classroom
-
క్లాస్ రూమ్‌కు సెల్ తీసుకెళ్లొద్దు
సాక్షి, హైదరాబాద్: తరగతి గదిలోసెల్‌ఫోన్ వాడొద్దని ఉపాధ్యాయులకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అలా చేస్తే శిక్ష తప్పదని హెచ్చరించింది. ఫోన్ వాడే టీచర్లను ఓ కంట కనిపెట్టాలని అధికారులకు సూచించింది. క్లాస్ రూ మ్‌లోకి అసలు ఫోన్ లేకుండానే వెళ్ళాలని స్పష్టం చేసింది. అత్యవసరమైతేనే ఫోన్ తీసుకెళ్ళాలని, దానికీ ప్రధానోపాధ్యాయుడి అనుమతి తప్పనిసరి అని పేర్కొంది. వాస్తవానికి ఈ నిబంధన పాతదేనని ఉన్నతాధికారులు అంటుండగా, ఇకపై దీన్ని కఠినంగా అమలు చేయనున్నట్లు డీఈవోలు చెబుతున్నారు. కొన్ని నెలల పాటు సెల్‌ఫోన్ వినియోగంపై నిఘా పెట్టాలని ఎంఈవోలకు ఆదేశాలిచ్చారు. దీనిపై ఉపాధ్యాయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా యి. ఇది టీచర్లకు ఇబ్బందికరంగా మారుతుందని, హెచ్ఎంలు వేధించేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. వాట్సాప్ చూస్తూ..ఫోన్ మాట్లాడుతూ..! ఇటీవల కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. అనేకమంది టీచర్లు సెల్ఫోన్లో వాట్సాప్, ఇతర సోషల్ మీడియా ఫాలో అవుతూ గడుపుతున్నారని గుర్తించారు. కొంతమంది ఎక్కువ సమయం ఫోన్లో మాట్లాడుతున్నారనే ఫిర్యాదులొచ్చాయి. దాదాపు 12 జిల్లాల నుంచి ఈ తరహా ఉదంతాలను జిల్లా అధికారులు గుర్తించారు. వీటిని రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయానికి పంపారు. సెల్‌ఫోన్‌పై క్లాస్‌రూంలో నిషేధం విధించాలని సూచించారు. పైగా టీచర్లు బోధనకు ముందుగా సన్నద్ధమవ్వడం లేదని, క్లాస్ రూంలో సెల్‌ఫోన్ ద్వారా సెర్చ్ చేసి పాఠాలు చెబుతున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. విద్యార్థులు క్లిష్టమైన ప్రశ్నలు వేసినప్పుడు సెల్ఫోన్లో సెర్చ్‌చేసి సమాధానమిస్తున్నారని ఉన్నతాధికారుల దృష్టికి వచి్చంది. వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకుని సెల్‌ఫోన్‌పై నిషేధం విధించినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. ఫోన్ లేకుండా స్కూల్ నడుస్తుందా? టీచర్లు వ్యక్తిగత ప్రయోజనాలకు సెల్ వాడుతున్నారని చెప్పడం అర్థం లేని మాట. అసలు సెల్‌ఫోన్ లేకుండా స్కూళ్ళు నడిచే అవకాశం ఉందా? విద్యార్థుల ముఖ హాజరు తీసుకోవాలంటే ఫోన్ కావాలి. ఉన్నతాధికారులకు పంపే అన్ని రిపోర్టులను సెల్ లేదా ట్యాబ్ ద్వారానే పంపాల్సి ఉంటుంది. అత్యాధునిక టెక్నాలజీ వాడమని ప్రభుత్వాలే చెబుతున్నాయి. సెల్‌ఫోన్‌తో పనులు చేయాలని చెప్పే అధికారులు ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలి. – చావా రవి (టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) స్వీయ నియంత్రణ మంచిది తరగతి గదిలో సెల్‌ఫోన్ వాడకంపై నిషేధం కన్నా.. టీచర్లు స్వీయ నియంత్రణ పాటించేలా చర్య లు తీసుకోవాలి. బోధనకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన అవసరం ఉంది. నిషేధాన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది హెచ్ఎంలు అనవసరంగా టీచర్లను వేధించకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా స్కూల్లో ఫోన్ వినియోగానికి టీచర్లు దూరంగా ఉండాలి. – సయ్యద్ షౌకత్ అలీ (టీఎస్పీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు) -
ఎడ్టెక్ ఇండియా!
దేశంలో ఆన్లైన్ విద్యకు అంతకంతకూ డిమాండ్ పెరిగిపోతోంది. దీంతో పలు ఎడ్ టెక్ స్టార్టప్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. కరోనా–19 పరిణామాలతో విద్యార్థులు ‘ఆన్లైన్’ బాట పట్టారు. అమెరికా తర్వాత భారత్‌లోనే ఆ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆయా కంపెనీలు ఆసక్తి చూపాయి. ఆ తర్వాత విద్యార్థులు, ఉపాధ్యాయులు తిరిగి సంప్రదాయ క్లాస్రూమ్ శిక్షణ వైపు మళ్లారు. దీంతో ఆయా కంపెనీలు సైతం ‘ఆఫ్‌లైన్’ సేవల్లోకి అడుగుపెట్టాయి. దేశంలో 2014 నుంచి 2020 వరకు ఎడ్ టెక్ రంగం విలువ 1.32 బిలియన్ డాలర్లుగా ఉండేది. అయితే కరోనా, లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఈ–లెరి్నంగ్కు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. ఒక్క 2020లోనే ఈ రంగం 1.88 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించి గత ఐదేళ్ల రికార్డును తిరగరాసింది. 2020–21 మధ్య కరోనా విస్తరణతో దేశంలో లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ రెండేళ్లల్లో దేశలోని దాదాపు 320 మిలియన్ల మందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇంటికే పరిమితమయ్యారు. ఆ సమయంలో ఆన్లైన్ తరగతులు, ఈ–లెర్నింగ్ సాఫ్ట్వేర్, వర్చువల్ ట్యుటోరియల్స్, డిజిటల్ లైబ్రరీలు వంటి రంగాలు విస్తరించి, ఈ–కంటెంట్ అభివృద్ధికి పెద్ద నగరాలు కేంద్రాలుగా మారాయి. 2020 చివరి నాటికి వ్యాపార ప్రాథమిక, ఆర్థిక విశ్లేషణ, వృత్తిపరమైన కమ్యూనికేషన్స్ కోర్సుల డిమాండ్ 606 శాతం పెరిగినట్టు ఓఆర్ఎఫ్ పేర్కొంది. 2021 నాటికి ఇండియా ఎడ్టెక్ బూమ్ తిరుగులేని ప్రగతిని నమోదు చేసిందని, ప్రపంచ దేశాల్లో అమెరికా తర్వాత రెండో అతిపెద్ద ఎడ్ టెక్ మార్కెట్‌గా నిలవడంతో పాటు స్టార్టప్ మార్కెట్ 2021లో 4.73 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించడం ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. ఈ రెండేళ్లలో దేశంలో దాదాపు 4,500 ఎడ్టెక్ స్టార్టప్స్ పుట్టుకొచ్చాయని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఓఆర్ఎఫ్) వెల్లడించింది. భారతీయ ఎడ్ టెక్ కంపెనీలైన బైజూస్, స్కేలర్ అకాడమీ, ఎమెరిటస్, సింప్లిలెర్న్ వంటి సంస్థలు అమెరికా, ఆగ్నేయాసియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాలకు విస్తరించాయి.మళ్లీ ‘ఆఫ్‌లైన్’లోకి అడుగులు..మన ఎడ్ టెక్ రంగం 2022 నుంచి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోందని ఓఆర్ఎఫ్ పేర్కొంది. పాఠశాలలు తిరి గి తెరవడం ఆన్లైన్ కోర్సులు నేర్చుకునే బదులు హైబ్రిడ్, సంప్రదాయ లెరి్నంగ్ విధానాల వైపు ఆసక్తి పెరగడంతో ఆన్లైన్ రంగంలో కొంత తడబాటు నెలకొందని వెల్లడించింది. దీంతో ఎడ్టెక్ కంపెనీలు తమ మా ర్కెట్‌ను కాపాడుకునేందుకు పోటీ పడుతున్నాయని, ఈ క్రమంలో కోర్సుల ధరలు, మార్జిన్లను తగ్గించినట్టు ప్రకటించింది. దీంతో పెట్టుబడిదారులు ఈ రంగంలోకి దిగేందుకు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో ఎడ్ టెక్ స్టార్టప్స్ నిధులు 2022లో 2.6 బిలియన్ డాలర్లు తగ్గిపోగా, 2023లో 0.297 బిలియన్ డాలర్లు తగ్గాయి. అంతేగాక 20 22లో ఈ రంగంలో ఉన్న 14 వేల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. మారిన పరిస్థితులు, పెరిగిన పోటీ రీత్యా భారత ఎడ్టెక్ సంస్థలు ఆన్ లైన్ సేవల నుంచి ఆఫ్‌లైన్ సే వలు అందించడం మొదలెట్టాయి. ఈ కోవలోనే బైజూస్ 2021లో ఆకాష్ ఇనిస్టిట్యూట్ ట్యుటోరియల్ సెంటర్ చైన్‌ను కొ నుగోలు చేసింది. ఫిజిక్స్ వాలా సంస్థ కూడా గతేడాది ఆఫ్‌లైన్ సేవల్లోకి వచ్చి0ది. 2024 చివరి నాటికి భార0 అంతటా 60కి పైగా విద్యాపీఠ్‌లు, పాఠశాలలు పేరు తో తెరవనున్నట్టు ప్రకటించింది. వీటితో పాటు బ్రైట్ క్యాంపస్, అన్ అకాడమీ వంటి సంస్థలు కూడా ఆఫ్‌లైన్ సేవల్లోకి ప్రవేశించాయి. జాతీయ విద్యావిధానం–2020 అమలు చేసి నాలుగేళ్లు పూర్తవడంతో ఎడ్ టెక్ రంగాలకు ప్రోత్సాహం ఉంటుందని, ఎడ్టెక్–కేంద్రీకృత ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యానికి విస్తృతమైన అవకాశాలు ఉంటాయని ఓఆర్ఎఫ్ అంచనా వేసింది. -
తరగతి గదిని స్విమ్మింగ్ ఫూల్ చేసిన హెడ్మాస్టర్!
ప్రస్తుతం దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు ఉక్కపోత, వేడి గాలులకు తల్లడిల్లిపోతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు తీవ్రమైన ఎండల కారణంగా అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ పరిస్థితులను గుర్తించిన ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వినూత్న ఆలోచనతో విద్యార్థులను పాఠశాలకు రప్పిస్తున్నారు.ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలోని ఒక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పిల్లలను పాఠశాలకు రప్పించడానికి ఒక ప్రత్యేకమైన విధానాన్ని ఆశ్రయిస్తున్నారు. పాఠశాలలోని తరగతి గదిని స్విమ్మింగ్ పూల్‌గా మార్చివేశారు. ఇది విజయవంతమయ్యింది. దీంతో చిన్నారులంతా పాఠశాలకు క్రమంతప్పక వస్తున్నారు. తరగతి గదిలోని స్విమ్మింగ్ పూల్‌లో చిన్నారులు సరదాగా ఆడుకుంటున్న వైనానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇది కన్నౌజ్ జిల్లాలోని మహసోనాపూర్లోని ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన ఉందంతం. ఇక్కడ ఉష్ణోగ్రతలు 40 నుండి 42 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటున్నాయి. దీంతో ఎండ వేడిమి నుంచి తమ పిల్లలను రక్షించేందుకు తల్లిదండ్రులు వారిని పాఠశాలలకు పంపడం లేదు. దీంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పిల్లల హాజరు శాతాన్ని పెంచేందుకు తరగతి గదిలోనే స్విమ్మింగ్ పూల్‌ను ఏర్పాటు చేశారు.పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వైభవ్ రాజ్‌పుత్ మీడియాతో మాట్లాడుతూ ‘పాఠశాలలోని ఒక తరగతి గదిని నీటితో నింపేసి, స్విమ్మింగ్ పూల్‌గా మార్చివేశాం. దీనిని చూసి పిల్లలు ముచ్చట పడ్డారు. ఆ స్విమ్మింగ్ ఫూల్లో ఆడుకోవడం మొదలు పెట్టారు. వారి ఆనందానికి అంతులేకుండా పోతోంది. ఆ నీటిలో ఈత కొడుతూ ఆడుకుంటున్నారు. ఇలా ఎంజాయ్ చేసేందుకు విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు వస్తున్నారు’ అని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో విద్యార్థులకు వేసవి సెలవులు మే 21 నుంచి జూన్ 30 వరకూ ఉంటాయి. -
స్కూల్లో 14 ఏళ్ల విద్యార్థి కాల్పులు.. 9 మంది మృతి
బెల్గ్రాడ్: సెర్బియా దేశంలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఓ పాఠశాలలో 14 ఏళ్ల విద్యార్థి తుపాకీతో వీరంగం సృష్టించాడు. ఎనిమిదో తరగతి చదువుతున్న బాలుడు తన టీచర్‌పై క్లాస్‌రూమ్‌లోనే విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అంతేగాక మిగతా విద్యార్థులు, సెక్యూరిటీగార్డుపై ఇష్టారీతిగా కాల్పులకు తెగబడ్డాడు. సెర్బియా రాజధాని బెల్‌గ్రాడ్‌లోని వ్లాడిస్లావ్ రిబ్నికర్ ఎలిమెంటరీ స్కూల్లో బుధవారం ఈ ఘోరం వెలుగు చూసింది. ఈ ఘటనలో ఇప్పటివరకు సెక్యురిటీ గార్డుతోపాటు ఎనిమిది మంది విద్యార్థులు మరణించినట్లు సెర్బియా హోంమంత్రిత్వశాఖ పేర్కొంది. టీచర్‌తోపాటు పాటు ఆరుగురు పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని.. కాల్పులకు తెగబడిన విద్యార్థిని అరెస్టు చేశారు. కాల్పులకు గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. టీచర్ పరిస్థితి విషమంగా ఉందని, వైద్యులు ఆమెను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. కాగా ముందుగా టీచర్‌పై కాల్పులు జరిపి తరువాత మిగతా విద్యార్థులపై కాల్పులు జరిపినట్లు క్లాస్‌లోని విద్యార్థుల్లో ఓ చిన్నారి తండ్రి చెప్పారు. అయితే తన కూతురుకు ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు. పాఠశాలలో ఒక్కసారిగా కాల్పులు చోటుచేసుకోవడంతో స్థానికంగా భయానక వాతావరణం నెలకొంది. తుపాకీ పేలిన శబ్ధం రావడంతో పాఠశాల నుంచి పిల్లలు అందరూ బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు భారీగా పాఠశాల వద్దకు చేరుకున్నారు. చదవండి: మంత్రిపై బాడీగార్డు కాల్పులు.. స్పాట్లోనే మృతి -
AP: ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోధన
సాక్షి, అమరావతి: ఆధునిక బోధన విధానాలను అనుసరిస్తూ విద్యార్థులకు అత్యుత్తమ రీతిలో అత్యున్నత పరిజ్ఞానాన్ని అందించేందుకు ప్రతి తరగతి గదిలో డిజిటల్ విద్యా బోధనకు శ్రీకారం చుడుతున్నట్లు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన పరికరాలను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో విద్యా శాఖపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులకు సబ్జెక్టులు మరింత నిశితంగా అర్థం అయ్యేలా బోధించేందుకు ప్రతి తరగతిలో ఇంటరాక్టివ్ డిస్ప్లే లేదా ప్రొజెక్టర్లు పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి అధికారులు చూపించిన ఇంటరాక్టివ్ డిస్ప్లేలు, ప్రొజెక్టర్స్ పనితీరు, నాణ్యత, మోడల్స్‌ను పరిశీలించారు. వాటి వివరాలు, ఇతర అంశాలపై ఆరా తీశారు. నాణ్యమైన డిజిటల్ పరికరాల ఏర్పాటుకు వేగవంతంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రొజెక్టర్లు, ఇంటరాక్టివ్ టీవీల నాణ్యతలో ఎక్కడా రాజీ పడరాదని స్పష్టం చేశారు. స్మార్ట్ బోధన సదుపాయాల వల్ల ఇటు పిల్లలకు, అటు ఉపాధ్యాయులకు మేలు జరుగుతుందన్నారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. ట్యాబ్‌లు నాణ్యతతో ఉండాలి ►ఈ విద్యా సంవత్సరం సెప్టెంబర్‌లో 8వ తరగతి విద్యార్థులకు అందించే ట్యాబ్‌లు నాణ్యంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ట్యాబ్‌ల్లోకి ప్రఖ్యాత ఆన్లైన్ ఎడ్టెక్ సంస్థ బైజూస్ కంటెంట్‌ను అప్లోడ్ చేస్తుంది. దీని ద్వారా విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య అందుబాటులోకి రానుంది. ►విద్యార్థుల చదువులకు అవసరమైన వస్తువులతో అమలు చేస్తున్న విద్యా కానుకకు సంబంధించి వచ్చే ఏడాదికి పంపిణీ కోసం తీసుకోవలసిన చర్యలపై ఇప్పటి నుంచే ప్రణాళికా బద్ధంగా సన్నద్ధం కావాలి. ప్రతి స్థాయిలో పర్యవేక్షణ ముఖ్యం ►రెండో దశ నాడు – నేడు పనులను వేగవంతం చేయాలి. స్కూళ్లలో విలువైన ఉపకరణాలను ఏర్పాటు చేస్తున్నందున భద్రత దృష్ట్యా తగిన చర్యలు తీసుకోవాలి. స్కూళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు గురించి ఆలోచించాలి. ►సస్టయినబుల్ డెవలప్మెంటు గోల్ (ఎస్డీజీ) లక్ష్యాలను చేరుకునే ప్రక్రియలో భాగంగా విద్యా వ్యవస్థలో చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించిన డేటా నిరంతరం అప్లోడ్ అయ్యేలా చూడాలి. దీనికి సంబంధించి ఎస్ఓపీలను రూపొందించాలి. జిల్లా స్థాయిలో కలెక్టర్లు కూడా సమీక్ష చేయాలి. ►టాయిలెట్స్ మెయింటెనెన్స్ ఫండ్ (టీఎంఎఫ్), స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ (ఎస్ఎంఎఫ్)లను సమర్థవంతంగా వినియోగించుకుని స్కూళ్ల నిర్వహణను పటిష్టం చేయాలి. విద్యా రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినందున, ప్రతి స్థాయిలో పర్యవేక్షణ బలంగా ఉండాలి. ఇందు కోసం విద్యా శాఖలో డీఈఓ, ఎంఈఓ సహా వివిధ స్థాయిల్లో పర్యవేక్షణ బాధ్యతలున్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ►ఎస్సీఈఆర్టీ, డైట్ సీనియర్ లెక్చరర్స్, డైట్ లెక్చరర్స్ పోస్టుల భర్తీపైనా దృష్టి పెట్టాలి. హాస్టళ్లలో కూడా నాడు – నేడు రెండో దశ కింద పనులు చేపట్టాలి. ►సీఎం గతంలో ఇచ్చిన వివిధ ఆదేశాల అమలు ప్రగతిని, నాడు – నేడు రెండో దశ కింద 22,344 స్కూళ్లలో చేపడుతున్న పనుల ప్రగతిని అధికారులు ఈ సమీక్షలో ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సమావేశంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ సమీర్ శర్మ, పాఠశాల విద్యా శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, విద్యా శాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, పాఠశాల విద్యా శాఖ సలహాదారు ఎ మురళీ, ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ కార్యదర్శి సాంబశివారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. పీపీ–1 నుంచే.. ►రాష్ట్రంలో ప్రవేశ పెడుతున్న పూర్వ ప్రాథమిక విద్యా తరగతుల నుంచే డిజిటల్ బోధనపై అధికారులు ఆలోచించాలి. పీపీ–1 (ప్రీ ప్రైమరీ–1) నుంచి రెండో తరగతి వరకు స్మార్ట్ టీవీలు, 3వ తరగతి.. ఆపైన తరగతులకు ప్రొజెక్టర్లు పెట్టేలా ప్రణాళికలు రూపొందించాలి. ►నాడు – నేడు పూర్తి చేసుకున్న అన్ని హైస్కూళ్లలో మొదటి దశ కింద ఈ డిజిటల్ పరికరాలను ఏర్పాటు చేయాలి. వచ్చే వారం నాటికి దీనిపై కార్యాచరణ సిద్ధం చేయాలి. -
ఉపాధ్యాయులకు షాక్.. క్లాస్ రూమ్స్‌లో ఫోన్ల వాడకంపై ఆంక్షలు
డెహ్రాడూన్: క్లాస్ రూమ్స్‌లో ఫోన్లు వాడే టీచర్లకు బిగ్ షాక్ తగిలింది. క్లాస్ రూమ్‌ల్లోకి సెల్ ఫోన్లను తీసుకెళ్లడాన్ని నిషేధిస్తూ ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లా మేజిస్ట్రేట్ వినయ్ శంకర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎవరైనా టీచర్ల వద్ద క్లాస్ రూమ్స్‌లో ఫోన్లు కలిగి ఉన్నట్టు తేలితే కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ రూల్ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘తరగతి గదుల్లో కూడా ఉపాధ్యాయులు మొబైల్ ఫోన్లతో బిజీగా ఉండటం చాలా కాలంగా గమినిస్తున్నట్టు చెప్పారు. ఫోన్లలో బిజీగా గేమ్స్ ఆడటం, చాటింగ్‌లు చేయడం వంటివి గుర్తించినట్టు పేర్కొన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రుల నుండి తమకు చాలా కాలంగా ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. అలాగే విద్యార్థులు, ఫిర్యాదులను ధృవీకరించడానికి అధికారులను పంపించినట్టు తెలిపారు. అయితే, ఉపాధ్యాయులు తమ మొబైల్ ఫోన్లను పాఠశాలలకు తీసుకెళ్లవచ్చు కానీ.. ఫోన్లను ప్రిన్సిపాల్ గదిలో భద్రపరచాలని స్పష్టం చేశారు. వారు మొబైల్ ఫోన్లు లేకుండా తరగతి గదిలోకి ప్రవేశించాలని ఆదేశాలు జారీ చేసినట్టు పాండే చెప్పారు. అయితే, టీచర్ ఫ్యామిలీలో మెడికల్ ఎమర్జెన్సీ విషయంలో మినహాయింపు ఇవ్వవచ్చని తెలియజేసారు. కాగా, ప్రిన్సిపాల్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే ఫోన్ తమ వద్ద పెట్టుకోవచ్చనని సూచించారు. ఈ క్రమంలోనే తమ ఆకస్మిక తనిఖీల్లో ఎవరైనా ఉపాధ్యాయులు ఫోన్‌ను వాడుతున్నట్టు గమినిస్తే.. కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో ప్రిన్సిపాల్ కూడా బాధ్యత వహించాలన్నారు. Following complaints from students, parents that teachers were engaged with their phones in classrooms, an order has been issued which makes it mandatory for teachers to deposit their phones to Principal. Strict action in case of violation:Vinay S Pandey, Haridwar DM, Uttarakhand pic.twitter.com/B4GVDVwKcU — ANI UP/Uttarakhand (@ANINewsUP) March 23, 2022 -
ఆన్లైన్ క్లాస్‌లో అశ్లీల వీడియో
మైసూరు: గూగుల్ మీట్ ద్వారా ఉపాధ్యాయురాలు విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాలను బోధిస్తున్న సమయంలో అశ్లీల వీడియో ప్రసారమైన సంఘటన మైసూరులో చోటు చేసుకుంది. ఒక ప్రైవేటు స్కూల్ క్లాస్ జరుగుతున్న సమయంలో లింక్‌లోకి గుర్తు తెలియని యువకుడు చొరబడి అశ్లీల వీడియో పెట్టాడు. గమనించిన టీచర్ క్లాస్‌ను బంద్ చేసింది. ఎవరు ఈ నేరానికి పాల్పడ్డారో గుర్తించి శిక్షించాలని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు. -
Haimanti Sen: అ అంటే ఆకాశ బడి
అ అంటే అమ్మ. కాని అమ్మ పనికి పోతుంది. ఆ అంటే ఆకలి. నాన్న పనికి వెళ్లమంటాడు. చదువు ఇప్పటికీ కొందరికి అందదు. అక్షరాలు, పుస్తకాలు, క్లాస్‌రూములు చూడకుండా వాళ్లు పెద్దవాళ్లై మురికివాడలకు పరిమితమవుతారు. ‘వెర్రి కోరికే కావచ్చు. కాని నా ప్రయత్నం నేను చేస్తాను’ అనుకుంది హైమంతి సేన్. వీధి బాలల కోసం ముంబైలో ‘జునూన్’ (వెర్రి కోరిక) అనే సంస్థ స్థాపించి వారికి ‘స్కైవాక్’ల మీద అక్షరాలు నేర్పే పని చేస్తోంది. ఒక రకంగా ఆమె నడుపుతున్నది ఆకాశబడులు. ముంబైలో పాదచారుల కోసం స్కైవాక్‌లు ఏర్పాటు చేయడం హైమంతి సేన్‌కు మేలు చేసింది. స్కూల్ కోసం బిల్డింగ్‌ను అద్దెకు తీసుకోవడం, బల్లలు పెట్టడం, లైట్లు వెలిగించడం లాంటి ఖర్చులేమీ పెట్టే అవసరం లేకపోయింది. నాలుగు చాపలు పట్టుకుని వెళ్లి, వస్తూ పోతున్న వారిని పట్టించుకోకుండా ఒక వైపుగా పరిస్తే, రెయిలింగ్‌కి నాలుగు చార్టులు బిగిస్తే అదే బడి. అలాంటి బడే వీధిపిల్లలను ఆకర్షిస్తుంది అని భావించిందామె. గత రెండేళ్లుగా ఆ ఆలోచన సత్ఫలితాలను ఇస్తోంది కూడా. ముంబై కండీవాలి రైల్వేస్టేషన్ దగ్గర ఉన్న స్కైవాక్ మీదకు వెళితే ఏ పని దినాల్లోనైనా ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకూ స్కూలు నడుస్తూ కనిపిస్తుంది. స్కూల్ అంటే ఒకటి రెండు చాపలు పరువగా ఐదు పది మంది వీధి బాలలు కూచోగా నడిచే స్కూలు. ఇలాంటి స్కూళ్లు ముంబైలోని స్కైవాక్‌ల మీద హైమంతి ఆధ్వర్యంలో ఇప్పుడు నాలుగు నడుస్తున్నాయి. రోజూ ‘జునూన్’ తరఫున వాలంటీర్లు ఈ స్కూళ్లు నడుపుతారు. వీధి బాలలు వాటిలో చదువుకుంటారు. ఇలా నడుస్తున్న స్కూళ్లు ఇవే కావచ్చు. ‘నేను కొన్నాళ్లు టీచర్‌గా, పర్సనాల్టీ డెవలప్మెంట్ కౌన్సిలర్‌గా పని చేశాను. మంచి జీతం వచ్చే ఆ ఉద్యోగంలో నాకు తృప్తి కనిపించలేదు. ముంబైలో ఎక్కడ చూసినా రోడ్డు మీద ఏవో కొన్ని చిల్లర వస్తువులు అమ్మే బాలలు, భిక్షాటన చేసే బాలలు కనిపించేవారు. 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం 6 నుంచి 14 ఏళ్ల వయసున్న బాల బాలికలకు ఉచిత నిర్బంధ విద్యనందించాలి. కాని ఆ చట్టం వచ్చాక కూడా చాలామంది పిల్లలకు చదువు అబ్బడం లేదు. అందరం సమస్యను గమనిస్తూ ఉంటాం. కాని దాని పరిష్కారానికి ఎంతో కొంత పని చేయడం అవసరం. నేను ఆ పని చేయాలనుకున్నాను’ అంటుంది హైమంతి సేన్. వీధి బాలల కోసం పని చేయాలి అని 2018లో అనుకున్నాక మురికివాడల చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ బడుల్లోకి వెళ్లి అక్కడి హెడ్మాస్టర్లతో మాట్లాడింది ఆమె. ‘ఆ పిల్లలతో వేగలేము. వాళ్లు సరిగ్గా స్కూళ్లకు రారు. వచ్చినా సాటి పిల్లలను చెడగొడతారు. యూనిఫామ్‌లు పుస్తకాలు తీసుకెళ్లి పత్తా ఉండరు.’ అని వారు చెప్పారు. అదొక్కటే కాదు... ఆరేడేళ్ల వయసు వచ్చాక కూడా స్కూల్‌కు పంపకపోవడం వల్ల ఆ వయసు పిల్లలను నేరుగా రెండో క్లాసులోనో మూడో క్లాసులోనో వేయడం సమస్య అవుతోంది. ఆ క్లాసును వాళ్లు అందుకోలేరు. చిన్న క్లాసులో కూచోలేరు. ‘ఇవన్నీ చూశాక ఆ పిల్లలను చదివించి బ్రిడ్జ్ కోర్స్లాంటిది చేయించి నేరుగా స్కూళ్లలో చేర్పించాలి అనుకున్నాను’ అంది హైమంతి. ముందు ఆమె ఏదైనా స్థలం వెతికి ఆ పని చేయాలనుకుంది కాని పిల్లలను ఆకర్షించాలంటే వాళ్లు స్వేచ్ఛగా నేర్చుకుంటున్నాము అనుకోవాలంటే స్కైవాక్లే సరైనవి అనుకుంది. ‘అయితే పిల్లలను పట్టుకురావడం అంత సులభం కాదు. మురికివాడల్లోని తల్లిదండ్రులు వారి చేత పని చేయిద్దామనుకుంటారు. వారిని ఒప్పించి తీసుకురావాల్సి వచ్చింది’ అందామె. ఈ రెండేళ్లలో దాదాపు 35 కుటుంబాల పిల్లలు ముంబైలోని నాలుగు స్కైవాక్ స్కూళ్లలో చదువుకున్నారు. ‘ఉషిక అనే అమ్మాయి మా బడి చూశాక వాళ్ల అమ్మా నాన్న మీద పెద్ద యుద్ధం చేసి మా దగ్గర చదువుకుంది. ఈ సంవత్సరం స్కూల్లో చేరనుంది. ఇంతకు మునుపు మట్టిలో ఆడుకుంటూ మురిగ్గా ఉండే తమ పిల్లలు ఇప్పుడు అక్షరాలు చదవడం చూసి తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు. ఉషిక చదువుకోవడం మొదలెట్టాక మా సహాయంతో ఆమె తల్లిదండ్రులు ఒక స్థిర నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నారు’ అంది హైమంతి. స్కైవాక్‌ల మీద వచ్చే పోయేవారిలో ఈ పిల్లల పట్ల ఇలాంటి పిల్లల పట్ల సానుభూతి ఏర్పడి సాయానికి ముందుకు రావాలని కూడా హైమంతి ఆలోచన. హైమంతి చేస్తున్న పని చాలా ప్రశంసలకే పాత్రమైంది. కాని ‘ఈ పిల్లలు ఏం చేసినా బాగుపడరు’ అనే నిరాశ కూడా వ్యక్తమైంది. కాని హైమంతితో కలిసి నడిచే వాలంటీర్లు వస్తున్నారు. పిల్లలను వెతికి వెతికి వారికి ఆసక్తి కలిగేలా పాఠాలు చెబుతున్నారు. వారి చేతికి అక్షరాలు అనే దారి దీపాలు ఇవ్వడానికి చూస్తున్నారు. నగరాల్లో ఇలాంటి పిల్లలను వెతికి ఈ పని చేసే ఇలాంటి వారు మరింత మంది ఉంటే బాగుణ్ణు. -
Viral Video: క్లాస్‌రూంలో టీచర్ల డ్యాన్స్.. సస్పెండ్ చేసిన ఉన్నతాధికారి
ఆగ్రా: సాధారణంగా ఇంట్లో కుటుంబ సభ్యులతో, వివాహ ఊరేగింపులో డాన్స్‌లు చేస్తుంటాం. కొన్ని సార్లు అధికారికంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా నృత్యం చేస్తారు. కానీ, ఓ ఐదుగురు టీచర్లు ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో సినిమా పాటలకు నృత్యం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆగ్రా జిల్లాలోని ఓ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో ఐదుగురు టీచర్లు హింది సినిమా పాటలకు డాన్స్‌లు చేశారు. వీరంతా ప్రాథమిక విద్యా శాఖలో ఉద్యోగస్తులుగా పని చేస్తున్నారు. అయితే వీరు టీచర్ల సర్వీస్ రూల్స్‌ను అతిక్రమించి, విద్యా శాఖ ప్రతిష్టను దెబ్బ తీశారని సంబంధింత ప్రాథమిక శిక్షా అధికారి బ్రజరాజ్ సింగ్ సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చారు. అదే విధంగా క్లాస్‌రూంలో నృత్యం చేయడానికి గల కారణాలును తెలియజేయాలని ఆదేశించారు. బ్రజరాజ్ సింగ్ ఆదేశాలకు నలుగురు టీచర్లు వివరణ ఇవ్వగా, మరో టీచర్ ఇంకా వివరణ ఇవ్వలేదు. ఇందులో నలుగురు అసిస్టెంట్ టీచర్లు కాగా, ఒకరు హెడ్ టీచర్. అయితే ఈ ఏడాది మార్చి 21న టీచర్ల డాన్స్ చేశారు. అప్పటి ఈ ఈ వీడియో ప్రస్తుతం వెలుగులోకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ మారింది. -
తూర్పుగోదావరి: క్లాస్‌రూంలో పెళ్లి
-
క్లాస్‌రూంలో పెళ్లి చేసుకున్న ఇంటర్ స్టూడెంట్స్
సాక్షి, తూర్పుగోదావరి : ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు తరగతి గదిలోనే పెళ్లి చేసుకున్న ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జూనియర్ కళాశాలలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఇంటర్మీడియట్ సెకండియర్ ఎంపీసీ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు గతనెల 17న తరగతి గదిలోనే తూతూమంత్రంగా వివాహం చేసుకున్నారు. మూడు ముళ్లు వేసి బొట్టు పెట్టి పెళ్లి చేసుకున్న తతంగం మొత్తాన్ని వీడియో తీసుకున్నారు. ఇది కాస్తా వైరల్‌గా మారడంతో కాలేజీ ప్రిన్సిపల్ వారికి టీసీ ఇచ్చి పంపించేశారు. అయితే ఇది నిజమైన పెళ్లికాదని, సోషల్ మీడియాలో లైకుల కోసం మాత్రమే చేశామని విద్యార్థులు చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విద్యార్థుల పేరేంట్స్‌కు సమాచారం ఇచ్చామని తెలిపారు. అయితే విద్యార్థులు చేసిన పనితో వారి తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. చదువుకోవాల్సిన వయస్సులో ఇలాంటి పిచ్చి పనులు చేయడమేంటని తలపట్టుకుంటున్నారు. చదువుకోమని కాలేజీ పంపిస్తే తమ పరువును ఇలా బజారుకీడుస్తారా అంటూ వాపోతున్నారు. -
తరగతి గదిలో దస్తూరి తిలకం
గ్వాలియర్‌లో వాజ్‌పేయి చదువుకున్న పాఠశాల ఆయన జ్ఞాపకాల్లో తడిసిముద్దవుతోంది. ఆయన చేతిరాతతో ఉన్న రిజిస్టర్ తమకు పెన్నిధి అంటూ గర్వంగా చెప్పుకుంటోంది. కృష్ణాదేవి, కృష్ణ బిహారి వాజ్‌పేయి దంపతులకు 1924 సంవత్సరం క్రిస్మస్ పర్వదినం రోజు జన్మించిన అటల్ బిహారి వాజ్‌పేయి గోరఖి పాఠశాలలో ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నారు. ఆ సమయంలో ఆ పాఠశాలకు వాజ్‌పేయి తండ్రే ప్రిన్సిపాల్‌గా ఉండేవారు. వాజ్‌పేయి స్కూలు రిజిస్టర్లో తన స్వదస్తూరితో పేరును రాసుకున్నారు. ప్రస్తుతం ఆ పాఠశాల శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ, వాజ్‌పేయి చేతిరాత ఉన్న రిజిస్టర్ మాత్రం పదిలంగా ఉంది. ‘ఈ రిజిస్టర్ మాకో నిధిలాంటిది. నెంబర్ 101 దగ్గర ఉన్న పేరు వాజ్‌పేయిదే. 1935లో ఆరో తరగతిలో చేరడానికి వచ్చినప్పుడు వాజపేయి స్వయంగా తన పేరుని రాసుకున్నారు. ఇప్పుడే ఇది ఒక చారిత్రక పత్రంగా మారింది‘ అని స్కూలు ప్రిన్సిపాల్ కె.ఎస్.రాథోడ్ ఉద్వేగంగా చెప్పారు. అంతేకాదు ఆ పాఠశాలను కూడా స్థానికులు అటల్ జీ అంటూ ప్రేమగా పిలుస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆ పాఠశాల అలాగే గుర్తింపు ఉంది. స్కూల్ రోజుల్లో వాజ్‌పేయి కబడ్డీ, హాకీ ఆటలు ఆడేవారు. అందరు విద్యార్థుల మాదిరిగానే సైకిల్ వేసుకొని పట్టణం అంతా చక్కెర్లు కొట్టేవారు. చిన్నప్పట్నుంచి అటల్జీకి స్వీట్లు అంటే ప్రాణం. గ్వాలియర్ ఎప్పుడు వచ్చినా తనకిష్టమైన మిఠాయి దుకాణానికి వెళ్లి లడ్డూలు, గులాబ్‌జాములు లాగించేవారు. తాను పుట్టిన గడ్డ, చిన్నతనంలో గడిపిన పరిసరాలు, చదువుకున్న స్కూలు, నోరూరించే మిఠాయిలుండే దుకాణాలు ఇవంటే వాజపేయికి ఎంతో మమకారం. ఆ అనుబంధంతోనే 1984 లోక్‌సభ ఎన్నికల్లో గ్వాలియర్ నుంచి పోటీ చేశారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి మాధవ్ రావు సింధియా చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. సొంత గడ్డ తనని ఓడించడాన్ని తట్టుకోలేకపోయారు. అందుకే మరోసారి గ్వాలియర్ నుంచి పోటీ చేయడానికి ఆయన సాహసించలేదు. కానీ తరచూ గ్వాలియర్ వెళ్లి వస్తూ ఉండేవారు. 2006లో చివరిసారిగా వాజపేయి గ్వాలియర్‌కు వెళ్లారు. అనారోగ్యం కబళించడంతో ఆయన ఆ తర్వాత వెళ్లలేకపోయారు. ఎన్నికల్లో ఓడిపోయినా, చివరి రోజుల్లో వెళ్లలేకపోయినా గ్వాలియర్‌తో అటల్జీకున్న అనుబంధం మరువలేనిది. ఉత్తమ గేయ రచయిత వాజ్‌పేయి వాజ్‌పేయి కవిత్వం కొత్త చిగుళ్లు తొడుక్కున్న ఆమనిలా ఆహ్లాదాన్ని పంచుతుంది. సహజంగానే సున్నిత మనస్కుడు, ప్రేమమూర్తి , భావకుడు అయిన వాజ్‌పేయి కలం నుంచి మరువలేని, మరపురాని అద్భుతమైన కవితలెన్నో జాలువారాయి. అలాంటి కవిత్వానికి ఒక సినిమా అవార్డు వస్తుందని ఎవరైనా ఊహించగలరా ? అసలు వాజపేయి కూడా అనుకోలేదు తన కవిత్వానికి ఒక అవార్డు వస్తుందని.. స్క్రీన్ అవార్డుల కమిటీ మాత్రం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ వాజపేయిని ఉత్తమ గేయ రచయితగా ఎంపిక చేశారు. వాజ్‌పేయి కవితల్లో ఆణిముత్యాల్లాంటివి కొన్నింటిని ఏరి గజల్మాస్ట్రో జగిత్ సింగ్ ఆలపించారు. అవన్నీ నవి దిశ పేరుతో 1999లో ఆల్బమ్‌గా వచ్చాయి. ఈ ఆల్బమ్‌కు 2000 సంవత్సరంలో నాన్ ఫిల్మ్ కేటగిరీలో ఉత్తమ గేయ రచయితగా వాజపేయి అవార్డు దక్కించుకున్నారు. అయితే అప్పుడు వాజ్‌పేయి ప్ర«ధానమంత్రిగా ఊపిరి సలపని పనుల్లో ఉండడంతో అవార్డు ప్రదానోత్సవానికి హాజరు కాలేకపోయారు. ఆ తర్వాత ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లి అవార్డుని అందజేశారు. -
తరగతి గదిలో సెల్‌ఫోన్‌తో ఆటలేంటి?
చిత్తూరు ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని కొంగారెడ్డి పల్లిలో ఉన్న గాండ్లపల్లి మున్సిపల్ హైస్కూల్‌ను డీఈఓ పాండురంగస్వామి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ‘సాక్షి’ దినపత్రికలో సోమవారం ప్రచురితమైన ‘ఉపాధ్యాయులే.. పాఠం చెప్పరు’ వార్తపై ఆయన స్పందించి, పాఠశాలను తనిఖీ చేశారు. ఆ పాఠశాలలో మ్యాథ్స్ టీచర్ ఖాదర్‌బాషా తరగతి గదిలో సెల్‌ఫోన్‌తో ఆటలు ఆడుతుండడం గుర్తించి, తరగతి గదిలో సెల్‌ఫోన్‌తో ఆటలు అవసరమా.. అంటూ మండిపడ్డారు. అతనిపై చర్యలకు నివేదికలు సిద్ధం చేయమని చిత్తూరు మండలం ఎంఈఓ సెల్వరాజ్‌ను ఆదేశించారు. అలాగే పక్కరూంలో సమ్మేటీవ్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు సమాధానాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్న మరో టీచర్‌ను మందలించారు. సమ్మేటివ్ పరీక్షలను పర్యవేక్షించకుండా ఆఫీసు రూంలో ఉన్న టీచర్ పరంజ్యోతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలను పర్యవేక్షించడం ఇలాగేనా అంటూ డీఈఓ హెచ్ఎంను ప్రశ్నించారు. పాఠశాలలో అన్ని తరగతి గదుల్లో జరుగుతున్న సమ్మేటివ్ –1 పరీక్షలను పరిశీలించారు. పరీక్షలు రాస్తున్న 8, 9 తరగతులను ఆబ్జెక్టివ్ పరీక్షా విధానంపై అడిగి తెలుసుకున్నారు. -
క్లాస్ రూమ్‌లో టీచర్‌కు చేదు అనుభవం
-
క్లాస్ రూమ్‌లో టీచర్‌కు చేదు అనుభవం
ఉపాధ్యాయ వృత్తి అనేది నేడు కత్తిమీద సాము లాంటిదే. ఇంట్లో ఒకరిద్దరు పిల్లలను కంట్రోల్ చేయడానికే తల్లిదండ్రులకు ప్రాణం మీదకు వస్తుంది. అలాంటిది తరగతి గదిలో విద్యార్థులను మేనేజ్ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అది కూడా టీనేజ్ పిల్లల విషయంలో టీచర్లు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏమాత్రం తేడా వచ్చినా అంతే. చైనాలో ఓ టీచర్‌కు అలాంటి అనుభవమే ఎదురైంది. ప్రస్తుతం ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. చైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్ ‘వైబో’ పోస్ట్ చేసిన ఈ వీడియోకు రెండు మిలియన్ వ్యూస్ వచ్చాయి. ‘ఓ ఉపాధ్యాయురాలు క్లాస్‌రూమ్‌లో అల్లరి చేస్తున్న ఓ విద్యార్థిని తిడుతోంది. పద్ధతి మార్చుకోవాలంటూ ఆ విద్యార్థిని కొట్టేందుకు టీచర్ చెయ్యెత్తుతుంది. అయితే విద్యార్థిని కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ప్రతి సమాధానం ఇవ్వడంతో పాటు, కొట్టాలంటూ తన ముఖాన్ని టీచర్ చేతి దగ్గరకు తీసుకువస్తుంది. దీంతో టీచర్ ఆ విద్యార్థిని చెంపపై ఒక్కటిస్తుంది. అయితే కథ అక్కడితో ఆగిపోలేదు... విద్యార్థిని కూడా తానేమీ తక్కువ తినలేదంటూ... షార్ప్‌గా రియాక్ట్ అవుతుంది. ప్రతిగా టీచర్ చెంప చెళ్లుమనిపిస్తుంది. దీంతో సీన్.. టీచర్, విద్యార్థిని కలబడి కొట్టుకునేవరకూ వెళుతుంది. ఆ షాక్ నుంచి తేరుకున్న మిగతా విద్యార్థులు వారిద్ధర్ని విడదీసేందుకు నానా కష్టాలు పడతారు.’ అయితే ఈ సంఘటన చైనాలోని ఏ స్కూల్లో జరిగిందనే వివరాలు మాత్రం ఆ వీడియోలో లేవు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. -
డిజిటల్ క్లాస్‌రూమ్‌తో మంచి ఫలితాలు
కాకినాడ సిటీ : పాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌రూమ్‌ల ద్వారా విద్యాబోధన చేసే ప్రయత్నంతో మంచి ఫలితాలు వస్తాయని, ఇందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ అరుణ్‌కుమార్ కోరారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ కోర్టు హాల్ నుంచి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో డిజిటల్ క్లాస్ రూమ్లపై మండలస్థాయి వీడియో కాన్ఫరె¯Œ్స నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిజిటల్ క్లాస్‌రూమ్‌ల నిర్వహణతో ఉపాధ్యాయులు సహకారంతో పాటు నాణ్యమైన విద్య పెరుగుతుందన్నారు. ఇంటర్నెట్లో ఎక్కువ యాప్‌లు డౌ¯ŒSలోడ్ చేసుకుని విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలన్నారు. ఏపీ ఫైబర్ గ్రిడ్ ద్వారా అన్ని హైస్కూళ్లకు మార్చి నెలాఖరుకు బ్రాడ్ బ్యాండ్ ఇవ్వనున్నామని తెలిపారు. ఈ ఏడాది జిల్లా మొదటి స్థానంలో ఉండేలా ఉపా«ధ్యాయులు కృషి చేయాలన్నారు. ఎస్ఎస్ఏ పీఓ శేషగిరి, ఇ¯ŒSచార్చి డీఈఓ అబ్రహం, డీవైఈఓ వాడపల్లి పాల్గొన్నారు. -
మోగనున్న డిజిటల్ గంట!
– 15 నుంచి జిల్లాలో 20 పాఠశాలల్లో డిజిటల్ తరగతులు – రెండో దశలో 80 పాఠశాలల కోసం ప్రతిపాదనలు – డివిజన్‌కు 20 పాఠశాలలకు చొప్పున నిర్వహణ – దాతల సాయంతో ఇప్పటికే 12 పాఠశాలల్లో డిజిటలైజేషన్ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఒకప్పుడు ఉపాధ్యాయులు..విద్యార్థులతో ఇసుకలో అక్షరాలు దిద్దించే వారు. తరువాత బ్లాక్ బోర్డులు రంగప్రవేశం చేయాయి. బోధన ఉపకరణాలు మెరుగుపెడ్డాయి. రాను రాను కంప్యూటర్లు సైతం అందుబాటులోకి వచ్చాయి. ఇంకా సాంకేతికంగా అభివృద్ధి చెంది.. నేడు డిజిటల్ ప్రపంచం రాజ్యమేలుతోంది. విద్యావిధానంలో ఇది పెనుమార్పు తీసుకొస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లోనూ డిజిటల్ తరగతుల నిర్వహణకు గంట కొట్టారు. త్వరలో స్రీన్‌పై త్రీడీ బొమ్మలతో విద్యార్థులకు నూతన పాఠాలు పరిచయం కానున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు సాంకేతికంగా అభివృద్ధి చెందనున్నాయి. జిల్లాలో వంద పాఠశాలలు డిజిటల్ సొబగులు అందిపుచ్చుకోనున్నాయి. ఈ నెల 15వ తేదీ నుంచి మొదటి దశలో 20 పాఠశాలల్లో డిజటిటల్ తరగతులు ప్రారంభం కానున్నాయి. రెండో దశలో మరో 80 పాఠశాలల్లో డిజిటల్ క్లాసు రూంల కోసం విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది. ఇప్పటికే జిల్లాలో దాతల సాయంతో 12 పాఠశాలల్లో డిజిటల్ తరగతులు పేద విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. అనుకున్నట్లు జరిగితే మరో రెండు, మూడు నెలలల్లో మొత్తం 112 పాఠశాలల్లో డిజిటలైజ్ కానున్నాయి. ప్రధానోపాధ్యాయులకు శిక్షణ.. రాష్ట్ర ప్రభుత్వం 5 వేల ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతులను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంది. అందులో భాగంగా మొదటి దశలో 18 పాఠశాలలను ఎంపిక చేసింది. ఆ సంఖ్యను ఇక్కడి అధికారులు మరో రెండు పాఠశాలలను కలిపి మొదటి దశలో మొత్తం 20 పాఠశాలల్లో ఈనెల 15 నుంచి డిజిటల్ తరగతులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు శిక్షణ కూడా ఇచ్చారు. స్కూలు, మెయింటెన్స్ గ్రాంట్ల నుంచి డిజిటల్ తరగతులకు అవసరమయ్యే స్క్రీన్లు, ప్రొజెక్టర్లు, కంప్యూటర్లు, సబ్జెక్టుల సీడీలు/డీవీడీలు కొనుగోలుకు విద్యాశాఖాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇవీ మొదటి దశ పాఠశాలలు 1.జెడ్పీహెచ్ఎస్, హల్వీ 2.జెడ్పీహెచ్ఎస్(బీ), కోసిగి 3. గవర్నమెంట్ హైస్కూల్, నందికొట్కూరు 4.గవర్నమెంట్ హైస్కూల్, ఆత్మకూరు 5.ఏపీఆర్ఐఈఎస్(బీసీ), సున్నిపెంట 6.జెడ్పీహెచ్ఎస్(గర్ల్స్) కోడుమూరు 7. జెడ్పీహెచ్ఎస్(బాయ్స్), వెల్దుర్తి 8. జెడ్పీహెచ్ఎస్ రంగాపురం 9. జెడ్పీహెచ్ఎస్ గడివేముల 10. జెడ్పీహెచ్ఎస్, శిరివెళ్ల 11. గవర్నమెంట్ హైస్కూల్, అళ్లగడ్డ 12. జెడ్పీహెచ్ఎస్, చాగలమర్రి, 13. జెడ్పీహెచ్ఎస్ దొర్నిపాడు, 14. జెడ్పీహెచ్ఎస్, దీబగుంట్ల, 15.జెడ్పీహెచ్ఎస్ నందవరం 16. జెడ్పీహెచ్ఎస్(గర్ల్స్), బనగానపల్లె 17.జెడ్పీహెచ్ఎస్(గర్ల్స్), డోన్ 18.జెడ్పీహెచ్ఎస్(గర్ల్స్) పత్తికొండ, 19.జెడ్పీహెచ్ఎస్ నిడ్జూరు, 20.జెడ్పీహెచ్ఎస్ కంబాలపాడు డివిజన్‌కు 20 పాఠశాలలు చొప్పున.. జిల్లాలో మొత్తం 898 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రైవేట్‌లో 354, ఎయిడెడ్‌లో 45, రెసిడెన్షియల్లో 123, మునిసిపల్‌లో 16, జెడ్పీలో 335, గవర్నమెంట్లో 25 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో గవర్నమెంట్, జెడ్పీ, మునిసిపల్ పాఠశాలలు కలిపి మొత్తం 376 ఉన్నాయి. వీటిలో డివిజన్‌కు 20 పాఠశాలల్లో చొప్పున మొత్తం 80 ఉన్నత పాఠశాలల్లో రెండోదశలో డిజిటల్ క్లాసు రూంలను ఏర్పాటు చేసేందుకు విద్యాశాఖ ప్రణాళిలకను రూపొందించింది. అత్యాధునిక వసతులు.. అత్యాధునిక వసతులతో డిజిటల్ క్లాసు రూంలు ఏర్పాటు కానున్నాయి. ప్రొజెక్టర్, స్క్రీన్, ల్యాప్‌టాప్‌లతోపాటు మరికొన్ని అత్యాధునిక పరికరాలు ఉంటాయి. వీటితోపాటు తరగతి గదిలో విద్యార్థులు కూర్చోవడానికి ప్రత్యేక కుర్చీలు, టేబుల్లు అమర్చుతారు. వీటన్నింటినీ ఉన్నతాధికారులే కొనుగోలు చేసిన ఎంపిక చేసిన పాఠశాలలకు పంపుతారు. డిజిటల్ తరగతులతో విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం కలుగుతుందనడంలో సందేహం లేదు. ఒక అంశానికి సంబంధించిన బొమ్మలు, మ్యాపులు, వివరణలతో కూడిన త్రీడీ ప్రింటుతో కూడిన చిత్రాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు ప్రత్యక్ష అనుభూతి కలిగేలా చేస్తాయి. ఇక్కడ బోధన చేసే ఉపాధ్యాయుడికి కూడా పనిభారం తగ్గుతుంది. దీంతో ఆయన అంశాన్ని విశదీకరించేందుకు ఎక్కువగా సమయం దొరుకుతుంది. ఆహ్వానించదగ్గ విషయం: కరుణానిధిమూర్తి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు డిజిటల్ క్లాసు రూంల ఏర్పాటు మంచిదే. వీటితో విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం కలుగుతుంది. తద్వారా పాఠ్యాంశాలు సులభంగా అర్థమవుతాయి. అన్ని ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేయాలి. -
తరగతి గదిలో ఘాతుకం
-
తరగతి గదిలో ఘాతుకం
సాక్షి, చెన్నై: తరగతి గదిలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని మాజీ విద్యార్థి కొట్టి చంపాడు. ఈ సంఘటన తమిళనాడులోని కరూర్‌లో చోటుచేసుకుంది. కరూర్‌లోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో శివగంగై జిల్లా మానామదురైకు చెందిన సోనాలి మూడో సంవత్సరం సివిల్ ఇంజినీరింగ్ చదువుతోంది. యథాప్రకారం మంగళవారం ఉదయం 11 గంటలకు తరగతి గదిలో ప్రొఫెసర్ చెప్పే పాఠాలను వింటూ కూర్చుంది. ఈ సమయంలో హఠాత్తుగా లోనికి ప్రవేశించిన ఓ యువకుడు చేతిలో ఉన్న దుడ్డుకర్రతో ఆమె తలపై దాడి చేశాడు. ఉన్మాది వలే హఠాత్తుగా అతడు ప్రవర్తించిన తీరు నుంచి అక్కడి విద్యార్థులు తేరుకునేలోపు తీవ్రంగా దాడి చేసి పారిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న సోనాలిని సహచర విద్యార్థులు, కళాశాల సిబ్బంది స్థానికంగా ఉన్న సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మదురైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందింది. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన ఉదయకుమార్ అనే యువకుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో ఉదయకుమార్ కళాశాల నుంచి సస్పెండ్ అయినట్టు తేలింది. సోనాలి తండ్రి నాలుగు నెలల క్రితం మరణించాడు. ఆమె తల్లి చెన్నైలో ఓ చిన్న సంస్థలో పని చేస్తూ తన కుమార్తెను చదివిస్తున్నట్టు విచారణలో తేలింది. తన ప్రేమను తిరస్కరించడంతో వల్లే ఉదయకుమార్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. రెండు నెలల క్రితం ఇదేతరహాలో చెన్నైలో ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్యకు గురైంది. తనను తిరస్కరించిందనే కోపంతో స్వాతిని ఓ యువకుడు రైల్వే స్టేషన్ లో నరికి చంపాడు. -
పాఠశాల్లో రక్తపు మరకలు..
భయంతో పరుగులు పెట్టిన విద్యార్థులు గ్రంథాలయానికి విద్యార్థుల తరలింపు తిరువళ్లూరు : ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు తరగతి గదిలో పగులగొట్టబడి ఉన్న మద్యం సీసాలు, రక్తపు మరకలను చూసి భయంతో పరుగులు పెట్టారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ కావాంగొలత్తూరు గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉంది. ఈ పాఠశాల్లో 90 మంది విద్యార్థులున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా ధనం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం పాఠశాలకు యథావిధిగా విద్యార్థులు రాగా 9.10 గంటలకు పాఠశాల తాళాలను తెరిచారు. వెనుక ఉన్న కిటికీలను పగలగొట్టి ఉండడం చూసి ఉపాధ్యాయులు షాక్‌కు గురయ్యారు. దీంతో పాటు పాఠశాల తరగతి గదిలో రక్తపు మరకలు, పగిలిన మద్యం సీసాలు ఉండడంతో కడంబత్తూరు పోలీసులు, విద్యాశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తరగతి గదిని పరిశీలించి కొన్ని ఆధారాలను సేకరించారు. విద్యార్థులు ఆందోళన చెందుతున్నట్టు గుర్తించిన ఉపాధ్యాయులు వారిని గ్రంథాలయ గదిలోకి పంపారు. తాళం వేసి ఉంచిన తరగతి గది కిటికీలను పగలగొట్టి ఎవరు లోనికి ప్రవేశించారన్న దానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బీరు తాగిన అమ్మాయిలకు టీసీలు
చెన్నై: పట్టపగలు.. క్లాస్ రూంలో నలుగురు అమ్మాయిలు కలిసి బీరు కొడతారని ఎప్పుడైనా ఊహించారా? ఆ స్కూలు యాజమాన్యం కూడా ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. విషయం తెలియగానే ముందు షాకైనా.. తర్వాత ఆ నలుగురికీ టీసీలు ఇచ్చి ఇంటికి పంపేశారు. ఇదేదో కార్పొరేట్ స్కూల్లో.. బాగా డబ్బున్న ఆసాముల పిల్లలు అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. తమిళనాడు నమక్కల్ జిల్లాలోని తిరుచెంగోడ్‌లో గల ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన వ్యవహారమిది. వీళ్లంతా 11వ తరగతి (జూనియర్ ఇంటర్) చదువుతున్నారు. చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎస్. గోపీదాస్ ఆదేశాలతో వీళ్లకు టీసీలు ఇచ్చినట్లు తెలుస్తోంది. క్లాసులో నలుగురు అమ్మాయిలు తాగిన మత్తులో ఉన్నట్లు క్లాస్ టీచర్ గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే ఆమె ప్రధానోపాధ్యాయురాలికి చెప్పగా, వాళ్లను ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ.. ఆ నలుగురూ మద్యం తాగినట్లు నిర్ధారణ అయ్యింది. స్నేహితురాలి పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోడానికి మొత్తం ఏడుగురు విద్యార్థినులు ఆ రోజు స్కూలుకు వచ్చారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు కూల్ డ్రింకు బాటిళ్లలో బీరు నింపుకొని తీసుకొచ్చారు. అయితే, తర్వాత వాళ్లలో ముగ్గురు భయపడి.. తాగలేదు. మిగిలిన నలుగురూ తాగడంతో.. వాళ్లకు మాత్రం టీసీలు ఇచ్చి పంపేశారు. -
బడి ఒడిలో..
-
క్లాస్రూమ్ పాలిటిక్స్
-
పాఠశాల పైకప్పు కూలి విద్యార్థినికి గాయాలు
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బీర్కూరు మండలం చించొల్లి గ్రామంలోని మంగళవారం పాఠశాల పైకప్పు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విద్యార్థిని కవిత తీవ్రంగా గాయపడింది. స్కూల్ సిబ్బంది వెంటనే స్పందించి ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కవితకు ప్రాధమిక వైద్యం అందించి వైద్యులు మెరుగైన వైద్య చికిత్స కోసం పెద్ద ఆసుపత్రికి తరలించాలని సూచించారు. దీంతో ఆమె మరో ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఉదయమే పాఠశాలకు వచ్చిన కవిత తరగతి గదిలో బ్యాగ్ పెట్టిన సమయంలో పాఠశాల పైకప్పు కూలిందని స్కూల్ సిబ్బంది తెలిపారు. -
టీచర్లను చితక్కొట్టిన విద్యార్థినులు
-
ఏమని చెప్పను!
కాలేజీ రోజుల్లో రవీందర్ అనే ఫ్రెండ్ ఉండేవాడు. కవిత్వం బాగా రాసేవాడు. అతని కవిత్వాన్ని విని మేమంతా ‘వహ్వా వహ్వా’ అని ఎంజాయ్ చేసేవాళ్లం. మేము మాత్రమే కాకుండా లెక్చరర్లు, కాలేజీ సిబ్బంది కూడా అతని కవిత్వాన్ని ఆస్వాదించేవారు. ఒకరోజు ‘ఆశు కవిత్వం’ పేరుతో ఒక కార్యక్రమం పెట్టాడు. ఎవరు ఏ టాపిక్ చెప్పినా అప్పటికప్పుడు కవిత్వం చెప్పడం మొదలుపెట్టాడు. ప్రేక్షకుల నుంచి నాగరాజు అనే సీనియర్ లేచి ‘‘ఇలా అప్పటికప్పుడు కవిత్వం చెప్పడం పెద్ద విషయం కాదు.. నేను కూడా చెప్పగలను. కావాలంటే చెక్ చేసుకోండి’’ అని సవాలు విసిరాడు. ‘‘రవి వాన మీద కవిత్వం చెప్పాడు కాబట్టి నువ్వు ఎండ మీద చెప్పు’’ అన్నారు ఎవరో. ‘‘అలాగే’’ అంటూ మొదలు పెట్టాడు నాగరాజు- ‘ఎండ మీద చెప్పమన్నావు... ఏమని చెప్పను! ఏమీ చెప్పకపోతే ఎండలా మండి పడతావు. అందుకే నిండుగా చెబుతున్నా ఎండ అంటే చెమటసముద్రం... అందులో మనం ఈదుతూనే ఉంటాం’ రవీందర్ కవిత్వం విని అందరం నవ్వుకున్నాం. అది ఇప్పటికీ గుర్తుకొస్తూనే ఉంటుంది. -పి. ప్రశాంత్, విజయనగరం -
కలకలం రేపుతున్న విద్యార్ధి మరణం
-
ఆత్మరక్షణకే అయినా...
సుమారు రెండేళ్ల క్రితం... ఆదిలాబాద్ జిల్లాలో గంగాభవాని అనే టీచర్ మీద క్లాస్‌రూమ్‌లోనే దాడి జరిగింది. ఆ దాడిలో ఆమె ప్రాణాలు పోయాయి. దాడికి పాల్పడింది ఒక ప్రేమోన్మాది. గ్రామస్థులు ఆ ఉన్మాదిని కొట్టి చంపేశారు. ఇది ధర్మాగ్రహమే అయినా వారి మీద కేసు నమోదైంది. అలాగే మహబూబ్‌నగర్ చిన్న చింతకుంటలో బహిర్భూమికి వెళ్లిన మహిళపై అత్యాచారం చేశాడు సీఐ. గ్రామస్థులు ఆ సీఐని కొట్టి చంపేశారు. ఖమ్మంలో మరో మహిళ తన మీద అత్యాచారం జరగకుండా అడ్డుకోగలిగింది. ఆ తర్వాత ఊరందరి సహకారంతో ఆగంతకుడి మీద ఎదురుదాడి చేసింది. ఈ విధమైన సందర్భాలలో ఆత్మరక్షణలో భాగంగా హత్య, తిరుగుబాటులో భాగంగా హత్య, ప్రతిఘటనలో భాగంగా హతమార్చడం... ఈ మూడు కోణాల్లో కేసును పరిశీలించి తీర్పు ఇస్తుంది న్యాయస్థానం. ఇలాంటి కేసుల విషయంలో ఆ మహిళలకు న్యాయం జరిగే వరకు, కేసును పక్కదారి పట్టనివ్వకుండా సంధ్య వంటి సామాజిక ఉద్యమకారులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. అయినా మహిళల మీద లైంగికదాడులు ఆగకపోగా పెరిగిపోతున్నాయి. ఈ దాడులను అడ్డుకోవాలంటే ఆత్మరక్షణ ఒక్కటే మార్గం. అయితే మహిళ ఆత్మరక్షణలో భాగంగా చేసిన దాడిలో అత్యాచారయత్నానికి పాల్పడినవాడి ప్రాణాలు పోతే!.. ఆ మహిళ న్యాయస్థానంలో విచారణను ఎదుర్కోవలసిందేనా? ఆ మహిళకు శిక్ష తప్పదా? ఈ సందేహాలకు చాలా సందర్భాలలో అవుననే సమాధానం అంటారు న్యాయవాది నిశ్చలసిద్ధారెడ్డి. స్త్రీ తనను తాను రక్షించుకునే క్రమంలో హత్య జరిగిన సందర్భంలో... రేప్ జరిగిన తర్వాత హత్య జరిగితే ఐపిసి 376, 302 అనే రెండు సెక్షన్ల కింద బాధితురాలిపైనే కేసు నమోదవుతుంది. దీనితోపాటు కేసులో తీర్పు రావడానికి కనీసం రెండు-మూడేళ్లు పడుతుంటుంది. ఇలాంటి కేసుల్లో నిర్భయ కేసులో వచ్చినట్లు త్వరితగతిన విచారణ పూర్తి చేసి తీర్పు చెప్పడం చాలా అవసరం. అంతకంటే ముఖ్యంగా తాను చేసిన హత్య ఆత్మరక్షణ కోసమే అని బాధితురాలు నిరూపించుకోవడం చాలా అవసరం. కోర్టులో ప్రతివాది తరఫు న్యాయవాదుల (పురుష న్యాయవాదులు) ప్రశ్నలు చాలా ఇబ్బందికరంగా, మహిళ అవమానపడే విధంగా ఉంటాయి. వీటికి భయపడి చాలామంది కేసును మధ్యలోనే ఉపసంహరించుకుంటుంటారు. ఇలాంటి కేసులను మహిళా న్యాయవాదులే విచారించాలనే చట్టం ఇంతవరకు లేదు. అలాంటి చట్టం వస్తే బావుంటుంది. అసలు అత్యాచారం, హత్యకేసును నమోదు చేయడంలోనే లోపాలు జరిగిపోతుంటాయి. కేసును నీరుకార్చే విధంగా నమోదయితే ఆ కేసులో సదరు మహిళ చేసిన హత్య ఆత్మరక్షణకోసమే అని నిరూపించడం కష్టం. హత్యకు గురైన వ్యక్తితో తనకు ఎటువంటి వ్యక్తిగత ద్వేషాలు లేవని కూడా నిరూపించుకోవాలి. ఇలాంటి కేసు నమోదు ప్రక్రియ(ఎఫ్ఐఆర్) మహిళా పోలీసుల చేతిలో జరగాలి. పోలీసు ఉన్నది ఉన్నట్లుగా నమోదు చేసే నిష్పక్షపాతి అయి ఉండాలి. ఇక శిక్ష విషయానికి వస్తే... ఇలాంటి కేసుల్లో మహిళకు విధించే శిక్షలు మరీ అంత కఠినంగా ఉండవు. అయితే తనకు చట్టాన్ని చేతిలోకి తీసుకునే ఉద్దేశం లేదని న్యాయస్థానానికి విధేయతతో తెలియపరచడం చాలా అవసరం. ఇంకా ముఖ్యంగా తనను కాపాడుకోవడానికి చూపించిన తెగువనే చివరి వరకు కొనసాగించాలి. తీర్పు వచ్చే వరకు అదొక యజ్ఞంలా భావించి న్యాయంకోసం పోరాడాలి. - వాకా మంజులారెడ్డి