డాక్టర్ అబ్దుల్ కలాం నేషనల్ స్కూల్ ప్రారంభం | dr.abdul kalam national school starts | Sakshi
Sakshi News home page

డాక్టర్ అబ్దుల్ కలాం నేషనల్ స్కూల్ ప్రారంభం

Published Tue, Apr 26 2016 1:56 AM | Last Updated on Tue, Oct 30 2018 7:45 PM

డాక్టర్ అబ్దుల్ కలాం నేషనల్ స్కూల్ ప్రారంభం - Sakshi

డాక్టర్ అబ్దుల్ కలాం నేషనల్ స్కూల్ ప్రారంభం

హైదరాబాద్  : తన చివరి క్షణం వరకు విద్యార్థులతో మమేకమైన భారతరత్న, దివంగత డాక్టర్ అబ్దుల్ కలాం స్ఫూర్తితో కలాం నేషనల్ స్కూల్‌ను ప్రారంభిస్తున్నట్లు మెథడిస్ట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గిరిధర్ ఆకుల అన్నారు. సోమవారం కళాశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. డాక్టర్ కలాం రచించిన వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకాన్ని తల్లిదండ్రులు చదివి పిల్లలకు వివరించాలన్నారు. ‘డెవలప్ యువర్ సెల్ఫ్ అండ్ డెవలప్ ద నేషన్’ అన్న ఆయన మాటలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులను డాక్టర్ గిరిధర్ ఆకుల సన్మానించారు. స్కూల్ చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అక్బర్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement