
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో (ICC ODI Rankings) భారత బ్యాటర్ల హవా కొనసాగింది. టాప్-10లో ఏకంగా నలుగురు భారత బ్యాటర్లు చోటు దక్కించుకున్నారు. శుభ్‌మన్ గిల్ (Shubman Gill) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. రోహిత్ (Rohit Sharma) మూడు, విరాట్ (virat Kohli) ఐదు, శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తొమ్మిది స్థానాల్లో ఉన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్‌పై సెంచరీ చేయడంతో విరాట్ ఓ స్థానాన్ని మెరుగుపర్చుకుని ఐదో స్థానానికి చేరాడు.
తాజా ర్యాంకింగ్స్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ సెంచరీ హీరోలు గణనీయంగా లబ్ది పొందారు. విల్ యంగ్ 8 స్థానాలు మెరుగుపర్చుకుని 14వ స్థానానికి.. బెన్ డకెట్ 27 స్థానాలు మెరుగుపర్చుకుని 17వ స్థానానికి.. రచిన్ రవీంద్ర 18 స్థానాలు మెరుగుపర్చుకుని 24వ స్థానానికి.. టామ్ లాథమ్ 11 స్థానాలు మెరుగుపర్చుకుని 31వ స్థానానికి.. జోస్ ఇంగ్లిస్ 18 స్థానాలు మెరుగుపర్చుకుని 88వ స్థానానికి చేరారు.
టాప్-10లో భారత బ్యాటర్లతో పాటు బాబర్ ఆజమ్ (2), హెన్రిచ్ క్లాసెన్ (4), డారిల్ మిచెల్ (6), హ్యారీ టెక్టార్ (7), చరిత్ అసలంక (8), షాయ్ హోప్ (10) ఉన్నారు.
బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టాప్-10లో కుల్దీప్ (3వ స్థానం) మినహా భారత్‌కు ప్రాతినిథ్యం లేదు. లంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ టాప్‌లో కొనసాగుతుండగా.. రషీద్ ఖాన్ రెండో స్థానంలో ఉన్నాడు. కేశవ్ మహారాజ్, బెర్నాల్డ్ స్కోల్జ్, మ్యాట్ హెన్రీ, మిచెల్ సాంట్నర్, గుడకేశ్ మోటీ, షాహీన్ అఫ్రిది, ఆడమ్ జంపా టాప్-10లో ఉన్నారు.
ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టాప్-10లో ఎలాంటి మార్పులు లేవు. మొహమ్మద్ నబీ, సికందర్ రజా, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, మెహిది హసన్ మిరాజ్, రషీద్ ఖాన్, మిచెల్ సాంట్నర్, మ్యాక్స్‌వెల్, బ్రాండన్ మెక్‌ముల్లెన్, రవీంద్ర జడేజా, గెర్హార్డ్ ఎరాస్మస్ టాప్-10లో కొనసాగుతున్నారు. ఈ వారం ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో ఒకే ఒక చెప్పుకోదగ్గ మార్పు జరిగింది. న్యూజిలాండ్ ఆటగాడు మైఖేల్ బ్రేస్‌వెల్ ఏకంగా 26 స్థానాలు మెరుగుపర్చుకుని 11వ స్థానానికి చేరాడు.
జట్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా ఎవరికీ అందనంత ఎత్తులో టాప్ ప్లేస్‌లో కొనసాగుతుంది. ఆసీస్, పాకిస్తాన్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, వెస్టిండీస్ ఆతర్వాతి స్థానాల్లో నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment