మచ్చలేని మృదువైన చర్మం కోసం మగువలు నానా తంటాలు పడతారు. చర్మం కాంతివంతంగా మెరిసేందుకు నెలకో ఫేస్ క్రీమ్స్ మారుస్తుంటారు. అయితే కెమికల్స్ ఎక్కువగా ఉండే కాస్మొటిక్ క్రీమ్స్ కంటే.. సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్సే మంచివంటున్నారు నిపుణులు. నేచురల్ ఫేస్ ప్యాక్స్ అప్లై చేసుకోవడం వల్ల... మృతకణాలు తొలగి.. చర్మం కాంతిని సంతరించుకుంటుంది. మెరుపుతో పాటు.. మొటిమలు, మచ్చలు పూర్తిగా తగ్గుతాయి.
కావల్సినవి: కొబ్బరి పాలు – 3 టేబుల్ స్పూన్స్ తేనె – అర టేబుల్ స్పూన్‌అరటి పండు గుజ్జు – 2 టేబుల్ స్పూన్స్ పసుపు – చిటికెడు
తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కొబ్బరి పాలు, అరటి పండు గుజ్జు యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. చివరిగా బనానా మిశ్రమంలో తేనె వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముఖాన్ని వాటర్‌తో శుభ్రం చేసుకుని, ఆవిరి పట్టించాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, పూర్తిగా ఆరాక గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇదే విధంగా వారానికి రెండు మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. మరెందుకు ఆలస్యం.. ట్రై చెయ్యండి.
Comments
Please login to add a commentAdd a comment