Holi 2024
-
అయోధ్య బాల రామ్ ప్రత్యేక ఆకర్షణ బోర్డర్ లో హోలీ సంబరాలు
-
హోలీ సంబురాల్లో మునిగి తేలిన ఐపీఎల్ హీరోలు.. కోహ్లి మాత్రం అలా..!
హోలీ పర్వదినాన ఐపీఎల్ క్రికెటర్లు రంగుల సంబురాల్లో మునిగి తేలారు. ఇవాళ ఉదయం నుంచి చాలా మంది క్రికెటర్లు ఉత్సాహంగా హోలీ సంబురాలు చేసుకున్నారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ సహచరులతో కలిసి రంగుల పూసుకుని నీటితో సంబురాలు చేసుకోగా, మరో ముంబై ఇండియన్ సూర్యకుమార్ యాదవ్ తన శ్రీమతితో కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. Rohit Sharma celebrating Holi with his family & MI team mates. ⭐https://t.co/Kc645b7DOV— Johns. (@CricCrazyJohns) March 25, 2024 The Hitman Rohit Sharma celebrating Holi. pic.twitter.com/kHaTPPQANf — CricketMAN2 (@ImTanujSingh) March 25, 2024 Gautam Gambhir and Shreyas Iyer celebrating Holi. pic.twitter.com/dWnjdSiOaz — CricketMAN2 (@ImTanujSingh) March 25, 2024 కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఆ జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ ముఖానికి రంగులు పూసుకుని ఫోటోలకు పోజులివ్వగా.. ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు పృథ్వీ షా ముఖం నిండా రంగులు పూసుకుని తన ఐపీఎల్ సహచరులతో కలిసి సెల్ఫీ దిగాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ డ్వేన్ బ్రావో నగరంలో జరిగిన హోలీ సంబురాల్లో పాల్గొని తన ఆటపాటలతో అభిమానులను అలరించాడు. Captain Shreyas Iyer and KKR players celebrating Holi.pic.twitter.com/L5WldKccF3 — Mufaddal Vohra (@mufaddal_vohra) March 25, 2024 Delhi Capitals' players celebrating Holi. pic.twitter.com/lqRn9RvLAe — CricketMAN2 (@ImTanujSingh) March 25, 2024 VIRAT KOHLI RETURNS AT CHINNASWAMY TODAY. - The GOAT is Ready to Roar..!!!! 🐐 pic.twitter.com/xpHsedcuzD — CricketMAN2 (@ImTanujSingh) March 25, 2024 ఐపీఎల్ కామెంటేటర్లు స్టీవ్ స్మిత్, స్టువర్ట్ బ్రాడ్ భారత సంప్రదాయ దుస్తులు ధరించి హోలీ సంబురాలు చేసుకుంటూ ఫోటోలకు పోజులిచ్చారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో తరహాలో హోలీ సంబురాలు చేసుకోగా.. ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి మాత్రం ప్రాక్టీస్‌లో మునిగి తేలాడు. Suryakumar Yadav with his wife celebrating Holi. pic.twitter.com/46ltjxTnBG — CricketMAN2 (@ImTanujSingh) March 25, 2024 Dwayne Bravo at the Holi Celebrations in Chennai. ❤️pic.twitter.com/27PWVB0rwj — CricketMAN2 (@ImTanujSingh) March 25, 2024 ఆర్సీబీకి ఇవాళ మ్యాచ్ ఉండటంతో కోహ్లి హోలీ సంబురాలు చేసుకున్నట్లు లేడు. ఆర్సీబీ తమ హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. పంజాబ్ తమ తొలి మ్యాచ్‌లో ఢిల్లీను ఓడించి బోణీ విజయం సొంతం చేసుకోగా.. తొలి మ్యాచ్‌లో సీఎస్కే చేతిలో ఓడిన ఆర్సీబీ ఖాతా తెరవాల్సి ఉంది. -
హోలీ 2024: సెలబ్రిటీల సందడి (ఫోటోలు)
-
Vizag : విశాఖలో ఘనంగా హోలీ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
Holi 2024 యాంకర్ సుమ వీడియో: చెప్పులు కూడా మారిస్తే ఇంకా బావుండేదట!
యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యాంకరింగ్, యాక్టింగ్, స్టేజ్ షోలు,సినిమాలు.. ఇలా ప్రతీ అంశంలోనూ నా స్టయిలే వేరు అన్నట్టు దూసుకుపోవడం సుమకు వెన్నతో పెట్టిన విద్య. దాదాపు ప్రతీ పండుగకు ఒక సందేశంతో ప్రాంక్ వీడియోలను చేయడం అలవాటు. ఫన్నీగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడం ఆమె స్టయిల్. తాజాగా హోలీ సందర్భంగా కూడా ఒక వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) ముఖ్యంగా నీటిని వేస్ట్ చేయొద్దు అనే సందేశంలో ఈ వీడియోను షేర్ చేయడం విశేషం. ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. మీకు తప్ప ఎవరికి ఇలాంటి ఐడియాస్ రావు సుమ గారు ఒకరు కామెంట్ చేయగా, ఇలాంటి వీడియోలు చేయడం మీకే సాధ్యం మేడమ్.. హ్యాపీ హోలీ శుభాకాంక్షలు అందించారు ఇంకొందరు. అయితే చెప్పులు కూడా మారిస్తే ఇంకా బావుండు మరొకరు ఫన్నీగా కామెంట్ చేయడం గమనార్హం. -
Holi 2024: మన దేశంలో ఇక్కడ హోలీ సంబరాలుండవు, ఎందుకో తెలుసా?
రంగుల పండుగ హోలీ అంటే దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. చిన్నా పెద్దా అంతే రంగుల్లో మునిగి తేలతారు. కానీ దేశంలో హోలీ జరుపుకోని కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. హోలీ ఎందుకు ఆడరో..ఆ కారణాలేంటో ఒకసారి చూద్దాం.. ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలోని క్విలీ, కుర్జాన్, జౌడ్లా మూడు గ్రామాలలో కూడా హోలీ పండుగను జరుపుకోరు. తమ ఇష్టమైన దేవత త్రిపుర సుందరి దేవి. ఒకటిన్నర శతాబ్దం క్రితం, ప్రజలు ఈ గ్రామంలో హోలీ జరుపుకోవడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో గ్రామంలో కలరా మహమ్మారి వ్యాపించింది. ఇక అప్పటినుంచి ఇక్కడి ప్రజలు హోలీ జరుపుకోవడానికి ఇష్టపడరు.ఇక్కడి త్రిపుర సుందరి దేవతకి శబ్దాలు నచ్చవని స్థానికులు చెబుతారు.హోలీ తమకు అచ్చి రాదని భావిస్తారట. అందుకే 150 ఏళ్లుగా హోలీ సంబరాలు చేసుకోరట. జార్ఖండ్: జార్ఖండ్‌లోని బొకారోలోని కస్మార్ బ్లాక్ సమీపంలోని దుర్గాపూర్ గ్రామంలో సుమారు 100 ఏళ్లకు పైగా ఇక్కడ హోలీ జరుపుకోవడం లేదు. ఒక శతాబ్దం క్రితం హోలీ రోజున ఇక్కడ ఒక రాజు కుమారుడు మరణించాడు. ఆ తర్వాత ఊరిలో హోలీ సంబరాలు చేసుకుంటే అరిష్టమని భావిస్తారు. కానీ కొంతమంది మాత్రం పొరుగూరికి హోలీ పండుగ చేసుకుంటారు. గుజరాత్: గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా రంసాన్ గ్రామంలో కూడా ప్రజలు హోలీని జరుపుకోరు. కొంతమంది సాధువులచే శాపగ్రస్తమైందట ఈ గ్రామం. అందుకే అప్పటి నుండి హోలీ జరుపుకోవడానికి భయపడతారు ప్రజలు . మధ్యప్రదేశ్: 125 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్‌లోని బైతుల్ జిల్లా ముల్తాయ్ తహసీల్‌లోని దహువా గ్రామంలో, బావిలో బాలుడు నీటిలో మునిగి చనిపోయాడట. ఈ విషాద ఘటనతో హోలీ ఆడటం తమకు చెడు శకునంగా భావించారు. దీంతో ఇక్కడ ఎవరూ హోలీ ఆడరని చెబుతారు. తమిళనాడు: దక్షిణ భారత రాష్ట్రం తమిళనాడు చాలా దేవాలయాలకు ప్రసిద్ధి. ఇక్కడ భక్తి కూడా ఎక్కువ అని చెబుతారు. కానీ ఉత్తర భారతంతో జరుపు కున్నంతగా హోలీని ఇక్కడ జరుపుకోరు. హోలీ పౌర్ణమి రోజున వస్తుంది కాబట్టి, తమిళులు మాసి మాగంగా జరుపుకుంటారు. పవిత్ర నదులు, చెరువులు, సరస్సులలో స్నానం చేయడానికి ,పూర్వీకులు భూమిపైకి వచ్చే పవిత్రమైన రోజు అని నమ్ముతారు. అందుకే ఇక్కడ ఆ రోజు హోలీ ఆడరు. అయితే పుదుచ్చేరి లాంటి టూరిస్ట్ ప్రదేశాలలో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతాయి. -
Hyderabad Holi Photos 2024: హైదరాబాద్‌లో హోలీ వేడుకలు..(ఫొటోలు)
-
Holi 2024: స్పెషల్ సమోసా, ఒక్కసారి తింటే.. వీడియో వైరల్
భారతీయులకు ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ , ఈవినింగ్ టీ టైంలోబెస్ట్ ఆప్షన్ సమోసా. సాధారణంగా సమోసా అంటే మనకి త్రిభుజాకారంలో, లోపల్ ఏదో ఒక స్టఫ్పింగ్తో ఉంటుంది. తాజాగా ఒక వెరైటీ సమోసా ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. హోలీ స్పెషల్‌గా ‘థ్రెడ్ సమోసా’ నెటిజనులను ఆకట్టుకుంటోంది. గుండ్రగా చేసిన ఒక చపాతీలో నాలుగ్గు భాగాల్లోని ఒక భాగంలో ఆలూ, బఠానీ కూరను స్టఫ్ చేసి దానిక ఎదురుగా ఉన్న భాగంతో కవర్ చేసింది.మిగిలిన రెండు భాగాలను మళ్లీ రిబన్స్లాగా కట్ చేసి, ఒకదాని దాని తరువాత ఒకటి సమోసా చుట్టూ థ్రెడ్లాగా చక్కగా అల్లింది. దీన్ని జాగ్రత్తగా నూనెలో వేయించింది. ఈ థ్రెడ్ సమోసా రెసిపీని plumsandpickle ఇన్స్టాగ్రామ్ ఖాతా షేర్ చేయగా ఇప్పటికే ఇది 95 మిలియన్లగా వ్యూస్‌ను సాధించడం విశేషం. రెసిపీ, కావాల్సిన పదార్థాలు ఉడకబెట్టిన బంగాళాదుంపలు, ఉడికించిన పచ్చి బఠానీలు, మిరపకాయ, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పొడి , కొత్తిమీర. పిండి కోసం : 2 కప్పులు ఆల్-పర్పస్ పిండి, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి లేదా నూనె, 1/2 టీస్పూన్, వామ్ము, ఉప్పు ,నీరు. ముందుగా పిండి కలుపుకొని ఒక అరగంట సేపు నాన బెట్టుకోవాలి. తరువాత ఆటూ, బఠానీ కూరను తయారు చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చపాతీ చేసుకొని, థ్రెడ్ సమోసాను సిద్ధం చేసుకోవడమే. View this post on Instagram A post shared by Megha Mahindroo | Recipe Video Creator (@plumsandpickle) -
Post Holi skincare: హోలీ రంగులు వదిలించుకోండి ఇలా...
హోలీ పండుగ అంటే అందరీ సదరాగానే ఉంటుంది. పెద్దవాళ్లను సైతం చిన్నవాళ్లలా చిందులేసి ఆడేలా చేసే పండుగ ఇది. అయితే ఈ రోజు జల్లుకునే రకరకాల రంగుల వల్ల చర్మం ప్రభావితం కావొచ్చు. కొందరికి ఈ రంగులు రియాక్షన్ ఇస్తాయి. ర్యాషస్ వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు. ఈ చక్కటి రంగులకేళిని ఆనందమయంగా జరుపుకునేలా మీ చర్మ సంరక్షణ కోసం ఈ చిన్న చిట్కాలు పాటించండి. చక్కగా రంగులు జల్లుకుని ఎంజాయ్ చేసాక అసలైన సమస్య మొదలవ్వుతుంది. ముఖానికి రాసిన రంగులు ఓ పట్టాన పోక ఏం చేయాలో తోచక ఏడుపొచ్చేస్తుంది. అలాంటప్పడూ ఈ సింపుల్ చిట్కాలతో సమస్య నుంచి సులువుగా బయటపడండి. అవేంటంటే.. ముఖానికి ఆయిల్‌ని అప్లై చేస్తే సులభంగా రంగులు ముఖం నుచి పోయే అవకాశం ఉంటుంది. అలాగే ముఖం క్లీన్ అయ్యాక కొన్ని గంటల వరకు ఏమి రాయకుండా ఫ్రీగా వదిలేయండి. అప్పుడు ముఖంపై రంధ్రాలు ఓపెన్ అయ్యి క్లీన్ అయ్యే అవకాశం ఉటుంది. హోలీ రంగులు రియాక్షన్ ఇచ్చే అవకాశం కూడా ఉండదు. హోలీ ఆడిన వెంటనే నేరుగా తలస్నానం అస్సలు చెయ్యొద్దు. ముందుగా రంగులు మీ చర్మం నుంచి పూర్తిగా పోయేలా చేయడం అనేది ముఖ్యం. అందుకోసం కొబ్బరి నూనె వంటి వాటితో క్లీన్ చేయండి. ఇది రంగుల నుంచి చర్మం ప్రభావితం కాకుండా చేయగలదు. అలాగే ముఖం ఆ రోజు కాస్త తేమగా ఉండేలా మంచి మాయిశ్చరైజర్‌ని అప్లై చేయండి. ఇలా చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవు. పైగా సులభంగా రంగులు వచ్చేస్తాయి. (చదవండి: జాలీగా, హ్యాపీగా హోలీ : ఇంట్రస్టింగ్ టిప్స్, అస్సలు మర్చిపోవద్దు!) -
రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ హోలీ శుభాకాంక్షలు
సాక్షి, గుంటూరు: హోలీ పండుగ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మన జీవితాల్లో సంతోషాన్ని వికసించే వసంత రుతువుకు స్వాగతం పలుకుతూ.. రంగుల హోలీ అందరికీ ఆనందాన్ని పంచాలని కోరుకుంటున్నా’ అని తన సందేశంలో పేర్కొన్నారాయన. అదే సమయంలో.. ‘చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక హోలీ. ప్రజల జీవితాల్లో ఈ పండుగ సుఖసంతోషాలను నింపాలని కోరుకుంటున్నాను. అందరికీ హోలీ శుభాకాంక్షలు’ అంటూ ఎక్స్ ఖాతాలోనూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక హోలీ. ప్రజల జీవితాల్లో ఈ పండుగ సుఖసంతోషాలను నింపాలని కోరుకుంటున్నాను. అందరికీ హోలీ శుభాకాంక్షలు. — YS Jagan Mohan Reddy (@ysjagan) March 25, 2024 -
రంగులు చల్లుకోని హోలీ గురించి తెలుసా?
ప్రకృతిలో సరికొత్త సొగసు కనుల విందు చేస్తుందంటే అది వసంత రుతువు ఆగమనానికి గుర్తింపు మాత్రమే కాదు.. మనుషుల్లో ఉత్సాహానికి కారణం కూడా. ఎందుకంటే..? ఆ రుతువులోనే ఎండిన చెట్లు, కొమ్మలు, రెమ్మలు చిగురిస్తాయి. అంతేనా ఆ కొమ్మలపైన కుహు.. కుహు.. అంటూ మనసు పులకరించేలా కోయిలమ్మ మధురగానాలతో వీనుల విందు చేస్తుంది. మరోవైపు ఆ పచ్చదనపు ప్రకృతి సోయగాలు పుష్ప పరిమళ వికాసాలు అన్నీ ఏకమై ఆవిష్కృతమవుతాయి. ఆ ఆనందభరిత సమయాన చిన్న, పెద్ద, ఆడ, మగ తేడాలు లేకుండా కులమతాలకు అతీతంగా దేశ వ్యాప్తంగా జరుపుకునే తొలి వేడుక హోలీ. హోలీ పండుగ రంగుల పండుగ.. అదో ఆనంద కేళీ… ప్రజలు ఎంతో ఇష్టంగా పాల్గొనే పండుగ. వసంతాగమనంలో వస్తుంది ఈ రంగుల హోలీ. గజగజా వణికించిన చలికి టాటా చెబుతూ.. వేసవి వెచ్చదనంలోకి అడుగుపెడుతున్న వేళ హోలీ వస్తుంది. భారతీయ పండుగల్లో హోలీ మరీ ప్రత్యేకం. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు హోలీని ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు. సంవత్సరంలో కేవలం ఒక్క సారి మాత్రమే ఘనంగా జరుపుకునే పండుగలలో హోలీ పండుగ ఒకటి. ఈ పండుగను సత్య యుగం నుంచి జరుగుతున్నట్లుగా హిందూ పురాణాలు తెలియజేస్తున్నాయి. హోళి అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. ఈ హోళిని హోలికా పూర్ణిమ అని కూడా అంటారు. పురాణాల ప్రకారం చూస్తే విష్ణు భక్తుడు ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశ్యపుడు. ప్రహ్లాదుడిని చంపడానికి రాక్షసి హోలికా ప్రయత్నిస్తుంది. ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు కావడం, తనని మాత్రమే పూజించాలన్నా.. తన మాట వినకపోవడంతో హిరణ్యకశ్యపుడే తన కొడుకు ప్రహ్లాదుడిని చంపాలని హోలికాకి ఆదేశాలు ఇచ్చాడు. ఎందువల్ల ఇలా చేస్తాడంటే..రాక్షస రాజు.. హిరణ్యకశ్యపుడు .. కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉంటాడు.. అది హిరణ్యకశ్యపుడికి నచ్చదు దీంతో భక్త ప్రహ్లాదుని చంపేయాలి అనుకుంటాడు. తన సోదరి అయిన హోలికను పిలుస్తారు. ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుని మంటలలో ఆహుతి చేయమని ఆమెను కోరతాడు. దీంతో ఆమె ప్రహ్లాదుని ఒడిలో కూర్చోబెట్టుకొని, మంటల్లోకి దూకుతుంది. విష్ణు మాయతో ప్రహ్లాదుడు బయటపడతాడు. హోలిక రాక్షసి మాత్రం ఆ మంటల్లో చిక్కుకొని చనిపోతుందట. మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. సతీవియోగంతో తపస్సులో ఉన్న శివునికి హిమవంతుని కుమార్తె అయిన పార్వతిని ఇచ్చి దేవతలు వివాహం చేయాలనుకుంటారు. కానీ తపస్సులో ఉన్న శివునికి ఎలా తపో భంగం కలిగించాలోనని ఆలోచించి మన్మథున్ని శివుని మీదకు పంపుతారు. కామదేవుడు శివుని తపస్సును భగ్నం చేసేందుకు పూల బాణాలు వదలడంతో శివుని మనస్సు పెండ్లి వైపు మరలిస్తాడు. దీంతో పార్వతీ పరమేశ్వరుల వివాహం జరుగుతుంది. మన్మథ బాణం ప్రభావం తగ్గగానే శివుడు తనకు మన్మథుడి వల్ల తపో భంగం కలిగిందని తన మూడో నేత్రంతో కామదేవుడిని భస్మం చేస్తాడు. పతీ వియోగంతో కామదేవుడి భార్య రతీదేవి శివునితో తన భర్త కామదేవున్ని బతికించమని వేడుకుంటుంది. శివుడు అనుగ్రహించి శరీరం లేకుండా మానసికంగా బతికే వరాన్ని ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున ప్రసాదిస్తాడు. కాముడు తిరిగి బతికిన రోజు కావడంతో కాముని పున్నమిగా పిలుస్తారు. పూర్వం ఈ పండుగ రోజున రకరకాల పూలను ఒకరిపై ఒకరు చల్లుకుని.. అలా వారి సంతోషాన్ని వ్యక్తపరిచేవారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో పూల స్థానంలో రకరకాల రంగులు వచ్చాయి. ఈ రంగులను నీళ్ళలో కలుపుకొని ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ప్రేమ తోపాటు, సౌభాగ్యాలు వెల్లి విరుస్తాయి అని అందరూ భావిస్తారు. హోలీ ఎలా వచ్చిందంటే.. ఇక మరో కథనం ప్రకారం.. అప్పట్లో శ్రీకృష్ణుడు గోపికలతో కలసి బృందావనంలో పువ్వులు, రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకునేవారు. ఇలా చేయడం ద్వారా ప్రేమ సౌభాగ్యాలు కలుగుతాయని నమ్మకం. పురాణ కథల ప్రకారంగా.. కృష్ణుడు ముదురు రంగులో ఉంటాడు. రాధ చాలా అందంగా ఉంటుంది. ఓ రోజు కృష్ణుడు తల్లి యశోద వద్దకు వెళ్లి రాధ గురించి చెబుతాడు. రాధ మేని మెరుపు తన ఒంటి ఛాయ పూర్తి విరుద్ధంగా ఉంది, ఆమె నా ప్రేమను అంగీకరిస్తుందా అని అడుగుతాడు. అప్పుడు యశోద బదులిస్తూ, రాధ ముఖానికి కూడా నీకు నచ్చిన రంగు పూయమని సరదాగా అంటుంది. దీంతో తల్లి యశోద సలహాను అనుసరించి, శ్రీకృష్ణుడు రాధ ముఖానికి రంగులు పూస్తాడు. అలా హోలీ మొదలైంది ఈ దినాన రాక్షస పీడ పోయే౦దుకు "హోళికా" అనే ఒక విధమైన శక్తిని ఆరాధిస్తారు. ఈ రోజునే మహాలక్ష్మీ ఆవిర్భావం.. ఆమె ప్రీతి కోస౦ అ౦దరూ కలిసి గానాలు చేయడ౦, పరిహాసాలాడడ౦ చేస్తారు. హోలికాగ్నిని రగిల్చి ఆరాధి౦చే స౦ప్రదాయ౦ ఇప్పుడు తగ్గిపోయి పరిహాసాది క్రియలే మిగిలాయి. శ్రీమహాలక్ష్మి క్షీరసాగర౦ ను౦డి ఆవిర్భవి౦చి౦దని పురాణ కథ. ఈ ఏడాది పూర్ణిమ, ఉత్తర ఫల్గుణి కలిసి వచ్చాయి. కనుక ఈ దినాన భక్తి శ్రధ్ధలతో మహాలక్ష్మిని షోడశోపచారములతో చక్కగా ఆరాధి౦చి లక్ష్మీ అష్టోత్తర శతనామాలు, కనకధారాస్తోత్ర౦, వ౦టివి పారాయణ చేయడ౦ మ౦చిది. ఈరోజున లక్ష్మిని శ్రద్ధగా అర్చి౦చే వారికి సమస్త ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈరోజుననే శ్రీకృష్ణుని ఉయ్యాలలో వేసి ఆరాధి౦చాలి. దీని ’డోలోత్సవ౦’ అని అ౦టారు. ఒరిస్సావ౦టి ప్రా౦తాలలో డోలా పూర్ణిమ పేరుతో ఇప్పటికీ దీనిని ఆచరిస్తారు. నరాడోలాగత౦ దృష్ట్వా గోవి౦ద౦ పురుషోత్తమ౦! ఫాల్గుణ్యా౦ ప్రయతో భూత్వా గోవి౦దస్య పుర౦వ్రజేత్!! ఉయ్యాలలో అర్చి౦పబడిన పురుషోత్తముడైన గోవి౦దుని ఈరోజున దర్శి౦చిన వారికి వైకు౦ఠలోక౦ ప్రాప్తిస్తు౦దని ధర్మశాస్త్రాల వాక్య౦. (చదవండి: జీవితం వర్ణమయం) -
Amritsar Holi Photos: రంగుల్లో మునిగి తేలిన అమృత్సర్.. విశేషం ఏంటంటే? (ఫోటోలు)
-
మంగ్లీ పాట, విజయ్ దేవరకొండ డ్యాన్స్.. హోలీ స్పెషల్ సాంగ్స్ విన్నారా?
సంవత్సరంలో ఘనంగా జరుపుకునే పండుగలలో హోలీ పండుగ ఒకటి. వసంత రుతు శోభకు వర్ణమయంగా, సౌందర్యయుతంగా స్వాగతం పలికే రంగుల పండుగ- హోలీ! ఈ పండుగను సత్య యుగం నుంచి జరుగుతున్నట్లుగా హిందూ పురాణాలు తెలియజేస్తున్నాయి. హోళి అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. ఈ హోళిని హోలికా పూర్ణిమ అని కూడా అంటారు. చిన్నాపెద్ద తేడా లేకుండా రంగుల పండగలో మునిగితేలుతారు. అందరిలో ఆనందాన్ని ఇచ్చే రంగుల పండుగ హోలీ.. నేడు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, రంగు నీటిని విసురుకుంటూ తమ మధ్య ఉన్న అనుబంధాన్ని సరికొత్తగా చెబుతారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు కలిసి ఆనందంగా రంగుల పండుగ చేసుకుంటారు. హోలీ అంటనే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ జోష్ వస్తుంది. మన ప్రియమైన వారిని అదే రంగుల్లో నింపడం లాంటివి చెస్తూ ఎంతో ఆనందంగా గడుపుతుంటాం. ఇలాంటి సమయంలో అందరిలో జోష్ నింపే పాటులు తోడైతే.. ఆ సంతోషం డబుల్ అవుతుంది. చాలా సినిమాల్లో హోలీ ఆధారంగా ఎన్నో పాటలు వచ్చాయి. వాటిలో కొన్ని పండుగ వైభవాన్ని చెబితే మరికొన్ని రంగుల జోష్‌ను నింపాయి. మీ ఇంట జరిగే హోలీకి ఈ పాటలను కూడా జత చేయండి. నాయకుడు: 1987లో మణిరత్నం దర్శకత్వంలో కమల్ హీరోగా వచ్చిన ‘నాయకుడు’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.. అందులో ‘సందెపొద్దు మేఘం పూలజల్లు కురిసెను నేడు’ అనే పాట ఎప్పటికీ ఎవర్గ్రీన్ అని చెప్పవచ్చు. రాఖీ: ఎన్టీఆర్, ఇలియానా జోడీగా నటించిన సినిమా రాఖీ. ఇందులో 'రంగు రబ్బా రబ్బా అంటోంది రంగ్ బర్సే' అంటూ హోలీ సాంగ్‌తో తారక్ దుమ్మురేపాడు. అందులో తన డ్యాన్స్‌తో హోలీ సంతోషాన్ని డబుల్ చేశాడు. ప్రతి హోలీ కార్యక్రమంలో ఈ పాట ఉండాల్సిందే. జెమిని: వెంకటేశ్- నమిత జోడీగా నటించి మెప్పించిన సినిమా ‘జెమిని’. ఈ చిత్రంలో ‘దిల్ దివానా.. మై హసీనా..’ పాట నేపథ్యం కూడా హోలీ పండుగ చుట్టే ఉంటుంది. 2017లో హోలీ పండగను మత సామరస్యాలకు అతీతంగా జరుపుకోవాలన్న సందేశాన్ని ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఒక పాటను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేసింది. అందులో విజయ్ దేవరకొండ నటిస్తే.. ఆ థీమ్‌ను వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేశారు. మాస్: నాగార్జున హీరోగా వచ్చిన మాస్ సినిమాలోని ‘రంగు తీసి కొట్టు’ సాంగ్ ఎవర్గ్రీన్ హోలీ పాటగా నిలిచింది. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ పాట సినిమాకే హైలెట్‌గా నిలిచింది. 2019లో మంగ్లీ హోలీ నేపథ్యంలో ఓ పాటను ఆలపించింది. ‘ఖతర్నాక్ కలర్ జల్లురా’ అనే సాగే ఈ పాటలో పల్లెల్లో హోలీని ఎంత సంతోషంగా జరుపుకుంటారో చక్కగా చూపించారు. రెండేళ్ల క్రితం హోలీ పండుగకు యాంకర్ వర్షిణీ ప్రత్యేకంగా రూపొందించిన సాంగ్‌లో తన డ్యాన్స్‌తో దుమ్మురేపింది. ఈ పాట ద్వారా మధుప్రియ తన గాత్రంతో ఆకట్టుకుంది. సిల్సిలా : బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ నటించిన 'సిల్సిలా' సినిమాలో రంగ్ బర్సే బీగీ చునర్వాలీ అనే పాట దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. ఈ పాటకు అప్పడు, ఇప్పుడు అనే తేడా ఉండదు. పాట వింటే చాలు డ్యాన్స్‌తో ఊగిపోతారు. -
HOLI 2024: జీవితం వర్ణమయం
మానవ జీవితం రంగుల మయం. ఆ మాటకొస్తే అసలీ ప్రపంచమే రంగులమయం. ఎందుకంటే మన జీవనవిధానమే రకరకాల రంగులతో మమేకమై ఉంది. ఇంద్రధనుస్సులో ఏడు రంగులు ఉంటే ప్రకృతిలో వేనవేల రంగులున్నాయి. ఈ ప్రకృతిలోని రంగులన్నీ జీవన తత్త్వాన్ని బోధిస్తాయి. ఆ రంగులతో చేసుకునే సంబరమే హోలీ. అందుకే హోలీని ఆలయాలలో కూడా ఒక వేడుకగా... ఉత్సవంగా నిర్వహిస్తారు. చిగురించే మోదుగులు. పూసే గురువిందలు. పరిమళించే మల్లెలు. మొగ్గలు తొడిగే మొల్లలు... రాలే పొగడ పుప్పొడి రేణువులు. చిందే గోగు తేనెలు. గుబాళించే గోరింట పూలు. ఎర్రని చివుళ్లతో మామిళ్లు... తెల్లని పూతాపుందెతో వేప చెట్లు... ఇందుకే కదా కవులు కీర్తించేది... వసంతాన్ని రుతువులకే రారాజని! మధుమాస వేళలో జరిగే వసంతోత్సవాన్ని భారతదేశమంతటా ఘనంగా జరుపుకుంటుంది. గతంలో రాజు, పేద, ధనిక, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఈ రంగునీళ్లను ఒకరిపై ఒకరు చల్లుకొని సంతోషించేవారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విశిష్ట సందర్భాన్ని పురస్కరించుకుని హోళీ జరుపుకుంటారు. ఫాల్గుణ మాసం పూర్ణిమనాడు జరుపుకునే పండుగ కనుక ఫాల్గుణోత్సవమని... వసంత రుతువును స్వాగతించే వేడుక కాబట్టి వసంతోత్సవమని పిలుచుకుంటాం. హోళీ పర్వదినం వెనుక చాలా పురాణ కథలు ఉన్నాయి. యోగనిష్ఠలో ఉన్న పరమేశ్వరుడికి తపోభంగం కలిగించమని దేవతలందరూ మన్మథుడిని కోరడంతో ఆయన శివుడి మీదకు తన పూలబాణాలను ప్రయోగిస్తాడు. ఆ బాణాల తాకిడికి ధ్యాన భంగం అయిన శివుడు ఆగ్రహంతో తన మూడో కంటిని తెరచి మన్మథుడిని మసి చేస్తాడు. మదనుడి భార్య రతీదేవి తనకు పతి భిక్ష పెట్టవలసిందిగా ప్రాధేయపడటంతో బోళా శంకరుడు కరిగిపోయి మన్మథుడు.. రతీదేవికి మాత్రమే శరీరంతో కనిపించేలా వరమిచ్చాడు. అలా మళ్లీ మన్మథుడు రతీదేవికి దక్కాడు. ఈ పండుగ జరుపుకోవడానికి ఈ కథ ఓ కారణమైందని విశ్వసిస్తారు. అన్నింటికీ మించి హోలీ పండుగ పుట్టుకకు మరో కథను చెబుతారు. శ్రీకృష్ణుడు నల్లనివాడు, రాధ మేలిమి బంగారం. ఓరోజున వారిద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని వనవిహారం చేస్తుండగా రాధ చేతిపక్కన ఉన్న తన చేయి నల్లగా ఉండటం చూసి దిగులు పడ్డాడట కృష్ణుడు. కన్నయ్య విచారానికి కారణం తెలుసుకున్న యశోదమ్మ ‘నాయనా! రాధమ్మ అసలు రంగు తెలియకుండా నువ్వు ఆమె ఒంటినిండా రంగులు కలిపిన నీళ్లు పోయి’ అని సలహా ఇచ్చిందట. అమ్మ మాట మేరకు నల్లనయ్య రాధమీద రంగునీళ్లు పోశాడట. ఈ హఠాత్పరిణామానికి విస్తుపోయిన రాధ తను కూడా కృష్ణుని మీద రంగులు కలిపిన నీరు చిలకరిస్తూ కృష్ణునికి అందకుండా ఉద్యానవనం నుంచి బయటకు పరుగులు తీసిందట. రాధాకృష్ణులిద్దరూ ఇలా ఒకరి మీద ఒకరు రంగునీళ్లు పోసుకోవడం చూసిన పురజనులు... ఆనందోత్సాహాలతో రంగుల పండుగ చేసుకున్నారట. ఆనాడు ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ. నాటినుంచి ప్రతి ఫాల్గుణ పున్నమినాడు ప్రజలందరూ ఒకరినొకరు రంగులతో ముంచెత్తుకోవడం, పెద్దఎత్తున పండుగలా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. పైన చెప్పుకున్న కథల నుంచి మనం గ్రహిం^è వలసినది ఏమిటంటే... మనందరమూ మనుషులమే కాబట్టి ఏదో ఒక లోపం ఉండితీరుతుంది. అలాంటి లోపాలను తీసుకు వచ్చే దుర్గుణాలను దూరం చేసుకోవడం అవసరం. అన్ని రంగులు ఉంటేనే.. ప్రకృతికి అందం. అందరిని కలుపుకుంటేనే మనసుకి అందం. అన్ని ఆలోచనలను పరిగణించి, చక్కని దారిన కలిసి నడిస్తేనే మనిషికి అందం. హోళీ రోజున ఒకరిపై ఒకరు చల్లుకునేవి రంగులు కావు. అనురాగ ఆప్యాయతలు కలసిన పన్నీటి పరిమళ జల్లులు. హోలీ పండుగను వసంత రుతువు వస్తోందనడానికి సంకేతంగా భావిస్తారు. వసంతకాలం అంటే చెట్లు చిగిర్చి పూలు పూసే కాలం కదా! అంటే మనలో ఉన్న దుర్గుణాలనే ఎండుటాకులను రాల్చేసి, వాటి స్థానంలో ఉల్లాసం, ఉత్సాహం, ప్రేమ, అనే సుగుణాలతో కూడిన ఆకులను చిగురింప చేసుకోవాలి. మన్మథుడు అంటే మనస్సును మథించేవాడని అర్థం. మనిషిలో దాగి ఉన్న కామక్రోధలోభమోహమదమాత్సర్యాలనే ఆరు అంతః శత్రువులు మనస్సును మథిస్తాయి. వాటినే అరిషడ్వర్గాలు అంటారు. మనిషిని పతనం చేసే ఈ ఆరుగుణాలనూ అదుపులో ఉంచుకోవాలని చెప్పేందుకే పరమేశ్వరుడు కామదేవుడిని భస్మం చేశాడు. రూపం కోల్పోయిన మన్మథుడు ఆనాటి నుంచి మనుషుల మనస్సులలో దాగి ఉండి అసలు పని నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకునేందుకే, ఈశ్వరుడు కాముణ్ణి భస్మం చేసిన రోజైన ఫాల్గుణ శుద్ధపూర్ణిమకు ముందురోజు, గ్రామాలలో కామదేవుని ప్రతిమను తయారుచేసి, ఊరేగింపుగా తీసుకెళతారు. యువకులంతా కలిసి కామదహనం చేస్తారు. ఇది ఆనవాయితీగా వస్తోంది. మన జీవితాలలో అనేక విధాలైన అలకలు, కినుకలు, అసంతృప్తులు, కోపాలు, తాపాలు, ఆవేశకావేశాలు, అలజడులు, అపశ్రుతులు, తడబాట్లు, ఎడబాట్లు ఉండొచ్చు. అందువల్ల ఈ హోళీ రోజు మనకు దగ్గరగా ఉన్న వారితోనే మాట, ఆట కాకుండా.... మనసుకు దగ్గర అయిన బంధు మిత్రులతో, మనవల్లో, వారి వల్లో ఏర్పడిన మానసిక దూరాన్ని తగ్గించుకుని, మనమే ముందుగా ఒక అడుగు వేసి అందరినీ దగ్గర చేసుకుని జీవితాలను వర్ణమయం... రాగ రంజితం చేసుకుందాం. హోలీ పర్వదినాన్ని అందరూ ఆప్యాయతతో కలిసే రంగుల రోజుగా మార్చుకుందాం. – డి.వి.ఆర్. భాస్కర్ -
ఉత్తరాఖండ్ సీఎం హోలీ డ్యాన్స్ - వీడియో
దేశంలో హోలీ సంబరాలు మొదలైపోయాయి. సాధారణ ప్రజల మాదిరిగానే.. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి 'పుష్కర్‌సింగ్ ధామి' కూడా తన కుటుంబ సభ్యులతో హోలీ జరుపుకున్నారు. తన తల్లి విష్ణదేవి, భార్య గీతా ధామితో కలిసి హోలీ పాటకు డ్యాన్స్ చేశారు. హోలీని ప్రేమ, సోదరభావం, సామరస్యానికి సంబంధించిన వేడుకగా సీఎం పుష్కర్‌సింగ్ ధామి అభివర్ణించారు. ఉత్తరాఖండ్‌లో హోలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉందని ఆయన అన్నారు. సీఎం ధామి హోలీ జరుపుకున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి హోలీ రేపు (మార్చి 25) జరగాల్సి ఉండగా.. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ప్రారంభించారు. పండుగ ముందు హోలికా దహన్ పేరుతో భోగి మంటలను వెలిగించే ఆచారం ఉంటుంది. ఇది హోలికా అనే రాక్షసిని దహనం చేసే కార్యక్రమం. ఆనందోత్సాహాల మధ్య, సాంప్రదాయ స్వీట్లు పంచుకుంటారు, ప్రజలలో స్నేహం, ఐక్యత భావాన్ని ఈ పండుగల ద్వారా పెంపొందించుకుంటారు. #WATCH | Dehradun | On the occasion of Holi, Uttarakhand Chief Minister Pushkar Singh Dhami dances to a Holi song with his mother Vishna Devi, wife Geeta Dhami and others. pic.twitter.com/p8JeSNSm8A — ANI UP/Uttarakhand (@ANINewsUP) March 24, 2024 -
ఈ పండుగ కొందరికి హోలీ అయితే.. మరి కొందరికి ‘హోలా మొహల్లా’..
ఏటా వసంతాగమన వేళ వచ్చే హోలీ హిందువులకు రంగుల పండుగ. సిక్కులకు మాత్రం ఇది రంగుల పండుగ మాత్రమే కాదు, వీరవిద్యల వేడుక కూడా. హోలీ నాటితో మొదలై మూడు రోజులు కొనసాగే ఈ వేడుకను ‘హోలా మొహల్లా’ అంటారు. సిక్కుల గురువు గురు గోబింద్ సింగ్ ఈ వేడుకను జరుపుకొనే ఆనవాయితీని ప్రారంభించారు. హోలీ వేడుకల్లో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడమే కాకుండా, ఆరుబయట మైదానాల్లోకి చేరి యువకులు సంప్రదాయ వీరవిద్యలను ప్రదర్శిస్తారు. జోడు గుర్రాల మీద నిలబడి స్వారీ చేయడం, గుర్రపు పందేలు, ఒంటెల పందేలు నిర్వహిస్తారు. ‘హోలా మొహల్లా’ అంటే ఉత్తుత్తి యుద్ధం అని అర్థం. ఈ వేడుకల్లో కత్తులు, బరిసెలతో ఉత్తుత్తి యుద్ధాల్లో పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. తొలిసారిగా ‘హోలా మొహల్లా’ వేడుకలు 1701లో ఆనంద్‌పూర్ సాహిబ్‌లో జరిగాయి. అదే సంప్రదాయ ప్రకారం ఇప్పటికి కూడా ఆనంద్‌పూర్ సాహిబ్‌లో ఈ వేడుకలు ఆర్భాటంగా జరుగుతాయి. పంజాబ్, హర్యానాలతో పాటు పాకిస్తాన్లో కూడా సిక్కులు ఈ వేడుకను సంప్రదాయబద్ధంగా జరుపుకొంటారు. ఉదయం వేళ రంగులు చల్లుకోవడం, వీరవిద్యా ప్రదర్శనలు, ఆయుధ ప్రదర్శనలు; సాయంత్రం వేళలో ఆధ్యాత్మిక సంకీర్తనలు, సంగీత నృత్య ప్రదర్శనలు, కవి సమ్మేళనాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. వేడుకల్లో పాల్గొనడానికి భారీ సంఖ్యలో వచ్చే జనాలకు సంప్రదాయక వంటకాలతో ఆరుబయట విందుభోజనాలను ఏర్పాటు చేస్తారు. ఇవి చదవండి: నాజూగ్గా ఉండే శిల్పాశెట్టి ఇంతలా ఫుడ్‌ని లాగించేస్తుందా..! -
Holi 2024: జాలీగా, హ్యాపీగా...ఇంట్రస్టింగ్ టిప్స్, అస్సలు మర్చిపోవద్దు!
పిల్లా పెద్దా అంతా సరదగా గడిపే రంగుల పండుగ హోలీ సమీపిస్తోంది. హోలీ రంగుల్లో తడిసి ముద్దవుతూ, స్నేహితులతో, బంధువులతో ఉత్సాహం గడుపుతారు. కానీ ఈ సంబరంలో కొన్ని జాగ్రత్తలు మర్చిపోకూడదు. ప్రతి సంవత్సరం, నిర్లక్ష్యం లేదా అవగాహన లేమి కారణం కంటి గాయాలకు గురవుతున్న అనేక సంఘటనలు జరుగుతాయి.అందుకే ఈ సేఫ్టీ టిప్స్ మీకోసం. మన ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని కాపాడుకోవాలంటే రసాయనమందులకు దూరంగా ఉండాలి. మార్కెట్లో విరివిగా లభించే రంగుల్లో హాని కారక రసాయనాలను గమనించాలి. వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లు, జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా చర్మం, కళ్లు సంరక్షణ చాలా అవసరం. చర్మపు సమసయలు, అలెర్జీలు, కంటి సమస్యలు , ముఖ్యంగా పిల్లలకు శ్వాసకోశ సమస్యలు వంటి అనేక సమస్యలకు దారితీస్తుంది. రసాయన రంగుల్లో సీసం, పాదరసం, క్రోమియం, కాడ్మియం , ఆస్బెస్టాస్ వంటి ప్రమాదకర రసాయనాలను కలిగి ఉంటాయి.ఇవి ఉబ్బసం, బ్రోన్కైటిస్ లాంటి వ్యాధులకుదారి తీయవచ్చు అందుకే ముందు జాగ్రత్త అవసరం. సహజరంగులకే ప్రాధాన్యత: ఇంట్లో తయారు చేసుకునే సేంద్రీయ, సహజ రంగులకేప్రాధాన్య ఇవ్వాలి. ఇలా చేయడం అనేక చర్మ సమస్యలు ఇరిటేషన్ ఇతర ప్రమాదాలనుంచి తప్పించుకోవచ్చు. పర్యావరణానికి ఎలాంటి ముప్పు జరగదు. పిల్లల్ని ఒక కంట: కంటి భద్రత , ప్రాముఖ్యత గురించి హోలీ ఆడటానికి వెళ్లే ముందే పిల్లలకు అవగాహన కల్పించాలి. ముఖ్యంగా చిన్నపిల్లల చెవుల్లో, ముక్కుల్లో, రంగు నీళ్లు, ఇతర నీళ్లు పోకుండా జాగ్రత్తపడాలి ఒకవేళ పోయినా వెంటనే పొడి గుడ్డతో శుభ్రం చేయాలి. ఎలా ఆడుకుంటున్నదీ ఒక కంట కనిపెడుతూ, వారి సేఫ్టీని పర్యవేక్షించాలి. లోషన్ లేదా నూనె : హోలీ ఆడటానికి వెళ్లే కొబ్బరి నూనెను లేదంటే కొబ్బరి, బాదం, ఆలివ్ నూనె లాంటి ఇతర సహజమైన నూనెను ముఖానికి, శరీరానికి, జుట్టుకు అప్లయ్ చేసుకోండి. పురుషులైతే, గడ్డం, జుట్టుకు బాగా నూనె రాయండి. అలాగే మాయిశ్చరైజర్‌ను మొత్తం బాడీకి అప్లయ్ చేసుకోవచ్చు. దుస్తులు: హోలీ రంగులు ముఖంతో పాటు మీ చేతులు, కాళ్ళ చర్మానికి హాని చేస్తాయి. ఫుల్ స్లీవ్ షర్ట్లు, కుర్తాలు ధరించాలి. నీళ్లలో జారి పడకుండే ఉండేందుకు షూ వేసుకుంటే మంచిది. కళ్లు,చర్మ రక్షణ: గులాల్, ఇతర రంగులు చర్మానికి అంటుకుని ఒక్క పట్టాన వదలవు. దీని స్కిన్కూడా పాడువుతుంది. అలా కాకుండా ఉండాలంటే హోలీ ఆడటానికి ఒక గంట ముందు సన్‌స్క్రీన్ రాసుకోవాలి. కళ్లల్లో పడకుండా అద్దాలు పెట్టుకోవడం అవసరం. సింథటిక్ రంగులు లేదా వాటర్ బెలూన్లలో ఉండే హానికరమైన రసాయనాలవల్ల కళ్లకు హాని. రంగులనుఎలా కడుక్కోవాలి: హోలీ ఆడిన తరువాత రంగులు వదిలించుకోవడం పెద్ద పని. సబ్బుతో లేదా ఫేస్ వాష్‌తో కడుక్కోవడం లాంటి పొరపాటు అస్సలు చేయొద్దు. రెండు మూడు రోజులలో హోలీ రంగులు క్రమంగా కనిపించకుండా పోతాయి నూనె పూసుకుని, సహజమైన సున్నిపిండితో నలుగు పెట్టుకోవచ్చు. స్నానం తరువాత బాడీలో రసాయన రహిత క్రీమ్స్, మాయిశ్చరైజర్ రాసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగడం: ఎండలో తిరగడం వల్ల పిల్లలు డీ హైడ్రేట్ అయిపోతారు. అందుకే నీళ్లు ఎక్కువ తాగాలి రంగు పొడులను పీల్చడం వల్ల తలెత్తే శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. నోట్ : ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఏదైనా అనుకోనిది జరిగితే తక్షణమే వైద్యులను సంప్రదించాలి. ఎలాంటి అవాంఛనీయ ప్రమాదాలు లేదా గాయాలు లేకుండా హోలీ వేడుక సంతోషంగా జరుపుకోవాలిన కోరుతూ హ్యాపీ హోలీ. -
ఢిల్లీ మెట్రోలో అమ్మాయిల పైత్యం : మండిపడుతున్న నెటిజన్లు
దేశవ్యాప్తంగా హోలీ వాతావరణం వచ్చేసింది. ఇప్పటికే పలు ప్రదేశాల్లో హోలీ సంబరాలు ఊపందు కున్నాయి. అయితే ఢిల్లీ మెట్రోలో చోటు చేసుకున్న ఘటన ఒకటి వివాదాన్ని రాజేసింది. ఇద్దరు అమ్మాయిలు అభ్యంతరకరంగా హోలీ ఆడటం విమర్శలకు తావిచ్చింది. విషయం ఏమిటంటే..దేశ రాజధాని నగరానికి తలమానికంగా పేరొందిన ఢిల్లీ మెట్రో ప్రతిసారీ ఏదో ఒక కారణంతో హెడ్ లైన్స్ లోకి వస్తుంది. అమ్మాయిలు పోల్ డ్యాన్స్, జంటల అశ్లీల వీడియోలు, రీళ్లు తయారు చేయడం, సెల్ఫీలతో వివాదాన్ని రేపడం పరిపాటిగా మారిపోయింది. దీనికి సంబంధించి డిఎంఆర్సి అనేక చట్టాలు చేసినా ప్రజలు పాటించడం లేదు తాజాగా ఢిల్లీ మెట్రోలో ఇద్దరు అమ్మాయిలు అసభ్యకరంగా హోలీ ఆడారు. వీరు తెల్లటి చీరలు సూట్లు ధరించి, నడుస్తున్న మెట్రోలో ఒకరికొకరు రంగులను పూసుకుంటూ హోలీ ఆడారు. డాన్స్ చేశారు. పవిత్ర హోలీని అవమనాపరుస్తూ, బాలీవుడ్ రొమాంటిక్ సాంగ్‌కు అభినయిస్తూ, ఒకర్ని ఒకరు తాకుతూ, మెట్రోలో బహిరంగంగా, అభ్యంతకరంగా ప్రవర్తించారంటూ యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు దీన్ని గమనించిన తోటి ప్రయాణీకులు రెచ్చగొట్టే విధంగా ఉందని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా యూజర్ ఒకరు దీన్ని ఎక్స్(ట్విటర్)లో షేర్ చేశారు. ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు, విమర్శలుగుప్పిస్తున్నారు.దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఇది సరైంది కాదు అంటూ విమర్శిస్తున్నారు. ఢిల్లీ మెట్రో కార్పొరేషన్లో చోటు చేసుకుంటున్న ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. We need a law against this asap pic.twitter.com/3qH1aom1Ml — Madhur Singh (@ThePlacardGuy) March 23, 2024 -
హోలీ 2024 : యూనివర్శిటీలో విద్యార్థుల హంగామా చూసి తీరాల్సిందే!
చండీగఢ్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయంలో వార్షిక హోలీ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. శుక్రవారం నిర్వహించిన ఈ ఈ కార్యక్రమం విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు హోలీ ఆడుతూ సందడి చేశారు. సరదాగా వాటర్ బెలూన్, తదితర ఆటపాటలతో విద్యార్థులంతా హోలీ వేడుకలను ఎంజాయ్ చేశారు. ఈవేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by '*·舞~ 𝕐άŜ𝓗Ɨ𝔰H ~舞*'¨¯ (@yashish023) అయితే ఈ సందర్బంగా క్యాంపస్‌లో భద్రతా తనిఖీలతో గందరగోళం ఏర్పడింది. అంతకుముందు విద్యార్థిపై బయటి వ్యక్తి దాడి చేసిన ఘటనలో విద్యార్థులు నిరసనకు దిగడంతో వేడుకలకు అంతరాయం ఏర్పడింది. నిందితుడు బాధితురాలికి క్షమాపణలు చెప్పినప్పటికీ విద్యార్థులు ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అయితే నిరసనకారులు చెదరగొట్టారు.దాడి కేసులో నిందితుడిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు.ఈ గందరగోళం హోలీ వేడుకల భద్రతా ఏర్పాట్లకు అంతరాయం కలిగించిందని పేరుచెప్పడానికి అంగీకరించని భద్రతా అధికారి ఒకరు వెల్లడించారని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. View this post on Instagram A post shared by Chandigarh (@the__chandigarh) -
హోలీ 2024: రంగుల్లో మునిగి తేలిన కుర్రకారు (ఫోటోలు)
-
ఈ గ్రామాల్లో హోలీ వేడుకలు ఎలా ఉంటాయంటే..?
తీర్థయాత్రలు చేస్తారు కొందరు. వర్ణయాత్రలు కొందరికి ఇష్టం. మన దేశంలో హోలి చాలా హుషారైన పండగ. బహుశా దీపావళి తర్వాత చిన్నా పెద్దా అందరూ కేరింతలతో పాల్గొనే పండగ ఇదే. రొటీన్ వితంలో రంగులను నింపుకోవడం బాగుంటుంది. అయితే కొందరికి ఇంట్లోనో, అపార్ట్మెంట్ ప్రాగణంలోనో, వీధిలో, ఏరియా చౌరస్తాలోనో ఆడే హోలీ పెద్దగా ఆనదు. వారికి భారీ హోలి వేడుక చూడాలనిపిస్తుంది. అలాంటి వారి కోసం హోలి డెస్టినేషన్స్ ఉన్నాయి. మన దేశంలో. ఈ హోలీకి వెళ్లగలిగితే వెళ్లండి. మధుర: ఉత్తరప్రదేశ్‌లోని మధురలో హోలి వేడుకలు చూడటం అంటే కృష్ణ రాధలు ఆడే హోలిని చూసినట్టే. ఇక్కడి బర్సానాలో స్త్రీలు గోపికల్లా, పురుషులు గోపబాలురలా అలంకరించుకుని హోలి ఆడతారు. రంగులు చల్లడానికి వచ్చిన గోపబాలురను స్త్రీలు సరదాగా బడితెలతో బాది దూరం తరుముతారు. అందుకే దీనిని ‘లాత్మార్ హోలి’ అంటారు. ఉదయ్‌పూర్: ఇక రాచరికస్థాయిలో హోలి చూడాలంటే రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు వెళ్లాలి. అక్కడి సిటీ ప్యాలెస్‌లో రాజ వంశీకుల హాజరీలో అద్భుతమైన హోలి వేడుకలు జరుగుతాయి. ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాజస్థానీ జానపద కళల ప్రదర్శన ఉంటుంది. టూరిస్ట్‌లు ఈ వేడుకలు చూడటానికి తెగబడతారు. బృందావన్: ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌కు వెళితే అక్కడి బన్కె బిహారి ఆలయంలో పూలు, రంగులు కలిపి చల్లుకుంటూ కోలాహలంగా హోలి నిర్వహిస్తారు. అందుకే దీనిని ‘ఫూల్వాలోంకి హోలి’ అంటారు. ఇక్కడ ఒకరోజు రెండు రోజులు కాదు... వారం రోజులపాటు హోలి వేడుకలు జరుగుతునే ఉంటాయి. చుట్టుపక్కల పల్లెలు రంగులతో తెల్లారి రంగులతో అస్తమిస్తాయి. ఈ అద్భుతమైన వేడుకలను చూడానికి టూరిస్ట్‌లు వస్తారు. హంపి: తుంగభద్ర నది ఒడ్డున రంగుల పండగ ఎలా ఉంటుందో చూడాలంటే హంపి వెళ్లాలి. ఇక్కడ హంపి సందర్భంగా భారీగా అలంకరించి నిర్వహించే రథయాత్ర చూడటానికి రెండు కళ్లూ చాలవు. ఈ సాంస్కృతిక క్షేత్రంలో హోలీ ఒక విచిత్ర భావన కలిగిస్తుంది. నగర ప్రజలు డోళ్లు మోగిస్తూ హోలి వేడుకల్లో విశేషంగా పాల్గొంటారు. విరూపాక్ష ఆలయం ఈ సందర్భంగా కళకళలాడిపోతుంది. దక్షిణాదివారు హోలీ సెలవు హంపిలో గడిపి ఆనందించవచ్చు. శాంతినికేతన్: పశ్చిమ బెంగాల్‌లోని శాంతినికేతన్లో హోలి అయితే నయనానందమూ శ్రవణానందమూ కూడా. ఎందుకంటే అక్కడ హోలి అంటే రంగులు చల్లుకోవడం మాత్రమే కాదు... నృత్యాలు, సంగీతం, కవిత్వం... అమ్మాయిలు అబ్బాయిలు కలిసి మనోహరంగా హోలి జరుపుకుంటారు. రవీంద్రనాథ్ ఠాగూర్ మొదలెట్టిన ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. ఇక్కడకు వెళ్లి హోలి చూసినవారి హృదయం కచ్చితంగా రంగులతో నిండిపోతుంది. ఆనంద్‌పూర్ సాహిబ్: పంజాబ్‌లోని ఈ ఊళ్లో హోలీ రంగులకు కళ్లు చెదురుతాయి. నిహాంగ్ సిక్కులు ఇక్కడ హోలి సమయంలో యుద్ధ విద్యలు ప్రదర్శిస్తారు. ఉత్తుత్తి పోరాటాలు ఇరు జట్ల మధ్య జరుగుతాయి. డోళ్లు తెగ మోగుతాయి. ఆట పాటల అట్టహాసం చూడతగ్గది. ఇవి చదవండి: పిచ్చుకా క్షేమమా..ఐ లవ్ స్పారోస్!! -
హోలీ రోజున అక్కడ దుస్తులు చించేసి..ఏకంగా తేళ్లతో..!
హోలీ అనగానే చిన్నా, పెద్దా రంగులు జల్లుకుంటూ ఎంజాయ్ చేస్తారు. మత పర భేదం లేకుండా అందరూ రంగులతో ఆనందహేళిలో మునిగి తేలుతుంటారు. అలాంటి హోలీని భారతదేశంలోని పలు రాష్ట్రల ప్రజలు విభిన్న సంప్రదాయాల్లో చేసుకుంటారు. అక్కడి ఆచారాలకు అనుగుణం చేసుకోవడం వరకు ఓకే. కానీ కొన్ని చోట్ల హోలీ పండుగా చాలా విచిత్రంగా జరుపుకుంటారు. ఎంతలా అంటే వామ్మో..! ఏంటిది..! అని విస్తుపోయాలా వింతగా జరుకుంటారు. అంత విలక్షణమైన సంప్రదాయాలు ఎక్కడున్నాయంటే.. రంగులు బదులు కర్రలతో.. ఉత్తరప్రదేశ్‌లోని బర్సానాలో హోలీ రోజున రంగులు చల్లుకోవడమే కాదు మహిళలు కర్రలతో పురుషులను వెంటపడి కొడతారు. స్త్రీలంతా కర్రలనే తమ ఆయుధాలుగా ధరించి ఎక్కడ పురుషులు కనిపించినా వారిని వెంబడించి మరీ కొడతారు. అయితే ఇది సరదాగా ఆడే సంప్రదాయమే. ఈ సంప్రదాయం శ్రీకృష్ణుడు గోపికల మధ్య జరిగిన కథకు గుర్తుగా జరుపుకుంటారు. ఆ రోజున బర్సానాలో చిన్న చిన్న యుద్ధ పోటీలు, పాటలు, నృత్యాలు, వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటారు. బూడిద జల్లుకుంటూ.. వారణాసిలో చితా భస్మా హోలీని నిర్వహిస్తారు. అక్కడ సాధువులు, అఘోరాలు... తమ భక్తులతో మణికర్ణిక ఘాట్ దగ్గర కలిసి చితి నుంచి వచ్చే బూడిదను తీసి హోలీగా ఆడతారు. వారణాసి అంటే మనం ముక్తి నగరంగా భావిస్తాం. అందుకు గుర్తుగా తమ శరీరాలపై ఈ చితా భస్మాన్ని పూసుకుంటారు. తద్వారా శివునికి తమ భక్తిని తెలియజేస్తారు. వీరంతా వీధుల్లో తిరుగుతూ శివనామస్మరణ చేస్తారు. నిజానికి శ్మశానేశ్వరుడైన శివుడు నిత్యం ఈ చితా భస్మాన్ని ఒంటికి పూసుకుంటాడు కాబట్టి తాము కూడా నీలోని వాళ్లమే, నీ బిడ్డలమే అని చెప్పేందుకు ఇలాంటి వింత ఆచారాన్ని అక్కడ వారణాసి ప్రజలు పాటిస్తారు. గంజాయితో హోలీ.. భాంగ్ అంటే గంజాయితో చేసిన పేస్టు. ఏంటీ గంజాయిని హోలీలోనా..! అని ఆశ్చర్యపోవద్దు. అయితే ఆరోజు ఇలా చేసినా.. పోలీసులు అరెస్ట్ చెయ్యరు. అందువల్లే దీన్ని హోలీ వేడుకల్లో భాగంగా అక్కడి ప్రజలు ధైర్యంగా ఉపయోగించి పండుగ జరుపుకుంటారు. అంతేగాదు ఆరోజు తయారు చేసిన పానీయాలు, ఆహారాలలోనూ కూడా ఈ పేస్టును వినియోగిస్తారు. గంజాయిపై నిషేధం ఉన్నప్పటికీ హోలీ సమయంలో మాత్రం దీన్ని చట్టబద్ధంగా వినియోగిస్తారు. భాంగ్ తయారీ అనేది అక్కడ ఒక కళగా చెప్పుకుంటారు. కుటుంబ వంటకాలలో దీన్ని భాగం చేసుకుంటారు. ఉత్తర ప్రదేశ్‌లోని చాలా చోట్ల హోలీ రోజున భాంగ్‌ను ఆహారంగా వాడతారు. తేళ్లతో హోలీ.. ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో సంతన అనే గ్రామం ఉంది. అక్కడ స్థానికులు హోలీ వచ్చిందంటే సాహసోపేతమైన సంప్రదాయాన్ని పాటిస్తారు. ఈ పవిత్రమైన రోజున బైసన్ దేవి ఆలయం కింద ఉన్న రాతి భూభాగంలో ఉన్న తేళ్ళను సేకరించి తమ శరీరాలపై పెట్టుకుంటారు. అయితే ఆ తేళ్లు తమని కుట్టమని ఆ గ్రామస్తుల నమ్మకం. దుస్తులు చించేసి.. మధుర సమీపంలో దౌజీ అనే గ్రామం ఉంది. ఇక్కడ మాత్రం హోలీ మరుసటి రోజు వేడుకలు నిర్వహించుకుంటారు. పురుషులు, స్త్రీలు రంగులు జల్లు కావడం తోపాటు స్త్రీలు, పురుషుల దుస్తులను చింపివేయడం వంటివి చేస్తారు. ఇది చాలా వేడుకగా జరుగుతుంది. (చదవండి: 'పఖాలా'తో వేసవి తాపం పరార్!) -
హోలీ..హోలీరే : నేచురల్ కలర్స్, గులాల్ తయారు చేసుకోండిలా!
#Holi 2024:హోలీ అంటేనే రంగుల పండుగ. చిన్నా పెద్దా అంతా రంగుల్లో మునిగి తేలే పండుగ. వసంతకాల వేడుక. పల్లె పట్నం అంతా ఎల్లలు దాటేలా సంబరాలు చేసుకుంటారు. చెడుపై మంచి విజయానికి చిహ్నంగా, రాధాకృష్ణుల ప్రేమకు ప్రతిరూపంగా ఆలయాలుముంగిళ్లు, వాకిళ్లు రంగులతో తడిసి మురిసే సంబరం. ఇంట్లోనే సహజంగా హోలీ రంగులు వసంతం ఆగమనానికి సూచిక హోలీ. ఒకప్పుడు ప్రకృతి ప్రసాదించిన పువ్వులు, ఆకులతో తయారుచేసుకున్న రంగులతో పండుగ జరుపుకునే వారు. కాలక్రమంలో హోలీ ప్రజాదరణ పెరిగింది. సహజ రంగుల స్థానాన్ని రసాయన ఆధారిత సింథటిక్ రంగులు ఆక్రమించేశాయి. సహజ రంగులతో పోలిస్తే చౌకగా ఉంటాయి, కానీ ఆరోగ్యానికి , పర్యావరణానికి హానికరమైనవి, చర్మానికి, ఆరోగ్యానికి మంచిదని కాదని తెలిసినా జాగ్రత్త పడటం లేదు. దీనికి తోడు సహజ రంగులను ఎలా తయారు చేసుకోవాలో తెలియక చాలామంది వీటిని వినియోగిస్తున్నారు. రానున్న హోలీ సందర్భంగా మార్కెట్లో లభించే అసహజ రంగులకు బదులుగా ఇంట్లోనే సహజ రంగులను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంట్లోనే పింక్ గులాల్ ఇలా పింక్ గులాల్ కోసం 1-2 మీడియం బీట్రూట్లను తీసుకోవాలి. వాటిని చక్కగాతురుముకోవాలి, దీన్ని ఒక కప్పు నీళ్లుపోసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఈ ద్రావణాన్ని వడకట్టుకోవాలి. దీనికి ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ కలుపుకోవచ్చు. దీనికి మొక్కజొన్న పిండి లేదా టాల్కమ్ పౌడర్ని కలుపుకోవచ్చు. పొడిగా కావాలనుకుంటే మైక్రోవేవ్‌లో వేడి చేయండి. దీన్ని బాగా కలపినా లేదా మళ్లీ గ్రైండ్ చేసినా పింక్ గులాల్ రడీ. రెడ్ కలర్ గులాల్ గులాల్ ను ఇంట్లో తయారు చేసుకోవాలంటే గులాబీ రేకులను తీసుకుని నీటిలో గంటసేపు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత కార్న్‌ఫ్లోర్ వేసి బాగా కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. పొడిగా కావాలంటే ఎండబెట్టండి లేదా మీరు మైక్రోవేవ్లోపుంచి డ్రైగా చేసుకోవచ్చు. ఎండబెట్టిన కొన్ని ఎరుపు మందార పువ్వులను తీసుకోండి. వాటిని మెత్తగా పొడి చేయండి. దీనికి కొద్దిగా బియ్యం పిండిని కలుపుకోవచ్చు. ఎర్ర చందనం కలిపిన నీళ్లు ఎర్ర రంగులోకి మారి భలే ఆకర్షణీయంగా ఉంటుంది. దానిమ్మ తొక్కలను నీటిలో ఉడకబెట్టి వాటర్ కలర్ వాడుకోవచ్చు.( కానీ ఈ నీళ్ళ మరకలు ఒక పట్టాన పోవు) పసుపు పసుపు పొడి ఇంట్లోనే పసుపు రంగును తయారు చేసకోవచ్చు. పసుపు రంగులో ఉండే శనగపిండి, పసుపు మిశ్రమంతో ఒక కలర్ సింపుల్‌గా రడీ అయిపోతుంది. దీని వల్ల ఎలాంటి నష్టం రాదు. పైగా పసుపు, శనగ పిండి సున్ని పిండిలాగా కూడా ఉపయోగపడుతుంది. వీటినే నీటిలో కలిపే తడి రంగును తయారు చేసుకోవచ్చు. అంతేకాదు పసుపు బంతి పువ్వులను తీసుకొని నీటిలో మరగించినా చక్కటి కలర్ వస్తుంది. గ్రీన్ కలర్: ఇంట్లో చాలా సులభంగా లభించే గోరింటాకు పొడితో గ్రీన్ కలర్ తయారు చేసుకోవచ్చు. అప్పుటి కప్పుడు కడిగేసుకుంటాం కాబట్టి పెద్దగా పండదు. అలాగే ఎండ బెట్టిన గోరింట పొడిని నీటిలో కలపి ఈ వాటర్‌ను వాడుకోవచ్చు. ఇంకా పుదీనీ, బచ్చలికూర లాంటి ఆకుకూరలు వేప, తులసి లాంటి ఆకులను నీటిలో ఉడకబెట్టడం ద్వారా కూడా ఆకుపచ్చ రంగును తయారు చేసుకోవచ్చు. మెరూన్ మెరూన్, లేదా లేత పర్పుల్ రంగును సులభంగా తయారు చేయడానికి బీట్రూట్ రసాన్ని మించింది లేదు. బీట్రూట్ను మెత్తగా దంచుకొని, లేదా మిక్సీలో వేసి ఆ ముద్దను నీటిని రాత్రంతా నానబెట్టండి. దీన్ని చక్కగా వడకట్టుకొని వాడుకోవచ్చు. బ్లూ కలర్: అపరాజిత నీలి రంగు మందారం రేకుల నుండి ఇంట్లోనే చాలా సులభంగా బ్లూ కలర్ తయారు చేసుకోవచ్చు. అంతేకాదు నీలి రంగు అపరాజిత లేధా శంఖం పువ్వులు కూడా బ్లూ కలర్‌కి బాగా ఉపయోగపడతాయి. పూల రేకులను ఎండబెట్టి, దాని నుండి పొడిని తయారు చేయండి. పొడిలో కాస్త బియ్యం పిండిని కలుపుకోవచ్చు. ఈ పూలను నీళ్లలో నానబెట్టి, ఆ నీళ్లను కూడా వాడుకోవచ్చు. ఆరెంజ్: ఎండిన నారింజ తొక్కలను ఉపయోగించి నిమిషాల్లో ఆరెంజ్రంగును తయారు చేయవచ్చు. తొక్కల్ని ఎండబెట్టి మెత్తని పొడిలా చేసుకోవాలి. తర్వాత మొక్కజొన్న పిండి, కొద్దిగా పసుపు వేసి బాగా కలపాలి. నోట్: వీటితోపాటు, మీకు తెలిసిన, మీ అమ్మమ్మ, బామ్మలను అడిగి తెలుసుకుని మరీ అనేక సహజ రంగులకు తయారు చేసుకోవచ్చు. సహజ రంగులనే వాడదాం. మన ఆరోగ్యాన్ని , ప్రకృతిని కాపాడుకుందాం!! -
హోలీ, రంగుల కేళి : ఇక్కడ పండుగ సంబరాల లెవలే వేరు!
#Holi2024హోలీ పండుగ అంటేనే ఉత్సాహభరితమైన పండుగ. 'రంగుల పండుగ'. చిన్నా పెద్దా అంతా దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకునే పండుగల్లో హోలీ కూడా. వసంతం రాకను తెలియ చెప్పే పండుగ. చెడుపై మంచి విజయానికి సూచిక. ఈ ఏడాది మార్చి 25, సోమవారం హోలీ జరుపుకుంటాం. అసలు హోలీ అంటే ఇలా ఉండాలి అనేలా జరుపుకునే ప్రదేశాల గురించి మీకు తెలుసా? హోలి అంటే వివిధ రకాల రంగులు, చక్కటి సంగీతం, కుటుంబం , స్నేహితులతో మంచి సమయం గడపటం, చక్కటి స్వీట్లు. ప్రతీ రెండు రోజుల వేడుకల కోసం సన్నాహాలు వారాల ముందుగానే షురూ అయిపోతాయి. రంగుల పొడులు (గులాల్), వాటర్ గన్లు , స్వీట్లను కొనుగోలు చేసే వ్యక్తులతో మార్కెట్లు నిండిపోతాయి. రాధా కృష్ణుల దైవిక ప్రేమకు గుర్తుగా జరుపుకోవడం ఒక ఆనవాయితీ. మన దేశంలోని కొన్ని చోట్ల అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఉత్తర్ ప్రదేశ్: యూపీ,మథురలోని బర్సానా లత్మార్ హోలీకి ప్రసిద్ధి చెందింది, ఇక్కడ ఈ హోలీ వేడుకలు ఏటా ప్రతిష్ఠాత్మకంగా జరుపుకుంటారు. స్త్రీలు సంప్రదాయబద్ధంగా గోపికల వేషధారణతోనూ, పురుషులు గో పురుషులుగానూ మారి పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. మథురలోని రాధా కృష్ణుల ఆలయాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతారు. భజనలు, సంకీర్తనలతో వీధులన్నీ మార్మోగుతుంటాయి. స్థానికులు మాత్రమే కాదు, విదేశీయులు కూడా హోలీ వేడుకలతో సందడి చేయడం విశేషం. బృందావన్: ఇక్కడ హోలీ వేడుక వారం రోజుల పాటు సాగుతుంది. పువ్వులు, రంగులతో హోలీని ఆడతారు. బృందావన్‌లోని బాంకీ బిహారీ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ హోలీ అనేది ఒకరోజు కార్యక్రమం కాదు. రంగుల్లో మునిగి తేలడంతోపాటు,పురాణ ఇతిహాసాలు, స్థానిక జానపద కథల ప్రస్తావనలతో వారం పాటు వేడుక కొనసాగుతుంది. శాంతినికేతన్: పశ్చిమ బెంగాల్, బోల్పూర్లో ఉన్న శాంతినికేతన్ హోలీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఇక్కడ దీనిని బసంత ఉత్సవ్ అని కూడా పిలుస్తారు. రవీద్ర భారతి యూనివర్శిటీలో నోబెల్ గ్రహీత రవీద్రనాథ్ ఠాగూర్ ఈ పండుగను నిర్వహించడం మొదలెట్టారట. ఈ ప్రేరణతోనే సాధారణ వేడుకలతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఉంటాయి. పంజాబ్: పంజాబ్‌లో హోలీ పండుగను హోలా మొహల్లాగా జరుపుకుంటారు. 'హోలా-మొహల్లా' అంటే 'యుద్ధ-నైపుణ్యాల సాధన' అని అర్థం. అందుకే హోలీ వేడుకలో కత్తులతో విన్యాసాలు, మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలు, నిహాంగ్ సిక్కులు ఉత్సాహంగా జరుపుకుంటారు. హోలీని పౌరుషానికి ప్రతీకగా, ధైర్యవంతుల హోలీగా వేడుక చేసుకుంటారు. ఉదయపూర్, రాజస్థాన్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోనూ హోలీ వేడుకలకు పెట్టింది పేరు. అక్కడ ఉండే మేవార్ రాజ వంశస్థులు ఈ పండుగను హోలికా దహన్ కార్యక్రమంతో ప్రారంభిస్తారు. రాజస్థాన్‌లోని పుష్కర్‌లో కూడా హోలీ వేడుకలు ఎంతో ప్రత్యేకంగా నిర్వహిస్తారు. రంగులు చల్లుకుంటూ సంతోషంగా గడుపుతారు, సంప్రదాయ నృత్య ప్రదర్శనలతో ఉత్సాహంగా హోలిని జరుపుకుంటారు. కాగా దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబై నగరాల్లో కూడా హోలీ వేడుకలు ఘనంగా జరుగుతాయి. అటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా తెలంగాణాలో చిన్నా, పెద్ద అంతా,ముఖ్యంగా యువత ఈ రంగుల హోలీని బాగా ఎంజాయ్ చేస్తారు.