ఢిల్లీ మెట్రోలో అమ్మాయిల పైత్యం : మండిపడుతున్న నెటిజన్లు | two girls Holi Inside Delhi Metro Sparks Debate On Internet | Sakshi
Sakshi News home page

ఢిల్లీ మెట్రోలో అమ్మాయిల పైత్యం : మండిపడుతున్న నెటిజన్లు

Published Sat, Mar 23 2024 2:21 PM | Last Updated on Sat, Mar 23 2024 3:13 PM

two girls Holi Inside Delhi Metro Sparks Debate On Internet - Sakshi

దేశవ్యాప్తంగా హోలీ వాతావరణం వచ్చేసింది. ఇప్పటికే పలు ప్రదేశాల్లో హోలీ సంబరాలు ఊపందు కున్నాయి. అయితే ఢిల్లీ మెట్రోలో చోటు చేసుకున్న ఘటన ఒకటి వివాదాన్ని రాజేసింది. ఇద్దరు  అమ్మాయిలు  అభ్యంతరకరంగా  హోలీ ఆడటం విమర్శలకు తావిచ్చింది. 

విషయం ఏమిటంటే..దేశ రాజధాని నగరానికి తలమానికంగా పేరొందిన ఢిల్లీ మెట్రో ప్రతిసారీ ఏదో ఒక కారణంతో హెడ్ లైన్స్ లోకి వస్తుంది. అమ్మాయిలు పోల్ డ్యాన్స్, జంటల అశ్లీల వీడియోలు, రీళ్లు తయారు చేయడం, సెల్ఫీలతో వివాదాన్ని రేపడం పరిపాటిగా మారిపోయింది. దీనికి సంబంధించి డిఎంఆర్‌సి అనేక చట్టాలు చేసినా ప్రజలు పాటించడం లేదు తాజాగా ఢిల్లీ మెట్రోలో ఇద్దరు అమ్మాయిలు అసభ్యకరంగా హోలీ ఆడారు. వీరు తెల్లటి చీరలు సూట్‌లు ధరించి, నడుస్తున్న మెట్రోలో ఒకరికొకరు రంగులను పూసుకుంటూ హోలీ ఆడారు. డాన్స్‌ చేశారు. పవిత్ర హోలీని అవమనాపరుస్తూ, బాలీవుడ్‌ రొమాంటిక్‌ సాంగ్‌కు  అభినయిస్తూ,  ఒకర్ని ఒకరు తాకుతూ, మెట్రోలో బహిరంగంగా, అభ్యంతకరంగా  ప్రవర్తించారంటూ  యూజర్లు  ఆగ్రహం వ్యక్తం చేశారు

దీన్ని గమనించిన తోటి ప్రయాణీకులు రెచ్చగొట్టే విధంగా ఉందని వ్యాఖ్యానించారు. సోషల్‌ మీడియా యూజర్‌ ఒకరు దీన్ని ఎక్స్‌(ట్విటర్‌)లో షేర్‌ చేశారు. ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు, విమర్శలుగుప్పిస్తున్నారు.దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఇది సరైంది కాదు అంటూ విమర్శిస్తున్నారు. ఢిల్లీ మెట్రో కార్పొరేషన్‌లో చోటు చేసుకుంటున్న ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement