Holi 2024: జాలీగా, హ్యాపీగా...ఇంట్రస్టింగ్‌ టిప్స్‌, అస్సలు మర్చిపోవద్దు! | Holi 2024 Essential Precautions For A Colorful Festival, Know Details Inside - Sakshi
Sakshi News home page

Holi Festival 2024: జాలీగా, హ్యాపీగా హోలీ : ఇంట్రస్టింగ్‌ టిప్స్‌, అస్సలు మర్చిపోవద్దు!

Published Sat, Mar 23 2024 5:42 PM | Last Updated on Mon, Mar 25 2024 11:02 AM

Holi 2024 Essential Precautions for a Colorful Festival - Sakshi

పిల్లా పెద్దా అంతా సరదగా గడిపే  రంగుల పండుగ హోలీ సమీపిస్తోంది. హోలీ రంగుల్లో తడిసి ముద్దవుతూ, స్నేహితులతో, బంధువులతో ఉత్సాహం గడుపుతారు. కానీ ఈ సంబరంలో కొన్ని జాగ్రత్తలు మర్చిపో​కూడదు. ప్రతి సంవత్సరం, నిర్లక్ష్యం లేదా అవగాహన లేమి కారణం కంటి గాయాలకు గురవుతున్న అనేక సంఘటనలు జరుగుతాయి.అందుకే ఈ సేఫ్టీ టిప్స్‌ మీకోసం.

మన ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని కాపాడుకోవాలంటే రసాయనమందులకు దూరంగా ఉండాలి. మార్కెట్‌లో  విరివిగా లభించే రంగుల్లో హాని కారక రసాయనాలను గమనించాలి. వాటి వల్ల వచ్చే సైడ్‌ ఎఫెక్ట్‌లు, జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా చర్మం, కళ్లు సంరక్షణ చాలా అవసరం. చర్మపు సమసయలు, అలెర్జీలు, కంటి సమస్యలు , ముఖ్యంగా పిల్లలకు శ్వాసకోశ సమస్యలు వంటి అనేక సమస్యలకు దారితీస్తుంది.  రసాయన రంగుల్లో సీసం, పాదరసం, క్రోమియం, కాడ్మియం , ఆస్బెస్టాస్ వంటి ప్రమాదకర రసాయనాలను కలిగి ఉంటాయి.ఇవి ఉబ్బసం, బ్రోన్కైటిస్ లాంటి వ్యాధులకుదారి తీయవచ్చు అందుకే ముందు జాగ్రత్త అవసరం.

సహజరంగులకే ప్రాధాన్యత: ఇంట్లో తయారు చేసుకునే సేంద్రీయ, సహజ రంగులకేప్రాధాన్య ఇవ్వాలి. ఇలా చేయడం అనేక  చర్మ సమస్యలు  ఇరిటేషన్‌ ఇతర ప్రమాదాలనుంచి తప్పించుకోవచ్చు.  పర్యావరణానికి ఎలాంటి ముప్పు జరగదు.

పిల్లల్ని ఒక కంట:  కంటి భద్రత , ప్రాముఖ్యత గురించి హోలీ ఆడటానికి వెళ్లే ముందే  పిల్లలకు  అవగాహన కల్పించాలి. ముఖ్యంగా చిన్నపిల్లల చెవుల్లో, ముక్కుల్లో, రంగు నీళ్లు, ఇతర నీళ్లు పోకుండా జాగ్రత్తపడాలి ఒకవేళ పోయినా వెంటనే పొడి గుడ్డతో శుభ్రం చేయాలి. ఎలా ఆడుకుంటున్నదీ ఒక కంట కనిపెడుతూ, వారి సేఫ్టీని పర్యవేక్షించాలి.


 
లోషన్‌ లేదా నూనె  : హోలీ ఆడటానికి వెళ్లే కొబ్బరి నూనెను లేదంటే కొబ్బరి, బాదం, ఆలివ్ నూనె లాంటి ఇతర సహజమైన నూనెను ముఖానికి, శరీరానికి, జుట్టుకు అప్లయ్‌ చేసుకోండి.  పురుషులైతే, గడ్డం, జుట్టుకు బాగా నూనె రాయండి. అలాగే  మాయిశ్చరైజర్‌ను  మొత్తం బాడీకి అప్లయ్ చేసుకోవచ్చు.

దుస్తులు: హోలీ రంగులు  ముఖంతో పాటు మీ చేతులు, కాళ్ళ చర్మానికి హాని చేస్తాయి. ఫుల్ స్లీవ్ షర్ట్‌లు, కుర్తాలు ధరించాలి.  నీళ్లలో జారి పడకుండే ఉండేందుకు షూ వేసుకుంటే మంచిది.  

కళ్లు,చర్మ రక్షణ: గులాల్‌, ఇతర రంగులు చర్మానికి అంటుకుని ఒక్క పట్టాన వదలవు. దీని స్కిన్‌కూడా పాడువుతుంది. అలా కాకుండా ఉండాలంటే హోలీ ఆడటానికి ఒక గంట ముందు సన్‌స్క్రీన్ రాసుకోవాలి.  కళ్లల్లో పడకుండా  అద్దాలు పెట్టుకోవడం అవసరం. సింథటిక్ రంగులు లేదా వాటర్ బెలూన్‌లలో ఉండే హానికరమైన రసాయనాలవల్ల కళ్లకు హాని.

రంగులనుఎలా కడుక్కోవాలి: హోలీ ఆడిన తరువాత రంగులు వదిలించుకోవడం పెద్ద పని. సబ్బుతో లేదా ఫేస్ వాష్‌తో కడుక్కోవడం లాంటి పొరపాటు అస్సలు చేయొద్దు. రెండు మూడు రోజులలో హోలీ రంగులు క్రమంగా కనిపించకుండా పోతాయి నూనె పూసుకుని, సహజమైన సున్నిపిండితో నలుగు పెట్టుకోవచ్చు. స్నానం తరువాత బాడీలో రసాయన రహిత క్రీమ్స్‌, మాయిశ్చరైజర్ రాసుకోవాలి.

నీళ్లు ఎక్కువగా తాగడం: ఎండలో తిరగడం వల్ల పిల్లలు డీ హైడ్రేట్‌ అయిపోతారు. అందుకే  నీళ్లు ఎక్కువ తాగాలి  రంగు పొడులను పీల్చడం వల్ల తలెత్తే  శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

నోట్‌ : ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఏదైనా అనుకోనిది జరిగితే తక్షణమే వైద్యులను సంప్రదించాలి.  ఎలాంటి అవాంఛనీయ ప్రమాదాలు లేదా గాయాలు లేకుండా హోలీ వేడుక సంతోషంగా జరుపుకోవాలిన కోరుతూ హ్యాపీ హోలీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement