
సాక్షి, అమరావతి : ప్రపంచంలోనే అత్యంత ఉత్తమ రాజధానిని నిర్మిస్తామంటూ ప్రకటనలతో ఊదరగొట్టే ఏపీ సర్కార్... అమరావతిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణంలో అభాసుపాలైన విషయం తెలిసిందే. నాసిరకం పనుల కారణంగా కొద్దిపాటి వర్షానికే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఛాంబర్‌తో పాటు, మంత్రుల కార్యాలయాల్లోకి వర్షపు నీరు చేరడం తెలిసిందే.
తాజాగా రాజధానిలోని నేలపాడులోతాత్కాలిక హైకోర్టు భవనం నిర్మాణంలోనూ డొల్లతనం బయటపడింది. జనరేటర్‌కు సంబంధించి నిర్మాణంలో ఆరు గదుల్లో రెండు గదుల స్లాబ్ కూలింది. ఈ సంఘటనలో నలుగురు కార్మికులు గాయపడ్డారు. వీరిని తాడేపల్లి సమీపంలోని ఎన్‌ఆర్ఐకి ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఉదయం పనులు చేస్తుండగా గోడ కూలినట్లు కార్మికులు తెలిపారు. కార్మికులంతా జార్ఖండ్‌కు చెందినవారు. అయితే ఈ సంఘటనను మీడియా ప్రతినిధులు చిత్రీకరించేందుకు వెళ్లగా, వారిని అక్కడ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment