![IPL 2024: Cricketers In Holi Celebrations - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/25/Untitled-8.jpg.webp?itok=QEi3LFCH)
ఫైల్ ఫోటో
హోలీ పర్వదినాన ఐపీఎల్ క్రికెటర్లు రంగుల సంబురాల్లో మునిగి తేలారు. ఇవాళ ఉదయం నుంచి చాలా మంది క్రికెటర్లు ఉత్సాహంగా హోలీ సంబురాలు చేసుకున్నారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ సహచరులతో కలిసి రంగుల పూసుకుని నీటితో సంబురాలు చేసుకోగా, మరో ముంబై ఇండియన్ సూర్యకుమార్ యాదవ్ తన శ్రీమతితో కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.
Rohit Sharma celebrating Holi with his family & MI team mates. ⭐https://t.co/Kc645b7DOV
— Johns. (@CricCrazyJohns) March 25, 2024
The Hitman Rohit Sharma celebrating Holi. pic.twitter.com/kHaTPPQANf
— CricketMAN2 (@ImTanujSingh) March 25, 2024
Gautam Gambhir and Shreyas Iyer celebrating Holi. pic.twitter.com/dWnjdSiOaz
— CricketMAN2 (@ImTanujSingh) March 25, 2024
కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఆ జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ ముఖానికి రంగులు పూసుకుని ఫోటోలకు పోజులివ్వగా.. ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు పృథ్వీ షా ముఖం నిండా రంగులు పూసుకుని తన ఐపీఎల్ సహచరులతో కలిసి సెల్ఫీ దిగాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ డ్వేన్ బ్రావో నగరంలో జరిగిన హోలీ సంబురాల్లో పాల్గొని తన ఆటపాటలతో అభిమానులను అలరించాడు.
Captain Shreyas Iyer and KKR players celebrating Holi.pic.twitter.com/L5WldKccF3
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 25, 2024
Delhi Capitals' players celebrating Holi. pic.twitter.com/lqRn9RvLAe
— CricketMAN2 (@ImTanujSingh) March 25, 2024
VIRAT KOHLI RETURNS AT CHINNASWAMY TODAY.
— CricketMAN2 (@ImTanujSingh) March 25, 2024
- The GOAT is Ready to Roar..!!!! 🐐 pic.twitter.com/xpHsedcuzD
ఐపీఎల్ కామెంటేటర్లు స్టీవ్ స్మిత్, స్టువర్ట్ బ్రాడ్ భారత సంప్రదాయ దుస్తులు ధరించి హోలీ సంబురాలు చేసుకుంటూ ఫోటోలకు పోజులిచ్చారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో తరహాలో హోలీ సంబురాలు చేసుకోగా.. ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి మాత్రం ప్రాక్టీస్‌లో మునిగి తేలాడు.
Suryakumar Yadav with his wife celebrating Holi. pic.twitter.com/46ltjxTnBG
— CricketMAN2 (@ImTanujSingh) March 25, 2024
Dwayne Bravo at the Holi Celebrations in Chennai. ❤️pic.twitter.com/27PWVB0rwj
— CricketMAN2 (@ImTanujSingh) March 25, 2024
ఆర్సీబీకి ఇవాళ మ్యాచ్ ఉండటంతో కోహ్లి హోలీ సంబురాలు చేసుకున్నట్లు లేడు. ఆర్సీబీ తమ హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. పంజాబ్ తమ తొలి మ్యాచ్‌లో ఢిల్లీను ఓడించి బోణీ విజయం సొంతం చేసుకోగా.. తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే చేతిలో ఓడిన ఆర్సీబీ ఖాతా తెరవాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment