న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో ఢిల్లీ మెట్రో తరుచూ వార్తల్లో నిలుస్తోంది. మెట్రోలో ప్రయాణికులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. వారి చర్యలు మిగతా ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ.. పట్టించుకోకుండా హద్దులు మీరుతున్నారు. ముఖ్యంగా మెట్రోలో లవర్స్ శ్రుతి మించి వ్యవహరించడం, యువతీ యువకుల డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే పాపులర్ అయ్యేందుకే కొంతమంది మెట్రోను ఉపయోగించుకుంటున్నారనే సందేహం కలుగుతోంది.
మెట్రోలో వీడియోలు చిత్రీకరించడంపై బ్యాన్ విధించాలంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే తాజాగా ఢిల్లీ మెట్రోలో ఓ యువతి తన డ్యాన్స్‌తో వైరల్‌గా మారింది. రెడ్ టాప్, గ్రే కలర్ స్కర్ట్ ధరించిన యువతి కాకా పాడిన 'షేప్' అనే పంజాబీ పాటకు డ్యాన్స్ చేసింది. మెట్రో మధ్యలో నిలబడి ఉత్సాహంగా స్టెప్పులు వేసింది. ఈ వీడియోను సదరు యువతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌చేసింది.
అయితే.. మెట్రోలో డ్యాన్స్ చేయడానికి అనుమతి లేదని తెలుసని, కానీ మొదటిసారి ఢిల్లీ మెట్రోలో ఇలా ట్రై చేశానని చెబుతూ మరీ యువతి తన వీడియోను పోస్టు చేసింది. ఇప్పటికే ఈ వీడియోను 2 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది యువతి డ్యాన్స్‌ను, ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటుంటే.. మరికొంతమంది మెట్రోలో ఇలాంటి పిచ్చి వేషాలు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
చదవండి: ఇంటి ఓనర్ పాడు పని.. అమ్మాయిల ఫ్లాట్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టి..
Comments
Please login to add a commentAdd a comment