సాక్షి, అమరావతి: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 88వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. పెద్ద కలలను కనడమే కాక వాటిని ఎలా సాకారం చేసుకోవాలో దేశానికి నేర్పిన మహా మనిషికి వినయపూర్వక నివాళి. మిస్సైల్ మ్యాన్‌గా, ప్రజల ప్రెసిడెంట్‌గా గుర్తింపు తెచ్చుకున్న భారతరత్న అవార్డు గ్రహీతకు ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
My humble tribute to the man who taught an entire nation how to dream big and achieve goals. Remembering the Missile Man of India, People's President and Bharat Ratna Dr A.P.J Abdul Kalam on his birth anniversary.#APJAbdulKalam 🇮🇳
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 15, 2019
కలాంకు నివాళులర్పించిన ప్రధాని
మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ది ఇండియాగా గుర్తింపు తెచ్చుకున్న మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 88వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ‘21వ శతాబ్ధికి చెందిన భారత్ ఎలా ఉండాలో కలాం కలలు కన్నారు... దాన్ని నిజం చేసేందుకు తన వంతు కృషి చేశారు. ఆయన జీవితం దేశ పౌరులందరికి ఆదర్శం. ఆయన జయంతి సందర్భంగా వినయపూర్వక నివాళి అర్పిస్తున్నాను’ అన్నారు మోదీ. కలాం చేసిన సేవలకు గాను దేశం ఆయనకు సెల్యూట్ చేస్తుందన్నారు మోదీ.
Comments
Please login to add a commentAdd a comment