స్కూల్‌లో 14 ఏళ్ల విద్యార్థి కాల్పులు.. 9 మంది మృతి | 14 Year Old Kills Students Security Guard in Serbia School | Sakshi
Sakshi News home page

సెర్బియాలో కలకలం.. క్లాస్‌రూమ్‌లో 14 ఏళ్ల విద్యార్థి కాల్పులు.. 9 మంది మృతి

Published Wed, May 3 2023 4:34 PM | Last Updated on Wed, May 3 2023 4:58 PM

14 Year Old Kills  Students Security Guard in Serbia School - Sakshi

బెల్‌గ్రాడ్‌: సెర్బియా దేశంలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఓ పాఠశాలలో 14 ఏళ్ల విద్యార్థి తుపాకీతో వీరంగం సృష్టించాడు. ఎనిమిదో తరగతి చదువుతున్న బాలుడు తన టీచర్‌పై క్లాస్‌రూమ్‌లోనే విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అంతేగాక మిగతా విద్యార్థులు, సెక్యూరిటీగార్డుపై ఇష్టారీతిగా కాల్పులకు తెగబడ్డాడు. సెర్బియా రాజధాని బెల్‌గ్రాడ్‌లోని వ్లాడిస్లావ్ రిబ్నికర్ ఎలిమెంటరీ స్కూల్‌లో బుధవారం ఈ ఘోరం వెలుగు చూసింది.

ఈ ఘటనలో ఇప్పటివరకు సెక్యురిటీ గార్డుతోపాటు ఎనిమిది మంది విద్యార్థులు మరణించినట్లు సెర్బియా హోంమంత్రిత్వశాఖ పేర్కొంది. టీచర్‌తోపాటు పాటు ఆరుగురు పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని.. కాల్పులకు తెగబడిన విద్యార్థిని అరెస్టు చేశారు. కాల్పులకు గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. టీచర్‌ పరిస్థితి విషమంగా ఉందని, వైద్యులు ఆమెను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.

కాగా ముందుగా టీచర్‌పై కాల్పులు జరిపి తరువాత మిగతా విద్యార్థులపై కాల్పులు జరిపినట్లు క్లాస్‌లోని విద్యార్థుల్లో ఓ చిన్నారి తండ్రి చెప్పారు. అయితే తన కూతురుకు ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు. పాఠశాలలో ఒక్కసారిగా కాల్పులు చోటుచేసుకోవడంతో స్థానికంగా భయానక వాతావరణం నెలకొంది. తుపాకీ పేలిన శబ్ధం రావడంతో పాఠశాల నుంచి పిల్లలు అందరూ బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు భారీగా పాఠశాల వద్దకు చేరుకున్నారు. 
చదవండి: మంత్రిపై బాడీగార్డు కాల్పులు.. స్పాట్‌లోనే మృతి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement