని ప్రశ్నలతో పదునెక్కించాలనే తాపత్రయం... మొదటి నుండి చివరివరకు నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగా బ్రతకడం ఈ రోజుల్లో ఎంతమంది ఆచరించగలరు. మా వల్లే కలాం రాష్ట్రపతి అయ్యారని స్వంత డబ్బా పదే పదే వాయించుకునే వాళ్లని చూస్తే నిజంగానే జాలి కలగక మానదు. రాష్ట్రపతి భవన్లో రాజరికపు ఆనవాళ్లను పట్టుబట్టి తుడిచేసిన విశాల హృదయం ముందు ఈ సంకుచిత మనస్తత్వాలు పిపీలికాలు కదూ! తన దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో తనతో నడచిన వంటమనిషి దగ్గర నుండి అత్యున్నత స్థాయిలో ఉన్న శాస్త్రవేత్తల వరకూ అందరినీ సమానంగా చూసి... ఆప్యాయంగా పలకరించిన మంచి మనసు ముందు గోముఖ వ్యాఘ్రాలు ఏ పాటివి. చెప్పిన విషయాల్నే పదేపదే చెప్పి విసుగూ విరామం లేకుండా విద్యార్థులు, యువకుల మధ్య గడిపిన మేరు నగధీరుడు. అగ్ని, పృథ్విలాంటి క్షిపణినైనా, గగనపు అంచులను తాకిన ఎస్ఎల్వీ లాంటి రాకెట్లయినా, పోఖ్రాన్ అణు పరీక్షలైనా, తక్కువ ఖరీదు చేసే స్టెంట్లైనా, తేలికైన కాలిపర్స్ అయినా, మేధస్సును పదునెక్కించే ప్రశ్నలైనా, కలలు కనడం నేర్పే ఓపికైనా, వాటిని ఎలా నిజం చేసుకోవాలో చెప్పే మార్గదర్శనమైనా .... తను చేసిన ప్రతీపనిలో అదే నిబద్ధత. అమాయకత్వంతో కూడుకున్న పట్టుదల...అలుపెరగని ప్రయాణం. 2004 సం.రం చివరిరోజుల్లో నెల్లూరులోని ఒక పాఠశాలకు భారత రాష్ట్రపతి పర్యటన. అపుడు పనిచేస్తున్న ఒక ఆంగ్ల దినపత్రిక తరుపున కవరేజి కోసం వెళ్లా. రాష్ట్రపతి కదా.. అధికారులు,పోలీసులు, రాజకీయ నాయకుల హడావుడి ఎక్కువే.. . కొంచెం విసుగ్గా కూడా అనిపించింది. కలాం వేగంగా వచ్చారు.. గుడీవినింగ్ చిల్డ్రన్ పలకరింపు.. అదే నవ్వు.. అప్పటివరకు ఉన్న విసుగు, చికాకు క్షణాల్లో మాయం. తర్వాత 90 నిమిషాలు చందమామ పుస్తకాల్లోని కథలు చదివినంత ఆహ్లాదం.. విజ్ఞానం.. వినోదం. ఆ తర్వాత పిల్లల మొహాల్లో ఆనందం..అబ్బురం.. ఆ చిన్ని మెదళ్లలో బెలోడన్ని ప్రశ్నలు.. సామాన్యంగా కనిపించే వ్యక్తి పిల్లల్ని ఏ మేరకు ప్రభావితం చేయగలడనే ప్రత్యక్ష ఉదాహరణ. ఒక జర్నలిస్టుగా నాకంటూ కొన్ని అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ అవి వార్తల్లో కనపడకూడదనే రూల్‌ని బ్రేక్ చేసి రిపోర్టు చేసింది ఆ రోజునే.. పిల్లల్నే కాదు, పెద్దల్ని కూడా కదిలించాడని నా వార్తకు నేనే పాఠకుణ్ని అయిన మరుసటి ఉదయం అనిపించింది. విద్యార్థుల మధ్య గడపడం వ్యసనంగా చేసుకున్న కలాం (బహుశా ఆయనకుండిన ఒకే ఒక వ్యసనం ఇదేనేమో) ఆ విద్యార్థుల మధ్యే కుప్పకూలడం కాకతాళీయమేమో. సముద్ర మట్టానికి కేవలం ముప్ఫైఅడుగుల ఎత్తులో పుట్టి, ఎన్నోవేల అడుగుల ఎత్తులో మరణించడం.. పుట్టిన ఊరికి వేల కిలో మీటర్ల దూరంలో మరణించడం.. ఈ రెండూ ఆయన జీవితంలో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదగడానికి....ఎవరూ ప్రయాణించనంత దూరం ప్రయాణించడానికి సూచికలేమో. ఎక్కడ పెరిగినా.. ఎంత ఎత్తు ఎదిగినా. ..పుట్టిన ఊరిలో... ఆ మట్టిలోనే కలిసిపోవాలనే చిన్నకోరిక.. దశాబ్దాల ఉద్యోగ జీవితంలో జన్మనిచ్చిన తల్లిదండ్రుల అంత్యక్రియలకు మాత్రమే సెలవు తీసుకున్నారని అప్పటి ఆయన సహోద్యోగులు పదే పదే గుర్తు చేసుకుంటారు.. ఇపుడు కలాం శాశ్వత సెలవు తీసుకున్నారు. ..దేశంలోని ప్రతిమూల తన అడుగు జాడల్ని ..ఆలోచనా స్రవంతిని ఆనవాళ్లుగా వదిలిపెట్టి.. ఇక మీద రామేశ్వరానికి వెళితే చూడటానికి సముద్రం మీద నిర్మించిన పంబన్ బ్రిడ్జి, చారిత్రాత్మక మైన రామేశ్వరం గుడి మాత్రమే కాదు.. కలాం నడిచిన, విడిచి వెళ్లిన పాద ముద్రలు కూడా... ఎన్. గోపీనాథ్ రెడ్డి -
కలాంకు త్రివిధ దళాల గౌరవ వందనం
న్యూఢిల్లీ : భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం భౌతికకాయానికి త్రివిధ దళాలు గౌరవ వందనం సమర్పించాయి. వాయుసేన విమానంలో కలాం పార్థీవ దేహం మంగళవారం మధ్యాహ్నం పాలెం విమానాశ్రయం చేరుకుంది. ఈ సందర్భంగా ఆర్మీ, నేవీ, వాయు సేనల అధ్యక్షులు.. కలాం భౌతికకాయంపై జాతీయ పతాకం కప్పి ఘనంగా నివాళులు అర్పించారు. బుధవారం రామేశ్వరంలో కలాం అంత్యక్రియల జరగనున్నాయి. -
పాలెం విమానాశ్రయంలో ప్రత్యేక ఏర్పాట్లు
న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం భౌతికకాయం కాసేపట్లో ఢిల్లీ చేరుకోనుంది. పాలెం విమానాశ్రయానికి కలాం పార్ధీవ దేహాన్ని తీసుకురానున్నారు. ఇందుకోసం పాలెం విమానాశ్రయంలో ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాధ్ సింగ్, రక్షణమంత్రి మనోహర్ పారీకర్ తదితరులు పాలం విమానాశ్రయానికి వెళ్లనున్నారు. పాలం విమానాశ్రయం నుంచి టెన్ రాజాజీ మార్గ్‌లోని అధికారిక నివాసానికి కలాం భౌతికకాయాన్ని తరలించనున్నారు. మరోవైపు కలాంకు ప్రజలు ఆయన నివాసంలో మధ్యాహ్నం మూడు గంటల నుంచి నివాళులు అర్పించవచ్చని రక్షణ శాఖ అధికారి ఒకరు ట్విట్ చేశారు. కాగా మంగళవారం ఉదయం ఐదున్నర గంటలకు వైమానిక దళ హెలికాప్టర్లో కలాం పార్థివదేహాన్ని గువాహటి వరకు.... అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకువచ్చారు. మరోవైపు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు గౌరవ సూచకంగా దేశవ్యాప్తంగా.... ఏడు రోజుల పాటు జులై 27 నుంచి ఆగస్ట్ 2 వరకు జాతీయ సంతాప దినాలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ వారం రోజులు జాతీయ పతాకాన్ని సగం వరకు అవనతం చేస్తారు. మరోవైపు కేంద్ర మంత్రివర్గం సమావేశంలో కలాం అంత్యక్రియలపై నిర్ణయం తీసుకోనున్నారు. -
ఢిల్లీకి చేరుకున్న కలాం భౌతికకాయం
న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం భౌతికకాయం ఢిల్లీకి చేరింది. ప్రత్యేక విమానంలో గుర్గావ్ నుంచి కలాం పార్ధివదేహాన్ని అధికారులు ఢిల్లీకి తరలించారు. కలాం కు గౌరవ సూచకంగా న్యూఢిల్లీలోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చారు. షిల్లాంగ్‌లోని ఐఐఎంలో జరిగిన ఓ సెమినార్లో ప్రసంగిస్తూ కలాం కుప్పకూలడంతో ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగానే సోమవారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. -
రోదించిన ఫేస్ బుక్.. విలపించిన ట్విట్టర్
(సాక్షి వెబ్ ప్రత్యేకం) నా గుండె కలుక్కుమంది. అవును.. నా గుండె రక్తనాళాల్లో కలాం రూపొందించిన స్టెంట్ ఉంది. ఆయన లేరనగానే ప్రాణంలేని ఆ స్టెంటు కూడా బాధతో మూలిగింది. అందుకే కాబోలు.. నా గుండె కలుక్కుమంది మోస్ట్ రెస్పెక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నా దృష్టిలో నువ్వే.. ఓ భారతదేశం నా కళ్లన్నీ నీళ్లతో నిండిపోయాయి. ముందు ఏముందో, టీవీలో ఏం చూపిస్తున్నారో కూడా కనపడటం లేదు.. నిజంగా బ్లాక్ డే. స్వామి వివేకానంద తర్వాత భారతీయ యువతలో స్ఫూర్తి రగిలించింది అబ్దుల్ కలామే. ఆయన కుప్పకూలారేగానీ, ఆయన సృష్టించిన మిసైల్స్ ఏనాడూ కూలలేదు. సలాం సర్ ..... సాధారణంగా ఎవరైనా మరణిస్తే వెంటనే వాళ్ల పేరుతో ‘రిప్’ అనే రెండక్షరాలతో సరిపెట్టేసే ఫేస్ బుక్ కమ్యూనిటీలో సోమవారం రాత్రి నుంచి వెల్లువెత్తుతున్న సందేశాలలో ఇవి కొన్ని మాత్రమే. అబ్దుల్ కలాం అస్వస్థతకు గురైనట్లు తెలిసినప్పటి నుంచి ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్.. ఇలా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆందోళన, ఆవేదన. ‘‘దేవుడా ఇప్పటికే లెక్కలేనన్ని దుర్వార్తలు వినిపించావు. ఈ ఒక్కసారీ కరుణించు.. ఆ మహానుభావుడిని బతికించు’’ అంటూ ట్విట్టర్ లో లెక్కలేనన్ని ట్వీట్లు వచ్చాయి. మొట్టమొదటి సారి ఓ జాతీయ చానల్లో రిపోర్టర్ ఆయన ఇక లేరంటూ చెప్పబోతుండగానే న్యూస్ రూంలో ఉన్నవాళ్లు కట్ చేసినప్పుడు కూడా ‘స్వామీ ఇది నిజం కాకూడదు.. ఇప్పుడైనా ఈ వార్త తప్పని చెప్పించు’ అంటూ కన్నీరు పెట్టారు. ఎలాంటి సందర్భంలోనైనా కూడా పెద్దగా బాధ్యత లేనట్లు, పొడిపొడిగా అరకొర మాటలతో, సంకేతార్థాలతో వినిపించే, కనిపించే సోషల్ మీడియా.. కలాం విషయంలో మాత్రం చాలా భిన్నంగా కనిపించింది. మంగళవారం ఉదయం ఎవరి ఫేస్ బుక్ అకౌంట్ తెరిచినా.. ఎన్ని స్క్రోల్స్ కిందకు వెళ్లినా.. ఒకటే విషయం.. కలాం సార్ కి సలాం. ఆయన చివరి నిమిషంలో స్టేజి మీద కుప్పకూలిన ఫొటోను షేర్ చేసినవాళ్లు లెక్కలేనంత మంది. పిల్లల పట్ల ఆయనకున్న ప్రేమాభిమానాలను ఫొటోల రూపంలో చూపించినవాళ్లూ ఉన్నారు. ఇంకా పెద్ద విశేషం ఏమిటంటే.. చాలామంది తమ ప్రొఫైల్ పిక్చర్స్ కూడా అబ్దుల్ కలాం ఫొటోతో మార్చేసుకున్నారు. వాట్సాప్ లో కూడా సోమవారం రాత్రి ఆయన మరణించిన విషయం దావానలంలా వ్యాపించింది. ఒకరి నుంచి మరొకరికి, అక్కడినుంచి గ్రూపుల్లోకి.. అలా అలా.. టీవీలు చూడనివాళ్లకు కూడా ఈ విషయం క్షణాల్లో తెలిసిపోయింది. ఒక్కసారిగా అంతా నివ్వెరపోయారు. మన తరానికి బాగా తెలిసిన, ఈ తరం మొత్తానికి తన స్వప్న సందేశాలతో స్ఫూర్తి రగిలించిన ఆ మహానుభావుడు ఇక లేడనగానే మూగగా రోదించారు. తమకూ మనసుందని, సందర్భం వస్తే అది కూడా చలిస్తుందని నిరూపించారు. -
రాష్ట్రపతి, ప్రధాని తదితరుల సంతాపం
దేశం గొప్ప పుత్రుడిని కోల్పోయింది: రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఒక గొప్ప పుత్రుడిని దేశం కోల్పోయిందని ఆవేదన చెందారు. ‘కలాం మృతి వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. ఆయనకు నా గౌరవ నివాళులర్పిస్తున్నాను. ’ అని పేర్కొన్నారు. మార్గదర్శకుడిని కోల్పోయా: ప్రధాని ఒక మార్గదర్శకుడిని తాను కోల్పోయానని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘శాస్త్ర సాంకేతిక, అంతరిక్ష రంగాల్లో విశేష కృషి చేసిన గొప్ప శాస్త్రవేత్త కలాం. భారతదేశానికంతటికీ.. ముఖ్యంగా యువతకు ఆయన స్ఫూర్తి ప్రదాత’ అని పేర్కొన్నారు. మానవతావాది: నరసింహన్ మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం మృతి పట్ల గవర్నర్ నరసింహన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి దేశానికి తీరని లోటన్నారు. ‘‘కలాంతో నాకెంతో అనుబంధముంది. ఆయన రాష్ట్రపతిగా ఉండగా కేంద్రంలో వివిధ హోదాల్లో పని చేశాను’’ అంటూ గుర్తు చేసుకున్నారు. మానవత్వమున్న శాస్త్రవేత్త: కేసీఆర్ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశానికి తీరని లోటన్నారు. కలాం హైదరాబాద్‌లో పలు కీలక పరిశోధనలు చేశారని గుర్తు చేసుకున్నారు. ఆయనది గొప్ప మానవత్వమున్న వ్యక్తిత్వమంటూ కీర్తించారు. దేశానికి తీరనిలోటు: చంద్రబాబు కలాం మృతి దేశానికి తీర ని లోటని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గొప్ప శాస్త్రవేత్తను, మేధావిని, దార్శనికుడిని, స్ఫూర్తి ప్రదాతను దేశం కోల్పోయిందన్నారు. యుగానికొకరే కనిపిస్తారు: జగన్ మాజీ రాష్ట్రపతి, భరతమాత ముద్దుబిడ్డ అబ్దుల్ కలాం మరణ వార్త తనను కన్నీటి సముద్రంలో ముంచిందని, అలాంటి మహానుభావులు యుగానికొకరు మాత్రమే కనిపిస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. -
చివరి నిమిషం వరకు పిల్లలతోనే!!
భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత పిల్లలను అంతగా ప్రేమించే మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం.. చివరి నిమిషం వరకు కూడా పిల్లలతోనే గడిపారు. ఆఖరకు తన చివరి క్షణాల్లో కూడా పిల్లలను వదిలిపెట్టలేదు. షిల్లాంగ్ ఐఐఎంలో విద్యార్థుల కోసం 'లివబుల్ ప్లానెట్ ఎర్త్' అనే అంశంపై సెమినార్లో పాల్గొన్నారు. ఎప్పుడూ కలలు కనాలని, వాటిని సాకారం చేసుకోడానికి కష్టపడాలని చెప్పే కలాం.. ఏ నగరానికి ఏ కార్యక్రమం కోసం వెళ్లినా, మళ్లీ అక్కడ ఏదో ఒక విద్యాసంస్థలో తప్పనిసరిగా ఒక కార్యక్రమం పెట్టుకుంటారు. అలా పిల్లలతో కలిసిపోయి, వాళ్లలో ఒక పిల్లాడిలా ఆయన ఆనందిస్తారు. అలాంటి కలాం లేరన్న విషయాన్ని పెద్దల నుంచి పిల్లల వరకు ఎవరూ తట్టుకోలేకపోతున్నారు. ట్విట్టర్లో సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వార్త నిజం కాకూడదంటూ చివరి నిమిషాల్లో కూడా పలువురు ట్వీట్ చేశారు. భారతదేశంలో ప్రాంతాలకు, రాష్ట్రాలకు అతీతంగా ఇంతటి అభిమానాన్ని పొందిన ఏకైక రాష్ట్రపతి కూడా అబ్దుల్ కలామే అనడంలో ఏమాత్రం సందేహం లేదు. -
కలాం చివరి ట్వీట్..
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చిట్టచివరకు వరకు దేశం పట్ల తనకున్న అంకితభావాన్ని చాటుకున్నారు. కలాం మరణించే రోజు కూడా ట్వీట్ చేశారు. తుది శ్వాస విడవడానికి దాదాపు 8 గంటల ముందు కలాం తన బాధ్యతలను తెలియజేశారు. ఈ రోజు షిల్లాంగ్‌కు వెళ్తున్నానని, లివబుల్ ప్లానెట్ ఎర్త్ అంశంపై కోర్సు తీసుకోబోతున్నట్టు ట్వీట్ చేశారు. షిల్లాంగ్ కు వెళ్లిన కాసేపటికే కలాం తుది శ్వాస విడిచారు. తీవ్ర అస్వస్థతకు గురైన కలాం సోమవారం రాత్రి కన్నుమూశారు. Going to Shillong.. to take course on Livable Planet earth at iim. With @srijanpalsingh and Sharma. — APJ Abdul Kalam (@APJAbdulKalam) July 27, 2015 -
అబ్దుల్ కలాం పరిస్థితి విషమం.. ఆస్పత్రిలో చేరిక
మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో ఆయనను షిల్లాంగ్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు మేఘాలయ రాజధాని నగరం షిల్లాంగ్ వచ్చిన కలాం (84).. అనుకోకుండా అనారోగ్యం పాలయ్యారు. దాంతో ఆయనను వెంటనే సమీపంలోని బెథనీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఖాసి హిల్స్ ఎస్పీ ఎం.ఖర్క్రంగ్ తెలిపారు. ఆర్మీవైద్యులు దగ్గరుండి ఆయనకు చికిత్సలు అందిస్తున్నట్లు తెలిసింది. షిల్లాంగ్‌లోని ఐఐఎంలో జరిగిన ఓ సెమినార్లో ప్రసంగిస్తూ ఆయన కుప్పకూలారు. దాంతో ఆయనను ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. 9 గంటలకు ముందు కూడా ఆయన సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉన్నారు. తాను షిల్లాంగ్ వెళ్తున్నానని, అక్కడి విద్యార్థులతో భేటీ కానున్నానని ట్వీట్ చేశారు. అయితే అంతలోనే ఆయన తీవ్ర అనారోగ్యం పాలు కావడం పట్ల ఐఐఎం విద్యార్థులతో పాటు అందరూ ఆందోళన చెందుతున్నారు. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని జాతీయ మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఆయనను ఆస్పత్రిలోని ఐసీయూలో చేర్చి వైద్యులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మేఘాలయ గవర్నర్ వి.షణ్ముగనాథన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.బి.ఒ. వర్జిరి ఇద్దరూ బెథనీ ఆస్పత్రికి వెళ్లి కలాం పరిస్థితి గురించి తెలుసుకున్నారు. దాదాపు మరణించిన స్థితిలో... కలాంను తమ ఆస్పత్రికి దాదాపు మరణించిన స్థితిలో తీసుకొచ్చారని, ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని బెథనీ ఆస్పత్రి డైరెక్టర్ జాన్ సైలో రైన్లాంథియాంగ్ చెప్పారు. పేషెంటును రక్షించేందుకు తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. కలాం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నారని, ఆయనకు అన్ని రకాల పరీక్షలు చేస్తున్నారని, బహుశా ఆయనకు 'కార్డియాక్ అరెస్ట్' అయి ఉండొచ్చని అన్నారు. Going to Shillong.. to take course on Livable Planet earth at iim. With @srijanpalsingh and Sharma. — APJ Abdul Kalam (@APJAbdulKalam) July 27, 2015 -
‘కళం’ కథేంటి?
కళం ఈ పేరుతో ఒక వైవిధ్యభరిత చిత్రం తెరకెక్కుతోంది. ఇది హారర్ కోవలో చేరే చిత్రమే. అయితే ఇది దెయ్యం ఇతి వృత్తమా? అన్న ప్రశ్నకు చిత్ర దర్శక నిర్మాతల నుంచి అవుననీ, కాదనీ కానీ సమాధానం రావడం లేదు. ఆ విషయం ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్న దర్శకుడు రాబర్ట్. ఎస్.రాజ్‌కు ఇది తొలి చిత్రం. సుభీష్ చంద్రన్ కథా, కథనం, సంభాషణలు రాసిన ఈ చిత్రాన్ని అరుళ్ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మాత పీకే చంద్రన్ నిర్మిస్తున్నారు. శ్రీనివాసన్ ఎన్ఎల్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రం చుట్టకదై చిత్రం ఫేమ్ లక్ష్మీప్రియ హీరోయిన్గా నటిస్తున్నారు. మధుసూదన్‌రావు, అంజాద్, బేబి హిమ, రేఖ సురేష్, ఎస్ఎస్ మ్యూజిక్ ఫేమ్ పూజ, కణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ప్రకాష్ నిక్కి సంగీతాన్ని ముఖేష్ జి ఛాయాగ్రహణాన్ని అందిస్తున్నారు. చిత్ర కథేంటన్న ప్రశ్నకు దర్శకుడు మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన సంఘటనల ఇతివృత్తమే కళం చిత్రం అన్నారు. చిత్ర నిర్మాణం తుది దశకు చేరుకొందని దర్శకుడు తెలిపారు.