హోలీ పండుగ అంటే అందరీ సదరాగానే ఉంటుంది. పెద్దవాళ్లను సైతం చిన్నవాళ్లలా చిందులేసి ఆడేలా చేసే పండుగ ఇది. అయితే ఈ రోజు జల్లుకునే రకరకాల రంగుల వల్ల చర్మం ప్రభావితం కావొచ్చు. కొందరికి ఈ రంగులు రియాక్షన్ ఇస్తాయి. ర్యాషస్ వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు. ఈ చక్కటి రంగులకేళిని ఆనందమయంగా జరుపుకునేలా మీ చర్మ సంరక్షణ కోసం ఈ చిన్న చిట్కాలు పాటించండి.
చక్కగా రంగులు జల్లుకుని ఎంజాయ్ చేసాక అసలైన సమస్య మొదలవ్వుతుంది. ముఖానికి రాసిన రంగులు ఓ పట్టాన పోక ఏం చేయాలో తోచక ఏడుపొచ్చేస్తుంది. అలాంటప్పడూ ఈ సింపుల్ చిట్కాలతో సమస్య నుంచి సులువుగా బయటపడండి. అవేంటంటే..
- ముఖానికి ఆయిల్‌ని అప్లై చేస్తే సులభంగా రంగులు ముఖం నుచి పోయే అవకాశం ఉంటుంది.
- అలాగే ముఖం క్లీన్ అయ్యాక కొన్ని గంటల వరకు ఏమి రాయకుండా ఫ్రీగా వదిలేయండి. అప్పుడు ముఖంపై రంధ్రాలు ఓపెన్ అయ్యి క్లీన్ అయ్యే అవకాశం ఉటుంది. హోలీ రంగులు రియాక్షన్ ఇచ్చే అవకాశం కూడా ఉండదు.
- హోలీ ఆడిన వెంటనే నేరుగా తలస్నానం అస్సలు చెయ్యొద్దు. ముందుగా రంగులు మీ చర్మం నుంచి పూర్తిగా పోయేలా చేయడం అనేది ముఖ్యం. అందుకోసం కొబ్బరి నూనె వంటి వాటితో క్లీన్ చేయండి. ఇది రంగుల నుంచి చర్మం ప్రభావితం కాకుండా చేయగలదు.
- అలాగే ముఖం ఆ రోజు కాస్త తేమగా ఉండేలా మంచి మాయిశ్చరైజర్‌ని అప్లై చేయండి. ఇలా చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవు. పైగా సులభంగా రంగులు వచ్చేస్తాయి.
(చదవండి: జాలీగా, హ్యాపీగా హోలీ : ఇంట్రస్టింగ్ టిప్స్, అస్సలు మర్చిపోవద్దు!)
Comments
Please login to add a commentAdd a comment