
గుంటూరు, సాక్షి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గుంటూరు పర్యటనను అడ్డుకోలేకపోయిన కూటమి ప్రభుత్వం.. మరో కుట్రకు తెరదీసింది. మిర్చి యార్డులో పర్యటించి రైతుల గోడు విన్నందుకుగానూ ఆయనపై కేసు(Case Against YS Jagan) పెట్టింది. ఎలాంటి సభ, మైక్ ప్రచారం నిర్వహించకపోయినా పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం.
మిర్చి రైతుల కష్టాలు తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ బుధవారం గుంటూరుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనకుగానూ మాజీ సీఎం హోదాలో కూడా ఆయనకు ప్రభుత్వం ఎలాంటి భద్రత ఇవ్వలేదు. రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో పాటు భద్రతా వ్యవహారంపై ఆయన సీఎం చంద్రబాబును నిలదీశారు కూడా. అయితే వైఎస్ జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ టీడీపీ నేతలు కొందరు నల్లపాడు పీఎస్(Nallapadu Police Station)లో ఫిర్యాదు చేశారు. దీంతో వాళ్ల ఒత్తిడి మేరకు పోలీసులు జగన్‌పై కేసు నమోదు చేశారు.
ఇక్కడ మరో కొసమెరుపు ఏంటంటే.. వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) అసలు ఆ పర్యటనకు రాకపోయినా కేసు నమోదు చేయడం. వైఎస్ జగన్, పేర్ని నానితో పాటు ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు కొడాలి నాని, అంబటి రాంబాబు, గుంటూరు మేయర్ కావట్టి మనోహర్ నాయుడు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితరులపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

మిర్చి రైతుల(Mirchi Farmers) కష్టాలుపై ప్రభుత్వాన్ని నిలదీసినందుకే కక్ష కట్టి చంద్రబాబు ప్రభుత్వం తమ నేతలపై కేసు పెట్టిందని వైఎస్సార్‌సీపీ మండిపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment