త్రుటిలో తప్పిన ప్రమాదం | roof collapse in school at nalgonda district | Sakshi
Sakshi News home page

త్రుటిలో తప్పిన ప్రమాదం

Published Tue, Jun 28 2016 12:40 PM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

roof collapse in school at nalgonda district

యాదగిరిగుట్ట: తరగతి గది పైకప్పు పెచ్చులూడి పడిన ఘటనలో విద్యార్థులు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో జరిగింది. సోమవారం నుంచి కురుస్తున్న వర్షానికి స్థానికంగా ఉన్న ఏళ్లనాటి ఉన్నత పాఠశాల భవనం పైకప్పు నుంచి పెచ్చులూడి పడ్డాయి. మంగళవారం ఉదయం పాఠశాలకు విద్యార్థులు చేరుకునేసరికి మొత్తం ఆరుగదులతో పాటు వరండాలో పైకప్పు పెచ్చులూడిపడి ఉన్నాయి. వాటి ధాటికి ఫర్నీచర్ ధ్వంసం అయ్యాయి. దీంతో భయ భ్రాంతులకు గురైన ఉపాధ్యాయులు, విద్యార్థులు చెట్ల కిందికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ డీఈవో మధ్యాహ్నం నుంచి పాఠశాలకు సెలవు ప్రకటించారు. తరగతులు సక్రమంగా కొనసాగేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని సర్పంచి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement