Nallapadu
-
తప్పుడు కేసుపై డీజీపీకి పేర్ని నాని ఫిర్యాదు
గుంటూరు, సాక్షి: తనపై తప్పుడు కేసు నమోదు అయిన విషయాన్ని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) డీజీపీకి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు శుక్రవారం ఫిర్యాదు చేస్తూ డీజీపీ(AP DGP) హరీష్ కుమార్ గుప్తాకు ఓ లేఖ రాశారు. గిట్టుబాటు ధర లేక ఆందోళనలో ఉన్న గుంటూరు మిర్చి రైతులను బుధవారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆయన జగన్, మరికొందరు వైఎస్సార్సీపీ(YSRCP) నేతలు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ నల్లపాడు పీఎస్‌లో టీడీపీ నేతలు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో జగన్ సహా వైఎస్సార్సీపీ నేతలపై కేసు నమోదు అయ్యింది.అయితే ఆ పర్యటనలో పాల్గొనని పేర్ని నాని(Perni Nani)పై కూడా కేసు నమోదు కావడంతో ఆయన స్పందించారు. ఈ పర్యటనలో పాల్గొనకున్నా తన ప్రతిష్టను దెబ్బ తీసేందుకు తనపై ఫిర్యాదు చేశారని డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారాయన. ప్రజాక్షేత్రంలో ఉన్న తనపై ఇలాంటి తప్పుడు కేసు బనాయించడం.. అందరినీ తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని అన్నారాయన. ఈ అంశంపై విచారణ జరిపి తప్పుడు ఫిర్యాదు చేసిన వాళ్లపై, అలాగే బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారాయన. ఇదీ చదవండి: సభ పెట్టలేదు.. మైక్ ముట్టలేదు.. ఇదేమీ దుర్మార్గం -
‘రైతుల గోడు వింటే కేసు పెడతారా?’
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటనను అడ్డుకోలేకపోయిన కూటమి ప్రభుత్వం.. మరో కుట్రకు తెరదీసింది. మిర్చి యార్డులో పర్యటించి రైతుల గోడు విన్నందుకుగానూ ఆయనపై కేసు(Case Against YS Jagan) పెట్టింది. ఎలాంటి సభ, మైక్ ప్రచారం నిర్వహించకపోయినా పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం.మిర్చి రైతుల కష్టాలు తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ బుధవారం గుంటూరుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనకుగానూ మాజీ సీఎం హోదాలో కూడా ఆయనకు ప్రభుత్వం ఎలాంటి భద్రత ఇవ్వలేదు. రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో పాటు భద్రతా వ్యవహారంపై ఆయన సీఎం చంద్రబాబును నిలదీశారు కూడా. అయితే వైఎస్ జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ టీడీపీ నేతలు కొందరు నల్లపాడు పీఎస్(Nallapadu Police Station)లో ఫిర్యాదు చేశారు. దీంతో వాళ్ల ఒత్తిడి మేరకు పోలీసులు జగన్‌పై కేసు నమోదు చేశారు. ఇక్కడ మరో కొసమెరుపు ఏంటంటే.. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) అసలు ఆ పర్యటనకు రాకపోయినా కేసు నమోదు చేయడం. వైఎస్ జగన్, పేర్ని నానితో పాటు ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు కొడాలి నాని, అంబటి రాంబాబు, గుంటూరు మేయర్ కావట్టి మనోహర్ నాయుడు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితరులపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మిర్చి రైతుల(Mirchi Farmers) కష్టాలుపై ప్రభుత్వాన్ని నిలదీసినందుకే కక్ష కట్టి చంద్రబాబు ప్రభుత్వం తమ నేతలపై కేసు పెట్టిందని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. -
ఖతార్ నుంచి హతమార్చేందుకు ప్లాన్.. చంపేందుకు వెళ్తూ..
గుంటూరు రూరల్: వాళ్లిద్దరూ చిన్నప్పటి నుంచీ ప్రాణ స్నేహితులు. బాగా చదువుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఆ తరువాత ఇద్దరిమధ్యా తలెత్తిన ఆర్థిక లావాదేవీలు దూరం పెంచాయి. చివరకు కిరాయి హంతకుల సాయంతో మిత్రుడునే హత్య చేయించే స్థాయికి పురిగొల్పాయి. చివరకు పన్నాగం బెడిసికొట్టడంతో నిందితులు పోలీసులకు చిక్కారు. గుంటూరు జిల్లా నల్లపాడు సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు మండలం ఏటీ అగ్రహారానికి చెందిన ప్రశాంత్, అవినాష్‌రెడ్డి చిన్ననాటి నుంచి స్నేహితులు. చదవండి: ఒకే మహిళతో ఇద్దరు వివాహేతర సంబంధం.. మర్మాంగాలను కోసి.. ప్రశాంత్ ఖతార్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తుండగా.. అవినాష్‌రెడ్డి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ రంగంలోనే స్థిరపడ్డారు. కాగా, అవినాష్‌రెడ్డికి ప్రశాంత్ తన సొంత ఖర్చుతో పెళ్లి చేశాడు. అనంతరం ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదాలు ఏర్పడ్డాయి. అవినాష్‌రెడ్డి వైఖరిపై విసుగు చెందిన ప్రశాంత్ అతడిని అంతం చేయాలని పథకం పన్నాడు. తాను ఖతార్‌లో నుంచి గుంటూరు సుందరయ్య కాలనీకి చెందిన నామాల చందు, దేవళ్ల సూర్య, రాచకొండ గోపీకృష్ణ, వెంగలశెట్టి దుర్గాప్రసాద్, షేక్ కరీముల్లా, షేక్ బాజీ, పూసల బాలాజీ, కమతం కృష్ణను సంప్రదించాడు. అవినాష్‌రెడ్డిని హతమార్చాలని, ఇందుకోసం ఎంత ఖర్చయినా భరిస్తానని చెప్పాడు. సుమారు రూ.30 లక్షల వరకు సుపారీ చెల్లించాడు. చంపేందుకు వెళ్తూ దొరికిపోయారు సుపారీ తీసుకున్న 8 మంది ఇటీవల విజయవాడలో కత్తులు కొనుగోలు చేసి తెచ్చుకున్నారు. కాగా, నిందితులకు స్థానికంగా కొందరితో వివాదాలు ఉండటంతో.. హైదరాబాద్‌లో హత్య చేసి తిరిగొచ్చాక ఇక్కడి వారి సంగతి తేలుస్తామని హెచ్చరించారు. అనంతరం శుక్రవారం రాత్రి వారంతా కారులో హైదరాబాద్ బయలుదేరగా.. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న నల్లపాడు పోలీసులు పేరేచర్ల వద్ద 8 మందినీ అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కత్తులు, ఇతర మారణాయుధాలు, కారును స్వాధీనం చేసుకున్నారు. స్నేహితుడి హత్యకు పథకం వేసిన ప్రశాంత్‌ను ఖతార్ నుంచి స్వగ్రామానికి రప్పించేందుకు చర్యలు చేపట్టారు. -
కి‘లేడీ’: కరోనా టీకా వేస్తున్నట్టు నటించి.. బంగారు గొలుసుతో...
గుంటూరు రూరల్: ఒంటరిగా ఉన్న మహిళలను గుర్తించి మాయమాటలు చెప్పి వారి వద్దనుంచి బంగారు గొలుసులు మాయంచేసే మాయలేడీని నల్లపాడు పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ బి.శ్రీనివాసరావు వివరాలను వెల్లడించారు. భవనం ప్రభావతి హౌసింగ్‌బోర్డ్ కాలనీ ఎల్‌ఐజీలో తన భర్త రాజశేఖరరెడ్డితో కలిసి నివాసం ఉంటుంది. ఇద్దరే ఉంటున్నారని గమనించిన నగరంలోని గౌతమినగర్ 4వ లైనుకు చెందిన దొల చంద్రకళ ద్విచక్రవాహనంపై ప్రభావతి ఇంటికి ఈనెల 15వ తేదీన మధ్యాహ్నం సమయంలో వచ్చింది. కరోనా టీకాలు వేస్తున్నామని మీరు టీకా వేయించుకోవాలని ప్రభావతిని నమ్మబలికింది. దీంతో ప్రభావతి సరే టీకా వేయండని చెప్పగా, టీకా వేస్తున్నట్లుగా నటిస్తూ మాయలేడీ చంద్రకళ ప్రభావతి మెడలోని రెండు బంగారు గొలుసులను కట్‌చేసి బయటకు పరిగెత్తింది. (చదవండి: సాఫ్ట్వేర్ లవ్‌స్టోరీ.. బెంగళూరులో వివాహం.. రక్షణ కల్పించాలంటూ..) ఒక్కసారిగా గొలుసు లాక్కుని పరారవ్వటంతో కిందపడిన ప్రభావతి తేరుకుని బయటకు వచ్చి చూడగా మాయలేడీ ద్విచక్ర వాహనంపై పరారవ్వటం గమనించింది. దీంతో చేసేదిలేక నల్లపాడు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు అర్బన్ జిల్లా ఎస్పీ ఆరీఫ్‌హఫీజ్ ఆదేశాల మేరకు సౌత్‌జోన్ రూరల్ డీఎస్పీ వై.జెస్సీప్రశాంతి, సీఐ శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఎస్ఐ ఆరోగ్యరాజు సిబ్బందితో కలిసి కేసు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ పుటేజీల ఆధారంగా మాయలేడీ వినియోగిస్తున్న ద్విచక్రవాహనం నంబర్లు సైతం సరైనవి కాదని నంబర్లు మార్చి వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఎట్టకేలకు మాయలేడీ చంద్రకళను ఆదివారం అరెస్ట్ చేశారు. అనంతరం తమదైన శైలిలో పోలీసులు విచారించగా నిందితురాలు చేసిన నేరం ఒప్పుకుంది. చోరీ చేసిన రూ.4 లక్షల విలువ చేసే రెండు బంగారు గొలుసులు రికవరీ చేశామని సీఐ తెలిపారు. దీంతోపాటుగా నిందితురాలు వినియోగిస్తున్న ద్విచక్రవాహనాన్ని సీజ్ చేశామన్నారు. కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన ఎస్.ఆరోగ్యరాజును, ఎస్ఐ ఎస్.సత్యనాయక్, కానిస్టేబుళ్లు కె.సుబ్బారావు, షేక్ జాన్‌సైదా, షేక్ మస్తాన్‌వలి, ఎం.లోకేశ్వరరావులను అభినందించి అర్బన్ ఎస్పీ రివార్డులను ప్రకటించారని సీఐ తెలిపారు. (చదవండి: పదో తరగతి పరీక్షలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం) -
ఇష్టం లేనిపెళ్లి.. నిశ్చితార్థం విషయం తెలిసి యువతి ఏం చేసిందంటే?
గుంటూరు రూరల్: తల్లిదండ్రులు ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని మానసిక ఒత్తిడికి గురై యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ తరంగిణి తెలిపిన వివరాలు.. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గోరంట్ల గ్రామానికి చెందిన దమ్ము జయపాల్‌కు ఒక కుమార్తె సంధ్య(19) ఉంది. ఈనెల 25వ తేదీన సంధ్యకు తల్లిదండ్రులు పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. చదవండి👉: మనసు ‘దోశ’కున్న మంత్రి వేణు నిశ్చితార్థం విషయం తెలిసిన నాటి నుంచి పెళ్లి ఇష్టంలేదని తల్లిందండ్రులకు చెప్పలేక మానసిక ఒత్తిడికి గురైంది. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జీజీహెచ్‌కి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేశారు. -
కరెంటు ఇచ్చారు..లైన్ మరిచారు!
సాక్షి, హైదరాబాద్: అది దగ్గరి దారి.. ఆ మార్గం గుండా వెళ్తే దాదాపు 80 కి.మీ. దూరం తగ్గుతుంది. ఫలితంగా సమయంతోపాటు ఖర్చూ ఆదా అవుతుంది. అలాంటప్పుడు ఎవరైనా ఈ మార్గాన్నే ఎంచుకుంటారు. గరిష్టంగా దాన్ని వినియోగించుకుని ఆదా చేసుకుంటారు. కానీ ఘనత వహించిన మన రైల్వే మాత్రం దానికి భిన్నంగా వ్యవహరిస్తోంది. దక్షిణ మధ్య రైల్వేలో నడికుడి మార్గం కీలకమైన వాటిల్లో ఒకటి. నగరం నుంచి వెళ్లేటప్పుడు బీబీ నగర్ దాటిన తర్వాత వచ్చే పగిడిపల్లి స్టేషన్ తర్వాత మార్గం రెండుగా విడిపోతుంది. ఎడమవైపు వెళ్తే వరంగల్, కుడివైపు వెళ్తే నడికుడి మార్గం వస్తుంది. వరంగల్ మార్గం డబుల్‌లైన్ కావటం, విద్యుదీకరణ ఉండటంతో ఇది ప్రధాన మార్గమైంది. కానీ నడికుడి మార్గం సింగిల్‌లైన్‌గా ఉండిపోవటంతో ఆ మార్గంలో కొన్ని రైళ్లే నడుస్తున్నాయి. పైగా ఇప్పటివరకు అది విద్యుదీకరణ పూర్తి కాకపోవటంతో డీజిల్ రైళ్లనే నడుపుతున్నారు. వరంగల్ మార్గంలో రైళ్ల ట్రాఫిక్ గరిష్ట పరిమితి దాటిపోవటంతో ప్రమాదకర పరిస్థితిలో దాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో దానికి ప్రత్యామ్నాయంగా నడికుడి మార్గాన్ని అభివృద్ధి చేయాలని గతంలోనే నిర్ణయించారు. రెండో లైన్ వేయటంతోపాటు విద్యుదీకరణ చేపట్టి కొన్ని రైళ్లను ఈ మార్గంలో మళ్లించాలనేది ఆలోచన. గుంటూరుకు వరంగల్ మీదుగా కంటే ఈ మార్గంలో వెళ్తే దాదాపు 80 కి.మీ. నిడివి తగ్గుతుంది. దీంతో ఈ మార్గాన్ని అభివృద్ధి చేయాలని గతంలో నిర్ణయించారు. కరెంటు ఏర్పాటు చేసి తుస్సుమనిపించారు.. చేసిన ఆలోచనకు, చేపట్టిన కార్యాచరణకు పొంతన లేకపోవటంతో ఇప్పుడు ఈ మార్గంలో వింత పరిస్థితి ఎదురైంది. పగిడిపల్లి స్టేషన్ నుంచి గుంటూరు సమీపంలోని నల్లపహాడ్ వరకు తాజాగా విద్యుదీకరణ పూర్తి చేశారు. గుంటూరు నుంచి విజయవాడ మార్గంలో చాలా కాలం క్రితమే ఆ తంతు పూర్తయింది. గుంటూరు నుంచి అటు తెనాలి, ఇటు గుంతకల్ మార్గాల్లో కూడా ఇటీవలే విద్యుదీకరణ పూర్తి చేశారు. వెరసి కరెంటు ఇంజిన్లతో రైళ్లు నడిపేందుకు ఈ మార్గం సిద్ధమైందన్నమాట. ఇప్పటివరకు ఈ మార్గంలో కేవలం డీజిల్ రైళ్లనే నడిపేవారు. హైదరాబాద్ నుంచి డీజిల్ ఇంజిన్ రైలును గుంటూరు/తెనాలి వరకు లాక్కెళ్లేది. అక్కడ దాన్ని మార్చి రైలుకు విద్యుత్తు ఇంజిన్ అమర్చి పంపేవారు. దీంతో దాదాపు 20 నిమిషాల సమయం వృథా అయ్యేది. ఇప్పుడు విద్యుదీకరణ పూర్తి కావటంతో ఆ సమస్య లేకుండా కరెంటు ఇంజిన్లు అమర్చి రైళ్లను నడిపే అవకాశం కలిగింది. విజయవాడ, గుంటూరు, తిరుపతి, చెన్నై తదితర ప్రాంతాలకు ఇది దగ్గరి దారిగా మారింది. ఇక వరంగల్ మార్గంపై భారం తగ్గించేందుకు కొన్ని రైళ్లను ఈ దారి గుండా నడపాల్సి ఉంది. కానీ ఇక్కడే చిక్కొచ్చి పడింది. ఈ మార్గాన్ని విద్యుదీకరించారు కానీ రెండో లైన్ (డబ్లింగ్) నిర్మించలేదు. ఫలితంగా పగిడిపల్లి నుంచి గుంటూరు వరకు ఇది సింగిల్ లైన్‌గానే ఉంది. దీంతో ఎక్కువ రైళ్లను నడిపే అవకాశం లేకుండా పోయింది. విద్యుదీకరించినా, ప్రస్తుతం నడుస్తున్న రైళ్లకు కరెంటు ఇంజిన్ ఏర్పాటు చేయడం తప్ప ఒక్క రైలు కూడా అదనంగా నడిపే అవకాశం దక్కలేదు. వెరసి భారీ వ్యయంతో విద్యుదీకరించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. గతంలోనే మంజూరు.. పనులే చేపట్టలేదు.. పగిడిపల్లి నుంచి నల్లపహాడ్ వరకు డబ్లింగ్ చేపట్టేందుకు రైల్వే శాఖ గతంలోనే అనుమతి మంజూరు చేసినా అది ముందుకు సాగలేదు. ఎంపీ నిలదీయంతో కొత్తగా మంజూరు చేస్తామని రైల్వే మంత్రి ప్రకటించారు. కానీ దాని ఊసేలేకుండా పోయింది. దాదాపు 200కి.మీ. మార్గాన్ని డబ్లింగ్ చేయకపోవటం వల్ల, విద్యుదీకరణ జరిగినా అదనంగా రైళ్లను నడిపే అవకాశం లేకుండా పోయింది. ఫలితం.. వరంగల్ మార్గంపై అదనపు భారం పడటం, 80 కి.మీ. ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి రావటం, అంతమేర కరెంటు ఖర్చు, సమయం వృథా.. ఇదీ పరిస్థితి. అటు విద్యుదీకరణ, ఇటు డబ్లింగ్ పనులు ఒకే సారి చేపట్టి ఉంటే.. రెండూ పూర్తయ్యేవి. రైల్వేకు, ప్రయాణికులకు ఎంతో మేలు జరిగేది. -
కూలిన ఏపీ హైకోర్టు జనరేటర్ రూం గోడ
సాక్షి, అమరావతి : ప్రపంచంలోనే అత్యంత ఉత్తమ రాజధానిని నిర్మిస్తామంటూ ప్రకటనలతో ఊదరగొట్టే ఏపీ సర్కార్... అమరావతిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణంలో అభాసుపాలైన విషయం తెలిసిందే. నాసిరకం పనుల కారణంగా కొద్దిపాటి వర్షానికే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఛాంబర్‌తో పాటు, మంత్రుల కార్యాలయాల్లోకి వర్షపు నీరు చేరడం తెలిసిందే. తాజాగా రాజధానిలోని నేలపాడులోతాత్కాలిక హైకోర్టు భవనం నిర్మాణంలోనూ డొల్లతనం బయటపడింది. జనరేటర్‌కు సంబంధించి నిర్మాణంలో ఆరు గదుల్లో రెండు గదుల స్లాబ్ కూలింది. ఈ సంఘటనలో నలుగురు కార్మికులు గాయపడ్డారు. వీరిని తాడేపల్లి సమీపంలోని ఎన్ఆర్ఐకి ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఉదయం పనులు చేస్తుండగా గోడ కూలినట్లు కార్మికులు తెలిపారు. కార్మికులంతా జార్ఖండ్‌కు చెందినవారు. అయితే ఈ సంఘటనను మీడియా ప్రతినిధులు చిత్రీకరించేందుకు వెళ్లగా, వారిని అక్కడ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. -
యువభేరి వేదిక ఖరారు
16న గుంటూరు మిర్చి యార్డు సమీపంలో నిర్వహణ వైఎస్సార్సీపీ నేతలు మర్రి రాజశేఖర్, అప్పిరెడ్డి వెల్లడి సాక్షి, అమరావతి బ్యూరో : గుంటూరులో ఈ నెల 16న జరగబోయే యువభేరి కార్యక్రమానికి సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు వేదికను ఖరారు చేశారు. గుంటూరులో నల్లపాడు రోడ్డులోని మిర్చి యార్డు సమీపంలో గల ఖాళీ ప్రదేశంలో యువభేరి నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వేదికను ఖరారు చేసినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి ప్రకటించారు. గతంలో పార్టీ అధ్యక్షుడు, శాసనసభ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదా కోరుతూ నిరవధిక దీక్ష నిర్వహించిన ప్రాంగణంలోనే యువభేరి నిర్వహించాలని నేతలు నిర్ణయించారు. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు బొత్స సత్యనారాయణ, తలశిల రఘురామ్, జిల్లాలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు యువభేరి ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా, నగర అధ్యక్షులు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డిలు సదస్సు నిర్వహణ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, హోదా సాధన కోసం వైఎస్సార్సీపీ అనేక పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. విద్యార్థులను చైతన్యపరచి, వారి మనోభావాలను తెలుసుకొని, హోదా వల్ల ఒనగూరే లబ్ధిని తెలియజేసేందుకే పార్టీ అధినేత యువభేరిని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రజల ఆకాంక్షను వైఎస్ జగన్మోహన్రెడ్డి భుజాలకెత్తుకొని పోరాటం చేస్తున్నారని తెలిపారు. యువభేరి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఒక్కరూ విజయవంతం చేసేందుకు సహకరించాలని కోరారు. సదస్సుకు పెద్ద ఎత్తున విద్యార్థులు తరలివచ్చేలా ప్రణాళికలు రూపొందించుకొని, వారిని చైతన్యపరచాలన్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని నేతలకు సూచించారు. -
ఇంటర్ విద్యార్థి అనుమానాస్పద మృతి
ముప్పాళ్ల (గుంటూరు జిల్లా) : నల్లపాడులోని ప్రైవేటు కళాశాలలో ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్న సుదర్శన్ రెడ్డి(18) అనే విద్యార్థి అనుమానాస్పదస్థితిలో శుక్రవారం కళాశాల హాస్టల్ గదిలో మృతిచెందాడు. కాలేజీ యాజమాన్యం గుర్తించి పోలీసులకు, తల్లిదండ్రులకు విషయం తెలియజేశారు. సుదర్శన్ రెడ్డి స్వస్థలం గుంటూరు జిల్లా ముప్పాళ్ల. విషయం తెలిసిన తల్లిదండ్రులు కాలేజీ వద్దకు చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వైఎస్ జగన్‌కు వైద్య పరీక్షలు
-
వైఎస్ జగన్‌కు వైద్య పరీక్షలు
గుంటూరు : ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని నినదిస్తూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహారదీక్ష మూడోరోజుకు చేరింది. శుక్రవారం ఉదయం ఆయనకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. మూడు రోజులనుంచి దీక్ష చేస్తున్న జగన్ బాగా నీరసించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ వైఎస్ జగన్ కొంచెం నీరసంగా కనిపిస్తున్నారని, కాకపోతే బీపీ, షుగర్ (బీపీ: 110/70, షుగర్ లెవల్స్ : 94 ఎంజీ, పల్స్: 80) నార్మల్‌గానే ఉన్నాయన్నారు. వెయిట్ లాస్ కూడా లేదని, కొంతవరకూ స్టేబుల్‌గా ఉన్నట్లు చెప్పారు. అయితే దీక్ష ఇలాగే కొనసాగిస్తే రేపు ప్రత్యేక పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. కాగా గుంటూరు నల్లపాడు రోడ్డులో బుధవారం మధ్యాహ్నాం 2గంటల 15 నిమిషాలకు వైఎస్ జగన్ దీక్ష ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వెల్లువలా వస్తున్న జనాన్ని పలకరిస్తూనే ఉన్నారు. మద్దతు తెలిపేందుకు దీక్షవేదిక వద్దకు ప్రతిఒక్కరికి అభివాదం చేస్తూ పలకరిస్తున్నారు. గంటగంటకూ పెరుగుతన్న జనం...ఆయన దగ్గర వచ్చేందుకు చేయి కలిపేందుకు ఉత్సాహం చూపటంతో అదుపు చేయటం భద్రతా సిబ్బందికి కష్టంగా మారింది. -
ప్రత్యేక హోదాపై పోరాటం
-
హోదా తేవడం చేతగాకే జగన్‌పై టీడీపీ విమర్శలు
- వైఎస్ జగన్ దీక్షకు సీపీఐ సంపూర్ణ మద్దతు - ప్రత్యేక హోదాపై బాబు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి - సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తేవడం చేతగాకే అధికార తెలుగుదేశం పార్టీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం గుంటూరు జిల్లా నల్లపాడు వద్ద వైఎస్ జగన్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు సీపీఐ సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నదని ఆయన చెప్పారు. టీడీపీ మంత్రులు, ఇతర నేతలు కేవలం బాబును సంతృప్తి పరిచేందుకే జగన్ పై విమర్శలు సంధిస్తున్నారని, ప్రత్యేక హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని సురవరం స్పష్టం చేశారు. హోదాపై బీజేపీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, ఆ పార్టీపై ఒత్తిడి పెరిగేలా చంద్రబాబు.. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు. -
జగన్ దీక్షకు మద్దతుగా మహిళల పూజలు
-
వైఎస్ జగన్ దీక్షకు ఉత్తరాంధ్ర మద్దతు
-
వైఎస్ జగన్ దీక్షకు సంఘీభావం
-
వైఎస్ జగన్ దీక్షకు సంఘీభావం
- ప్రత్యేక హోదా కోసం రేపటి నుంచి జననేత నిరవధిక నిరాహారదీక్ష - గుంటూరులోని నల్లపాడులో దీక్షా శిబిరం ఏర్పాట్లు పూర్తి - ప్రత్యేక హోదా ఆవశ్యకతపై వైఎస్సార్ సీపీ శ్రేణుల విస్తృత ప్రచారం - గుంటూరులో రౌండ్‌టేబుల్ సమావేశం - పాల్గొన్న విద్యార్థి, యువజన, సేవా సంఘాల నేతలు గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టనున్న నిరవధిక నిరాహారదీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి (అక్టోబర్ 7) గుంటూరులోని నల్లపాడులో జరగనున్న దీక్షలో పాల్గొని వైఎస్ జగన్ కు సంఘీభావం తెలిపేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు, కార్యకర్తలు గుంటూరుకు పయనమవుతున్నారు. వైఎస్ జగన్.. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం నల్లపాడులోని దీక్షా శిబిరానికి బయలుదేరుతారు. మొదట గత నెల 26 నుంచి గుంటూరులో చేపట్టాలని భావించిన దీక్షకు రాష్ట్ర ప్రభుత్వం ఆటంకం కలిగించినప్పటికీ కార్యకర్తలు, నాయకులు రెట్టించిన ఉత్సాహంతో దీక్షకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, సీనియర్‌నేత బొత్ససత్యనారాయణ ప్రత్యక్షంగా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు, మండల, గ్రామస్థాయి నాయకులు ప్రత్యేక హోదాపై విస్త్రత ప్రచారం చేస్తున్నారు. దీక్ష విజయానికి కార్యకర్తలు ప్రజలను సమాయత్తం చేస్తున్నారు. దీక్షకు మద్దతు.. సోమవారం గుంటూరు పట్టణంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి విజయసాయిరెడ్డి, మాజీ కేంద్రమంత్రి, ఎమ్మెల్సీ ఉమ్మారె డ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉప్పులేటి కల్పన, జిల్లా, నగర అధ్యక్షులు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి సహా పలు విద్యార్థి, యువజన, సేవాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొని జగన్ చేపట్టనున్న దీక్షకు సంఘీభావం పలికారు. ఓటుకు కోట్లు కేసుల్లో ఇరుక్కున చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజిపై కేంద్రంపై వత్తిడి తీసుకురావడం లేదని, స్వప్రయోజనాల కోసం ప్రజల శ్రేయస్సును తాకట్టుపెడుతున్నారని వారంతా దుయ్యబట్టారు. ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు దీక్షకు మద్దతుగా నిలుస్తామని ప్రతినబూనారు. -
నల్లపాడు రోడ్డులో వైఎస్ జగన్ దీక్ష
-
హామీలు..పట్టాలెక్కేనా..?
ప్రతి ఏటా రైల్వే బడ్జెట్లో జిల్లాకు అరకొర కేటాయింపులతోనే సరిపుచ్చుతున్నారు. దీంతో గత కొన్నేళ్లుగా జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లా నుంచి ఇద్దరు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నా.. వారి ప్రతిపాదనలను కేంద్రం ఏ మాత్రం పట్టించుకోలేదు. పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రైల్వే ప్రాజెక్టులు రావడం లేదన్న అభిఫ్రాయం ఉంది. అప్పుడెప్పుడో ఇందిరాగాంధీ కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు కూడా మోక్షం కలగడం లేదు. ఇక కేంద్రం కేటాయించిన నిధులు రైల్వే లైన్ల సర్వేకే సరిపోతున్నాయి తప్ప రైలు మార్గాల నిర్మాణానికి చాలడం లేదు. నెలకు రూ.40లక్షల ఆదాయం నల్లగొండ మీదుగా నిత్యం 12 రైళ్లు రెండు సార్లు రాకపోకలు సాగిస్తున్నా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని సమయాల్లో రైలులో కాలు పెట్టడానికి కూడా స్థలం దొరకడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నల్లగొండ రైల్వే స్టేషన్ ద్వారా నిత్యం 1500 జనరల్ టికెట్లు, రెండు వేల వరకు రిజర్వేషన్ టికెట్లు అమ్ముడవుతుంటాయి. వీటి ద్వారా రైల్వే శాఖకు నెలకు రూ.40 లక్షల వరకు ఆదాయం సమకూరుతుంది. అయినా కేంద్రం రైల్వే స్టేషన్‌కు బడ్జెట్లో మొండిచేయి చూపిస్తోంది. సింగిల్ లైన్ మార్గం వల్ల రైళ్ల రాకపోకలు ఇబ్బంది కరంగా మారింది. గుంటూరు, విజయవాడ మీదుగా సికింద్రాబాద్ వైపు వెళ్లే రైళ్లు జిల్లా కేంద్రానికి రాకముందే ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. హైదరాబాద్ నుంచి జిల్లా మీదుగా మిర్యాలగూడ వరకు వెళ్లే ప్యాసింజర్ రైలు నడికుడి వరకు పొడగించారు. దీంతో తిరిగి రైలు జిల్లాకు వచ్చే సరికి నిండిపోతుంది. పూణే-భువనేశ్వర్-కాకినాడ-భావన్‌నగర్ వరకు ప్రస్తుతం వారానికోసారి రైళ్లు వెళ్తున్నాయి. వాటిని ప్రతి రోజు నడిపిస్తే సౌకర్యంగా ఉంటుంది. డబ్లింగ్, విద్యుదీకరణకు చోటు దక్కేనా.. బీబీనగర్-నల్లపాడు రైల్వే లైన్ డబ్లింగ్, విద్యుదీకరణ జిల్లా ప్రజల చిరకాల స్పప్నంగా మారింది. డబ్లింగ్తో పాటు విద్యుద్దీకరణ చేపట్టాలని జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యులు గతంలో ప్రతిపాదనలు పెట్టినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అంతే కాకుండా మిర్యాలగూడ రైల్వేస్టేషన్‌ను ఆదర్శ స్టేషన్‌గా గుర్తించాలనే డిమాండ్‌ను సైతం గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కాగా బీబీనగర్-నల్లపాడు వరకు డబ్లింగ్ పనులకు రెండేళ్ల క్రితం సర్వే కోసం ప్రతిపాదనలు చేశారు. కానీ నిధులు మాత్రం విడుదల చేయలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో కొత్తగా వేసిన మొట్టమొదటి రైల్వే లైన్ ఇదే. రైళ్ల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండటం వల్ల సింగిల్ లైన్‌తో ఇక్కట్లు ఎదురవుతున్నాయి. మిర్యాలగూడ నుంచి సికింద్రాబాద్ వెళ్లాలంటే నాలుగు గంటల సమయం పడుతుంది. డబ్లింగ్‌లో పాటు విద్యుదీకరణ చేస్తే గంటల తరబడి క్రాసింగ్‌లో పెట్టే పరిస్థితి నుంచి ప్రయాణికులకు ఉపశమణం కలుగుతుంది. ఈసారైనా నిధులు మంజూరయ్యేనా అని ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. ఎంఎంటీఎస్ వచ్చేనా..? ఎంఎంటీఎస్ రైళ్లను భువనగిరి వరకు పొడిగించాలని ఇక్కడి ప్రజలు ఎంతోకాలంగా కోరుతున్నారు. రెండేళ్ల క్రితం బడ్జెట్లో ఎంఎంటీఎస్(మల్టీ మోడ ల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్) రైళ్లను రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించిన అధికారులు ఇంతవరకు పనులు ప్రారంభించలేదు. దీంతో మూడో దశలో ఉన్న భువనగిరికి ఎంఎంటీఎస్ రైళ్లు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఘట్కేసర్కు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న భువనగిరికి ఎంఎంటీఎస్ రైళ్ల ఆవశ్యకత ఎంతో ఉంది. పెరుగుతున్న పారిశ్రామికీకరణ, వైద్య, విద్యా సౌకర్యాలు, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఎంఎంటీఎస్ రైళ్ల అవసరం ఎంతో పెరిగింది.