ఆగ్రా: సాధారణంగా ఇంట్లో కుటుంబ సభ్యులతో, వివాహ ఊరేగింపులో డాన్స్‌లు చేస్తుంటాం. కొన్ని సార్లు అధికారికంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా నృత్యం చేస్తారు. కానీ, ఓ ఐదుగురు టీచర్లు ప్రభుత్వ ప్రైమరీ స్కూల్‌లో సినిమా పాటలకు నృత్యం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
ఆగ్రా జిల్లాలోని ఓ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్‌లో ఐదుగురు టీచర్లు హింది సినిమా పాటలకు డాన్స్‌లు చేశారు. వీరంతా ప్రాథమిక విద్యా శాఖలో ఉద్యోగస్తులుగా పని చేస్తున్నారు. అయితే వీరు టీచర్ల సర్వీస్ రూల్స్‌ను అతిక్రమించి, విద్యా శాఖ ప్రతిష్టను దెబ్బ తీశారని సంబంధింత ప్రాథమిక శిక్షా అధికారి బ్రజరాజ్ సింగ్ సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చారు.
అదే విధంగా క్లాస్‌రూంలో నృత్యం చేయడానికి గల కారణాలును తెలియజేయాలని ఆదేశించారు. బ్రజరాజ్ సింగ్ ఆదేశాలకు నలుగురు టీచర్లు వివరణ ఇవ్వగా, మరో టీచర్ ఇంకా వివరణ ఇవ్వలేదు. ఇందులో నలుగురు అసిస్టెంట్ టీచర్లు కాగా, ఒకరు హెడ్ టీచర్. అయితే ఈ ఏడాది మార్చి 21న టీచర్ల డాన్స్ చేశారు. అప్పటి ఈ ఈ వీడియో ప్రస్తుతం వెలుగులోకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ మారింది.
Comments
Please login to add a commentAdd a comment