
సాక్షి, ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వైఎస్సార్‌సీపీ లోక్‌సభ పక్ష నేత మిథున్ రెడ్డి లేఖ రాశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ జగన్‌కు రక్షణ కల్పించడంలో ఏపీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ పర్యటనకు వెళ్ళిన వైఎస్ జగన్‌కు పోలీసులు రక్షణ కల్పించలేదు. జగన్ పర్యటనలో తీవ్రమైన భద్రత వైఫల్యం తలెత్తింది’’ అని లేఖలో మిథున్‌రెడ్డి వివరించారు.
జెడ్ ప్లస్ సెక్యూరిటీ కేటగిరిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వెంటనే కేంద్ర బలగాలతో రక్షణ కల్పించండి. ఇటీవల వైఎస్ జగన్ నివాసం వద్ద కొన్ని ఘటనలు జరిగాయి. ఇవి భారీ ఎత్తున పన్నిన కుట్రలో భాగంగా జరుగుతున్న ఘటనలు. వైఎస్ జగన్ ప్రాణాలకు ముప్పు తెచ్చే విధంగా భద్రత వైఫల్యం కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం విధానాల వల్ల మాజీ ముఖ్యమంత్రి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. ప్రజాస్వామ్య విధానాలకు తూట్లు పొడిచేలా ప్రమాదకర ధోరణికి తెరలేపుతోంది’’ అని లేఖలో మిథున్‌రెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: జనం గుండెల్లో జగన్.. కూటమి గుండెల్లో రైళ్లు
కాగా.. మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గుంటూరు పర్యటనలో అడుగడుగునా భద్రతా వైఫల్యం కనిపించింది. మాజీ సీఎం పర్యటనలో భద్రత కల్పనపై ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఈ వైఫల్యంపై వైఎస్సార్‌సీపీ నేతలు గురువారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

Comments
Please login to add a commentAdd a comment