Face packs
-
చర్మం మృదువుగా కోమలంగా ఉండాలంటే..!
పొడి చర్మం గలవారు ఏ ఫేస్ ప్యాక్ పడితే అది వేసుకోవడం మంచిది కాదు. అందులోనూ వాళ్ల చర్మం డ్రైగా అయిపోయి, ర్యాషస్ ఈజీగా వచ్చేస్తాయి. అలాంటి వారు చర్మాన్ని తేమగా ఉంచి మృదువుగా చేసే ఫేస్ ప్యాక్‌లు ఎంచుకోవాల్సి ఉంటుంది. వీళ్లు ఆయిల్‌తో కూడిన ప్యాక్‌లు ఉపయోగిస్తే చర్మం కోమలంగా మెరుస్తూ ఉంటుంది. అందుకోసం హెల్ప్ అయ్యే బెస్ట్ ఫేస్ ప్యాక్‌లు ఏంటో చూద్దామా..!.పూలలోని పుప్పొడి, నల్లనువ్వులు, బార్లీ గింజలు సమపాళ్లలో తీసుకొని, పొడి చేసి, ఒక డబ్బాలో భద్రపరుచుకోవాలి. ఈ పొడిని కావల్సినంత తీసుకొని, తగినన్ని నీళ్లు కలిపి, ముఖానికి, శరీరానికి పట్టించాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల పొడిబారిన చర్మం మృదువుగా, కాంతిమంతంగా అవుతుంది. అర టీ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. తేనె చర్మానికి మాయిశ్చరైజర్‌లా ఉపయోగపడుతుంది. రోజ్‌వాటర్‌తో పోర్స్ శుభ్రపడి ముఖ చర్మం కాంతిమంతమవుతుంది. ఆలివ్ ఆయిల్, అలొవెరా జెల్ సమపాళ్లలో తీసుకొని అందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని పొడిబారే చర్మతత్త్వం గలవారు మాయిశ్చరైజర్ గా ఉపయోగించవచ్చు. చర్మం పొడిబారకుండా ఉండాలంటే మృతకణాలను తొలగిస్తూ ఉండాలి. కార్న్‌ఫ్లేక్స్‌ని పొడి చేసి అందులో తేనె, పాలు కలిపి చర్మానికి పట్టించి మర్దన చేయాలి. ఫలితంగా మృతకణాలు తొలగి΄ోయి, చర్మం మృదువుగా మారుతుంది. మూడు టీ స్పూన్ల కొబ్బరి నూనె, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, టీ స్పూన్ గ్లిజరిన్, రెండు టీ స్పూన్ల నీళ్లు కలిపి మరిగించాలి. ఈ మిశ్రమం చల్లారాక ముఖానికి రాసి, మసాజ్ చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ ఆయిల్ ΄్యాక్ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. (చదవండి: జుట్టు రాలిపోవడంతో 40 కిలోలు బరువు తగ్గింది..! 80/20 రూల్‌తో..) -
చర్మతత్వానికి సరిపోయే ఫేస్ ప్యాక్‌లు..!
ఇంట్లో మనం అనునిత్యం ఉపయోగించేవే చక్కటి సౌందర్య సాధనాలుగా పనికొస్తాయి. వాటితో చక్కటి మెరిసే చర్మాన్ని పొందొచ్చు కూడా. అయితే ఎలాంటి చర్మం కలవారికి ఏది బెటర్ అనేది చాలామంది సరైన అవగాహన ఉండదు. అలాంటివారు సౌందర్య నిపుణులు చెబుతున్న ఈ చిట్కాలు ఫాలో అయితే సరి. మరి అవేంటో చూద్దామా..!..పాది ద్రాక్షపండ్లు, ఒక నిమ్మకాయ, ఒక కోడిగుడ్డు తీసుకోవాలి. ద్రాక్షపండ్లను, నిమ్మ రసాన్ని, కోడిగుడ్డు తెల్లసొనను బ్లెండ్ చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఇది జిడ్డు చర్మానికి వేయాల్సిన ప్యాక్. నిమ్మరసం నేచురల్ క్లెన్సర్. ఇది చర్మాన్ని శుభ్రం చేస్తుంది. ద్రాక్షరసం మృదుత్వాన్నిస్తుంది, కోడిగుడ్డు తెల్లసొన చర్మాన్ని వదులు కానీయకుండా రక్షిస్తుంది. దీనిని పొడి చర్మానికి కాని నార్మల్ స్కిన్‌కు కాని వాడితే మరింత పొడిబారే అవకాశం ఉంది.రకరకాల పండ్లను, సౌందర్య సాధనాలను కలిపి ప్యాక్ తయారు చేసుకోవడానికి సమయం, సహనం లేనప్పుడు నిమ్మకాయను సగానికి కోసి ఒక చెక్కతో ముఖాన్నంతటినీ రుద్ది పదిహేను నిమిషాల సేపు అలాగే ఉంచి తర్వాత చన్నీటితో శుభ్రంచేయాలి. ఇది జిడ్డును తొలగించి ముఖాన్ని తాజాగా ఉంచుతుంది. ఇది కూడా పొడి చర్మానికి పనికిరాదు.ఒక టీ స్పూన్ తేనెలో అంతే మోతాదులో పాలు కలిపి ముఖానికి అప్లయ్ చేసి పది నిమిషాల సేపటికి కడగాలి. రెండు రోజులకొకసారి ఇలా చేస్తుంటే చర్మం కాంతివంతంగా ఉంటుంది.డ్రైస్కిన్ అయితే... ఒక టీ స్పూన్ తేనె, అంతే మోతాదులో నిమ్మరసం, వెజిటబుల్ ఆయిల్‌లను బాగా కలిపి ప్యాక్ వేసి పది నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. కొబ్బరి, వేరుశనగ, నువ్వులు, సన్‌ఫ్లవర్, సోయా... ఇలా ఏదైనా సరే... అందుబాటులో ఉన్న ఆయిల్ వాడవచ్చు. (చదవండి: కడవల కొద్దీ కన్నీళ్లు వచ్చేస్తాయ్..! సమస్యను బయటపెట్టిన ప్రియాంక చోప్రా -
అరటిపండుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నారా? దానిలోని బి12 చర్మానికి..
ఈరోజుల్లో ఆడవాళ్లు, మగవాళ్లు అనే తేడా లేకుండా అందానికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఒకప్పుడు బ్యూటీ పార్లర్లు అంటే ఆడవాళ్ల కోసమే ప్రత్యేకంగా ఉండేవి. కానీ ఇప్పుడు అబ్బాయిలు కూడా మేం ఎందుకు తగ్గాలి అని సెలూన్ షాప్‌లకు క్యూ కడుతున్నారు. వేలకు వేలు తగలేసి మరీ కాస్ట్లీ ప్రోడక్ట్లను కొంటున్నారు. అయితే ఖర్చు లేకుండానే మన ఇంట్లో దొరికే వస్తువులతో క్షణాల్లో అందంగా మెరిసిపోవచ్చు. అదెలాగో చూసేద్దాం. బ్యూటీ టిప్స్: అరటి తొక్కతో సహా పండుని ముక్కలుగా తరిగి పేస్టు చేయాలి. ఈ పేస్టుకు రెండు టీస్పూన్ల పచ్చిపాలు పోసి మరోసారి గ్రైండ్ చేసి పదిహేను నిమిషాలు రిఫ్రిజిరేటర్లో పెట్టాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పూతలా వేసుకుని, ఇరవై నిమిషాలు ఆరాక కడిగేయాలి. అరటి పండులో ఉన్న విటమిన్ బి 6, బి12, ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం చర్మానికి పోషణ అందించి ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు వేసుకోవడం వల్ల ముఖ చర్మం నిగారింపుని సంతరించుకుంటుంది. -
Beauty: పెసలను రాత్రంతా నానబెట్టి.. గ్రైండ్ చేసి.. ఇలా మర్ధనా చేస్తే!
పెసలతో ఆరోగ్యమే కాదు.. అందాన్ని పొందవచ్చు. ఇంట్లోనే ఈ సులువైన చిట్కాలు పాటించి నునుపైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. ►టేబుల్ స్పూన్ పెసలను రాత్రంతా నానబెట్టి ఉదయం మెత్తగా గ్రైండ్ చేసి అందులో అర టీ స్పూన్ నెయ్యి లేదా పాలు వేసి కలిపి ముఖానికి పట్టించి మర్దన చేసి పది నిమిషాల సేపు మిశ్రమాన్ని ముఖం మీద ఉంచాలి. ►ఈ ప్యాక్ పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో కడగాలి. ఇలా చేస్తే పొడిబారిన చర్మం ఆరోగ్యంగా, నునుపుగా మారుతుంది. ఆయిల్ స్కిన్ వాళ్లయితే పెసర పేస్ట్‌లో కొద్దిగా మజ్జిగ లేదా పన్నీరు కలుపుకోవాలి. ►ఎండకు కమిలిపోయిన చర్మం తిరిగి మామూలు కావాలంటే... పైన చెప్పుకొన్న పెసల పేస్టులో చల్లటి పెరుగు లేదా కలబంద పేస్టు కలిపి ముఖానికి, చేతులకు, పాదాలకు పట్టించి ఐదు నిమిషాల సేపు మర్దన చేయాలి. ఆరిపోయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి. హెయిర్ ఫాల్ తగ్గాలంటే... రాత్రంతా నానబెట్టిన పెసలను గ్రైండ్ చేసి అందులో కోడిగుడ్డు సొన, టేబుల్ స్పూన్ నిమ్మరసం, కప్పు పెరుగు కలిపి చిక్కటి పేస్టు చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి 15నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఈ మూంగ్‌దాల్ ప్యాక్‌ను నూనె రాసిన జుట్టుకు పట్టించకూడదు. షాంపూతో తలస్నానం చేసి ఆరిన తర్వాత మాత్రమే వేయాలి. చదవండి: Pomegranate: 3 నెలల పాటు ప్రతిరోజు తింటే! ఇక తొక్కలు పొడి చేసి నీళ్లలో కలిపి తాగారంటే.. Nora Fatehi: భోజనంలో అవి ఉండాల్సిందే! రోజూ ఆయిల్ మసాజ్.. నా బ్యూటీ సీక్రెట్ ఇదే! -
ఆవు పేడతో సౌందర్య ఉత్పత్తులు త్వరలో అమెజాన్‌లో
సాక్షి, ముంబై: ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఇకపై ఆవు మూత్రం, పేడ నుంచి తయారైన ఫేస్ ప్యాక్స్, షాంపూలు తదితర ఔషధ ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్సెస్) అనుబంధ ఔషధ ఉత్పత్తి సంస్థ దీన్‌దయాళ్ ధామ్ ఈ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. గోమూత్రం, ఆపు పేడతో చేసిన సబ్బులు, ఫేస్‌క్రీములు, షాంపూలు లాంటి ఇతర మెడికల్ ఉత్పతులను అమెజాన్ ఇండియాలో అమ్మేందుకు సిద్ధమైంది. ఇప్పటికే దీనిపై అమెజాన్‌తో చర్చలు నిర్వహించామని, మరో వారం రోజుల్లో దీనికి సంబంధించిన ప్రకటనలు అమెజాన్ వెబ్సైట్లో చూడవచ్చని కూడా సంస్థ తెలిపింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర లోని ఆర్ఎస్ఎస్ కుచెందిన దీన్ దయాళ్ ధామ్ సెంటర్లో ఆరోగ్యం, బ్యూటీ, ఆపరెల్కు సంబంధించిన డజన్ ఉత్పత్తులనున అమ్మేందుకు సిద్ధం చేసినట్లు తయారీ కేంద్రం మేనేజర్ ఘన్ శ్యామ్ గుప్తా వెల్లడించారు. దీంతో అమెజాన్ వెబ్సైట్లో వినియోగదారులు ఆ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. అమెజాన్ లో ఆర్డర్ ప్లేస్అయిన వెంటనే వెబ్సైట్ తమకు సమాచారం అందిస్తుంది. అయితే కొరియర్ సర్వీసు ప్రస్తుతం అందుబాటులో లేదు, కాబట్టి అ మెజాన్ భారతీయ పోస్టల్ శాఖ ద్వారా 10రోజుట్లో వినియోగదారులకు అందిస్తుందన్నారు. ఈ మేరకు ఒప్పందంపై సంతకం చేశామని ఆయన చెప్పారు. కాగా ఇప్పటికే ఆవుపేడతో పాటు పేడతో చేసిన పిడకలు, గోమూత్రం కూడా ఆన్లైన్లో లభిస్తున్న సంగతి తెలిసిందే. -
చర్మకాంతికి పసుపు, దోస..
ఈ కాలం చర్మం కాంతిమంతంగా మారాలంటే ఉపయోగపడే సహజసిద్ధమైన ఫేస్‌ప్యాక్స్ ఇవి.. ∙రెండు టేబుల్ స్పూన్ల గంధంపొడి, అరకప్పు రోజ్‌వాటర్, టేబుల్ స్పూన్ పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించాలి. అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రపరచాలి. ఈ ఫేస్‌ప్యాక్ రోజూ వేసుకోవడం వల్ల ముఖంపై మురికి, మచ్చలు తగ్గి చర్మకాంతి పెరుగుతుంది. ∙ఈ కాలం సహజసిద్ధమైన బ్లీచింగ్‌గా ఉపయోగపడేది దోస లేదా కీర. వీటిని గుజ్జు చేసి ముఖానికి, మెడకు, చేతులకు రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. జిడ్డు చర్మం గల వారికి ఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది. ∙రెండు టేబుల్ స్పూన్ల జొజోబా ఆయిల్ (మార్కెట్లో లభిస్తుంది), రెండు టేబుల్ స్పూన్ల తాజా పెరుగు, టీ స్పూన్ తేనె ఈ మూడూ ఒక పాత్రలో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి 10–15 నిమిషాలు ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరచాలి. పొడి చర్మం గలవారికి ఇది మహత్తరమైన ఫేస్‌ప్యాక్. -
సింపుల్ ఫేస్ ప్యాక్స్
♦ నిర్జీవంగా, కాంతిహీనంగా మారినట్లున్న చర్మం మృదువుగా మారాలంటే కీరదోస కాయను పచ్చిపాలతో కలిపి గ్రైండ్ చేసి ప్యాక్ వేయాలి. ♦ ఒక టేబుల్ స్పూన్ చందనం పొడిని పన్నీటితో కలిపి ప్యాక్ వేస్తే చర్మసౌందర్యం ఇనుమడించడంతోపాటు ఎండ వేడి నుంచి ఉపశమనం ఉంటుంది. అయిలీ స్కిన్ అయితే ఇందులో కొద్దిగా నిమ్మరసం లేదా పుల్లటి పెరుగు కలుపుకోవచ్చు. -
అదరగొట్టే అందం!
మచ్చలేని మృదువైన చర్మం కోసం మగువలు నానా తంటాలు పడతారు. చర్మం కాంతివంతంగా మెరిసేందుకు నెలకో ఫేస్ క్రీమ్స్ మారుస్తుంటారు. అయితే కెమికల్స్ ఎక్కువగా ఉండే కాస్మొటిక్ క్రీమ్స్ కంటే.. సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్సే మంచివంటున్నారు నిపుణులు. నేచురల్ ఫేస్ ప్యాక్స్ అప్లై చేసుకోవడం వల్ల... మృతకణాలు తొలగి.. చర్మం కాంతిని సంతరించుకుంటుంది. మెరుపుతో పాటు.. మొటిమలు, మచ్చలు పూర్తిగా తగ్గుతాయి. కావల్సినవి: కొబ్బరి పాలు – 3 టేబుల్ స్పూన్స్ తేనె – అర టేబుల్ స్పూన్‌అరటి పండు గుజ్జు – 2 టేబుల్ స్పూన్స్ పసుపు – చిటికెడు తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కొబ్బరి పాలు, అరటి పండు గుజ్జు యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. చివరిగా బనానా మిశ్రమంలో తేనె వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముఖాన్ని వాటర్‌తో శుభ్రం చేసుకుని, ఆవిరి పట్టించాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, పూర్తిగా ఆరాక గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇదే విధంగా వారానికి రెండు మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. మరెందుకు ఆలస్యం.. ట్రై చెయ్యండి. -
అందానికి కలబంద
కలబంద అందుబాటులో ఉంటే చాలు, చక్కని ముఖవర్చస్సు మీ సొంతమవుతుంది. ఎలాంటి చర్మానికైనా సరే కలబందతో తగిన ఫేస్‌ప్యాక్‌లను ఇంట్లోనే తేలికగా తయారు చేసుకోవచ్చు. ఇలాంటి కొన్ని ఫేస్‌ప్యాక్స్ మీ కోసం... రెండు చెంచాల కలబంద గుజ్జు, రెండు చెంచాల చీజ్, రెండు చెంచాల కీర దోసకాయల గుజ్జు, ఐదారు గింజలు తీసిన ఖర్జూరాలు మెత్తగా కలుపుకోవాలి. దీనికి కాస్త నిమ్మరసాన్ని, చిటికెడు పసుపును చేర్చి ముఖానికి పట్టించాలి. పావుగంట తర్వాత చన్నీటితో కడిగేయాలి. పొడిచర్మం ఉన్న వాళ్లకు కళాకాంతులు వస్తాయి. రెండు తాజా కలబంద ఆకులను నీళ్లలో ఉడికించండి. తర్వాత వాటిని గుజ్జుగా చేసి, రెండు చెంచాల తేనె, చిటికెడు గంధం పొడి కలపండి. దీనిని ముఖానికి పట్టించి, అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. జిడ్డు చర్మం ఉన్నవాళ్లకు ఇది బాగా పనిచేస్తుంది. -
పూవులాంటి మోముకు...
బ్యూటిప్స్ ముఖారవిందానికి ఎన్నోరకాల ఫేస్‌ప్యాక్స్ వేసుకుంటుంటారు. పండ్లనీ, కాయలనీ ఇంకా ఏవేవో క్రీములతో ప్యాక్స్ వేసుకోవడం విన్నాం. కానీ ఈ కింది ప్యాక్స్ వాడి చూడండి. జిడ్డుతనం, మొటిమలు, మచ్చలు లాంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం పొందుతారు. జిడ్డు చర్మం కారణంగానే మొటిమల సమస్య ఎక్కువగా ఉంటుంది. దానికి చక్కటి పరిష్కారం బంతిపూల ప్యాక్. రెండు పెద్ద బంతిపూలను పూర్తిగా తుంచేసి మిక్సీలో వేసి కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. అందులో ఒక టీస్పూన్ ఉసిరి పొడి, ఒక టీస్పూన్ పెరుగు, రెండు టీ స్పూన్ల నిమ్మరసం వేసి బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమంతో రోజూ ఉదయం ఫేస్‌ప్యాక్ వేసుకొని ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా రెండు వారాలు చేస్తే జిడ్డుతనం తగ్గి ముఖంలో నిగారింపు వస్తుంది. చలికాలంలో ముఖంపై పగుళ్లు, గీతలు కనిపిస్తుంటాయి. ఎన్ని మాయిశ్చరైజర్లు రాసుకున్నా అది కొద్దిసేపటికే ఇంకిపోతుంటుంది. రోజంతా ముఖం మృదువుగా ఉండాలంటే చేమంతి ప్యాక్ వేసుకుంటే సరి. అందుకు రెండు చేమంతి పూలను నీళ్లలో ఉడకబెట్టాలి. ఆ నీటిలో కాస్త తేనె, పాలు పోసి కలుపుకోవాలి. రోజూ ఉదయం బయటికి వెళ్లేటప్పుడు ఈ మిశ్రమంతో ముఖంపై బాగా మర్దన చేసుకొని రెండు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే రోజంతా ముఖం తాజాగా, అందంగా ఉంటుంది. {yై స్కిన్ వారికి మల్లెలు ఎంతో మేలు చేస్తాయి. వారు 5-6 మల్లెపూలను పేస్ట్‌లా చేసుకొని, అందులో కొద్దిగా పెరుగు వేసి కలుపుకోవాలి. దాంతో రోజూ ఉదయం లేచిన వెంటనే ముఖానికి ప్యాక్ వేసుకుంటే మంచి రంగుతేలడంతో పాటు పొడితనం కూడా తగ్గుతుంది. సమయం అంతగా కేటాయించలేని వారు మల్లెపూలను ఉడకబెట్టి, ఆ నీళ్లలో ఏదైనా ఫెయిర్‌నెస్ క్రీం కలిపి ముఖంపై ఓ నిమిషం మర్దన చేసుకొని వెంటనే గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే చాలు కోమలమైన చర్మం మీ సొంతం. తామరపూలలో లినోనిక్ యాసిడ్‌తో పాటు అనేక రకాల మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అవి ముఖాన్ని తెల్లగా చేయటమే కాకుండా నల్లమచ్చలను పోగొడ్తాయి కూడా! అందుకు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. ఒక పెద్ద తామరపువ్వును బాగా కడిగి రేకులను వేరుచేసి నీళ్లలో ఉడకబెట్టాలి. ఆ నీరు చల్లారాక అందులో కొద్దిగా రోజ్ వాటర్ కలపాలి. తర్వాత వాటిని ఓ సీసాలో తీసుకొని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే సరి. రోజూ ముఖం కడుక్కోవడానికి ఆ నీటిని ఉపయోగించుకుంటే సరి! -
వండర్ ప్యాక్స్
చర్మం పొడిబారడం ఈ కాలం ఎదుర్కొనే ప్రధాన సమస్య. ఇంట్లోనే కొన్ని ఫేస్‌ప్యాక్స్ వేసుకొని మృదుత్వాన్ని కాపాడుకోవచ్చు.రెండు టేబుల్ స్పూన్ల జొజోబా ఆయిల్ (మార్కెట్లో లభిస్తుంది), రెండు టేబుల్ స్పూన్ల తాజా పెరుగు, టీ స్పూన్ తేనె ఈ మూడూ ఒక పాత్రలో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి 10-15 నిమిషాలు ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరచాలి. పొడి చర్మం గలవారికి ఇది మహత్తరమైన ఫేస్‌ప్యాక్. రెండు టేబుల్ స్పూన్ల గంధంపొడి, అరకప్పు రోజ్‌వాటర్, టేబుల్ స్పూన్ పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించాలి. అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రపరచాలి. ఈ ఫేస్‌ప్యాక్ రోజూ వేసుకోవడం వల్ల ముఖంపై మురికి, మచ్చలు తగ్గి చర్మకాంతి పెరుగుతుంది.ఈ కాలం సహజసిద్ధమైన బ్లీచింగ్‌గా ఉపయోగపడేది దోస లేదా కీర. వీటిని గుజ్జు చేసి ముఖానికి, మెడకు, చేతులకు రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. జిడ్డు చర్మం గల వారికి ఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది.