
సాక్షి, గుంటూరు: హోలీ పండుగ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మన జీవితాల్లో సంతోషాన్ని వికసించే వసంత రుతువుకు స్వాగతం పలుకుతూ.. రంగుల హోలీ అందరికీ ఆనందాన్ని పంచాలని కోరుకుంటున్నా’ అని తన సందేశంలో పేర్కొన్నారాయన. అదే సమయంలో..
‘చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక హోలీ. ప్రజల జీవితాల్లో ఈ పండుగ సుఖసంతోషాలను నింపాలని కోరుకుంటున్నాను. అందరికీ హోలీ శుభాకాంక్షలు’ అంటూ ఎక్స్ ఖాతాలోనూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక హోలీ. ప్రజల జీవితాల్లో ఈ పండుగ సుఖసంతోషాలను నింపాలని కోరుకుంటున్నాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 25, 2024
అందరికీ హోలీ శుభాకాంక్షలు.
Comments
Please login to add a commentAdd a comment