మెరిసే గ్లాస్‌స్కిన్ కోసం కే బ్యూటీ అంటూ రకరకలా బ్యూటీ ప్రొడక్ట్‌లు, సౌందర్య చిట్కాలు కోకొల్లలుగా వచ్చేస్తున్నాయి. అవన్నీ ఎలా ఉన్నా పూర్వకాలంలో కొందరు ప్రసిద్ధ రాణుల అందాల గరించి కవులు వర్ణించి చెప్పినట్లు కథకథలగా విన్నాం. అయితే ఆ రాణులు(Queens) ఆ కాలంలోనే తమ అందం కోసం ఎంత ప్రాముఖ్యత ఇచ్చేవారో వింటే విస్తుపోతారు. అందుకోసం ఎలాంటి వాటిని సౌందర్య సాధనాలు(Beauty Secret)గా ఉపయోగించారో వింటో వామ్మో..! అని నోరెళ్లబెడతారు.
క్లియోపాత్రా గాడిద పాలతో స్నానం..
ఈజిప్ట్ టోలెమిక రాజ్యం రాణి క్లియోపాత్రా(Cleopatra) చర్మ సంరక్షణ కోసం గాడిద పాలతో స్నానం చేసేదట. అందుకోసం రోజు సేవకులు బిందెల కొద్ది గాడిద పాలను పితికి రెడి చేసేవారట. అవి విరిగిపోయాక వాటితో స్నానం చేసేదట. అందుకోసం దాదాపు 700 గాడిద పాలను వినియోగించేవారట. రోజంతో గాడిద పాల బాత్‌తో మునిగిపోయేదట.
ఎలిసబెత్..దూడ మాంసం మాస్క్..
'సిసి' అని పిలిచే ఆస్ట్రియా సామ్రాజ్ఞి ఎలిసబెత్(Elisabeth) 19 శతాబ్దంలో అందానికి ప్రసిద్ధి చెందిన రాణి. ఆమె మచ్చలేని తెల్లటి పింగాణీలా మెరిసే చర్మం కోసం స్ట్రాబెర్రీల ప్యాక్ ముఖానికి రాసేదట. అలాగే చర్మ ఆరోగ్యం కోసం ఆలివ్ నూనెతో స్నానాలు చేసేదట. ముఖ్యం కాంతిగా కనిపించాలని దూడ చర్మాన్ని మాస్క్‌గా వేసుకుని నిద్రించేదట. ఇక ఆమె వొత్తైన జుట్టు గురించి కథలుకథలుగా చెప్పుకునేవారట. ప్రతి మూడు వారాలకొకసారి పచ్చి గుడ్లు, బ్రాందీల మిశ్రమాన్ని అప్లై చేసుకునేదట. అది ఆరిపోయే వరకు మారథాన్‌లా వాక్ చేస్తూ ఉండేదని చరిత్రకారులు పేర్కొన్నారు.
మేరీ ఆంటోయినెట్: పావురాలు ఉడికించిన నీళ్లు..
ఫ్రాన్స్ రాణి మేరీ ఆంటోయినెట్(Marie Antoinette) అందం కోసం ఎన్నో విలక్షణమైన సౌందర్య సాధనాలను ఉపయోగించేది. ఆమె ముఖాన్ని యూ కాస్మెటిక్ డి పిజియన్‌తో కడుక్కునేదట. ఇది పండ్ల రసం, పూల సారం, మూడు ఫ్రెంచ్ రోల్స్, బోరాక్స్, 17 రోజల పాటు ఉడికించి పులియబెట్టిన ఎనిమిది పావురాల మిశ్రమం అట.
ఎలిజబెత్ I: అత్యంత విషపూరితమైన సీసం..
క్వీన్ ఎలిజబెత్ I(Elizabeth I) పాలనలో "వెనీషియన్ సెరూస్" అనే సీసాన్ని సౌందర్య సాధనంగా ఉపయోగించేవారట. ఈ సీసం(Lead), వెనిగర్‌ల మిశ్రమాన్ని తెల్లటి కాంతి వంతమైన రంగు కోసం చర్మానికి పూసేవారట. ఇవి చికెన్‌పాక్స్(తట్టు, అమ్మవారు) వంటి చర్మవ్యాధుల తాలుకా మచ్చలను నివారించి మచ్చలేని చర్మంలా ప్రకాశవంతంగా చేస్తుందట. అయితే ఈ రాణి చిన్నవయసులోనే అకాల మరణం చెందింది. అందుకు ఆమె ఉపయోగించిన ఈ సీసమే కారణమని అంటుంటారు.
ఎందుకంటే లెడ్ సల్ఫైడ్(సీసం) ఖనిజ రూపమైన బ్లాక్ పౌడరే ఈ వెనీషియన్ సెరూస్. ఇది ముఖానికి పూస్తే లేత గులాబీ రంగు ఛాయతో మెరుస్తుంటుందట. అంతేగాదు కళ్లు చక్కగా కనిపించేలా ఐలైనర్‌లాగా కూడా వాడేవరట. అయితే ఇందులో ఉండే సీసం అత్యంత హానికరమైనది. ఇది అనారోగ్యం బారినపడేలా చేసి మరణానికి కారణమవుతుందంటూ ప్రస్తుతం బ్యాన్ చేశారు అధికారులు.
(చదవండి: ఆ థెరపీ పేరెంట్స్‌ని అర్థం చేసుకోవడానికి సహాయపడింది..!: ఇరాఖాన్)
Comments
Please login to add a commentAdd a comment