అన్ని స్టేషన్లు, రైల్వే బోగీల్లో పూర్తి స్థాయి వైఫై సేవలు
న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రోని ‘వైఫై’మయం చేయడానికి రంగం సిద్ధమైంది. దేశ రాజధానిలోని అన్నీ మెట్రో స్టేషన్లు, రైల్వే బోగీల్లో వైఫై సేవల్ని విస్తరించడానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. అందుకోసం ‘దయచేసి ప్రతిపాదనలు పంపించండి’ అని స్మార్ట్ ఫోన్ వినియోగదారులు, ప్రయాణికులను అభ్యర్థిస్తున్నారు. దీంతో చాలా కాలంగా ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్‌కు మార్గం సుగమమయింది.
ప్రజల నుంచి వచ్చే ప్రతిపాదనల సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకొని తదుపరి చర్యలు తీసుకుంటామని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వెల్లడించింది. అలాగే ఇప్పటి వరకు 193 కిలోమీటర్లు వ్యాపించిన వైఫై సేవల్ని శరవేగంగా విస్తరిస్తోన్న స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు అనుగుణంగా పెంచాలని నిర్ణయించింది. ‘మెట్రోలో వైఫై సేవల్ని విస్తరించడాని మొబైల్ వినియోగదారుల నుంచి ప్రతిపాదనలు పంపించమని కోరాం. వారి నుంచి వచ్చిన సూచనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం.
అన్ని స్టేషన్లలో వైఫై సేవల్ని మే నెలాఖరు నాటికి విస్తరింపజే యాలని కంపెనీలకు స్పష్టం చేశాం.’ అని మెట్రో అధికారి తెలిపారు. మెట్రో అధికారులు స్మార్ట్ ఫోన్ వినియోగదారుల కోసం వినూత్నమైన కార్యక్రమం ప్రవేశపెట్టారు. వినియోగదారులకు క్రెడిట్ పాయింట్లు ఇవ్వడం ద్వారా రిచార్జ్ స్మార్ట్ కార్డులు అందిస్తున్నారు. దీని ద్వారా ప్రయాణికులు మెట్రోరైళ్లపై మరింత ఆసక్తి పెరుగుతోందని అధికారులు వివరించారు.
మెట్రో ఇంట ‘వైఫై’ పంట
Published Fri, Apr 3 2015 11:27 PM | Last Updated on Sat, Sep 2 2017 11:48 PM
Advertisement
Advertisement