![Skin Care Tips: Find The Right Face Packs For Your Needs](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/face.jpg.webp?itok=1IacvO7E)
ఇంట్లో మనం అనునిత్యం ఉపయోగించేవే చక్కటి సౌందర్య సాధనాలుగా పనికొస్తాయి. వాటితో చక్కటి మెరిసే చర్మాన్ని పొందొచ్చు కూడా. అయితే ఎలాంటి చర్మం కలవారికి ఏది బెటర్ అనేది చాలామంది సరైన అవగాహన ఉండదు. అలాంటివారు సౌందర్య నిపుణులు చెబుతున్న ఈ చిట్కాలు ఫాలో అయితే సరి. మరి అవేంటో చూద్దామా..!..
పాది ద్రాక్షపండ్లు, ఒక నిమ్మకాయ, ఒక కోడిగుడ్డు తీసుకోవాలి. ద్రాక్షపండ్లను, నిమ్మ రసాన్ని, కోడిగుడ్డు తెల్లసొనను బ్లెండ్ చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఇది జిడ్డు చర్మానికి వేయాల్సిన ప్యాక్. నిమ్మరసం నేచురల్ క్లెన్సర్. ఇది చర్మాన్ని శుభ్రం చేస్తుంది. ద్రాక్షరసం మృదుత్వాన్నిస్తుంది, కోడిగుడ్డు తెల్లసొన చర్మాన్ని వదులు కానీయకుండా రక్షిస్తుంది. దీనిని పొడి చర్మానికి కాని నార్మల్ స్కిన్‌కు కాని వాడితే మరింత పొడిబారే అవకాశం ఉంది.
రకరకాల పండ్లను, సౌందర్య సాధనాలను కలిపి ప్యాక్ తయారు చేసుకోవడానికి సమయం, సహనం లేనప్పుడు నిమ్మకాయను సగానికి కోసి ఒక చెక్కతో ముఖాన్నంతటినీ రుద్ది పదిహేను నిమిషాల సేపు అలాగే ఉంచి తర్వాత చన్నీటితో శుభ్రంచేయాలి. ఇది జిడ్డును తొలగించి ముఖాన్ని తాజాగా ఉంచుతుంది. ఇది కూడా పొడి చర్మానికి పనికిరాదు.
ఒక టీ స్పూన్ తేనెలో అంతే మోతాదులో పాలు కలిపి ముఖానికి అప్లయ్ చేసి పది నిమిషాల సేపటికి కడగాలి. రెండు రోజులకొకసారి ఇలా చేస్తుంటే చర్మం కాంతివంతంగా ఉంటుంది.
డ్రైస్కిన్ అయితే... ఒక టీ స్పూన్ తేనె, అంతే మోతాదులో నిమ్మరసం, వెజిటబుల్ ఆయిల్‌లను బాగా కలిపి ప్యాక్ వేసి పది నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. కొబ్బరి, వేరుశనగ, నువ్వులు, సన్‌ఫ్లవర్, సోయా... ఇలా ఏదైనా సరే... అందుబాటులో ఉన్న ఆయిల్ వాడవచ్చు.
(చదవండి: కడవల కొద్దీ కన్నీళ్లు వచ్చేస్తాయ్..! సమస్యను బయటపెట్టిన ప్రియాంక చోప్రా
Comments
Please login to add a commentAdd a comment