నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బీర్కూరు మండలం చించొల్లి గ్రామంలోని మంగళవారం పాఠశాల పైకప్పు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విద్యార్థిని కవిత తీవ్రంగా గాయపడింది. స్కూల్ సిబ్బంది వెంటనే స్పందించి ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కవితకు ప్రాధమిక వైద్యం అందించి వైద్యులు మెరుగైన వైద్య చికిత్స కోసం పెద్ద ఆసుపత్రికి తరలించాలని సూచించారు.
దీంతో ఆమె మరో ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఉదయమే పాఠశాలకు వచ్చిన కవిత తరగతి గదిలో బ్యాగ్ పెట్టిన సమయంలో పాఠశాల పైకప్పు కూలిందని స్కూల్ సిబ్బంది తెలిపారు.