బీహార్: నర్సరీ చదువుతున్న ఓ ఐదేళ్ల విద్యార్థి చదివే స్కూల్‌కి రహస్యంగా గన్నుతో వచ్చాడు. అదే స్కూల్లో చదువుతున్న పదేళ్ల విద్యార్థిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో బాధిత విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. కాల్పులు జరిపిన విద్యార్థి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
బీహార్‌లోని సుపాల్ జిల్లా లాల్‌పట్టి ప్రాంతానికి చెందిన సెయింట్ జోన్ బోర్డింగ్ స్కూల్‌లో ఐదేళ్ల బాలుడు నర్సరీ చదువుతున్నాడు. అయితే ఎప్పటిలాగే సదరు విద్యార్థి బుధవారం స్కూల్‌కు వచ్చాడు. వచ్చే సమయంలో రహస్యంగా తన స్కూల్ బ్యాగ్‌లో గన్ దాచాడు.
ఇక వచ్చీ రావడంతోనే అదే స్కూల్లో మూడో తరగతి చదువుతున్న పదేళ్ల బాలుడిపై కాల్పులు జరిపాడు. దీంతో అప్రమత్తమైన స్థానికులు,స్కూల్ యాజమాన్యం అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలుడికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు నిర్ధారించారు. కాల్పులపై సమాచారం అందుకున్న పోలీసులు బాధిత విద్యార్ధిని ప్రశ్నించారు. ఎందుకు కాల్పులు జరిగాయని ప్రశ్నించారు.
‘నేను నా క్లాస్‌కి వెళ్తున్నాను. అదే సమయంలో నర్సరీ విద్యార్థి తన బ్యాగ్‌లో నుంచి గన్ తీసి నాపై కాల్పులు జరిపాడు. ఆ విద్యార్థిని ఆపే ప్రయత్నం చేశా. ఆ ప్రయత్నంలో నర్సరీ విద్యార్థి నా చేతిపై కాల్పులు జరిపాడు’ అని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మూడో తరగతి విద్యార్థి పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు. తనపై కాల్పులు జరిపిన బాలుడితో ఎలాంటి గొడవ జరుగలేదని ఆ విద్యార్థి చెప్పాడు.
VIDEO | "In Triveniganj's St. Joan School, a student brought a pistol from home in a school bag and fired it during the school assembly. The bullet hit a 10-year-old boy in his arm. He was immediately provided medical treatment and now he is out of danger," says a police… pic.twitter.com/fdfkGQnnqZ
— Press Trust of India (@PTI_News) July 31, 2024
కాల్పుల ఘటనలో నిర్లక్ష్యం వహించిన సెయింట్ జోన్ బోర్డింగ్ స్కూల్ ప్రిన్సిపల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న కాల్పులు జరిపిన బాలుడు, అతడి తండ్రి కోసం పోలీసులు వెతుకుతున్నారు.
మరోవైపు ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. కాల్పులతో ఉలిక్కిపడ్డ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ స్కూల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment