
పొడి చర్మం గలవారు ఏ ఫేస్ ప్యాక్ పడితే అది వేసుకోవడం మంచిది కాదు. అందులోనూ వాళ్ల చర్మం డ్రైగా అయిపోయి, ర్యాషస్ ఈజీగా వచ్చేస్తాయి. అలాంటి వారు చర్మాన్ని తేమగా ఉంచి మృదువుగా చేసే ఫేస్ ప్యాక్‌లు ఎంచుకోవాల్సి ఉంటుంది. వీళ్లు ఆయిల్‌తో కూడిన ప్యాక్‌లు ఉపయోగిస్తే చర్మం కోమలంగా మెరుస్తూ ఉంటుంది. అందుకోసం హెల్ప్ అయ్యే బెస్ట్ ఫేస్ ప్యాక్‌లు ఏంటో చూద్దామా..!.
పూలలోని పుప్పొడి, నల్లనువ్వులు, బార్లీ గింజలు సమపాళ్లలో తీసుకొని, పొడి చేసి, ఒక డబ్బాలో భద్రపరుచుకోవాలి. ఈ పొడిని కావల్సినంత తీసుకొని, తగినన్ని నీళ్లు కలిపి, ముఖానికి, శరీరానికి పట్టించాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల పొడిబారిన చర్మం మృదువుగా, కాంతిమంతంగా అవుతుంది.
అర టీ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. తేనె చర్మానికి మాయిశ్చరైజర్‌లా ఉపయోగపడుతుంది. రోజ్‌వాటర్‌తో పోర్స్ శుభ్రపడి ముఖ చర్మం కాంతిమంతమవుతుంది.
ఆలివ్ ఆయిల్, అలొవెరా జెల్ సమపాళ్లలో తీసుకొని అందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని పొడిబారే చర్మతత్త్వం గలవారు మాయిశ్చరైజర్ గా ఉపయోగించవచ్చు.
చర్మం పొడిబారకుండా ఉండాలంటే మృతకణాలను తొలగిస్తూ ఉండాలి. కార్న్‌ఫ్లేక్స్‌ని పొడి చేసి అందులో తేనె, పాలు కలిపి చర్మానికి పట్టించి మర్దన చేయాలి. ఫలితంగా మృతకణాలు తొలగి΄ోయి, చర్మం మృదువుగా మారుతుంది.
మూడు టీ స్పూన్ల కొబ్బరి నూనె, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, టీ స్పూన్ గ్లిజరిన్, రెండు టీ స్పూన్ల నీళ్లు కలిపి మరిగించాలి. ఈ మిశ్రమం చల్లారాక ముఖానికి రాసి, మసాజ్ చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ ఆయిల్ ΄్యాక్ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.
(చదవండి: జుట్టు రాలిపోవడంతో 40 కిలోలు బరువు తగ్గింది..! 80/20 రూల్‌తో..)
Comments
Please login to add a commentAdd a comment