roof collapse
-
Video: డ్యాన్స్ షో చూస్తుండగా కూలిన పైకప్పు.. వందలాది మందికి గాయాలు
పాట్నా: బీహార్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మహావీర్ మేళా సందర్భంగా నిర్వహించిన సంగీత కార్యక్రమంలో ఉన్నట్టుండి ఓ ఇంటి పైకప్పు కూలడంతో అనేకమందికి గాయాలయ్యాయి. ఛప్రా నగరంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఇషావ్పూర్ బ్లాక్‌లో మహావీర్ అఖారా ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన డ్యాన్స్ ప్రదర్శనను చూసేందుకు వేల సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. వేదిక చుట్టూ, రోడ్డు మీద మొత్తం గుమిగూడారు. వీరిలో చాలా మంది భవనాల పైకప్పులపైకి, రోడ్డుపక్కన బాల్కనీలు, చెట్లపైకి ఎక్కారు. ఈ క్రమంలో వందల మంది ఎక్కడంతో శిథిలావస్థకు చేరిన ఓ ఇంటి పైకప్పు అకస్మాత్తుగా కూలిపోయింది.పైకప్పు పైన నిలబడి ఉన్న వందలాది మంది వ్యక్తులు కిందపడిపోయారు. ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన జనం గట్టిగా అరుస్తూ పరుగులు తీశారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. The roof collapsed in Chapra, Bihar, injuring 100 people.#Bihar #Chhapra #RoofCollapse @bihar_police @officecmbihar @ChapraZila pic.twitter.com/PvBT1mno4d— Payal Mohindra (@payal_mohindra) September 4, 2024 వందలాది మంది ప్రజలు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. రూఫ్ కూలుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
Delhi Rains: ఢిల్లీ విమానాశ్రయంలో కూలిన పైకప్పు
న్యూఢిల్లీ: భారీ వర్షాలకు దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ జాతీయ విమానాశ్రయంలో టెరి్మనల్ 1 (పాతది) పై కప్పు పాక్షికంగా కుప్పకూలింది. కొంత భాగం కూలి నేరుగా కింద ఉన్న కార్లపై పడింది. దాంతో రమేశ్ కుమార్ (43) అనే ట్యాక్సీ డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. ఆరుగురు గాయపడ్డారు. శుక్రవారం ఉదయం 5:30 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. అగి్నమాపక యంత్రాలు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టాయి. కూలిన బీమ్ల కింద ఉన్న కారులోంచి ఒకరిని కాపాడారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ‘‘శుక్రవారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షంతో రూఫ్ షీట్, సపోర్ట్ బీమ్‌లు కూలాయి. పార్క్ చేసిన 4 కార్లు దెబ్బతిన్నాయి’’ అని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో టెరి్మనల్ 1 నుంచి అన్ని విమాన సేవలనూ నిలిపివేశారు. చెకిన్ కౌంటర్లను కూడా మూసేశారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమానాల్లో వసతి కలి్పంచారు. కొందరికి టికెట్ డబ్బులు తిరిగిచ్చారు. ఈ టెరి్మనల్లో ఇండిగో, స్పైస్‌జెట్ దేశీయ విమాన కార్యకలాపాలు సాగిస్తాయి. అవి కార్యకలాపాలను తాత్కాలికంగా టెరి్మనల్ 2, 3కి మార్చాయి. విస్తరించిన టెరి్మనల్ 1ను ప్రధాని మోదీ మార్చిలో ప్రారంభించారు. పూర్తిస్థాయి విచారణ: కింజరాపు పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు టెరి్మనల్ 1ను సందర్శించారు. అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించినట్టు చెప్పారు. మృతుని కుటుంబానికి రూ.20 లక్షలు, క్షతగాత్రులకు రూ.3 లక్షల పరిహారం ప్రకటించారు.ప్రచార యావ వల్లే: ప్రతిపక్షాలు మోదీ సర్కారు ప్రచార యావ వల్లే టెరి్మనల్ పై కప్పు కూలిందని విపక్షాలు ఆరోపించాయి. నిర్మాణం పూర్తవకుండానే లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం మోదీ దాన్ని హడావుడిగా ప్రారంభించారంటూ ఆప్ దుయ్యబట్టింది. ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యమే దీనికి కారణమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. -
గాలి వాన బీభత్సం.. ఢిల్లీ ఎయిర్ పోర్టు లో కుప్పకూలిన రూఫ్
-
దేశంలో వరుస ఘటనలు.. ప్రకృతి పరంగా కొన్ని.. ప్రమాదాలు మరికొన్ని
ఇటీవల ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు వంటి ఊహించని ప్రమాదాలు కొన్ని అయితే, మానవ తప్పిదాలతో జరిగే ఘటనలు మరికొన్ని.. మధ్యకాలంలో గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో అత్యంత తీవ్రతతో ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వీటిలో ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించినవి కూడా ఉన్నాయి. వరుస ఘటనలతో ఎటునుంచి ఏ ప్రమాదం పొంచి వస్తుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఢిల్లీ ప్రగతి మైదానం సొరంగంలో పగుళ్లుసెంట్రల్ ఢిల్లీని నగర తూర్పు ప్రాంతాలతో అనుసంధానం చేస్తూ.. రూ. 777 కోట్లతో ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్ ప్రాజెక్ట్‌ను కేంద్రం చేపట్టింది.. ఇందులో భాగంగా 1.3 కి.మీ. పొడవైన సొరంగం, ఐదు అండర్‌పాస్‌లు నిర్మించారు. 2022 జూన్‌లో ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ టన్నెల్లో నీళ్లు నిలిచిపోవడం, పగుళ్లు రావడం వంటి అనేక లోపాలు వెలుగుచూశాయి. పనుల్లో జాప్యం, నిర్వహణ లేమీ కారణంగా సమస్యలు తలెత్తాయి. అనంతం మళ్లీ కోట్ల రూపాయలతతో డిజైన్‌ను సరిదిద్ది, మరమ్మతులు చేశారు.జలమయంగా మారిన అయోధ్యఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరంలో వర్ష బీభత్సం కారణంగా రోడ్లపై మోకాళ్ల వరకు నీరు నిలిచిపోయింది. రామమందీర్ సమీపంలోని ఇళ్లలోకి మురుగునీరు చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామమందిరం చుట్టూ హడావిడిగా నిర్మాణ పనులు చేపట్టడంతోనే ఇళ్లలోకి నీళ్లు వచ్చాయని స్థానికులు అంటున్నారు.మరోవైపు ధ్యలో నిర్మించిన రామమందిరం ప్రారంభోత్సవం జరుపుకొని సరిగ్గా ఆరు నెలలు కూడా పూర్తి కాకముందే.. ప్రధాన గర్భాలయంలో నీరు లీకవడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. చిన్నపాటి వర్షానికే ఆలయం నుంచి నీరు కారుతోందని ఆలయ ప్రధాన ఆర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ పేర్కొన్నారు. రామ్‌లల్లా విగ్రహం ముందు పూజారి కూర్చునే స్థలం, వీఐపీ దర్శనం కోసం భక్తులు వచ్చే ప్రదేశం వరకూ పైకప్పు నుంచి వర్షపు నీరు లీక్ అవుతోందన్నారు.ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దేవాలయం పైకప్పు లీక్ అవడం ఆశ్చర్యంగా ఉందని, ఇలా ఎందుకు జరిగిందని విస్మయం వ్యక్త ంచేశారు. ఇంత పెద్ద ఇంజనీర్ల సమక్షంలోనే ఇలాంటి ఘటన జరగడం చాలా పొరపాటుగా పేర్కొన్నారు.అయితే గర్భగుడి నుంచి వర్షపు నీరు లీకవుతోందన్న వార్తలపై రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా స్పందించారు. ఈ మేరకు ఆలయ ప్రధాన పూజారి ఆరోపణలను తోసిపుచ్చారు. పైకప్పు లీక్ కాలేదని, విద్యుత్ తీగల కోసం అమర్చిన పైపుల ద్వారా నీరు కిందకు వచ్చిందని వివరించారు. జబల్పూర్ ఎయిర్ పోర్టు ప్రమాదంమధ్యప్రదేశ్లోని జబల్పూర్ దుమ్నా ఎయిర్‌పోర్ట్‌లో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షాలు కారణంగా టెర్మినల్ రూఫ్‌టాప్ పడిపోయింది. పార్కు చేసిన కారు మీద పడడంతో నుజ్జునుజ్జు అయింది. ప్రమాదానికి కొద్ది సేపటి క్రితమే కారులోంచి ఆదాయపు పన్ను అధికారి, డ్రైవర్ కిందకి దిగారు. లేదంటే ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి.ఇక ఈ విమానాశ్రాయాన్ని కొన్ని నెలల క్రితమే రూ.450 కోట్ల వ్యయంతో పునరుద్ధరించారు. కానీ గురువారం కురిసిన వర్షానికి అతలాకుతలం అయింది. దీంతో నాణ్యతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.ఢిల్లీ ఎయిర్‌పోర్టు టెర్మినల్‌లో కూలిన రూఫ్ఈ ఘటన జరిగిన ఒక్క రోజుకే ఢిల్లీలోని విమానాశ్రయంలోని టెర్మినల్-1లో పైకప్పు కూలింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు ఘటనాస్థలానికి చేరుకున్న పొలిసు బృందాలు సహాయక చర్యలు అందిస్తున్నాయి. టెర్మినల్ 1లో ప్రమాదం జరగడంతో పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.అయితే ఎయిర్ పోర్టును నిర్మించిన కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు. నాసిరకం మెటీరియల్‌తో ఎయిర్ పోర్టును నిర్మించిన కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఢిల్లీలో బీభత్సం సృష్టించిన గాలి వాన
-
ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రమాదానికి కారణం అదేనా?.. వీడియో వైరల్
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ విమానాశ్రయంలో టెర్మినల్-1 పైకప్పు శుక్రవారం తెల్లవారుజామున కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం సందర్బంగా టెర్మినల్ పైకప్పు ట్యాక్సీలు సహా పలు కార్లపై పడిపోవడంతో వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి.అయితే, భారీ వర్షం నేపథ్యంలో టెర్మినల్ పైకప్పు కూలినట్లు తమకు ఉదయం 5:30 గంటల సమయంలో సమాచారం అందినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, ఇదురుగాలుల కారణంగా పైకప్పు కూలినట్టు తెలిపారు. మరోవైపు.. టెర్మినల్ పైకప్పుపై పెద్ద మొత్తంలో వరద నీరు ఆగిపోయింది. పైకప్పునకు ఉన్న లీకేజీల కారణంగా కొన్ని గంటల పాటు వర్షపు నీరు కిందకు పారుతూనే ఉంది. ఈ కారణంగానే పైకప్పు కూలిపోయిందని తెలుస్తోంది. Airport Scenes #DelhiRains pic.twitter.com/yzXzzLheFC— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) June 27, 2024ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు టెర్మినల్1 నుంచి బయలుదేరే అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు ప్రకటించారు. కూలిన టెర్మినల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.మరోవైపు ప్రమాదంపై ఎక్స్ ద్వారా స్పందిన కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు.. కాసేపటికే ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ ప్రమాదంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘భారీ వర్షాల కారణంగా ఎయిర్‌పోర్టు వెలుపల ఉన్న రూఫ్ భాగం కొంత భాగం కూలిపోయింది. ఈ విషాద ఘటనలో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాం. అలాగే గాయపడిన నలుగురికి మెరుగైన వైద్యం అందించే ప్రయత్నాలు చేస్తున్నాం. ఘటన జరిగిన వెంటనే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, ఫైర్ సేఫ్టీ టీమ్‌ను ఇక్కడికి పంపించాం. ప్రమాద నేపథ్యంలో టెర్మినల్ భవనంలోని మిగిలిన భాగాన్ని మూసివేశారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంతా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు అని తెలిపారు. #WATCH | On portion of canopy collapsed at Delhi airport's Terminal-1, Union Minister of Civil Aviation Ram Mohan Naidu Kinjarapu says, "...we are taking this incident seriously...I want to clarify that the building inaugurated by PM Narendra Modi is on the other side and the… pic.twitter.com/ahb6d9ujc0— ANI (@ANI) June 28, 2024 -
కార్మిక క్షేత్రంలో విషాదం: ‘బావ.. ఒక్కసారి లే.. నీ కొడుకును ఎత్తుకో..’
శ్రీరాంపూర్/నస్పూర్/జన్నారం/మంచిర్యాలరూరల్(హాజీపూర్): శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పీ 3 బొగ్గు గనిలో జరిగిన ప్రమాదం కార్మిక క్షేత్రంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బుధవారం మొదటి షిఫ్టులో జరిగిన గని ప్రమాదంలో పట్టణంలో నివాసం ఉంటున్న నలుగురు కార్మికులు మృతిచెందారు. విషయం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు గని వద్ద విలపించిన తీరు పలువురు కార్మికులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. గని ప్రమాదంలో మృతిచెందిన కార్మికులది ఒక్కొక్కరిది ఒక్కో విషాదగాథ.. సైకిల్‌పైనే డ్యూటీకి... ఒంటెల క్రిష్ణారెడ్డి ఆర్కే 8 కాలనీ నివాసి. ఇతను అనారోగ్య కారణాలతో కారుణ్య ఉద్యోగాల కోసం మెడికల్ బోర్డుకు వెళ్లాడు. ఐతే బోర్డు ఆయన్ను తిరిగి ఫిట్ ఫర్ సేమ్ జాబ్ ఇవ్వడంతో వచ్చి డ్యూటీ చేస్తున్నారు. మంచి సౌమ్యుడిగా పేరు. ఎప్పుడు సైకిల్‌పైనే తిరిగే వాడని, డ్యూటీకి కూడా సైకిల్ మీదనే వచ్చే వాడని పేరుంది. ఇతనికి భార్య సత్యవతి, కొడుకులు రాజేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. అన్‌ఫిట్ అయితే కొడుకు ఉద్యోగం వస్తుందని ఆశ పడితే బోర్డు ఫిట్ ఇవ్వడంతో అటు కొడుకు ఉద్యోగం ఆశ నెరవేరక, ఇటూ ఇంటి పెద్దప్రాణాలు నిలువక ఆ కుటుంబంలో తీవ్ర విషాదం మిగిలింది. శాశ్వత విశ్రాంతి మిగిలింది బేర లక్ష్మయ్య ఈ సంవత్సరం జూలైలో రిటైర్డ్ అయ్యారు. విశ్రాంతి తీసుకుందామనుకుంటే కంపెనీ తిరిగి ఒక సంవత్సరం సర్వీసు పెంచడంతో తిరిగి ఆగస్టులో ఉద్యోగంలో చేరారు. నస్పూర్ షిర్కేలో కుటుంబం నివాసం ఉంటుంది. తన జీవిత కాలంలో ఏ ప్రమాదం జరగకుండా బయటపడి.. మళ్లీ డ్యూటీలో చేరాక ప్రమాదంలో మృతి చెందడం అందర్నీ కలచివేసింది. ఇతనికి భార్య, కొడుకులు శ్రీధర్, శ్రీకాంత్, కూతురు సుమలత ఉన్నారు. స్నేహితుడి రూంలో ఉంటూ.. గడ్డం సత్యనర్సింహారాజు స్వస్థలం ఇల్లెందు. ఉద్యోగం చేరి సంవత్సరం దాటింది. పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడు అయితడనే మురిపం తీరకుండానే బాయి ప్రమాదం పొట్టనపెట్టుకోవడం వారికుటుంబాల్లో విషాదం నింపింది. తల్లిదంద్రులు రాజు, రమాదేవి ఇల్లందులోనే ఉంటారు. నర్సింహారాజు మంచిర్యాల సున్నంబట్టి వాడలో స్నేహితుడి రూంలో ఉంటూ డ్యూటీకి వస్తుంటాడు. చంద్రశేఖర్ మృతదేహం వద్ద రోదిస్తున్న చెల్లెలు.. ఇన్సెట్లో చంద్రశేఖర్ (ఫైల్ ఫొటో) అరిన ఆశాదీపం.. రెండ చంద్రశేఖర్ తండ్రి పోశం సింగరేణిలో పని చేసి మెడికల్ అన్‌ఫిట్ కావడంతో ఆయన స్థానంలో కారుణ్య ఉద్యోగం వచ్చింది. రెండేళ్లుగా సింగరేణిలో చేస్తున్నారు. ఇతనికి భార్య నవ్య, ఐదు నెలల ముద్దుల కొడుకు ఉన్నాడు. కొడుకుతో మురిపం తీరలేదు. కారుణ్య ఉద్యోగంతో ఆ ఇంటికి ఆశాదీపంగా ఉంటానుకున్న తన కొడుకు బాయి ప్రమాదం విగతజీవున్ని చేసిందని చంద్రశేఖర్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. బావా.. నీ కొడుకును ఎత్తుకోవా..? ఆ పసి మనసుకు ఏం తెలుసు? నాన్న చనిపోయాడని..? అమ్మ ఎందుకు ఏడుస్తుందోనని...? అమ్మ ఎన్ని సార్లు పిలిచిన నాన్న రావడం లేదని.. మృతుల్లో ఒకరైన యువ కార్మికుడు రెంక చంద్రశేఖర్ ఐదు నెలల కుమారుడి చూపులు ఆ పరిసరాల్లో వర్ణణాతీత విషాదాన్ని నింపింది. ఊహ తెలియని వయస్సులో తండ్రిని కోల్పోయిన ఆ చిన్నారిని చూసిన వారందరికీ దుఃఖం కడుపులోంచి తన్నుకొచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడి భార్య నవ్య ‘‘ఓ బావ, నీ కొడుకును ఎత్తుకోవా.. నీ కోసం చూస్తున్నాడు... బావ.. ఒక్కసారి లే.. బావ ఒక్కసారి లే..’’ అంటూ తల్లడిల్లిన తీరు అందరినీ కలచి వేసింది. (గని పైకప్పు కూలి... నలుగురు కార్మికులు మృతి) -
శ్రీరాంపూర్ భూగర్భగనిలో ప్రమాదం
-
సింగరేణిలో విషాదం: రూఫ్ కూలి ఇద్దరు దుర్మరణం
జయశంకర్ భూపాలపల్లి: సింగరేణి బొగ్గుగనుల్లో విషాదం ఏర్పడింది. పనులు చేస్తున్న సమయంలో బండ కూలడంతో ఇద్దరు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లిలోలోని కాకతీయ 6వ బొగ్గు గనిలో జరిగింది. అయితే చీకటి పడడంతో వారికి సహాయక చర్యలు చేపట్టడానికి ఆలస్యమైంది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రస్తుతం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని తెలుస్తోంది. కాకతీయ 6వ బొగ్గు గనిలో 2వ షిఫ్ట్‌లో విధులు నిర్వహించేందుకు సపోర్ట్ మెయిన్ కార్మికులు శంకరయ్య నరసయ్య వచ్చారు. పనులు చేస్తున్న సమయంలో పై నుంచి ఒక్కసారిగా బండ (రూఫ్) కూలి వారిద్దరిపై పడింది. తీవ్ర గాయాలపాలయ్యారు. దీన్ని గుర్తించి వెంటనే తోటి కార్మికులు, అధికారులు స్పందించి వారిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సహాయక చర్యలు చేపడుతున్న సింగరేణి అధికారులు చేపట్టారు. చీకటి పడడంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి మృతదేహాలను లోపలి నుంచి బయటకు తీసుకొచ్చేందుకు సింగరేణి అధికారులు చర్యలు చేపట్టారు. -
కూలిన బ్యాంకు పైకప్పు..
షోలాపూర్ : బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు చెందిన భవనం పైకప్పు కూలిన ఘటనలో 20 మందికి పైగా శిథిలాల్లో చిక్కుకున్నారు. ఈ ఘటన షోలాపూర్‌కు సమీపంలోని కర్మాలాలో బుధవారం చోటుచేసుకుంది. సమచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల్లో చిక్కుకున్న 10 మందిని సహాయ బృందాలు రక్షించాయి. మిగతా వారిని కూడా బయటకు తీసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ విషయం తెలియగానే స్థానికులు పెద్ద ఎత్తున బ్యాంకు వద్దకు చేరుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
18వ అంతస్తుపై సాహసం చేస్తూ..
ముంబై : సాహసం చేయడానికి ప్రయత్నించి ఓ యువకుడు 18 అంతస్తులపైనుంచి కిందపడి మృతిచెందాడు. సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని క్విన్‌యాంగ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 19 ఏళ్ల యాంగ్ అనే యువకుడు 18 అంతస్తుల భవనం చివర చిన్నగోడపై నిలబడి సాహసం చేయడానికి ప్రయత్నించి ప్రమాదవశాత్తు కిందపడి మరణించాడు. ఆ సమయంలో ఎదురుగా ఉన్న భవనం నుంచి ఓ వ్యక్తి వీడియో తీయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. గోడ రూఫ్ కూలిపోవడంతో యువకుడు ఒక్కసారిగా కిందకుపడిపోయాడు. రూఫ్‌టాప్ నిర్మాణంలో నాణ్యత లేకపోవడం వల్ల ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. సెల్ఫీ పిచ్చితోనో లేక సాహసాల పేరుతోనో ప్రాణాలు కోల్పోవొద్దని సందేశమిస్తూ ఏప్రిల్ 22న జరిగిన ఈ ఘటనకు సంబంధించి వీడియోను ముంబై పోలీసులు ట్వీట్ చేశారు. దీంతో ఈవీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. డేరింగ్ సెల్ఫీ కోసం ప్రయత్నం చేస్తున్నారా? బాధ్యత లేకుండా సాహసాలు చేస్తున్నారా ? చేసేదేదైనా మీకు మిగిలేది రిస్క్ మాత్రమే అంటూ హెచ్చరించారు. సేఫ్టీ ఫస్ట్ అనే హ్యాష్ ట్యాగ్‌తో ముంబైపోలీసులు ఈ పోస్ట్ పెట్టారు. -
సాహసం చేస్తూ 18 అంతస్తుల పైనుంచి పడి..
-
అంగన్వాడీ చిన్నారులకు తప్పిన ప్రమాదం
అనంతపురం, కూడేరు: కూడేరులో 3వ అంగన్వాడీ కేంద్రంలో గురువారం చిన్నారులకు ప్రమాదం తప్పింది. అంగన్వాడీ కేంద్రం భవనం పైకప్పు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఈ క్రమంలోనే గురువారం చిన్నారులు కూర్చొని ఉండగా పైకప్పు నుంచి సిమెంట్ పెచ్చులూడి కింద పడ్డాయి. పొరపాటున పిల్లల తలమీద పడి ఉంటే చిన్నారులు ప్రమాదానికి గురయ్యే వారు. ఇంతకు మునుపు కూడా పిల్లలు లేని సమయంలో పెచ్చులూడి కింద పడ్డాయి. కేంద్రంలో 20 మంది చిన్నారులు, అంగన్వాడీ కార్యకర్త, ఆయా ఉంటారు. పెచ్చులూడుతున్న గదిలో కూర్చోవాలంటేనే పిల్లలు, గర్భవతులు, బాలింతలు, సిబ్బంది భయపడుతున్నారు. పెచ్చులూడి ఎప్పుడు మీద పడతాయోనని భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైన సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి నూతన అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మించాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
కూలిన ఏపీ హైకోర్టు జనరేటర్ రూం గోడ
సాక్షి, అమరావతి : ప్రపంచంలోనే అత్యంత ఉత్తమ రాజధానిని నిర్మిస్తామంటూ ప్రకటనలతో ఊదరగొట్టే ఏపీ సర్కార్... అమరావతిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణంలో అభాసుపాలైన విషయం తెలిసిందే. నాసిరకం పనుల కారణంగా కొద్దిపాటి వర్షానికే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఛాంబర్‌తో పాటు, మంత్రుల కార్యాలయాల్లోకి వర్షపు నీరు చేరడం తెలిసిందే. తాజాగా రాజధానిలోని నేలపాడులోతాత్కాలిక హైకోర్టు భవనం నిర్మాణంలోనూ డొల్లతనం బయటపడింది. జనరేటర్‌కు సంబంధించి నిర్మాణంలో ఆరు గదుల్లో రెండు గదుల స్లాబ్ కూలింది. ఈ సంఘటనలో నలుగురు కార్మికులు గాయపడ్డారు. వీరిని తాడేపల్లి సమీపంలోని ఎన్ఆర్ఐకి ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఉదయం పనులు చేస్తుండగా గోడ కూలినట్లు కార్మికులు తెలిపారు. కార్మికులంతా జార్ఖండ్‌కు చెందినవారు. అయితే ఈ సంఘటనను మీడియా ప్రతినిధులు చిత్రీకరించేందుకు వెళ్లగా, వారిని అక్కడ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. -
విద్యార్థులకు త్రుటిలో తప్పిన ప్రమాదం
విశాఖపట్నం , నాతవరం(నర్సీపట్నం): మండలంలో సరుగుడు పంచాయతీ శివారు రామన్నపాలెం గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల భవనం శ్లాబుపెచ్చులూడి పడ్డాయి. అయితే ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. వివరాలు ఇలా ఉన్నాయి ఈ పాఠశాల భవనాలు చాలా కాలంగా శిథిలావస్థలో ఉన్నాయి.శిథలమైన భవనంలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ ఆశ్రమ పాఠశాలలో 201 మంది విద్యార్థులు చదువుతున్నారు. పెథాయ్ తుపాను కారణంగా రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా మంగళవారం శ్లాబు పెచ్చులూడి కిందపడ్డాయి. తరగతులు నిర్వహిస్తుండగా ఈ సంఘటన జరిగింది. విద్యార్థులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఎంఈవో తాడి అమృత్‌కుమార్ పాఠశాలను పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. శిథిలమైన భవనాల్లో తరగతులు నిర్వహించరాదని హెచ్ఎం మణిగోల్డ్‌కు అదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడతూ 1977లో ఈ పాఠశాల భవనాలు నిర్మించారని, అవి పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయని చెప్పారు. కొత్త భవనాల కోసం పాడేరు ఐటీడీఏ పీవో ప్రతిపాదించినట్టు చెప్పారు. -
బడిలో భయం భయం
ధర్మవరం: నియోజవకర్గంలో మొత్తం 244 ప్రభుత్వ పాఠశాలల్లో 22,492 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మొత్తం పాఠశాలల భవనాల్లో 60 శాతం బడుల్లో తరగతి గదుల పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, భయం భయంగానే పాఠాలు చెబుతున్నారని అధికారులు గుర్తించారు. పాఠశాల నిర్మాణాలపై చెత్తాచెదారం పేరుకపోవడం, వర్షపునీరు నిల్వ ఉండటం వల్ల నీరు గోడల్లోకి ఇంకి ఇనుము తుప్పు పట్టి పెచ్చులు లేశాయని చెబుతున్నారు. నియోజకవర్గంలో పరిస్థితి ఇలా..! ♦ తాడిమర్రి మండల పరిధిలోని తురకవారిపల్లి, నార్సింపల్లి ప్రాథమిక పాఠశాలల్లో మూడు గదులు, బీసీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో ఒక గది, పుల్లానారాయణపల్లి పాఠశాలలో ఒక గది పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ♦ ముదిగుబ్బ మండల కేంద్రంలో 4 పాఠశాలలతోపాటు గంగిరెడ్డిపల్లి, రాళ్లనంతపురం, సంకేపల్లి, ఒడ్డుకిందతాండా, రామస్వామి తాండా, నాగలగుబ్బల, యాకర్లకుంటపల్లి, బ్రహ్మదేవమర్రి, కోటిరెడ్డిపల్లి, కొండగట్టుపల్లి, ఎన్ఎస్పీ కొట్టాల, అడవి బ్రాహ్మణపల్లి తాండాల్లోని పాఠశాలల్లో తరగతి గదుల పరిస్థితి అధ్వానంగా ఉందని, వాటికి తక్షణమే మరమ్మత్తులు చేయించాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. ♦ ధర్మవరం పట్టణంలో 13, ధర్మవరం మండల పరిధిలో 8 పాఠశాలల్లో తరగతి గదుల పరిస్థితి అధ్వానంగా ఉందని, మరమ్మతులు చేయించాలని అధికారులు ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలిసింది. ♦ బత్తలపల్లి మండలంలో ముద్దనపల్లి, వేల్పుమడుగు, పోట్లమర్రి వెంకటగారిపల్లి, మాల్యవంతం, ఎం.చెర్లోపల్లి, తంబాపురం, కోడేకండ్ల, జలాలపురం, రాఘవంపల్లి గ్రామాల్లో తరగతి గదులు పెచ్చులూడుతూ ప్రమాదకరంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అదేవిధంగా మండల కేంద్రంలోని ఎమ్మార్సీ భవనం కూడా శిథిలావస్థకు చేరుకుంది. ఆయా పాఠశాలల పరిస్థితి గురించి ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు ఎంఈఓ తెలిపారు. తరగతి గది పెచ్చులూడిపడి విద్యార్థికి గాయాలు తాడిమర్రి: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి గదిలో పైకప్పు పెచ్చులూడి మీద పడటంతో ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ధర్మవరం మండలం పోతుకుంటకు చెందిన స్థానిక ఎస్సీ హాస్టల్ విద్యార్థి సాకే.నరేంద్ర మధ్యాహ్నం 2గంటల సమయంలో తోటి విద్యార్థులతో కలిసి తరగతిలో పాఠాలు వింటుండగా పైకప్పు పెచ్చులూడి అతనిపై పడింది. ఆ విద్యార్థి తలకు తీవ్రగాయం కావడంతో క్లాస్‌లో ఉన్న హిందీ టీచర్ చంద్రకళ, ఇతర ఉపాధ్యాయులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. కంప్యూటర్ గది కావడం వల్లే... తొమ్మిదో తరగతి విద్యార్థులకు క్లాస్‌రూం మొదటి అంతస్తులో ఉన్ననప్పటికీ వాళ్లు అక్కడ అల్లరి చేస్తుండటంతో కిందున్న కంప్యూటర్ గదిలో వాళ్లకు పాఠాలు చెబుతున్నారు. అది కంప్యూటర్ గది కావడంతో పైకప్పునకు థర్మాకోల్‌తో పీఓపీ చేయించారు. దీనివల్ల ఆ గది పైకప్పు కనిపించే అవకాశం లేకుండా పోయింది. దీంతో పైపెచ్చులు ఊడుతున్నాయనే విషయాన్ని గుర్తించలేకపోయారు. పీఓపీతో తప్పిన పెనుప్రమాదం పీఓపీ థర్మాకోల్ కారణంగా ప్రమాదకర పరిస్థితిని గుర్తించడానికి వీల్లేకుండా పోయినప్పటికీ దానివల్లే పెనుప్రమాదం తప్పిం చింది. పెచ్చులూడిన పైకప్పు థర్మాకోల్‌పై పడి తర్వాత విద్యార్థిపై పడటంతో ఓ మోస్తరు గాయంతో విద్యార్థి క్షేమంగా బయటపడ్డాడు. అదే నేరుగా విద్యార్థి తలపై పడి ఉంటే చాలా ప్రమాదం జరిగి ఉండేది. దసరా సెలవుల్లో మరమ్మతులు చేపట్టాలి శిథిలావస్థలో ఉన్న పాఠశాలల భవనాలను యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేయాలి. ఎంఈఓలు సూచించిన భవనాలకు దసరా సెలవుల్లో మరమ్మతులు చేపట్టి పాఠశాలలు తిరిగి తెరిచేసరికి పనులు పూర్తి చేయాలి. తాడిమర్రిలో పాఠశాల భవనం పెచ్చులు ఊడిపడి విద్యార్థి గాయపడిన సంఘటనల్లాంటివి పునరావృతం కాకూడదు.– అమరనాథరెడ్డి, వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకుడు -
కూలిన అంగన్వాడీ కేంద్రం పైకప్పు
పోలాకి: చిన్నారులుండే కేంద్రమది. గర్భిణులు, బాలింతలు కూడా అక్కడికి వస్తుంటారు. ఏదైనా చిన్న పొరపాటు జరిగినా ఊహించని పరిణామాలు ఎదురవుతుంటాయి. వీటిని లెక్కచేయని అధికారులు, కిందిస్థాయి సిబ్బంది వీటిని పట్టించుకోలేదు. వీరి నిర్లక్ష్యం కారణంగా దీర్ఘాశి గ్రామంలో బుధవారం కలకలం రేగింది. అంగన్వాడీ భవనం పైకప్పు కూలిన ఘటనలో తల్లీబిడ్డలు గాయాలతో బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. కొన్నెళ్ల క్రితం హెల్త్ సెంటర్ కోసం నిర్మించిన శిథిల భవనంలో ధీర్ఘాశి–2 అంగన్వాడీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఈ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఏడాది క్రితం కూలగొట్టి నూతన భవనాన్ని నిర్మించేందుకు ప్రతిపాదించారు. అయితే కేంద్రాన్ని ప్రస్తుతం అందులోనే నిర్వహిస్తున్నారు. రోజులాగానే బుధవారం కూడా కేంద్రానికి 12 మంది చిన్నారులు వచ్చారు. అలాగే నెలవారీ చికిత్సలకు వచ్చే వారికి సేవలందించేందుకు హెల్త్సిబ్బంది హాజరయ్యారు. కేంద్రం పరిధిలోని బాలింతలు, గర్భిణులతో పాటు చిన్నారుల తల్లులు కూడా వచ్చారు. ఇదే సమయంలో ఒక్క సారిగా భవనం పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో అందులో ఉన్నవారంతా భయంతో బయటకు పరుగులు తీశారు. భవనం పెచ్చులూడిపడిన ఘటనలో దండాశి పార్వతి, ఆమె రెండున్నరేళ్ల కుమారుడు భరత్‌చంద్ర గాయాలపాలయ్యారు. వీరిద్దరినీ 108 వాహనంలో నరసన్నపేట సామాజిక ఆస్పత్రికి తరలించారు. కాగా అంగన్వాడీ కేంద్రం భవనం పెచ్చులూడి ఇద్దరు గాయపడినప్పటికీ ఐసీడీఎస్ అధికారుల దృష్టికి విషయం చేరలేదు. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నరసన్నపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు పీవో అనంతలక్ష్మి దృష్టికి ‘సాక్షి’ ప్రమాద విషయాన్ని తీసుకెళ్లగా.. ఆమె కూడా ఘటనపై సమాచారం లేదన్నారు. -
బాత్రూమ్ పైకప్పు కూలి..
కర్నూలు, కల్లూరు (రూరల్) : బాత్రూం పైకప్పు కూలి పాత కల్లూరులో ఓ మహిళ మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి.. పాతకల్లూరులోని చెంచునగర్లో చెంచు పెద్దక్క(27) మంగళవారం రాత్రి స్నానం చేసేందుకు బాత్రూం వెళ్లింది. ఈక్రమంలో బాత్రూం పైకప్పు కూలింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో భర్త వెంటనే అక్కడి చేరుకున్నాడు. తీవ్రగాయాలపాలైన ఆమెను వెంటనే కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలికి నాలుగేళ్ల కూతురు ఉంది. పెద్దక్క మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతురాలి కుటుంబాన్ని ఎమ్మెల్యే గౌరు చరిత పరామర్శించారు. ఈమె కుటుంబానికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
ఊరేగింపు చూస్తుండగా ఇంటి పైకప్పు కూలి
-
చిలంకూరులో కూలిన మిద్దె
ఎర్రగుంట్ల: మండల పరిధిలోని చిలంకూరు గ్రామం పాత ఊరులో శివాలయం సమీపంలో బుధవారం అర్ధరాత్రి ఓ మట్టిమిద్దె కూలిపోయింది. ఇందులో నివాసముంటున్న వృద్ధ వికలాంగుడు హుస్సేన్ సాహెబ్ ఇంటి వరండాలో పడుకొని ఉండటంతో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ సందర్భంగా హుస్సేన్‌సాహెబ్ మాట్లాడుతు బుధవారం రాత్రి భోజనం చేసి పడుకొన్నానని, అర్థరాత్రి ఉరుములతో కూడిన వర్షం కురిసిందని తెలిపాడు. దీంతో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ఇంటి పైకప్పు కూలిపోయిందన్నాడు. వెంటనే వరండాలో పడుకొని ఉన్న తాను భయంతో అతి కష్టం మీద బయటకు వచ్చానని వివరించాడు. మట్టి మిద్దె కావడంతో దూలాలన్నీ విరిగిపోయి సామాన్లు పాడైపోయాయి. -
చౌడు మిద్దె కూలి ఆరుగురు మృతి
మైదుకూరు టౌన్: వైఎస్సార్ జిల్లా మైదుకూరు మండలం ఉత్సలవరం గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున చౌడు మిద్దె కూలిన సంఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతుల బంధువుల కథనం మేరకు.. ఉత్సలవరం గ్రామానికి చెందిన అంగంపల్లె చిన్న గుర్రప్ప, పెంచలమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెలు, కుమారుడికి వివాహం కావడంతో కుమారుడు పక్కనే ఇంటిలో వేరుగా కాపురం ఉన్నాడు. అయితే చిన్నగుర్రప్ప దంపతులు, వారి పెద్ద కుమార్తె లలితలు ఒకే ఇంటిలో నివాసముంటున్నారు. లలితకు వివాహమైనప్పటికీ కుటుంబ తగాదాల కారణంగా తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఈమెకు యశ్వంత్ అనే కుమారుడు ఉన్నాడు. చిన్నకూతురైన హరిత బ్రహ్మంగారిమఠం మండలం పెద్దురాజుపల్లె గ్రామంలో వివాహం చేసుకోగా ఆమెకు నవనీత్, నిహారిక అనే పిల్లలు ఉన్నారు. చిన్న కుమార్తె హరిత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం సోమవారం సాయంత్రం పుట్టింటికి వచ్చింది. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున వర్షం రావడంతో బాగా తడిచి ఉన్న పైకప్పు ఒక్కసారిగా ఇంట్లో నిద్రిస్తున్న వారిపై పడింది. పెద్ద శబ్దం రావడంతో పక్కనే నివాసమున్న కొడుకు, గ్రామస్తులు అక్కడికి వెళ్లి చూసే సరికి చిన్నగుర్రప్ప(50), పెంచలమ్మ(44), హరిత(23), యశ్వంత్(6), నవనీత్(2) అక్కడికక్కడే మృతి చెంది ఉన్నారు. లలిత(27), నిహారిక (9నెలలు) కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండటంతో వారిని ప్రొద్దుటూరు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ లలిత మృతి చెందగా కేవలం 9నెలల నిహారిక మృత్యుంజయురాలుగా నిలిచింది. ఈ సంఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలాన్ని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి సందర్శించారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
త్రుటిలో తప్పిన ప్రమాదం
యాదగిరిగుట్ట: తరగతి గది పైకప్పు పెచ్చులూడి పడిన ఘటనలో విద్యార్థులు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో జరిగింది. సోమవారం నుంచి కురుస్తున్న వర్షానికి స్థానికంగా ఉన్న ఏళ్లనాటి ఉన్నత పాఠశాల భవనం పైకప్పు నుంచి పెచ్చులూడి పడ్డాయి. మంగళవారం ఉదయం పాఠశాలకు విద్యార్థులు చేరుకునేసరికి మొత్తం ఆరుగదులతో పాటు వరండాలో పైకప్పు పెచ్చులూడిపడి ఉన్నాయి. వాటి ధాటికి ఫర్నీచర్ ధ్వంసం అయ్యాయి. దీంతో భయ భ్రాంతులకు గురైన ఉపాధ్యాయులు, విద్యార్థులు చెట్ల కిందికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ డీఈవో మధ్యాహ్నం నుంచి పాఠశాలకు సెలవు ప్రకటించారు. తరగతులు సక్రమంగా కొనసాగేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని సర్పంచి తెలిపారు. -
ఉమెన్స్ హాస్టల్లో కూలిన పైకప్పు
హైదరాబాద్: నగరంలోని జవహర్‌నగర్‌లో అభిశ్రీ ఉమెన్స్ హాస్టల్ పైకప్పు శుక్రవారం తెల్లవారుజామున వచ్చిన భారీ గాలివానకు కూలిపోయింది. ఐదవ అంతస్తులో హాస్టల్ నిర్వాహకుడు రేకులతో షెడ్డు వేసి అందులో వసతి ఏర్పాటు చేశాడు. ఎలాంటి అనుమతులు లేకుండా షెడ్డువేసి తగిన రక్షణ ఏర్పాట్లు చేయకపోవడంతో గాలికి రేకులు ఎగిరిపోయాయి. ఐరన్ పోల్స్ కూలి విద్యార్థినులపై పడిపోయాయి. తెల్లవారుజామున నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామంతో విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలు కాగా సుమారు 20 మంది విద్యార్థినుల సర్టిఫికెట్లు, బుక్స్ ఇతర వస్తువులు తడిసి ముద్దయ్యాయి. ఇంత జరిగినా హాస్టల్ నిర్వాహకుడు హాస్టల్‌కు రాకుండా ఉండడం గమనార్హం. దీంతో విద్యార్థినులు జరిగిన ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అదే విధంగా హైదర్‌గూడ ఓల్డ్ ఎమ్మెల్యే కార్వర్ట్స్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్మెంట్ వద్ద గోడ కూలిపోవడంతో మూడు కార్లు ధ్వంసం అయ్యాయి. -
బాత్రూమ్ పైకప్పు కూలి వ్యక్తి మృతి
సుల్తానాబాద్: మరుగుదొడ్డి శుభ్రం చేస్తుండగా పైకప్పు కూలిపోవడంతో ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామంలో సోమవారం ఉదయం జరిగింది. గ్రామ పంచాయతీ ఉద్యోగి సాయిలు(50) జెడ్పీ హైస్కూల్లోని మరుగుదొడ్డిని శుభ్రం చేస్తుండగా పై కప్పు కూలిపోవడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
భవనం పైకప్పు కూలి తొమ్మిది మంది మృతి
-
పైకప్పు కూలి ఓ కుటుంబంలో ఐదుగురి మృతి
పెషావర్ : ఓ ఇంటి పైకప్పు కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి ఐదుగురు మృతిచెందారు. పాకిస్తాన్ లోని ఆగ్నేయ ప్రాంతంలోని కరాక్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఈ ఘటనలో తల్లి సహా నలుగురు సంతానం చనిపోయారు. పోలీసుల కథనం ప్రకారం... మహమ్మద్ ఖలీద్ కు చెందిన ఇల్లు చాలా కాలం కిందట కట్టారు. అక్కడ కురుస్తున్న భారీ వర్షాలకు ఈ రోజు ఆ ఇల్లు పైకప్పు ప్రమాదవశాత్తూ కూలడంతో ఐదుగురు మృతిచెందారు. మర్యామ్ (12), ముకాద్దాస్ (8), అలీహా (6) లు అక్కడిక్కడే మృతిచెందగా, ఖలీద్ భార్య, ఓ చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. వారు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతిచెందారు. -
ఇంటి పైకప్పు కూలి వృద్ధుడి మృతి
లింగాల ఘన్పూర్ (వరంగల్ జిల్లా) : ఈదురు గాలికి ఇంటి పైకప్పు కూలి వృద్ధుడు మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లాలో శనివారం సాయంత్రం జరిగింది. వివరాల ప్రకారం.. లింగాల ఘన్పూర్ మండలం పటేల్‌గూడెంలో గాలి దుమారానికి ఇంటి పైకప్పు కూలి అనుముల మల్లయ్య (60) అనే వృద్ధుడు అక్కడికక్కడే మృతిచెందాడు. -
పైకప్పు కూలి ఇద్దరి మృతి
విజయవాడ (విద్యాధరపురం): విజయవాడ నగరంలో ఇంటి పైకప్పు కూలి ఇద్దరు కూలీలు మృతిచెందిన సంఘటన ఆదివారం జరిగింది. ఈ సంఘటన విజయవాడ నగరంలోని విద్యాధరపురం కాలనీలోని కొండ ప్రాంతంలో పాత భవనం మరమ్మతులు నిర్వహిస్తుండగా సంభవించింది. భవన నిర్మాణంలో భాగంగా పాత కప్పును తీసివేసే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. భవనం పైభాగం నుంచి దిమ్మిసతో కొడుతున్న సమయంలో కింది భాగంలో పనిచేస్తున్న ఇద్దరు కూలీలపై స్లాబ్ ఒక్కసారిగా పడటంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. భవనం పైభాగంలో ఉన్న వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. మృతులు ఎవరెవరు అనేది ఇంకా తెలియరాలేదు. -
మిద్దె కూలి మహిళ మృతి
గోపాల్పేట: మహబూబ్‌నగర్ జిల్లా గోపాల్పేట మండలం బుద్ధారంలో మట్టి మిద్దె కూలి ఓ మహిళ మృతి చెందింది. మరొకరికి గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన వెంకటయ్య గౌడ్, సుగుణమ్మ(40) దంపతులు ఇంట్లో నిద్రిస్తుండగా బుధవారం వేకువజామున ఒక్కసారిగా మట్టి మిద్దె కూలి వారిపైన పడింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన సుగుణమ్మ అక్కడిక్కడే మృతి చెందింది. గాయాలైన వెంకటయ్య స్తానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
మిద్దె కూలి వ్యక్తి మృతి
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం హెచ్ కైరావాడి గ్రామంలో మిద్దె కూలి ఓ వ్యక్తి మరణించాడు, మరొకరికి గాయాలయ్యాయి. సోమవారం అర్థరాత్రి ఇంట్లో అంతా నిద్రపోతుండగా మిద్దె ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దాంతో శ్రీనివాసులు అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. మరొకరికి కూడా ఈ ప్రమాదంలో గాయాలయ్యాయి. -
పాఠశాల పైకప్పు కూలి విద్యార్థినికి గాయాలు
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బీర్కూరు మండలం చించొల్లి గ్రామంలోని మంగళవారం పాఠశాల పైకప్పు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విద్యార్థిని కవిత తీవ్రంగా గాయపడింది. స్కూల్ సిబ్బంది వెంటనే స్పందించి ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కవితకు ప్రాధమిక వైద్యం అందించి వైద్యులు మెరుగైన వైద్య చికిత్స కోసం పెద్ద ఆసుపత్రికి తరలించాలని సూచించారు. దీంతో ఆమె మరో ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఉదయమే పాఠశాలకు వచ్చిన కవిత తరగతి గదిలో బ్యాగ్ పెట్టిన సమయంలో పాఠశాల పైకప్పు కూలిందని స్కూల్ సిబ్బంది తెలిపారు.