delhi metro
-
బైక్ టాక్సీ సేవలను ప్రారంభించిన ఢిల్లీ మెట్రో
న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు శుభవార్త. ఇకపై మెట్రోలో ప్రయాణించేవారు బైక్‌ను కూడా బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం 12 మెట్రో స్టేషన్లలో ఈ సౌకర్యాన్ని ప్రారంభించారు. రానున్న రోజుల్లో దీని సంఖ్య మరింత పెరగనుంది.ఢిల్లీ మెట్రో ప్రయాణికులు 'డీఎంఆర్సీ మొమెంటం' అప్లికేషన్ ద్వారా బైక్ టాక్సీలను బుక్ చేసుకోవచ్చు. మహిళా ప్రయాణికుల కోసం ఢిల్లీ మెట్రో ప్రత్యేక బైక్ టాక్సీ సర్వీసును కూడా అందుబాటులోకి తీసుకువస్తూ, రెండు రకాల బైక్ ట్యాక్సీలను విడుదల చేసింది. మొదటిది ‘షీరైడ్స్’ దీనిని ప్రత్యేకించి మహిళా ప్రయాణికుల కోసం తీసుకువచ్చారు. రెండవది ‘రైడర్’ ఈ బైక్ టాక్సీ అందరికీ ఉపయోగపడుతుంది. ఈ బైక్ టాక్సీలన్నీ ఎలక్ట్రిక్ బైక్‌లు. వీటి వినియోగం వల్ల కాలుష్యం ఏర్పడదు. DELHI METRO LAUNCHES BIKE TAXI SERVICE FOR ITS COMMUTERS INCLUDING DEDICATED BIKE TAXIS FOR WOMEN TRAVELERSDelhi Metro customers will now be able to book their Bike taxi rides from Delhi Metro’s official mobile app, DMRC Momentum (Delhi Sarthi 2.0) itself without the need to… pic.twitter.com/pFwmhi3t0u— Delhi Metro Rail Corporation (@OfficialDMRC) November 11, 2024షీరైడ్స్ బైక్ టాక్సీకి మహిళా డ్రైవర్ ఉంటారు. దీనిద్వారా మహిళా ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని ఎంచుకోవచ్చు. షీరైడ్స్లో ప్రయాణానికి కనీస ధర రూ. 10. ఈ సౌకర్యం ప్రస్తుతం 12 మెట్రో స్టేషన్లలో అందుబాటులో ఉంది. డీఆర్ఎంసీ ఈ సేవలను ‘ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ భాగస్వామ్యంతో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. మిగిలిన స్టేషన్లలో కూడా ఈ సదుపాయం రానున్న మూడు నెలల్లో అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఇది కూడా చదవండి: మబ్బుల్లో తేలుదాం.. మంచును ముద్దాడదాం -
మెట్రోలో నవరాత్రి సందడి
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా నవరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఢిల్లీ మెట్రోలోనూ ఈ వేడుకల సందడి కనిపిస్తోంది. తాజాగా ఢిల్లీ మెట్రోకి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఒక వ్యక్తి గిటార్ వాయిస్తూ అమ్మవారి పాటలు పాడటం కనిపిస్తుంది. ఈ వీడియో క్యాప్షన్‌గా ‘జై మాతా ది’ అని రాశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ ముచ్చట పడుతున్నారు.ఈ అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోలో ఒక వ్యక్తి గిటార్ ప్లేచేస్తూ పాటలు పాడుతుండగా, అక్కడున్న ఇతర ప్రయాణికులు అతనితో కలిసి పాడటం కనిపిస్తుంది. మరికొందరు దానిని వీడియో తీస్తున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో చూసిన చాలా మంది.. గిటార్ వాయిస్తూ పాటలు పాడుతున్న వ్యక్తిని మెచ్చుకుంటున్నారు. फूहड़ रील वालों ने मेट्रो को दूषित कर दिया था और इन्होंने मेट्रो का शुद्धिकरण कर दिया😍जय माता शेरावाली🙏 pic.twitter.com/pjOULqMCSu— Vikash Mohta (@VikashMohta_IND) October 5, 2024ఇది కూడా చదవండి: దుర్గమాసుర సంహారం -
ఢిల్లీ మెట్రోలో అమ్మాయిల పైత్యం : మండిపడుతున్న నెటిజన్లు
దేశవ్యాప్తంగా హోలీ వాతావరణం వచ్చేసింది. ఇప్పటికే పలు ప్రదేశాల్లో హోలీ సంబరాలు ఊపందు కున్నాయి. అయితే ఢిల్లీ మెట్రోలో చోటు చేసుకున్న ఘటన ఒకటి వివాదాన్ని రాజేసింది. ఇద్దరు అమ్మాయిలు అభ్యంతరకరంగా హోలీ ఆడటం విమర్శలకు తావిచ్చింది. విషయం ఏమిటంటే..దేశ రాజధాని నగరానికి తలమానికంగా పేరొందిన ఢిల్లీ మెట్రో ప్రతిసారీ ఏదో ఒక కారణంతో హెడ్ లైన్స్ లోకి వస్తుంది. అమ్మాయిలు పోల్ డ్యాన్స్, జంటల అశ్లీల వీడియోలు, రీళ్లు తయారు చేయడం, సెల్ఫీలతో వివాదాన్ని రేపడం పరిపాటిగా మారిపోయింది. దీనికి సంబంధించి డిఎంఆర్సి అనేక చట్టాలు చేసినా ప్రజలు పాటించడం లేదు తాజాగా ఢిల్లీ మెట్రోలో ఇద్దరు అమ్మాయిలు అసభ్యకరంగా హోలీ ఆడారు. వీరు తెల్లటి చీరలు సూట్లు ధరించి, నడుస్తున్న మెట్రోలో ఒకరికొకరు రంగులను పూసుకుంటూ హోలీ ఆడారు. డాన్స్ చేశారు. పవిత్ర హోలీని అవమనాపరుస్తూ, బాలీవుడ్ రొమాంటిక్ సాంగ్‌కు అభినయిస్తూ, ఒకర్ని ఒకరు తాకుతూ, మెట్రోలో బహిరంగంగా, అభ్యంతకరంగా ప్రవర్తించారంటూ యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు దీన్ని గమనించిన తోటి ప్రయాణీకులు రెచ్చగొట్టే విధంగా ఉందని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా యూజర్ ఒకరు దీన్ని ఎక్స్(ట్విటర్)లో షేర్ చేశారు. ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు, విమర్శలుగుప్పిస్తున్నారు.దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఇది సరైంది కాదు అంటూ విమర్శిస్తున్నారు. ఢిల్లీ మెట్రో కార్పొరేషన్లో చోటు చేసుకుంటున్న ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. We need a law against this asap pic.twitter.com/3qH1aom1Ml — Madhur Singh (@ThePlacardGuy) March 23, 2024 -
26న మెట్రోలో వారికి ఉచిత ప్రయాణం!
దేశంలోని వివిధ ప్రాంతాల్లో జనవరి 26, గణతంత్ర దినోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్ కోసం రిహార్సల్స్ కొనసాగుతున్నాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ-ఎన్సీఆర్లో నిఘా మరింతగా పెంచారు. ఢిల్లీలోని అన్ని కూడళ్లలో పోలీసులను మోహరించారు. వారు ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా రిపబ్లిక్ డే పరేడ్ దృష్ట్యా, జనవరి 26న ఢిల్లీ మెట్రో రాకపోకల సమయాలను మార్చారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) తెలిపిన వివరాల ప్రకారం గణతంత్ర దినోత్సవం నాడు ఉదయం నాలుగు గంటల నుండి మెట్రో రైళ్లు నడవనున్నాయి. ప్రజలకు పరేడ్‌ను చూసే అవకాశం కల్పించేందుకు డీఎంఆర్సీ మెట్రో రాకపోకల్లో మార్పులు చేసింది. 26న ఉదయం 4 గంటల నుంచి అన్ని రూట్లలో మెట్రో అందుబాటులో ఉండనుంది. రిపబ్లిక్ డే కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఈ-టికెట్లు లేదా ఈ-ఇన్విటేషన్లు కలిగినవారికి ప్రత్యేక కూపన్లు జారీ చేయనున్నట్లు డిఎంఆర్సి ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూజ్ దయాల్ సమాచారం తెలిపారు. ఈ కూపన్లు కలిగిన ప్రయాణికులు ‘కర్తవ్య పథ్’ వరకూ మెట్రోలో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఉచిత ప్రయాణం కోసం ప్రయాణీకులు తమ ఈ-టికెట్, ఈ-ఇన్విటేషన్ లేదా ఫోటో గుర్తింపు కార్డును మెట్రో స్టేషన్‌లోని సంబంధిత కౌంటర్లలో చూపించవలసి ఉంటుంది. ఇదిలావుండగా రిపబ్లిక్ డే సందర్భంగా రాజధానిలోని పలు బస్సుల రూట్లను కూడా మార్చారు. జనవరి 26న విజయ్ చౌక్, రాజ్‌పథ్, ఇండియా గేట్, తిలక్ మార్గ్-బహదూర్ షా జఫర్ మార్గ్-ఢిల్లీ గేట్-నేతాజీ సుభాష్ మార్గ్లలోకి ఎలాంటి వాహనాన్ని అనుమతించరు. Delhi Metro services to commence at 4:00 Am on 26th January. pic.twitter.com/DnK6Ak1sHh — Delhi Metro Rail Corporation (@OfficialDMRC) January 24, 2024 -
2023లో ఢిల్లీ మెట్రోలో ఏం జరిగింది? వీడియోలు ఎందుకు వైరల్ అయ్యాయి?
ఢిల్లీ మెట్రో అధికారులు పలు హెచ్చరికలు జారీ చేసిన తరువాత కూడా కొందరు ప్రయాణికులు తమ తీరు మార్చుకోలేదు. మెట్రోలో ముద్దులు పెట్టుకోవడం, సరసాలు ఆడటం, కొట్టుకోవడం, పాటలు పాడడం, డ్యాన్స్ చేయడం లాంటి పనులు 2023లో తరచూ కనిపించాయి. ఇటువంటి ఉందంతాలకు సంబంధించిన వీడియోలు ఏడాది సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఒక వీడియోలో ఒక యువతి బ్రా, షార్ట్ స్కర్ట్ ధరించి ఢిల్లీ మెట్రోలో ప్రయాణించింది. ఈ వీడియో వైరల్ కావడంతో, ఆ అమ్మాయిని ఢిల్లీ మెట్రోలో ‘ఉర్ఫీ జావేద్’ అనే పేరు పెట్టారు. మరో వీడియోలో ఢిల్లీ మెట్రోలో ఒక బాలుడు హస్తప్రయోగం చేస్తూ కనిపించాడు. ఈ వీడియోను చూసిన వారంతా తెగ అసహ్యించుకున్నారు. ఇంకొక వీడియోలో ఢిల్లీ మెట్రోలో ఓరల్ సెక్స్ చేస్తున్న జంట కనిపించింది. దీనిని ప్రయాణికులెవరో వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ వీడియోలో ఒక బాయ్‌ఫ్రెండ్ తన గర్ల్‌ఫ్రెండ్‌కి శీతల పానీయం ఇస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ ప్రియురాలు శీతల పానీయాన్ని తన నోటితో స్ప్రే చేసి.. ప్రియుడి నోట్లో పోస్తుంది. ఈ వీడియో చూసిన వారంతా ఈ జంటను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఢిల్లీ మెట్రో కోచ్‌లో ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేస్తున్న వీడియో కూడా వైరల్‌గా మారింది. అయితే దీనిని ఎవరో అడ్డుకోవడంతో అతను సిగ్గుపడకుండా సీసాలో మూత్ర విసర్జనను కొనసాగించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఢిల్లీ మెట్రోలో సీట్ల కోసం జరిగిన గొడవలకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతుంటాయి. వాటిలోని ఒక వీడియోలో సీటు విషయంలో ఓ మహిళ, పురుషుడి మధ్య గొడవ జరిగింది. ఆ మహిళ అతని ముఖంపై బలంగా కొట్టడం వీడియోలో కనిపిస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ‘మెట్రో’ వీడియోలో కొంతమంది మహిళలు చప్పట్లు కొడుతూ భజనలు చేయడం కనిపిస్తుంది. మరో వీడియోలో ఒక అంధ జంట తమ ముగ్గురు పిల్లలతో మెట్రోలో ప్రయాణిస్తున్నారు. దీనిని చూసిన యూజర్స్ భావోద్వేగానికి లోనయ్యారు. మరో వైరల్ వీడియోలో ఒక జంట ప్రేమలో మునిగి తేలుతూ.. ముద్దులు పెట్టుకోవడం కనిపిస్తుంది. ఇలాంటి ఘటనలన్నీ ఢిల్లీలో మెట్రోలో 2023లో చోటుచేసుకున్నాయి. ఇది కూడా చదవండి: 10 ఒళ్లు గగుర్పొడిచే దారుణాలు.. 2023 మిగిల్చిన చేదు గురుతులు! -
మెట్రో రెయిలింగ్‌పై మహిళ హైడ్రామా..
ఏదో ఒక కారణంతో ఢిల్లీ మెట్రో తరచూ ముఖ్యాంశాలలో నిలుస్తుంటుంది. కొందరు మెట్రోలో తమకు నచ్చినట్లు వ్యవహరిస్తూ ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తుంటారు. తాజాగా మెట్రోలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఈ ఉదంతం మెట్రో అధికారులకు చిక్కులను తెచ్చిపెట్టింది. ఢిల్లీలోని షాదీపూర్ మెట్రో స్టేషన్లో ఒక మహిళ ఎలివేటెడ్ ట్రాక్ దాటి, రెయిలింగ్ ఎక్కి అక్కడి నుంచి దూకేందుకు ప్రయత్నించింది. దీనిని గమించిన కొందరు ప్రయాణికులు మెట్రో అధికారులకు ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో వారు అతి కష్టం మీద ఆ మహిళను కాపాడారు. #Delhi- Girl was jumping from the track of metro station.. police saved her. #delhimetro #delhigirls #DelhiGovernment #Delhi #METRO4D #Metro pic.twitter.com/eFwJ6yNhAH — Arun Gangwar (@AG_Journalist) December 12, 2023 ఈ ఘటనకు సంబంధించిన 40 సెకన్ల వీడియో క్లిప్ వైరల్ అవుతోంది. ఓ మహిళ ఫోన్ పట్టుకుని ఎలివేటెడ్ మెట్రో ట్రాక్ పక్కన నిలబడి కనిపించింది. ఆమె ట్రాక్ పరిమితిని దాటి, రెయిలింగ్ పైకి ఎక్కినట్లు వీడియోలో కనిపిస్తోంది. షాదీపూర్ మెట్రో స్టేషన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఎలివేటెడ్ ట్రాక్‌పై నుంచి దూకుతానంటూ ఆ మహిళ బెదిరించింది. ఆమెను కాపాడేందుకు అధికారుల బృందం ఫుట్‌పాత్ మీదుగా ట్రాక్ వైపు వెళ్లి ఆమెను రక్షించింది. కాగా ఆ మహిళ ఎందుకు ఈ ప్రయత్నం చేసిందో స్పష్టంగా తెలియలేదు. ప్రస్తుతం ఈ ఉదంతపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇది కూడా చదవండి: శరద్ పవార్‌కు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు మరిన్ని వార్తల కోసం సాక్షి వాట్సాప్ ఛానల్ వీక్షించండి: -
Video Viral: ఢిల్లీ మెట్రోలో మహిళల ఫైటింగ్.. తగ్గేదేలే!
వింత వింత ఘటనలతో ఇటీవల ఢిల్లీ మెట్రో తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ప్రయాణికుల చేష్టలు, ప్రేమికుల రొమాన్స్, డ్యాన్స్ రీల్స్, మహిళ ఘర్షణలు వంటి వీడియోలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ క్రమంలో ఢిల్లీ మెట్రో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మెట్రో ట్రైన్లో అభ్యంతరకర, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగే చేష్టలు చేస్తే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఫలితం కనిపించడం లేదు. తాజాగా మరో వీడియోతో సోషల్ మీడియాలో ఢిల్లీ మెట్రో ట్రెండింగ్‌గా మారింది. మెట్రో రైలు కోచ్‌లో ఇద్దరు మహిళలు వాదులాడుకున్నారు. బ్లాక్, ఎల్లో డ్రెస్‌లు ధరించిన ఇద్దరు మహిళలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఒకరినొకరు బట్టలు, జుట్టు లాగుతూ కొట్టుకున్నారు. వీరిలో బ్లాక్ డ్రెస్ ఆమె రెచ్చిపోయి ప్రవర్తించింది. అక్కడే ఉన్న ఓ మహిళ పోలీస్ అధికారి, చుట్టుపక్కల వారు జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించినా కుదరలేదు. అంతేగాక ‘నేను జడ్జి కూతుర్ని, నిన్ను నేను వదిలిపెట్టను’ అంటూ పోలీస్‌ను హెచ్చరించింది సదరు మహిళ. మరో మహిళ తాను ఏం తప్పు చేయలేదని ఎవరిపై శారీరకంగా దాడి చేయలేదని తెలిపింది. అయినా న్యాయమూర్తి కుమార్తెను అంటూ చెప్పుకుంటున్న మహిళ తగ్గకుండా తన హోదాను అడ్డుపెట్టుకొని వీరంగం సృష్టించింది. చివరికి స్టేషన్ రావడంతో ఇద్దరిని మెట్రో దిగి వెళ్లాలని పోలీస్ అధికారి సూచించడంతో వారు వెళ్లిపోయారు. ఈ వీడియోను ఘర్ కా కాలేష్ అనే ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో నెట్టింట్లో వైరల్‌గా మారింది. చదవండి: పెళ్లిలో యువతుల జోరు.. బ్లాక్ డ్రెస్‌లో కుమ్మేశారు..! అయితే అసలు వాళ్ల సమస్య ఏంటి? గొడవెందుకు? అనేది తెలియలేదు. దీనిపై నెటిజన్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. "ఏంటీ బ్రో.. ఈ ఆడవాళ్లు మరీ ఇలా తయారయ్యారు. వీళ్లకు ఎక్కడ చూసిన గొడవలేనా. అయినా ఇవన్నీ ఢిల్లీ మెట్రోలో సాధారణమే. నల్ల రంగు దుస్తులు ధరించిన మహిళ తండ్రి అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంది. మహిళా పోలీస్ అధికారికి సెల్యూ చేద్దాం’అని రకరకాలుగా కామెంట్ ఇచ్చారు. . Kalesh inside delhi metro b/w Two woman, a lady cop interfere 🫡 pic.twitter.com/zlQ7gUyZ2F — Ghar Ke Kalesh (@gharkekalesh) September 2, 2023 -
జీ-20 ఎఫెక్ట్: ఈ తేదీల్లో పలు మెట్రో స్టేషన్లు రద్దు
ఢిల్లీ: జీ-20 శిఖరాగ్ర సమావేశానికి ఢిల్లీ ముస్తాబవుతోంది. సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికారులు శరవేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే సమావేశాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఢిల్లీ మెట్రోపై ఆంక్షలను విధించారు అధికారులు. భద్రతా నిర్వహణ దృష్ట్యా కొన్ని స్టేషన్లను మూసివేస్తామని అధికారులు తెలిపారు. దేశ విదేశాల నుంచి నేతలు జీ 20 సమావేశాలకు హాజరుకానున్నారు. దాదాపు 25 దేశాలకు చెందిన లీడర్లతో సహా వివిధ ప్రపంచస్థాయి సంస్థల నాయకులు ఢిల్లీకి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యం కలగకూడదని ఢిల్లీ మెట్రోలోని కొన్ని స్టేషన్లను ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు మూసివేయనున్నారు. In order to maintain foolproof security arrangements during the G20 Summit, scheduled to be held in Delhi from September 9 to 10, the Delhi Police metro unit asked the Chief Security Commissioner to close some metro station gates that open towards the VVIPS Route/venue of… pic.twitter.com/5ssPc9xepz — ANI (@ANI) September 4, 2023 ఢిల్లీలోని మోతీ బాగ్, భికాజీ కామా ప్లేస్, మునిర్కా, ఆర్కే పురం, ఐఐటీ, సదర్ బజార్ కంటోన్మెంట్ మెట్రో స్టేషన్లు మూసివేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో ధౌలా కువాన్, ఖాన్ మార్కెట్, జన్‌పథ్, భికాజీ కామా ప్లేస్ మెట్రో స్టేషన్లను సున్నితమైన ప్రదేశాల జాబితాలో ఉంచారు. దీనితో పాటు వేదికకు సమీప స్టేషన్ అయిన సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్ పూర్తిగా మూసివేయనున్నారు. ఢిల్లీలో మిగిలిన స్టేషన్లు సాధారణంగా నడుస్తాయని అధికారులు తెలిపారు. ఈ నెల 4-13 వరకు స్మార్ట్ కార్డ్ సేవలను ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చినట్లు ఢిల్లీ మెట్రో అధికారులు తెలిపారు. ఇంతకుముందు కూడా ఈ సేవలు ఉన్నప్పటికీ ఇందుకోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమావేశాల దృష్ట్యా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌పై ఇప్పటికే ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: ఉదయనిధి ‘సనాతన ధర్మం’ వ్యాఖ్యల దుమారం.. స్టాలిన్ ఏమన్నారంటే -
ఢిల్లీలో హై అలర్ట్.. మెట్రో స్టేషన్ గోడలపై ఖలిస్థాన్ నినాదాల కలకలం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని శివాజీ పార్కు నుండి పంజాబ్ బాగ్ మెట్రో స్టేషన్ గోడలపై ఖలిస్థాన్ తీవ్రవాదుల నినాదాలు కలకలం సృష్టించాయి. ఈ మేరకు SFJ సంస్థలోకి వీడియోను కూడా విడుదల చేసింది. మెట్రో అధికారుల నుండి సమాచారాన్ని అందుకున్న వెంటనే అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు అన్ని మెట్రో స్టేషన్ల వద్ద హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీని ఖలిస్థాన్ గా మారుస్తామని, పంజాబ్ భారత దేశానికి చెందినది కాదని, మోదీ భారతదేశం సిక్కుల నరమేధానికి పాల్పడిందని, ఖలిస్థాన్ రెఫరెండం జిందాబాద్ అని SFJ పేరుతో ఈ నినాదాలను రాశారు దుండగులు. భారత దేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన జీ20 సదస్సుకు కొద్దిరోజుల ముందు ఖలిస్తానీలు ఈ దారుణానికి ఒడిగట్టడంతో ఢిల్లీ పోలీసులు భద్రతా ప్రమాణాలను మరింత పటిష్టం చేసి 450కి పైగా క్విక్ రెస్పాన్స్ టీమ్‌లను పీసీఆర్ వ్యాన్లు, 50కి పైగా అంబులెన్స్‌లు, ఎయిర్‌పోర్టు, ప్రగతి మైదాన్, రాజ్‌ఘాట్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో అగ్నిమాపక యంత్రాలతో సహా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దుండగుల కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టారు. In more than 5 metro stations somebody has written 'Delhi Banega Khalistan and Khalistan Zindabad'. Delhi Police is taking legal action against this: Delhi Police pic.twitter.com/T6U5myjZyv — ANI (@ANI) August 27, 2023 ఇది కూడా చదవండి: మోదీ మన్‌కీ బాత్.. కీలక విషయాలు వెల్లడించిన ప్రధాని -
మెట్రోలో యువతుల పోల్ డ్యాన్సింగ్.. వీడియో వైరల్..
ఢిల్లీ: ఢిల్లీ మెట్రో తరచూ వివాదాస్పద అంశాలతో వార్తల్లోకి ఎక్కుతోంది. ఇటీవల ఓ యువతి టూ పీస్ బికినీ టైప్ డ్రెస్ ధరించి ప్రయాణించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మరో ఘటనలో సీటు కోసం గొడవపడుతూ ఓ మహిళ మరో మహిళపై పెప్పర్ స్ప్రే కొట్టింది. తాజాగా ఇద్దరు యువతులు మోడర్న్ డ్రస్ వేసుకుని బాలీవుడ్ సాంగ్‌కు మెట్రోలో పోల్ డ్యాన్స్ చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. 'మెయిన్ టూ బెఘర్ హున్' సాంగ్‌కు యువతులు లిప్ సింక్ చేస్తూ డ్యాన్సులు చేశారు. ఈ పాట సుహాగ్ చిత్రంలోని కాగా.. ప్రవీణ్ బాబీ, శశి కపూర్ నటించారు. ఈ పాటకు యువతులు పోల్ పట్టుకుని కింద నుంచి మీదకు లయబద్దంగా ఊగుతూ హోరెత్తించే స్టెప్పులు వేశారు. వీరి డ్యాన్సులు చూస్తే అలాగే ఉండిపోయారు తోటి ప్రయాణికులు. ఈ వీడియోకు 3 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. After porn, kissing and fighting in Delhi Metro, The latest is Pole Dancing..... 🤣🤣🤣🤣🤣 pic.twitter.com/RpvKJ9jLny — Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) July 6, 2023 ఈ వీడియో వైరల్ కాగా.. నెటిజన్లు మండిపడుతున్నారు. ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రయాణికుల తీరు మారట్లేదని వాపోతున్నారు. వైరల్ కావడానికి మెట్రో ఓ సాధనంగా మారిపోయిందని కామెంట్ చేస్తున్నారు. మెట్రో యాజమాన్యం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి చర్యలు పునరావృతమవుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇదీ చదవండి: కొడుకును ఎనిమిదేళ్లు ఎందుకు దాచిపెట్టింది? అమ్మతనానికి మచ్చ! -
మెట్రోలో మద్యం అనుమతి.. ఎన్ని బాటిళ్ల వరకు తెలుసా..?
ఢిల్లీ: మెట్రో ప్రయాణం ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో మనందరికీ తెలుసు. భద్రతపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రయాణికులకు మెట్రో నగరాల్లో సేవలు అందిస్తున్నాయి. అయితే.. మెట్రోలో మద్యాన్ని తీసుకురావడానికి అనుమతి ఉంటుందా? ఎప్పుడైనా ఆలోచించారా? ఓ వ్యక్తి ట్విట్టర్ వేదికగా అడిగిన ఈ ప్రశ్నకు ఢిల్లీ మెట్రో(డీఎమ్ఆర్సీ ) సమాధానం తెలిపింది. రెండు మద్యం బాటిళ్ల వరకు తీసుకురావడానికి మెట్రోలో అవకాశం ఉంటుందని డీఎమ్ఆర్సీ స్పష్టం చేసింది. మెట్రోలో మద్యం సేవించడం మాత్రం నిషేధించింది. అయితే.. ఢిల్లీలో ఎయిర్‌పోర్టు లైన్లో తప్పా మిగిలిన రూట్లలో మద్యం తీసుకురావడానికి ఇప్పటివరకు అనుమతి ఉండేది కాదు. కానీ ఇటీవల ఢిల్లీ మెట్రో నిబంధనలను సడలించింది. Hi. Yes 2 sealed bottles of alcohol is allowed in Delhi Metro. — Delhi Metro Rail Corporation I कृपया मास्क पहनें😷 (@OfficialDMRC) June 30, 2023 ఈ అంశంలో యాజమాన్యం సీఐఎస్ఎఫ్, డీఎమ్ఆర్సీ సభ్యులతో ఓ కమిటీని వేసింది. ఈ నివేదిక ప్రకారం మెట్రో ఏ రూట్లోనైనా ఒక వ్యక్తి రెండు బాటిళ్ల మద్యం వరకు తీసుకురావచ్చని తెలిపింది. ఇదీ చదవండి: దేన్నీ వదలకుండా మాట్లాడారు.. మెట్రో రైలులో అనుభవంపై ప్రధాని మోదీ -
ఏదీ వదలకుండా మాట్లాడారు: ప్రధాని మోదీ
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సాధారణ ప్రయాణికుడిలా ఢిల్లీ మెట్రో రైలులో సందడి చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాల ముగింపు వేడుకల కోసం ఇవాళ లోక్ కల్యాణ్ మార్గ్ నుంచి విశ్వ విద్యాలయా మెట్రో స్టేషన్ మధ్య రైలులో ప్రయాణించారు. ప్రధాని మోదీ మెట్రోరైలులో సందడి చేసిన ఫొటోలు, వీడియోలు ట్విటర్లో ట్రెండ్ అవుతున్నాయి. యువ ప్రయాణికులతో ప్రయాణం సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశారాయన. On the way to the DU programme by the Delhi Metro. Happy to have youngsters as my co-passengers. pic.twitter.com/G9pwsC0BQK — Narendra Modi (@narendramodi) June 30, 2023 PM Shri #NarendraModi interacts with passengers in #Delhi Metro during his ride to Delhi University.#Viralvideo pic.twitter.com/PkojngLPEe — Akshara (@Akshara117) June 30, 2023 ► ఇక ఢిల్లీ యూనివర్సిటీ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. మెట్రో ప్రయాణ అనుభవాన్ని సైతం వివరించారు. విద్యార్థులు మెట్రో ప్రయాణంలో ఎన్నో మాట్లాడారు. ఓటీటీ నుంచి సైన్స్ అంశాల దాకా దేన్ని వదలకుండా చర్చించారు అని తెలిపారాయన. ► ఢిల్లీ యూనివర్సిటీ కార్యక్రమంలో భాగంగా.. పలు విభాగాలకు శంకుస్థాపనలు.. పలు సెక్షన్లను ప్రారంభించారాయన. ► సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ చట్టం ప్రకారం.. ఢిల్లీ యూనివర్సిటీకి 1922లో స్థాపన జరిగింది. ► 2022, మే 1వ తేదీన ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాలు మొదలయ్యాయి. ఇవాళ్టి ప్రధాని మోదీ హాజరు కార్యక్రమంతో ఆ వేడుకలు ముగిశాయి. ► ప్రధాని రాక నేపథ్యంలో విద్యార్థులు నల్ల దుస్తులు(నిరసన తెలిపే అవకాశం ఉన్నందునా) వేసుకురావొద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే 10 నుంచి 12 గంటల నడుమ ప్రధాని మోదీ ప్రసంగాన్ని విద్యార్థులు వీక్షించే ఏర్పాట్లు చేశారు. Prime Minister #NarendraModi on Friday travelled on the metro to attend the closing ceremony of the Delhi University's centenary celebrations as the chief guest.#delhiuniversity #Delhi #india pic.twitter.com/RoTeFQi04X — Kashmir Local News (@local_kashmir) June 30, 2023 -
కిక్కిరిసిన మెట్రో.. ఏమైందో తెలియదు.. తన్నుకున్న యువకులు..
ఢిల్లీ: ఢిల్లీ మెట్రోలో ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు. అప్పటికే కిక్కిరిసిపోయిన మెట్రోలో యువకులు పిడిగుద్దుల కురిపించుకున్నారు. దీంతో తోటి ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. ఢిల్లీ మెట్రో రైలు ప్రారంభమైంది. ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. నిలబడటానికి కూడా సరిగా స్థలం దొరకని పరిస్థితి. ఇంతలోనే మెట్రోలో ఇద్దరు యువకుల మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. అదీ కాస్త ఘర్షణకు దారి తీసింది. కోపంతో ఇద్దరు యువకులు ఒకరిపై ఇంకొకరు రెచ్చిపోయారు. పిడిగుద్దులు కురిపించుకున్నారు. కొందరు ప్రయాణికులు వారిని విడిపించే ప్రయత్నం చేశారు. వారి గొడవ నుంచి మరికొందరు దూరంగా జరిగారు. దీంతో రైలులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. A fight broke out between two people on @OfficialDMRC Violet Line. #viral #viralvideo #delhi #delhimetro pic.twitter.com/FbTGlEu7cn — Sachin Bharadwaj (@sbgreen17) June 28, 2023 ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రయాణికులు మెట్రో యాజమాన్యాన్ని విమర్శించారు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా చర్యలు శూన్యమని కామెంట్లు పెట్టారు. ఘర్షణకు దిగిన ఇద్దరు యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఢిల్లీ మెట్రో కూడా స్పందించింది. నిందితులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. మెట్రోలో ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని సూచనలు చేసింది. ఇదీ చదవండి: వీడేం లవర్‌రా బాబు..! దొంగకే సానుభూతి కలిగింది.. -
ఢిల్లీ మెట్రోలో మరో యువతి డ్యాన్స్.. వీడియో వైరల్
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో ఢిల్లీ మెట్రో తరుచూ వార్తల్లో నిలుస్తోంది. మెట్రోలో ప్రయాణికులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. వారి చర్యలు మిగతా ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ.. పట్టించుకోకుండా హద్దులు మీరుతున్నారు. ముఖ్యంగా మెట్రోలో లవర్స్ శ్రుతి మించి వ్యవహరించడం, యువతీ యువకుల డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే పాపులర్ అయ్యేందుకే కొంతమంది మెట్రోను ఉపయోగించుకుంటున్నారనే సందేహం కలుగుతోంది. మెట్రోలో వీడియోలు చిత్రీకరించడంపై బ్యాన్ విధించాలంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే తాజాగా ఢిల్లీ మెట్రోలో ఓ యువతి తన డ్యాన్స్‌తో వైరల్‌గా మారింది. రెడ్ టాప్, గ్రే కలర్ స్కర్ట్ ధరించిన యువతి కాకా పాడిన 'షేప్' అనే పంజాబీ పాటకు డ్యాన్స్ చేసింది. మెట్రో మధ్యలో నిలబడి ఉత్సాహంగా స్టెప్పులు వేసింది. ఈ వీడియోను సదరు యువతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేసింది. అయితే.. మెట్రోలో డ్యాన్స్ చేయడానికి అనుమతి లేదని తెలుసని, కానీ మొదటిసారి ఢిల్లీ మెట్రోలో ఇలా ట్రై చేశానని చెబుతూ మరీ యువతి తన వీడియోను పోస్టు చేసింది. ఇప్పటికే ఈ వీడియోను 2 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది యువతి డ్యాన్స్‌ను, ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటుంటే.. మరికొంతమంది మెట్రోలో ఇలాంటి పిచ్చి వేషాలు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చదవండి: ఇంటి ఓనర్ పాడు పని.. అమ్మాయిల ఫ్లాట్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టి.. View this post on Instagram A post shared by self taught✨🤌 (@itz__officialroy) -
Delhi Metro: లుంగీ అనుకుని స్కర్ట్ వేసుకున్నారా ఏంటి భయ్యా..?
న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో తరచూ ఏదో ఒక ఘటనతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఇద్దరు యువకులు రోటీన్‌కు భిన్నంగా స్కర్ట్ ధరించి ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. స్నేహితులైన వీరిద్దరూ ఏం చక్కా అమ్మాయిలు వేసుకునే స్కర్టులతో మెట్రో ఎక్కారు. రిలాక్స్‌గా కన్పిస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. వీరిని చూసిన తోటి ప్రయాణికులు అవాక్కయ్యారు. కొందరైతే పగలబడి నవ్వారు. కాగా.. ఈ ఫొటోలపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వచ్చాయి. వీరిద్దరూ లుంగీ అనుకుని పొరపాటున స్కర్ట్ ధరించారేమో అని ఓ యూజర్ ఛలోక్తులు విసిరాడు. మరో నెటిజన్ స్పందిస్తూ.. స్కర్ట్లు అమ్మాయిలే ధరించాలని రూల్ ఏమైనా ఉందా? సౌకర్యంగా ఉంటే అబ్బాయిలు కూడా వేసుకోవచ్చు. అందులో తప్పేముంది అని వీరికి మద్దతు తెలిపారు. లుంగీకంటే ఇవే బాగున్నట్టున్నాయ్ ఫ్రీగా.. అని మరో యూజర్ రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Sameer Khan (@sameerthatsit) చదవండి: సోలో సెయిలింగ్ రేస్‌లో చరిత్ర సృష్టించిన భారత ఇండియన్ నేవీ ఆఫీసర్ -
Video: మెట్రో యువతి మరో డ్యాన్స్.. ఈసారి యువకుడితో స్టెప్పులు
ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా ప్రపంచాన్ని శాసిస్తోందనే చెప్పాలి. సామాన్యుడిని సెలబ్రిటీ చేయాలన్నా, ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నా, అంతెందుకు మనీ సంపాదనకు కూడా మార్గం చూపిస్తూ ప్రత్యేకంగా యవతను తనవైపు తిప్పుకుంది. ఇదిలా ఉండగా భారతదేశంలో టిక్‌టాక్ నిషేధం తర్వాత, నెటిజన్లు ఇప్పుడు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇన్‌స్టాగ్రామ్‌ను ఆశ్రయిస్తున్నారు. ఫోటోగ్రఫీ నైపుణ్యాలను ప్రదర్శించడం నుంచి అనేక ఫన్నీ వీడియోలు, డ్యాన్స్‌లు, పాడే క్లిప్‌లతో ప్రజలను అలరించడం వరకు ఇలా ఒక్కటేంటి నెటిజన్లు తమ ప్రతిభను ప్రదర్శించడానికి సోషల్‌మీడియా ఒక వేదికగా రూపాంతరం చెందిందనే చెప్పాలి. అందుకే యవత వీడియోలతో తమ టాలెంట్‌ను నెట్టింట షేర్ చేస్తున్నారు. ఇటీవల చీరకట్టులో ఢిల్లీ మెట్రో ప్లాట్‌ఫాంపై డ్యాన్స్ చేసి హల్చల్ చేసిన అవ్నీకరీశ్ తాజాగా మరో డాన్స్ వీడియో ఇన్‌స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. వృత్తిరీత్యా డ్యాన్సర్‌గా చెప్పుకునే అవ్నీకరీశ్ ఢిల్లీ మెట్రో స్టేషన్లో భోజ్‌పురి పాట సాజ్ కే సవార్ కేకు తన నిర్మొహమాటంగా డ్యాన్స్ చేసినందుకు అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే పబ్లిక్‌గా డ్యాన్స్ చేయడం ఆమెకు కొత్తేమీ కాదు. తాజాగా ఈ యువతి నలుపు రంగు లెహంగా ధరించి, తన డ్యాన్స్ పార్ట్నర్తో స్టెప్పులేసింది. సల్మాన్ ఖాన్, రాణి ముఖర్జీ నటించిన హలో బ్రదర్లోని తేరి చున్నారియా పాట బీట్లకు వీరిద్దరూ డ్యాన్స్ చేసి అలరించారు. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. View this post on Instagram A post shared by Avnikarish Avnikarish (@avnikarish) -
చీరకట్టులో యువతి డ్యాన్స్.. ఢిల్లీ మెట్రో మరో వీడియో వైరల్..
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో ఢిల్లీ మెట్రో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఓ యువతి టూ పీస్ బికినీ టైప్ డ్రెస్ ధరించి ప్రయాణించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మరో ఘటనలో సీటు కోసం గొడవపడుతూ ఓ మహిళ మరో మహిళపై పెప్పర్ స్ప్రే కొట్టింది. తాజాగా ఓ యువతి చీరకట్టులో ఢిల్లీ మెట్రో ప్లాట్‌ఫాంపై డ్యాన్స్ చేసి హల్చల్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎర్ర చీర ధరించి బోజ్‌పురి పాటకు అదిరే స్టెప్పులేసి అదరగొట్టిన ఈ యువతి పేరు అవ్నీకరీశ్. ఇన్‌స్టాలో తన డ్యాన్స్ వీడియో పోస్టు చేసింది. ఇప్పటికే వేల మంది ఈ వీడియోను వీక్షించారు. View this post on Instagram A post shared by Avnikarish Avnikarish (@avnikarish) అయితే ఈ వీడియోపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఢిల్లీ మెట్రో ఆవరణలో ఇలాంటి ఫొటోలు, వీడియోల చిత్రీకరణపై నిషేధం అమల్లో ఉంది కాదా.. అయినా ఎలా రికార్డు చేశారు అని కొందరు అభ్యంతరం తెలిపారు. మరికొందరేమో ఇలాంటి వాటిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకొందరు మాత్రం యువతి స్టెప్పులకు ఫిదా అయ్యారు. ఎలాంటి భయం లేకుండా మెట్రో ప్లాట్‌ఫాంపై డ్యాన్స్ చేసిన ఈమె ధైర్యవంతురాలు అని ప్రశంసలు కురిపించారు. ఈమె డ్యాన్స్‌ను తెగమెచ్చుకున్నారు. అవ్నీకరీశ్ ఢిల్లీ మెట్రోలో డ్యాన్స్ చేయడం ఇదే తొలిసారి కాదు. మార్చిలోనూ సోనూ నిగమ్ పాటకు నృత్యం చేసి.. ఆ వీడియోనూ కూడా ఇన్‌స్టాలో పోస్టు చేసింది. చదవండి: తాజ్‌మహల్ ప్రేమకు చిహ్నం కాదు.. దాన్ని కూల్చేయాలి: బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు -
ఢిల్లీ మెట్రో మరో వీడియో వైరల్.. తోటి మహిళపై పెప్పర్ స్ప్రే కొట్టిన ప్యాసెంజర్..
-
Delhi Metro girl: ‘నాది పద్ధతిగల కుటుంబం’
ఈ భూమ్మీద ఎక్కడా లేని జంక్ అంతా ఇప్పుడు సోషల్ మీడియాకే చేరుతోంది. ఏదో ఒకటి చేసి వైరల్ కావడమే లక్ష్యంగా పెట్టుకుంటోంది యువత. ఇంతకీ వైరల్ కావాలంటే ఏం చేయాలి?.. జనాల నోళ్లు వెల్లబెట్టి మరీ చూసేలా చేయగలిగినా చాలా?. ఢిల్లీ మెట్రో గర్ల్.. ఇప్పుడు అలాంటి పనే చేస్తోంది. ముంబై గడ్డపై ఉర్ఫీ జావెద్ అని ఓ మోడల్ మొన్నటిదాకా చేసిన పనినే.. ఇప్పుడు ఈ 19 ఏళ్ల అమ్మాయి కంటిన్యూ చేస్తోంది. ఢిల్లీ మెట్రో గర్ల్‌గా నార్త్ సోషల్ మీడియా పేజీలను షేక్ చేస్తోంది. బ్రా.. మిని స్కర్ట్.. పీలికల్లాంటి దుస్తుల్లో మెట్రో రైలులో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికులను బిత్తరపోయేలా చేస్తోంది రిథమ్ చననా. సోషల్ మీడియాలో ఈ యువతిపై మామూలు తిట్లు పడడం లేదు. సొసైటీని పాడు చేయడానికే అలాంటి బట్టలు వేసుకుంటున్నావా? అంటూ మండిపడుతున్నారంతా. తొలుత ఆమె ఫొటోలు, వీడియోలు చూసి అంతా ఉర్ఫీ జావెద్ అనుకుని పొరపడ్డారంతా. చివరికి.. ఆమె అసలు సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఐడెంటింటీ రివీల్ అయ్యింది. @prettypastry11112222 ఇన్స్టాగ్రామ్ ఐడీతో రిథమ్ చననా పోస్టులు పెడుతోంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారడంతో ఈ యువతి ఉద్దేశం ఏంటో తెలుసుకుందామని ఓ జాతీయ ఛానెల్ ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేసింది. తన పేరు రిథమ్ చననా అని, పంజాబ్ ఫతేగఢ్ సాహిబ్ నగరం తన స్వస్థలం అని ఆమె తెలిపింది. తనది ఎంతో పద్ధతిగల కుటుంబమని చెప్పిన ఆమె.. మొదట్లో తాను అంతే పద్దతిగా ఉండేదానినని చెప్పింది. అయితే.. సడన్‌గా తన ఆలోచనలు మారాయని, ఆ ఆలోచనలకు ఇంట్లో వాళ్లు అంగీకరించకపోవడంతో దూరంగా ఉంటూ వస్తున్నానని తెలిపింది రిథమ్. తన మీద ఎవరి ప్రభావం లేదన్న ఆమె.. తన ఇష్టప్రకారంగానే అలాంటి బట్టలు వేసుకుంటున్నట్లు చెప్పింది. పేరు, పబ్లిసిటీ కోసమో తాను ఇలా బతకడం లేదని, విమర్శలను తాను పట్టించుకోనని, తనకు నచ్చినట్లు జీవిస్తానని అంటోందామె. ‘పైకి పద్ధతిగా ఉంటే సరిపోతుందా? లోపలి ఆలోచనల సంగతి ఏంటి?. నేను ఎవరి జీవితాల్లోకి తొంగిచూడనప్పుడు.. నా జీవితాల్లోకి వాళ్లెందుకు చూడడం. నా పని చేసుకుంటూ నా బతుకు నేను బతుకుతున్నా. చాలదా?. అలాంటప్పుడు అవతలివాళ్ల అభిప్రాయాల్ని.. విమర్శలను ఎందుకు పట్టించుకోవడం? అని చెబుతోందామె. పింక్ లైన్ మెట్రో రూట్లో తప్ప తన వస్త్రధారణపై ఎక్కడా, ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని అంటోందామె. కొసమెరుపు ఏంటంటే.. కిందటి ఏడాది అక్టోబర్ వరకు ఆమె సోషల్ మీడియా అకౌంట్లలో పద్ధతిగానే ఫొటోలు ఉన్నాయి. కామ్ బిఫోర్ స్ట్రోమ్ అంటూ ఓ బోల్డ్ ఫొటోను ఉంచిన రిథమ్.. అప్పటి నుంచి రెచ్చిపోతూ వస్తోంది. ఎంతలా అంటే.. కురచదుస్తుల్లో ఏం సందేశం ఇస్తున్నావ్ తల్లీ అంటూ తిట్టిపోసే స్టేజ్‌కు చేరుకుంది. -
మెట్రోలో లవర్స్ పాడుపని.. ట్రెండింగ్‌లో వీడియోలు
సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్ కోసం కొందరు బరితెగిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పిచ్చి చేష్టలతో రెచ్చిపోతున్నారు. ఇతరులకు ఇబ్బంది కలుగుతుందన్న సోయి లేకుండా హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. బస్సు, మెట్రో, విమానం, రైల్లో ఆకతాయిల ఆగడాలు ఈమధ్య ఎక్కువై పోతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ మెట్రోలో అసాంఘిక కార్యక్రమాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. పాపులర్ కావాలని చేస్తున్నారా? లేక పొరపాటుగా అలా జరిగిపోతోందా? తెలియదుగానీ మెట్రో పరువైతే బజారున పడే పరిస్థితి దాపురించింది. ఈ క్రమంలో ట్విటర్లో #DelhiMetro హాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. గతంలో కొందరు ప్రేమికులు మెట్రోలో పబ్లిక్ ముందే ముద్దులు పెట్టుకుంటూ ఇబ్బందులకు గురిచేసిన విషయం తెలిసిందే. మరో వ్యక్తి మెట్రో రైలు కోచ్‌లో బనియన్, టవల్‌తో దర్శనమిచ్చాడు. ఇది మరవకముందే మరో జంట సిగ్గు విడిచి లిప్ కిస్ ఇచ్చుకున్నారు. నిన్న కాక మొన్న ఓ యువతి బికినీ ధరించి మెట్రోలో ప్రయాణించింది. ఈ వీడియోలన్నీ నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టాయి. అయితే వరుస సంఘటనలకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు ట్విటర్లో షేర్ చేస్తూ ఫిర్యాదు చేస్తున్నారు. పబ్లిక్ ప్లేసెస్‌లో ఇలాంటి పనులేంటని ప్రశ్నిస్తూ.. వీటిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. #DelhiMetro హాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో గళమెత్తుతున్నారు. कल से सिर्फ Delhi Metro में ही travel करूंगा !!!!!! pic.twitter.com/l228ZEao1q — Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) April 3, 2023 View this post on Instagram A post shared by 🇮🇳मोहित गौहर 🇮🇳 (@mohitgauhar) Another video of Delhi Metro. If this is an example of WOMEN EMPOWERMENT, then alas our young generation GIRLS can be victim of such EMPOWERMENT 🤦♂️ And this is exactly what SHAMELESS FEMINISTS want. I would call it CULTURAL GEN*CIDE.#delhimetro @OfficialDMRC pic.twitter.com/BrmjBQ3u32 — Barkha Trehan 🇮🇳 / बरखा त्रेहन (@barkhatrehan16) March 31, 2023 -
మెట్రో రైలులో లవర్స్ రచ్చ!.. అవాక్కైన ప్రయాణికులు
వారిద్దరూ లవర్స్ అనుకుంటా.. సరదాగా మెట్రో రైలులో ప్రయాణిస్తున్నారు. ఒక్కసారిగా సీరియస్ అయిన ఆమె.. యువకుడిని పొట్టుపొట్టు కొట్టింది. ఇంతలో నన్నే కొడతావా అంటూ యువకుడు సైతం చెంపపై ఒక్కటిచ్చాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఓ యువతి, యువకుడు.. ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణిస్తున్నారు. ఇంతలో వారి మధ్య టీ షర్ట్ ధరపై వాగ్వాదం మొదలైంది. ఆమె తాను వేసుకున్న టీ షర్ట్‌ను వేయి రూపాయలకు కొనుగోలు చేశానని చెప్పింది. ఈ క్రమంలో యువకుడు.. ఆ టీ షర్ట్ రూ. 150కే దొరుకుతుందని ఫన్నీగా అన్నాడు. దీంతో, ఆమె కోపంతో ఊగిపోయి.. యువకుడి చెంప చెల్లుమనిపించింది. ఈ క్రమంలోనే "మమ్మీ కో బోలుంగీ మెయిన్" (నేను తల్లికి చెబుతాను) అని చెబుతుంది. దీనికి వెంటనే.. సదరు యువకుడు.."తేరే జైసా లడ్కా కిస్కికో నా మైలే" (నీలాంటి వ్యక్తి ఎవరికీ ఉండకూడదు) అంటూ బదులిచ్చాడు. దీంతో, మరింత రెచ్చిపోయిన యువతి.. వరుసగా ఆమె చెంపదెబ్బలు కొడుతుండటంతో యువకుడు కూడా ఆమె చెంప చెల్లుమనిపించాడు. అనంతరం ఒకరిపై ఒకరు అరుచుకుంటూ స్టేషన్ రాగానే రైలు దిగి వెళ్లిపోయారు. అనంతరం వారి చేష్టలకు షాకైన ప్రయాణికులు నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. Delhi metro entertainment 😂😂pic.twitter.com/LLdIDHB54N— kartik (@Kartik_sharmaji) July 12, 2022 ఇది కూడా చదవండి: ‘సార్.. ప్లీజ్ మమ్మల్ని విడిచి వెళ్లొద్దు’.. టీచర్ అంటే ఇలా ఉండాలా? -
మెట్రో రైలులో యువతి ‘జిగల్’ డ్యాన్స్.. సోషల్ మీడియా షేక్
సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు కొందరు నెటిజన్లు వినూత్నంగా థింక్ చేస్తుంటారు. ఇందుకోసం స్పెషల్ ఫీట్స్, డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తుంటారు. అలాంటి వీడియోలు కొన్ని సోషల్ మీడియాను షేక్ చేస్తుంటాయి. ఈ కేటగిరికి చెందిన ఓ వీడియో తాజాగా ట్రెండింగ్‌లో నిలిచింది. ఇటీవలే వచ్చిన జిగల్ జిగల్ డ్యాన్స్ ఛాలెంజ్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. కొందరు నెటిజన్లు ఈ డ్యాన్స్‌పై ఫ్రెండ్స్‌కు ఛాలెంజ్ విసురుతున్నారు. తన ఫ్రెండ్ విసిరిన ఛాలెంజ్‌ను ఆక్సెప్ట్ చేసిన ఢిల్లీకి చెందిన ఓ యువతి ట్రెండీగా ఆలోచించింది. ఢిల్లీ మెట్రో రైలులో జిగల్ జిగల్ డ్యాన్స్ చేసి.. ఛాలెంజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by kashika (@kashikabassi) కాగా, ఆమె డ్యాన్స్ చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా క్షణాల్లో లక్షల్లో వ్యూస్ వచ్చాయి. దీంతో వీడియో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇక, జిగల్ జిగల్ డ్యాన్స్‌పై ప్రపంచవ్యాప్తంగా ఛాలెంజ్ నడుస్తోంది. వివిధ దేశాలకు చెందిన అమ్మాయిలు కూడా డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆమె వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. మెట్రోలో డ్యాన్స్ చేయాలంటే ఎంతో కరేజ్ ఉండాలి అంటూ కామెంట్ చేశాడు. [TIKTOK] 220528 #ROSÉ Tiktok update with #JENNIE & #LISA 블랙핑크 @BLACKPINK pic.twitter.com/BXWbjvN6mF — Worldwide BLIИK 🌷 (@WorldwideBLINK) May 28, 2022 My favorite female artist Shakira dancing to a song called my money don't jiggle jiggle on the Tonight show with Jimmy Fallon she absolutely killed it ♥️♥️🔥🔥@shakira ♥️♥️🔥🔥 pic.twitter.com/zHR1JEkQLj — Vanessa Mendes (@vanessa_ban2) May 20, 2022 View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) ఇది కూడా చదవండి: నెట్టింట్లో హల్చల్ చేస్తున్న హైబ్రిడ్ భరతనాట్యం -
2025 నాటికి 25 నగరాల్లో మెట్రో
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రోలో తొలి డ్రైవర్‌లెస్ ట్రైన్‌ను సోమవారం ప్రధాని మోదీ ప్రారంభించారు. 2025 నాటికి దేశవ్యాప్తంగా మెట్రో రైలు సేవలను 25 నగరాలకు విస్తరిస్తామని ప్రకటించారు. వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో అన్ని ప్రజా రవాణా సేవలను పొందేందుకు వీలు కల్పించే ‘నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్’నూ ప్రారంభించారు. తాము అధికారంలోకి వచ్చేనాటికి దేశవ్యాప్తంగా ఐదు నగరాల్లో మాత్రమే మెట్రో సేవలు ఉండగా, ప్రస్తుతం ఆ సేవలు 18 నగరాలకు విస్తరించాయన్నారు. ప్రయాణీకుల సంఖ్య తక్కువగా ఉంటే పట్టణాలో ‘మెట్రోలైట్’ విధానంలో తక్కువ ఖర్చుతో మెట్రో సేవలందించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. జల మార్గాలకు అవకాశమున్న నగరాల్లో ‘వాటర్ మెట్రో’ విధానం ఒక వినూత్న ఆలోచన అవుతుందన్నారు. ప్రస్తుతం మెజెంటా లైన్(జానక్‌పురి వెస్ట్ – బొటానికల్ గార్డెన్)లో ఈ ట్రైన్లు నడుస్తాయని, మరో ఆరు నెలల్లో పింక్ లైన్(మజ్లిస్ పార్క్ – శివ్ విహార్)లో ప్రారంభిస్తామని వెల్లడించింది. 21వ శతాబ్దపు భారత దేశ వైభవాన్ని ఢిల్లీ ప్రతిబింబించాలని మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలోని పాత పర్యాటక నిర్మాణాలను ఆధునీకరించడంతో పాటు, నగరానికి 21వ శతాబ్దపు హంగులను అద్దనున్నామన్నారు. సాగు ఉత్పత్తుల కోసం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు, రైతుల ఆదాయం పెంచేందుకు విప్లవాత్మక సంస్కరణలను ప్రారంభించామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వీడియో కాన్ఫెరెన్స్ విధానంలో సోమవారం 100వ కిసాన్ రైలు సర్వీసును మోదీ ప్రారంభించారు. మహారాష్ట్రలోని సాంగోలా నుంచి పశ్చిమబెంగాల్లోని షాలిమార్ వరకు ఈ కిసాన్ రైలు నడవనుంది. చిన్న, మధ్య తరహా రైతులు తమ ఉత్పత్తులను సూదూరంలో ఉన్న మార్కెట్లలో అమ్ముకునేందుకు కోల్డ్ స్టోరేజ్ సౌకర్యం ఉన్న ఈ కిసాన్ రైళ్లు ఉపయోగపడ్తాయని ప్రధాని వివరించారు. ఈ రైళ్లకు రైతుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. రైతులు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి వీలుగా రైల్వే స్టేషన్లకు దగ్గరలో రైల్ కార్గో సెంటర్లను నిర్మిస్తున్నామన్నారు. -
మెట్రో ఇప్పట్లో లేనట్టే!
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా నిలిచిపోయిన మెట్రో రైళ్లు ఇప్పట్లో పునఃప్రారంభమయ్యేలా లేవు. జూన్ 30 తర్వాత మెట్రో రైళ్లు పట్టాలపైకి వస్తాయని ఆశించిన నగరవాసులకు నిరాశ ఎదురైంది. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన అన్‌లాక్ 2.0 నిబంధనల ప్రకారం తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేవరకూ ఢిల్లీ మెట్రో సర్వీసుల నిలిపివేత కొనసాగుతుందని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) మంగళవారం పేర్కొంది. కాగా దేశరాజధాని ఢిల్లీలో కోవిడ్-19 వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఢిల్లీలో ఇప్పటివరకూ 83,077 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా మహమ్మారి బారినపడి 2623 మంది ప్రాణాలు విడిచారు. చదవండి : ఇస్మార్ట్ బార్బర్.. -
ఆ రూట్లో మెట్రో స్టేషన్ల మూసివేత..
సాక్షి, న్యూఢిల్లీ : హాస్టల్ ఫీజుల పెంపుదలను పూర్తిగా వెనక్కితీసుకోవాలని కోరుతూ జేఎన్‌యూ విద్యార్ధులు చేపట్టిన ఆందోళనలతో ఢిల్లీ హోరెత్తింది. జేఎన్‌యూ విద్యార్ధుల ఆందోళన నేపథ్యంలో పోలీసుల సూచనతో ఢిల్లీ మెట్రో ఉద్యోగ్ భవన్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్ల వద్ద ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను మూసివేసింది. మరోవైపు సెంట్రల్ ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్ స్టేషన్లో మెట్రో రైళ్లు ఆగవని ఢిల్లీ మెట్రో తెలిపింది. ఢిల్లీ పోలీసుల సూచనల మేరకు ఆయా మెట్రో స్టేషన్లలో మెట్రో ట్రైన్లు ఆగవని వాటి వద్ద ప్రవేశ, నిష్ర్కమణ ద్వారాలను తాత్కాలికంగా మూసివేశామని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తన ట్విటర్ ఖాతాలో పేర్కొంది. మరోవైపు ఆందోళన బాట పట్టిన విద్యార్ధులు, జేఎన్‌యూ అధికార యంత్రాంగం మధ్య సయోధ్య సాధించేందుకు మాజీ యూజీసీ చీఫ్ డాక్టర్ వీరేందర్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో ఓ కమిటీని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నియమించింది. -
ఇప్పుడు ఫ్రీ అంటే.. తర్వాత ఇబ్బందులొస్తాయి
సాక్షి, ఢిల్లీ : మెట్రో రైళ్లలో మహిళలకు ఉచిత ప్రయాణమంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన పథకం మీద సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి పథకాల వల్ల ఢిల్లీ మెట్రో తీసుకున్న దీర్ఘకాలిక రుణాల చెల్లింపులపై భారం పడుతుందని స్పష్టం చేసింది. అంతేకాక, భవిష్యత్తులో మెట్రో విస్తరణ, సదుపాయాలు, సేవలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పేర్కొంది. ఢిల్లీలో నాలుగో ఫేజ్‌లో భాగంగా త్వరలో చేపట్టే మెట్రో విస్తరణ భూసేకరణకు అయ్యే వ్యయంలో సగం కేంద్రం భరించాలని ఆప్ ప్రభుత్వం వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ పథకం వల్ల ఇప్పటివరకు రూ. 100 కోట్ల నష్టంలో ఉన్న సంస్థపై రూ.1500 కోట్ల భారం పడుతుందని హెచ్చరించింది. ఏడాదికి ఏడు వేల కోట్ల ఆదాయం గడిస్తున్నా కూడా నష్టాలు తప్పట్లేదన్నారు. ప్రజాధనాన్ని సరిగ్గా ఉపయోగించాలనీ, ఉచిత పథకాలతో వృథా చేయవద్దని హితవు పలికింది. (చదవండి: నిరుద్యోగ మహిళలకు కేజ్రివాల్ వరం) -
వాళ్ల వల్లే మెట్రోకు రూ. 2.84కోట్ల ఆదాయం
న్యూ ఢిల్లీ : మహిళా ప్రయాణికుల ద్వారా ఢిల్లీ మెట్రోకు ప్రతిరోజూ 2.84కోట్ల రూపాయల ఆదాయం లభిస్తోందని, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ తీసుకున్న నిర్ణయంతో ఢిల్లీ మెట్రో ఆదాయనికి భారీగా గండిపడుతుందని ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ మాజీ డైరక్టర్ ఈ శ్రీధరన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇదివరకే భారత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ఆపు చేసేలా చర్యలు తీసుకోవాలని ‘‘మెట్రోమ్యాన్’’ శ్రీధరన్ లేఖలో ప్రధానిని కోరారు. ఢిల్లీ మెట్రోకు మూడింట రెండు వంతుల నిధులు జపాన్ ప్రభుత్వం నుంచి అందుతున్నాయని, సామాన్య ప్రజలందరికీ మెట్రో ఛార్జీలు అందుబాటులో ఉండేలా చూసుకుంటూ లోన్ తిరిగి చెల్లించేలా చూసుకోవాలని తెలిపారు. అయితే ఢిల్లీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయంతో మెట్రో ఉనికికే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆప్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం మహిళలకు సహాయం చేయటం కోసంకాదని, రానున్న ఎన్నికల్లో మహిళల ఓట్లు దండుకోవాలనేనని మండిపడ్డారు. కేవలం మహిళలకు మాత్రమే రాయితీలు ఇవ్వటం కుదరదన్నారు. వారికంటే ఎక్కువగా వయోవృద్ధులకు, విద్యార్థులకు, దివ్యాంగులకు మెట్రో రాయితీల అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు. కానీ వారందరికి ప్రస్తుతం ఎలాంటి రాయితీలు ఢిల్లీ మెట్రో ఇవ్వటం లేదన్నారు. ఢిల్లీ మెట్రోలో మహిళలకు ఉచిత సదుపాయం కల్పిస్తే గనుక అది అంటురోగంలా దేశం మొత్తం ఉన్న మెట్రోలకు పాకుతుందని అన్నారు. అలా జరిగితే మెట్రో వ్యవస్థ రాయితీల కోసం ప్రభుత్వాల మీద ఆధారపడవల్సి ఉంటుందని తెలిపారు. -
అలా అయితే మెట్రో దివాళా..
సాక్షి, న్యూఢిల్లీ : మెట్రో రైలులో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తామన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదన ఆమోదయోగ్యం కాదని మెట్రో మేన్‌గా గుర్తింపు పొంది పదవీవిరమణ చేసిన ఢిల్లీ మెట్రో మాజీ చీఫ్ ఈ శ్రీధరన్ స్పష్టం చేశారు. మెట్రోలో మహిళలను ఉచితంగా ప్రయాణం చేసేందుకు వెసులుబాటు కల్పిస్తే రవాణా వ్యవస్ధ కుప్పకూలి దివాలా తీస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ ప్రతిపాదనకు అంగీకరించవద్దని ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో శ్రీధరన్ విజ్ఞప్తి చేశారు. మహిళలకు ఢిల్లీ మెట్రోలో ఉచిత ప్రయాణానికి అవకాశం ఇచ్చే ఢిల్లీ ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలపరాదని మోదీకి రాసిన లేఖలో ఆయన తేల్చిచెప్పారు. 2002లో ఢిల్లీ మెట్రో ప్రారంభించే సమయంలో ప్రతి ఒక్కరూ టికెట్ కొనుగోలు చేసి మెట్రో రైలులో ప్రయాణించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ఇందుకు ఎవరికీ మినహాయింపు లేదని గుర్తుచేశారు. ఈ నిర్ణయాన్ని స్వాగతించిన అప్పటి ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి సైతం 2002 డిసెంబర్లో షహ్‌దర నుంచి కశ్మీరీ గేట్ వరకూ టికెట్ కొనుగోలు చేసి ప్రయాణించారని చెప్పుకొచ్చారు. ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్‌గా ఏర్పడిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ)లో కేవలం ఓ భాగస్వామి ఢిల్లీ మెట్రోలో ఓ వర్గానికి ఉచిత ప్రయాణం కల్పిస్తూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని సంస్థను దివాలా తీయించలేరని శ్రీధరన్ తేల్చిచెప్పారు. ఢిల్లీమెట్రోలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం ఇతర మెట్రోలూ ఇదే ఒరవడి అనుసరించే ప్రమాదం లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల ఉచిత ప్రయాణంతో తలెత్తే ఆదాయ నష్టాన్ని తాము పూడ్చుతామన్న ఢిల్లీ ప్రభుత్వ ప్రతిపాదన పసలేని వాదనగా కొట్టిపారేశారు. -
మెట్రోరైలు దిగుతున్న సమయంలో.. అనూహ్యంగా
న్యూఢిల్లీ : నగరమంటేనే ఉరుకుల-పరుగుల జీవితం. ఇప్పుడు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ మెట్రోరైళ్లు నడుస్తున్నాయి. మెట్రోలో ప్రయాణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు, ముఖ్యంగా మెట్రో రైలు నుంచి దిగేటప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన చాటుతోంది. ఓ 40 ఏళ్ల మహిళ మెట్రో రైలు దిగుతుండగా.. ఆమె చీర బోగీ డోర్లో చిక్కుకుపోయింది. దీంతో ఆమెను ఫ్లాట్‌ఫామ్ మీద మెట్రోరైలు లాక్కెళ్లింది. ఈ విషయాన్ని గుర్తించిన ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ బటన్ నొక్కడంతో ఆ మహిళకు పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ఘటనలో ఆమె తలకు గాయాలయ్యాయి. బ్లూలైన్ మార్గంలోని మోతినగర్ మెట్రో స్టేషన్లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలిని గీతగా గుర్తించారు. గీత తన కూతురితో కలిసి.. మోతినగర్ మెట్రో స్టేషన్లో దిగుతున్నప్పుడు ఈ ఘటన జరిగింది. ‘నవాడా నుంచి గీత, నా కూతురు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. మోతినగర్‌లో ఆమె దిగారు. అయితే, దిగే సమయంలో ఆమె చీర మెట్రో బోగీ డోర్లో చిక్కుకొని.. డోర్ మూతపడింది. దీంతో మెట్రో రైలు కదలడంతోపాటు ఆమెను ఫ్లాట్‌ఫాం మీద ఈడ్చుకెళ్లింది. ఈ విషయాన్ని గుర్తించిన ప్రయాణికుడెవరో ఎమర్జెన్సీ బటన్ నొక్కారు. దీంతో డ్రైవర్ రైలును ఆపారు’ అని ఆమె భర్త జగదీశ్ ప్రసాద్ తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన గీతను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. మోతినగర్ మెట్రో స్టేషన్లో ఈ ఘటన జరిగిన విషయం వాస్తవమేనని, ఈ ఘటనతో ఈ మార్గంలో మెట్రో సేవల్లో కొంత అంతరాయం ఏర్పడిందని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
అమల్లోకి వచ్చిన కాలుష్య ఎమర్జెన్సీ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ– ఎన్సీఆర్లో కాలుష్య సమస్య రోజురోజుకు ముదురుతుండడంతో గురువారం నుంచి కాలుష్య నియంత్రణ కోసం ఎమర్జెన్సీని పది రోజుల పాటు అమల్లోకి తెచ్చారు. నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ కింద కాలుష్య నియంత్రణ కోసం నిర్మాణ పనులపై నిషేధం విధించడం, స్టోన్ క్రషర్స్, హాట్ మిక్స్ ప్లాంట్లను మూసివేయడం వంటి పలు కఠిన చర్యలు అమల్లోకి వచ్చాయి. ఈ నియమాలను ఉల్లంఘించేవారిపై భారీ జరిమానాలు విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ సంస్థలను ఆదేశించారు. కాలుష్య కారక వాహనాలను తనిఖీ చేసే కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ జారీ చేసిన ఆదేశాల మేరకు ఢిలీ ట్రాఫిక్ పోలీసులు, రవాణా విభాగం అధికారుల బృందాలు రోడ్లపై పాత వాహనాలను తనిఖీ చేస్తూ స్వాధీనం చేసుకుంటున్నారు. ఢిల్లీ ప్రభుత్వం కూడా అవసరమైనప్పుడు సరి–బేసి విధానాన్ని అమలుచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ప్రైవేటు వాహనాలను పక్కనపెట్టండి... నగరంలో కాలుష్యం మరింత దిగజారే సూచనలు కనిపిస్తోన్న దృష్ట్యా రానున్న పది రోజుల పాటు ప్రైవేటు వాహనాలను పక్కనపెట్టి ప్రజా రవాణా వాహనాలను ఉపయోగించవలసిందిగా ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కంట్రోల్ అథారిటీ(ఈపీసీఏ), ఢిల్లీ–ఎన్సీఆర్ వాసులను కోరింది. ఢిల్లీ–ఎన్సీఆర్లో కాలుష్యానికి ప్రైవేటు వాహనాలు 40 శాతం కారణమవుతున్నాయని ఈపీసీఏ తెలిపింది. ఢిల్లీలో 35 లక్షల ప్రైవేటు వాహనాలు ఉన్నాయి. ఢిల్లీ మెట్రో కూడా బుధవారం నుంచి 21 అదనపు రైళ్లను పట్టాలపై దింపింది. -
ఆ మెట్రో ఎక్కితే జేబు గుల్లే..
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో మెట్రో రైలు ప్రయాణం సామాన్యుడి జేబుకు అందనంత దూరంలో ఉంది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) చేపట్టిన అథ్యయనంలో ఢిల్లీ మెట్రో ప్రపంచంలోనే ఖరీదైన మెట్రో ప్రయాణంలో రెండవదిగా నిలిచింది. గత ఏడాది మెట్రో రైలు చార్జీలు పెంచిన అనంతరం ప్రపంచంలోనే అతిఎక్కువ చార్జీలు కలిగిన రెండవ మెట్రో సర్వీసుగా ఢిల్లీ మెట్రో అవతరించింది. ప్రపంచంలో తొమ్మిది మెట్రపాలిటన్ నగరాల్లో పది కిలోమీటర్ల ప్రయాణానికి సగం డాలర్‌లోపే ఖర్చవుతుండగా, ఢిల్లీ మెట్రోలో ప్రయాణించేందుకు ప్రయాణీకులు తమ ఆదాయంలో చేస్తున్న ఖర్చు శాతం ఆధారంగా ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మెట్రో ప్రయాణాల్లో రెండవదిగా నిలిచిందని సీఎస్ఈ అథ్యయనం వెల్లడించింది. ఢిల్లీలో మెట్రో జర్నీపై ప్రయాణీకులు తమ ఆదాయంలో 14 శాతం ఖర్చు చేస్తుండగా, అత్యధికంగా వియత్నాంలోని హనోయిలో ప్రయాణీకులు మెట్రో జర్నీ కోసం తమ ఆదాయంలో ఏకంగా 25 శాతం వెచ్చించాల్సి వస్తోంది. ఢిల్లీలో దినసరి కార్మికుడు నాన్ ఏసీ బస్సులో వెళ్లేందుకు తన ఆదాయంలో 8 శాతం, ఏసీ బస్‌లో వెళ్లేందుకు 14 శాతం ఖర్చు చేయాల్సి ఉండగా, ఢిల్లీ మెట్రోలో వెళ్లాలంటే మాత్రం తన రాబడిలో ఏకంగా 22 శాతం ఖర్చు చేయాల్సి వస్తోందని ఈ అథ్యయనం విశ్లేషించింది. -
మెట్రో ట్రాక్‌పై నడిచిన మహిళ
సాక్షి, న్యూఢిల్లీ : స్టేషన్లలో పౌరుల భద్రతకు, ఆత్మహత్యలను నిరోధించేందుకు ఢిల్లీ మెట్రో అధికారులు పలు చర్యలు చేపడుతున్నా ఈ తరహా ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతో ఓ మహిళ ఏకంగా పలు స్టేషన్లకు మెట్రో ట్రాక్‌లపైనే నడిచి వెళుతున్న వీడియో వైరల్‌గా మారింది. నోయిడా సెక్టార్ 15 మెట్రో స్టేషన్ నుంచి సెక్టార్ 16 మెట్రో స్టేషన్‌కు ట్రాక్‌పై నుంచి మహిళ నడిచివెళుతున్న దృశ్యాలు ఆ వీడియోలో రికార్డయ్యాయి. ఆమె మెట్రోలో వెళ్లకుండా ట్రాక్‌ల పైనుంచి వెళ్లడం గమనార్హం. మహిళ ట్రాక్‌లపై నడవడాన్ని గుర్తించిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) అధికారులు ఇరు స్టేషన్ల మధ్య రైళ్లను నిలిపివేశారు. ట్రాక్‌పై నడుస్తున్న మహిళను స్ధానికులు వారించినా ఆమె వినిపించుకోకపోవడం గమనార్హం.మెట్రో స్టేషన్లో ఆత్మహత్యకు పాల్పడాలనే ఉద్దేశంతోనే ఆమె ఇలామ వ్యవహరించారని భావిస్తున్నారు. ట్రాక్‌పై నడుస్తున్న మహిళను అధికారులకు డీఎంఆర్‌ఆసీ అప్పగించింది. -
మెట్రో సేవలకు బ్రేక్..
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో మెట్రో రైల్ ప్రయాణీకులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ), లేబర్ కమిషన్ అధికారులతో జరిగిన చర్చలు విఫలం కావడంతో మెట్రో సిబ్బంది శనివారం నుంచి సమ్మె బాట పట్టనున్నారు. మెట్రో సిబ్బంది సమ్మె హెచ్చరికల నేపథ్యంలో ప్రతిష్టంభన సమసిపోయేలా చొరవ చూపాలని ఢిల్లీ రవాణా మంత్రి కైలాష్ గెహ్లాట్ డీఎంఆర్సీని ఆదేశించినా చర్చలు ఇప్పటివరకూ ఓ కొలిక్కిరాకపోవడంతో ఉద్యోగులు సమ్మెకు సంసిద్ధమవుతున్నారు. డిమాండ్ల సాధన కోసం జూన్ 19 నుంచి నిరసనలు తెలుపుతున్న మెట్రో సిబ్బంది శనివారం నుంచి నిరవధిక సమ్మె బాట పట్టనున్నారు. మెట్రో సిబ్బంది సమ్మెతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. అయితే వారాంతం కావడంతో శని, ఆదివారాలు సమ్మె ప్రభావం పెద్దగా ఉండబోదని భావిస్తున్నారు. ఢిల్లీ మెట్రోకు చెందిన 9000 మందికి పైగా నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు వేతన చెల్లింపులు, ఇతర డిమాండ్ల సాధన కోసం నిరసన బాట పట్టిన సంగతి తెలిసిందే. -
మెట్రో సిబ్బంది సమ్మె బాట
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ)కు చెందిన 9000 మంది ఉద్యోగులు తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించకుంటే ఈనెల 30 నుంచి సమ్మె బాట పడతామని హెచ్చరించారు. డిమాండ్ల సాధన కోసం డీఎంఆర్సీకి చెందిన స్టాఫ్ కౌన్సిల్లో ఓ వర్గం ఈనెల 19 నుంచి యమునా నదీ తీరంలో, శారదా మెట్రో స్టేషన్ల వద్ద ప్రదర్శనలు చేపడుతున్నాయి. జూన్ 29లోగా తమ డిమాండ్లను నెరవేర్చనిపక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని డీఎంఆర్సీ స్టాఫ్ కౌన్సిల్ తేల్చిచెప్పింది. తమ డిమాండ్లను ఇప్పటికే ఢిల్లీ మెట్రో అధికారులకు, కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువెళ్లామని పేర్కొంది. డీఎంఆర్సీ స్టాఫ్ కౌన్సిల్‌ను డీఎంఆర్సీ ఉద్యోగుల సంఘంగా మార్చాలన్నది తమ ప్రధాన డిమాండ్ అని, మూడవ వేతన సవరణ స్కేల్‌కు అనుగుణంగా తమకు ఐడీఏ వర్తింప చేయాలన్నవి ఇతర డిమాండ్లని కౌన్సిల్ సెక్రటరీ రవి భరద్వాజ్ చెప్పారు. నిరసనలో భాగంగా తొలిరోజు మెట్రో డ్రైవర్ల నుంచి స్టేషన్ కంట్రోలర్లు, ఇతర సిబ్బంది నల్ల రిబ్బన్లతో విధులకు హాజరవుతారని తెలిపారు. తదుపరి దశలో నిరాహార దీక్షలు చేపడతామని, ఎలాంటి ఆహారం తీసుకోకుండా విధులకు హాజరై ఫ్లాట్‌ఫాంలపై ప్రదర్శనలు చేపడతామని చెప్పారు. కాగా, మెట్రో సిబ్బంది సమ్మెతో మెట్రో రైళ్ల సేవలకు అంతరాయం ఏర్పడుతుందని భావిస్తున్నారు. -
వైరల్ ఫోటో..వాస్తవం తెలుసుకుని రాయండి
సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా ఓ ఫోటో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ మెట్రో రైలులో ఓ మహిళ తన బిడ్డతో సీట్లో కూర్చుని.. పని మనిషిని మాత్రం కింద కూర్చోబెట్టింది. ఓ యువ జర్నలిస్ట్ ఈ ఫోటోను తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా... సదరు మహిళపై తీవ్ర విమర్శలు వినిపించాయి. ది ప్రింట్ ఇండియా రిపోర్టర్ సన్య ధింగ్రా శనివారం సాయంత్రం మెట్రో రైల్లో ప్రయాణిస్తోంది. ఆ సమయంలో ఓ మహిళ తన చిన్నారితో సీట్లో కూర్చొని ఉన్నారు. అయితే చిన్నారి బాగోగులు చూసుకునే ఆయా మాత్రం కిందే కూర్చుని ఉన్నారు. పక్కనే కాస్త జాగా ఉన్నప్పటికీ ఎవరూ ఆమెకు చోటు ఇవ్వలేదు. చివరకు యాజమాని అయిన మహిళ కూడా ఆమెను కూర్చొమని కోరలేదు. ఎలా ఉందో చూడండంటూ ఆ ఫోటోను సన్య తన ట్వీటర్లో పోస్టు చేశారు. ఇది ఇంతటితో ఆగలేదు. ది ప్రింట్ ఇండియా సోమవారం సంచికలో దీనిని ముఖచిత్రంగా ప్రచురించింది. విమర్శల నేపథ్యంలో చివరకు ఆ మహిళ తన బ్లాగ్‌లో స్పందించారు. తాను అపోలో ఆస్పత్రిలో పని చేసే వైద్యురాలినినని పేర్కొంటూ 8 పేరాలతో ఓ పెద్ద వ్యాసాన్నే ప్రచురించారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో చెబుతూ మొత్తం వివరించారు. ‘‘నేను-నా బిడ్డ-ఆయా ముగ్గురం మెట్రోలో ఇంటికి బయలుదేరాం. మా దగ్గర లగేజీ చాలా ఉంది. మేం రైలు ఎక్కిన సమయంలో ప్రయాణికులతో కిక్కిరిసిపోయి ఉంది. మహిళలంతా కిందే కూర్చుని ఉన్నారు. ఇది మాకు కొత్తేం కాదు. నా బిడ్డను నేను, ఆయా ఇద్దరం కలిసి ఆడించాం. తర్వాత కాసేపటికి మేమున్న కోచ్ కాస్త ఖాళీ అయ్యింది. ఓ మహిళ నాకు సీటు ఇచ్చి దిగిపోయారు. వెంటనే నేను, నా చిన్నారి ఆ సీట్లో కూర్చున్నాం. అప్పుడే సన్య మా కోచ్‌లోకి ఎక్కారు. అయితే అప్పటికే బాగా అలిసిపోయిన ఆయా కింద కూర్చోవటం గమనించిన సన్య.. ఆమెను పైన కూర్చొమని కోరారు. కానీ, తనకు కింద కూర్చోవటమే బాగుందని ఆయా బదులిచ్చింది.. చివరకు ఎంజీ రోడ్ స్టేషన్లో దిగి మేం ఇంటికి వెళ్లిపోయాం. సోషల్ మీడియాపై నాకు పెద్దగా ఆసక్తి లేదు. ఎవరో చెప్పగా నేను ఆ పోస్టును చూశాను. నేనొక వైద్యురాలిని ప్రజలకు సేవ చేయటం నా కర్తవ్యం. ఆమె మా ఇంట్లో పని మనిషిగా చాలా రోజుల నుంచి చేస్తోంది. మాతోనే ఉంటుంది. మాతోనే తింటుంది. తోటి మనిషితో ఎలా ప్రవర్తించాలో నాకు బాగా తెలుసు. ఆత్రుతతో అనుమతి లేకుండా సన్య నా ఫోటో తీయటం.. వాస్తవాలు ఏంటో తెలీకుండా శేఖర్ గుప్తా(ప్రముఖ జర్నలిస్ట్) కథనం రాయటం... సరికాదు. అంటూ సదరు మహిళ ఆ కథనంపై మండిపడ్డారు. సన్య చేసిన పోస్టు ఇదే! -
మెట్రో కార్డుతో 250 బస్సుల్లో జర్నీ
సాక్షి , న్యూఢిల్లీ : మెట్రో కార్డులతో ఢిల్లీ ప్రయాణీకులు ఎంపిక చేసిన 250 బస్సుల్లో తిరగవచ్చని ఢిల్లీ రవాణా మంత్రి కైలాష్ గెహ్లాట్ చెప్పారు. మెట్రో, ఢిల్లీ రవాణా సంస్థ బస్సులు, క్లస్టర్ బస్సుల్లో ఒకే కార్డుతో జర్నీ చేయడంపై నెలరోజులు ఎంపిక చేసిన బస్సుల్లో పరిశీలిస్తామని మంత్రి తెలిపారు. ఆయా బస్సుల్లో ఎలక్ర్టానిక్ టికెటింగ్ యంత్రాల్లో (ఈటీఎం) మెట్రో కార్డును ట్యాప్ చేయడం ద్వారా ప్రయాణాలు సాగించవచ్చన్నారు. మెట్రో కార్డును ట్యాప్ చేయగానే టికెట్ జనరేట్ అవుతుంది. ఈ టికెట్‌పై మెట్రో కార్డులో బ్యాలెన్స్ వివరాలూ పొందుపరుస్తారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అన్ని బస్సుల్లో మెట్రో కార్డును కామన్ కార్డుగా అనుమతిస్తారు. -
మోదీ జాలీ రైడ్.. కేజ్రీకి అవమానం
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో కొత్త మెట్రో రైల్ లైన్ ప్రారంభమైంది. ఢిల్లీ నుంచి నోయిడాను కలిపే మాజెంటాలైన్‌ను క్రిస్టమస్ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. నోయిడాకు తొలి మెట్రో రైల్ కూడా ఇదే. దాదాపు 12.6కిలోమీటర్ల పొడవునా నిర్మించిన ఈ మార్గం ఢిల్లీలోని కాల్కాజీ నుంచి నోయిడా వరకు ఉంది. ప్రధాని నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇతర ప్రభుత్వ అధికారులు తొలిసారి ఈ రైలులో నోయిడా నుంచి ఓక్లా బర్డ్ శాంక్చూరి స్టేషన్ వరకు ప్రయాణించారు. అయితే, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు తీవ్ర అవమానం జరిగింది. ఆయనను మరోసారి మెట్రో రైల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించలేదు. ఢిల్లీలో మెట్రో కొత్త లైన్ ప్రారంభంకావడం ఆ కార్యక్రమానికి కేజ్రీవాల్‌ను ఆహ్వానించకపోవడం ఇది మూడోసారి. అయితే, ఈ మూడుసార్లు కూడా ప్రధాని మోదీ మాత్రం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మోదీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ పట్ల బీజేపీ ప్రభుత్వ వివక్షపూరితంగా వ్యవహరిస్తోందని, కిందిస్థాయి మనస్తత్వంతో వ్యవహరిస్తోందని మండిపడింది. కేజ్రీవాల్ అంటే బీజేపీకి ఏహ్యభావం ఉందని కూడా ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ వ్యవహారంపై స్పందించేందుకు నిరాకరించారు. క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపిన ఆయన రాజకీయాలపై ప్రస్తుతం చర్చ అవసరం లేదని అన్నారు. -
మెట్రో ప్రారంభోత్సవం.. కేజ్రీవాల్‌కేదీ ఆహ్వానం?
న్యూ ఢిల్లీ: నొయిడా బొటానికల్ గార్డెన్ నుంచి ఢిల్లీలోని కల్కాజీ వరకు నిర్మించిన మెట్రోరైలు ప్రారంభోత్సవానికి హస్తిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఆహ్వానం అందకపోవడం రాజకీయంగా విమర్శలకు తావిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా ఈ మెట్రోలైన్ ఈ నెల 25న ప్రారంభం కానుంది. యూపీ పరిధిలోకి వచ్చే నొయిడాలోని బొటానికల్ గార్డెన్ వద్ద ఈ ప్రారంభోత్సవ వేడక జరుగుతుంది. దేశ రాజధాని ప్రాంతంలో ఇది మొదటి ఇంటర్చేంజ్ స్టేషన్ కావడం గమనార్హం. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం వీఐపీ అతిథుల జాబితాలో అరవింద్ కేజ్రీవాల్ పేరు లేదు. 12.64 కిలోమీటర్ల పొడవున్న ఈ మెట్రోలైన్ ఢిల్లీలో ముగుస్తుంది. ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ (డీఎంఆర్సీ) హస్తిన, కేంద్ర ప్రభుత్వాల (కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ) జాయింట్ వెంచర్ (ఇరు వర్గాలకు 50:50 వాటా ఉంది). నొయిడా నుంచి మెట్రోలైన్‌కు యూపీ ప్రభుత్వమే నిధులు సమకూర్చినప్పటికీ, ఢిల్లీలో పొడిగించిన మేర దూరానికి ఆ రాష్ట్ర ప్రభుత్వమే నిధులు భరించింది. ఈ నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్‌కు ఆహ్వానం అందకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆహ్వానం అందని విషయాన్ని ఢిల్లీ ప్రభుత్వ అధికార ప్రతినిధి సైతం ధ్రువీకరించారు. ఆయన మాట్లాడుతూ ఢిల్లీ మెట్రో రైలు కార్పోరేషన్(డీఎంఆర్సీ) నుంచి అధికారికంగా ఎలాంటి పిలుపు రాలేదని తెలిపారు. తక్కువ ధరలతో మెట్రో ప్రయాణం సురక్షితంగా సాగలన్నదే తమ లక్ష్యమని అన్నారు. మెట్రో నిర్మాణ సంస్థలు ధరల పెంపును ప్రతిపాదించినప్పుడు ప్రభుత్వం అంగీకరించలేదని వెల్లడించారు. కానీ ఢిల్లీ మెట్రో సంస్థ, కేంద్ర ప్రభుత్వంతో కలిసి ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకుందని పేర్కొన్నారు. తమకు ఆహ్వానం అందకపోవడంపై ఎమైనా ప్రశ్నలు అడగదలుచుకుంటే పట్టణాభివృద్ధి శాఖను, డీఎంఆర్సీని సంప్రదించాలని తెలిపారు. బొటానికల్ గార్డెన్ నుంచి కల్కాజీ వరకు పారంభం కానున్న మార్గంలో తొమ్మిది స్టేషన్లున్నాయి. దీని ద్వారా ఈ మార్గంలో ప్రయాణ సమయం 52 నిమిషాల నుంచి 19 నిమిషాలకు తగ్గనుంది. అధునాతన టెక్నాలజీతో డ్రైవర్ లేకుండా రైలు పరుగులు పెట్టనుంది. ఇది ఈ ఏడాదిలో ప్రధాని మోదీ ప్రాంభించనున్న మూడో మెట్రోరైలు కావడం విశేషం. జూన్‌లో కొచ్చి మెట్రోను, నవంబర్‌లో హైదరాబాద్ మెట్రోను మోదీ ప్రారంభించారు. -
మెట్రోలో.. మనమెక్కడ?
మెట్రో.. హైదరాబాద్ కలలు రైలు. వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రజా రవాణా కోసం ఏర్పడ్డ మెట్రో.. నేటి నుంచి పట్టాలపై పరుగులు తీయనుంది. దేశంలో ఇప్పటికే ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరు, గుర్గావ్, జైపూర్, చెన్నై పట్టణాల్లో మెట్రో రైలు పరుగులు తీస్తోంది. మన దేశంలోకి మెట్రో సేవలు అలస్యంగా అడుగుపెట్టినా.. అత్యంత ఆధునికతో అందుబాటులోకి వచ్చాయి. ఇంకా చెప్పాలంటూ హైదరాబాద్ మెట్రో.. ఆధునిక సాంకేతికతకు నిలువుటద్దం. ప్రపంచవ్యాప్తంగా ..! ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్‌గా పేర్కొనే మెట్రో.. సేవలు నేడు ప్రపంచవ్యాప్తంగా 55 దేశాల్లో 157 నగరాల్లో ప్రజలకు సేవలందిస్తున్నాయి. ఇందులో లండన్ మెట్రోను.. ప్రపంచంలోనే మొట్టమొదటి అండర్‌గ్రౌండ్ మెట్రోగా ఖ్యాతి దక్కించుకుంది. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన మెట్రోగా చైనాలోని షాంఘై మెట్రో గుర్తింపు పొందింది. ఇక ప్రపంచంలోనే అత్యంత బిజీ మెట్రో సబ్వేలుగా బీజింగ్, న్యూయార్క్ సబ్‌వేలు నిలిచాయి. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను నేడు మెట్రోగా వ్యహరిస్తున్నారు. మెట్రో గణాంకాలు ప్రపంచవ్యాప్తంగా మెట్రో లైన్లు... 549 మొత్తం స్టేషన్లు... 9,200 మొత్తం కిలోమీటర్లు.. 11,300 ప్రయాణికుల సామర్థ్యం... రోజుకు 160 మిలియన్లు (మొత్తం బంగ్లాదేశ్ జనాభాకు సమానం) భారత్‌లో మెట్రో మన దేశంలో ప్రస్తుతం ఏడు నగరాల్లో మెట్రో పరుగులు తీస్తోంది. ప్రస్తుతం దేశంలో పొడవైన మెట్రోగా ఢిల్లీ నిలిస్తే.. చివరిస్థానంలో చెన్నై మెట్రో నిలిచింది. గుర్గావ్ మెట్రో దేశంలో మొట్టమొదటి పబ్లిక్ ప్రైవేట్ మెట్రోగా గుర్తింపు పొందింది. అంకెల్లో మెట్రోలు మెట్రో దూరం (కి.మీ) స్టేషన్లు లైన్లు సామర్థ్యం ఢిల్లీ 213 160 6 2.60 మిలియన్లు కోల్‌కతా మెట్రో 28.14 24 1 0.65 మి ముంబై మెట్రొ 11.40 12 1 0.12 మి బెంగళూరు మెట్రో 25.50 25 2 0.05 మి గుర్గావ్ మెట్రో 5.50 6 1 0.03 మి జైపూర్ మెట్రో 9.63 9 1 0.2 మి చెన్నై మెట్రో 10 7 1 0.02 మి -
మరోసారి మెట్రో ఛార్జీల పెంపు
ఆదాయాలను పెంచుకోవడానికి ఢిల్లీ మెట్రో తన ఛార్జీలను పెంచడం మొదలు పెట్టింది. ఛార్జీల పెంపుతో ఓ వైపు ప్రయాణికులు తగ్గిపోతున్నా... మరోవైపు నుంచి పెద్ద ఎత్తున్న విమర్శలు వెల్లువెత్తుతున్నా.. ఈ పెంపుపై మాత్రం ఢిల్లీ మెట్రో రైలు కార్పోరేషన్ అసలు తగ్గడం లేదు. మరోసారి 2019 జనవరిలో కూడా ఢిల్లీ మెట్రో తన ఛార్జీలు పెంచబోతున్నట్టు తెలిసింది. కేంద్రం నియమించిన కమిటీ ప్రతిపాదనలను ఢిల్లీ మెట్రో అమలు చేయబోతుందని వెల్లడైంది. ఇప్పటికే ఈ కమిటీ ప్రతిపాదించిన మేరకు మే, అక్టోబర్‌లో రెండు దశల్లో ఛార్జీల పెంపు జరిగింది. జస్టిస్(రిటైర్డ్) ఎంఎల్ మెహతా చైర్మన్‌గా ఈ కమిటీ ఏర్పడింది. దీనిలోనే ఢిల్లీ చీఫ్ సెక్రటరీ, అర్బన్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ బోర్డులో అదనపు సెక్రటరీలున్నారు. మెట్రో రైల్వే యాక్ట్ కింద 4వ ఛార్జీలను నిర్ణయించే కమిటీ(ఎఫ్ఎఫ్సీ) ఏర్పడింది. ఆటోమేటిక్ యాన్యువల్ ఫేర్ రివిజన్‌ను ఇది ప్రతిపాదించింది. ప్రస్తుతం ఢిల్లీ మెట్రో ఛార్జీలు 2 కిలోమీటర్లకు రూ.10, 2 నుంచి 5 కిలోమీటర్లకు 20 రూపాయలు, 5 నుంచి 12 కిలోమీటర్లకు 30 రూపాయలు, 12 నుంచి 21 కిలోమీటర్లకు 40 రూపాయలు, 21 నుంచి 32 కిలోమీటర్లకు 50 రూపాయలు, 32 కిలోమీటర్లకు మించితే రూ.60 ఛార్జీలు విధిస్తున్నారు. ఛార్జీల పెంపును నిలిపివేయాలంటూ మోదీ ప్రభుత్వాన్ని సీఎం కేజ్రీవాల్ కోరినప్పటికీ, కేంద్రం అసలు తగ్గలేదు. ఛార్జీల పెంపుతో ఒక్క నెలలోనే భారీగా ప్రయాణికులను కోల్పోయింది. సెప్టెంబర్ లో 27.4 లక్షలుగా ఉన్న ప్రయాణికులు, ధరల పెంపు తర్వాత అక్టోబర్ నెలలో ప్రయాణికుల సంఖ్య 24.2 లక్షలకు పడిపోయారు. -
మెట్రోను చంపేస్తుంది : సీఎం
న్యూఢిల్లీ : ఢిల్లీ మెట్రో ఛార్జీల పెంపుపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఛార్జీల పెంపు ఢిల్లీ మెట్రోను చంపేస్తుందని విమర్శించారు. 2002లో ఢిల్లీలో మెట్రో ప్రారంభమైన సమయంలో కనీస ఛార్జీ రూ.4, గరిష్ట ఛార్జీ రూ.8గా ఉండేది. ప్రస్తుతం కనీస ఛార్జీ రూ.10. మాగ్జిమమ్ ఛార్జీ రూ.60 వరకు పెంచారు. దీంతో తీవ్ర భారంగా భావిస్తున్న ప్రజలు ఎక్కేందుకు ఆసక్తి చూపడం లేదు. '' మెట్రో ధరల్లో భారీగా పెంపు, ఢిల్లీ మెట్రోను చంపేస్తుంది. ఒకవేళ దీన్ని వాడటం ప్రజలు తగ్గిస్తే, అప్పుడు అది ఏ ప్రయోజనాన్ని సర్వ్‌చేస్తుంది'' అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ధరల పెంపు అనంతరం దాదాపు మూడు లక్షల మంది ప్రయాణికులు తగ్గిపోయినట్టు మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. అయితే కేవలం ధరల పెంపు మాత్రమే ప్రయాణికులను తగ్గించడం లేదని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్సీ) పేర్కొంది. ఏడాది వ్యాప్తంగా నెలవారీ మార్పులున్నాయని చెప్పింది. సెప్టెంబరులో రోజుకు సగటున 27.4 లక్షల మంది మెట్రోలో ప్రయాణించారు. అక్టోబరులో ధరలు పెరిగిన తర్వాత ఈ సంఖ్య 24.2 లక్షలకు పడిపోయింది. ధరల పెంపును ఢిల్లీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. -
మెట్రోకు ధరల షాక్.. రోజుకు 3లక్షల మంది ప్రయాణికులు ఔట్!
న్యూఢిల్లీ: గత అక్టోబర్‌లో ధరలు ఒక్కసారిగా పెంచడంతో దేశ రాజధాని ఢిల్లీలోని మెట్రో రైలుకు గట్టి షాకే తగిలింది. ధరల బాదుడు భరించలేక రోజుకు మూడు లక్షలమంది చొప్పున గత నెలలో ప్రయాణికులు తగ్గిపోయారు. సెప్టెంబర్ నెలలో ఢిల్లీ మెట్రోలో రోజుకు సగటున 27.4 లక్షల మంది ప్రయాణించగా.. అక్టోబర్ నెలకు వచ్చేసరికి రోజు ప్రయాణికుల సంఖ్య 24.2 లక్షలకు తగ్గిపోయింది. ధరల పెరుగుదల కారణంగా 11శాతం మంది ప్రయాణికులు తగ్గిపోయారు. ఒక ఆర్టీఐ దరఖాస్తుకు ఢిల్లీ మెట్రోరైల్ కార్పోరేషన్ ఈ మేరకు వివరాలు వెల్లడించింది. ఢిల్లీ, రాజధాని ప్రాంతం కలుపుకొని మొత్తం 218 కిలోమీటర్ల మెట్రోనెట్‌వర్క్ ఉంది. ద్వారాక నుంచి నొయిడా వరకు మెట్రో రైల్లో ప్రయాణించవచ్చు. ఢిల్లీలో సాధారణంగా ప్రయాణికులు మెట్రోరైల్లో ప్రయాణించడానికి ప్రాధాన్యం ఇస్తారు. కానీ ఇటీవలికాలంలో మెట్రోరైల్ ప్రయాణికులు గణనీయంగా తగ్గారు. గత సంవత్సరాల్లో లేనివిధంగా ఈసారి మెట్రోలో ప్రయాణించేవారు తగ్గుతున్న ట్రెండ్ కనిపిస్తోంది. -
‘ఓలా, ఊబర్ మేలు కోసమే’
సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో చార్జీల పెంపుపై కేంద్రం, ఆప్ నేతృత్వంలోని ఢిల్లీ సర్కార్ల మధ్య వాగ్యుద్ధం కొనసాగుతోంది. ఓలా, ఊబర్ వంటి ప్రైవేట్ ఆపరేటర్ల లబ్థి కోసమే చార్జీల పెంపు కుట్ర జరిగిందని ఆప్ ఆరోపించింది. ప్రజల సొమ్ముతో చేపట్టిన మెట్రోలో ప్రయాణీకులపై భారం మోపడం తగదని, ఓలా, ఊబర్లకు మేలు చేసేందుకు కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరించిందని విమర్శించింది. ఢిల్లీ మెట్రోను ప్రతిష్టాత్మక ప్రజా రవాణా వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ఆప్ సర్కార్‌ను అనుమతించడం లేదని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆవేదన వ్యక్తం చేశారు. మెట్రో చార్జీలు అధికంగా ఉంటే ప్రజలు క్యాబ్‌లవైపు మొగ్గుచూపుతారని ఫలితంగా ఢిలీల్లో కాలుష్య స్థాయిలు మితిమీరుతాయని అన్నారు. కాగా కేంద్రం అంగీకరిస్తే మెట్రోను తాము చేపడతామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తమ ఆస్తులు, వనరులను సమర్ధంగా వాడుకుంటే మరోసారి చార్జీలను పెంచాల్సిన అవసరం తలెత్తేది కాదని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీ మెట్రో చార్జీలను పెంచడం పట్ల ప్రయాణీకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. -
పాకిస్తాన్‌కు పో...!
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్న ఓ ముస్లిం సీనియర్ సిటిజన్‌కు తీవ్ర అవమానం ఎదురైంది. కొందరు యువకులు వద్దనికి సీటు ఇవ్వడానికి నిరాకరించడమేకాక అతనిని పాకిస్తానీ అంటూ దుర్భాషలాడారు. ఈ ఘటన ఢిల్లీ మెట్రో యెల్లో లైన్లో జరిగింది. సీనియర్ సిటిజన్ సీట్లో కూర్చున్న ఇద్దరు యువకులు ముస్లిం వృద్ధునికి సీటు ఇవ్వడానికి నిరాకరించారు. రైల్లో రద్దీ అధికంగా ఉండడంతో ఆయన వారిని లేచి సీటివ్వమని కోరారు. కానీ వారు సీటు ఖాళీ చేయడానికి నిరాకరించడమేకాక రైల్ కోచ్‌లో సీటు కావాలంటే పాకిస్తాన్‌కు వెళ్లిపో అంటూ అపహాస్యం చేశారు. ఫేస్బుక్ పోస్టుతో వెలుగులోకి... మహిళా హక్కుల కార్యకర్త కవితా కృష్ణమూర్తి ఈ విషయాన్ని ఫేస్బుక్ పోస్ట్ ద్వారా వెలుగులోకి తెచ్చారు. ఏఐసీసీఈయూ జాతీయ కార్యదర్శి సంతోష్ రాయ్ కొన్ని రోజుల కిందట యెల్లో లైన్ మెట్రోలో ప్రయాణిస్తుం డగా ఈ ఘటన జరిగిందని ఆమె తెలిపారు. రాయ్ ఎదురుగా సీనియర్ సిటిజన్ల సీట్లలో ఇద్దరు యువకులు కూర్చుని ఉన్నారని, ఓ వృద్ధుడు వారిని సీటు ఇవ్వవలసిందిగా అడిగినప్పుడు వారు అందుకు నిరాకరించా రని ఆమె తెలిపారు. ఆయన మరోసారి వారిని సీటు నుంచి లేవమని కోరినప్పుడు ఈ సీటు హిందుస్తానీల కోసమని, నీ వంటి పాకిస్తానీల కోసం కాదని అపహాస్యం చేశారు. అది చూసిన రాయ్ వెంటనే జోక్యం చేసుకుని సీనియర్ ïసిటిజన్‌కు క్షమాపణ చెప్పవలసిందిగా యువకులను డిమాండ్ చేశారు. కానీ మరి కొందరు యువకులు ఇద్దరు యువకులకు అండగా వచ్చి రాయ్ కాలర్ పట్టుకుని పాకిస్తాన్ వెళ్లిపో అంటూ అవమానించారు. దీంతో కొందరు మెట్రో ప్రయాణీకులు రాయ్‌కు మద్దతుగా వచ్చారు. మెట్రో రైలు ఖాన్ మార్కెట్ స్టేషన్లో ఆగినప్పుడు ఓ గార్డు కంపార్ట్ మెంట్లోకి వచ్చాడు. అతను రాయ్‌తో పాటు ముస్లిం సీనియర్ సిటిజన్‌ను, ఇద్దరు యువకులను పండారా రోడ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. కొన్ని రోజుల తరువాత రాయ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు సీనియర్ సిటిజన్ యువకులను క్షమించి వదిలేశాడని పోలీసులు చెప్పారు. కుర్రచేష్టగా పరిగణించి యువకుల క్షమాపణను స్వీకరిస్తున్నట్లు సీనియర్ సిటిజన్ రాసిచ్చిన లేఖను పోలీసులు రాయ్‌కు చూపారు. ఆ తర్వాత యువకులు రాయ్‌కు కూడా క్షమాపణలు తెలిపారు. -
మెట్రో రైలు ఎక్కిన సీనియర్ హీరోయిన్
సీనియర్ హీరోయిన్, ప్రముఖ సామాజిక కార్యకర్త షబానా ఆజ్మీ ఢిల్లీ మెట్రో రైల్లో సామాన్య ప్రయాణికురాలిలా వెళ్లారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి అత్యవసర పనిమీద వెళ్లేందుకు మెట్రో ఎక్కానని, అది చాలా శుభ్రంగా, బ్రహ్మాండంగా ఉందని ఆమె ట్వీట్ చేశారు. దాంతోపాటు తాను మెట్రోలో కూర్చుని ఉండగా సెల్ఫీ తీసుకున్న ఫొటో కూడా ఆమె ట్వీట్ చేశారు. ప్రస్తుతం అపర్ణాసేన్ దర్శకత్వంలో వస్తున్న సొనాటా సినిమాలో షబానా నటిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 21న విడుదల కానుంది. ఈ సినిమాలో ముగ్గురు అవివాహిత మహిళలు మధ్యవయసులో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారన్న విషయం గురించిన చర్చ ఉంటుంది. ఒక ప్రొఫెసర్, ఒక బ్యాంకు ఉద్యోగిని, జర్నలిస్టు.. ఈ ముగ్గురు మహిళల చుట్టూనే సినిమా కథ తిరుగుతుంటుంది. Travelling by Delhi Metro from airport to make it in time for an urgent appointment! Its SUPERB.. clean .! pic.twitter.com/m7U2xzRGwh — Azmi Shabana (@AzmiShabana) 6 April 2017 -
మెట్రో సర్వీసులకు బ్రేక్
జాట్ల సమ్మె కారణంగా ఢిల్లీ వెలుపల మెట్రోరైలు సేవలను ఆదివారం రాత్రి నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు డీఎంఆర్సీ ప్రకటించింది. సోమవారం నుంచి తమ సమ్మెను ఉధృతం చేయనున్నట్లు జాట్ సంస్థలు ప్రకటించడంతో ఈ చర్య తీసుకున్నారు. ఆదివారం రాత్రి 8 గంటల తర్వాత సెంట్రల్ ఢిల్లీలోని 12 మెట్రో స్టేషన్లు కూడా మూతపడతాయని, అయితే ఇంటర్‌ఛేంజ్ సదుపాయం మాత్రం అన్నిచోట్లా అందుబాటులో ఉంటుందని డీఎంఆర్సీ ప్రకటించింది. గురు ద్రోణాచార్య నుంచి హుడా సిటీసెంటర్‌కు, కౌశాంబి నుంచి వైశాలి వరకు, నోయిడా సెక్టార్ -15 నుంచి నోయిడా సిటీ వరకు, సరాయ్ నుంచి ఎస్కార్ట్స్ ముజేశ్వర్ వరకు మళ్లీ ప్రకటించేవరకు సేవలను ఆపేస్తున్నామని ఢిల్లీ మెట్రో అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, ఉద్యోగ్ భవన్, లోక్ కళ్యాణ్ మార్గ్, జన్‌పథ్, మండీ హౌస్, బారాఖంబా రోడ్, ఆర్కే ఆశ్రమ్ మార్గ్, ప్రగతి మైదాన్, ఖాన్ మార్కెట్, శివాజీ స్టేడియం మెట్రో స్టేషన్లను కూడా మూసేస్తున్నారు. మార్చి 20వ తేదీన పార్లమెంటు వెలుపల భారీ నిరసన నిర్వహిస్తామని జాట్ గ్రూపులు తెలిపాయి. ప్రభుత్వోద్యోగాలతో పాటు విద్యాసంస్థల్లో కూడా తమకు రిజర్వేషన్లు కావాలని జాట్లు డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు గత సంవత్సరం ఆందోళనలో మరణించినవారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలంటున్నారు. -
ట్రయల్ రన్లో మెట్రో రైళ్లు ఢీ
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఢిల్లీ మెట్రో మెజెంటా లైన్ ప్రాజెక్టులో ఊహించని ప్రమాదం జరిగింది. ట్రయల్ రన్లో రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పై వచ్చి ఢీకొన్నాయి. ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. సిగ్నల్ వ్యవస్థలో లోపం వల్ల ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కాగా ప్రమాదం ఎక్కడ జరిగిందన్న విషయాన్ని అధికారులు వెల్లడించలేదు. డ్రైవర్ రహిత రైళ్లను నడపడానికి ఢిల్లీ మెట్రో ప్రత్యేకంగా మెజెంటా లైన్ నిర్మాణాన్ని చేపట్టింది. ఇది 2017 ఏడాది మధ్యలో ప్రజలకు అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. జానక్‌పురి వెస్ట్, బొటానికల్ గార్డెన్ మధ్య 25 స్టేషన్లను కలుపుతూ కొత్త కారిడార్‌ను నిర్మిస్తున్నారు. మెట్రో అధికారులు ఇటీవల ఈ లైన్‌పై విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు. అయితే తాజాగా ఇదే లైన్‌పై నిర్వహించిన ట్రయల్ రన్లో రెండు రైళ్లు ఢీకొన్నాయి. -
మెట్రో రైలు డబ్బుతో ఉద్యోగి పరారీ
మెట్రో రైల్వే స్టేషన్లలో టికెట్ల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేయాల్సిన వ్యక్తి.. ఆ డబ్బు తీసుకుని ఎంచక్కా పరారయ్యాడు. ఢిల్లీ మెట్రోరైలుకు చెందిన రూ. 50 లక్షలతో అతడు చెక్కేశాడు. నీరజ్ అనే ఆ వ్యక్తి మెట్రో స్టేషన్లన్నింటి నుంచి డబ్బు సేకరించి.. దాన్ని భికాజీ కామా ప్లేస్ ప్రాంతంలో ఉన్న బ్యాంకు శాఖలో డిపాజిట్ చేయాలి. ఈనెల 16న అతడు ఏడు స్టేషన్ల నుంచి డబ్బు సేకరించాడు. కానీ దాన్ని బ్యాంకులో జమచేయడానికి బదులు ఉన్నట్టుండి మాయమైపోయాడు. అతడి మొబైల్ ఫోన్ కూడా స్విచాఫ్ చేసి ఉంది. ఆరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఉద్యోగ్ భవన్ మెట్రోస్టేషన్ నుంచి డబ్బు సేకరించి, హుడా సిటీసెంటర్ వెళ్లే రైలు ఎక్కాడు. అతడు ఎయిమ్స్ స్టేషన్‌కు వెళ్తే, అక్కడ అతడి కోసం ఒక ఎస్కార్టు వాహనం ఉంటుంది. దాంట్లో అతడు బ్యాంకుకు వెళ్లాలి. కానీ అతడు మాలవీయ నగర్ స్టేషన్లోనే దిగిపోయి, అక్కడి నుంచి మాయమైపోయాడు. అప్పటికి అతగాడి వద్ద మూడురోజుల నుంచి సేకరించిన రూ. 50 లక్షల సొమ్ము ఉంది. సాధారణంగా అయితే మూడు రోజులకు రూ. 12 లక్షలు మాత్రమే వస్తుంది. కానీ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా వరుస సెలవులు రావడంతో జనం ఎక్కువ తిరగడం వల్ల టికెట్ల డబ్బులు కూడా బాగా వచ్చాయి. అదిచూసి ఆశపడిన నీరజ్.. ఆ డబ్బుతో ఎంచక్కా చెక్కేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. బిహార్‌కు చెందిన అతగాడి కోసం గాలింపు మొదలైంది. -
21 మంది మహిళా పిక్పాకెటర్లకు జరిమానా
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కొందరు అమ్మాయిలు పిక్‌పాకెటర్ల అవతారమెత్తారు. మోడ్రన్ దుస్తులు వేసుకుని కాలేజీ అమ్మాయిల్లా, ఉద్యోగుల్లా కనిపిస్తారు. మెట్రోలో హడావిడిగా తిరుగుతుంటారు. వీరిపట్ల ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అంతే. జేబులు, హ్యాండ్ బ్యాగుల్లో డబ్బులు, సెల్‌ఫోన్ ఇతర విలువైన వస్తువులు మాయం అయిపోతాయి. సీఐఎస్ఎఫ్ సిబ్బంది ప్రత్యేకంగా నిఘా వేసి 21 మంది మహిళా పిక్పాకెటర్లను అదుపులోకి తీసుకుని జరిమానా వేశారు. ఆదివారం మఫ్టీలో ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది.. రాజీవ్ చౌక్, బరఖంబ రోడ్డు, కశ్మీర్ గేట్ వంటి రద్దీ రైల్వే స్టేషన్లలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. చోరీలకు పాల్పడుతున్న మహిళలను అదుపులోకి తీసుకుని మూడువేల రూపాయలకుపైగా జరిమానా వేశారు. ఢిల్లీలోని ఇతర మెట్రో స్టేషన్లలోనూ నిఘా ఉంచుతామని అధికారులు చెప్పారు. ఢిల్లీ మెట్రోలో రోజూ దాదాపు 26 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. -
'వాళ్లెవరూ మెట్రో రైల్లో ఎక్కకూడదు'
ఢిల్లీ మెట్రో రైలు అధికారులు పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. మానసిక ఆరోగ్యం బాగోలేనివాళ్లు, కొన్ని రకాల వ్యాధులతో బాదపడేవాళ్లు తమ రైళ్లలో ఎక్కకూడదని చెప్పారు. కుష్టువ్యాధి ఉన్నవాళ్లు ఆ వ్యాధి ఎవరికీ అంటుకోదని రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్‌తో సర్టిఫికెట్ తెచ్చిన తర్వాత మాత్రమే మెట్రో రైలు ఎక్కాలని చెప్పారు. ఈ నిబంధనలతో కూడిన పోస్టర్లను ఢిల్లీ మెట్రో పలుచోట్ల అతికించింది. అంటువ్యాధులు ఉన్నవాళ్లు తమ రైళ్లలో ఎక్కకూడదని స్పష్టం చేసింది. సెరెబ్రో స్పైనల్ మెనింజైటిస్, చికెన్ పాక్స్, డిఫ్తీరియా, మంప్స్, టైఫస్, దగ్గు, కలరా, మీజిల్స్, స్కార్లెట్ జ్వరం, టైఫాయిడ్, టీబీ.. ఇలాంటి వ్యాధులు ఉన్నవాళ్లు రైళ్లు ఎక్కడానికి వీల్లేదని తెలిపింది. దివ్యాంగుల హక్కుల కోసం పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థ ఈ ఆదేశాలను తీవ్రంగా విమర్శించింది. ఇది చాలా వివక్షాపూరితమని, ఢిల్లీ మెట్రో తీరును బయటపెడుతోందని మానస్ ఫౌండేషన్ ట్రస్టీ, సైకాలజిస్టు అయిన నవీన్ కుమార్ అన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదని, సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతున్న వ్యక్తి విషయంలో సుప్రీంకోర్టు తీర్పుకూడా ఇచ్చిందని ఆయన చెప్పారు. అయితే, ఇన్నీ ఢిల్లీ మెట్రో ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం ఎప్పటి నుంచో ఉన్న నిబంధనలేనని, కొత్తగా వేటినీ సృష్టించలేదని మెట్రో అధికారి ఒకరు చెప్పారు. -
డ్రైవర్ లేకుండానే మెట్రో రయ్ రయ్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో త్వరలో డ్రైవర్ రహిత రైళ్లు పట్టాలెక్కనున్నాయి. డ్రైవర్ రహిత రైళ్లను బుధవారం ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్ (డీఎంఆర్సీ) పరీక్షించింది. ఫేస్ 3 కింద రెండు కారిడార్లను ఈ పరిధిలోకి తీసుకురానున్నారు. వైఫై సౌకర్యం, సెల్ ఫోన్ ఛార్జింగ్ కోసం ప్రత్యేక యూఎస్బీ డివైస్ అందుబాటులో ఉంటాయి. ఈ ఏడాది చివరికల్లా డ్రైవర్ లేకుండా నడిచే ఈ మెట్రో రైళ్లు రాజధానిలో పరుగులు పెట్టనున్నాయని మెట్రో ఎండీ మంగు సింగ్ వెల్లడించారు. మొదటగా డ్రైవర్ పర్యవేక్షణలో ఓ ఏడాది రైళ్లను నడిపి 100 శాతం సక్సెస్ సాధించాక డ్రైవర్ రహిత రైళ్లను ప్రారంభిస్తామన్నారు. దక్షిణ కొరియాలో తయారైన ఐదు డ్రైవర్ రహిత రైళ్లను ఇటీవలే దిగుమతి చేసుకున్నారు. ఇవి ఇప్పటికే ఢిల్లీలోని ముకుంద్‌పూర్ డిపోకు చేరుకున్నాయి. మరో మూడు రైళ్లు 'సిగ్నలింగ్ సిస్టమ్, ఎలెక్ట్రికల్ ఫిటింగ్స్‌తో అనుసంధానించి డ్రైవర్ రహిత రైళ్లను పరీక్షించనున్నారు. స్పెషల్ రైళ్లు ఒక్కసారి 1866 మంది ప్రయాణికులను గమ్యానికి చేర్చుతాయి. డ్రైవర్ క్యాబిన్ తీసివేయడంతో 40 మంది ప్రయాణించేందుకు అవకావం ఉంది. ఈ రైళ్లకు 6 కోచ్‌లు ఉంటాయి. మజ్లిస్ పార్క్-శివ్ విధార్ ల మధ్య 58.5 కిలోమీటర్లు, నొయిడాలోని బొటానికల్ గార్డెన్-జానక్పూరి పశ్చిమ ఢిల్లీ ల మధ్య 38 కి.మీ మేర ఇప్పటికే ట్రయల్ రన్ సాఫీగా సాగిపోతున్న విషయం తెలిసిందే. ఫేస్ 3లో డ్రైవర్ రహిత రైళ్లను ప్రవేశపెట్టే సమయంలో ప్రాథమిక పరీక్షల్లో సిబ్బంది అందుబాటులో ఉంటారు. అయితే పరీక్షలన్నీ పూర్తయ్యాక సిబ్బంది లేకుండా రైళ్లను నడుపుతాం' అని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ ఓ ప్రతినిధి చెప్పారు. 56 కిలో మీటర్ల దూరాన్ని 12 నిమిషాల్లో చేరుకునే వేగంతో ఈ రైళ్లు పరుగులు పెట్టడం విశేషం. -
డ్రైవర్ రహిత రైళ్లను పరీక్షించిన ఢిల్లీ మెట్రో
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో త్వరలో డ్రైవర్ రహిత రైళ్లు పట్టాలపైకి రానున్నాయి. ఢిల్లీ నగరంలోని ఉత్తర ప్రాంతంలో గత నెల రోజులుగా డ్రైవర్ రహిత రైళ్లను ఢిల్లీ మెట్రో పరీక్షిస్తోంది. ఫేస్ 3 కింద రెండు కారిడార్లను ఈ పరిధిలోకి తీసుకురానున్నారు. దక్షిణ కొరియాలో తయారైన ఐదు డ్రైవర్ రహిత రైళ్లను దిగుమతి చేసుకున్నారు. ఇవి ఇప్పటికే ఢిల్లీలోని ముకుంద్‌పూర్ డిపోకు చేరుకున్నాయి. మరో మూడు రైళ్లు వచ్చే ఫిబ్రవరి నాటికి రావచ్చు. 'సిగ్నలింగ్ సిస్టమ్, ఎలెక్ట్రికల్ ఫిటింగ్స్‌తో అనుసంధానించి డ్రైవర్ రహిత రైళ్లను పరీక్షిస్తున్నాం. ఈ రైళ్లను దక్షిణ కొరియాలో తయారు చేశారు. భారత్‌లో ఇలాంటి నమూనా రైలునే తయారు చేశారు. బెంగళూరులో తయారు చేసిన ఓ రైలు గత డిసెంబర్లో ఢిల్లీకి చేరుకుంది. ఫేస్ 3లో డ్రైవర్ రహిత రైళ్లను అందుబాటులో ఉంచుతాం. ప్రాథమిక పరీక్షల్లో సిబ్బంది అందుబాటులో ఉన్నారు. అయితే పరీక్షలన్నీ పూర్తయ్యాక సిబ్బంది లేకుండా రైళ్లను నడుపుతాం' అని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ ప్రతినిధి అనుజ్ దయాల్ చెప్పారు. ఢిల్లీ మెట్రో సిస్టమ్ ఆపరేషన్ కంట్రోల్ సెంటర్లు నేరుగా డ్రైవర్ రహిత రైళ్ల గమనాన్ని పర్యవేక్షిస్తాయి. 56 కిలో మీటర్ల దూరాన్ని 12 నిమిషాల్లో చేరుకుందని, సరాసరి వేగం గంటకు 35 కిలో మీటర్లు ఉంటుందని దయాల్ చెప్పారు. ఈ రైళ్లను హ్యుందాయ్ రోటెమ్ రూపొందించినట్టు దయాల్ తెలిపారు. 20 కోచ్‌లను మాత్రమే దక్షిణ కొరియా నుంచి నౌకలో దిగుమతి చేసుకున్నామని, మిగిలిన 366 కోచ్‌లను (6 కోచ్‌లు గల 61 రైళ్లు)ను బెంగళూరులో తయారు చేస్తున్నట్టు తెలిపారు. మేకిన్ ఇండియాలో భాగంగా వీటిని రూపొందిస్తున్నారు. -
పెళ్లి ఇష్టంలేక ...
ఢిల్లీ: ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్ లో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. యమునా బ్యాంక్ ర్వేల్వేస్టేషన్ లో ఢిల్లీనుంచి వైశాలి వైపు వెడుతుండగా పట్టాలపైకి దూకేయడంతో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. సంఘటనా స్థలంలో దొరికిన ఆమె బ్యాగ్ ఆధారంగా అలహాబాద్ కు చెందిన అంజలిగా పోలీసులు గుర్తించారు. అయితే అలహాబాద్ కు చెందిన అంజలికి ఢిల్లీకి చెందిన అబ్బాయితో ఇటీవల నిశ్చితార్థం జరిగింది. పెళ్లి తేదీని కూడా ఖరారు చేసుకున్నారు. అయితే ఆ పెళ్లి ఇష్టంలేకనే ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డానికి ముందు 3 వ నెంబర్ ప్లాట్ ఫాం పై దాదాపు పది నిమిషాలు ఆమె తచ్చాడినట్టు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డయిందని పోలీసులు తెలిపారు. ఆమె హ్యాండ్ బ్యాగు నుంచి మెట్రో పాస్, సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్ డేటాను పరిశీలిస్తున్నామని, ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని తెలిపారు. -
తప్పతాగి మెట్రో రైల్లో తూలిన పోలీసు.. సస్పెండ్
న్యూఢిల్లీ: తప్ప తాగి ఢిల్లీ మెట్రో రైల్లోకనిపించిన పోలీసు అధికారి వీడియో ఒకటి సంచలనం సృష్టించింది. దీనిపై పలు వర్గాల నుంచి తీవ్ర విమర్శలు తలెత్తడంతో ఆ పోలీసు అధికారిని గుర్తించిన పైఅధికారులు వెంటనే అతడిని సస్పెండ్ చేశారు. తేదీ, సమయం లేకుండా ఉన్న 36 సెకండ్ల నిడివిగల వీడియో ఒకటి సామాజిక అనుసంధాన వేదికలైన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. దీనిని మొత్తం ఆరువేలమంది షేర్ చేసుకున్నారు. అక్కడా ఇక్కడా చేరి చివరికి అందరికీ ఈ వీడియో తెలిసిపోయింది. ఈ వీడియోలో ఫుల్లుగా తాగిన పోలీసు అధికారి యూనిఫాం టక్ కూడా చేసుకోకుండా నిర్లక్ష్యంగా తూలుతూ కనిపించాడు. బోగీ మధ్యలో నిల్చుని అటూఇటూ ఊగుతూ కనిపించాడు. అజాద్‌పూర్ స్టేషన్లో ఆగేందుకు ట్రైన్ బ్రేక్ వేయగా అతడు ఒక్కసారిగా కిందపడి ఈడ్చుకుపోయే పరిస్థితి తలెత్తింది. తోటీ ప్రయాణీకులు అతడిని రక్షించడంతో ఓ రకంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ వీడియో నెట్లో హల్ చల్ చేయడంతో గుర్తించిన ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు. -
డ్రైవర్ అక్కర్లేని రైలు వచ్చేసింది..
ఢిల్లీ: ఢిల్లీ మోట్రోలోకి డ్రైవర్ లేకుండానే నడిచే మొదటి ట్రైన్ గురువారం వచ్చి చేరింది. సౌత్‌కొరియాలో తయారైన ఈ ట్రైన్ ముకుంద్ పుర్ డిపోకి చేరుకుంది...డ్రైవర్ లేకుండానే, ఢిల్లీ మెట్రో ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ ఇచ్చే ఆదేశాలో ఈ ట్రైన్ నడుస్తుంది. ఈ ట్రైన్లో ఒకేసారి 2,280 మంది ప్రయాణించవచ్చు. మిగతా ట్రైన్లకన్నా240 మంది ఎక్కవగా ప్రయాణించే సామర్థ్యం ఈ ట్రైన్ లో ఉంది. మామూలు ట్రైన్లలా డ్రైవర్ కోసం ప్రత్యేక క్యాబిన్ ఈ ట్రైన్‌కి ఉండదు. అంతేకాకుండా ఈ ట్రైన్‌కి లోపల, బయట సీసీటీవీ కెమరాలు అమర్చి ఉంటాయి. ఇవి తీసే చిత్రాలు డైరెక్ట్‌గా కంట్రోల్ రూం కి చేరుతాయి. -
డిల్లీ మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో రైల్లో శనివారం ప్రయాణించారు. దౌలాకువా స్టేషన్ నుంచి ద్వారకా వరకు ఆయన మెట్రో మార్గాన్ని ఎంచుకున్నారు. నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీని ప్రారంభించడం కోసం వెళ్తూ ఆయన మెట్రోలో ప్రయాణించారు. ఢిల్లీ మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ప్రధాని వెంట జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఉన్నారు. భద్రతా ఏర్పాట్ల కారణంగా సాధారణ ప్రజానీకానికి ఇబ్బందిని కలుగుతుందనే ప్రధాని మెట్రోలో ప్రయాణించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ మెట్రోలో ప్రయాణించాల్సిందిగా శ్రీధరన్ తనకు ఎప్పుడూ చెబుతుండేవారని ప్రధాని మెట్రో ప్రయాణం తరువాత ట్వీట్ చేశారు. ఈ రోజు ద్వారకా ప్రయాణం సందర్భంగా తనకు ఈ ఆవకాశం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. మెట్రో ప్రయాణాన్ని తాను నిజంగా ఆస్వాదించినట్లు వివరించారు. అయితే ప్రధాని మెట్రో పర్యటనపై కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ హర్షం వ్యక్తం చేశారు. నిత్యం మెట్రోలో ప్రయాణించే చాలా మంది మాదిరిగానే ప్రధాని ప్రయాణించి ప్రజలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. తన ప్రయాణం ద్వారా మెట్రోను ప్రజలు తరచుగా వాడాలన్న సందేశాన్ని పంపించారన్నారు. మోదీ తన సహచరులకు సైకిల్ వాడాలన్న సలహా ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. -
మెట్రో ఇంట ‘వైఫై’ పంట
అన్ని స్టేషన్లు, రైల్వే బోగీల్లో పూర్తి స్థాయి వైఫై సేవలు న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రోని ‘వైఫై’మయం చేయడానికి రంగం సిద్ధమైంది. దేశ రాజధానిలోని అన్నీ మెట్రో స్టేషన్లు, రైల్వే బోగీల్లో వైఫై సేవల్ని విస్తరించడానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. అందుకోసం ‘దయచేసి ప్రతిపాదనలు పంపించండి’ అని స్మార్ట్ ఫోన్ వినియోగదారులు, ప్రయాణికులను అభ్యర్థిస్తున్నారు. దీంతో చాలా కాలంగా ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్‌కు మార్గం సుగమమయింది. ప్రజల నుంచి వచ్చే ప్రతిపాదనల సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకొని తదుపరి చర్యలు తీసుకుంటామని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వెల్లడించింది. అలాగే ఇప్పటి వరకు 193 కిలోమీటర్లు వ్యాపించిన వైఫై సేవల్ని శరవేగంగా విస్తరిస్తోన్న స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు అనుగుణంగా పెంచాలని నిర్ణయించింది. ‘మెట్రోలో వైఫై సేవల్ని విస్తరించడాని మొబైల్ వినియోగదారుల నుంచి ప్రతిపాదనలు పంపించమని కోరాం. వారి నుంచి వచ్చిన సూచనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. అన్ని స్టేషన్లలో వైఫై సేవల్ని మే నెలాఖరు నాటికి విస్తరింపజే యాలని కంపెనీలకు స్పష్టం చేశాం.’ అని మెట్రో అధికారి తెలిపారు. మెట్రో అధికారులు స్మార్ట్ ఫోన్ వినియోగదారుల కోసం వినూత్నమైన కార్యక్రమం ప్రవేశపెట్టారు. వినియోగదారులకు క్రెడిట్ పాయింట్లు ఇవ్వడం ద్వారా రిచార్జ్ స్మార్ట్ కార్డులు అందిస్తున్నారు. దీని ద్వారా ప్రయాణికులు మెట్రోరైళ్లపై మరింత ఆసక్తి పెరుగుతోందని అధికారులు వివరించారు. -
మెట్రో నిబంధనలు తెలియదంటోన్న ఢిల్లీ వాసులు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రోలో ప్రతి రోజు 25 లక్షల మంది ప్రయాణిస్తారు. అయితే చాలామందికి మెట్రో ప్రయాణం సందర్భంగా పాటించాల్సిన నియమాల గురించిన అవగాహన లేదు. వారికి అవగాహన లేదనడం కన్నా తమ తీరుతెన్నులు మార్చుకోవడానికి ఢిల్లీ వాసులు ఇష్టపడడం లేదనడం సముచితంగా ఉంటుంది. మెట్రో ప్రారంభించి ఇప్పటికి 13 ఏళ్లవుతోంది. దీనిని మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ అనేక ప్రచార మాధ్యమాల ద్వారా విృస్తతంగా ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రయాణీకుల ఆలోచనాసరళిలో మార్పు రావడం లేదు. ఇప్పటికీ పలువురు మెట్రో రైలు ట్రాక్‌ను సాధారణ రైల్వే ట్రాక్ మాదిరిగా దాటడానికి ప్రయత్నిస్తుంటారు. మెట్రో ట్రాక్‌ను దాటి ఒక ప్లాట్‌ఫారంపై నుంచి మరో ప్లాట్ఫారానికి వెళ్లడం చట్టరీత్యా నేరమని తెలిసినప్పటికీ ఈ పద్ధతిని చాలామంది ఉయోగిస్తుంటారు. ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటివరకు ఈ నేరంపై 12 మందిని పట్టుకున్నట్లు సీఐఎస్ఎఫ్ రికార్డులు ద్వారా తెలుస్తోంది. 2014లో అయితే 655 మంది పట్టుబడ్డారు. పట్టుబడినవారిలో చాలామంది తాము మొదటిసారి మెట్రోలో ప్రయాణిస్తున్నామని, తమకు నిబంధనల గురించి తెలియదని చెబుతున్నారు. మరి కొందరు ప్లాట్ ఫారం దాటి ఎలా వెళ్లాలో తెలియక ట్రాక్ దాటామన్న సాకు చెబుతుంటారు. ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట వేయడానికి డీఎంఆర్సీ జరిమానా విధిస్తుంటుంది. అలాంటి ప్రయత్నం చేసేవారిని పట్టివ్వడంలో సీసీటీవీ కెమేరాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. దాదాపు 90 శాతం కేసుల్లో సీసీటీవీ సహాయంతోనే పట్టుకున్నారు. అలాగే 10 శాతం మంది సీఐఎస్ఎఫ్ జవాన్లకు పట్టుబడ్డారు. సీసీటీవీ కెమేరాల సహాయంతో సీఐఎస్ఎఫ్ జవాన్లు కొన్ని దుర్ఘటనలను కూడా నివారించగలుగుతున్నారు. -
180 మందిని కాపాడి శభాష్ అనిపించుకుంది..
ఒకటికాదు రెండు కాదు.. ఏకంగా 180 ఆత్మహత్యల్ని అడ్డుకున్నారు. రకరకాల సమస్యలతో కునారిల్లిపోతూ రైలు పట్టాలపై ప్రాణాలర్పించేందుకు సిద్ధమైన బాధితులను గుర్తించి.. కౌన్సిలింగ్ ఇచ్చి జీవితంపై కొత్త ఆశలు చిగురించేలా చేశారు. ఇదంతా చేసింది ఏ స్వచ్ఛంద సంస్థో కాదు. ఒకచేత్తో లాఠీ, మరో చేతిలో అధునాతన ఆయుధం.. ప్రజలు ఆందోళనలకు దిగినప్పుడల్లా అణచివేతకు దిగే అర్ధ సైనిక బలగం సీఐఎస్ఎఫ్ ఇప్పుడు ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలుస్తోంది. గడిచిన ఏడాది కాలంగా దేశ రాజధాని ఢిల్లీ మెట్రో రైల్వే ట్రాక్ లపై ఆత్మహత్యలకు ప్రయత్నించిన 180 మందిని కాపాడి శభాష్ అనిపించుకుంటోంది. ఎయిర్ పోర్టుల తర్వాత బంగారం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతోంది మెట్రో రైళ్లలోనే కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో రైల్ స్టేషన్ల వద్ద రక్షణ వ్యవస్థను పటిష్టం చేసే దిశగా సీఐఎస్ఎఫ్ బలగాలను మోహరించారు. ఈ క్రమంలోనే ఢిల్లీ మెట్రో రైల్లో సీఐఎస్ఎఫ్ పలు నేరాల్ని అడ్డుకుంది. వాటిలో కొన్నే ఇవి.. * దాదాపు 10 వేల మంది పురుషుల్ని మహిళల కోచ్ ల నుంచి దింపేశారు. * 6 ఆయుధాలు, 120 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. * రూ.10.2 విలువైన బంగారంతోపాటు రూ. 10.8 కోట్ల అక్రమ ధనాన్ని గుర్తించారు. * 382 మంది జేబు దొంగల్ని అరెస్టు చేశారు. అందులో చోరీకి పాల్పడినవారిలో 90 శాతం మంది మహిళలే ఉండటం గమనార్హం. -
మహిళా సంరక్షణకు మెరుగైన భద్రత
న్యూఢిల్లీ: రాత్రి వేళల్లో ఢిల్లీ మెట్రోల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులు క్షేమంగా ఇంటికి చేరుకునేలా మెరుగైన భద్రత కల్పించాలని కేంద్ర పరిశ్రమల భద్రత దళం(సీఐఎస్ఎఫ్) నిర్ణయించింది. కేవలం మెట్రోల్లో భద్రత కల్పించడమే కాకుండా, వారు క్షేమంగా ఇంటికి చేరుకునేలా ఆటో, రిక్షా, బస్సు వంటి ప్రయాణ సాధనాలు కూడా సమకూర్చాలని తమ మహిళా సిబ్బందికి సీఐఎస్ఎఫ్ ఆదేశాలు జారీ చేసింది. డీఎంఆర్సీ పరిధిలో 136 మెట్రో సేష్టన్లు ఉండగా, పురుషులు, మహిళలు కలిపి 4,800 మంది భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు. మహిళా ప్రయాణికులకి సాయమందించాలని మేము మా సిబ్బందికి చెప్పాం. ముఖ్యంగా అర్ధరాత్రి సమయాల్లో ఆటోలు, రిక్షా వంటి ప్రయాణ సాధనాలు కూడా సమకూర్చి, వాటి నంబర్లను నోట్ చేసుకోవాలని చెప్పాం. తద్వారా తమను గమనిస్తున్నారనే భయంతో మహిళా ప్రయాణికులతో డ్రైవర్లు సక్రమంగా నడుచుకుంటారు. దీంతో మహిళలు క్షేమంగా ఇంటికి వెళ్లగలుగుతారు’ అని సీఐఎస్ఎఫ్ డీజీ అర్వింద్ రంజన్ చెప్పారు. సోమవారం సీఐఎస్ఎఫ్ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. మెట్రో స్టేషన్లలో ఉన్న సీసీటీవీలు కూడా తమకు తోడ్పాటునందిస్తున్నాయని చెప్పారు. మరిన్ని సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. 180 సంఘటనల్లో ఇవి ఉపయోగిపడ్డాయని తెలిపారు. వీటిని ఉపయోగించి ట్రాక్‌లపై నడుస్తున్న 500 మంది పై కేసులు నమోదు చేశామని వెల్లడించారు. మంచి ప్రవర్తన, నైపుణ్యాలను నేర్పించి తమ సిబ్బందిని మహిళా ప్రయాణికుల సౌకర్యార్థం నియమించామని తెలిపారు. అలాగే స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకు రాజీవ్ చౌక్, న్యూఢిల్లీ, చాందినీ చౌక్, కష్మీరీ గేట్, చౌరీ బజార్, సెంట్రల్ సెక్రటేరియట్ వంటి ఆరు ప్రాంతాల్లో గ్లాస్ డోర్ కారిడార్ల ఎత్తు పెంచాలని డీఎంఆర్సీకి ప్రతిపాదించింది. స్టేషన్లలో 90 శాతం దొంగతనాలు మహిళా దొంగలు చేస్తున్నారని తేలినట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న హెల్ప్‌లైన్ నంబరు స్థానంలో సులభంగా గుర్తుండేలా నాలుగు సంఖ్యల నంబరు ఏర్పాటు చేస్తే బాగుంటుందని సీఐఎస్ఎఫ్ అధికారులు డీఎంఆర్సీకి సూచించారు. తద్వారా ప్రజలు సీఐఎస్‌ఎఫ్‌ని సంప్రదించడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదన్నారు. -
మెట్రో బోగీల నిండా ప్రకటనలే!
కేవలం టికెట్లు అమ్ముకుంటే డబ్బులు సరిపోవడం లేదని, అందువల్ల మెట్రోరైలు బోగీల నిండా బయటివైపు ప్రకటనలు గుప్పించాలని ఢిల్లీ మెట్రో వర్గాలు నిర్ణయించాయి. ప్రస్తుతానికి కేవలం ఒక్క రైలు మీదే ఇలా ప్రకటనలు వేస్తున్నామని, వచ్చే వారం నుంచి మరో లైనులో కూడా వేస్తామని ఓ అధికారి తెలిపారు. ద్వారక, వైశాలి స్టేషన్ల మధ్య ఆరు బోగీలతో కూడిన ఈ బ్లూలైన్ రైలు ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. యమునా బ్యాంక్, నోయిడా సిటీసెంటర్ స్టేషన్ల మధ్య ఓ కొత్త రైలును ఢిల్లీ మెట్రో ట్రయల్ రన్ చేసింది. డిసెంబర్ నెలాఖరుకల్లా ఇలాంటివి మరో 15 రైళ్లు ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు ఢిల్లీ మెట్రో అధికారులు చెప్పారు. సాధారణంగా ప్రభుత్వరంగంలోని రవాణా వాహనాలను ఇలా ప్రకటనలతో నింపేయడం ఉండదు. కానీ తొలిసారి ఢిల్లీ మెట్రోలో ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ మెట్రోలో మొత్తం 200 రైళ్లు తిరుగుతున్నాయి. -
మెట్రో అత్యవసర వైద్యసేవలు భేష్
న్యూఢిల్లీ: అత్యవసర వైద్య సదుపాయాలు కల్పించడంలోనూ ఢిల్లీ మెట్రో ప్రయాణికుల నుంచి ప్రశంసలందుకుంటోంది. రోజుకు ప్రయాణించే లక్షలాదిమందిలో ఏదో ఒక రైళ్లో, ఎప్పుడో ఒకప్పుడు అస్వస్థతకు గురవుతూనే ఉంటారు. వీరిలో కొందరికి గుండెనొప్పి, కడుపునొప్పి, తీవ్రమైన తలనొప్పి, హైపర్‌టెన్షన్ వంటి ప్రాణాంతక సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే ఇటువంటివారిని గుర్తించి, వారికి ముందుగా అవసరమైన ప్రథమ చికిత్స చేసి, వెనువెంటనే ఆస్పత్రికి తరలించాల్సి ఉంటుంది. ఈ బాధ్యతలను మెట్రో సిబ్బంది చాలా సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. 2012 నుంచి ఇప్పటిదాకా 1,850 మంది ప్రాణాలను కాపాడారు. సంబంధిత అధికారి ఒకరు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రయాణికుల్లో ఎవరికి అత్యవసర వైద్య సేవలు అవసరమో ముందుగా గుర్తించాలి. గుర్తించినవారికి ముందుగా ప్రథమ చికిత్సనందించి, ఆస్పత్రికి తరలించాలి. ఇందుకోసం డీఎంఆర్సీ ప్రత్యేకంగా ప్రతి స్టేషన్లో కొంతమందిని నియమించింది. విధుల్లో చేరేముందే వారంరోజులపాటు సిబ్బందికి ప్రత్యేక శిక్షణనిచ్చాం. ఫలితంగా రెండేళ్లలో 100 హృద్రోగుల ప్రాణాలను కాపాడారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయే అత్యవసర పరిస్థితి నుంచి వారిని గట్టెక్కించాం. ఇక ఛాతీనొప్పి, కడుపునొప్పి, పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్న 340 మందికి ప్రథమచికిత్సనందించి, సమీపంలోని ఆస్పత్రులకు తరలించాం. వికారంతో తీవ్ర అస్వస్థతకు గురైన 105 మందిని, తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న 25 మంది, మూర్చపోయిన 65 మందిని, నిర్జలీకరణనానికి లోనైన మరికొందరిని మెట్రో సిబ్బంది కాపాడారు. ఇలా అత్యవసర వైద్యసహాయం అవసరమైనవారిలో ఎక్కువమంది ఒంటరిగా ప్రయాణం చేస్తున్నవారు కావడంతోనే మెట్రో సిబ్బంది స్పందించాల్సి వచ్చింది. సహాయకులుగా ఉన్నవారు కోరిన వెంటనే వైద్య సదుపాయాన్ని సమకూర్చేందుకు మెట్రో సిబ్బంది ఎప్పుడూ సిద్ధంగా ఉంటార’ని చెప్పారు. -
ప్రపంచ మెట్రోల్లో 2వ స్థానం ఢిల్లీ మెట్రో రైల్దే !!
-
మెట్రో బోగీలపై త్వరలో ప్రకటనలు
న్యూఢిల్లీ: రాబడి పెంపు దిశగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగా బోగీలపై త్వరలో ప్రకటనలకు అనుమతించ నుంది. కార్యాచరణేతర రాబడిని పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని సంబంధిత అధికారి ఒకరు తెలియజేశారు. బొమ్మలు, ముద్రిత సామగ్రి, ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ డిస్ప్లే, స్మార్ట్ పోస్టర్లు, హోలోగ్రాఫిక్ చిత్రాలు, విజ్యువల్ డిస్ప్లేకి సంబంధించిన కాంట్రాక్టుకు సంబంధించిన హక్కులను ఇప్పటికే ఓ సంస్థకు అప్పగించామన్నారు. ఈ కాంట్రాక్టు పది సంవత్సరాలపాటు ఉంటుందన్నారు. మెట్రో బోగీలు లోపలిభాగంతోపాటు, స్టేషన్ పరిసరాల్లో ప్రకటనలను ఇప్పటికే అనుమతిస్తున్నామన్నారు. ఈ సంస్థల కార్యకలాపాలను తాము నిరంతరం నిశితంగా పరిశీలిస్తుంటామన్నారు. ఈ ప్రకటనల నాణ్యత ప్రపంచశ్రేణి విమానాశ్రయాలు, మెట్రో రైళ్ల ప్రమాణాలకు ధీటుగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. కాగా ప్రస్తుతం డీఎంఆర్సీ 200 మెట్రో రైళ్లను నడుపుతోంది. 60 రైళ్లకు ఎనిమిది బోగీలు ఉండగా, మరో 80 రైళ్లకు ఆరు బోగీలు ఉన్నాయి. వరల్డ్ గ్రీన్ బిల్డింగ్ వీక్ ప్రారంభం పర్యావరణ అనుకూల నిర్మాణాలకు ప్రోత్సాహమిచ్చే దిశగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) అడుగులు వేసింది. ఇందులోభాగంగా సోమవారం నుంచి ఈ నెల 27వ తేదీవరకూ వరల్డ్ గ్రీన్ బిల్డింగ్ వారాన్ని నిర్వహిస్తోంది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ), కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కాగా భారత్‌తోపాటు ప్రపంచంలోని వంద దేశాల్లో కూడా సోమవారం నుంచి వారం రోజులపాటు రల్డ్ గ్రీన్ బిల్డింగ్ వీక్ కార్యక్రమం జరుగుతోంది. ఈ నెల ఆరంభంలో డీఎంఆర్సీ... ఐజీబీసీతో కలసి గ్రీన్ మాస్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టం (ఎంఆర్టీఎస్) కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి విదితమే. ఈ కార్యక్ర మాన్ని డీఎంఆర్సీ మేనేజింగ్ డెరైక్టర్ మంగూ సింగ్ ప్రారంభించారు. నేటినుంచి ఫీడర్ బస్సుల సేవలు శివాజీ స్టేడియం మెట్రో రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులకు శుభవార్త. మంగళవారం నుంచి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) ఫీడర్ బస్సు సేవలను ప్రారంభించనుంది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ బస్సులు ఉదయం ఎనిమిది గంటలనుంచి రాత్రి ఎనిమిది గంటలవరకూ అందుబాటులో ఉంటాయి. ఈ బస్సులు పటేల్ చౌక్, ఆకాశ్శాణి భవన్, కృషి భవన్, పాటియాలా హౌస్, హైకోర్టు, ప్రగతిమైదాన్, సుప్రీంకోర్టు ఐటీఓ, ఢిల్లీ గేట్, న్యూఢిల్లీ మెట్రో స్టేషన్, మింట్ రోడ్, స్టేట్స్‌మన్ హౌస్ తదితర ప్రాంతాలమీదుగా రాకపోకలు సాగిస్తాయి. ఈ మార్గంలో ప్రస్తుతానికి శీతలేతర బస్సులను ప్రయోగాత్మకంగా నడుపుతారు. ప్రతి 20 నిమిషాలకొకటి చొప్పున ఈ బస్సుల సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల స్పందననుబట్టి వీటి సేవలను పెంచుతామని సదరు ప్రకటనలో డీఎంఆర్సీ పేర్కొంది. కాగా ప్రస్తుతం ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్‌లైన్ ఈ తరహా సేవలను అందిస్తోంది. -
రంగంలోకి ఢిల్లీ మెట్రో
వీజీటీఎం ఉడా పరిధిని పరిశీలిస్తున్న డీఎంఆర్సీ డీపీఆర్ తయారీకి కసరత్తు ఉడా పరిధిలో ఢిల్లీ బృంద పర్యటన సాక్షి, విజయవాడ : వీజీటీఎం ఉడా పరిధిలో నిర్మించ తలపెట్టిన మెట్రో ప్రాజెక్టు బాధ్యతల్ని ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో వీజీటీఎం ఉడా పరిధిలో మెట్రో ప్రాజెక్టు నిర్మించనున్న ప్రాంతాల్లో అధికారులు శుక్రవారం పర్యటించారు. వాస్తవానికి డిటైల్డ్ ప్రాజెక్టు తయారీ బాధ్యతల్ని తొలుత ప్రభుత్వం వీజీటీఎం ఉడాకు అప్పగించింది. అయితే, దీనికంటే ముందే ఉడా అధికారులు పలు ప్రతిపాదనలు సిద్ధంచేయటం.. ఆ తర్వాత కేంద్రబృంద పర్యటన.. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆదేశాలతో మెట్రో సాధ్యాసాధ్యాలపై నివేదిక తయారుచేయడం జరిగాయి. ఉడా పరిధి అంతా మెట్రోరైల్ ఉండేలా నాలుగు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. చివరకు ప్రాజెక్టు మంజూరుచేసిన క్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అధికారులు నాలుగు ప్రతిపాదనల్ని క్రోడీకరించి 49 కిలోమీటర్ల మార్గం మేరకు నూతన ప్రతిపాదన సిద్ధంచేసి ఖరారు చేశారు. దీనికి సంబంధించిన బాధ్యతలను ఉడాకు అప్పగించారు. వెంటనే ఉడా అధికారులు కంపెనీ ప్రొఫైల్స్ స్వీకరణ కార్యక్రమం టెండర్ల ప్రక్రియ ద్వారా నిర్వహించారు. చివరకు ఢిల్లీ మెట్రో ప్రాజెక్టు నిపుణుడు శ్రీధరన్ సేవలు రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటున్న క్రమంలో ప్రాజెక్టు పూర్తి బాధ్యతలు డీఎంఆర్సీకి కేటాయించారు. ప్రాజెక్టుకు సంబంధించి పనులు యథాతథంగా నిలిపివేయాలని ప్రత్యేక జీవో కూడా జారీచేశారు. ఇదంతా జరిగి మూడు రోజులైంది. ప్రాజెక్టు ఇంకా డీపీఆర్ తయారీకి సంబంధించిన టెండర్ల దశలోనే ఉంది. అయితే, టెండర్లు లేకుండానే.. నేరుగా ఢిల్లీ మెట్రోకే ప్రాజెక్టును అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈక్రమంలో ఢిల్లీ మెట్రో ఇంజినీర్లు ఉడా మాస్టర్‌ప్లాన్ ఆధారంగా వీజీటీఎం ఉడా పరిధిలో పర్యటించారు. వారి పర్యటన వివరాలు పూర్తి గోప్యంగా ఉంచారు. అయితే, డీపీఆర్ తయారీలో భాగంగా ఉడా పరిధిపై అవగాహన కోసం మెట్రో మార్గం నిర్మించనున్న 49 కిలోమీటర్లు గన్నవరం, కంకిపాడు, విజయవాడ, గొల్లపూడిలో వారు పర్యటించారు. అలాగే, శుక్రవారం ఉదయం వీజీటీఎం ఉడా కార్యాలయంలోని సిటిజన్ చార్టర్లో కూడా మెట్రో మాస్టర్ ప్లాన్‌ను ఢిల్లీ బృందం కొనుగోలు చేసింది. -
పెరిగిన మెట్రో కనీస రీచార్జి
న్యూఢిల్లీ: టోకెన్ వెండింగ్ మిషన్ (టీవీఎం)ల ద్వారా రీచార్జి చేసే కనీస మొత్తం పెరిగింది. నిన్నటిదాకా రూ. 100 ఉండగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) ఈ మొత్తాన్ని రూ. 200 చేసింది. ఇలా పెంచడం రెండు నెలల వ్యవధిలో ఇది రెండోసారి. వాస్తవానికి ఇది తొలుత రూ. 50 కాగా తర్వాత రూ.100కు పెంచింది. ఇప్పుడు ఏకంగా రూ. 200 చేసింది. కస్టమర్ కేర్ సెంటర్లద్వారా కనీస మొత్తాన్ని రీచార్జి చేసుకోవాలని, ఆ తర్వాత రూ. 100 ఆపైన చేసుకోవచ్చని డీఎంఆర్సీ కార్యనిర్వాహక సంచాలకుడు అనుజ్ దయాళ్ చెప్పారు. కాగా నగర పరిధిలోని మొత్తం 83 మెట్రో స్టేషన్లలో 170 టీవీఎంలు ఉన్నాయి. మెట్రో ైరె ళ్లలో ప్రయాణించేవారిలో 70 శాతం మంది వీటిని వినియోగిస్తున్నారు. ఈ కార్డులను వినియోగించేవారికి డీఎంఆర్సీ ప్రయాణంలో పది శాతం రాయితీ ఇస్తోంది. -
ఢిల్లీ మెట్రోలో ఒకే రోజు 26 లక్షల మంది ప్రయాణం..
న్యూఢిల్లీ: ఒకే రోజు అత్యధిక మంది ప్రయాణీకులను తరలించిన ఓ రికార్డును ఢిల్లీ మెట్రో రైలు సొంతం చేసుకుంది. జూలై 21 తేదిన 26 లక్షల మంది ప్యాసింజర్లను ఢిల్లీ మెట్రో తరలించింది. జూలై 21 తేదిన 26,84,132 మంది ప్యాసింజర్లు ప్రయాణించారని డిల్లీ మెట్రో రైలు కార్పోరేషన్ (డీఎమ్ఆర్సీ) తెలిపింది. గత సంవత్సరం ఆగస్టు 19న 26,50,635 ప్రయాణించారని డీఎమ్ఆర్సీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
నగరవాసులకు మరో కానుక
సెంట్రల్ సెక్రటేరియట్-మండీహౌజ్ మధ్య 3.2 కిలోమీటర్ల పొడవైన మెట్రో మార్గాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. మెట్రోరైలు చార్జీల పెంపు ప్రతిపాదనపై అధ్యయనం చే సి చార్జీల సవరణకుఅవకాశం ఉందేమో చూడాల్సిందిగా డీఎమ్మార్సీని కోరినట్లు మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మండీహౌజ్-సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో లైన్ గురువారం ప్రారంభమయింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు దీనిని ప్రారంభించారు. మహిళా డ్రైవరుతో కూడిన మొదటి రైలును ఉదయం 9.30 గంటలకు మండీహౌజ్ స్టేషన్లో జెండా ఊపి ఈ లైన్‌ను ప్రారంభించారు. ఆ తరువాత డీఎంఆర్సీ మేనేజింగ్ డెరైక్టర్ మంగూసింగ్, ఇతర సీనియర్ అధికారులు, విలేకరులతోపాటు వెంకయ్యనాయుడు మెట్రోరైలులో ప్రయాణించి సెంట్రల్ సెక్రటేరియట్ చేరుకున్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి ఈ మార్గంలో మెట్రో సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మెట్రో రెండోదశలో నిర్మించిన బదర్‌పుర్ కారిడార్‌ను కశ్మీరీగేట్ వరకు పొడిగించడానికి సెంట్రల్సెక్రటేరియట్ నుంచి కశ్మీరీ గేట్ వరకు కిలోమీటర్ల మెట్రోలైన్ నిర్మించారు. ఇందులో భాగంగా సెంట్రల్ సెక్రటేరియట్-మండీహౌజ్ మధ్య 3.2 కిలోమీటర్ల పొడవైన మెట్రో మార్గాన్ని భూగర్భంలో నిర్మించారు. ఈ మార్గంలో సెంట్రల్ సెక్రటేరియట్, జన్‌పథ్, మండీహౌజ్ స్టేషన్లు ఉన్నాయి. మే 2011లో ప్రారంభించిన ఈ మెట్రో లైన్ నిర్మాణాన్ని నిర్దేశిత గడువుకు మూడు నెలల ముందే ముగించినట్లు ఢిల్లీ మెట్రో చెప్పింది. బదర్‌పుర్ కారిడార్‌ను (వయొలెట్ లైన్) పొడిగిస్తూ నిర్మించిన ఈ సెక్షన్ వల్ల రాజీవ్‌చౌక్ స్టేషన్‌పై ప్రయాణికుల ఒత్తిడి తగ్గుతుంది. బదర్‌పుర్-సెంట్రల్ సెక్రటేరియట్ మార్గంలో ప్రయాణికులు దక్షిణ ఢిల్లీ నుంచి నోయిడా, ద్వారకా, వైశాలి వెళ్లేందుకు ఇక నుంచి రెండురైళ్లు మారనవసరం లేదు. అంతకు ముందు ఈ రూట్లో ప్రయాణించేవారు సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లో, రాజీవ్‌చౌక్ స్టేషన్లో రైళ్లు మారవలసి వచ్చేది. ఈ సెక్షన్ ప్రతిరోజూ 70 వేల మంది ప్రయాణికులుకు ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. ఇక నుంచి తరచూ మెట్రో ప్రయాణం: మంత్రి వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ మండీహౌజ్ కారిడార్ నిర్మాణ పనులను విజయవంతంగా ముగించిన ఢిల్లీ మెట్రో అధికారులు, ఢిల్లీ ప్రభుత్వాన్ని, కార్మికులను అభినందించారు. 140 కిలోమీటర్ల మెట్రోమార్గంతో మెట్రోఫేజ్ 3 నిర్మాణం మొత్తం పూర్తయితే దేశరాజధానిలో ప్రయాణం తీరుతెన్నులు మారుతాయని మంత్రి అభిప్రాయపడ్డారు. పట్టణ జీవితంలో వేగవంతమైన, సౌకర్యంగా ఉండే ప్రయాణ సాధనం ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. సెంట్రల్ సెక్రటేరియట్-మండీహౌజ్ సెక్షన్‌లోని స్టేషన్ల గోడలు ఈ ప్రాంతపు చారిత్రక నేపథ్యాన్ని కనుల ముందుంచుతున్నాయని వ్యాఖ్యానించారు. మెట్రోఫేజ్ 3లో 13 ఇంటర్చేంజ్ స్టేషన్లు ఉన్నాయి. వీటి నిర్మాణం 2016 మార్చి నాటికి పూర్తికానుంది. అప్పటి వరకు ఢిల్లీలో చాలా భాగం మెట్రోతో అనుసంధానిస్తామని వెంకయ్యనాయుడు ఆశాభావం వ్యక్తం చే శారు. దూరప్రాంతాల నుంచి ఢిల్లీకి వచ్చినప్పుడు దేశరాజధానిలో ప్రయాణించడానికి మెట్రో సదుపాయాన్ని ఉపయోగించుకోవలసిందిగా కోరుతూ తన మంత్రివర్గ సహచరులందరికీ లేఖలు రాసినట్లు ఆయన తెలిపారు. ఇది కాలుష్యాన్ని తగ్గించడానికి దోహదపడడంతోపాటు ప్రయాణ సమయాన్ని ఆదా చేస్తుందన్నారు. ఢిల్లీకి వచ్చినప్పుడల్లా తాను మెట్రో రైలులో ప్రయాణిస్తానని వెంకయ్య ఈ సందర్భంగా అన్నారు. దాని వల్ల మెట్రో పనితీరు గురించి స్వయంగా తెలుసుకోవడంతోపాటు రోడ్లపై రద్దీని, కాలుష్యాన్ని తగ్గించడానికి తోడ్పడగలుగుతానని చెప్పారు. చార్జీల పెంపుపై త్వరలోనే నిర్ణయం పెండింగులో ఉన్న మెట్రో చార్జీల పెంపును గురించి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, చార్జీల పెంపు ప్రతిపాదనను అధ్యయనం చే సి చార్జీల సవరణకుఅవకాశం ఉందేమో చూడాల్సిందిగా డీఎమ్మార్సీని కోరినట్లు ఆయన చెప్పారు. చమురు, ఇతర ధరలు పెరిగినప్పుడు వ్యయభారం సమస్యను పరిష్కరించడానికి రెండు మార్గాలున్నాయని తెలిపారు. ఒకటి ప్రయాణికులపై పెరిగిన వ్యయభారాన్ని మోపడం, రెండోది.. వాణిజ్య ప్రకటనలు, ఫుడ్‌కోర్టుల వంటి వాటి ఏర్పాటుకు మెట్రో స్టేషన్ల ప్రాంగణాలను సమర్థంగా వాడుకోవడమని చెప్పారు. మెట్రోఫేజ్ 3 ప్రాజెక్టుల కోసం భూసేకరణ గురించి లెఫ్టినెంట్ గవర్నర్‌తో మాట్లాడానని వెంకయ్య నాయుడు తెలిపారు. -
తప్పిన క్యూ తిప్పలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రయాణికుల మన్ననలను అందుకున్న ఢిల్లీ మెట్రో వారి కోసం మరో వెసులుబాటును బుధవారం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ ఐసీఐసీతో కలసి తొలిసారిగా ట్రావెల్ కార్డును ప్రవేశపెట్టింది. దీనికి యూనిఫేర్ కార్డు’ అని నామకరణం చేసింది. దీనిని కొనుగోలు చేసినట్టయితే టికెట్ల కోసం క్యూలో బారులుతీరాల్సిన అవసరమే ఉండదు. దీనిని డెబిట్/క్రెడిట్ కార్డుగా కూడా వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా రీచార్జి కూడా చేసుకోవచ్చు. ప్రయాణికులు క్యూలలో నిలబడే బదులు ఆయా స్టేషన్లలో స్వైప్ చేస్తే సరిపోతుంది. వచ్చే ఏడాది మార్చినాటికి మొత్తం లక్ష కార్డులను జారీచేయాలని డీఎంఆర్సీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయమై డీఎంఆర్సీ చైర్మన్ మంగూసింగ్ మీడియాతో మాట్లాడుతూ ప్రయాణికులకు అన్ని వె సులుబాట్లు కల్పించడమే తమ లక్ష్యమన్నారు. వారికి ఎటువంటీ ఇబ్బందులూ తలెత్తకుండా చేసేందుకు యత్నిస్తామన్నారు. వచ్చే వారం నుంచి మెట్రో హెల్ప్‌లైన్ 1511 మెట్రోరైలులో ప్రయాణించేవారికి ఏదైనా సమస్య ఎదురైనట్లయితే ఫిర్యాదు చేయడానికి 1511 నంబరుతో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ప్రారంభిస్తున్నట్టు డీఎంఆర్సీ వర్గాలు తెలిపాయి. మెట్రోలో నేరాలను తగ్గించడానికి, బాధితులకు తక్షణసాయం అందించడానికి ఉద్దేశించిన ఈ హెల్ప్‌లైన్ వచ్చే వారం నుంచి పనిచేస్తుంది. ఈ హెల్ప్‌లైన్ కోసం ఢిల్లీ పోలీసులు శాస్త్రిపార్క్ మెట్రో స్టేషన్లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. -
త్వరలో మూడు ఎఫ్‌ఓబీలు
గుర్గావ్: హర్యానా పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా) నగరంలో త్వరలో మూడు పాదచార వంతెన (ఫుట్ ఓవర్ బ్రిడ్జి)లను నిర్మించనుంది. హుడా సిటీ సెంటర్ మెట్రో స్టేషన్ వద్ద నిర్మించతలపెట్టిన ఈ బ్రిడ్జిల కోసం రూ. 7.44 కోట్లను వెచ్చించనుంది. సదరు ప్రతిపాదనను ఆమోదంకోసం హుడా ఉన్నతాధికారి పీసీ మీనా వద్దకు పంపింది. ఆమోదం లభించిన తర్వాత వీటి నిర్మాణానికి మూడు నెలల సమయం పట్టొచ్చని అంచనా వేస్తోంది. ఈ విషయాన్ని హుడా సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎ.కె.మాకెన్ వెల్లడించారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ హుడా సిటీ సెంటర్ మెట్రో స్టేషన్... నగరంలోకెల్లా అత్యంత కీలకమైన ప్రదేశమన్నారు. సిగ్నేచర్ టవర్స్, ఇఫ్కో చౌక్, సుభాష్ చౌక్, సెక్టార్-56 తదితర కీలక ప్రదేశాలను ఇది కలుపుతుందన్నారు. ఈ ప్రాంతంలోనే అనేక బహుళ జాతి సంస్థలకు చెందిన కార్యాలయాలు కూడా ఉన్నాయన్నారు. ఫోర్టిస్ ఆస్పత్రి, ఎపిక్ సెంటర్, ఇండస్ట్రియల్ సెక్టార్ 44 కూడా దీనికి అత్యంత సమీపంలోనే ఉన్నాయన్నారు. అత్యంత రద్దీగా ఉండే ఈ స్టేషన్ సమీపంలో రహదారులను దాటడం అత్యంత ప్రాణాంతకమన్నారు. ఫోర్టిస్ ఆస్పత్రి, ఎపిక్ సెంటర్, ఇండస్ట్రియల్ సెక్టార్ 44లకు వెళ్లదలుచుకున్నవారు విధిలేని పరిస్థితుల్లో నగరవాసులు రహదారులను దాటుతున్నారని, అదే ప్రమాదాలకు కారణమవుతోందన్నారు. ఈ కారణంగా అనేకమంది చనిపోతున్నారన్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. కాగా ట్రాఫిక్ పోలీసులు అందించిన గణాంకాల ప్రకారం గడచిన మూడు సంవత్సరాల కాలంలో 1,403 మంది పాదచారులు రోడ్లు దాటుతూ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాదచార వంతెనలను నిర్మించాలంటూ అనేకమంది హుడాను అభ్యర్థించారని మాకెన్ తెలిపారు. ఈ ఎఫ్‌ఓబీలను హుడా సిటీ సెంటర్ మెట్రో స్టేషన్‌తోపాటు మేదాంత మెడిసిటీ, సెక్టార్ 39లోగల మార్కెట్ వద్ద నిర్మించనున్నారు. -
వికలాంగులకు ‘మెట్రో’వర్క్‌షాప్
సాక్షి, న్యూఢిల్లీ: మెట్రోరైలులో ప్రయాణంతోపాటు ప్రత్యేకంగా కల్పిస్తున్న సదుపాయాలపై వికలాంగులకు అవగాహన కల్పించేందుకు ఢిల్లీ మెట్రోమ్యూజియం అధికారులు ఓ వర్క్‌షాప్ నిర్వహించారు. బుధవారం ఉదయం పది గంటల నుంచి ప్రారంభమైన కార్యక్రమంలో ఢిల్లీలోని వివిధ ప్రాంతాలకు చెందిన 40 మంది వికలాంగులు పాల్గొన్నారు. మెట్రోరైళ్లలో వికలాంగులకు కల్పిస్తున్న సదుపాయాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తో వివరించారు. మెట్రోస్టేషన్లు, రైళ్లలో సదుపాయాలతోపాటు ఎలా ప్రవర్తించాలన్నది వివరిస్తూ ఓ లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. పేరణ నికేతన్ సంఘ్ ఎన్జీఓ సంస్థ సహకారంతో ఈ వర్క్‌షాప్‌ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డ్రాయింగ్ పోటీల్లో వికలాంగులంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో డీఎంఆర్సీ ఫైనాన్స్ డెరైక్టర్ కె.కె.సబర్వాల్ పాల్గొన్నారు. వికలాంగులకు మెట్రోస్టేషన్లలో వీల్చైర్లు, దృష్టి లోపం ఉన్నవారి కోసం ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. వికలాంగులకోసం ప్రత్యేకంగా సీట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. ఢిల్లీ మెట్రోమ్యూజియం ఆధ్వర్యంలో వికలాంగులు, కేన్సర్ బారిన పడిన చిన్నారులకోసం ఏటా డ్రాయింగ్, క్విజ్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. -
మెట్రో స్టేషన్లలో మరో 200 తనిఖీ బూత్‌లు
న్యూఢిల్లీ: నగరంలోని మెట్రోస్టేషన్లలో మరో 200 తనిఖీ బూత్‌లను ఏర్పాటు చేయనున్నారు. మెట్రోల్లో ప్రయాణిస్తున్న మహిళల సంఖ్య పెరుగుతుండడంతో ప్రస్తుతం ఉన్న తనిఖీ బూత్‌లు ఎటూ సరిపోవడంలేదు. దీంతో యుద్ధప్రాతిపదికన 200 తనిఖీ బూత్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్(డీఎంఆర్సీ) ప్రకటిం చింది. నీలం రంగులో ఏర్పాట్లు చేయనున్న ఈ క్యాబిన్లలో ఢిల్లీ పోలీసులతోపాటు కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాలు(సీఐఎస్ఎఫ్) విధులు నిర్వర్తిస్తాయి. దశలవారీగా పూర్తిచేయనున్న ఈ పనులను మొదట బ్లూలైన్‌లో ప్రారంభించనున్నారు. ద్వారక సెక్టార్-21 నుంచి వైశాలీ/నోయిడా సిటీసెంటర్ మార్గంలోగల మెట్రో స్టేషన్లలో మొదట వీటిని ఏర్పాటు చేస్తారని, ఆ తర్వాత మిగతా స్టేష న్లలో ఏర్పాటు చేస్తారని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నారు. వీటిని ఏర్పాటు చేయడం వల్ల మహిళా ప్రయాణికులను మరింత క్షుణ్ణంగా తనిఖీ చేయవచ్చునని, ప్రయాణికులకు కూడా ఇది సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఇంతకుముందు ఓ ఫ్రేమ్ మాత్రమే ఉండి దానికి చుట్టూ కవర్లలాంటి ఏర్పా ట్లు మాత్రమే ఉండేవి. అయితే ప్రస్తుతం ఏర్పాటు చస్తున్న క్యాబిన్లు పూర్తిగా కార్డ్బోర్డ్ వంటి వస్తువుల తో తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఇది మహిళలకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పారు. భద్రతా ఏర్పాట్ల పెంపు.. తనిఖీ బూత్‌ల ఏర్పాటు మాత్రమేకాకుండా స్టేషన్లలో భద్రతా ఏర్పాట్లను మరింతగా పెంచుతున్నట్లు సీఐఎస్ఎఫ్ చీఫ్ అరవింద్ రాజన్ తెలిపారు. ప్రస్తుతం నగరంలోని 134 స్టేషన్లలో దాదాపు 5,000 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బందే భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో మహిళా సిబ్బంది కూడా ఉన్నారు. వీరికి ఢిల్లీ పోలీసులు కూడా తొడవడంతో భద్రత మరింత పటిష్టం కానుందని రాజన్ అభిప్రాయపడ్డారు. -
30 నుంచి ట్రయల్ రన్.
న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో మూడో దశ మొదటి పనులు అఖరుకు చేరుకున్నాయి. ఈ నెల 30 నుంచి సెంట్రల్ సెక్రటేరియట్ నుంచి మండి హౌస్ మార్గంలో ట్రయల్ రన్లు నిర్వహిస్తామని ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్ (డీఎంఆర్సీ) మేనేజింగ్ డెరైక్టర్ మంగూ సింగ్ తెలిపారు. ఆయన మంగళవారం మెట్రో మూడో దశ పనులను స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2014 మార్చి వరకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూస్తామన్నారు. గతంలో తామనుకున్న 2014 అక్టోబర్ కన్నా ముందుగానే ఈ మెట్రో సేవలను నగరవాసులకు అందుబాటులోకి తెస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. 2011 డిసెంబర్లో ప్రారంభమైన మూడో తొలి విడత పనులు త్వరితగతిన పూర్తయ్యాయని చెప్పారు. ఈ మార్గంలో మెట్రో సేవలు అందుబాటులోకి రావడం వల్ల రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్‌పై ఒత్తిడి తగ్గుతుందన్నారు. ‘ఇంతకుముందు నోయిడా, వైశాలికి వెళ్లే ప్రయాణికులు సెంట్రల్ సెక్రటేరియట్, రాజీవ్ చౌక్ వద్ద రెండుసార్లు రైళ్లు మారేవారు. మూడో దశ తొలి మార్గం బాంద్రాపూర్, సెంట్రల్ సెక్రటేరియట్ లైన్ అందుబాటులోకి రావడం వల్ల రైళ్లు మారకుండానే గమ్యస్థానానికి చేరుకునే వెసులుబాటు కలగనుంద’ని ఆయన వివరించారు. మూడో దశ మెట్రోకు మండి హౌస్ స్టేషన్ తొలి ఇంటర్చేంజ్ స్టేషన్‌గా ఉంటుందన్నారు. అలాగే సెంట్రల్ సెక్రటేరియట్లో కూడా ఇంటర్ చేంజ్ సౌకర్యం ఉంటుందని తెలిపారు. ఈ మార్గం ప్రారంభం కావడం వల్ల ప్రజలకు ఎంతో మేలు కలగనుందని, వారి వెతలు తీరనున్నాయని తెలిపారు. రాజీవ్ చౌక్ స్టేషన్‌కు ఉండే ప్రయాణికుల తాకిడి తగ్గుతుందన్నారు.