Queen
-
డెన్మార్క్ రాణి 1800ల నాటి అరుదైన కిరీటం..! 140 ఏళ్లుగా..
రాణులు ధరించే ప్రతి ఆభరణానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంటుంది. తరతరాలుగా ఆ ఆభరణాలను వారసత్వంగా ధరించడం జరుగుతుంది. అయితే ఆ భరణాలు అత్యంత ఖరీదే గాక వాటి వెనుక ఎంతో ఆసక్తికరమైన కథలు ఉంటాయి. వాటి నేపథ్యం చూస్తే నోటమాటరాదు. అన్నేళ్లుగా ఆ ఆభరణాలను తరతరాలుగా భద్రపరచడం చూస్తే..వాటికున్న విలువ, పూర్వకాలం నాటి హస్తకళా నైపుణ్యం భవిష్యత్తు తరాలకు తెలుసుకునే వీలుంటుంది. ప్రస్తుతం ఈ డెన్మార్క్ క్వీన్ ధరించి శోరోభూషణం కూడా అందరీ దృష్టిని ఆకర్షించడమే ఒక్కసారిగా దాని చారిత్రక నేపథ్యం కళ్లముందుకు కదలాడింది. మరీ ఆఇంట్రస్టింగ్ స్టోరీ ఏంటో చూద్దామా..!.డెన్మార్క్రాణి మేరీ ఇటీవల హెల్సింకిలోని ఒక రాష్ట్ర వేడకలో అందరూ మర్చిపోయిన రాజ ఆభరణాన్ని వెలుగులోకి తెచ్చింది. క్వీన్ మేరీ డెన్మార్క్, ఫిన్లాండ్ల మధ్య సన్నిహిత సంబంధాల బలోపేతం చేసుకునేందకు ఏర్పాటు చేసిన వైట్- టై ఈవెంట్లో ఈ శిరో ఆభరణాన్ని(కిరీటం)ధరించింది. ఆమె ధరించి కిరీటం 1839- 1848 కాలం నాటిది. ఆ కాలంలో డెన్మార్క్ రాజప్రతినిధి అయిన క్రిస్టియన్ VIIIని వివాహం చేసుకున్న క్వీన్ కరోలిన అమాలీకి చెందిన బంగారు కీరిటీం. ఈ కిరీటం అత్యంత అరుదైన రత్నాలతో పొదిగి ఉంటుంది. డానిష్ కోర్టు ప్రకారం, 1819-1821లో ఈ జంట ఇటలీ పర్యటన సందర్భంగా ఆ 11 రత్నాలను సేకరించారట. ఆ పర్యటనలో ఈ దంపతులు రోమ్ని సందర్శించి సమీపంలో పాంపీలో జరిపిన పురాతన తవ్వకాల నుంచి వీటిని సేకరించినట్లు డానిష్ కోర్టు పేర్కొంది. ఆసక్తికర కథేంటంటే..ఈ కిరీటం 140 ఏళ్లకు పైగా కనిపించలేదు. రాజ ఖజనాలోనే లాక్ చేసి ఉంచారని డానిష్ కోర్టు ధృవీకరించింది. మళ్లీ ఇన్నేళ్లకు డెన్మార్క్ రాణి మేరీ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లో జరిగిన వేడుకలో ఆ ఆభరణాన్ని తలకు ధరించింది. ఈ కార్యక్రమం ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్, అతని భార్య సుజాన్ ఇన్నెస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఇది ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా జరిగిన ఈవెంట్. ఇక రాయల్ కలెక్షన్లలో తరుచుగా కనిపించే అత్యంత విలాసవంతమైన వస్తువులా కాకుండా రోజువారీ దుస్తులకు సరిపోయేలా ధరించడానికి అనుగుణంగా ఉండేటమే ఈ కిరీటం ప్రత్యేకతట. (చదవండి: ‘ఆడపిల్లనమ్మా..’ పాటతో పాపులర్ అయిన సింగర్ మధుప్రియ జర్నీ..!) -
అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం చీర కట్టులో మెరిసిన సాయిపల్లవి
-
అలనాటి రాణుల బ్యూటీ సీక్రెట్ తెలిస్తే కంగుతింటారు..!
మెరిసే గ్లాస్స్కిన్ కోసం కే బ్యూటీ అంటూ రకరకలా బ్యూటీ ప్రొడక్ట్‌లు, సౌందర్య చిట్కాలు కోకొల్లలుగా వచ్చేస్తున్నాయి. అవన్నీ ఎలా ఉన్నా పూర్వకాలంలో కొందరు ప్రసిద్ధ రాణుల అందాల గరించి కవులు వర్ణించి చెప్పినట్లు కథకథలగా విన్నాం. అయితే ఆ రాణులు(Queens) ఆ కాలంలోనే తమ అందం కోసం ఎంత ప్రాముఖ్యత ఇచ్చేవారో వింటే విస్తుపోతారు. అందుకోసం ఎలాంటి వాటిని సౌందర్య సాధనాలు(Beauty Secret)గా ఉపయోగించారో వింటో వామ్మో..! అని నోరెళ్లబెడతారు.క్లియోపాత్రా గాడిద పాలతో స్నానం..ఈజిప్ట్ టోలెమిక రాజ్యం రాణి క్లియోపాత్రా(Cleopatra) చర్మ సంరక్షణ కోసం గాడిద పాలతో స్నానం చేసేదట. అందుకోసం రోజు సేవకులు బిందెల కొద్ది గాడిద పాలను పితికి రెడి చేసేవారట. అవి విరిగిపోయాక వాటితో స్నానం చేసేదట. అందుకోసం దాదాపు 700 గాడిద పాలను వినియోగించేవారట. రోజంతో గాడిద పాల బాత్‌తో మునిగిపోయేదట. ఎలిసబెత్..దూడ మాంసం మాస్క్.. 'సిసి' అని పిలిచే ఆస్ట్రియా సామ్రాజ్ఞి ఎలిసబెత్(Elisabeth) 19 శతాబ్దంలో అందానికి ప్రసిద్ధి చెందిన రాణి. ఆమె మచ్చలేని తెల్లటి పింగాణీలా మెరిసే చర్మం కోసం స్ట్రాబెర్రీల ప్యాక్ ముఖానికి రాసేదట. అలాగే చర్మ ఆరోగ్యం కోసం ఆలివ్ నూనెతో స్నానాలు చేసేదట. ముఖ్యం కాంతిగా కనిపించాలని దూడ చర్మాన్ని మాస్క్‌గా వేసుకుని నిద్రించేదట. ఇక ఆమె వొత్తైన జుట్టు గురించి కథలుకథలుగా చెప్పుకునేవారట. ప్రతి మూడు వారాలకొకసారి పచ్చి గుడ్లు, బ్రాందీల మిశ్రమాన్ని అప్లై చేసుకునేదట. అది ఆరిపోయే వరకు మారథాన్‌లా వాక్ చేస్తూ ఉండేదని చరిత్రకారులు పేర్కొన్నారు. మేరీ ఆంటోయినెట్: పావురాలు ఉడికించిన నీళ్లు..ఫ్రాన్స్ రాణి మేరీ ఆంటోయినెట్(Marie Antoinette) అందం కోసం ఎన్నో విలక్షణమైన సౌందర్య సాధనాలను ఉపయోగించేది. ఆమె ముఖాన్ని యూ కాస్మెటిక్ డి పిజియన్తో కడుక్కునేదట. ఇది పండ్ల రసం, పూల సారం, మూడు ఫ్రెంచ్ రోల్స్, బోరాక్స్, 17 రోజల పాటు ఉడికించి పులియబెట్టిన ఎనిమిది పావురాల మిశ్రమం అట.ఎలిజబెత్ I: అత్యంత విషపూరితమైన సీసం..క్వీన్ ఎలిజబెత్ I(Elizabeth I) పాలనలో "వెనీషియన్ సెరూస్" అనే సీసాన్ని సౌందర్య సాధనంగా ఉపయోగించేవారట. ఈ సీసం(Lead), వెనిగర్ల మిశ్రమాన్ని తెల్లటి కాంతి వంతమైన రంగు కోసం చర్మానికి పూసేవారట. ఇవి చికెన్‌పాక్స్(తట్టు, అమ్మవారు) వంటి చర్మవ్యాధుల తాలుకా మచ్చలను నివారించి మచ్చలేని చర్మంలా ప్రకాశవంతంగా చేస్తుందట. అయితే ఈ రాణి చిన్నవయసులోనే అకాల మరణం చెందింది. అందుకు ఆమె ఉపయోగించిన ఈ సీసమే కారణమని అంటుంటారు. ఎందుకంటే లెడ్ సల్ఫైడ్(సీసం) ఖనిజ రూపమైన బ్లాక్ పౌడరే ఈ వెనీషియన్ సెరూస్. ఇది ముఖానికి పూస్తే లేత గులాబీ రంగు ఛాయతో మెరుస్తుంటుందట. అంతేగాదు కళ్లు చక్కగా కనిపించేలా ఐలైనర్లాగా కూడా వాడేవరట. అయితే ఇందులో ఉండే సీసం అత్యంత హానికరమైనది. ఇది అనారోగ్యం బారినపడేలా చేసి మరణానికి కారణమవుతుందంటూ ప్రస్తుతం బ్యాన్ చేశారు అధికారులు. (చదవండి: ఆ థెరపీ పేరెంట్స్‌ని అర్థం చేసుకోవడానికి సహాయపడింది..!: ఇరాఖాన్) -
2024 అమేజింగ్ డేస్ : అప్సరసలా మెలోడీ క్వీన్
-
అనార్కలీ డ్రెస్‌లో మహారాణిలా వెలిగిపోతున్న మాజీ మిస్ ఇండియా (ఫోటోలు)
-
చిన్నప్పుడే విషప్రయోగం కానీ.. ‘క్వీన్ ఆఫ్ గజల్స్’ బేగం అఖ్తర్!
చీకటి తరువాత వెలుగు’ అనేది ప్రకృతి సూత్రం.అయితే బేగం అఖ్తర్ విషయంలో ఈ సూత్రం తిరగబడింది. చీకటి తరువాత చీకటి...మరింత చీకటి... ఆమె జీవితం. అంత అంధకారంలోనూ వెయ్యి దీపకాంతులతో సంగీతంతో వెలిగిపోయింది. అందుకే అఖ్తర్ బేగం ‘క్వీన్ ఆఫ్ గజల్స్’ అయింది. ‘అమ్మీ’ నాటకంతో మరోసారి వార్తల్లోకి వచ్చింది. ప్రముఖ నటి పద్మిని కొల్హాపురి అక్తర్ బేగం పాత్ర పోషించిన అమ్మీనాటక ప్రదర్శన వివిధ నగరాలలో ప్రారంభమైన సందర్భంగా..వన్స్ అపాన్ ఏ టైమ్... ఇన్ ఫైజాబాద్: న్యాయవాది అస్ఘర్ హుస్సేన్‌కు ముస్తారీ రెండవ భార్య. కొద్దికాలం తరువాత భార్య, కవల కుమార్తెలు జోహ్ర, బిబ్బీలను దూరం పెట్టాడు. నాలుగేళ్ల వయసులో అక్కాచెల్లెళ్లపై విష ప్రయోగం జరిగింది. మిఠాయిలు తిన్న అక్కాచెల్లెళ్లు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో జోహ్రా చనిపోయింది. విషయం తెలియని బిబ్బీ ‘జోహ్ర ఎక్కడ?’ అని అడిగింది.‘దేవుడి ఇంటికి వెళ్లింది’ అని చెప్పింది కళ్లనీళ్లతో అమ్మ. అప్పుడు బిబ్బీకి ఏం అర్థం కాలేదు. ఆ తరువాత మెల్లగా అర్థం కావడం మొదలైంది. అక్కతో మాట్లాడడం మిస్ అయింది. అక్కతో కలిసి నవ్వులు పంచుకోవడం మిస్ అయింది. జోహ్ర వీపు మీద కూర్చొని గుర్రంలా స్వారీ చేస్తూ బిగ్గరగా అరవడం మిస్ అయింది. క్రమంగా బిబ్బీ నిశ్శబ్దంలోకి వెళ్లిపోయింది.ఎప్పుడూ మౌనంగా ఉండే అమ్మాయి అయింది. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లుగా ఉండేది. ఇది గమనించిన తల్లి బిబ్బీని సంగీత తరగతులకు పంపించింది. ఆ తరగతులకు ఇష్టంతో వెళ్లిందా, తల్లి బలవంతం మీద వెళ్లిందా అనేది తెలియదుగానీ ఏడేళ్ల వయసులో చంద్రబాయి అనే ఆర్టిస్ట్ సంగీతానికి ఫిదా అయిపోయింది బిబ్బీ. ఇక అప్పటి నుంచి సంగీతం వైపు ఇష్టంగా అడుగులు మొదలయ్యాయి. పట్నాకు చెందిన ప్రసిద్ధ సారంగి విద్వాంసుడు ఉస్తాద్ ఇమ్దాద్ఖాన్ దగ్గర సంగీతంలో శిక్షణ పొందింది. తల్లితో కలిసి కోల్‌కతాకు వెళ్లి లాహోర్‌కు చెందిన మహ్మద్ ఖాన్, అబ్దుల్ వహీద్ఖాన్లాంటి శాస్త్రీయ సంగీత దిగ్గజాల దగ్గర సంగీతం నేర్చుకుంది. బిబ్బీ ‘బేగం అఖ్తర్’ అయిందిపదిహేనేళ్ల వయసులో తొలిసారిగా వేదిక మీద కనిపించింది. నేపాల్–బిహార్ భూకంప బాధితుల సహాయంకోసం ఏర్పాటు చేసిన కచేరిలో బేగం అఖ్తర్ గానాన్ని సరోజినీనాయుడు ప్రశంసించింది. ఆ ప్రశంస తనకు ఉత్సాహాన్ని ఇచ్చింది. గజల్స్, దాద్రాలు, టుమ్రీల గ్రామ్‌ఫోన్ రికార్డులతో బేగం అఖ్తర్ పేరు మారుమోగిపోయింది. వినేకొద్దీ వినాలనిపించే స్వరం, అందమైన రూపం ఆమెను సినిమా రంగానికి తీసుకెళ్లింది. మన దేశంలో టాకీ శకం మొదలైన తరువాత కొన్ని హిందీ చిత్రాలలో నటించింది. తాను నటించిన అన్ని సినిమాల్లోని పాటలను స్వయంగా పాడింది.లక్నోకు చెందిన ఇష్తియాక్ అహ్మద్ అబ్బాస్ అనే బారిస్టర్తో అఖ్తర్‌కు వివాహం అయింది. వివాహానంతరం భర్త ఆంక్షల కారణంగా దాదాపు ఐదేళ్ల పాటు గానానికి దూరం అయింది. దీనికి తోడు తల్లి చనిపోవడంతో అఖ్తర్ మానసికంగా, శారీరకంగా బాగా కుంగిపోయింది. ‘మీరు దుఃఖం నుంచి బయటపడే మార్గం సంగీతం మాత్రమే’ అని వైద్యులు సలహా ఇచ్చారు. అలా వారి సలహాతో సంగీతానికి మళ్లీ దగ్గరైంది.సంగీతం వైపు తిరిగిరావడం బేగం అఖ్తర్‌కు రెండో జీవితం అయింది. ఆల్ ఇండియా రేడియో ద్వారా తన తీపి గళాన్ని దేశం నలుమూలలా వినిపించింది. 60 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించిన బేగం అఖ్తర్ అభిమానుల గుండ్లెలో ‘క్వీన్ ఆఫ్ గజల్స్’గా నిచిలింది.‘ఏ మొహబ్బతే’ పుస్తకం రాసిన రీటా గంగూలి మాటల్లో... ‘బేగం అఖ్తర్ అంటే ఏళ్ల తరబడి ఒంటరితనం. నీడలా వెంటాడే బాధ. విషాదం అనేది తన జీవితంలో విడదీయని భాగం అయింది. జీవితంలో లోతైన శూన్యాన్ని అనుభవించిన బేగం అఖ్తర్ దేవుడా, తర్వాత ఏమిటి అనే భయంతోనే జీవించింది. ప్రకాశవంతమైన చిరునవ్వుతో అత్యంత విషాదకరమైన పాటను పాడే సామర్థ్యం ఆమెలో ఉంది’.‘అమ్మీ’గా రంగస్థలం పైకి...నాటకరంగాన్ని తన కాలింగ్ అండ్ కంఫర్ట్‌జోన్‌గా పిలిచే నటి పద్మిని కొల్హాపురి గత కొన్ని నెలలుగా ఉర్దూ మాట్లాడే నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడంపై దృష్టి సారించింది. దీనికి కారణం అమ్మీ. ఈ నాటకంలో ఆమె బేగం అక్తర్‌గా కనిపిస్తుంది. ‘బేగం అక్తర్ పాత్ర పోషించడంతో నా కల సాకారమైంది’ అంటుంది పద్మిని కొల్హాపురి.పద్మిని గతంలో కొన్ని నాటకాల్లో నటించినా ‘అమ్మీ’ నాటకం మాత్రం ఆమెకు నిజంగా సవాలే.‘బేగం అక్తర్ పాత్రను పోషించడం అనేది కత్తిమీద సాములాంటిది. ఈ పాత్ర ఒకే సమయంలో ఉత్తేజపరుస్తుంది. ఆందోళనలోకి నెడుతుంది. విషాదంలోకి తీసుకువెళుతుంది’ అంటుంది పద్మిని కొల్హాపురి. -
క్వీన్ ఆఫ్ నట్స్ .. షుగర్, కేన్సర్ రానివ్వవు..
సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే మకడమియ తోటల సాగు మనకు బాగా కొత్త. ప్రోటీసీ కుటుంబం. ఎన్నో పోషక విలువలతో కూడినది కావటం వల్ల దీనికి క్వీన్ ఆఫ్ ద నట్స్ అని పేరొచ్చింది. మకడమియ చెట్టు గింజలను క్వీన్స్లాండ్ నట్స్ లేదా ఆస్ట్రేలియన్ నట్స్ అని కూడా పిలుస్తారు. దక్షిణాది రాష్ట్రాల్లోని ఉష్ణమండల ప్రాంతాలు దీని సాగుకు అనుకూలం. గుండె జబ్బులు, కేన్సర్, షుగర్ రానివ్వకుండా చూసే ఈ అద్భుత పంటకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..మకడమియ దీర్ఘకాలిక పంట. గుబురుగా పెరిగే చెట్టుకు కాచే గుండ్రటి మకడమియ కాయల నుంచి వొలిచిన గింజలను తింటారు. ఈ గింజలు చూడడానికి పెద్ద శనగల మాదిరిగా ఉంటాయి. గుండ్రటి కాయలోని మరొక ΄÷రలో ఈ గింజ దాక్కొని ఉంటుంది. మకడమియ చెట్లలో ఏడు జాతులున్నాయి. వాణిజ్యపరంగా సాగుకు అనువైనవి రెండు మాత్రమే. మకడమియ ఇంటెగ్రిఫోలియ (దీని కాయ పెంకు గుల్లగా ఉంటుంది), మకడమియ టెట్రాఫిల్లా (దీని కాయ పెంకు కొంచెం గట్టిగా ఉంటుంది). మిగతా రకాల గింజలు విషపూరితాలు, తినటానికి పనికిరావు.కిలో గింజల ధర రూ. 1,175మకడమియ పంట ఆస్ట్రేలియా, హవాయి, సౌతాఫ్రికా, మలావి, బ్రెజిల్, ఫిజి, కాలిఫోర్నియ (అమెరికా)లో ఎక్కువగా సాగువుతున్నది. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో కొందరు రైతులు ఈ చెట్ల సాగును ఈ మధ్యనే ప్రారంభించారు. 2017 నాటి గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 48,544 టన్నుల మకడమియ కాయల వార్షిక ఉత్పత్తి జరుగుతోంది. ప్రధానంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, కెన్యాల నుంచే 70% దిగుబడి వస్తోంది. డిమాండ్‌కు తగిన మకడమియ గింజల లభ్యత మార్కెట్లో లేదు. ఈ గింజల ఖరీదు కిలోకు 14 అమెరికన్ డాలర్లు. అంటే.. రూ. 1,175. ఇంత ఖరీదైన పంట కాబట్టే మకడమియ తోటల సాగుపై మన దేశంలోనూ రైతులు ఆసక్తి చూపుతున్నారు.12 అడుగుల ఎత్తుమకడమియ ఉష్ణమండల పంట. అన్ని కాలాల్లోనూ పచ్చగా ఉంటుంది. అశోకా చెట్ల ఆకుల మాదిరిగా దీని ఆకులు ఉంటాయి. ఎత్తు 2–12 మీటర్లు, కొమ్మలు 5–10 మీటర్ల వరకు పెరగుతాయి. తెల్లటి పూలు గుత్తులుగా (8–10 సెం.మీ. పోడవున) వస్తాయి. శీతాకాలం మధ్యలో పూత ్ర΄ారంభమవుతుంది. గుత్తికి 100కిపైగా పూలు ఉన్నా 2 నుంచి 10 కాయలు మాత్రమే వస్తాయి. స్వపరాగ సంపర్కం జరిగే పంట ఇది. కృత్రిమంగా పోలినేషన్ చేస్తే దిగుబడి పెరుగుతుంది. మకడమియ కాయ పైన ఉండే మందపాటి తీసేస్తే గట్టి గుళ్లు బయటపడతాయి. వాటిని పగులగొడితే మధ్యలో గింజలు ఉంటాయి. లేత పసుపు రంగులో మెత్తగా ఉండే గింజలు తియ్యగా ఉంటాయి. పూత వచ్చిన 7–8 నెలల్లో కాయలు కోతకొస్తాయి. 13 –31 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దీనికి సూటబుల్. వార్షిక వర్ష΄ాతం 125 సెం.మీ. చాలు. నీరు నిలవని సారవంతమైన లోమీ సాయిల్ (ఇసుక, బంకమన్ను, సేంద్రియ పదార్థం కలిసిన ఎర్ర ఒండ్రు భూములు) అనుకూలం. విత్తనాల ద్వారా, కొమ్మ కత్తిరింపుల ద్వారా మొక్కలు పెంచవచ్చు. నాటిన తర్వాత 4–5 ఏళ్లలో కాపు ప్రారంభమై.. 50–75 ఏళ్ల ΄ాటు కాయల దిగుబడినివ్వటం ఈ చెట్ల ప్రత్యేకత.ఆరోగ్యదాయక పోషకాల గనిఆరోగ్యదాయకమైన అనేక పోషకాలతో కూడి ఉండే మకడమియ గింజలు తియ్యగా, కమ్మని రుచిని కలిగి ఉంటాయి. మోనో అన్‌శాచ్యురేటెడ్ ఫాటీ ఆసిడ్లు ఉంటాయి. ఆస్ట్రేలియాలో జరిగిన పరిశోధనల ప్రకారం.. ఈ గింజలు తిన్న వారి రక్తంలో టోటల్, ఎల్డిఎల్ కొలస్ట్రాల్ తగ్గింది. వంద గ్రాముల గింజలు 718 కేలరీల శక్తినిస్తాయి. గింజలకే కాదు దాని పైన రలో కూడా అధిక కేలరీలను ఇచ్చే శక్తి ఉంది. ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఇందులో ఉన్నాయి. వంద గ్రాముల మకడమియ గింజల్లో 8.6 గ్రాములు లేదా రోజుకు మనిషికి కావాల్సిన 23% డైటరీ ఫైబర్ ఉంది. చెడు కొలెస్ట్రాల్ లేదు. బి–సిటోస్టెరాల్ వంటి ఫైటోస్టెరాల్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఓలిక్ ఆసిడ్ (18:1), పాల్మిటోలీక్ ఆసిడ్ (16:1) వంటి మోనో అన్‌శాచ్యురేటెడ్ ఫాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీసు, జింగ్, సెలీనియం (గుండె రక్షణకు ఇది ముఖ్యం) వంటి ఎంతో ఉపయోగకరమైన మినరల్స్ ఉన్నాయి. ఇంకా.. జీవక్రియలకు దోహదపడే బి–కాంప్లెక్స్ విటమిన్లు కూడా ఉన్నాయి. వంద గ్రాముల మకడమియ గింజల్లో 15% నియాసిన్, 21% పైరిడాక్సిన్ (విటమిన్ బి–6), 100% థయామిన్, 12% రిబోఫ్లావిన్ వంటి కొవ్వులో కరిగే విటమిన్లు ఉన్నాయి. ఆక్సిజన్–ఫ్రీ రాడికల్స్ కలిగించే నష్టం నుంచి డిఎన్ఎను, కణజాలాన్ని రక్షించే యాంటీఆక్సిడెంట్లు మకడమియ గింజల్లో పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఈ పంటకు అంత క్రేజ్!గుండె ఆరోగ్యానికి మేలు..షుగర్, కేన్సర్ రానివ్వవు..👉మకడమియ గింజలు గుండె ఆరోగ్యానికి మంచి చేస్తాయి. 👉 మెటబాలిక్ సిండ్రోమ్ రిస్క్ తగ్గిస్తాయి. 👉 ఊబకాయాన్ని తగ్గిస్తాయి. ∙జీర్ణ శక్తిని పెంచుతాయి. 👉 కేన్సర్ నిరోధక శక్తినిస్తాయి.👉 మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. 👉 చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. 👉 ఎముకలు, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. 👉 మానసిక వత్తిడి నుంచి ఇన్ఫ్లమేషన్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 👉 రక్తహీనత రాకుండా చూస్తాయి. 👉 మధుమేహం రాకుండా చూస్తాయి. -
మావోరీలకు కొత్త రాణి
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లోని మావోరి తెగకు కొత్త రాణి పట్టాభిషిక్తురాలయ్యారు. తండ్రి, ఏడవ రాజు టుహెటియా పొటటౌ టె వెరోహెరో 69 ఏళ్ల వయసులో గుండెకు శస్త్రచికిత్స తర్వాత శుక్రవారం మరణించడంతో ఎన్గావాయ్ హోనోయ్‌తే పొపాకీ రాణిగా వారసత్వ బాధ్యతలను స్వీకరించారు. నార్త్ ఐలాండ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో 27 సంవత్సరాల ఎన్గావాయ్ హోనోయ్‌తే పొపాకీకి మావోరి అధిపతుల మండలి రాజు బాధ్యతల్ని అప్పగించింది. మావోరి రాజు ఉద్యమానికి కేంద్రంగా ఉన్న తురంగవేవే మారే వద్ద జరిగిన సభలో ఈ మేరకు ప్రకటించారు. 1858లో మొదటి మావోరి రాజుకు అభిõÙకం చేయడానికి ఉపయోగించిన బైబిల్‌తో ఆమెను ఆశీర్వదించారు. తండ్రి శవపేటిక ముందు తర్వాత ఆమె పుష్పగుచ్ఛం ఉంచి నివాళులరి్పంచారు. అంతిమ వేడుకల్లో హాకా నృత్యాన్ని ప్రదర్శించారు. తరువాత యుద్ధ పడవల ద్వారా రాజు శవపేటికను వైకాటో నది వెంబడి తీసుకువెళ్లారు. మావోరీలకు పవిత్రమైన తౌపిరి పర్వతం పైన ఖననం చేశారు. నిబద్ధత కలిగిన నాయకుడు కింగి తుహెటియా మరణం మావోరీలకు, మొత్తం దేశానికి విచారకరమైన క్షణమని మావోరి ఉద్యమ ప్రతినిధి రహుయి పాపా అన్నారు. రాజు మరణంతో దేశం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయిందని న్యూజిలాండ్ ప్రతిపక్ష లేబర్ పార్టీ నాయకుడు క్రిస్ హిప్కిన్స్ అన్నారు. న్యూజిలాండ్ వాసులను ఏకతాటిపైకి తీసుకురావడంపై దృష్టి సారించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. రాజు టుహీటియా.. మావోరీ, న్యూజిలాండ్ ప్రజలందరి పట్ల నిబద్ధత కలిగిన నాయకుడని న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోపర్ లక్సన్ ప్రశంసించారు. రెండో రాణి.. మావోరీ తెగకు రాణిగా భాధ్యతలు స్వీకరిస్తున్న రెండో మహిళగా ఎన్గావాయ్ పేరు చరిత్రలో నిలిచిపోనుంది. అంతకు ముందు ఆమె నాన్నమ్మ టె అరికినుయి డామ్ టె అటైరంగికహు మొదటి రాణిగా సేవలందించారు. మావోరీలందరినీ సంఘటితం చేసిన గొప్ప నాయకిగా ఆమెకు మంచి పేరుంది. ఆమె కుమారుడు టుహెటియా సైతం తల్లి బాటలోనే పయనించారు. మావోరిని లక్ష్యంగా చేసుకునే విధానాలకు ఎదురు నిలిచిపోరాడా లని పిలుపునిచ్చారు. ఎన్గావాయ్ మావోరీ సాంస్కృతిక అధ్యయనాలలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. మావోరీల రాచరికం 19వ శతాబ్దం నుంచీ కొనసాగుతోంది. బ్రిటిష్ వారు న్యూజిలాండ్ భూమిని ఆక్రమించకుండా నిరోధించడానికి, మావోరీ సంస్కృతిని పరిరక్షించడానికి వివిధ మావోరీ తెగలు సొంతంగా రాజును ప్రకటించుకోవడం తెల్సిందే. -
మిస్ యూనివర్స్ నైజీరియాగా దక్షిణాఫ్రికా బ్యూటీ!
దక్షిణాఫ్రికాలో నైజీరియన్ తండ్రికి జన్మించిన చిదిమ్మా అడెత్షినా అందాల కిరిటాన్ని కైవసం చేసుకునేందుకు ఎదుర్కొన్న అడ్డంకులు అవమానాలు అన్నీ ఇన్నీ కావు. కేవలం ఆమె గుర్తింపు కారణంగా అందాల పోటీ నుంచి చివరి నిమిషంలో వైదొలగాల్సి వచ్చింది. ఎంతో మందిని దాటుకుంటూ దక్షిణాఫ్రికా అందాల పోటీల ఫైనల్‌కి చేరుకుంటే. జస్ట్ ఆమె గుర్తింపే జాతీయ వివాదానికి దారితీసి అనర్హురాలిగా చేసింది. ఐతేనేం చివరికి అనుకున్నది సాధించి అందరినోళ్లు మూయించింది. ఐడెంటిటీతో ఏ మనిషి టాలెంట్‌ని తొక్కేయలేమని చాటిచెప్పింది. వివరాల్లోకెళ్తే..దక్షిణాప్రికాకు చెందిన చిదిమ్మా అడెత్షినా ఈ నెల ప్రారంభంలో దక్షిణాఫ్రికా అందాల పోటీల్లో ఫైనలిస్ట్‌గా ఎంపిక కావడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆమె నైజీరియన్ వారసత్వం పోటీకి అనర్హురాలిగా చేసింది. ఆమె తన తల్లి ఐడెంటిటీతో దక్షిణాప్రికన్గా గుర్తింపును తెచ్చుకుందంటూ ఆరోపణలు వచ్చాయి. అంతేగాదు ఈ అందాల పోటీల్లో అడెత్షినా దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించకూడదని పలు వాదనలు వినిపించాయి. దీంతో ఆమె వెంటనే ఆ పోటీ నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా పేర్కొంది. తన కుటుంబ శ్రేయస్సు కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ పోస్ట్ పెట్టిన మరుసటి రోజే అందాల పోటీల నిర్వాహకుల నుంచి అడెత్షినాకు ఆహ్వానం అందింది. అంతర్జాతీయ వేదికపై ఆమె తన తండ్రి మాతృభూమికి ప్రాతినిధ్యం వహించగలదని పేర్కొన్నారు నిర్వాహకులు. ఆ తర్వాత ఆమె శనివారం (ఆగస్టు 31)న మిస్ యూనివర్స్ నైజీరియాగా అందాల కిరీటాన్ని గెలుచుకుంది. ఎట్టకేలకు తన కలను నెరవేర్చుకున్నా అన్న భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఈ కిరీటం అందానికి మాత్రం కాదు 'ఐక్యతకు పిలుపు' అని న్యాయ విద్యార్థి అయిన అడెత్షినా గద్గద స్వరంతో చెప్పింది. "ఈ అందమైన కల చివరికి నిజమయ్యింది. ఈ కిరీటాన్ని ధరించడం ఎంతో గర్వంగానూ, గౌరంవంగానూ ఉంది. ఈ అత్యున్నత గౌరవాన్ని స్వీకరిస్తున్న సందర్భంగా ఎన్నేళ్లుగానో బాధను రగిలిస్తున్న ఆవేదనను పంచుకోవాలనుకుంటున్నా అన్నారు. ఆఫ్రికన్ ఐక్యత గురించి మాట్లాడాలనుకుంటున్నా. మనమంతా శాంతియుత సహజీనంతో మెలుగుతూ మనల్ని వేరుచేసే అడ్డంకులను చేధించుకుందాం. ప్రతి ఆఫ్రికన్ పక్షపాతం లేకుండా స్వేచ్ఛగా బతికేలా ఆ గొప్ప ఖండం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా". అని ఇన్‌స్టాగ్రాంలో రాసుకొచ్చింది అడెత్షినా. కాగా, అడెత్షినా నైజీరియన్ తండ్రి, దక్షిణాఫ్రికా తల్లి జన్మించిన మహిళ. మొజాంబికన్ సంతతికి చెందింది. సోవెటోలో జన్మించింది. ఐతే 1995 తర్వాత నుంచిఆ దేశ ప్రభుత్వం దక్షిణాప్రికాలోనే జన్మించిన వారికి లేదా శాశ్వత నివాసికి దక్షిణాఫ్రికా పౌరసత్వాన్ని మంజూరు చేసింది. ఆ నేపథ్యమే అడెత్షినాకి దక్షిణాఫ్రికా అందాల పోటీల్లో అడ్డంకి మారి తీవ్ర అవమానాల పాలయ్యేలా చేసింది. ఏదైతేనేం చివరికి ఆమె తన కలను సాధించడమే గాక గెలుపుతో విమర్శకుల నోళ్లు మూయించింది.(చదవండి: ఈ తెలంగాణ మిస్ డ్రీమ్.. 'మిస్ ఇండియా'!) -
‘కౌసల్య–క్వీన్ ఆఫ్ హార్ట్స్’.. ఇతిహాసాల్లో స్త్రీ పాత్రలకు ఉన్నప్రాధాన్యత ఎంత?!
ఇతిహాసాల్లో స్త్రీ పాత్రలకు ఉన్నప్రాధాన్యత ఎంత?! భగవంతునికే పునర్జన్మను ఇచ్చిన స్త్రీ అంటే ఆమె ఎంత గొప్పదై ఉండాలి?! మానవ భావోద్వేగాలైన కోపం, అసూయ, ఆనందం, దుఃఖం, సంతృప్తి.. వ్యక్తిత్వాలలో నలుపు–తెలుపుల వడబోతలో వుండే షేడ్స్ ఎన్ని?! ఇలా ఎన్నో సందేహాలకు సమాధానాలు వెతుకుతూ ‘కౌసల్య’ను మన ముందుకు తెచ్చింది విభా సంగీత కృష్ణకుమార్. యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లో బయాలజీలో ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ చేస్తున్న విభా సంగీత ‘కౌసల్య– క్వీన్ ఆఫ్ హార్ట్స్’ పుస్తకాన్ని రచించింది. రామాయణంలో కొడుకు జీవితంలో స్త్రీ పాత్రకు ఉన్న ప్రాధాన్యత గురించి రాసిన ‘కౌసల్య’ పుస్తకం విభాకు మంచి పేరు తెచ్చింది. శాస్త్రీయ సంగీతంలోనూ ప్రావీణ్యురాలైన విభా సంగీతను కలిస్తే ఎన్నో విషయాలు ఇలా మన ముందుంచారు.‘‘నేను పుట్టి పెరిగింది చెన్నై. యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లో బయాలజీ ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్‌లో రెండవ సంవత్సరం చదువుతున్నాను. మా అమ్మానాన్నలు సీత, కృష్ణకుమార్ ఇద్దరూ ఉద్యోగస్తులే. రామాయణాన్ని రకరకాల కథనాల ద్వారా వింటూ పెరిగాను. అవన్నీ చాలా ఆసక్తిగా అనిపించేవి. ఈ క్రమంలోనే రామాయణంలోని స్త్రీల పాత్రల గురించి, వారి మనస్తత్వాల గురించి బాగా ఆలోచించేదాన్ని. అందులో కౌసల్య ప్రస్తావన గురించి వచ్చినప్పుడు చాలా ధర్మబద్ధమైన మహిళలలో ఒకరిగా, క్లుప్తంగా ఆమె పాత్ర ఉంది. భగవంతునికి పునర్జన్మను ఇచ్చిన స్త్రీ అంటే ఆమె ఎంత గొప్పదై ఉండాలి. ఆమెకు ఇవ్వాల్సిన గౌరవం దక్కిందా అనిపించింది. ఆ ఆలోచన నుంచి పుట్టుకువచ్చిందే ‘కౌసల్య’. ఈ పుస్తకాన్ని పూర్తిగా కౌసల్య దృష్టి కోణం నుండే తీసుకున్నాను.మొదటి పుస్తకం..పుస్తకం రాయడం పూర్తయ్యేవరకు ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. ‘రామాయణం స్ఫూర్తితో ఎన్నో పుస్తకాలు, సినిమాలు, సీరియల్స్ వచ్చాయి. వాటికి భిన్నంగా ఏం రాసుంటుంది ఈ అమ్మాయి’ అని అనుకుంటారు. నా పుస్తకంలో నా పాత్రలన్నీ మనుషులే. వారిని అతిగా ΄÷గడలేదు. అలాగని, వారిప్రాధాన్యతలను తగ్గించలేదు. మానవ భావోద్వేగాలు అన్నీ ఉంటాయి. వ్యక్తిత్వాలలో నలుపు–తెలుపు మాత్రమే కాదు వివిధ రకాల షేడ్స్ కూడా ఉంటాయి. ఇంతకు ముందు కొన్ని పుస్తకాలు రాశాను. కానీ, అవి ప్రచురించలేదు. ‘కౌసల్య– క్వీన్ ఆఫ్ హార్ట్స్’ నా మొదటి పుస్తకం. ఆంగ్లభాషా పత్రిక ‘శృతి’ మ్యాగజీన్‌కు కరస్పాండెంట్‌గా ఉన్నాను. ఈ మ్యాగజీన్లో నా వ్యాసాలు, సమీక్షలు ప్రచురించారు. ఆ విధంగా నా గురించి చాలామందికి తెలిసింది.మార్పులు చేసుకుంటూ..ఈ పుస్తకాన్ని రెండేళ్ల క్రితం జూలై 2022లోప్రారంభించాను. అలాగని నిరంతరాయంగా రాయలేదు. దీంతో పాటు అకడమిక్ బాధ్యతలు కూడా ఉన్నాయి. కిందటేడాది 84,000 పదాలతో పూర్తి చేసి అనేక మార్పులు చేశాను. ఈ నవల ప్రస్తుత వెర్షన్లో 65,000 పదాలు ఉంటాయి. జేకె పేపర్స్ ఆథర్స్ అవార్డ్ రావడం, ఢిల్లీకి చెందిన పబ్లిషర్, ఎడిటర్ రీడొమానియ నాకు ఎంతో ్రపోత్సాహాన్ని ఇచ్చారు. నేను చదువుకుంటున్నది సైన్స్‌కు సంబంధించినది. కథలు రాయడాన్ని ఇష్టపడతాను. శాస్త్రీయ సంగీతం నాకున్న మరో అభిరుచి.సామాన్యులకు సైన్స్..‘సమాజ శ్రేయస్సుకు పాటుపడటమే నా ముందున్న లక్ష్యం. రకరకాల వ్యాధుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది. నా చదువును కొనసాగిస్తూనే వాటికి సంబంధించిన అధ్యయనం కూడా చేయాలనుకుంటున్నాను. కర్ణాటక సంగీతంలో చూపించిన ప్రతిభకు గానూ వందకు పైగా బహుమతులు అందుకున్నాను. భారత ప్రభుత్వం నుండి సిసిఆర్టి స్కాలర్షిప్ పొందాను. నా రచనకు వచ్చిన మొదటి అవార్డును మాత్రం ఎప్పటికీ మరిచిపోలేను’ అంటుంది విభా సంగీత. – పరియాద రామ్మోహన్, సాక్షి, హైదరాబాద్ఇవి చదవండి: శభాష్ శంకర్! పదిహేనేళ్ల వయస్సులోనే ఏఐ స్టార్టప్‌గా.. -
లెహెంగాలో వధువు రాధిక మనోహరంగా, మహరాణిలా (ఫోటోలు)
-
అనంత్ అంబానీ-రాధిక సంగీత్‌లో మెరిసిన బ్యూటీ క్వీన్స్
-
బంగారు కాంతుల మధ్య మెరిసిపోతున్న మెహరీన్ (ఫొటోలు)
-
Seerat Kapoor: ఎర్ర చీరలో రాణిలా వెలిగిపోతున్న హీరోయిన్ (ఫోటోలు)
-
Trisha Krishnan : త్రిష పుట్టినరోజు స్పెషల్.. ప్రత్యేకమైన ఫోటోలు వైరల్
-
రాణి రావడం ఖాయం
బాలీవుడ్ హిట్ ఫిల్మ్ ‘క్వీన్’కు సీక్వెల్‌గా ‘క్వీన్ 2’ని రూపొందించే చాన్స్ ఉందని ఈ చిత్రదర్శకుడు వికాస్ బాల్ చెబుతున్నారు. కంగనా రనౌత్ లీడ్ రోల్లో రాజ్‌కుమార్ రావు కీలక పాత్రలో నటించిన చిత్రం ‘క్వీన్’. 2014 మార్చి 7న విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా ‘క్వీన్’ సీక్వెల్ గురించి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు వికాస్. ‘‘క్వీన్’ సినిమా విడుదలై దాదాపు పదేళ్లు కావస్తోంది. కానీ ఇప్పటికీ చాలామంది నన్ను ‘క్వీన్ 2’ సినిమా గురించే అడుగుతున్నారు. ‘క్వీన్ 2’కి కథ రెడీగానే ఉంది. ఎప్పుడన్నది ఇప్పుడే చెప్పలేను కానీ క్వీన్ రావడం ఖాయం’’ అన్నారు వికాస్. ఇక ఈ సీక్వెల్లోనూ కంగనా రనౌత్‌నే కథాకానాయికగా తీసుకుంటారా? అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే.. వికాస్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘సైతాన్’ మార్చి 8న విడుదల కానుంది. ఈ సినిమాలో అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతిక లీడ్ రోల్స్ చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే వికాస్ ‘క్వీన్ 2’ గురించి వెల్లడించినట్లుగా తెలుస్తోంది. -
తొలి ‘ఎయిమ్స్’ ఎలా ఏర్పాటైంది? యువరాణి అమృత్ కౌర్‌కు సంబంధం ఏమిటి?
దేశ రాజధాని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటే ఎయిమ్స్ గురించి తెలియనివారెవరూ ఉండరు. దేశంలోని సుదూర ప్రాంతాల నుంచి కూడా బాధితులు ఎయిమ్స్‌కు వస్తుంటారు. అయితే ఎయిమ్స్‌ను ఎలా స్థాపించారో, దాని వెనుక ఎవరి చొరవ ఉందో తెలుసా? దేశ తొలి మహిళా ఆరోగ్య మంత్రి రాజకుమారి అమృత్‌కౌర్ ఎయిమ్స్ గురించి కలలుగన్నారు. యువరాణి అమృత్ కౌర్ 1887 ఫిబ్రవరి 2న లక్నోలో జన్మించారు. ఆమె తండ్రి రాజా హర్నామ్ సింగ్ అహ్లువాలియాను బ్రిటీషర్లు ‘సర్’ బిరుదుతో సత్కరించారు. హర్నామ్ సింగ్ అహ్లువాలియా పంజాబ్‌లోని కపుర్తలా సంస్థానానికి చెందిన మహారాజుకు చిన్న కుమారుడు. కపుర్తలా సింహాసనం విషయంలో వివాదం ప్రారంభమైనప్పుడు రాజా హర్నామ్ సింగ్ తన రాజ్యాన్ని విడిచిపెట్టి, కపుర్తలా నుండి లక్నోకు చేరుకున్నారు. అనంతరం హర్నామ్ సింగ్ అహ్లువాలియా అవధ్ రాచరిక రాష్ట్రానికి మేనేజర్‌గా చేరారు. అంతే కాదు క్రిస్టియన్ మతం స్వీకరించారు. హర్నామ్ సింగ్ అహ్లువాలియా పశ్చిమ బెంగాల్ (అప్పటి బెంగాల్)కు చెందిన ప్రిస్కిల్లాను వివాహం చేసుకున్నారు. ఆమె తండ్రి పేరు గోకుల్‌నాథ్ ఛటర్జీ. రాజా సాహెబ్, ప్రిస్కిల్లాకు తొమ్మిది మంది కుమారులు. యువరాణి అమృత్ కౌర్ 10వ సంతానంగా జన్మించారు. రాజా హర్నామ్ సింగ్ అహ్లూవాలియా యువరాణి అమృత్ కౌర్‌ను చదువుకునేందుకు విదేశాలకు పంపారు. ఆమె ఇంగ్లాండ్‌లోని డోర్సెట్‌లోని షీర్బార్న్ స్కూల్ ఫర్ గర్ల్స్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేశారు. అనంతరం ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రురాలయ్యారు. చదువు పూర్తయ్యాక ఆమె 1908లో భారత్‌కు తిరిగివచ్చారు. మహాత్మా గాంధీ రాజకీయ గురువు గోపాల్ కృష్ణ గోఖలేకు ప్రభావితురాలైన యువరాణి అమృత్ కౌర్ స్వాతంత్ర్య పోరాటంలో చేరారు. మహాత్మా గాంధీకి అభిమానిగా మారారు. దండి మార్చ్ సమయంలో జైలుకు వెళ్లారు. తల్లిదండ్రుల మరణానంతరం ఆమె 1930లో రాజభవనాన్ని విడిచిపెట్టి స్వాతంత్ర్య ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేశారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో అమృత్ కౌర్ గొప్ప పాత్ర పోషించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత విద్యావంతులైన యువరాణి అమృత్ కౌర్ ఆరోగ్య మంత్రిగా నియమితులయ్యారు. వైద్యరంగంలో చికిత్స, పరిశోధనల కోసం దేశంలోనే ఉన్నతమైన వైద్యసంస్థను నెలకొల్పాలన్నది అమృత్ కౌర్ కల. ఇందుకోసం ఆమె 1956 ఫిబ్రవరి 18న లోక్‌సభలో కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. అమృత్ కౌర్ కల సాకారం కావాలని అందరూ కోరుకున్నారు. అనంతరం యువరాణి అమృత్ కౌర్ ఎయిమ్స్ ఏర్పాటు కోసం నిధుల సేకరణను ప్రారంభించారు. అమెరికాతో పాటు స్వీడన్, పశ్చిమ జర్మనీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల నుంచి నిధులను సేకరించారు. సిమ్లాలోని తన ప్యాలెస్‌ను ఎయిమ్స్‌కు ఇచ్చారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చట్టం మే 1956లో పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందింది. ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీకి అధ్యక్షురాలైన మొదటి ఆసియా మహిళ గానూ కూడా అమృత్ కౌర్ ఖ్యాతి గడించారు. ఆమె 1964 ఫిబ్రవరి 6న న్యూఢిల్లీలో కన్నుమూశారు. -
పబ్‌లో తొలి ప్రేమ ఇపుడు డెన్మార్క్ రాణిగా..అద్భుత లవ్ స్టోరీ
డెన్మార్క్ రాణి పదవినుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడంతో కానున్న డెన్మార్క్ రాణి మేరీ డొనాల్డ్సన్ ఎవరు, ఏంటి అనేదానిపై ఆసక్తి నెలకొంది. అసలు ఎవరీ మేరీ. ఒక సాధారణ యువతి యువరాణిగా , రాచకుటుంబంలో ఒక ట్రెండ్ సెట్టర్‌గా, ఎలా మారింది. ఈ వివరాలు చూద్దాం. మాజీ ఆస్ట్రేలియన్ అడ్వర్టైజింగ్ ఎగ్జిక్యూటివ్ , రియల్ ఎస్టేట్‌లో పనిచేస్తున్న టాస్మానియాకు చెందిన 28 ఏళ్ల యువతితో, డెన్మార్క్ యువరాజు ఫ్రెడెరిక్ (ఫ్రెడ్) తో పరిచయం ప్రేమ పరిచయం ఒక అద్భుత కథ. 2000, సెప్టెంబరులో ఒక పబ్‌లో ఇద్దరూ కలుసుకున్నారు. తొలిసారి ఆయనను కలిసినపుడు, షేక్ హ్యాండ్ ఇచ్చినపుడు డెన్మార్క్ యువరాజు అని తనకు తెలియదని మేరీ 2003లో ఇంటర్వ్యూలో చెప్పారు. అసలు తాను యువరాణి అవుతానని కలలో కూడా ఊహించలేదన్నారు. అలాగే ఫ్రెడ్‌తో మాట కలిసింది మొదలు మాట్లాడుకుంటూనే ఉన్నామంటూ తమ ప్రేమ కథను గుర్తుచేసుకున్నారు. తన ఫోన్ నెంబరు తీసుకోవడం, కలిసిన మరునాడే కాల్ చేయడం లాంటి సంగతులను ముచ్చటించారు. అలాగే ఆమెను చూసిన తొలిచూపులోనే ప్రేమ, తన సోల్‌మేట్‌ను కలిసిన అనుభూతి కలిగిందని ఫ్రెడరిక్ చెప్పడం విశేషం. ఇదీ చదవండి: హీరో అయితేనేం.. ఆ కూతురికి నాన్నేగా! ప్రేమ, వివాహం తరువాత రాచరికపు మర్యాదలకు, గౌరవాలకు భంగం కలగకుండా ప్రవర్తించిందామె. డానిష్ అనర్గళంగా మాట్లాడటంతోపాటు, తన సొంత ఊరిని, భాషను, యాసను మర్చిపోలేదు.అంతేకాదు ప్రిన్సెస్ మేరీ టాస్మానియాకు అద్భుతమైన రాయబారి అని టాస్మానియా ప్రీమియర్ జెరెమీ రాక్లిఫ్ ఇటీవల ప్రకటించడం ఇందుకు నిదర్శనం. కోపెన్‌హాగన్‌లోని ఆస్ట్రేలియన్ ప్రవాసులు తమ దేశ బిడ్డ మేరీ డెన్మార్క్ క్వీన్ అయినందుకు సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే తనదైన వ్యక్తిత్వంతో, ప్రగతి శీలంగా ఉంటూ మహిళలు, పిల్లల హక్కులు, గృహహింసకు వ్యతిరేకంగా తన భావాలను పంచుకుంటూ అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కించుకున్నారు. 23 ఏళ్ల తరువాత 51 ఏళ్ల వయసులో డెన్మార్క్ తదుపరి రాణిగా అవతరించబోతున్నారు. ఈ (జనవరి 14,2024) ఆదివారం భర్త ఫ్రెడరిక్ సింహాసనాన్ని అధిష్టించిన తర్వాత ఆమె రాణి హోదాను దక్కించుకోనున్నారు. ఇదీ చదవండి: బిల్కిస్ బానో కేసు: ఎవరీ సంచలన మహిళా జడ్జి? రాణి మార్గరెట్ -2పదవీ విరమణ వయసు, అనారోగ్య కారణాలు, 2023 ఫిబ్రవరిలో తన వెన్నెముకకు జరిగిన ఆపరేషన్ తదితర కారణాల రీత్యా దేశ సింహాసనం నుంచి తప్పుకుంటూ డెన్మార్క్ రాణి మార్గరెట్ -2 (83) సంచలన నిర్ణయం తీసుకున్నారు. జనవరి 14తో రాణిగా 52 ఏళ్లు పూర్తి కాబోతున్నాయని, అదే రోజున సింహాసనాన్ని వీడనున్నట్టు ప్రకటించారు. కొత్త ఏడాది రోజు తన నిర్ణయాన్ని ప్రకటించగానే దేశ ప్రజలంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అలాగే తన వారసుడిగా కుమారుడు క్రౌన్ ప్రిన్స్ ఫ్రెడెరిక్ కిరీటాన్ని ధరిస్తాడని కూడా అదే రోజు వెల్లడించారు. "నేను ఎక్కువ వెలుగులో ఉంటాను కాబట్టి, కొంతమంది నా భర్త నా ప్రభావంలో ఉన్నారని అనుకుంటారు కానీ మేము అలా కాదు. ఒకరి నీడలో మరొకరం ఉండం, నిజానికి ఆయనే నా వెలుగు’’ - ప్రిన్స్ ఫ్రెడరిక్ ( 2017) బయోగ్రఫీలో మేరీ రాశారు. ఫిబ్రవరి 5, 1972న టాస్మానియా రాజధాని హోబర్ట్‌లో జన్మించారు మేరీ. ఆమె తండ్రి గణితశాస్త్ర ప్రొఫెసర్ , ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంది. గుర్రపు స్వారీ, ఆటల్లో మంచి ప్రవేశం ఉంది. లా అండ్ కామర్స్ చదివి మెల్బోర్న్, సిడ్నీలో ప్రకటన రంగంలో కరియర్‌ను స్టార్ట్ చేసింది.అలా ఆస్ట్రేలియాలో అడ్వర్టైజింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నప్పుడు, 2000లో వేసవి ఒలింపిక్స్‌లో సిడ్నీలోని స్లిప్ ఇన్ బార్లో స్నేహితులతో కలిసి బయటికి వెళ్లినప్పుడు అప్పటి 34 ఏళ్ల ఫ్రెడరిక్‌ను కలుసుకుంది.ఈ జంట అధికారికంగా 2003 అక్టోబరులో నిశ్చితార్థం చేసుకున్నారు . అలాగే మే 14, 2004న కోపెన్హాగన్ కేథడ్రల్‌లో వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు. ప్రిన్స్ క్రిస్టియన్( 18) ప్రిన్సెస్ ఇసాబెల్లా(16), కవల పిల్లలు ప్రిన్స్ విన్సెంట్ ప్రిన్సెస్ జోసెఫిన్ (13) ఉన్నారు. ఇదీ చదవండి: ఇది మహిళలందరి విజయం..మాకూ ధైర్యం: రెజ్లర్ వినేష్ ఫోగట్ -
డెన్మార్క్ రాణి మార్గరేట్-II పదవీ విరమణపై కీలక ప్రకటన
కోపెన్హాగన్: న్యూఇయర్ రోజున డెన్మార్క్ రాణి మార్గరేట్-II(83) కీలక ప్రకటన చేశారు. జనవరి 14న తాను పదవీ విరమణ చేయనున్నట్లు స్పష్టం చేశారు. తన కుమారుడు ప్రిన్స్ ఫ్రెడరిక్కు తన బాధ్యతలు అప్పగిస్తానని వెల్లడించారు. యూరప్‌లోనే అత్యధికంగా 52 ఏళ్లుగా పదవిలో ఉన్న చక్రవర్తిగా మార్గరేట్-II నిలిచారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్-II మరణం తర్వాత యూరప్‌లో అధికారంలో ఉన్న ఏకైక రాణి మార్గరేట్. డెన్మార్క్ టెలివిజన్‌లో ప్రసారమయ్యే సాంప్రదాయ నూతన సంవత్సర ప్రసంగం సందర్భంగా ఆమె తన వయస్సు, ఆరోగ్య సమస్యలను పేర్కొంటూ ఆశ్చర్యకరంగా పదవీ విరమణ ప్రకటన చేశారు. డెన్మార్క్‌లో 1972లో సింహాసనం అధిరోహించిన రాణి మార్గరేట్.. చక్రవర్తిగానే గాక వివిధ కళల్లో ఉన్న ప్రతిభతో సాధారణ ప్రజల్లో ప్రజాధరణ పొందారు. ఆమె హయాంలోనే డెన్మార్క్ సహా ప్రపంచంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రపంచీకరణ, 1970, 1980నాటి ఆర్థిక సంక్షోభాలు, 2008 నుంచి 2015 మధ్య తీవ్ర కరువు, కరోనా మాహమ్మారి వంటి పరిస్థితులను డెన్మార్క్ ఎదుర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ డెన్మార్ను ఐక్యంగా ఉంచడంలో ఆమె సఫలం అయ్యారు. మెరిసే నీలి కళ్లతో నిత్యం ఉత్సాహంగా ఉండే మార్గరేట్.. అనేక కళల్లో నిష్ణాతురాలు. పేయింటింగ్, కాస్ట్యూమ్, సెట్ డిజైనర్‌గా రాయల్ డానిష్ బ్యాలెట్, రాయల్ డానిష్ థియేటర్‌తో కలిసి పనిచేశారు. ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, స్వీడిష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. "ఆల్ మెన్ ఆర్ మోర్టల్"తో సహా అనేక నాటకాలను కూడా ఆమె అనువదించారు. ఇదీ చదవండి: మరిన్ని శాటిలైట్లు, అణ్వస్త్రాలు: కిమ్ -
దేశ రాజకీయాల్లో మహరాణులెవరు? ఎక్కడ చక్రం తిప్పుతున్నారు?
రాజభవనాల నుంచి బయటకు వచ్చి, రాజకీయాల్లో కాలుమోపిన మహరాజుల ట్రెండ్ 1951-52లో మొదలైంది. అప్పటి రాజు దివంగత హన్వంత్ సింగ్ రాథోడ్(జోధ్‌పూర్) లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఫలితాలు వెలువడకముందే విమాన ప్రమాదంలో మరణించారు. దీని తరువాత, అతని కుమారుడు గజ్ సింగ్, కుమార్తె రాజకుమారి చంద్రేష్ కుమారి కటోచ్ రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇద్దరూ అదృష్టాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం రాజకీయాల్లో రాణిస్తున్న రాణులు, యువరాణుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. విజయరాజే సింధియా: దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1957లో రాణి రాజమాత విజయరాజే సింధియా కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నారు. 1957లో గుణ(మధ్యప్రదేశ్) లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన విజయరాజే సింధియా తొలిసారిగా పార్లమెంటుకు చేరుకున్నారు. వసుంధర రాజే: గ్వాలియర్ రాజ కుటుంబానికి చెందిన వసుంధర రాజే 1984లో బీజేపీ జాతీయ కార్యవర్గంలో చేరారు. 1985-87 మధ్య కాలంలో ఆమె భారతీయ జనతా యువమోర్చా రాజస్థాన్ ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. 1998-1999లో అటల్ బిహారీ వాజ్‌పేయి క్యాబినెట్లో వసుంధర రాజే విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. భైరోన్ సింగ్ షెకావత్ ఉపరాష్ట్రపతి అయిన తర్వాత, రాజస్థాన్‌లో ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారు. రాజస్థాన్‌లో వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఝల్రాపటన్ నుండి పోటీచేస్తున్నారు. దియా కుమారి: జైపూర్ మహారాణి, కూచ్ బెహార్ యువరాణి గాయత్రీ దేవి కూడా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి, స్వతంత్ర పార్టీ ఎన్నికల గుర్తుపై 1962లో వరుసగా మూడుసార్లు గెలిచారు. ఆమె 2013లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. 2019లో బీజేపీ ఆమెకు లోక్‌సభ టికెట్ ఇచ్చింది. గెలిచిన తరువాత ఆమె పార్లమెంటులో స్థానం దక్కించుకున్నారు. యశోధర రాజే సింధియా: యశోధర రాజే సింధియా, జీవాజీరావు సింధియా, దివంగత రాజమాత విజయరాజే సింధియాల కుమార్తె. 1998 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తరపున పోటీచేసి గెలుపొందారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని, రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆమె ప్రకటించారు. గాయత్రీ రాజే పన్వార్: మధ్యప్రదేశ్‌లోని దేవాస్ రాజ కుటుంబానికి చెందిన గాయత్రీ రాజే పన్వార్‌కు దేవాస్ అసెంబ్లీ స్థానం నుండి టిక్కెట్ లభించింది. గాయత్రి ప్రస్తుతం ఈ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. తుకోజీ రావు పవార్ ఈ స్థానం నుండి వరుసగా ఆరు సార్లు ఎన్నికయ్యారు. ఆయన 2015లో మరణించడంతో ఉప ఎన్నిక జరిగింది. అతని భార్య గాయత్రి రాజే పవార్ ఆ స్థానం నుంచి గెలిచారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. పక్షాలికా సింగ్: రాణి పక్షాలికా సింగ్ యూపీలోని బాహ్ అసెంబ్లీ స్థానానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే. ఆమె 2017లో బీజేపీలో చేరారు. యూపీలోని అత్యంత ధనిక మహిళా ఎమ్మెల్యే రాణి పక్షాలికా సింగ్. 2017లో ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన అఫిడవిట్లో తనకు సుమారు రూ.58 కోట్ల విలువైన చర, స్థిరాస్తులు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: బాబాల మాయలో మధ్యప్రదేశ్ సర్కార్? ‘ఓట్ల ఆశీర్వాదం’ కోసం పడిగాపులు? -
ప్రపంచంలోనే అత్యంత ధనిక మహిళ.. ఎలాన్ మస్క్, అంబానీ కంటే ఎక్కువే!
World Richest Woman Empress Wu: ఆధునిక కాలంలో ధనవంతులెవరు? అనగానే ప్రపంచ వ్యాప్తంగా ఎలాన్ మస్క్, మన దేశంలో ముఖేష్ అంబానీ గుర్తుకు వస్తారు. ఇక మహిళల్లో అయితే ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్, ఇండియాలో సావిత్రి జిందాల్ జ్ఞప్తికి వస్తారు. వీరందరి కంటే ముందు ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళా ఎవరనేది బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు క్షుణ్ణంగా తెలుసుకుందాం. చైనా మహారాణి.. ప్రపంచంలో అత్యధిక సంపద కలిగిన మహిళల్లో చైనాకి చెందిన మహారాణి 'ఎంప్రెస్ వు' (Empress Wu) అని తెలుస్తోంది. చైనీస్ చరిత్రలోనే టాంగ్ రాజవంశానికి చెందిన ఏకైన అందమైన మహిళా చక్రవర్తి. పదవి కోసం పిల్లలను చంపిన చరిత్ర ఈమెదని కొంతమంది చెబుతారు. ఉన్నత విద్యావంతురాలు.. చరిత్రకారుల ప్రకారం.. ఎంప్రెస్ వు కేవలం అందమైన మహిళ మాత్రమే కాదు, ఉన్నత విద్యావంతురాలు. అలాగే చాలా మోసపూర్తితమైన, క్రూరమైన వ్యక్తిగా తెలుస్తోంది. ఈమె జీవితం ఆధారంగా గతంలో చాలా సినిమాలు కూడా తెరకెక్కాయి. తన రాజ్యాన్ని సుమారు 15 సంవత్సరాలు పరిపాలించి, మధ్య ఆసియాలో చైనా సామ్రాజ్యం విస్తరించడంలో గొప్ప పాత్ర పోషించింది. ఎంప్రెస్ వు హయాంలో టీ, సిల్క్ వ్యాపారంతో మంచి బిజినెస్ జరిగేదని చైనా ప్రాజెక్టు నివేదించింది. ప్రస్తుతం ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంపద 235 బిలియన్ డాలర్లు అని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఒకప్పుడు చక్రవర్తిగా బతికిన ఎంప్రెస్ వు సంపద సుమారు 16 ట్రిలియన్ డాలర్లకి తెలుస్తోంది. అంటే ఈమె సంపద మస్క్ సంపాదకంటే ఎన్నో రెట్లు ఎక్కువని స్పష్టమవుతోంది. -
సంగీతానికి సరిహద్దులు లేవోయి!
దేశానికి సరిహద్దులు ఉండొచ్చుగానీ సంగీతానికి ఉండవు అని మరోసారి గుర్తు చేసిన ఈ వీడియో అంతర్జాలంలో వైరల్ అవుతూ ‘ఆహా’ అనిపిస్తోంది. విషయం ఏమనగా... భారతీయ యువతి ఒకరు లండన్‌లోని బిగ్‌బెన్(గ్రేట్ బెల్ ఆఫ్ ది గ్రేట్ క్లాక్ ఆఫ్ వెస్ట్‌మినిస్టర్)కు సమీపంలో బాలీవుడ్ సినిమా ‘క్వీన్’లోని ‘లండన్ తుమ్ఖడా’ పాటకు డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. చుట్టుపక్కల జనాలు గుంపులుగా చేరి ఆ డాన్స్‌ను ఆసక్తితో చూడడం మొదలుపెట్టారు. సీన్ ఇదే అయితే ఈ సీన్ గురించి చెప్పడానికి అంత సీన్ ఉండేది కాదు. అయితే హిందీ భాషలో ఒక్క ముక్క కూడా అర్థం కాని ఆ జనాలు యువతితో పాటు డ్యాన్స్ చేయడం కోసం కాలు కదపడమే విషయం. . ‘ఇలాంటి దృశ్యాన్ని లండన్‌లో మాత్రమే చూడగలం’ అనే కాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. -
అసలు క్లియోపాత్రా ఏ కలర్? నెట్‌ఫ్లిక్స్‌తో ఎందుకీ రచ్చ!
స్ట్రీమింగ్ సర్వీస్ నెట్‌ఫ్లిక్స్‌కి మరో వివాదపు సెగ తగిలింది. నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన డాక్యుమెంటరీ సిరీస్ ‘ఆఫ్రికన్ క్వీన్స్: క్వీన్ క్లియోపాత్ర’ ట్రైలర్ ద్వారానే రచ్చ రేపింది. చరిత్రలో ఉన్న బ్లాక్ క్వీన్స్‌ను హైలెట్ చేస్తూ నిర్మించిన ఈ సిరీస్‌లో క్లియోపాత్ర మీద తీసిన పోర్షన్ ట్రైలర్‌పై ఈజిప్ట్ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు కారణం.. క్లియోపాత్రా పాత్ర కోసం ఓ బ్లాక్ ఆర్టిస్ట్‌ను ఎంచుకోవడం!. క్వీన్ క్లియో పాత్రా దేహం నలుపు రంగు కాదని.. ఆమె ఛామన ఛాయ రంగులో ఉండేదని ప్రముఖ ఆర్కియాలజిస్ట్ జాహి హవాస్ నెట్‌ఫ్లిక్స్ క్వీన్ క్లియోపాత్రాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమెది యూరోపియన్ మూలాలని చెప్తున్నారాయన. క్లియోపాత్రా గ్రీకుకు చెందిన వ్యక్తి. మాసిడోనియా రాజులు, రాణులతో ఆమెకు దగ్గరి పోలికలు ఉన్నాయి అని పేర్కొన్నారు. మరోవైపు క్లియోపాత్ర రంగును నలుపుగా చూపించడం ద్వారా.. ఆమె ఈజిప్ట్ గుర్తింపును తుడిచేసే ప్రయత్నం జరుగుతోందంటూ మహమొద్ అల్ సెమారీ అనే లాయర్ ఈజిప్ట్ అటార్నీ జనరల్‌కు ఓ విజ్ఞప్తి సమర్పించాడు. ఈజిప్ట్‌లో నెట్‌ఫ్లిక్స్‌ను బ్లాక్ చేయడం ద్వారా ఆ వివాదాస్పద సిరీస్ ప్రసారం కాకుండా చూడాలంటూ కోరారాయన. అయితే.. ఇది అనవసర వివాదమంటోంది ఈ సిరీస్ నిర్మాణంలో భాగం పంచుకున్న జడా పింకెట్ స్మిత్(విల్‌స్మిత్ భార్య). ఇది కేవలం బ్లాక్ క్వీన్స్ గురించి, వాళ్ల గొప్పదనం గురించి చెప్పడమేగానీ ఇతర ఉద్దేశం లేదని ఆమె ఆంటోంది. అయినప్పటికీ.. ఈజిప్ట్ మాత్రం నెట్‌ఫ్లిక్స్‌పై ఆగ్రహంతో ఊగిపోతోంది. బ్యాన్ నెట్‌ఫ్లిక్స్ ట్రెండ్‌ను నడిపిస్తోంది అక్కడి సోషల్ మీడియా. హిస్టరీ ఐకాన్.. క్లియోపాత్రా గ్రేట్ ఫిగర్స్ ఆఫ్ హిస్టరీలో ఒకరిగా పేరుంది క్లియోపాత్రాVII ఫిలోపేటర్కి. ముందున్న ఆరుగురు క్లియోపాత్రాల్లో ఎవరికీ లేని ప్రత్యేకతలున్నాయి కాబట్టే ఈమె గురించి ఇంత చర్చ. రాజకీయ వ్యూహాలు రచించడంలో క్లియోపాత్రాVII సిద్ధహస్తురాలని, కొన్ని సార్లు ఆమె ఎత్తులకు చక్రవర్తులే చిత్తయిపోయేవారని చరిత్ర చెబుతుంది. అంతేకాదు.. గొప్ప అందగత్తె అయినప్పటికీ శారీరక సుఖం కోసం ఆమె ఎంతదాకా అయినా వెళ్తుందనే ప్రచారమూ ఒకటి ఉంది. 👉 క్రీస్తు పూర్వం 48లో ఆమె ఈజిప్ట్‌ను మహారాణిగా పాలించారు. ఆమె ఈజిప్టులోని అలెగ్జాండ్రియలో క్రీస్తు పూర్వం 69లో జన్మించారు. టాలమీ వంశస్థురాలైన క్లియోపాత్రా.. పాలనలోనే కాదు పలు రంగాల్లోనూ నేర్పరి. బహుభాషా కోవిదురాలు. గొప్ప రచయిత. కాస్మోటిక్స్, హెయిర్ కేర్ మీద ఆమె ఓ పుస్తకం కూడా రాశారట. 👉 క్లియోపాత్రా అధికారం కోసం.. సోదరి బైరినైస్, తండ్రి 12వ టాలెమీ మరణాంతరం రాజైన సోదరుడు 13వ టాలెమీ (ఆచారం ప్రకారం.. ఇతన్నే వివాహం చేసుకుని ఈజిప్ట్‌కు రాణి అయ్యింది) పథకం ప్రకారం అడ్డు తొలగించుకుంది. ఆపై ఇరవై ఏళ్లపాటు ఈజిప్ట్‌ను పాలించింది క్లియోపాత్రా. 👉 రోమ్ చక్రవర్తి జూలియస్ సీజర్, అతని కుడిభుజం మార్కస్ ఆంటోనియస్లతో క్లియోపాత్రా రొమాంటిక్ రిలేషన్షిప్ నడిపింది. 👉 క్లియోపాత్రాతో జూలియస్ సీజర్ బంధాన్ని రోమన్ సైన్యాధికారులు తట్టుకోలేకపోయారు. తిరుగుబాటు చేశారు. ఆ పరిణామంతో మనస్తానం చెంది.. కత్తితో పొడుచుకుని క్లియోపాత్రా ఒడిలోనే చనిపోయాడని ఓ కథనం, శత్రువుల చేతిలోనే మరణించాడని మరో కథనం ప్రచారంలో ఉంది. 👉 క్లియోపాత్రా ఒకానొక సమయంలో నిరాదరణకు గురవడంతో తీవ్ర మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. పాముతో తన వక్షోజాలకు కాటు వేయించుకుని మరీ ప్రాణం విడిచింది. ఆమెతోపాటు ఆమె చెలికత్తెలు కూడా అదే విధంగా చనిపోయారు. అయితే.. ఇది ఒక వర్షన్. ఆమెకు ఎవరో విషం ఇచ్చి చంపారు. ఇది రెండో వర్షన్. దీంతో.. క్లియోపాత్రా మరణం చరిత్రలో మిస్టరీగానే మిగిలిపోయింది. 👉 టాలోమీ రాజవంశం.. మొదటి శతాబ్దం BCలో రోమన్ ఆక్రమణతో ముగిసింది. 👉 క్లియోపాత్రాకు మొత్తం 4 మంది సంతానమని ఈజిప్ట్ చరిత్ర పుస్తకాలు చెబుతుంటాయి. కానీ వారిలో ఒక్కరు మాత్రమే బతికారట. ఆమె క్లియోపాత్రా సెలిన్. 👉 క్లియోపాత్రా నల్లజాతి మూలాలున్న వ్యక్తేనని ఆఫ్రోసెంటిస్ట్ స్కాలర్స్ ప్రతిపాదించారు. కానీ, చాలామంది మేధావులు మాత్రం ఆమె అందగత్తె కాబట్టే చక్రవర్తులు వెర్రెత్తిపోయారని చెబుతూ ఆ వాదనను కొట్టేశారు. కొసమెరుపు.. క్లియోపాత్రాను ఆఫ్రికన్ సంతతి వ్యక్తిగా చూపించిన ఈ డాక్యుమెంటరీలో బ్రిటిష్ నటి అడెలె జేమ్స్ లీడ్రోల్లో నటించింది. :::సాక్షి వెబ్ ప్రత్యేకం -
నా శత్రువులకు ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటా: కంగనా
ఎలాంటి విషయమైనా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పే నటీనటుల్లో బాలీవుడ్ బ్యూటీ క్వీన్ కంగనా రనౌత్. అందుకే ఆమెకు ఫైర్ బ్రాండ్‌గా పేరు సంపాదించింది. అటు సినిమాలతో పాటు.. ఇటు రాజకీయ అంశాలను ప్రస్తావిస్తూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంది. అందుకే కంగనా అంటే కాంట్రవర్సీ క్వీన్ అని కూడా పిలుస్తారు. తన మాటలు కాంట్రవర్సీ అయినా కూడా.. ధైర్యంగా ఎదుర్కొగల సత్తా ఆమెది. మార్చి 23న కంగనా రనౌత్ బర్త్ డే సందర్భంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె ప్రయాణంపై ఓ లుక్కేద్దాం. కంగనా రనౌత్ మార్చి 23 1987లో హిమాచల్ ప్రదేశ్‌లోని భంబ్లా అనే పల్లెటూరిలో జన్మించారు. ఆమె తల్లిదండ్రుల కోరికతో డాక్టర్ అవ్వాలని అనుకునేవారు. కానీ తన 16వ ఏటనే కెరీర్ కోసమని ఢిల్లీకి వచ్చారు. అదే సమయంలో మోడలింగ్ వైపు అడుగులు వేశారు. ఆమె 2006లో గాంగ్ స్టర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాకి ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారం అందుకుంది. ఆ తర్వాత వోహ్ లమ్హే (2006), లైఫ్ ఇన్ ఎ మెట్రో (2007), ఫ్యాషన్ (2008) సినిమాలతో గుర్తింపు దక్కించుకుంది. ఈ మూడు సినిమాలకు జాతీయ, ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి అవార్డులు కూడా అందుకున్నారు. ఆమెకు ఇప్పటివరకూ మూడు జాతీయ, నాలుగు ఫిలింఫేర్ పురస్కారాలు దక్కాయి. హృతిక్ సరసన ఆమె నటించిన క్రిష్- 3 సినిమా ఆమె కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. (ఇది చదవండి: ఓటీటీకి బలగం మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) ఇవాళ కంగనా రనౌత్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఓ వీడియో సందేశం రిలీజ్ చేశారు కంగనా. ఎవరైనా తన వల్ల బాధపడి ఉంటే క్షమించాలని ఆ వీడియో కోరింది. ఇవాళ ఆమె 36వ బర్త్ డే జరుపుకుంటున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించిన కంగనా తన గురువులకు ధన్యవాదాలు తెలిపింది. కంగనా మాట్లాడుతూ..'నన్ను ఎప్పుడూ విశ్రాంతి తీసుకోనివ్వని నా శత్రువులు. నేను ఎంత సక్సెస్ సాధించినా.. నన్ను నా కాలి మీద నిలబడేలా విజయపథంలో నడిపించారు. వారే నాకు పోరాడటం నేర్పించారు. నేను వారికి ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. మిత్రులారా నా భావజాలం చాలా సులభం. నా ప్రవర్తన, ఆలోచనలు సరళమైనవి. నేను ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరికీ మంచి జరగాలనే కోరుకుంటున్నా. నేను దేశ సంక్షేమం గురించి మాట్లాడిన విషయాలు ఎవరినైనా బాధపెట్టి ఉండొచ్చు. అందులో కేవలం మంచి ఆలోచనలు మాత్రమే ఉన్నాయి.' అని అన్నారు. కాగా.. రెండు రోజుల క్రితమే కంగనా నటుడు దిల్జిత్ దోసాంజ్‌ను టార్గెట్ చేసింది. ఖలిస్తానీలకు మద్దతుగా నిలిచినందుకు పోలీసులు అతడిని త్వరలో అరెస్టు చేస్తారని పేర్కొంది. ఆమె గతంలో అలియా భట్, స్వర భాస్కర్, అమీర్ ఖాన్, తాప్సీ పన్నులతో కూడా విభేదించింది. కాగా..ప్రస్తుతం ఆమె ఎమర్జన్సీ, చంద్రముఖి-2 చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. Message from my heart … 🤗♥️ pic.twitter.com/LxgxnOO0Xg — Kangana Ranaut (@KanganaTeam) March 23, 2023 -
జయపురం మహారాణి ఇక లేరు
జయపురం (భువనేశ్వర్): మహారాణి రమాకుమారి దేవి(92) వృద్ధాప్య అనారోగ్య కారణాలతో సోమవారం పరమపదించారు. ఆమె జయపురం ఆఖరి మహారాజు రామకృష్ణ దేవ్ పట్టపురాణి. సాహిత్య సామ్రాట్ విక్రమదేవ్ వర్మకు కోడలు. రామకృష్ణ దేవ్ వృద్ధాప్య ఛాయలతో కొన్నేళ్ల క్రితం మరణించిన విషయం తెలిసిందే. రమాకుమారి దేవి ఆంధ్రప్రదేశ్‌లోని మాడుగుల శాశనసభ నియోజకవర్గం నుంచి 1975లో ఎమ్మెల్యేగా పోటిచేసి, గెలుపొందారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం కాగా, ముగ్గురూ ఇదివరకే మృతిచెందారు. ఇద్దరు యువరాణిలు(కోడల్లు), మనుమడు విశ్వేశ్వర చంద్రచూడ్ దేవ్, మనుమరాలు ఉన్నారు. విషణ్న వదనంలో యువరాజు చంద్రచూడ్ దేవ్, అతని తల్లి మహారాణి మరణ సమయంలో కోటలోనే ఉన్న చంద్రచూడ్, రాజ కుటుంబీకులు తుది సేవలందించారు. మరణ వార్త తెలుసుకున్న జయపురం ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. సాయంత్ర జరిపిన అంతిమ యాత్రలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు, ప్రజలు భారీగా తరలివచ్చి, పాల్గొన్నారు. జయపురంలోని రాజుల ప్రత్యేక శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు రాజ లాంఛనాలతో చేపట్టారు. మహారాణి రమాకుమారి దేవి మృతికి జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ఆఖరి రాజైన మహారాజ రామకృష్ణ దేవ్ పట్టపురాణి రమాకుమారి దేవి భహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. -
వైరల్ వీడియో: ఈ అమ్మాయి బైక్ ఎలా నడుపుతుందో చూస్తే షాక్ అవుతారు..!
-
కింగ్ చార్లెస్‌ని కలిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము... సంతాప పుస్తకంలో..
లండన్‌లోని వెస్ట్మిన్స్టర్ అబ్బేలో క్వీన్ ఎలిజబెత్2 అంత్యక్రియలు సెప్టంబర్ 19న సోమవారం 11 గంటలకు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. భారత్ తరుఫున క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు హాజరైందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లండన్‌కి చేరుకున్నారు కూడా. ఆ తర్వాత బకింగ్‌హామ్ ప్యాలెస్ సమీపంలోని లాంకాస్టర్ హౌస్‌లో ముర్ము ముందుగా కింగ్ చార్లెస్‌ని కలిశారు. తదనంతరం క్వీన్ ఎలిజబెత్2 జ్ఞాపకార్థం ద్రౌపది ముర్ము సంతాప పుస్తకంపై సంతకం చేశారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్ ట్విట్టర్లో పేర్కొంది. అంతేకాదు ముర్ము వెస్ట్‌మినిస్టర్ హాల్లో ఉన్న బ్రిటన్ రాణి శవపేటిక వద్ద క్వీన్ ఎలిజబెత్‌కి నివాళులర్పించారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత్ తరుపున సంతాపం తెలియజేసేందుకు ఆమె సెప్టెంబర్ 17 నుంచి 19 వరకు బ్రిటన్ అధికారిక పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన నిమిత్తం ముర్ము విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రాతో సహా తన పరివార సభ్యులతో కలిసి లండన్‌లోని గ్యాట్రిక్ విమానాశ్రయానకి చేరుకుని అక్కడ నుంచి బస చేసే హోటల్‌కు చేరుకున్నారు. విమానాశ్రయంకు చేరకున్న ద్రౌపది ముర్ముకు బ్రిటన్‌లోని భారత హై కమిషనర్ ఘన స్వాగతం పలికారు. ద్రౌపది ముర్ము వెస్ట్‌మినిస్టర్ అబ్బేలోని వెస్ట్గేట్లో జరిగే క్వీన్ ఎలిజబెత్2 అంత్యక్రియలకు హాజరయ్యి, తదనంతరం బ్రిటన్ కామన్వెల్త్ అభివృద్ధి వ్యవహారాల కార్యదర్శి జేమ్స్ క్లీవర్లీ నిర్వహించే రిసెప్షన్‌కి హాజరవుతారు. President Droupadi Murmu signed the Condolence Book in the memory of Her Majesty the Queen Elizabeth II at Lancaster House, London. pic.twitter.com/19udV2yt0z — President of India (@rashtrapatibhvn) September 18, 2022 (చదవండి: రాణి ఎలిజబెత్2 అంత్యక్రియలు.. లండన్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము) -
విమానంలో క్వీన్ మృతదేహాన్ని మోసుకెళ్లి....
లండన్: బ్రిటన్‌ని సుదీర్ఘకాలం పాలించిన రాణి ఎలిజబెత్ సెప్టెంబర్ 8న స్కాట్లాండ్లోని బల్మోరల్లో మరణించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమె భౌతిక దేహాన్ని ప్రజల సందర్శనార్ధం స్కాట్లాండ్ రాజధాని ఎడిన్‌బర్గ్‌లోని రాణి అధికారిక నివాసం రుడ్‌హౌస్ ప్యాలెస్‌కు తరలించారు. తదనంతరం విమానంలో లండన్‌కి తరలిస్తారు. ఇది ఆమె చివరి ఫ్లైట్ జర్నీగా చెప్పవచ్చు. ఈ మేరకు విమాన ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్ రాడార్24 ద్వారా బోయింగ్ సీ17 విమానంలో ఆమె భౌతిక దేహాన్ని తీసుకువెళ్తున్న చివరి ప్రయాణాన్ని అత్యధిక మంది ఆన్లైన్లో ప్రత్యక్షంగా వీక్షించారు. అంతేకాదు ఎడిన్బర్గ్ విమానాశ్రయంలో బోయింగ్ సీ17ఏ ఎగరడానికి సిద్ధంగా ఉన్న మొదటి నిమిషంలోనే సుమారు 6 మిలియన్ల మంది విమానాన్ని ట్రాక్ చేయడానికి ప్రయత్నించారు. బోక్ అర్గోనాట్ అటలాంటాలో క్వీన్‌గా ఆమె తొలి ఫైట్ ప్రయాణానికి 70 సంవత్సరాల తర్వాత క్వీన్ ఎలిజబెత్ 2 చివరి విమానమే చరిత్రలో అత్యధికాంగా ట్రాక్ చేయబడిన విమానం. అమెరికా సభ ప్రతినిధుల స్పీకర్ నాన్సీ తైవాన్ వివాదాస్పద పర్యటనను ఫ్లైట్ రాడార్24 వెబ్సైట్లో ట్రాక్ చేసిన దానికంటే రికార్డు స్థాయిలో 2.2 మిలియన్ల ఎక్కువ అని పేర్కొంది. 📊 Flight tracking statistics regarding the final flight of Queen Elizabeth II In the minute after the transponder of C-17 ZZ177 activated, an unprecedented 6 million people attempted to follow the flight. This unfortunately impacted the stability of our platform. pic.twitter.com/VBB7vOhk3A — Flightradar24 (@flightradar24) September 13, 2022 (చదవండి: ఎలిజబెత్ కోట బయట ఏడుస్తున్న చిన్నారిని ఓదార్చిన మేఘన్) -
ఫోటోలకు ఫోజులిచ్చి.. ఘోరంగా తిట్టించుకుంది: వీడియో వైరల్
చారిత్రక ప్రదేశాలు, మ్యూజియంలు సందర్శించేటప్పుడూ అక్కడ పాటించాల్సిన కొన్ని నియమ నిబంధనలకు సంబంధించిన బోర్డులు ఉంటాయి. పైగా అక్కడ మనకు ఈ వస్తువులను తాకవద్దు అని కూడా రాసి ఉంటుంది. అయినప్పటికీ కొంతమంది అత్యుత్సహంతో ఎవరికంట పడకుండా ఆ వస్తువులను తాకేందుకు తెగ ట్రై చేస్తుంటారు. ఈ క్రమంలో ఆ వస్తువు గనుక కిందపడి పగిలిందో ఇక అంతే సంగతులు. అచ్చం అలానే ఇక్కడొక మహిళ ఒక చారిత్రత్మక ప్రదేశానికి వెళ్లి ఫోటోలు తీసుకునే క్రమంలో ఊహించని షాకింగ్ ఘటనను ఎదుర్కొంటుంది. అసలేం జరిగిదంటే....ఒక మహిళ లండన్ పర్యటనకు వెళ్లింది. అక్కడ ఆమె ప్రసిద్ధిగాంచిన బకింగ్‌హామ్ ప్యాలెస్‌ని సందర్శించింది. అక్కడకు వెళ్లిన ప్రతిఒక్కరూ రకరకాల ఫోజులతో ఫోటోలు తీసుకోవడం సర్వసాధారణం. ఆ క్రమంలోనే ఒక టూరిస్ట్ మహిళ గుర్రం మీద ఉన్న క్వీన్ గార్డుతో కలిసి ఫోటో తీసుకోవాలనుకుంటుంది. అనుకున్నదే తడువుగా ఆ క్వీన్గార్డుకి దగ్గరగా నుంచుని ఒక ఫోటో తీసుకుంటోంది. ఐతే ఫోటోలు తీసుకునే క్రమంలో ఆ గుర్రాన్ని తాకేందుకు యత్నించకూడదని హెచ్చరిక బోర్డులు ఉంటాయి. పైగా అక్కడ ఉన్న సంరక్షణాధికారులు కూడా పర్యాటకులకు ఈ నియమాలు గురించి చెబుతారు. ఐతే సదరు మహిళ అవేమి పట్టించుకోకుండా తనదారి తనది అన్నట్టుగా గుర్రం పై ఉన్న క్వీన్ గార్డుతో కలసి ఫోటో తీసుకుంటున్న నెపంతో ఆ గుర్రాన్ని తాకడమే కాక తనవైపుకు తిప్పుకుంటూ ఫోటోలకు ఫోజులిస్తుంది. అంతే ఒక్కసారిగా ఆ క్వీన్గార్డు బిగ్గరగా అరుస్తూ...గుర్రాన్ని, వాటికి ఉన్న పగ్గాలను తాకొద్దు అంటూ ఆమె పై సీరియస్ అయ్యాడు. ఈ హఠాత్పరిణామానికి ఆ మహిళ ఒక్కసారిగా తత్తరపాటుకి గురవుతుంది. పైగా ఆ గుర్రం కూడా కాస్త బెదురుగా ముందుకు కదులుతుంది. ఈ ఊహించని ఘటనకు ఆ మహిళ తెగ బాధపడిపోతూ...ఇక లండన్‌కి ఎప్పటికీ రానంటూ శపథం చేసింది. ఈ మేరకు ఈ ఘటన తాలుకా వీడియోని కూడా ట్విట్టర్లో పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు ఆ గార్డు చర్యను తప్పుపడితే, మరికొందరూ అక్కడ తాకకుడదని కొన్ని నియమాలు ఉన్నాయి కాబట్టే అతను అలా ప్రవర్తించాడంటూ క్వీన్ గార్డుని సమర్థిస్తూ... రకరకాలుగా ట్వీట్ చేశారు. He scared me for a moment too. 😂😂pic.twitter.com/6dD8Fmx62q — Figen (@TheFigen) July 31, 2022 (చదవండి: అనూహ్య ఘటన!. పైలెట్ దూకేశాడా? పడిపోయాడా!) -
బ్రిటిషర్లతో పోరాడిన తొలి భారతీయ రాణి: ఖడ్గధారి భరతనారి
భారత్‌లో వ్యాపార నిమిత్తం అడుగుపెట్టిన పరాయి దేశస్థులు దక్షిణ భారతంలో మొదట పట్టు సాధించారు. ఈ క్రమంలో వీరి పోకడలను వ్యతిరేకిస్తూ పలువురు విముక్తి పోరాటాలు చేశారు. అయితే భారతీయులంతా సంఘటితంగా తొలిసారి పోరాడింది 1857 తొలి స్వాతంత్య్ర సంగ్రామం లోనే! ఈ తొలి సంగ్రామం కన్నా ముందు నుంచే వేర్వేరు ప్రాంతాల్లో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా సామాన్యుల నుంచి మహారాజుల వరకు తమకు సాధ్యమైన రీతిలో స్వేచ్ఛ కోసం పోరాడారు. అలా తమిళనాట బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా 1780 ల్లోనే మహారాణి వేలునాచియార్ వీర పోరాటం చేశారు. క్రూరమైన ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడిన తొలి భారతీయ రాణిగా వేలు నాచియార్ ఖ్యాతిగాంచారు. ఆమె వీరత్వానికి, సాహసానికి గుర్తుగా తమిళులు ఆమెను వీరమంగై (వీరవనిత) అని కీర్తించారు. ఆర్కాట్ నవాబు మోసం తమిళనాడులోని రామ్నాడ్ రాజ్యానికి చెందిన రాణి సకందిముతల్‌కు, చెల్లముత్తు విజయరఘునాథ సేతుపతి మహారాజుకు 1730లో రాణి వేలు నాచియార్ జన్మించారు. మగ సంతతి లేకపోవడంతో నాచియార్‌ను రాజుగారు మగపిల్లాడిలా పెంచారు. ఆమెకు అన్నిరకాల విద్యలతో పాటు ఖడ్గయుద్ధ రీతులను, దండాయుధ పోరాట విధానాలను నేర్పారు. వీటితో పాటు భారతీయ రణవిద్యలైన వలరి, సిలంబం వంటివాటిలో నాచియార్ నైపుణ్యం సాధించారు. విలువిద్యలో, అశ్వవిద్యలో ఆమెకు సాటిలేరు. రాణిగా రాణించాలంటే కేవలం స్థానిక భాషపై పట్టు ఉంటే సరిపోదని భావించిన రాజుగారు తన కూతురుకు ఉర్దూ, ఫ్రెంచ్, ఇంగ్లీష్ నేర్పించారు. 1746లో నాచియార్‌కు శివగంగ సంస్థానాధిపతి రాజా ముత్తువదుగనతపెరియ ఉదయతేవర్‌తో వివాహమైంది. వీరికి ఒక కూతురు జన్మించింది. అయితే నాచియార్ వైవాహిక జీవితం మూణ్నాళ్ల ముచ్చటైంది. అప్పటి ఆర్కాట్ నవాబు బ్రిటిషర్లతో చేతులు కలిపి స్వదేశీ సంస్థానాలపై విరుచుకు పడ్డాడు. శివగంగ సంస్థానంపై నవాబు భారీగా పన్నులు విధించి వసూలు చేయడానికి ఈస్టిండియా కంపెనీ అధికారులను పంపాడు. అయితే రాజా ఉదయ్‌తేవర్ ఈ పన్నులను వ్యతిరేకించారు. 1772 యుద్ధంలో బ్రిటిషర్లు, ఆర్కాట్ నవాబు కలిసి అతడిని హతమార్చారు. దీంతో కూతురు వెలాచ్చితో కలిసి నాచియార్ విరుపాచ్చికి చెందిన పలయకారర్ గోపాల నాయకర్ వద్ద ఎనిమిదేళ్లు ఆశ్రయం పొందారు. నాచియార్, ఆమె దండనాయకులను గోపాల్ ఎంతగానో ఆదరించాడు. ఈ సమయంలో తిరిగి సంస్థానం స్వాధీనం చేసుకోవడం గురించి రాణి నిరంతరం ఆలోచిస్తూ ఉండేవారు. తొలి సూసైడ్ బాంబర్ 1780లో ఆమెకు కాలం కలిసివచ్చింది. ఆర్కాట్ నవాబుకు వ్యతిరేకంగా హైదర్ఆలీ యుద్ధం ప్రకటించాడు. ఇదే అదనుగా శివగంగను స్వాధీనం చేసుకునేందుకు నాచియార్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఆమెతో పాటు అనేకమంది మహిళా సైనికులు స్థానిక రాజరాజేశ్వరి ఆలయానికి విజయదశమి సందర్భంగా చేరుకున్నారు. అంతా పండుగ వేడుకల్లో ఉన్నప్పుడు రాణి ఒక్కమారుగా బ్రిటిషర్లపైకి దాడికి దిగారు. అయితే ఎంత వ్యూహాత్మకంగా ముందుకు కదిలినా.. బ్రిటిషర్ల ఆయుధ సంపత్తి అపారంగా ఉండడంతో రాణికి పోరాటం కష్టంగా మారింది. ఇదే సమయంలో రాణి మహిళా దళపతి కుయిలి మహా సాహసానికి ఒడిగట్టింది. ఒంటి నిండా చమురు పోసుకొని ఆయుధగారం వద్దకు చేరుకున్న కుయిలీ తనను తాను కాల్చుకుంది. దీంతో భారీ విస్ఫోటనంతో ఆయుధాలన్నీ ధ్వంసమయ్యాయి. ఇలా చరిత్రలో తొలి సూసైడ్ బాంబర్‌గా కుయిలీ నిలిచింది. అంతకుముందు కూడా రాణి నాచియార్‌ను కుయిలీ పలుమార్లు కాపాడింది. కుయిలీని తన దత్తపుత్రికగా నాచియార్ పేర్కొనేవారు. అనంతర కాలంలో ‘ఉడైయాల్‘ అనే స్త్రీసేనను పోరాటంలో మరణించిన తన దత్తపుత్రిక పేరుతో స్థాపించారు నాచియార్. హైదర్ఆలీతో రాణి చేతులు కలిపిన సంగతి గ్రహించిన ఆర్కాట్ నవాబు చివరకు చేసేది లేక ఆమెకే శివగంగ సంస్థానాన్ని అప్పగించారు. ఈ నేపథ్యంలో మరుదు సోదరులు, కూతురుతో కలిసి ఆమె శివగంగ ఆస్థానానికి తిరిగి వచ్చారు. వెల్లై మరుదును సేనాధిపతిగా, చిన్న మరుదును మంత్రిగా నియమించుకొని పాలన సాగించారు. తన ధైర్యసాహసాలతో వీరవనిత అనే నామాన్ని సార్ధకపరచుకొన్నారు నాచియార్. యుద్ధానంతరం క్రమంగా ఆమె మురుదు సోదరులకు పరిపాలనాధికారం అప్పగించారు. 1796లో నాచియార్ మరణించారు. ఆమె సాహసానికి గుర్తుగా నాచియార్‌ను ‘జోన్ ఆఫ్ ఆర్క్ ఆఫ్ ఇండియా‘ అని కీర్తిస్తారు. – దుగ్గరాజు శాయి ప్రమోద్ (చదవండి: మార్గరెట్ బూర్కి–వైట్: తను లేరు, తనిచ్చిన లైఫ్ ఉంది) -
ఎలిజబెత్ బార్బీ రాణి!
చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా ఆడుకునే బొమ్మల్లో బార్బీ చాలా ముఖ్యమైనది. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఇష్టపడేటట్టుగా ఉంటుంది బార్బీ. ఏడాదికేడాది సరికొత్త మెరుగులు దిద్దుకుంటూ వస్తోన్న బార్బీ ఇప్పుడు మహారాణి అయ్యింది. బొమ్మేంటీ మహారాణి అవడమేంటీ అనుకుంటున్నారా? ఎప్పుడూ అందంగా కనిపించే బార్బీ ఇప్పుడు మహారాణి డ్రెస్‌లో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న మహారాణులందరిలోకి బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ ఎంత ప్రత్యేకంగా ఉంటారో అందరికీ తెలిసిందే! అయితే ‘ఆమెకు నేనేమి తీసుకుపోను’ అన్నట్టుగా ఎలిజబెత్ రాణి గెటప్‌తో రెడీ అయ్యింది మన చిట్టి బార్బీ. మామూలు బార్బీ బొమ్మగా కంటే క్వీన్ ఎలిజబెత్ రూపంలో ధగధగా మెరిసిపోతూ దర్పం వెలిబుచ్చుతోంది. బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 ఇటీవల 96వ పుట్టిన రోజు జరుపుకున్నారు. క్వీన్ ఎలిజబెత్–2 బ్రిటన్ రాజవంశంలో డెబ్బైఏళ్లుగా విజయవంతంగా పాలన కొనసాగిస్తూ ప్లాటినం జూబ్లి జరుపుకోబోతున్న మొదటి వ్యక్తిగా నిలవడంతో ఆమె రూపంతో బార్బీని రూపొందించారు. ఈ పుట్టినరోజుకు బార్బీ బొమ్మను ఎలిజబెత్ రాణిలా రూపొందించి విడుదల చేసింది బార్బీ బొమ్మల కంపెనీ. గత డెభ్బై సంవత్సరాలుగా ఏడాదికో థీమ్, ప్రత్యేకతలతో బార్బీ సంస్థ మ్యాటెల్ సందర్భానుసారం బార్బీ బొమ్మలను విడుదల చేస్తోంది. ఈ ఏడాది ఎలిజబెత్ రాణి–2 పుట్టిన రోజుని పురస్కరించుకుని ఆమె రూపాన్ని బార్బీలో ప్రతిబింబించేలా చేసింది. చూబడానికి ఈ బార్బీ నిజమైన క్వీన్‌లాగే కనిపిస్తుంది జూన్ 2–5 వరకు నాలుగురోజుల పాటు ప్లాటినం జూబ్లి సెలబ్రేషన్స్‌ను నిర్వహించబోతున్నారు. బ్రిటన్ మహారాణిగా డెబ్బై ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్లాటినం జూబ్లి వేడుకలను అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలు ఉన్నందున ఏప్రిల్ 21న మహారాణి పుట్టిన రోజు వేడుకలు ప్రైవేటు ప్లేసులో కొంతమందితో మాత్రమే నిర్వహించారు. ఈ వేడుకల్లో క్వీన్ బార్బీని విడుదల చేశారు. మ్యాటెల్ విడుదల చేసిన క్వీన్ బార్బీ బొమ్మ ఐవరీ తెలుపు గౌన్ వేసుకుని నీలం రంగురిబ్బన్, తల మీద మిరుమిట్లు గొలిపే అంచున్న తలపాగ ధరించడం విశేషం. అచ్చం రాయల్ కుటుంబ సభ్యులు ధరించే గౌను, రిబ్బన్‌తో బార్బీ ఎలిజబెత్ రాణిగా మెరిసిపోతుంది. ఈ గౌనుకు సరిగ్గా నప్పే యాక్సెసరీస్‌తోపాటు ఎలిజబెత్–2 కు తన తండ్రి జార్జ్–4 ఇచ్చిన పింక్ రిబ్బన్, తలకు అలంకరించిన కిరీటంతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ‘‘మహారాణి ఏ ఈవెంట్లో కనిపించినా ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తారు. ఆమె మార్క్ కనిపించేలా ఈ డిజైన్‌ను రూపొందించాము. భవిష్యత్ ప్రపంచం కోసం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన మహిళామణులకి గుర్తుగా ఈ సీరిస్‌ను మొదలుపెట్టాం. ఈ క్రమంలోనే క్వీన్ బార్బీని కూడా రూపొందించాం’’ అని బార్బీ సీనియర్ డిజైన్ డైరెక్టర్ రాబర్ట్ బెస్ట్ చెప్పారు. -
నలభై ఏళ్లనాటి డ్రెస్...మరింత అందంగా.. ఆధునికంగా...
ఆయన దేశాన్ని పాలించే మహారాజు. ఆయన భార్య మహారాణి. లెక్క ప్రకారం వారికి దేనికీ కొదవే ఉండదు. వాళ్లు వేసుకునే పాదరక్షల నుంచి హెయిర్ క్లిప్‌ల వరకు అన్నీ ఖరీదైనవిగా ఉంటాయి. మహారాణిగారు ఏ కార్యక్రమానికైనా వచ్చారంటే ఆమె సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తారు. దీనికి తగ్గట్టుగానే వారు రెడీ అవుతుంటారు. ఈ సంప్రదాయానికి భిన్నంగా వ్యవహరిస్తూ సరికొత్త ఫ్యాషన్‌కు ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తున్నారు స్పెయిన్ మహారాణి లెట్జియా ఓరి్టజ్ రోకసోలానో. కార్యక్రమానికో డ్రెస్ కొనకుండా, తన దగ్గర ఉన్న పాత డ్రెస్సులను సరికొత్తగా తీర్చిదిద్ది వివిధ కార్యక్రమాలకు వాటినే వాడుతూ ఫ్యాషన్ ఐకాన్లకే సవాళ్లు విసురుతున్నారు. ఎప్పుడూ స్టైలి‹Ùగా కనిపించే లెట్జియా రెండు రోజులక్రితం రాయల్ ప్యాలెస్‌లో చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినెరాకు ఆహా్వనం పలికే క్రమంలో నలభై ఏళ్లనాటి డ్రెస్‌లో ఫ్యాషనబుల్‌గా కనిపించారు. ఈ గౌనుకు పెద్ద చరిత్రే ఉంది. లెట్జియా అత్తగారు క్వీన్ సోఫియా నలభై ఏళ్ల క్రితం ధరించిన ఈ గౌనును ఇప్పటి మహారాణి ధరించడం విశేషం. పొట్టి చేతులు, పింక్ పేస్టల్ కలర్లో ఫ్రాక్. పువ్వులతో మోకాళ్ల కింద వరకు స్కర్ట్‌ను ధరించారు. మహారాజు జువాన్ కార్లోస్–1తో కలిసి, క్వీన్ సోఫియా 1981లో రోమ్ను సందర్శించారు. ఆ సమయంలో సోఫియా ఈ డ్రెస్‌ను ధరించారు. ఆనాటి డ్రెస్‌ను వార్డ్రోబ్ లో నుంచి తీసి దానిని వెండి, రత్నాలతో మరింత అందంగా డెకొరేట్ చేసి, సిల్వర్ బెల్ట్‌తో ధరించి చూపరులను ఆకట్టుకుంది లెట్జియా. అంతేగాక ఈ వారం లో జరిగిన రెటీనా ఈసీవో అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న లెట్జియా ఒక నలుపు రంగు గౌనును వేసుకున్నారు. ఈ గౌనును సేంద్రియ వెదురుతో తయారు చేయడం విశేషం. ఇద్దరమ్మాయిలకు తల్లి అయిన లెట్జియా, ఒకపక్క తల్లిగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే వివిధ అధికారిక కార్యక్రమాల్లో తరచూ పొల్గొంటూ ఉంటారు. ఆమె ధరించే డ్రెస్‌లు ఎంతో సింపుల్‌గా స్టైలిష్‌గా ఉండడమేగాక, దాదాపు రీసైక్లింగ్ చేసినవి కావడంతో అంతా లెట్జియా డ్రెస్‌లను ఆసక్తిగా గమనిస్తుంటారు. -
400 ఏళ్ల క్రితం హత్య.. మిస్టరీని చేధించిన భారత శాస్త్రవేత్తలు
సాక్షి, వెబ్‌డెస్క్: ప్రస్తుతం అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఈ క్రమంలో ఏ నేరం జరిగినా.. చిన్న క్లూతో మొత్తం క్రైమ్ సీన్‌ను కళ్లకు కడుతున్నారు పోలీసులు. అయితే టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందని కాలంలో జరిగిన ఎన్నో నేరాలకు సంబంధించిన వాస్తవాలు, రహస్యాలు అలానే నిశ్శబ్దంగా భూమిలో సమాధి అయ్యాయి. వీటిలో కొన్ని నేరాలు ఇప్పటికి కూడా పరిశోధకులను, శాస్త్రవేత్తలను వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతికత సాయంతో కాలగర్భంలో కలిసిపోయిన పలు రహస్యాలను చేధిస్తున్నారు శాస్త్రవేత్తలు. తాజాగా భారతీయ పురాతత్వ శాస్త్రవేత్తలు, పరమాణు జీవశాస్త్రవేత్తలు 400 ఏళ్ల నాటి మర్డర్ మిస్టరీని చేధించారు. ఇన్నాళ్లు రహస్యంగా మిగిలిపోయిన జార్జియా రాణి కేతేవాన్ మర్డర్ మిస్టరీని చేధించారు. ఆమెను గొంతు కోసి చంపారని మన పరిశోధకులు ధ్రువీకరించారు. పర్షియా చక్రవర్తి, షా అబ్బాస్ I జార్జియా రాణి సెయింట్ క్వీన్ కేతేవన్‌ను 1624 లో హత్య చేశాడా.. అంటే అవుననే అంటున్నాయి అందుబాటులో ఉన్న సాహిత్య ఆధారులు. అయితే, ఇరానియన్ కథనం మాత్రం దీనికి విరుద్ధంగా ఉంటుంది. ఎందుకంటే వారు తమ దేశ చరిత్రలో అత్యంత ముఖ్య పాలకుల్లో షా అబ్బాస్ I ను ఒకడిగా భావిస్తారు. ఇలా భిన్న వైరుధ్యాలు ఉన్న ఈ మిస్టరీని మన శాస్త్రవేత్తలు పరిష్కరించారు. అసలు ఎక్కడో జార్జియాలో జరిగిన ఈ సంఘటనకు భారతదేశంతో సంబంధం ఏంటి.. దాన్ని మన శాస్త్రవేత్తలు పరిష్కరించడం ఏంటి వంటి తదితర వివరాలు తెలియాలంటే ఇది చదవాలి... రాణి కేతేవాన్ కథ ఏంటంటే.. సాహిత్య ఆధారాల ప్రకారం 1613 లో పర్షియా చక్రవర్తి జార్జియన్ రాజ్యాన్ని జయించి, ఇరాన్ నైరుతిలో ఉన్న షిరాజ్ అనే నగరంలో రాణిని పదేళ్లపాటు బందీగా ఉంచాడని చెబుతున్నాయి. 1624 లో, కేతేవాన్‌ను మతం మారి, పర్షియా రాజు అంతపురంలో చేరవలసిందిగా చక్రవర్తి ఇచ్చిన ప్రతిపాదనను రాణి తిరస్కరించింది. ఈ క్రమంలో కేతేవాన్, పర్షియా రాజు చేతిలో తీవ్ర హింసకు గురైంది. ఆమె మరణానికి ఒక సంవత్సరం ముందు, ఇద్దరు అగస్టీనియన్ పూజారులు ఒక మిషన్ ప్రారంభించడానికి షిరాజ్‌కు వచ్చారు. వారు రాణిని కలవడానికి అనుమతి పొందడమే కాక ఆమెకు సహాయకులుగా మారారు. ఈ క్రమంలో కేతేవాన్ మరణం తర్వాత పూజారులు ఆమె సమాధిని వెలికితీసి, రాణి అవశేషాలను 1624 నుంచి 1627 వరకు దాచారు. అనంతరం రాణి అవశేషాలను సురక్షితంగా ఉంచడానికి, వారు ఆమె శరీరంలోని వివిధ భాగాలను వేర్వేరు ప్రదేశాలలో దాచారు. గోవాలో రాణి కేతేవాన్ అవశేషాలు ఈ క్రమంలో రాణి కేతేవాన్ కుడి చేయిని ఓల్డ్ గోవాలోని సెయింట్ అగస్టీనియన్ కాన్వెంట్కు తీసుకువెళ్లి అక్కడ సురక్షితంగా పూడ్చి పెట్టినట్లు సాహిత్య ఆధారాలున్నాయి. అంతేకాక వారు రాణి అవశేషాలను ఎక్కడెక్కడ పూడ్చిన విషయాలను కొన్ని పత్రాలలో స్పష్టంగా పేర్కొనన్నారు. దీనిలో ఓల్డ్ గోవా సెయింట్ అగస్టీనియస్ చర్చి ప్రస్తావన కూడా ఉంది. అయితే ఎప్పటికప్పుడు చర్చిని పునర్నిర్మించడంతో ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించడం పెద్ద సవాలుగా ఉంది. మరోవైపు జార్జియా ప్రజలకు రాణి అవశేషాలు ముఖ్యమైనవి కాబట్టి, అప్పటి సోవియట్ యూనియన్ ప్రభుత్వం, ఆ తరువాత యుఎస్ఎస్ఆర్ నుంచి విడిపోయిన తర్వాత జార్జియన్ ప్రభుత్వం, రాణి శేషాలను గుర్తించడంలో సహాయపడాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఈ శోధన 1980 ల చివరలో ప్రారంభమై.. అనేక విరమాలతో కొనసాగింది. చాలా ప్రయత్నాల తరువాత, స్థానిక చరిత్రకారులు, గోవా సర్కిల్ ఆఫ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) పురావస్తు శాస్త్రవేత్తలు 2004 లో సాహిత్య వనరుల ఆధారంగా చర్చి గ్రౌండ్ మ్యాప్‌ను పునర్నిర్మించారు. ఈ క్రమంలో మొదట అక్కడ పూడ్చి పెట్టిన ఓ పొడవైన చేయి ఎముకను.. ఆ తరువాత మరో రెండు అవశేషాలను గుర్తించగలిగారు. 22 వేల డీఎన్ఏలతో పోల్చారు తాము గుర్తించిన అవశేషాల్లో క్వీన్ కేతేవన్‌కి సంబంధించిన వాటిని గుర్తించడం కోసం మూడు అవశేషాల మైటోకాన్డ్రియల్ డీఎన్ఏను వేరుచేశారు. దాన్ని సీసీఎంబీ డేటా బ్యాంక్‌లో 22,000 కంటే ఎక్కువ డీఎన్ఏ సీక్వెన్స్‌లతో సరిపోల్చారు. మొదట గుర్తించిన అవశేషం దేనితో సరిపోలేదు. మరోవైపు, తరువాత గుర్తించిన రెండు అవశేషాలు దక్షిణ ఆసియాలోని వివిధ జాతులతో ముఖ్యంగా భారతదేశంతో సరిపోలాయి. దాంతో మొదట తాము గుర్తించిన చేయిని రాణి కేతేవాన్‌ది ప్రకటించారు శాస్త్రవేత్తలు. ఈ విషయాలకు సంబంధించి ఎల్సెవియర్ జర్నల్‌లో 2014 లో తమ పరిశోధనా పత్రాన్ని కూడా ప్రచురించారు, అయితే రాణి అవశేషాలను జార్జియా ప్రభుత్వానికి అప్పగించే దౌత్య ప్రక్రియకు దాదాపు ఏడు సంవత్సరాలు పట్టింది. ఈ క్రమంలో 2021, జూలై 9 న, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ జార్జియా విదేశాంగ మంత్రికి రాణి అవశేషాలను సమర్పించారు. దాంతో ఈ సంఘటనల చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. భారతీయ పరమాణు జీవశాస్త్రజ్ఞులు రాణి హత్యకు సంబంధించిన సాక్ష్యాల చారిత్రక ఆధారాలను కూడా ధృవీకరించారు. గొంతు కోసి రాణి కేతేవాన్‌ను హత్య చేసినట్లు తెలిపారు. -
ప్రిన్స్ ఫిలిప్ బర్త్‌డేకి మామిడి పండ్లు
జైపుర్ మహారాణి గాయత్రీదేవి యేటా ప్రిన్స్ ఫిలిప్ పుట్టినరోజుకు బుట్టెడు ఆల్ఫాన్సో రకం మామిడి పండ్లు పంపేవారని, వాటిని ఆయన ఇష్టంగా స్వీకరించేవారని గత ఏడాది ఆగస్టులో విడుదలైన ‘ది హౌస్ ఆఫ్ జైపుర్ : ది ఇన్సైడ్ స్టోరీ ఆఫ్ ఇండియా’ అనే పుస్తకంలో ఆస్ట్రేలియా రచయిత జాన్ జుబ్రిక్సీ రాశారు. మరొక ఆసక్తికరమైన విశేషం.. క్వీన్ ఎలిజబెత్, గాయత్రీదేవి దంపతుల ప్రేమ కథలకు, జీవిత విధానాలకు దగ్గరి పోలికలు ఉండటం!! క్వీన్ ఎలిజబెత్, ప్రిన్స్ ఫిలిప్‌ల జంటకు; మన జైపుర్ మహారాణి గాయత్రీదేవి, మాన్సింగ్ల జంటకు మధ్య ఆసక్తికరమైన పోలికలు కొన్ని కనిపిస్తాయి. క్వీన్ ఎలిజబెత్‌తో డెబ్బై నాలుగేళ్ల దాంపత్య బాంధవ్యాన్ని గడిపి, తన నిండు నూరేళ్లకు దగ్గరి వయసులో నిన్న శుక్రవారం ఆమె చెయ్యి వదలి వెళ్లిన ప్రిన్స్ ఫిలిప్.. క్వీన్‌ని చూసింది ఆమె 13 ఏళ్ల వయసులో. మాన్సింగ్ గాయత్రీదేవిని మొదట చూసింది కూడా ఆమెకు 13 ఏళ్ల వయసులోనే. ఏడేళ్లపాటు మాన్సింగ్ గాయత్రిని ప్రేమించాడు. ఆమెకు 21 ఏళ్లు రాగానే పెళ్లి చేసుకున్నాడు. ఒడ్డు పొడుగు కన్నా ‘పోలో’ ఆటలో అతడి ‘ఒడుపు’ చూసి మనసిచ్చేసింది గాయత్రి. అక్కడ బ్రిటన్ లో ఆ జంటదీ ఇదే కథ. ఫిలిప్ క్రికెట్ ఆడతాడు. ఎవరిదో పెళ్లిలో ఎలిజబెత్‌ని తొలిసారి చూశాడు. తర్వాత ఏడేళ్లపాటు ప్రేమలేఖలు నడిచాయి. ఆరో యేట (ప్రేమకు ఆరో యేట) ఎలిజబెత్ తండ్రిని కలిసి, ‘నేను మీ అమ్మాయి ని పెళ్లి చేసుకుంటాను’ అని అడిగాడు. ఒక్క ఏడాది ఆగమన్నారు ఆయన! ఆగడం ఎందుకంటే అప్పటికి ఎలిజబెత్‌కి 21 ఏళ్లు వస్తాయి. అలా ఇక్కడ గాయత్రీ దేవికి, అక్కడ క్వీన్ ఎలిజ బెత్కి వారి ఇరవై ఒకటో యేటే వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఏడేళ్లకు అక్కడ ఎలిజబెత్‌కి క్వీన్‌గా పట్టాభిషేకం జరిగితే, ఇక్కడ జైపుర్‌లో గాయత్రీదేవి రాజకీయాల్లోకి ప్రవేశించారు. అక్కడ క్వీన్ భర్త ప్రిన్స్ ఫిలిప్ ‘డ్యూక్ ఆఫ్ ఎడిన్బర్గ్’ అయితే, ఇక్కడ గాయత్రి భర్త రాష్ట్ర గవర్నర్ అయ్యారు. ఎలిజబెత్, ఫిలిప్‌ల వివాహం జరిగిన ఏడాదే భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. జైపుర్, మరో 18 సంస్థానాలు కలిసి రాజస్థాన్ రాష్ట్రంగా ఏర్పడ్డాయి. ఆ రాష్ట్రానికే మాన్సింగ్ గవర్నర్ అయ్యారు. గాయత్రి దేవి ప్రజాప్రతినిధి అయ్యారు. ఆ జంటలో భార్య, ఈ జంటలో భార్య ప్రత్యక్ష పాలనలో ఉంటే, ఆ జంటలో భర్త, ఈ జంటలో భర్త పరోక్ష విధులకు పరిమితం అయ్యారు. గాయత్రీదేవి పుట్టింది కూడా క్వీన్ ఎలిజబెత్ పుట్టిన లండన్‌లోనే. క్వీన్ కన్నా గాయత్రి ఏడేళ్లు పెద్ద. 1950, 60 లలో క్వీన్ ఎలిజబెత్, ప్రిన్స్ ఫిలిప్; గాయత్రిదేవి, మాన్సింగ్ దంపతులు ప్రపంచానికి ‘గోల్డెన్ కపుల్’. వీరి రెండు ప్రేమ కథలకు పోలికలు ఉండటం మాత్రమే కాదు, రెండు జంటలూ మంచి ఫ్రెండ్స్ కూడా! ప్రిన్స్ ఫిలిప్ వేసవిలో పుట్టారు. ఏటా జూన్ 10 న ఆయన పుట్టినరోజు జరుగుతున్నా అసలు పుట్టిన రోజు మాత్రం మే 28. నూరేళ్ల క్రితం 1921లో ఆయన పుట్టే సమయానికి గ్రెగోరియన్ క్యాలెండర్ పుట్టలేదు. ఆ ముందువరకు ఉన్న జూలియన్ క్యాలెండర్ ప్రకారం అయితే ఆయన ‘మే’ నెలలోనే పుట్టినట్లు. మే అయినా, జూన్ అయినా.. ఇండియాలో అది మామిడి పండ్ల కాలం. ఏటా ఆయన పుట్టిన రోజుకు గాయత్రీదేవి బుట్టెడు ఆల్ఫోన్సో మామిడి పండ్లను కానుకగా పంపేవారు. ఆ పండ్లను ప్రిన్స్ ఫిలిప్ ఎంతో ప్రీతిగా స్వీకరించేవారని గాయత్రీ దేవి ఆంతరంగిక సలహాదారు ఒకరు తనతో చెప్పినట్లు గత ఏడాది ఆగస్టులో విడుదలైన ‘ది హౌస్ ఆఫ్ జైపుర్: ది ఇన్సైడ్ స్టోరీ ఆఫ్ ఇండియా’ అనే పుస్తకంలో ఆస్ట్రేలియా రచయిత జాన్ జుబ్రిక్సీ రాశారు. ప్రిన్స్ ఫిలిప్, క్వీన్ ఎలిజబెత్ దంపతులతో గాయత్రీదేవి, మాన్సింగ్ -
చిరంజీవి కూడా వెబ్‌సిరీస్‌లో..
‘పరుగులు లేవు. మేకప్ లూ.. పేకప్లూ లేవు. అరుపులూ.. హడావుడీ లేదు. పొల్యూషన్ లేదు. చుట్టూ నిశ్శబ్ధమే.. కుటుంబంతో మమేకమే’ అంటున్నారు సినీ నటి ఎవర్ గ్రీన్ గ్లామర్ హీరోయిన్ రమ్యకృష్ణ. టాలీవుడ్ అగ్రగామి హీరోయిన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా కూడారాణించి.. బాహుబలి సినిమా తర్వాత మరిన్ని ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ స్టార్ యాక్ట్రెస్ గతేడాదే వెబ్‌సిరీస్‌లో కూడా నటించారు. క్వీన్ పేరుతో రూపొందిన ఆ వెబ్‌సిరీస్ తెలుగులో డబ్ అయి జీ తెలుగు చానెల్లో ప్రసారం కానుంది. ఒక వెబ్‌సిరీస్ తెలుగు టీవీ చానెల్లో ప్రసారం అవుతుండటం కూడా ఇదే తొలిసారి. ఈ సందర్భంగా రమ్యకృష్ణ ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. సినిమాల్లో బిజీ బిజీ.. ప్రస్తుతం కృష్ణవంశీ తీస్తున్న రంగమార్తాండ, పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వస్తున్న చిత్రం, సాయిధరమ్ తేజ్ సినిమా.. ఇలా పలు చిత్రాల్లో నటిస్తున్నా. క్వీన్ సీజన్–2 కూడా చేయాలి. ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్, రెండు హిందీ ప్రాజెక్టŠస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చూడాలి లాక్డౌన్ తర్వాత ఏమవుతుందో..? నాకు డ్రీమ్ రోల్ అంటూ ఏవీ ఉండవు. నాకొచ్చిన, వస్తున్నవన్నీ నేను కోరుకున్నవే అన్నట్టు ఉంటాయి. కాబట్టి అవే నా డ్రీమ్ రోల్స్ అనుకోవచ్చు(నవ్వుతూ)..లాక్డౌన్ నా జీవితంలో ముందెన్నడూ ఎరుగని అనుభవాన్ని ఇచ్చింది. హాయిగా ఉంది. ఇలాంటి టైమ్ లైఫ్‌లో దొరకలేదు. ఇలాంటి టైమ్ మళ్లీ దొరకదేమో కూడా.. దాదాపు రెండు నెలలైందేమో గుమ్మం దాటి. ఓ వైపు టైమంతా మన చేతుల్లోకి రావడం, ఫ్యామిలీతో మరింత టైమ్ స్పెండ్ చేయడం చాలా బాగున్నా.. మరోవైపు ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతుండటం, మన దేశంలో వలస కూలీలు, ఆహారం లేని నిరుపేదల దుస్థితి చూస్తుంటే మాత్రం చాలా బాధ అనిపిస్తోంది. వాళ్లంతా తమ తమ ఊర్లకు వెళ్లి.. బాగుండాలని కోరుకుంటున్నాను. ‘క్వీన్’ను ఆమెతో పోలుస్తున్నారు.. నేను నటించిన తొలి వెబ్‌సిరీస్ క్వీన్. దీని డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ చాలా ప్రజ్ఞావంతులు. ఆయన స్ట్రాంగ్ స్క్రిప్తో వస్తారు. చాలా బాగా తీస్తారని తెలుసు. ఈ అవకాశాన్ని ఎవరు వదులుకుంటారు? అందుకే చేశా. ఇక ఇందులో నా పాత్ర జయలలితను పోలినట్టు ఉందని అంటున్నారు. అది ఎవరికి తోచినట్టు వారు పోల్చుకోవచ్చు.. దానికి నేనేం చేయలేను. అనితా శివకుమారన్ రాసిన క్వీన్ నవల ఆధారంగా తీసిన చిత్రమిది. ఇది తెలుగు ప్రేక్షకులకు కూడా జీ తెలుగు చానెల్లో వచ్చే సోమవారం నుంచి సీరియల్‌గా అందిస్తుండటం నాకు మరింత ఆనందంగా అనిపిస్తోంది. క్వీన్ సినిమా చేయడం ద్వారా రాజకీయ ఆకాంక్షలు, ఆలోచనలు ఏమీ రాలేదు. వస్తాయా? అంటే భవిష్యత్‌లో ఏమవుతుందీ చెప్పలేం కదా.. ఒత్తిడి వద్దు.. జాగ్రత్తలు వీడొద్దు.. రేపేమవుతుంది? రేపేం కాదు? అనేది తెలియడం లేదు. కంటికి కనపడని శత్రువుతో చేసే యుద్ధం కాబట్టి మానసిక ప్రశాంతతను కొంత కోల్పోతాం. ఇది మనల్ని ఒత్తిడికి గురి చేస్తుంది. కరోనాతో మనం కలిసి బతకాల్సిందే అంటున్నారు. కాబట్టి బీ స్ట్రాంగ్, భయం, ఒత్తిడి మనల్ని తమ ఆధీనంలోకి తీసుకోకుండా పాజిటివ్ థింకింగ్ పెంచుకోవాలి.. జాగ్రత్తలు పాటించండి. ఒకసారి ఈ లాక్డౌన్ పూర్తయిన తర్వాత ఈ టైమ్ తప్పకుండా మెమొరబుల్ అవుతుంది. ఇలాంటి ఫ్రీ టైమ్ మళ్లీ వస్తుందా? అనిపిస్తుంది. కానీ మళ్లీ వచ్చినా ఇలాంటి కరోనా లాంటి కారణంతో కాకుండా రావాలని మాత్రం కోరుకుంటున్నా. ప్రేక్షకుల హృదయాల్లో వెబ్.. డబ్ ప్రస్తుతం వెబ్‌సిరీస్ కోసం చాలా వైవిధ్యభరితమైన ఆసక్తికరమైన కథాంశాలు ఎంచుకుంటున్నారు. దీని వల్ల నటులకు వెరైటీ రోల్స్ చేసే అవకాశం లభిస్తుంది. ఈ కరోనా దెబ్బకు వెబ్‌సిరీస్‌కి మరీ డిమాండ్ బాగా పెరిగింది. అయితే సినిమాలు చూడటం కోసం థియేటర్స్‌కి జనం వెళ్లడం మానేస్తారు అనను గానీ వెబ్‌సిరీస్ కూడా అదేస్థాయిలో ఆదరణ వస్తుందని చెప్పగలను. ఇకపై కూడా వెబ్‌సిరీస్‌లో నటిస్తాను. తెలుగులో చిరంజీవిలాంటి అగ్రనటులు కూడా వెబ్‌సిరీస్‌లో నటిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో వారితో కాంబినేషన్‌గా నాకు ఏదైనా మంచి ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తాను. ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ ఆఫర్లున్నాయి. వెబ్‌సిరీస్‌లో సాంగ్స్ ఉండవు నిజమే.. అయినా నేనిప్పుడేం సాంగ్స్ చేస్తాను చెప్పండి?(నవ్వుతూ).. సాంగ్స్కంటే వెబ్‌సిరీస్‌లో కంటెంటే పెద్ద ఆకర్షణ. -
తొలి మహిళా రాణిగా యువరాణి
ఒడిశా, పర్లాకిమిడి: పర్లాఖెముండి సంస్థానం రాణిగా యువరాణి కల్యాణీ దేవి గజపతికి ఆదివారం పట్టాభిషేకం నిర్వహించారు. ఇంతవరకు దాదాపు 17 మంది రాజులు పర్లాఖెముండి సంస్థాన సింహాసనాన్ని అధిష్టించగా, ఇటీవల 17వ రాజు గోపీనాథ గజపతి మరణించడంతో ఆ స్థానం ఖాళీగా అయింది. అమరులు గోపీనాథ గజపతి రాజా వారికి కుమారులు లేకపోవడంతో ఆయన కుమార్తె యువరాణి కల్యాణీదేవి గజపతికి పట్టాభిషేకం నిర్వహించడం అనివార్యమైంది. దీంతో ఆ సంస్థానం సింహాసనాన్ని అధిష్టించిన మొట్టమొదటి మహిళా రాణిగా యువరాణి కీర్తి గడించారు. 1550లో తొలిసారిగా శివలింగ నారాయణదేవ్ రాజుగా పర్లాఖెముండి సింహాసనం అధిష్టించిన విషయం విదితమే కాగా ఆ తర్వాత వరుసగా 17 మంది రాజులు పర్లాఖెముండి సంస్థానానికి రాజులుగా వ్యవహరించారు. అయితే ఈ నెల 22వ తేదీన రాజమందిరం వద్ద పెద్దఎత్తున అధికారికంగా పట్టాభిషేకం నిర్వహించేందుకు రాణి వారి అనుయాయులు సన్నాహాలు చేస్తున్నారు. అదేరోజున అమర గోపీనాథ గజపతి శ్రద్ధకర్మ(చనిపోయి 12వ రోజు)కూడా కావడంతో అంతా కలసివస్తుందన్న నమ్మకంతో పట్టా భిషేక కార్యక్రమానికి నిర్ణయించినట్లు తెలు స్తోంది. సంస్థానం రాణిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం యువరాణి కల్యాణీదేవి ఆస్థా న విధులను సక్రమంగా నిర్వహించి, రాజవంశ ప్రతిష్టను ఇనుమడింపజేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా రాణి కల్యాణీదేవిని చికిటి రాణి, ఎమ్మెల్యే ఉషాదేవి కలిసి, అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బీజేడీ నాయకులు ప్రదీప్ నాయక్, వి.ఎస్.ఎన్.రాజు, బసంత్ దాస్, సంస్థానం ప్రముఖులు ఉన్నారు. -
క్వీన్ రివ్యూ: అందరి మనసులో ‘అమ్మ’
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ తీయాలని చాలామంది ఉవ్విళ్లూరుతున్నారు. ఫలితంగా ఆమె బయోపిక్‌పై మూడు సినిమాలు రానున్నాయి. కంగనా రనౌత్ ‘తలైవి’, నిత్యామీనన్ ‘ద ఐరన్ లేడీ’ సినిమాలతో పాటు డిజిటల్ మాధ్యమంలో రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో ‘క్వీన్’ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఈ చిత్రానికి గౌతమ్ మీనన్, మురుగేశన్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. అటు న్యాయపరంగా ఇబ్బందులు తలెత్తకుండా చిత్రబృందం జయలలిత పాత్రకు శక్తి శేషాద్రి అని నామకరణం చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం అందరి నుంచీ ప్రశంసలు అందుకుంటోంది. శక్తి.. ఏమీ తెలియని బాల్యం నుంచి అందర్నీ శాసించే రాజకీయ నాయకురాలిగా ఎదిగిన తీరు, ఆమె సంఘర్షణ, పోరాటతత్వం అన్నీ కళ్లకు కట్టినట్టు కనిపిస్తాయి. చిన్నప్పటి శక్తి పాత్రను అనిక పోషించగా యవ్వనంలో అంజనా జయప్రకాశ్ తెరమీద ప్రత్యక్షమవుతుంది. శక్తి రాజకీయ ప్రస్థానాన్ని టాలీవుడ్ నటి రమ్యకష్ణ మరింత రక్తి కట్టించిందనడంలో సందేహం లేదు. శక్తి బాల్యం నుంచే ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటూ ముళ్లదారిలోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ చివరాఖరకు విజయాన్ని ముద్దాడింది. ఒక్కసారి నటిగా గుర్తింపు వచ్చిన తర్వాత బాల్యంలో దక్కని ప్రేమ, అభిమానాలు ఆమెను చుట్టుముట్టడం విశేషం. శక్తి.. సమాజంలోని అసమానతలను, పితృస్వామ్య ధోరణిలను నిర్భయంగా, నిస్సందేహంగా నిలదీస్తుంది. అక్కడే ఆమెలోని నాయకత్వ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. తనకు ఎదురయ్యే ప్రతీ సమస్యను ఎదుర్కొంటూ మరింత రాటు దేలుతూ వచ్చిందే తప్ప కుంగిపోయి ఆమె ప్రయాణాన్ని ఆపలేదు. అదే ఆమెను గొప్ప స్త్రీగా నిలబెట్టింది. నటిగా, నాయకురాలిగా ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. ఇక రాజకీయ ఎంట్రీతో ఆమె జీవితం అనూహ్య మలుపు తిరుగుతుంది. శక్తి(జయలలిత) ఎంతగానో గౌరవించే ఎమ్జీఆర్ పాత్రలో నటుడు ఇంద్రజిత్ సుకుమార్ దర్శనమిస్తాడు. వీరి కలయికలో వచ్చే సీన్లు ఆసక్తికరంగా ఉంటాయి. మొత్తంగా చెప్పాలంటే శక్తి జీవితంలో ఎత్తుపల్లాలను స్పృశిస్తూనే, ఓ గొప్ప నాయకురాలిగా అందరి మనసులో ఎలా స్థానం సంపాదించిందన్నదే కథ. సామాజిక వ్యత్యాసాలు, పురుషాధిక్యం వంటి సమస్యలను కూడా టచ్ చేస్తుందీ సినిమా. రాజకీయ నాయకురాలిగా రమ్యకృష్ణ ఠీవి, అధికారం, ఆమె నటన అద్భుతంగా ఉంటుంది. మొత్తానికి తమిళ వెబ్‌సిరీస్‌లో క్వీన్ ప్రత్యేక స్థానం దక్కించుకోవడంతోపాటు అమ్మ(జయలలిత) అభిమానులు మర్చిపోలేని చిత్రంగా మిగిలిపోతుందనటంలో అతిశయోక్తి లేదు. -
14 నుంచి క్వీన్ పయనం
చెన్నై : ఈనెల 14వ తేదీ నుంచి క్వీన్ పయనం ప్రారంభంకానుంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్కు ఉన్న డిమాండ్ ఏమిటన్నది ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ సంచలన నటి కంగనారనౌత్ టైటిల్ పాత్రలో తలైవి పేరుతో దర్శకుడు విజయ్ ఒక చిత్రాన్ని, నటి నిత్యామీనన్ టైటిల్ పాత్రలో ది ఐరన్ లేడీ పేరుతో నవ దర్శకురాలు ప్రియదర్శిని చిత్రాలను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. వీటిలో తలైవి చిత్రం ఇప్పటికే సెట్ పైకి వచ్చేసింది. కాగా వాటితో పాటు ప్రముఖ దర్శకుడు గౌతమ్‌మీనన్, ప్రసాద్ మురుగేశన్‌లు కలిసి క్వీన్ పేరుతో వెబ్ సీరీస్‌ను రూపొందిస్తున్నారు. జయలలితగా రమ్యకృష్ణ నటించారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. జయలలిత గెటప్‌లో రమ్యకృష్ణ బాగా నప్పిందనే ప్రశంసలు వస్తున్నాయి. కాగా ఈ క్వీన్ సిరీస్ ప్రసారానికి టైమ్ ఫిక్స్ అయింది. ఈ నెల 14 నుంచి ప్రసారం కానున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. కాగా తెగింపు గల నటి, రాజకీయవాది, కాంప్రమైజ్ అనే పదానికి చోటు లేకుండా జీవించిన మనిషిగా రూపొందుతున్న వెబ్ సిరీస్ క్వీన్. బూడిద నుంచి ఉన్నత శిఖరాలకు చేరిన పీనిక్స్ పక్షిలా అతి పిన్న వయసులోనే ముఖ్యమంత్రి అన్న ఘనతకెక్కి తమిళనాడును ఏలిన వ్యక్తి జయలలిత. ఆమె యదార్థ సంఘటనలతో రూపొందుతున్న సిరీస్ క్వీన్. ఎంఎక్స్ ప్లేయర్ సంస్థ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను తమిళం, హిందీ, బెంగాలీ భాషల్లో ఎంఎక్స్ యాప్‌లో ప్రసారం చేయనున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. కాగా ఈ వెబ్ సిరీస్‌తో పాటు జయలలిత బయోపిక్‌తో తెరకెక్కనున్న చిత్రాలకు జయలలిత సోదరుడి కూతురు దీప అనుమతి ఇవ్వలేదు. అంతే కాదు ఈ వ్యవహారంపై ఆమె కోర్టుకెక్కారు. అయినా క్వీన్ వెబ్ సిరీస్‌ను ప్రసారానికి సిద్ధం అవుతున్నారు. దీంతో సమస్యలు తలెత్తకుండా ఈ సిరీస్‌లో ఎక్కడా జయలలిత పేరును ప్రస్థావం లేకుండా జాగ్రత్త పడ్డారు దర్శక నిర్మాతలు. ఇందులో జయలలిత పాత్ర పేరును శక్తి శేషాద్రి అనే పెట్టారు. అలా చట్ట పరమైన సమస్యలు నుంచి క్వీన్ వెబ్ సిరీస్ బయట పడుతుందా? లేదా?అన్నది చూడాలి. -
దిస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్
నటి, తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ ‘క్వీన్’.గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రసాద్ మురుగేశన్ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్‌సిరీస్‌లో జయలలిత పాత్రలో రమ్యకృష్ణ నటించారు. ఇప్పటికే విడుదలైన క్వీన్ ఫస్ట్ లుక్, టీజర్లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. జయలలిత పాత్రలో రమ్యకృష్ణ ఒదిగిపోయారని ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇక తాజాగా ‘క్వీన్’ ట్రైలర్‌ను విడుదల చేశారు. రెండు నిమిషాల 44 సెకన్ల నిడివిగల ఈ ట్రైలర్ అద్యంతం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో రమ్యకృష్ణ పేరు శక్తి శేషాద్రి. జయలలిత స్కూల్ డేస్ నుంచి మొదలు సినీ, రాజకీయ విషయాలను ఈ ట్రైలర్లో జోడించారు. ఇక జయలలిత చిన్న నాటి పాత్రలో ‘విశ్వాసం’ ఫేమ్ అనిఖ ఆకట్టుకుంది. డిసెంబర్ 14న విడుదల కానున్న ఈ వెబ్ సిరీస్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. జయలలిత చిన్ననాటి సన్నివేశాలకు ప్రసాద్, రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి సాగిన పరిస్థితుల సన్నివేశాలను గౌతమ్ మీనన్ తెరకెక్కించారు. ఇక ఈ వెబ్ సిరీసే కాకుండా జయలలిత జీవితం ఆధారంగా ‘తలైవి’, ‘ఐరన్‌లేడీ’ అనే రెండు బయోపిక్స్ వెండితెరపైకి రాబోతున్న విషయం తెలిసిందే. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘తలైవి’ (హిందీలో ‘జయ’)లో జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటిస్తుండగా.. దర్శకురాలు ప్రియదర్శిని ‘ఐరన్ లేడీ’లో జయలలిత పాత్రలో నిత్యా మీనన్ కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ముఖ్యంగా తలైవి ఫస్ట్ లుక్‌పై జయలలిత అభిమానులతో పాటు సినీ అభిమానులు పెదవి విరుస్తున్నారు. (తలైవి ఫస్ట్ లుక్ రిలీజ్) -
రాజకీయ రాణి
రాజకీయ నాయకురాలిగా మారారు రమ్యకృష్ణ. నాయకురాలిగా ఆమె ఆడిన రాజకీయ చదరంగం ఎలా ఉంటుందో చూడటానికి సమయం ఆసన్నమైంది. నటి, తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ‘క్వీన్’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రసాద్ మురుగేశన్ దర్శకత్వం వహించారు. జయలలిత చిన్ననాటి సన్నివేశాలకు ప్రసాద్, రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి సాగిన పరిస్థితుల సన్నివేశాలను గౌతమ్ మీనన్ తెరకెక్కించారు. జయలలిత పాత్రలో రమ్యకృష్ణ నటించారు. ఇందులో రమ్యకృష్ణ పాత్ర పేరు శక్తి అని టాక్. ఈ చిత్రంలో ఎమ్జీఆర్గా నటుడు ఇంద్రజిత్ కనిపిస్తారట. అలాగే యంగ్ జయలలిత పాత్రలో ‘విశ్వాసం’ ఫేమ్ అనిఖ నటించారని కోలీవుడ్ టాక్. తెలుగు, తమిళం, హిందీలో ప్రసారం కానుంది. ఈ వెబ్ సిరీసే కాకుండా జయలలిత జీవితం ఆధారంగా ‘తలైవి’, ‘ఐరన్‌లేడీ’ అనే రెండు బయోపిక్స్ వెండితెరపైకి రాబోతున్న సంగతి తెలిసిందే. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘తలైవి’ (హిందీలో ‘జయ’)లో జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటిస్తారు. ఇక దర్శకురాలు ప్రియదర్శిని ‘ఐరన్ లేడీ’లో జయలిలిత పాత్రలో నిత్యా మీనన్ కనిపిస్తారు. -
ఈ యువతికి ఇంత వయసు ఉంటుందా!
బ్రిటన్ రాచకుటుంబానికి చెందిన క్వీన్ ఎలిజబెత్, కేట్ మిడిల్టన్, మేఘన్ మార్కెల్ లా.. క్వీన్ రానియా చాలామందికి తెలియకపోవచ్చు. విద్య, స్త్రీ సాధికారత, మధ్య ఆసియా దేశాల శరణార్థులు స్థితిగతుల గురించి ఆసక్తి ఉన్నవారికి మాత్రం ఈ పేరు బాగా పరిచయం. ఎందుకంటే క్వీన్ రానియా ఈ సామాజికాంశాల కోసమే పాటుపడుతూ దేశవిదేశాల్లో తన ప్రసంగాలతో అందరికీ అవగాహన కల్పిస్తూ ఉంటారు. క్వీన్ రానియా జోర్డాన్ రాజు అల్ అబ్దుల్లా బిన్ అల్–హుస్సేన్ భార్య. 1970 ఆగష్టు 31 న కువైట్‌లో పాలస్తీనా దంపతులకు జన్మించారు. అమెరికన్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలు అయ్యాక, అక్కడి సిటీబ్యాంక్లోని మార్కెటింగ్ విభాగంలో కొంతకాలం పనిచేశారు. తరువాత జోర్డాన్ రాజధాని అమ్మన్ లో ‘ఆపిల్’ సంస్థలో చేరారు. ఆపిల్‌లో పనిచేస్తున్నప్పుడే ఒక విందులో జోర్డాన్ యువరాజు అల్ అబ్దుల్లా బిన్ అల్–హుస్సేన్ పరిచయం అయ్యాడు. ఇద్దరి మధ్యా ప్రేమ అంకురించింది. 1993లో వివాహం చేసుకున్నారు. పెళ్లినాటికి ఆమె వయసు 23 ఏళ్లు. అప్పటికి రాజుగా ఉన్న కింగ్ హుస్సేన్ 1999లో మరణించడంతో ఆమె భర్త సింహాసనాన్ని అధిష్టించాడు. వెంటనే రానియాను రాణిగా ప్రకటించాడు. అప్పటినుండి రానియా క్వీన్ హోదాలో ప్రపంచ విద్యకు, సమాజ సాధికారతకు కృషి చేస్తున్నారు. మధ్య ఆసియా దేశాలనుంచి ఇతర దేశాలకు వలస వెళ్తున్న వారిపై ప్రపంచదేశాలకు కనికరం కలిగించేందుకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ‘‘వలస వచ్చే వాళ్లు యుద్ధ ప్రభావాల మూలంగా వాళ్ల ఇళ్లను, అయినవాళ్లను పోగొట్టుకుని మానసికంగా, శారీరకంగా కుంగిపోయి ఏ దిక్కూ తోచని వాళ్లే అయి ఉంటారు. అలాంటి వాళ్లను మనం చిన్న చూపు చూస్తే వాళ్లు ఉగ్రవాదులుగా మారే ప్రమాదం ఉంది. దానికంటే కూడా వాళ్లు గౌరవంగా బతకడానికి అవకాశం కల్పించి, వాళ్లకు ఒక దారి చూపిస్తే బాధ్యత గల పౌరులు అవుతారు’’ అని చెబుతుంటారు క్వీన్ రానియా. ఆమె రచయిత్రి కూడా. ముఖ్యంగా చిన్న పిల్లల మానసిక వికాసం కోసం పుస్తకాలు రాశారు. ది కింగ్స్ గిఫ్ట్, ఎటర్నల్ బ్యూటీ, మహా ఆఫ్ ది మౌంటైన్స్, ది శాండ్విచ్ స్వాప్ వాటిలో ముఖ్యమైనవి. నేటితో నలభై తొమ్మిదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న రానియా.. ‘ఏంటి! ఈ యువతికి ఇంత వయసు ఉంటుందా!’ అనిపించేలా ఉంటారు. ఓప్రా విన్ఫ్రే చేసిన ఒక ఇంటర్వ్యూలో ‘‘ఇంత అందంగా ఉన్నారు, ప్రపంచంలోని ఇన్ని అంశాల గురించి పాటుపడుతున్నారు. అసలు మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి?’’ అన్నప్పుడు ‘చాక్లెట్’ అని సమాధానమిచ్చారామె.– రేఖ పర్వతాల ది శాండ్విచ్ స్వాప్ : పిల్లల కోసం రానియా రాసిన పుస్తకం -
సౌత్ క్వీన్‌కు కత్తెర్లు
‘‘మా కష్టాన్ని వృథా చేయకండి’’ అని వాపోతున్నారు కాజల్ అగర్వాల్. రమేష్ అరవింద్ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ప్యారిస్ ప్యారిస్’. హిందీ హిట్ చిత్రం ‘క్వీన్’కు ఇది తమిళ రీమేక్. ఈ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి పాతిక కత్తెర్లు ఇచ్చింది సెన్సార్ బోర్డ్. దీంతో ‘ప్యారిస్ ప్యారిస్’ చిత్రబృందం రివైజింగ్ కమిటీకి వెళ్లింది. ఇటీవల ఈ విషయంపై కాజల్ అగర్వాల్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా స్పందిస్తూ –‘‘హిందీ ‘క్వీన్’ చిత్రాన్ని దక్షిణాది ప్రేక్షకులకు చూపించాలని ఓ మంచి ప్రయత్నం చేశాం. కానీ సెన్సార్ వారు ఇన్ని కట్స్ చెప్పారన్నప్పుడు షాకయ్యాను. వారు చెప్పిన కట్స్‌లో చాలా సన్నివేశాలు మన నిత్య జీవితంలో జరిగేవే ఉన్నాయి. ఈ విషయమే నిర్మాతలకూ చెప్పి సరైన యాక్షన్ తీసుకోమని కోరాను. ఈ సినిమా కోసం చాలా కాలం సమష్టిగా కష్టపడ్డాం. ఆ కష్టానికి తగ్గ ఫలాన్ని అందుకోవాలనుకుప్పుడు ఇలా జరుగుతోంది. ఎటువంటి సెన్సార్ కట్స్ లేకుండానే సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు. హిందీ ‘క్వీన్’ చిత్రం తెలుగు వెర్షన్ ‘దటీజ్ మహాలక్ష్మి’గా మలయాళంలో ‘జామ్ జామ్’గా, కన్నడలో ‘బటర్‌ఫ్లై’గా రీమేక్ అయ్యాయి. ‘జామ్ జామ్’, ‘బటర్ ఫ్లై’ చిత్రాలకు సెన్సార్ బోర్డ్ యుఏ సర్టిఫికెట్ ఇచ్చింది. -
సెన్సార్ సమస్యల్లో కాజల్ ‘క్వీన్’!
బాలీవుడ్లో ఘన విజయం సాధించిన క్వీన్ సినిమాను సౌత్ లో నాలుగు భాషల్లో ఒకేసారి రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో తమన్నా, తమిళ్లో కాజల్, కన్నడలో పరూల్ యాదవ్, మలయాళంలో మంజిమా మోహన్‌లు లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలోనే షూటింగ్ పూర్తయినా రిలీజ్ విషయంలో మాత్రం చిత్రయూనిట్ ఆలస్యం చేస్తున్నారు. తాజాగా తమిళ వర్షనకు సంబంధించిన అప్డేట్ ఒకటి మీడియా సర్కిల్స్‌లో వినిపిస్తోంది. పారిస్ పారిస్ పేరుతో రూపొందిన ఈ సినిమాకు సెన్సార్ ఇబ్బందులు ఎదురవుతున్నట్టుగా తెలుస్తోంది. బోల్డ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా కావటంతో చాలా డైలాగ్స్‌ను తొలగించాల్సిందిగా సెన్సార్ సభ్యులు సూచించారు. అంతేకాదు సీన్స్‌ను బ్లర్ చేయాలని చెప్పటంతో చిత్రయూనిట్ రివైజ్ కమిటీని ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి రివైజింగ్ కమిటీ తమిళ క్వీన్‌కు క్లియరెన్స్ ఇస్తుందేమో చూడాలి. రమేష్ అరవింద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మను కుమరన్ నిర్మిస్తున్నారు. -
ఆమె నటనకు మైమరచిపోయా!
తమిళసినిమా: ఎంత పెద్ద నటికైనా జీవితంలో ఎత్తుపల్లాలు ఎదుర్కోకతప్పదు. కెరీర్ కాస్త డల్ అవగానే ఆ నటి పనైపోయిందనే భావనకు రావడం కరెక్ట్ కాదు. నటి కాజల్ అగర్వాల్ కూడా దక్షిణాదిలో ప్రస్తుతం అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. ముఖ్యంగా కోలీవుడ్‌లో ప్యారిస్ ప్యారిస్ అనే ఒక్క చిత్రం మాత్రమే చేతిలో ఉంది. అయితే తను మాత్రం ఈ చిత్రంపై చాలా నమ్మకం పెట్టుకుంది. ప్యారిస్ ప్యారిస్ ఇది బాలీవుడ్ చిత్రం క్వీన్‌కు రీమేక్. ఇదే చిత్రం తెలుగులో దటీజ్ మహాలక్ష్మి పేరుతోనూ, కన్నడంలో బటర్‌ఫ్లై పేరుతోనూ, మలయాళంలో జామ్ జామ్ పేరుతోనూ నాలుగు భాషల్లో ఏక కాలంలో తెరకెక్కుతోంది. హిందీలో నటి కంగనా రణౌత్ నటించిన పాత్రను తమిళంలో కాజల్‌అగర్వాల్, తెలుగులో తమన్నా, మలయాళంలో మంజిమామోహన్, కన్నడంలో ఫరూఖ్ యాదవ్ పోషిస్తున్నారు. తమిళ వెర్షన్లో నటిస్తున్న అనుభవం గురించి కాజల్ తెలుపుతూ హిందీ చిత్రం క్వీన్‌లో కంగనా రణౌత్ నటన చూసి మైమరచి పోయానని చెప్పింది. నాలుగు గోడల మధ్య నుంచే గొంగళి పురుగు లాంటి అమ్మాయి సీతాకోకచిలుకగా మారిన కథే ఇదని చెప్పింది. ఇలాంటి కథా చిత్రాల్లో నటించాలన్నది తన చిరకాల ఆశ అని పేర్కొంది. అయితే మొదట ఈ చిత్ర దర్శక నిర్మాతలు తనను కలిసి నటించమని కోరినప్పుడు కాస్త సంకోచించానని చెప్పింది. అయితే ఇప్పుడు చిత్రం రూపొందుతున్న తీరు చూసి చాలా సంతృప్తిగా ఉందని అంది. ఈ చిత్రం ఒక్కో భాషలో ఒక్కో నటి నటించడం స్వాగతించదగ్గ విషయంగా పేర్కొంది. తమిళ వెర్షన్ ప్యారిస్ ప్యారిస్‌లో తాను నటించడం ఘనంగా భావిస్తున్నానని చెప్పింది. చిత్ర దర్శకుడు రమేశ్ అరవింద్ ఒక నటుడు కావడంతో తన పాత్రలో సహజంగా నటించడంలోనూ, ప్రతి సన్నివేశం భావాన్ని గ్రహించి అర్థవంతంగా నటించి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు వారి అంచనాలను పూర్తి చేయడానికి ఎంతగానో సహకరిస్తున్నారని తెలిపింది. ప్యారిస్ ప్యారిస్ చిత్రం తన కెరీర్లో గుర్తుండిపోతుందనే అభిప్రాయాన్ని కాజల్‌అగర్వాల్ వెలిబుచ్చింది. -
టాలీవుడ్ చందమామ బర్త్‌డే కానుకగా..
హైదరాబాద్: టాలీవుడ్ చందమామ, నటి కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఓ మేకింగ్ వీడియోను మూవీ యూనిట్ విడుదల చేసింది. జూన్ 19న పుట్టినరోజు జరుపుకుంటున్న కాజల్‌కు సినీ ప్రముఖులతో పాటు ఫ్యాన్స్ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఎల్లారుకు వనక్కం అంటూ కాజల్ నమస్కారం పెట్టారు. కాజల్ లీడ్ రోల్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘ప్యారిస్ ప్యారిస్’.. సీనియర్ నటుడు రమేశ్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ హిందీ ‘క్వీన్’కు తమిళ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాజల్ బర్త్‌డే కానుకగా మూవీ మేకింగ్ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. హిందీలో కంగనా రనౌత్ నటనకు విమర్శల ప్రశంసలు అందుకున్న ‘క్వీన్’ను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ప్యారిస్ ప్యారిస్ తప్పక చూడాలంటూ ప్రేక్షకులను నటి కాజల్ కోరారు. -
మైసూర్లో ముగ్గురు రాణులు
మైసూర్ వెళ్లారు మహాలక్ష్మి. అక్కడ ఏవో వర్క్స్‌ని కంప్లీట్ చేసుకుని తిరిగి హైదరాబాద్ వస్తారు. ఎవరో మహాలక్ష్మి గురించి ఈ డీటైల్స్ ఎందుకు? అని తేలికగా తీసిపారేయకండి. ఎందుకంటే.. మైసూర్ వెళ్లింది మన టాలీవుడ్ మహాలక్ష్మినే. అదేనండీ.. తమన్నా అని చెప్తున్నాం. ఇంతకీ మహాలక్ష్మి మైసూర్ ప్రయాణం విశేషం ఏంటంటే... తమన్నా లీడ్ రోల్లో ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘దటీజ్ మహాలక్ష్మి’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హిట్ ‘క్వీన్’ చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. మనుకుమారన్ నిర్మిస్తున్నారు. అమిత్ త్రివేది స్వరకర్త. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మైసూర్లో శరవేగంగా జరుగుతోంది. తమ్మూపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. టైటిల్‌ని బట్టి ఇప్పుడు మహాలక్ష్మి క్యారెక్టర్లో తమన్నా నటిస్తున్నారని ఊహించవచ్చు. ఈ సంగతి ఇలా ఉంచితే... హిందీ చిత్రం ‘క్వీన్’ తమిళ, కన్నడ భాషల్లో కూడా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తమిళ రీమేక్ ‘ప్యారిస్ ప్యారిస్’లో కాజల్, కన్నడ రీమేక్ ‘బటర్ ఫ్లై’లో పరుల్ యాదవ్ నటిస్తున్నారు. కన్నడ, తమిళ వెర్షన్స్‌కు రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్నారు. సెట్లో మంగళవారం పరుల్ బర్త్‌డే సెలబ్రేషన్స్ జరిగాయి. తమన్నా, కాజల్ పాల్గొన్నారు. ‘‘ఇది నాకు స్పెషల్ పుట్టినరోజు. ఈ చిత్రానికి పని చేయడం మర్చిపోలేని అనుభూతి’’ అన్నారు పరుల్. ఇలా మైసూర్లో ముగ్గురు రాణులు కలుసుకున్నారన్నమాట. మలయాళం ‘క్వీన్’ రీమేక్‌లో నటిస్తోన్న మంజిమా మోహన్ మాత్రం ఈ వేడుకల్లో పాల్గొనలేదు. సోషల్ మీడియా ద్వారా పరుల్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపారామె. -
మైసూర్లో ప్యారిస్ ప్యారిస్!
‘ప్యారిస్ ప్యారిస్’ అంటూ మైసూర్ వెళ్లారట హీరోయిన్ కాజల్ అగర్వాల్. అయ్యో.. పాపం ఆమె అలా ఎలా పొరపాటు పడ్డారు? ఇప్పుడెలా అని ఫ్యాన్స్ కంగారు పడిపోకండి. ‘ప్యారిస్ ప్యారిస్’ అనేది సినిమా టైటిల్. ప్లేస్ కాదండీ బాబు. రమేష్ అరవింద్ దర్శకత్వంలో కాజల్ లీడ్ రోల్ చేస్తోన్న చిత్రం ‘ప్యారిస్ ప్యారిస్’. హిందీ హిట్ ‘క్వీన్’ చిత్రానికి రీమేక్ ఇది. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను చిత్రబృందం మైసూర్లో ప్లాన్ చేసింది. ఈ షూటింగ్లో కాజల్ పాల్గొంటున్నారట. మూడు రోజుల క్రితం బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా హైదరాబాద్ షెడ్యూల్లో కాజల్ పాల్గొన్న సంగతి తెలిసిందే. -
దటీజ్ మహాలక్ష్మి
... అనగానే టక్కున తమన్నా గుర్తుకు రాక మానరు. నాగచైతన్య, తమన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘100 పర్సెంట్ లవ్’ చిత్రంలోని ‘దటీజ్ మహాలక్ష్మి..’ పాట, తమన్నా చెప్పిన ఆ డైలాగ్ ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిందే. మహాలక్ష్మి పాత్రలో ప్రేక్షకుల్ని అలరించారు మిల్కీ బ్యూటీ. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకు? అనేగా మీ డౌట్. అసలు విషయం ఏంటంటే.. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘క్వీన్’ తెలుగు రీమేక్‌లో తమన్నా లీడ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘అ’ సినిమా ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘దటీజ్ మహాలక్ష్మి’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ‘మీ సినిమా టైటిల్ ‘ఇట్స్ మీ మహాలక్ష్మి’, ‘దటీజ్ మహాలక్ష్మి’.. ఈ రెంటిలో ఏది? అని ఓ అభిమాని ట్వీటర్లో అడిగిన ప్రశ్నకు ‘కన్ఫ్యూజ్ అవ్వొద్దు... ‘దటీజ్ మహాలక్ష్మి’ అని క్లారిటీ ఇచ్చారు తమన్నా. ‘క్వీన్’ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ రీమేక్ అవుతోంది. తమిళంలో కాజల్ అగర్వాల్ చేస్తోన్న ఈ చిత్రానికి ‘ప్యారిస్ ప్యారిస్’ టైటిల్ కన్ఫార్మ్ చేశారు. కన్నడ వెర్షన్‌కి ‘బటర్‌ఫ్లై’ అని పెట్టారు. ఇందులో పరుల్ యాదవ్ కథానాయికగా నటిస్తున్నారు. మలయాళ రీమేక్‌లో మంజిమా మోహన్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘జామ్ జామ్’ అనే టైటిల్‌ని నిర్ణయించారు. మరి.. నాలుగు భాషల్లో ఏ ‘క్వీన్’ బెస్ట్ అనిపించుకుంటారో వేచి చూద్దాం. -
అలాంటివి కలగానే మిగిలిపోయాయి..
తమిళసినిమా: ఆశకు అంతం ఉండదంటారు. అదే విధంగా చేసే పనిలో సంతృప్తి పడిపోతే ముందుకు సాగలేం అన్నది ఆర్యోక్తి. నటి కాజల్ ఈ రెండో కోవకు చెందన వ్యక్తి అని ఆమె మాటల్లో వ్యక్తం అవుతోంది. కోలీవుడ్, టాలీవుడ్‌ల్లో ప్రముఖ కథానాయకులందరితోనూ నటించిన కాజల్‌అగర్వాల్ ప్రస్తుతం అవకాశాల విషయంలో కాస్త వెనకపడ్డారనే చెప్పాలి. ముఖ్యంగా కోలీవుడ్‌లో చేతిలో ప్యారిస్ ప్యారిస్ అనే ఒక్క చిత్రమే చేతిలో ఉంది. ఇది హిందీలో సంచలన విజయం సాధించిన క్వీన్ చిత్రానికి రీమేక్ అన్న విషయం తెలిసిందే.అయినా అగ్రనటీమణుల పట్టికలోనే కొనసాగుతున్న కాజల్‌అగర్వాల్ ఇంకా ఎలాంటి కథా పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నారు అన్న ప్రశ్నకు నిజం చెప్పాలంటే వచ్చిన అవకాశాల్లో నచ్చినవి ఎంపిక చేసుకుని నటిస్తున్నానని చెప్పింది. అయితే యాక్షన్, కామెడీ కథా పాత్రల్లో నటించాలన్న ఆశ ఉందంది. తాను ఇప్పటి వరకూ యాక్షన్ కథా పాత్రల్లో నటించలేదని, అందుకే అలాంటి పాత్రలు కలగానే మిగిలిపోయాయని పేర్కొంది. వ్యక్తిగతంగా తనకు మంచి భావోద్రేక కథా చిత్రాలు, ప్రేమ కథా చిత్రాలంటేనే ఇష్టం అని చెప్పింది. అదే విధంగా భాషా భేదం లేకుండా అన్ని భాషా చిత్రాల్లోనూ నటించాలన్నది తన నిర్ణయం అని తెలిపింది. నటన వరకూ భాష అడ్డు కాకూడదన్నదే తన అభిప్రాయం అని అంది. నటన అనేది కథా పాత్రను బట్టి ఉంటుందని, అందుకే ఏ భాషా చిత్రం అయినా కథ నచ్చితే నటిస్తానని చెప్పింది. అది అంతర్జాతీయ భాషా చిత్రం అయిన నటించడానికి రెడీ అంటూ కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్‌లకు మించి తన హాలీవుడ్ ఆశను చెప్పకనే చెప్పేసింది. ఈ అమ్మడు బాలీవుడ్లోనే పెద్దగా సక్సెస్ కాలేదన్నది గమనార్హం. -
‘అ’ దర్శకుడేనా?
కంగనా రనౌత్ లీడ్ రోల్లో తెరకెక్కిన ‘క్వీన్’ సినిమా ఎంతటి భారీ హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమాని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో తమన్నా లీడ్ రోల్ చేస్తున్నారు. తమిళంలో కాజల్ అగర్వాల్, కన్నడలో పరుల్ యాదవ్, మలయాళంలో మంజిమా మోహన్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాకి నీలకంఠ దర్శకుడు. అయితే.. ఈ ప్రాజెక్టు నుంచి ఆయన తప్పుకోవడంతో కొత్త దర్శకుడు ఎవరా? అనే ఆసక్తి ఇండస్ట్రీ వర్గాల్లో నెలకొంది. గతంలో కొందరి దర్శకులు పేర్లు వినిపించినా తాజాగా ప్రశాంత్ వర్మ పేరు వినిపిస్తోంది. ఆయన దర్శకత్వం వహించిన ‘అ’ సినిమా మంచి ప్రశంసలు అందుకుంది. ఈ దర్శకుడితో ‘క్వీన్’ తెలుగు రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. -
ది లిప్‌స్టిక్ బ్యాండిట్..
2015.. వరుస బ్యాంక్ దోపిడీలతో అమెరికా పశ్చిమ తీర రాష్ట్రాలైన ఆరిజోనా, కాలిఫోర్నియా, ఉటాలను ఊపేసిన బాంబ్‌షెల్ బాండిట్ గుర్తుంది కదా? అదేనండీ ఉరఫ్ సందీప్ కౌర్... 24 ఏళ్ల అమ్మాయి.. కాలిఫోర్నియాలో నర్స్‌గా పనిచేసేది. కాసినోకి వెళ్లే వ్యసనంతో విపరీతంగా అప్పులపాలై వాటిని తీర్చడానికి బ్యాంకులకు కన్నం వేయాలని నిర్ణయించుకుంది. మారువేషం.. ఆమె మోడస్ ఆపరెండి. తల మీద విగ్గు.. సగం మొహాన్ని కప్పేసే సన్‌గ్లాసెస్.. ట్రాక్ సూట్, హ్యాండ్ బ్యాగ్‌తో బ్యాంక్‌కు వెళ్లేది. క్యాషియర్ దగ్గరకు వెళ్లి.. ‘‘ఈ బ్యాగ్‌లో బాంబ్ ఉంది.. ఈ బ్యాగ్‌లో పట్టినంత డబ్బు సర్దకపోతే బాంబ్‌తో బ్యాంక్ పేల్చేస్తా’’ అని స్థిర స్వరంతో బెదిరించి లూటీ చేసి వెళ్లిపోయేది ఈ రాణి. అలా వరసగా అయిదు వారాలు ఆరిజోనా, కాలిఫోర్నియా, ఉటాలో తన దోపిడీలతో కలకలం సృష్టించింది. అలా దొంగతనం చేసి వెళ్లిపోతుంటే పోలీసులు ఆమెను వెంటాడారు. పసిగట్టిన కౌర్ తన వెహికిల్‌ను హై స్పీడ్‌లో మూడు రాష్ట్రాలను అంటే రెండు టైమ్‌జోన్స్‌ను దాటించింది. ఈ చేజింగ్ సీన్ హాలీవుడ్ సినిమాకూ తక్కువకాదు. మొత్తానికి పోలీసులకు చిక్కి 66 నెలల జైలు శిక్షకు గురైంది. ఆమె బెదిరింపు విని భయంతో గొంతు తడారిపోయిన వాళ్లకు నీళ్లు తాగించి మరీ డబ్బులు దోచుకొళ్లేదట దొరసాని.ఓకే.. క్వీన్ సినిమా కూడా గుర్తుంది కదా? ఏంటీ ఒక స్క్రీన్ మీద రెండు కథలు? అని ఐబ్రోస్‌ను ముడేయకండి! నిజంగా ఒక టికెట్‌కు రెండు కథల సినిమానే సిమ్రన్. విడాకులు తీసుకున్న30 ఏళ్ల ఓ వనిత కథ... ప్రఫూల్ పటేల్ అలియాస్ సిమ్రన్... అమెరికాలోని జార్జియా (అట్లాంటా)లో ఉంటుంది... తల్లిదండ్రులతో కలిసి. ఓ ఫైవ్ స్టార్ హోటల్లో హౌజ్ కీపింగ్ ఉద్యోగం చేస్తూ. భర్తతో విడిపోయి ఇంట్లో ఉంటున్న కూతురంటే తల్లికి, తండ్రికి ఇద్దరికీ చిన్న చూపే. ప్రఫూల్ ఉద్యోగం నుంచి ఇంటికి రాగానే.. ‘‘ఎన్నాళ్లిలా ఉంటావ్? ఇంకో పెళ్లి చేసుకోవచ్చుకదా.. ’ అంటూ తల్లి నస పెడుతుంటుంది. జీతం డబ్బుల్లో చాలా దాచుకుంటూ సొంతంగా ఇల్లు తీసుకొని విడిగా ఉండాలనుకుంటుంది. ఈ విషయం తెలిసి తండ్రి ‘‘ఎందుకూ.. ఒంటరిగా అయితే బాయ్‌ఫ్రెండ్స్‌ను పిలిపించుకోవచ్చనా?’’ అంటూ అవమానపరుస్తుంటాడు. తల్లిదండ్రుల అనుమానాలు, అవమానాలు, అంచనాల నుంచి విముక్తి పొందాలనుకుంటుంది ప్రఫూల్. స్వతంత్రంగా బతకాలనుకుంటుంది. లాస్ వేగస్.. ఆ క్రమంలోనే లాస్ వేగాస్‌లో కజిన్ బ్యాచ్‌లరేట్ పార్టీ ఉండడంతో వెళ్తుంది. అక్కడ ఆమెను ఓ క్లబ్‌కు తీసుకెళ్తాడు ఓ ఫ్రెండ్. బాకర్ట్ గేమ్‌లో డబ్బులు గెల్చుకుంటుంది. ఎంజాయ్ చేస్తుంది. కాసినోకు వెళ్తుంది. బకార్ట్లో సహకరించిన అదృష్టం కాసినోలో వెక్కిరిస్తుంది. గెలుచుకున్నదంతా పోతుంది. అక్కడితో ఆగకుండా బ్యాంక్లోఉన్న సేవింగ్స్‌నూ పెడ్తుంది. అవీ పోతాయ్. తిరిగి అట్లాంటా వెళ్లిపోతుంది. బ్యాంక్‌లో ఉండాల్సిన డిపాజిట్ లేకపోవడంతో ఇల్లు లోన్ కోసం పెట్టుకున్న దరఖాస్తు రిజెక్ట్ అవుతుంది. ఆర్థిక సహాయం కోసం తండ్రిని అభ్యర్థిస్తుంది. ‘‘ఈ పిచ్చి పనులన్నీ మానుకుని సమీర్ (సోహమ్ షా.. తండ్రి చూసిన ఇంకో సంబంధం)ను చేసుకో’’ అంటూ ఒత్తిడి చేస్తాడు. ససేమిరా అనుకుని ఆఖరిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మళ్లీ వేగస్ వెళుతుంది. కాసినోలో అప్పులిచ్చేవాడు తారసపడ్తాడు. తాకట్టుగా డ్రైవింగ్ లైసెన్స్‌ను పెట్టి డబ్బు తీసుకుంటుంది. వాటినీ పోగొట్టుకుంటుంది. లిప్‌స్టిక్ బ్యాండిట్.. మళ్లీ అట్లాంటా వెళ్లిపోయి తండ్రితో చెప్తుంది సమీర్‌ను కలుస్తానని. కలుస్తుంది కాని ఎలాంటి ఆసక్తీ చూపదు. అయితే సమీర్‌కు ప్రఫూల్ అంటే ఇష్టం ఏర్పడుతుంది. ఈలోపు కజిన్ పెళ్లి వస్తుంది. ఆ పెళ్లిలో అప్పులవాడు డబ్బు కట్టమని ఫోన్ చేసి బెదిరిస్తుంటాడు. ఇంటికి లోన్ వస్తే అవి కట్టేద్దామనుకుంటుంది. కాని లోన్ క్యాన్సల్ కావడంతో ఏం చేయాలో పాలుపోదు. మెల్లగా చిల్లర దొంగతనాలకు అలవాటు పడుతుంది. ఆ అలవాటు బ్యాంక్ దోచేందుకు ప్రోత్సహిస్తుంది. బ్యాంక్‌కు వెళ్లి ‘‘డబ్బులు ఈ బ్యాగ్‌లో పెట్టండి లేదంటే బాంబు పేలుస్తా’’ అని లిప్‌స్టిక్‌తో రాసిన నోట్‌ను క్యాషియర్‌కు చూపిస్తుంది. భయపడి డబ్బు సర్దేస్తారు బ్యాగ్‌లో. ఇదేదో బాగుంది అని వరుసగా ఇంకో రెండు బ్యాంక్‌లను దోచేస్తుంది. ఆ క్రమంలోనే మరో బ్యాంక్‌ను ఎంచుకుంటుంది. అదే ఫక్కీలో లిప్‌స్టిక్ నోట్ చూపిస్తుంది. అయితే మేనేజర్ నీ పేరేంటి అని అంటూ మాటల్లో పెడ్తాడు. తడబడ్డ ప్రఫూల్.. సిమ్రన్ అని చెప్తుంది. కారణం అప్పటికే వాళ్ల అమ్మ వల్ల ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమాను కొన్ని పదులసార్లు చూడ్డం వల్ల. పైగా ఆ సినిమాలోని లాస్ట్ సీన్.. ‘‘జా సిమ్రన్ జా.. జీలే అప్నీ జిందగీ’’ అనే డైలాగ్ ప్రఫూల్కి చాలా ఇష్టం. దాంతో ఆ పేరు చెప్తుంది. కాని మేనేజర్ ఆమె గురించి పోలీసులకు ఇన్ఫామ్ చేస్తున్నాడని తెలుసుకుని తప్పించుకుని ఇంకో బ్యాంక్‌కు వెళ్తుంది. అప్పటికే ఆమె ‘సిమ్రన్.. ది లిప్‌స్టిక్ బ్యాండిట్’ పేరుతో మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్‌గా మారుతుంది. మూడు, నాలుగు బ్యాంక్‌లను దోచుకున్నా అప్పుల వ్యక్తికి కట్టాల్సిన డబ్బు జమకాదు. దాంతో ఇంకొంత వ్యవధి ఇవ్వమని ప్రాధేయపడుతుంది. ఒప్పుకోడు. ఇంకోవైపు సమీర్ అంటే ఇష్టం ఏర్పడి పెళ్లికి సరే అంటుంది ప్రఫూల్. ఈలోపే ఇంకో సమస్య చుట్టుకుంటుంది ఆమెను. హోటల్లో పనిచేస్తుండగా అప్పుల వాళ్లు ఆమె మీద దాడి చేస్తారు. ఆమె పాత బాయ్‌ఫ్రెండ్, ఆ హోటల్ మేనేజర్ (మైక్) ప్రఫూల్ హోటల్ లాకర్లో భద్రపర్చుకున్న డబ్బు (బ్యాంక్ రాబరీ మనీ) మీద కన్నేసి దొంగలిస్తాడు. ఆ విషయం తెలిసి తన డబ్బు తనకు తిరిగి ఇచ్చేయమని అడుగుతుంది ప్రఫూల్. ఇవ్వనంటాడు. అతన్ని కొట్టి సస్పెండ్ అవుతుంది. ఈ గొడవలో అప్పుల వాళ్లకు ప్రఫూలే లిప్‌స్టిక్ బ్యాండిట్ అని అర్థమవుతుంది. దాంతో ఇంకో పెద్ద బ్యాంక్‌కు కన్నం వేయమని పిస్టల్‌ను కూడా ఇస్తారు ప్రఫూల్‌కు. సరెండర్.. వీటన్నిటితో విసిగిపోయి.. ఇక దాంట్లోంచి బయటకు రాలేననుకుని తాను చేసిన దొంగతనాల గురించి సమీర్‌కు చెప్పి తనను వదిలేయమంటుంది ప్రఫూల్. తండ్రికి తెలిసి కూతురి చెంప ఛెళ్లుమనిపించి ఇంట్లోంచి వెళ్లిపొమ్మంటాడు. స్నేహితురాలి దగ్గరకు వెళ్లి ఆ రాత్రి తలదాచుకుంటుంది. అయితే తెల్లవారి తనకు లోన్ రిజెక్ట్ చేసిన బ్యాంక్‌కు కన్నం వేసి డబ్బు దొంగలిస్తుంది. ఇదిలా ఉండగా.. ప్రఫూల్ దొంగ అని తెలిసినా ప్రేమను చంపుకోని సమీర్ ఆమె అప్పులవాళ్లకు కట్టాల్సిన 50 వేల డాలర్ల డబ్బును ప్రఫూల్ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేస్తాడు. గ్రహించిన ప్రఫూల్ అతన్ని ఒంటరి ప్రదేశంలో కల్సుకుని తనను వదిలేసి ఇంకో మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొమ్మని చెప్తుంది. అదంతా కాదు.. ముందు పోలీసులకు లొంగిపో అంటాడు సమీర్. తండ్రి నుంచి ఫోన్ వస్తుంది క్షమించమని. ఇంటికి బయలుదేరుతుంది. పోలీసుల నిఘా ఉండడం వల్ల ఇంటి దగ్గర పోలీసులు చుట్టుముడ్తారు. తప్పించుకుంటుంది ప్రఫూల్. చేజింగ్ మొదలవుతుంది. తర్వాత సరెండర్ అవుతుంది. తప్పించుకోవాలనే ఉద్దేశం లేదని, తమింటి దగ్గర అందరూ భారతీయులే కావడం వల్ల అక్కడ దొరికిపోవడం ఇష్టం లేకే అంత దూరం వచ్చినట్టు చెప్తుంది. వచ్చేసరికి పోలీసులు ఆమె కారును చుట్టుముడ్తారు. సరెండర్ అయిపోతుంది. పదినెలలు జైలు శిక్ష పడుతుంది. ఇదీ బాంబ్‌షెల్ బ్యాండిట్కు ప్రతీకగా వచ్చిన ‘ది లిప్‌స్టిక్ బ్యాండిట్’ సిమ్రన్ సినిమా కథ. – శరాది -
‘మెంటల్’ వారిదేనట....
సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో ఉండే వారెవరైనా ఈ మధ్యకాలంలో వచ్చిన కంగనా రనౌత్, రాజ్‌కుమార్ రావ్ల ‘మెంటల్ హై క్యా’ సినిమా పోస్టర్లను చూడకుండా ఉండరు. పోస్టర్లతోనే భారీ అంచనాలు పెంచుకున్న ఈ సినిమా విడుదల కోసం అభిమానులంతా ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తుంటే... బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, అతని సోదరుడు సోహాలి ఖాన్ మాత్రం అసంతృప్తిగా ఉన్నారు. విషయమేంటంటే ‘మెంటల్’ టైటిల్‌ను ఈ బాలీవుడ్ బ్రదర్స్ చాలా కాలం క్రితమే తమ పేరిట నమోదు చేసుకున్నారు. ఇప్పుడు ఏక్తాకపూర్ ఈ పేరుకు దగ్గరగా ఉండేలా ‘మెంటల్ హై క్యా’ టైటిల్‌ను పెట్టడం వీరి అసంతృప్తికి కారణమైంది. గతంలో సోహాలి తీసిన ‘జయ హో’(2014)కు, కబీర్ ఖాన్ తీసిన ‘ట్యూబ్‌లైట్’కు ముందుగా ‘మెంటల్’ టైటిల్‌నే అనుకున్నారు. ఖాన్ బ్రదర్స్ ఈ టైటిల్‌ను వాడుకునే లోపే ఏక్తా తన సినిమా పేరు ‘మెంటల్ హై క్యా’ అని ప్రకటించింది. అంటే ఆమె వీరి టైటిల్‌ను దొంగిలించిందనే చెప్పవచ్చు. అందుకే వారు ఏక్తాపై అసహనంగా ఉన్నారని, కనీసం ఏక్తా వారిని అడిగి వుంటే ఆమెకు ఇచ్చేవారు అని ఖాన్ కుంటుంబ సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఇదే విషయం గురించి సోహాలి ఖాన్‌ను అడగ్గా ‘మేము ‘మెంటల్’ టైటిల్‌ను ఏక్తాకు ఇవ్వలేదు, ఆమె కనీసం మమ్మల్ని అడగలేదు’ అన్నారు. ‘క్విన్’(2014) సినిమా తర్వాత కంగనా రనౌత్, రాజ్‌కుమార్ రావ్ నటిస్తున్న చిత్రం ‘మెంటల్ హై క్యా’. మానసిక అనారోగ్యం, భ్రమల చూట్టూ తిరిగే ఈ థ్రిల్లర్ చిత్రానికి జాతీయ అవార్డు విజేత ప్రకాశ్ రావ్ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. -
నాలుగేళ్ల తర్వాత
కెరీర్ పరంగానే కాదు. యాక్టింగ్‌వైజ్‌గా కూడా కంగనా రనౌత్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లిన సినిమా ‘క్వీన్’. వికాశ్ బాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు విమర్శకుల ప్రసంశలూ దక్కాయి. ఈ సినిమాలో కీలక పాత్రలో రాజ్‌కుమార్ రావ్ నటించారు. ఇప్పుడు ఈ ఇద్దరు నాలుగేళ్ల తర్వాత నటించనున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో రూపొందనుందని బాలీవుడ్ టాక్. బొమ్మలాట, అనగనగా ఓ ధీరుడు, సైజ్ జీరో చిత్రాలను తెరకెక్కించారాయన. ఈ సినిమా షూటింగ్ మార్చిలో స్టార్ట్ కానుందని బీటౌన్ టాక్. -
రాణులకాలం వస్తోంది
రాజుల కాలం నాటి సెట్టింగులతో అమెరికాలో ‘మెడీవల్ టైమ్స్’ అని తొమ్మిది రెస్టారెంట్లు ఉన్నాయి. 1983 నుంచీ ఉన్నాయి. అవన్నీ కూడా కోటల్లా ఉంటాయి. వాటిలోకి వెళ్లి ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తూ మధ్యయుగాలనాటి పోరాట సన్నివేశాలను, కత్తి యుద్ధాలను చూడొచ్చు. అప్పటి యుద్ధ క్రీడల్ని కూడా లోపలి స్టాఫ్ ఆర్టిస్టులు ప్రదర్శిస్తుంటారు. డిన్నర్‌తో పాటు ఎంటర్టైన్మెంట్ కోరుకునే సంపన్న విలాసవంతులకు ఇవి మంచి కాలక్షేపం. రాజులు, మంత్రులు, గుర్రాలు, విలు విద్యలు, రంగస్థల నాటకాలు అన్నీ అక్కడే! తొమ్మిది రెస్టారెంట్లలో కలిపి దాదాపు పది వేల మందికి పైగా సిబ్బంది ఉంటారు. అవసరాన్ని బట్టి అక్కడివారు ఇక్కడికి మారుతుంటారు. ఫ్లారిడా, కాలిఫోర్నియా, న్యూజెర్సీ, ఇల్లినాయిస్, టెక్సాస్, ఆంటారియో, సౌత్ కరోలినా, మేరీల్యాండ్, జార్జియా.. ఈ తొమ్మిది చోట్లా రాజులూ, రాజ్యాలే థీమ్. ఏడాది పొడవునా రెస్టారెంట్ టేబుళ్లు భార్యాభర్తల్తో, పిల్లాజెల్లల్తో, బ్యాచిలర్లతో కిటకిటలాడుతుంటాయి. ఏడాదికి 25 లక్షలమంది కస్టమర్లు వచ్చిపోతుంటారు. విషయం ఏంటంటే.. ఇప్పుడీ రెస్టారెంట్లన్నీ థీమ్‌ని మార్చుకోబోతున్నాయి. ఇంతవరకు లోపల సింహాసనాలపై రాజులు కూర్చునేవారు. ఇప్పుడు రాణులు కూర్చొని ఈ చెయిన్ రెస్టారెంట్లలో రాజ్యపాలన చేయబోతున్నారు. అంటే.. కస్టమర్లకు ఎప్పుడూ కనిపించే రాజులు కాకుండా, ఇంతవరకు కనిపించని రాణులు ప్రత్యక్షమౌతారు. ఆ విధంగా థీమ్‌ని మార్చేసుకుంది.. ‘మెడీవల్ టైమ్స్’ గ్రూపు. ‘‘అన్ని రంగాల్లో మహిళలకు ప్రాధాన్యం పెరుగుతోంది. అందుకే మేమూ మా ప్రాధాన్యాన్ని పెంచుకోవాలనుకున్నాం’’ అని కంపెనీ ఓనర్లు అంటున్నారు. అయితే ఇక్కడికి తరచూ వచ్చే మగధీరులు కొందరు మాత్రం.. ‘సీట్లో రాజుగారు ఉంటే ఆ కిక్కే వేరప్పా’ అని పెదవి విరుస్తున్నారు. రాణిగారి పాలనను చూశాకైనా వీళ్లు మనసు మార్చుకుంటారేమో చూడాలి. మోడలింగ్‌లోకి కొత్తగా వచ్చిన హాలీవుడ్ అమ్మాయిల్ని రాణులుగా ఎంపిక చేసుకునే పనిలో ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నాయి ఈ రెస్టారెంట్లు. -
ఆ వార్తల్లో నిజం లేదు
...అంటున్నారు మిల్కీ బూటీ తమన్నా. ఇంతకీ ఆ వార్త ఏంటనేగా మీ డౌట్. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన ‘క్వీన్’ హిందీ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రీమేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. తెలుగులోనూ ‘క్వీన్’ పేరుతో వస్తోన్న ఈ చిత్రంలో తమన్నా టైటిల్ రోల్ చేస్తుండగా నీలకంఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆ మధ్య మొదలైంది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ‘క్వీన్’ చిత్రీకరణ లో నీలకంఠకూ, తమన్నాకు మధ్య మనస్పర్థలు వచ్చాయనీ, దాంతో నీలకంఠ ఆ సినిమా నుంచి తప్పుకున్నారనే వార్తలు ఫిల్మ్‌నగర్‌లో హల్చల్ చేయడంతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారాయి. ఈ వార్తలు అటూ ఇటూ తిరిగి తెలుగు క్వీన్ చెవిన పడ్డట్టున్నాయి. అందుకే కాబోలు తాజాగా తమన్నా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ‘‘నీలకంఠ సార్ అంటే నాకు చాలా గౌరవం. నేను ఆయనతో గొడవ పడ్డానని వస్తున్న వార్తల్లో నిజం లేదు. మా మధ్య ఎటువంటి మనస్పర్థలు లేవు. సినిమా నిర్మాణం విషయంలో నాకు, నా టీమ్‌కి కానీ ఎటువంటి అధికారం లేదు. పూర్తి అధికారం నిర్మాత మను కుమారన్‌దే. నాలుగు భాషల్లో ఏక కాలంలో రానున్న ‘క్వీన్’ మా అందరికీ ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిది. అందుకోసం యూనిట్ అంతా కష్టపడి పనిచేస్తోంది’’ అని సెలవిచ్చారు తమన్నా. అయితే.. ప్రస్తుతం ‘క్వీన్’ షూటింగ్ జరుగుతోందా? ఆగిపోయిందా? అనే క్లారిటీ ఇవ్వలేదు మిల్కీ బ్యూటీ. -
బయో పీక్స్
► పద్మావత్‌కి అక్కడ దారి ఉందా? చరిత్రలో ఖ్యాతి గాంచిన రాణుల్లో రాణి పద్మావతి ఒకరు. ఆమె జీవితం ఆధారంగానే సంజయ్ లీలా భన్సాలీ ‘పద్మావత్’ చిత్రాన్ని తెరకెక్కించారని బాలీవుడ్ టాక్. దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ ముఖ్య తారలుగా నటించిన ఈ సినిమాను ఈ నెల 25న రిలీజ్ చేయనున్నారు. అయితే హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో రిలీజ్‌కు అభ్యంతరం తెలిపాయి. దీంతో చిత్రనిర్మాణ సంస్థ వయాకామ్18 సుప్రీం కోర్టును ఆశ్రయించగా, పరిశీలనకు అంగీకరించింది. ► బయోపిక్స్ క్రేజ్ పీక్స్‌కి చేరింది. బాక్సింగ్ రింగ్‌లో మేరీ కోమ్ పిడిగుద్దులు గుద్దుతుంటే... లేడీ లైన్ అని, చప్పట్లు కొట్టారు. ఈ లేడీ లైన్ బాక్సర్‌గా రాణించడానికి చాలా కష్టాలు పడ్డారు. అందుకే మేరీ కోమ్ స్టోరీతో సినిమా తీస్తే... ప్రేక్షకులు కనకవర్షం కురిపించారు. ‘బావలు సయ్యా.. మరదలు సయ్యా’... సిల్క్ సిత్మ రింగు రింగులు తిరుగుతూ డ్యాన్స్ చేస్తుంటే సిక్స్టీ ప్లస్ ఏజ్ ఉన్న హార్టులు కూడా స్వీట్ సిక్స్టీ అయిపోయాయి. అందుకే ఆమె లైఫ్ స్టోరీతో ‘డర్టీ పిక్చర్’ తీస్తే ఎగబడి చూశారు. గ్రౌండ్లో ధోని రన్నుల మీద రన్నులు పీకుతుంటే... ఈ రేంజ్లో ఆడటానికి ఏ రేంజ్లో కష్టపడ్డాడు? ఇతగాడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలియాల్సిందే అనుకున్నారు. అందుకే ధోని జీవితకథతో తీసిన ‘ఎం.ఎస్.ధోని’ హిట్. ఇలా చెప్పుకుంటూ పోతే బాలీవుడ్ స్క్రీన్‌పై మెరిసిన ‘బయోపిక్స్’ ఎన్నో. ఈ నిజ జీవిత కథలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే రెండు మూడేళ్లుగా హిందీలో బయోపిక్స్ హవా సాగుతోంది. ఈ ఏడాదైతే మినిమమ్ పది నిజజీవిత కథలు రీల్‌కి వచ్చే అవకాశం ఉంది. ఆ రియల్ స్టోరీస్ ఏంటంటే... ► ట్రిపుల్ ధమాకా కిలాడీ కుమార్... బాలీవుడ్లో అక్షయ్‌కుమార్‌ని అలానే అంటారు. ఎందుకంటే సినిమాల సెలెక్షన్ విషయంలో అక్షయ్ భలే కిలాడీ. అది నిజమే. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తుంటారు. సోషల్ మెసేజ్ ఉన్న ‘ప్యాడ్‌మేన్’ లాంటి సినిమా అంటే చాలు.. ‘సై’ అంటారు. అరుణాచలమ్ మురుగనాథమ్ అనే వ్యక్తి తక్కువ ధరకు లభ్యమయ్యే ‘శానిటరీ నేప్కిన్’లు తయారు చేసి, తన గ్రామంలో ఉన్న మహిళలకు అందజేసేవారు. ఆయన కథతో తీసిన సినిమానే ‘ప్యాడ్‌మేన్’. ఆర్. బాల్కీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా అక్షయ్ భార్య, మాజీ కథానాయిక ట్వింకిల్ ఖన్నా నిర్మాతగా మారారు. ఈ నెల 25న సినిమా విడుదల కానుంది. అక్షయ్లాంటి మాస్ హీరో ఈ సినిమా చేయడం గ్రేట్. ఈ ఒక్క బయోపిక్‌లోనే కాదు.. ఈ ఏడాది మరో రెండు నిజజీవిత కథల్లో కనిపించి, ట్రిపుల్ ధమాకా ఇవ్వనున్నారు. అవేంటంటే... ► గోల్డెన్ జూబ్లీ ఇయర్లో గోల్డ్ లాస్ట్ ఇయర్ అక్షయ్‌కుమార్ గోల్డెన్ జూబ్లి ఇయర్లోకి ఎంటరయ్యారు. అంటే.. ఆయన వయసు 50. గోల్డెన్ జూబ్లీ ఇయర్లో అక్షయ్ ‘గోల్డ్’ పేరుతో సినిమా చేయడం విశేషం. గతేడాదే షూటింగ్ పూర్తయింది. హాకీ ప్లేయర్ బల్బీర్ సింగ్ జీవితం ఆధారంగా లేడీ డైరెక్టర్ రీమా కగ్తి దర్శకత్వంలో ఈ సినిమాని ఫర్హాన్ అక్తర్ నిర్మించారు. స్వతంత్ర భారతదేశం తరఫున ఒలింపిక్స్‌లో తొలి బంగారు పతకం సాధించిన టీమ్‌లో బల్బీర్ సింగ్ ఒకరు. ఆయన కథతోనే ‘గోల్డ్’ తీశారు. ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ► గుల్షన్ జీవిత కథలో... ఢిలీల్లో పండ్ల దుకాణంలో పని చేసిన గుల్షన్ కుమార్ చౌకగా ఆడియో కేసెట్లు అమ్మే దుకాణం కొని, చిన్నగా మొదలై, సంగీత ప్రపంచంలో పెద్దగా ఎదిగారు. టీ–సిరీస్ మ్యూజిక్ లేబుల్ వ్యస్థాపకుడిగా, నిర్మాతగా ఎంతో పేరు సంపాదించారు. ఆయన జీవితం ఆధారంగా తీయబోతున్న ‘మొఘల్’ చిత్రంలో గుల్షన్ కుమార్ పాత్ర చేయబోతున్నారు అక్షయ్. 1997లో గుల్షన్ హత్యకు గురయ్యా రు. తొలినాళ్లల్లో ఆయన పడ్డ కష్టాల నుంచి మరణం వరకూ ‘మొఘల్’ కథ ఉంటుంది. అక్షయ్‌తో ‘జాలీ ఎల్ఎల్బి 2’ తెరకెక్కించిన సుభాష్ కపూర్ ఈ చిత్రానికి దర్శకుడు. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేసి, ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ► క్వీన్ కంగనా ‘తను వెడ్స్ మను’, ‘క్వీన్’ వంటి చిత్రాలతో బాలీవుడ్ క్వీన్ అనిపించుకున్నారు కంగనా. ఇప్పుడు క్వీన్‌గా ఆమె నటిస్తోన్న చిత్రం ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో వీర వనిత ఝాన్సీ రాణి లక్ష్మీబాయి పాత్రలో కంగనా కనిపించనున్నారు. ఈ సినిమా కోసం గుర్రపు స్వారీ, కత్తిసాము నేర్చుకున్నారు. చిత్రీకరణ సమయంలో చిన్ని చిన్ని గాయాలవుతున్నా కంగనా లెక్క చేయకుండా చేస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ► దత్‌గా కపూర్ హీరో సంజయ్ దత్ జీవితం కథతో రాజ్‌కుమార్ హిరానీ ఓ సినిమా తీస్తున్నారు. ఇందులో సంజయ్గా రణబీర్ కపూర్ చేస్తున్నారు. యంగ్ ఏజ్, ఓల్డ్ సంజయ్గా కనిపించడం కోసం రణ బీర్ బరువు తగ్గుతున్నారు, పెరుగుతున్నారు. సంజయ్ వృత్తి జీవితం, వ్యక్తిగత వివాదాలు వంటివి చూపిస్తారని టాక్. ఈ చిత్రానికి ‘సంజూ’ అనే టైటిల్ అనుకుంటున్నారట. సంజయ్ దత్‌ని ‘సంజూ బాబా’ అని పిలుస్తుంటుంది బాలీవుడ్. అందుకే ఈ టైటిల్‌ని పరిశీలిస్తున్నారట. జూన్ 29న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ► హృతిక్.. ఫస్ట్ బయోపిక్ ఇండియన్ ఇన్స్ట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడానికి కష్టపడే పేద విద్యార్థుల కోసం ఆనంద్‌కుమార్ ‘సూపర్ 30’ అనే కాన్సెప్ట్ తయారు చేశారు. ఎందరో స్టూడెంట్స్‌కి శిక్షణ ఇచ్చి, వారు గెలిచేలా చేశారు. ఎవరీ ఆనంద్‌కుమార్ అంటే.. బిహారీ గణిత శాస్త్రవేత్త. ఆయన బయోపిక్‌లో నటించనున్నారు హృతిక్. ఆయన నటిస్తోన్న తొలి బయోపిక్ ఇది. విశాల్ బాల్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా టైటిల్ ‘సూపర్ 30’. నవంబర్‌లో రిలీజ్ కానుంది. ► అతని గోల్ గెలుపే ఒక మ్యాచ్‌లో పెద్ద గాయం అయితే కోలుకుని మళ్లీ ఫిట్నెస్ను ప్రూవ్ చేసుకోవడం ఆషామాషీ కాదు. అలాంటి గాయమే అయ్యింది హాకీ ప్లేయర్ సందీప్ సింగ్‌కి. కానీ మ్యాచ్‌లో కాదు లైఫ్‌లో. అంటే.. యాక్సిడెంట్ అయ్యింది. సందీప్ సింగ్ తిరిగి హాకీ స్టిక్ పట్టడం అసాధ్యం అన్నారు కొందరు. కానీ, అతని గోల్ గెలుపువైపు. హాకీ స్టిక్ పట్టుకున్నారు.. గోల్ కొట్టారు. అసాధ్యం కాదు.. సుసాధ్యం అని ప్రూవ్ చేశారాయన. ఇప్పుడు ఈ రియల్ కథనంపై రీల్ లైఫ్ స్టోరీ రూపొందుతోంది. షాద్ అలీ దర్శకత్వంలో ‘సూర్మ’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో సందీప్ పాత్రలో నటిస్తున్నారు దిల్జీత్. ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ అవుతుంది. ► గురి ఎలా కుదిరింది ఒలింపిక్స్‌లో పతకం సాధించడం అంత ఈజీ కాదు. అందుకే మెడల్ సాధించినవాళ్లు ఆదర్శంగా నిలుస్తారు. అభినవ్ బింద్రా ఈ కోవకే వస్తారు. 2008 బిజీంగ్ ఒలింపిక్స్‌లో 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ విభాగంలో గోల్డ్ పతకం సాధించి, త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు అభినవ్. గోల్డ్ మెడల్‌పై అంత కచ్చితమైన గురి అతనికి ఎలా కుదిరిందన్న దానిపై ఇప్పుడు ఓ బయోపిక్‌ను హిందీలో రూపొందించనున్నారు. అభినవ్ బింద్రా పాత్రను హర్షవర్థన్ కపూర్ పోషించనున్నారు. ► సెట్స్‌కు సై! దేశం గర్వించదగ్గ క్రీడాకారుల్లో సైనా నెహ్వాల్ ఒకరు. ఆమె జీవితం సిల్వర్ స్క్రీన్కు రానుంది. సైనా పాత్రను శ్రద్ధాకపూర్ పోషించనున్నారు. అయితే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడం లేదన్న వార్తలు వచ్చాయి. ‘‘అది నిజం కాదు. త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ► ఆడ.. ఈడ..అదే జోరు! పది బయోపిక్స్ మాత్రమే కాదు.. మరికొన్ని సెట్స్‌కి వెళ్లే అవకాశం ఉంది. వాటిలో దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న సినిమా ఒకటి. ఇందులో విద్యాబాలన్ నటిస్తారని టాక్. రచయిత షాహిర్ బయోపిక్‌లో అభిషేక్ బచ్చన్ నటిస్తారట. ఆల్రెడీ కపిల్ దేవ్ పాత్రలో రణ్వీర్ సింగ్ నటిస్తున్నారు. మరి ఇంకెన్ని రియల్ స్టోరీస్ రీల్ పైకి వస్తాయో చూడాలి. ఆ సంగతలా ఉంచితే చెప్పిన తేదీ ప్రకారం పైన ఉన్న పది బయోపిక్‌లు రిలీజ్ అవుతాయా? ఈ మధ్యకాలంలో కొన్ని చిత్రాలు వాయిదా పడినట్లు పడతాయా? వేచి చూద్దాం. మరో సంగతేంటంటే.. ఆడ (హిందీ)లో మాత్రమే కాకుండా ఈడ (సౌత్) కూడా బయోపిక్స్ జోరు బాగానే ఉంది. ట్రెండ్‌తో, సీజన్‌తో సంబంధం లేదు. ఆదర్శంగా తీసుకోదగ్గ వ్యక్తుల కథలతో ఎప్పుడు సినిమా తీసినా ‘వర్కవుట్’ అవుతుంది. ఏమంటారు? ఇంకో విషయం కూడా... బయోపిక్స్‌లో క్రీడాకారుల లైఫ్ హిస్టరీలు ఎక్కువగా ‘పిక్’ చేస్తుండటం విశేషం. ► నో ఫైట్! సందీప్సింగ్కి, సంజయ్‌దత్‌కి నో ఫైట్. అయినా.. ఇదేంటి. హాకీ ప్లేయర్ సందీప్ సింగ్‌కి, నటుడు సంజయ్‌దత్‌కి ఫైట్ ఏంటి గురూ అంటే.. రియల్ లైఫ్‌లో కాదండి. రీల్ లైఫ్‌లో. అది కూడా వీరికి కాదు. వీరి బయోపిక్స్‌లో నటిస్తున్న హీరోలకి. ముందు సూర్మ (సందీప్ సింగ్ బయోపిక్)ను జూన్ 29న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ, మార్చి 30న రిలీజ్ కావాల్సిన ‘సంజు’ ( సంజయ్‌దత్ బయోపిక్కు పరిశీలనో ఉన్న టైటిల్) వాయిదా పడింది. ఈ చిత్రాన్ని కూడా జూన్ 29నే విడుదల చేయాలనుకుంటున్నారు. దాంతో రెండు బయోపిక్‌లకు క్లాష్ తప్పదని పరిశీలకులు అన్నారు. క్లాష్ ఉండకూడదనుకున్నారేమో ‘సూర్మా’ను ఆరు రోజులకు వాయిదా వేశారు. అంటే... జూలై 6న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. సో.. నో ఫైట్ అన్నమాట. -
ముచ్చటగా మూడు!
కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీల వరకూ సమ స్యలు లేనివాళ్లు ఉండరు. అయితే ఆ సమస్యను ఎవరు ఎలా తీసుకుంటున్నారు? అనేది ముఖ్యం. కొందరు లైట్ తీసుకుంటారు. కొంతమంది టెన్షన్ పడతారు. తమన్నా అయితే ఏం చేస్తారో తెలుసా... జస్ట్ మూడు సూత్రాలు పాటిస్తారు. ‘‘ప్రతి సమస్యను పరిష్కరింటానికి మూడు సూత్రాలు ఉంటాయి. మొదటిది ఆ సమస్యను అంగీకరించటం, రెండోది దాన్ని మార్చగలగటం, మూడోది వదిలిపెట్టేయడం. ‘ఒకవేళ నువ్వు ఆ సమస్యను అంగీకరించలేకపొతే మార్చేయ్, దాన్ని మార్చలేకపోతే వదిలేయ్’’ అన్నారు తమన్నా. చాలా బాగా చెప్పారు కదండీ. మనమూ ఇవే సూత్రాలను పాటించడానికి ట్రై చేద్దాం. ప్రస్తుతం హిందీ హిట్ మూవీ ‘క్వీన్’ తెలుగు రీమేక్ ‘క్వీన్ వన్స్ఎగైన్’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు తమన్నా. -
రాణీగారి కథలో శిబానీ...
... దండేకర్! పేరు కొత్తగా ఉంది కదూ! పేరుతో పాటు శిబానీ దండేకరూ తెలుగు ప్రేక్షకులకు కొత్తే. సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’, తాప్సీ ‘నామ్ షబానా’లతో పాటు కొన్ని హిందీ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారీమె. కొన్ని హిందీ టీవీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇప్పుడీ ముంబై బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు హాట్ హాట్ క్యారెక్టర్లో కనువిందు చేయనున్నారు. తమన్నా ముఖ్యతారగా నీలకంఠ దర్శకత్వంలో నిర్మాత మను కుమారన్ హిందీ హిట్ ‘క్వీన్’ని తెలుగులో అదే పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో కంగనా రనౌత్ చేసిన పాత్రను తెలుగులో తమన్నా చేస్తున్నారు. లీసా హెడెన్ చేసిన విజయలక్ష్మీ పాత్రను శిబానీ దండేకర్ చేయనున్నారు. యాక్చువల్లీ... లీసా పాత్రకు ముందు అమీ జాక్సన్‌ని అనుకున్నారు. అమీ ఆల్మోస్ట్ ‘యస్’ అన్నారు. అయితే... ఈలోపు అమెరికన్ టీవీ సిరీస్ ‘సూపర్ గాళ్’లో చాన్స్ వచ్చింది. మరోపక్క ‘క్వీన్’ షూటింగ్ లేట్ కావడంతో సిన్మా నుంచి తప్పుకున్నారు. ఇప్పుడా పాత్రకు శిబానీను సెలక్ట్ చేశారు. రాణీగారి (‘క్వీన్’) కథలో విజయలక్ష్మీ పాత్ర ఎక్కువే. తెలుగు–మలయాళ ‘క్వీన్’ రీమేక్స్‌లో శిబా, తమిళ–కన్నడ ‘క్వీన్’ రీమేక్స్‌లో హిందీ నటి ఎలీ ఎవరామ్ నటించనున్నారు. -
నలుగురు రాణులు.. నలభై రోజులు... ఒకటే కహానీ!
కథొక్కటే... కథానాయికలు మాత్రం వేర్వేరు! కంట్రీ ఒక్కటే... కెమెరాలు కదిలే ప్రదేశాలు మాత్రం వేర్వేరు! నిర్మాత ఒక్కరే... దర్శకులు మాత్రం వేర్వేరు! కానీ, అందరూ స్నేహితులే! చిత్రీకరణ పూరై్తన తర్వాత కలిసే చోటు ఒక్కటే! సిన్మా కథ కాదిది... అంతకు మించిన కహానీ! ‘ఒక్క కథ... ఇద్దరు దర్శకులు... నలుగురు రాణులు!’ కథేంటో మీరూ లుక్కేయండి! హిందీ హిట్ ‘క్వీన్’లో కంగనా రనౌత్ కుమ్మేశారు. ఇప్పుడీ సిన్మాను దక్షిణాది భాషల్లో మెడియంటే ఫిల్మ్స్ పతాకంపై ప్రముఖ మలయాళ దర్శకుడు కె.పి. కుమారన్ తనయుడు, నిర్మాత మనుకుమారన్ రీమేక్ చేస్తున్నారు. సారీ... రీమేక్ కాదు, రీమేక్స్! తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో! ఇందులో తెలుగు–మలయాళ వెర్షన్స్‌కు ‘షో, మిస్సమ్మ’ సిన్మాల ఫేమ్ నీలకంఠ, తమిళ–కన్నడ వెర్షన్స్‌కు నటుడు రమేశ్ అరవింద్ దర్శకులు. తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్, కన్నడలో పరుల్ యాదవ్, మలయాళంలో మంజిమా మోహన్ నాయికలుగా నటిస్తున్నారు. అంటే... కంగనా రనౌత్ పాత్రను ఈ నలుగురూ చేస్తున్నారు. తెలుగులో ‘క్వీన్’గా నటిస్తున్న తమన్నా తమిళ ప్రేక్షకులకు, తమిళ ‘క్వీన్’గా నటిస్తున్న కాజల్ తెలుగు ప్రేక్షకులకూ తెలుసు. నాగచైతన్య ‘సాహసం శ్వాసగా సాగిపో’ ఫేమ్ మంజిమాయే మలయాళ ‘క్వీన్’. తమిళ సినిమాలు కొన్నిటిలో ఆమె నటించారు. కన్నడ ‘క్వీన్’ పరుల్ యాదవ్ ‘కిల్లింగ్ వీరప్పన్’తో తెలుగు–తమిళ ప్రేక్షకులకు తెలుసు. మలయాళ సినిమాలూ చేశారామె. అందువల్ల, ఎవరెలా చేస్తారోననే ఆసక్తి అందరిలోనూ నెలకొంది! ఈ ఆసక్తిని పెంచుతూ... ప్యారిస్‌లో మన నలుగురు ‘క్వీన్స్’ ఈ రోజు కంగనా రనౌత్ షూస్‌లో అడుగులేశారు. నాలుగు సినిమాల షూటింగులు నేడు ప్యారిస్‌లో మొదలయ్యాయి. దాదాపు 40 రోజుల పాటు అక్కడే జరుగుతాయి. అయితే... లొకేషన్లు వేర్వేరులెండి! కానీ, షూటింగ్ తర్వాత అందరూ ఉండేది ఓ హోటల్లోనే. ‘ఓ ఒరలో రెండు కత్తులు ఇమడవు’ అని ఓ సామెత. ఇక్కడ రెండు కాదు... నాలుగు! అదేనండి.. కత్తిలాంటి కథానాయికలు నలుగురున్నారు. ఒకే సినిమాలో నటించకపోయినా ఒకే చోట, ఒకే లొకేషన్లో ఉంటారు కాబట్టి, నలుగురికీ గొడవలు వస్తాయేమో? అనే డౌట్ చాలామందికి ఉంది. నో... అటువంటి చాన్సే లేదంటున్నారు తమన్నా. యాక్చువల్లీ... చిత్రీకరణ ప్రారంభానికి ముందే తమన్నా, కాజల్, మంజిమ, పరుల్ కలసి ఓ వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నారు. అందులో సినిమా గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. ‘‘నలుగురు హీరోయిన్లు సేమ్ స్టోరీలో, సేమ్ క్యారెక్టర్లో, సేమ్ కంట్రీలో, సేమ్ టైమ్‌లో నటించడం అరుదైన విషయం కదా! నాకీ సంగతి చెప్పగానే... ఎగ్జయిటయ్యాను. ప్యారిస్‌లో మేం నలుగురమూ ఏమేం చేయాలనే అంశాలను వాట్సాప్ గ్రూప్‌లో డిస్కస్ చేసుకున్నాం’’ అని తమన్నా పేర్కొన్నారు. ఇక, కాజల్ అయితే... ‘‘తమన్నా, నేను ఆల్మోస్ట్ సేమ్ టైమ్‌లో కెరీర్ స్టార్ట్ చేశాం. నా బెస్ట్ ఫ్రెండ్స్‌లో తమన్నా ఒకరు. అయితే సేమ్ లొకేషన్లో షూట్ చేయడం ఫస్ట్ టైమ్. సరదాగా ఉంటుంది’’ అన్నారు. పరుల్ యాదవ్, మంజిమా మోహన్... ఇద్దరూ తమన్నా, కాజల్‌తో టైమ్ స్పెండ్ చేయడానికి, సరదా సంగతులు చెప్పుకోవడానికి ఎదురు చూస్తున్నామన్నారు. ఇదండీ... క్వీన్స్ కహానీ!! క్వీన్ కథ... వైవాహిక జీవితం గురించి ఎన్నో కలలు కంటుంది రాణీ మెహ్రా (కంగనా రనౌత్). విజయ్ (రాజ్‌కుమార్ రావ్) తో ఆమె పెళ్లి కుదురుతుంది. హనీమూన్‌కి టికెట్స్ కూడా బుక్ చేస్తారు. అయితే రేపు వివాహం అనగా.. ‘‘నేను ఫారిన్లో పెరిగాను. నా కల్చర్ వేరు. నువ్వు నాకు సరి కాదు’’ అంటాడు విజయ్. పెళ్లాగిపోతుంది. రాణీ కట్టుకున్న కలల మేడ కూలిపోతుంది. చివరికి వేరొకరి కారణంగా తను బాధపడకూడదని నిర్ణయించుకుంటుంది. హనీమూన్ కోసం బుక్ చేసిన టిక్కెట్లతో ఒంటరిగా ప్యారిస్ వెళుతుంది. కొత్త దేశం.. కొత్త మనుషులు కావడంతో కంగారు పడుతుంది. కష్టాల్లో ఉన్న రాణీని వరలక్ష్మీ (లీసా హెడన్) ఆదుకుంటుంది. మెల్లగా రాణీ ఫారిన్ కల్చర్‌కి అలవాటు పడుతుంది. అక్కడ పరిస్థితులపై అవగాహన పెంచుకుంటుంది. ఆమె జీవితంలోకి వచ్చిన కొత్త స్నేహితులు ఆమె ఎదుగుదలకు మరింత సహాయం చేస్తారు. రాణీ తనలో ఉన్న టాలెంట్‌కి మెరుగులు దిద్దుకుంటుంది. ఓ సందర్భంలో రాణీ ఫొటోను విజయ్ చూస్తాడు. ఆమెపై ఇష్టం పెంచుకుంటాడు. ప్యాకప్ అనుకున్న మన రిలేషన్‌షిప్‌ను ప్యాచప్ చేసి, కంటిన్యూ చేద్దాం అంటాడు. ఆ తర్వాత కథేంటి? అనేది వికాస్ బాల్ దర్శకత్వం వహించిన ‘క్వీన్’ చూసినవారికి తెలిసే ఉంటుంది. -
అవకాశాలు పెంచుకునే దిశగా..
తమిళసినిమా: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న పాలసీని పాటించే హీరోయిన్లలో నటి తమన్నా భాటియా ముందుంటారు. తమిళం, తెలుగు, హిందీ అంటూ పలు భాషల్లో నటిస్తున్న తమన్నా ఇంచుమించు స్టార్ హీరోలందరితోనూ నటించింది. దీంతో పారితోషికాన్ని అందుకు తగ్గట్టుగానే పెంచుకుంటూ పోయిందంటారు. మధ్యలో అవకాశాలు కొరవడ్డా బాహుబలితో మరోసారి విజృంభించింది. అయితే ఆ క్రేజ్‌ను వాడుకోవడానికి పారితోషికాన్ని రూ.కోటి వరకూ పెంచేసిందట. దీంతో అవకాశాలు మళ్లీ తగ్గాయనే టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఆ మధ్య హిందీ చిత్రం క్వీన్ దక్షిణాది భాషలో రీమేక్‌లో నటించడానికి తమన్నాను సంప్రదించగా దర్శక నిర్మాతలు కళ్లు తిరిగి కిందపడేంత పారితోషికం డిమాండ్ చేసిందనే ప్రచారం జోరుగా సాగింది. తమన్నాకు అవకాశాలు తగ్గడానికి ఇదీ ఒకకారణం కాగా ఇటీవల ఈమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడడం మరో కారణం అన్నది చిత్ర వర్గాల టాక్. పరిస్థితులు చేజారిపోతున్నాయని గ్రహించిన ఈ బ్యూటీ ఒక మెట్టు దిగొచ్చి తన పారితోషికాన్ని తగ్గించుకోవడంతో మళ్లీ అవకాశాలు తలుపుతడుతున్నాయని సమాచారం. ఇంతకు ముందు చిత్రానికి రూ.కోటి, సింగిల్ సాంగ్‌కే రూ.60 లక్షలు పుచ్చుకున్న తమన్నా తాజాగా పారితోషికం విషయంలో పట్టువిడుపుల విధానాన్ని పాటిస్తున్నట్లు సినీవర్గాల్లో చక్కర్లు కొడుతున్న టాక్. ఏదేమైన ఈ మిల్కీ బ్యూటీ చేతిలో ప్రస్తుతం తమిళం, తెలుగు, హిందీ చిత్రాల్లో రెండేసి చిత్రాలు ఉన్నాయి. విక్రమ్‌తో రొమాన్స్ చేస్తున్న స్కెచ్ చిత్రం మినహా ఏ ఒక్క చిత్రం లోనూ స్టార్ హీరో లేరన్నది గమనార్హం. మరో విషయం ఏంటంటే ముందుగా క్వీన్ హిందీ చిత్రం రీమేక్‌లో నటించడానికి భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసిన తమన్నా ఇప్పుడు అదే చిత్ర తెలుగు రీమేక్‌లో నటిస్తోంది. -
టాలీవుడ్ 'క్వీన్' తమన్నా
-
టాలీవుడ్ 'క్వీన్'..!
-
కాజల్ క్వీన్ అయిన వేళ
తమిళసినిమా: నటి కాజల్‌అగర్వాల్ వెండితెర క్వీన్ అయ్యిందీవేళ.కాజల్ హిందీ చిత్రం క్వీన్ రీమేక్‌లో నటించనున్నారన్న ప్రచారం జరగుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఆదివారం ఉదయం చెన్నైలో లాంఛనంగా ప్రారంభమైంది. హిందీలో కంగనారనౌత్ నటించిన క్వీన్ ఆమెకు జాతీయ అవార్డును అందించింది. తాజాగా ఈ చిత్రం దక్షిణాది భాషల్లో రీమేక్ కానుంది. ఈ చిత్రానికి తమిళంలో ప్యారిస్ ప్యారిస్ టైటిల్‌ను నిర్ణయించారు. మీడియంటీ పతాకంపై మనుకుమార్, లైంగర్ మనోజ్కేశవ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కన్నడ నటుడు రమేశ్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకు ముందు కమలహాసన్ హీరోగా ఉత్తమవిలన్ చిత్రాన్ని తెరకెక్కించింది ఈయనేనన్నది గమనార్హం. ప్రముఖ రచయిత్రి తమిళచ్చి తంగపాండియన్ ఈ చిత్రానికి మాటలు, పాటలు రాయడం మరో విశేషం. శశి అనే నవ నటుడు కథానాయకుడిగా నటించనున్నారు. చిత్ర షూటింగ్ అక్టోబర్ 4వ తేదీ నుంచి మొదలు కానుందని నిర్మాతలు వెల్లడించారు. క్వీన్ చిత్రాన్ని తాను చూశానని, అందులో కంగనారనౌత్ చాలా బాగా నటించారని కాజల్ అన్నారు. అలాంటి మంచి పాత్రల్లో నటించే అవకాశం తనకు రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. హిందీలో సంగీత బాణీలు అందించిన అమిత్ త్రివేదినే ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కన్నడ వెర్షన్‌కు రమేశ్ అరవింద్‌నే దర్శకత్వం వహిస్తున్నారు. అందులో హీరోయిన్గా పార్వతి నటిస్తున్నారు. ఇక తెలుగులో నటించే హీరోయిన్ ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం గురించి త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు. -
హమ్మయ్య.. సౌత్ 'క్వీన్' పట్టాలెక్కింది..!
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ క్వీన్ సినిమాను సౌత్‌లో రీమేక్ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముందుగా ఈ సినిమా తమన్నా లీడ్ రోల్ లో తెరకెక్కుతుందన్న టాక్ వినిపించింది. అయితే తమన్నా భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయటంతో క్వీన్ తమిళ రీమేక్ ను పక్కన పెట్టేశారు. అయితే ఇప్పటికే పరుల్ యాదవ్ లీడ్ రోల్ లో కన్నడలో ఈ సినిమా రీమేక్ పనులు జరుగుతుండగా తాజాగా తమిళ క్వీన్ కూడా పట్టాలెక్కేసింది. తమన్నా తరువాత తెరమీదకు వచ్చిన కాజల్ క్వీన్ గా నటించేందుకు అంగీకరించింది. నటుడు, దర్శకుడు రమేష్ అరవింద్ ఈ రీమేక్ కు దర్శకత్వం వహిస్తున్నాడు. 'పారిస్ పారిస్' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా లాంచింగ్ సందర్భంగా ఈ సందర్భంగా తాను ఎవరినీ అనుకరించనని.. తన స్టైల్ లోనూ క్వీన్ పాత్రలో నటిస్తానని తెలిపింది కాజల్. అంతేకాదు ఒరిజినల్ వర్షన్ నుంచి కేవలం కథను మాత్రమే తీసుకొని కొత్త తరహా టేకింగ్ తో సినిమాను రూపొందిస్తున్నారట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఆదివారం ఉదయం ప్రారంభించారు. -
తెలుగు రాణీ తమన్నాయే
ప్రతి మెతుకుపై తినేవాళ్ల పేరు రాసుంటుందని ఓ సామెత. ఏయే పాత్రల్లో ఎవరెవరు నటించాలనేది కూడా దేవుడు రాసుంటాడనుకోవాలేమో! ఎందుకంటే... హిందీ హిట్ ‘క్వీన్’ తమిళ రీమేక్‌లో మెయిన్ లీడ్‌గా ముందు తమన్నా పేరే వినిపించింది. కొన్నాళ్లకు తెలుగులోనూ ఆమె నటిస్తారన్నారు. ఏమైందో ఏమో... తమిళ రీమేక్‌లో ‘క్వీన్’గా కాజల్ అగర్వాల్ ఎంపికయ్యారు. కానీ, తెలుగులో రాణీగా తమన్నానే కన్ఫర్మ్ చేశారు దర్శక–నిర్మాతలు. తెలుగు వెర్షన్‌కి ఉత్తమ దర్శకుడిగా జాతీయ పురస్కార గ్రహీత, ‘షో, మిస్సమ్మ’ సినిమాల ఫేమ్ నీలకంఠ దర్శకత్వం వహించనున్నారు. ముంబై వ్యాపారవేత్త మను కుమారన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘క్వీన్’ సౌత్ రీమేక్స్ అన్నిటికీ ఆయనే నిర్మాత. ‘‘ప్రస్తుతం తెలుగు వెర్షన్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. తమన్నా మెయిన్ లీడ్‌గా నీలకంఠ దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందిస్తాం. త్వరలో చిత్రీకరణ మొదలవుతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న సినిమాను విడుదల చేయాలనేది మా ప్లాన్’’ అని మను కుమారన్ తెలిపారు. బ్రిటన్ బ్యూటీ అమీ జాక్సన్ ఇందులో సెకండ్ లీడ్‌గా నటించనున్నారు. -
క్వీన్‌గా కాజల్
తమిళసినిమా: నటి కాజల్ అగర్వాల్ టైమ్ ఇప్పుడు వెలిగిపోతోందనవచ్చు. ఆ మధ్య తెలుగులో చిరంజీవితో ఖైధీనంబర్ 150 చిత్రంలో రొమాన్స్ చేసి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తరువాత రానాతో నటించిన నేనేరాజు నేనేమంత్రి చిత్రం కూడా మంచి సక్సెస్‌నే అందుకుంది. తాజాగా కోలీవుడ్‌లో అజిత్‌తో తొలిసారిగా జత కట్టిన వివేకం చిత్రం విడుదలై మిశ్రమ స్పందనను పొందుతున్నా, వసూళ్ల పరంగా కుమ్మేస్తోంది. ఇక ఇందులో కాజల్‌అగర్వాల్ పాత్రకు, ఆమె నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి. వివేకం చిత్రంలో కాజల్‌ది చాలా కీలకపాత్రగా నిలిచింది. ఈ చిత్రానికి అందుతున్న ప్రశంసలలో మునిగి తేలుతున్న కాజల్‌అగర్వాల్ ఇకపై ఇలాంటి బలమైన పాత్రల్లోనే నటించాలని నిర్ణయించుకున్నట్లు అంటున్నారు. తదుపరి విజయ్‌తో నటిస్తున్న మెర్శల్ చిత్రం దీపావళికి సందడి చేయడానికి రెడీ అవుతోంది. ఇప్పుడు తాజా సమాచారం ఏమిటంటే హిందీ సంచలన చిత్రం క్వీన్ రీమేక్ గురించి చాలానే ప్రచారం జరిగింది. ఈ చిత్ర దక్షిణాది రీమేక్‌లో కంగణారావత్ పాత్రల్లో నటించే నటి ఎవరన్న విషయం గురించి సమంత నుంచి మిల్కీబ్యూటీ తమన్నా వరకూ చాలా మంది నటీమణులు పేరు ప్రచారం జరిగింది. కాగా చివరికి తమిళ, తెలుగు భాషల్లో క్వీన్‌గా నటి కాజల్‌అగర్వాల్ నటించనున్నట్లు తాజా సమాచారం. కాలం కలిసి రావడం అంటే ఇదేనేమో. ఒకప్పుడు కోలీవుడ్‌లో సక్సెస్ కోసం పాకులాడిన కాజల్‌అగర్వాల్ ఇప్పుడు స్టార్ హీరోయిన్గా రాణిస్తున్నారు. -
క్వీన్ అవడానికి నేను రెడీ!
క్వీన్‌గా మారడానికి ఏ భాషలోనైనా తాను రెడీ అంటోంది నటి కాజల్‌అగర్వాల్. 2014లో హిందీలో సంచలన విజయం సాధించిన చిత్రం క్వీన్. ఈ చిత్ర దక్షిణాది రీమేక్ హక్కులు సీనియర్ నటుడు, నిర్మాత త్యాగరాజన్ పొందారన్న విషయం తెలిసిందే. కాగా హిందీలో కంగనారనౌత్ నాయకిగా నటించిన పాత్రలో నటించడానికి ఇక్కడ చాలామంది అగ్రనాయికలు ఆసక్తి చూపారు. అలాగే పలు పేర్లు ప్రచారంలో ఉన్నాయి కూడా. వారిలో మిల్కీబ్యూటీ తమన్నా పేరు ఖరారైనట్లు వార్తలు వెలువడ్డయి. కాగా ఈ చిత్ర కన్నడ రీమేక్ చిత్రీకరణ ఇటీవల ప్రారంభమైనట్లు ప్రచారం జరిగింది.అదే విధంగా చిత్ర రీమేక్ హక్కుల విషయంలో వివాదం తెరపైకి వచ్చింది. ఇలాంటి పరిస్థితిలో తాజాగా క్వీన్ అయ్యే అవకాశం కాజల్ అగర్వాల్ తలుపు తట్టిందట. ఈ విషయాన్ని ఇటీవల ఆ అమ్మడే ఒక భేటీలో తెలిపింది. ఆ కథేంటో చూద్దాం. హిందీ చిత్రం క్వీన్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ చిత్ర రీమేక్‌లో నాయకి పాత్రను పోషించాలని కోరుకుంటున్నాను. లక్కీగా ఆ చిత్ర నిర్మాతలు ఆ పాత్రలో నటించమని నన్ను అడిగారు. నేనూ అందుకు సమ్మతించాను. అయితే ఇంకా ఒప్పందం కాలేదు. చర్చల్లోనే ఉంది. అయితే క్వీన్ రీమేక్‌లో నటించడానికి చాలా మంది హీరోయిన్లు సిద్ధంగా ఉండగా ఆ పాత్ర నన్ను వెతుక్కుంటూ రావడం సంతోషంగా ఉంది. ఈ చిత్ర రీమేక్‌లో నేను ఏ భాషలో నటించడానికైనా రెడీ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ బ్యూటీ అజిత్‌తో రొమాన్స్ చేస్తున్న వివేగం, విజయ్‌తో డ్యూయెట్లు పాడుతున్న మెర్సల్ చిత్రాలు దాదాపు పూర్తి కావొచ్చాయి. తెలుగులో రానాతో స్టెప్స్ వేస్తున్న నేనేరాజా నేనేమంత్రి చిత్ర షూటింగ్ చివరి ద«శకు చేరుకుంది. సో కాజల్ కిప్పుడు అర్జెంట్‌గా ఒక కొత్త చిత్రం కావాలి. అందుకే క్వీన్ కోసం ఈ ఫీట్లు అని అనుకోవచ్చు. -
క్వీన్ అవడానికి నేను రెడీ!
క్వీన్‌గా మారడానికి ఏ భాషలోనైనా తాను రెడీ అంటోంది నటి కాజల్‌అగర్వాల్. 2014లో హిందీలో సంచలన విజయం సాధించిన చిత్రం క్వీన్. ఈ చిత్ర దక్షిణాది రీమేక్ హక్కులు సీనియర్ నటుడు, నిర్మాత త్యాగరాజన్ పొందారన్న విషయం తెలిసిందే. కాగా హిందీలో కంగనారనౌత్ నాయకిగా నటించిన పాత్రలో నటించడానికి ఇక్కడ చాలామంది అగ్రనాయికలు ఆసక్తి చూపారు. అలాగే పలు పేర్లు ప్రచారంలో ఉన్నాయి కూడా. వారిలో మిల్కీబ్యూటీ తమన్నా పేరు ఖరారైనట్లు వార్తలు వెలువడ్డయి. కాగా ఈ చిత్ర కన్నడ రీమేక్ చిత్రీకరణ ఇటీవల ప్రారంభమైనట్లు ప్రచారం జరిగింది. అదే విధంగా చిత్ర రీమేక్ హక్కుల విషయంలో వివాదం తెరపైకి వచ్చింది. ఇలాంటి పరిస్థితిలో తాజాగా క్వీన్ అయ్యే అవకాశం కాజల్ అగర్వాల్ తలుపు తట్టిందట. ఈ విషయాన్ని ఇటీవల ఆ అమ్మడే ఒక భేటీలో తెలిపింది. ఆ కథేంటో చూద్దాం. హిందీ చిత్రం క్వీన్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ చిత్ర రీమేక్‌లో నాయకి పాత్రను పోషించాలని కోరుకుంటున్నాను. లక్కీగా ఆ చిత్ర నిర్మాతలు ఆ పాత్రలో నటించమని నన్ను అడిగారు. నేనూ అందుకు సమ్మతించాను. అయితే ఇంకా ఒప్పందం కాలేదు. చర్చల్లోనే ఉంది. అయితే క్వీన్ రీమేక్‌లో నటించడానికి చాలా మంది హీరోయిన్లు సిద్ధంగా ఉండగా ఆ పాత్ర నన్ను వెతుక్కుంటూ రావడం సంతోషంగా ఉంది. ఈ చిత్ర రీమేక్‌లో నేను ఏ భాషలో నటించడానికైనా రెడీ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ బ్యూటీ అజిత్‌తో రొమాన్స్ చేస్తున్న వివేగం, విజయ్‌తో డ్యూయెట్లు పాడుతున్న మెర్సల్ చిత్రాలు దాదాపు పూర్తి కావొచ్చాయి. తెలుగులో రానాతో స్టెప్స్ వేస్తున్న నేనేరాజా నేనేమంత్రి చిత్ర షూటింగ్ చివరి ద«శకు చేరుకుంది. సో కాజల్ కిప్పుడు అర్జెంట్‌గా ఒక కొత్త చిత్రం కావాలి. అందుకే క్వీన్ కోసం ఈ ఫీట్లు అని అనుకోవచ్చు. -
‘క్వీన్’ అవ్వడానికి నేను రెడీ: నటి
చెన్నై: క్వీన్‌గా మారడానికి ఏ భాషలోనైనా తాను రెడీ అంటోంది నటి కాజల్ అగర్వాల్. 2014లో హిందీలో సంచల విజయం సాధించిన చిత్రం క్వీన్. ఈ చిత్ర దక్షిణాది రీమేక్ హక్కులు సీనియర్ నటుడు, నిర్మాత త్యాగరాజన్ పొందారన్న విజయం తెలిసిందే. అయితే హిందీలో కంగనారావత్ నాయకిగా నటించిన పాత్రలో చాలా మంది అగ్రనాయికలు ఆసక్తి చూపారు. చాలా మంది పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వారిలో మిల్కీబ్యూటీ తమన్న పేరు ఖరారైనట్లు వార్తలు వెలవడ్డాయి. ఈ చిత్ర కన్నడ రీమేక్ చిత్రీకరణ ఇటీవల ప్రారంభం అయినట్లు ప్రచారం జరిగింది. అదే విధంగా చిత్ర రీమేక్ హక్కుల విషయంలో వివాదం తెరపైకి వచ్చింది. ఇలాంటి పరిస్థితిలో తాజాగా క్వీన్ అయ్యే అవకాశం నటి కాజల్ అగర్వాల్ తులుపు తట్టిందట. ఈ విషయాన్ని ఇటీవల ఆ అమ్మడే ఒక భేటీలో తెలిపింది. ఆ కథేంటో చూద్దాం. ‘ హిందీ చిత్రం క్వీన్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ చిత్ర రీమేక్‌లో నాయకి పాత్రను పోషించాలని ఉంది. లక్కీగా ఆ చిత్ర నిర్మాతలు ఆ పాత్రలో నటించమని నన్ను అడిగారు. నేను అందుకు సరే అన్నాను. అయితే ఇంకా ఒప్పందం కాలేదు. దానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. క్వీన్ రీమేక్‌లో నటించడానికి చాలా మంది హీరోయిన్లు సిద్ధంగా ఉన్నారు కానీ ఆ పాత్ర నన్ను వెతుక్కుంటూ రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్ర రీమేక్‌లో నేను ఏ భాషలో నటించడానికైనా రెడీ’ అని కాజల్ పేర్కొంది. ప్రస్తుతం ఈ బ్యూటీ అజిత్‌తో రొమాన్స్ చేస్తున్న వివేగం, విజయ్‌తో డ్యూయెట్లు పాడుతున్న మెర్సల్ చిత్రాలు దాదాపు పూర్తి కావచ్చాయి. తెలుగులో రానాతో స్టెప్స్ వేస్తున నేనేరాజు నేనే మంత్రి చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాజల్ కి ప్రస్తుతం ఒక కొత్త చిత్రం కావాలి. అందుకే క్వీన్ కోసం ఈ ఫీట్లు అని అనుకోవచ్చా! -
అసలు సంగతి దాచేసి...
కథేంటి? అందులో ఆమె పాత్ర ఏంటి? హీరో ఎవరు? వంటి విషయాలేవీ కాజల్ అగర్వాల్ చెప్పడం లేదు. అసలు సంగతులన్నీ దాచేసి ‘ఓ బడా బాలీవుడ్ సినిమాకి నేను సంతకం చేశానోచ్’ అని చెబుతున్నారామె. ఎవరి పక్కన ఏ సినిమాలో ఛాన్సొచ్చింది? అని కాజల్‌ను ప్రశ్నిస్తే... ‘‘సరైన సమయం, సందర్భంలో మీ ప్రశ్నలకు సమాధానం చెబుతా’’ అంటున్నారు. ‘‘నేను నటించబోయే కొత్త హిందీ సినిమా ఆగస్టులో ప్రారంభం అవుతుంది. చాలా పెద్ద సినిమా. అందులో ఓ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ చేయబోతున్నా’’ అన్నారు కాజల్. ఈ హిందీ సినిమాతో పాటు ‘క్వీన్’ తమిళ రీమేక్‌లోనూ కాజల్ నటించడం దాదాపు ఖాయమే. ఆ సినిమా చిత్రీకరణ సైతం ఆగస్టులోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం తెలుగులో రెండు, తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నారీ చందమామ. -
నలుగురు రాణులు.. ఒక్క అమీ
తెలుగులో రాణీగారి కోసం ఇంకా అన్వేషణ కొనసాగుతూనే ఉంది! అందానికి తోడు కాస్త అమాయకత్వం ఉన్న అమ్మాయి అయితే రాణీగారి రోల్‌కి ఫర్ఫెక్ట్. కత్తియుద్ధం, గుర్రపు స్వారీ వంటివి అస్సలు అవసరం లేదు. ఎందుకంటే... ఇదేమీ రాజులు, రాజ్యాల సినిమా కాదు. హిందీ హిట్ ‘క్వీన్’ రీమేక్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను రీమేక్ చేయాలని ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నారు. రీసెంట్గా పరుల్ యాదవ్ ప్రధాన పాత్రలో కన్నడ ‘క్వీన్’ రీమేక్ షూటింగ్ మొదలైంది. ఈపాటికే తమిళ, తెలుగు రీమేక్స్ షూటింగ్ కూడా మొదలయ్యేది. కానీ, ముందు ఈ రీమేక్‌లో నటించడానికి ఓకే చెప్పిన తమన్నా తర్వాత తప్పుకోవడంతో కొత్త కథానాయికను వెతికే పనిలో పడింది చిత్రబృందం. కాజల్ అగర్వాల్ తమిళ ‘క్వీన్’ రీమేక్‌లో నటించే చాన్సుందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే... ఆమె ఇంకా సినిమాకు సంతకం చేయలేదని నిర్మాణ సంస్థ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం నిర్మాతలతో చర్చలు జరుగుతున్నాయట. ఒకవేళ కాజల్ ఓకే చెప్పినా... తెలుగు కోసం మరో కథానాయికను వెతకాలి. ఎందుకంటే... నాలుగు భాషల్లో నలుగురు వేర్వేరు కథానాయికలతో వేర్వేరు దర్శకులతో ‘క్వీన్’ రీమేక్‌ను తీయాలనుకుంటున్నారు నిర్మాతలు. అమీ జాక్సన్ మాత్రం నాలుగు భాషల్లో సెకండ్ హీరోయిన్గా హాట్ హాట్ క్యారెక్టర్లో నటించనున్నారు. -
చిక్కుల్లో క్వీన్
ప్రారంభానికి ముందే క్వీన్ చిత్రం చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్లో సంచలన విజయం సాధించిన చిత్రం క్వీన్. కంగనారావత్ నటించిన ఈ చిత్రం ఆమె స్థాయి పెంచడంతో పాటు అవార్డులను తెచ్చిపెట్టింది. అలాంటి చిత్రాన్ని దక్షిణాధి భాషల్లో నిర్మించే హక్కులను సీనియర్ దర్శక నటుడు త్యాగరాజన్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో క్వీన్ పాత్రలో నటించే నటి ఎవరన్న విషయం ఆసక్తిగా మారింది.చివరకు మిల్కీబ్యూటీ తమన్నాను క్వీన్‌ను చేయాలని నిర్మాత వర్గం భావించింది. అయితే ఈ అమ్మడు అధిక పారితోషికం డిమాండ్ చేయడంతో వేరే హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతున్నట్లు సమాచారం. మరో పక్క కాజల్‌అగర్వాల్‌ను క్వీన్‌గా ఎంపిక చేసినట్లు సోషల్‌మీడియాల్లో ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్ర తమిళం, కన్నడం భాషల్లో నటుడు రమేశ్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్నారనే ప్రకటన వెలువడింది. అంతే కాదు ఈ చిత్రానికి వానిల్ తేడి నిండ్రేన్ అనే టైటిల్ నిర్ణయించి హీరోయిన్ ఎంపిక జరగకుండానే చిత్రీకరణ ప్రారంభించారు. నాజర్ పాల్గొన్న కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. కాగా గోల్డెన్ క్లబ్ ఫిలింస్ అనే లండన్‌కు చెందిన ప్రొడక్షన్ సంస్థ యూనిట్‌కు షాక్ ఇచ్చే ప్రకటన విడుదల చేసింది. క్వీన్ చిత్ర దక్షిణాది హక్కులు తమకు చెందినవని, తాను స్టార్ మూవీస్ సంస్థ అధినేత త్యాగరాజన్‌ను భాగస్వామిగా చేర్చుకున్నామని పేర్కొన్నారు. ఈ చిత్రంలో నటించే తారల ఎంపిక జరుగుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో క్వీన్ చిత్రం తమిళం, కన్నడం భాషల్లో చిత్రీకరణ జరుపుకుంటోందన్న విషయం తెలిసి తాము షాక్‌కు గురయ్యామని పేర్కొన్నారు.క్వీన్ చిత్ర దక్షిణాది రీమేక్ హక్కులను తాము బ్రిటీష్ ఫిలిం ఇన్స్టిట్యూట్(బీఎఫ్ఐ)లో రిజిస్టర్ చేసినట్లు తెలిపారు. ఇందులో నటీనటులను తాము ఎంపిక చేసే పనిలోనే ఉన్నామని, అలాంటిది తమను సంప్రదించకుండా చిత్రీకరణ జరపడం తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఈ వ్యవహారం గురించి తదుపరి ప్రకటనను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. దీంతో క్వీన్ చిత్రం చిక్కుల్లో పడినట్లైంది. -
క్వీన్ రీమేక్‌లో కాజల్..?
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ క్వీన్ సినిమాను సౌత్‌లో రీమేక్ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమిళ నటుడు దర్శకుడు త్యాగరాజన్ క్వీన్ రీమేక్ రైట్స్‌ను సొంతం చేసుకోగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే ముందుగా తెలుగు, తమిళ భాషల్లో సినిమాను స్టార్ చేయాలని భావించిన త్యాగరాజన్, రేవతి దర్శకత్వంలో తమన్నా లీడ్ రోల్లో క్వీన్‌ను రీమేక్‌కు ప్లాన్ చేశాడు. అయితే తమన్నా భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయటంలో ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశారన్న ప్రచారం జరిగింది. కానీ త్యాగరాజన్ మాత్రం క్వీన్ రీమేక్‌ను ఎలాగైన ముందుకు తీసుకెళ్లే ప్లాన్ లో ఉన్నాడు. అందుకే ముందుగా కన్నడ లో రమేష్ అరవింద్ దర్వకత్వంలో పరుల్ యాదవ్ లీడ్ రోల్ లో సినిమాను స్టార్ట్ చేశాడు. తరువాత తమన్నా ప్లేస్‌లో మరో హీరోయిన్ కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. తాజాగా సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ రీమేక్‌లో నటించేందుకు అంగీకరించింది. రేవతి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం కాజల్‌తో చర్చలు జరుపుతున్నారట. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కనున్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. -
'క్వీన్' రీమేక్ ఆగిపోలేదట..!
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ క్వీన్ సినిమాను సౌత్‌లో రీమేక్ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమిళ నటుడు దర్శకుడు త్యాగరాజన్ క్వీన్ రీమేక్ రైట్స్‌ను సొంతం చేసుకోగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే ముందుగా తెలుగు, తమిళ భాషల్లో సినిమాను స్టార్ చేయానలి భావించిన త్యాగరాజన్, రేవతి దర్శకత్వంలో తమన్నా లీడ్ రోల్లో క్వీన్‌ను రీమేక్ చేయడానికి ప్లాన్ చేశాడు. అయితే తమన్నా భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయటంలో ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశారన్న ప్రచారం జరిగింది. కానీ త్యాగరాజన్ మాత్రం తమన్నా తప్పించి క్వీన్ రీమేక్ ను ముందుకు తీసుకెళ్లే ప్లాన్ లో ఉన్నాడు. అందుకే ముందుగా కన్నడ రీమేక్ ను ప్రారంభిస్తున్నాడు. పరుల్ యాదవ్ లీడ్ రోల్ లో రమేష్ అరవింద్ దర్శకత్వంలో సినిమా ప్రారంభిస్తున్నాడు. తరువాత తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో ఒకేసారి సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. -
తమన్నా వల్లే ఆగిపోయింది..!
బాలీవుడ్లో ఘనవిజయం సాధించిన క్వీన్ సినిమాను సౌత్‌లో రీమేక్ చేసేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కోలీవుడ్ నటుడు నిర్మాత త్యాగరాజన్, క్వీన్ రీమేక్ హక్కులు సొంతం చేసుకోగా.. ప్రధాన పాత్రల్లో కనిపించబోయే నటీనటుల కోసం చాలా కాలం కసరత్తులు చేశాడు. ఫైనల్‌గా తమన్నా హీరోయిన్గా సీనియర్ నటి రేవతి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించాడు. అయితే సడన్‌గా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందన్న ప్రకటన వచ్చింది. క్వీన్ రీమేక్ ఆగిపోవడానికి కారణాలు ఇవే అంటూ రకరకాల వార్తలు వినిపించాయి. ఈ రూమర్స్ అన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతూ నిర్మాత త్యాగరాజన్ అసలు కారణాన్ని బయటపెట్టాడు. తమన్నా భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం కారణంగానే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని తెలిపాడు. ప్రస్తుతానికి క్వీన్ రీమేక్‌ను పక్కకు పెట్టినా.. సరైన నటి దొరికితే తిరిగి ప్రారంభిస్తానని తెలిపాడు. -
తమిళ 'క్వీన్' ఆగిపోయిందా..!
బాహుబలి సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన తమన్నా, లేడీ ఓరియంటెడ్ సినిమాలతో సత్తా చాటాలని భావిస్తోంది. ఇప్పటికే అభినేత్రి సినిమాతో ట్రై చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. అయితే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని భావించిన క్వీన్ రీమేక్ లో నటించే అవకాశం రావటంతో తెగ సంబరపడిపోయింది. మోస్ట్ టాలెంటెడ్ రేవతి దర్శకత్వంలో సుహాసిన మణిరత్నం రైటర్ గా క్వీన్ సినిమాను రీమేక్ చేయాలని భావించారు. అయితే తాజాగా క్వీన్ రీమేక్ ఆగిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. కారణలేంటో సరిగా తెలియకపోయినా.. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లే ఆలోచన లేదని యూనిట్ సభ్యులు చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. క్వీన్ రీమేక్ తో నటిగానూ ప్రూవ్ చేసుకోవాలని భావించిన తమన్నాకు ఆ కోరిక తీరేలా కనిపించటం లేదు. -
తమన్నాకే ఆ ఛాన్స్ దక్కింది..
బాలీవుడ్ బ్యూటి కంగనా రనౌత్‌కు స్టార్ స్టేటస్ అందించిన సినిమా క్వీన్. ఈ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి సౌత్ ఇండస్ట్రీలో ఈ సినిమా రీమేక్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే క్వీన్ పాత్రకు సరైన నటిని ఎంపిక చేసే విషయంలో దర్శక నిర్మాతలు ఎటూ తేల్చుకోలేకపోయారు. ఫైనల్‌గా క్వీన్ రీమేక్‌కు తమన్నాను ఫైనల్ చేశారు కోలీవుడ్ నిర్మాతలు. అలనాటి స్టార్ హీరోయిన్ రేవతి దర్శకత్వంలో క్వీన్ సినిమాను తమిళ్లో రీమేక్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం క్వీన్ తెలుగు రీమేక్‌లోనూ తమన్నానే హీరోయిన్గా నటించనుందట. ఉత్తమ విలన్ ఫేం రమేష్ అరవింద్ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి క్వీన్ సినిమాను రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత త్యాగరాజన్ అన్ని భాషల్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
ఆ సినిమాలో నటించేందుకు సిద్ధపడ్డా: నటి
జాతీయ అవార్డు గ్రహిత, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తాజాగా తన కెరీర్ గురించి మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. 2006లో ‘గ్యాంగ్‌స్టర్’ సినిమాతో కంగనా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆఫర్ కనుక వచ్చి ఉండకపోతే.. తాను ఓ చెత్త సినిమాతో కెరీర్ ను ప్రారంభించి ఉండేదానని పేర్కొంది. ‘కెరీర్ లో నాకు వచ్చిన ‘గ్యాంగ్‌స్టర్’ సినిమాతోనే బ్రేక్ వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే అంతకన్నా ముందు నాకో సినిమా ఆఫర్ వచ్చింది. అది ఏమంతా మంచి సినిమా కాదు. అయినా, పర్వాలేదు చేద్దామనుకున్నా. ఆ తర్వాత ఫొటోషూట్ కూడా చేశాను. ఆ తర్వాత కాస్ట్యూమ్ రోబ్ ఇచ్చారు. అందులో దుస్తులేమీ లేవు. దీంతో అది నీలిచిత్రమేమో అనిపించింది. ఇది మంచి సినిమా కాదేమో, నేను చేయకూడదేమో అనిపించింది. ఇంతలోనే ‘గ్యాంగ్‌స్టర్’ సినిమా వచ్చింది. ఆ సినిమా నాకు నచ్చడంతో అదే చేశాను’ అని కంగనా తెలిపింది ‘దీంతో ఆ సినిమా నిర్మాత నాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ ప్రాజెక్టును వదిలేయడం వల్ల కొన్ని కష్టాలు కూడా పడ్డాను. అప్పట్లో నేను 17, 18 ఏళ్ల చిన్న వయస్సులో ఉన్నాను. గ్యాంగ్ స్టర్ ఆఫర్ కనుక రాకపోయి ఉంటే నేను ఆ సినిమా చేసి ఉండేదాన్ని. అప్పట్లో నేను ఉన్న పరిస్థితులు ప్రతి సినిమాకు ఓకే చెప్పు అన్నట్టుగా ఉండేవి’ అని ఆమె పేర్కొంది. బాలీవుడ్ ‘క్వీన్’గా పేరొందిన కంగన త్వరలో రంగూన్, రాణి లక్ష్మీబాయి, సిమ్రన్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
టిప్స్ ప్లీజ్!
‘‘హిందీ ‘క్వీన్’ కంగనా రనౌత్‌ను కాపీ చేయడం ఇష్టం లేదు. కానీ, ఆమెను టిప్స్ అడుగుతా’’ అంటున్నారు తమన్నా. ‘క్వీన్’ తమిళ రీమేక్‌లో తమన్నా హీరోయిన్గా నటించనున్న సంగతి తెలిసిందే. అందులో ఎలా నటిస్తే బాగుంటుందనే విషయమై కంగనాను టిప్స్ అడుగుతారట! ‘‘ఇప్పటివరకూ కంగనాను కలవలేదు, మాట్లాడనూ లేదు. కానీ, ‘క్వీన్’లో ఆమె నటనంటే నాకు ఇష్టం. కంగనా కెరీర్లో ‘క్వీన్’ ప్రత్యేక చిత్రంగా నిలుస్తుంది. ఆమెతో ఆ పాత్ర గురించి మాట్లాడితే నాకు హెల్ప్ అవుతుంది’’ అన్నారు తమన్నా. నటి రేవతి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి మరో నటి సుహాసిని మాటలు రాస్తున్నారు. -
క్వీన్ లో మిల్కీబ్యూటీతో ఎమీజాక్సన్
క్వీన్ లో మిల్కీబ్యూటీతో ఇంగ్లీష్ భామ ఎమీజాక్సన్ నటించనున్నారా? అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. హిందీ చిత్రం క్వీన్ గురించి తెలియని సినీ ప్రియులుండరనే చెప్పవచ్చు. 2014లో తెరపైకి వచ్చిన ఈ చిత్రం బాలీవుడ్ బ్యూటీ కంగనారనౌత్ కెరీర్లో మైలురాయిగా నిలిచిన చిత్రం. అంతే కాదు ఆమెకు జాతీయ అవార్డు, ఫిలింఫేర్ అవార్డులను అందించిన చిత్రం. ఈ చిత్ర దక్షిణాది భాషల రీమేక్ హక్కులను సీనియర్ దర్శక, నిర్మాత, నటుడు త్యాగరాజన్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్ర రీమేక్‌లో కంగనారనౌత్ పాత్రలో నటించే నటి ఎవరన్నది ఆసక్తిగా మారింది. చెన్నై చిన్నది త్రిష, సమంత ఇలా చాలా మంది స్టార్ హీరోయిన్ల పేర్లు మీడియాలో హల్చల్ చేశారుు. మరి కొందరైతే ఆ పాత్రలో నటించడానికి వెనుకాడినట్లు సమాచారం. దక్షిణాది క్వీన్‌గా నటి తమన్న ఎంపికై నట్లు తాజా సమాచారం. అంతే కాదు ఆమెతో పాటు నటి ఎమీజాక్సన్ నటించనున్నారన్న టాక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. క్వీన్ చిత్రంలో విదేశాల్లో నటి కంగనా రనౌత్‌కు సాయం చేసే నటి లిసా హెడెన్ పోషించారు. ఈ పాత్రను దక్షిణాదిలో ఇంగ్లీష్ భామ ఎమీజాక్సన్ పోషించనున్నారనే టాక్ వినిపిస్తోంది. తమన్న ప్రస్తుతం శింబుకు జంటగా అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంలో నటిస్తున్నారు. విశాల్‌తో నటించిన కత్తిసండై సంక్రాంతికి విడుదలకు ముస్తాబవుతోంది. తాజాగా క్వీన్ చిత్రం వరించింది. ఇక ఎమీజాక్సన్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు జంటగా 2.ఓ చిత్రంలో నటిస్తున్నారు. దీని తరువాత క్వీన్ చిత్రంలో మిల్కీబ్యూటీతో కలిసి నటించడానికి సిద్ధం అవుతోందని సమాచారం. ఇక పోతే ఈ చిత్రానికి ప్రముఖ నటి రేవతి దర్శకత్వం వహించనుండగా, మరో ప్రముఖ నటి సుహాసిని మణిరత్నం సంభాషణలను అందించనున్నారు. ఒకే చిత్రంలో నలుగురు హీరోTamannaahన్లు పనిచేయనుండడం అరుదైన విషయంగా భావించాలి. -
తమిళ రాణి తమన్నా! మరి తెలుగులో...?
‘‘తమిళంలో తమన్నా.. మలయాళంలో అమలాపాల్.. కన్నడంలో పరుల్ యాదవ్... ‘క్వీన్’గా సందడి చేయనున్నారు. తెలుగు ‘క్వీన్’ ఎవరనేది ఇంకా డిసైడ్ కాలేదు’’ అన్నారు త్యాగరాజన్. హిందీలో కంగనా రనౌత్ నటించిన ‘క్వీన్’ సౌతిండియా రీమేక్ హక్కులను తమిళ నటుడు-దర్శక-నిర్మాత త్యాగరాజన్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. నితిన్ నాష్, ఫర్నాజ్ శెట్టి జంటగా జి. రవికుమార్ దర్శకత్వంలో అనురాధ ఫిలిమ్స్ డివిజన్ సంస్థ నిర్మిస్తున్న ‘రోజ్ గార్డెన్’లో ఓ కాశ్మీర్ టీవీ ఛానల్ అధినేతగా త్యాగరాజన్ కీలక పాత్ర చేస్తున్నారు. గతంలో ‘అంతిమ తీర్పు’, ‘మగాడు’, ‘స్టేట్ రౌడీ’ల్లో నటించిన ఆయన మూడు దశాబ్దాల తర్వాత నటిస్తున్న తెలుగు చిత్రమిది. ప్రస్తుతం శంషాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. మీడియాతో త్యాగరాజన్ మాట్లాడుతూ - ‘‘తెలుగు ‘క్వీన్’ రీమేక్‌కి అనీశ్ కురువిల్లా... తమిళ, మలయాళ చిత్రాలకు రేవతి, కన్నడ చిత్రానికి ప్రకాశ్‌రాజ్ దర్శకత్వం వహిస్తారు. నాలుగు భాషల్లోనూ నేనే నిర్మిస్తా. నాలుగు భాషల్లోనూ రెండో హీరోయిన్ అమీ జాక్సన్. ఇక, మా అబ్బాయి ప్రశాంత్ హీరోగా నా స్వీయ దర్శకత్వంలో ఓ హిందీ సినిమా నిర్మిస్తున్నా. త్వరలో స్ట్రయిట్ తెలుగు సినిమా కూడా చేస్తాడు’’ అని తెలిపారు. -
క్వీన్ మనసు గెలుచుకున్న తమన్నా!
‘ఐయామ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ తమన్నా...’ ఈ మాట అన్నది ఎవరో తెలుసా? క్వీన్ ఆఫ్ బాలీవుడ్ కంగనా రనౌత్. ‘ఫ్యాషన్’, ‘క్వీన్’, ‘తను వెడ్స్ మను’ తదితర చిత్రాలతో పలువురు హీరోయిన్లకు కంగనా ఫేవరెట్ హీరోయిన్ అయ్యారు. స్టోరీ సెలక్షన్లో ఇన్స్పిరేషన్గా నిలిచారు. ఇంతకీ కంగనా ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా? తమన్నా. ఈ మిల్క్ బ్యూటీ తాజా సినిమా ‘అభినేత్రి’ హిందీ వెర్షన్ సాంగ్ లాంచ్‌కి అతిథిగా హాజరైన కంగనా రనౌత్.. ‘‘నేను తమన్నా సినిమాలు చూశాను. ఆమె నటనంటే ఇష్టం. దెయ్యం ఆవహించినట్టుగా ఎక్కడా ఆమెను నేను చూడలేదు. అందుకే ‘అభినేత్రి’ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. మరో సినిమా షూటింగ్లో ఉండడంతో ఈ సాంగ్ లాంచ్‌కి తమన్నా హాజరు కాలేదు. అయితే కంగనా తనకు ఫేవరెట్ అని చెప్పిన విషయం ఆ నోటా ఈ నోటా తమన్నాకి చేరింది. అది విని ఈ బ్యూటీ ఫుల్ ఖుష్ అయ్యారట. -
హిల్లరీపై ట్రంప్ తీవ్ర విమర్శలు
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్.. తన ప్రత్యర్థి, డెమోక్రటిక్ ప్రెసిడెంట్ అభ్యర్థి హిల్లరీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హిల్లరీ క్లింటన్ అవినీతి రాణి(కరప్షన్ క్వీన్) అని ట్రంప్ ఆరోపించారు. ఇటీవలి పలు సర్వేలు హిల్లరీకి జనాదరణ పెంరిగిందని వెల్లడించిన నేపథ్యంలో ట్రంప్ ఈ విమర్శలు చేశారు. గతంలో ఆమెను 'దెయ్యం' అని కూడా ట్రంప్ విమర్శించిన విషయం తెలిసిందే. హిల్లరీ అమెరికా అధ్యక్షురాలిగా ఎన్నికైతే దేశాన్ని నాశనం చేస్తుందని ఐయోవాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ట్రంప్ హెచ్చరించారు. 'హిల్లరీ ప్రెసిడెంట్ అయితే దేశంలో ఉగ్రవాదం ఉంటుంది, సమస్యలు ఉంటాయి.. ఒకరకంగా ఆమెను అధ్యక్షురాలిగా ఎన్నుకోవడమంటే స్వయంగా దేశాన్ని నాశనం చేసుకోవడమే' అని ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హిల్లరీని సమన్వయం లోపించిన వ్యక్తిగా ట్రంప్ పేర్కొన్నాడు. ఆమె అమెరికా అధ్యక్షురాలిగా ఉండేంత స్ట్రాంగ్ కాదని ట్రంప్ విమర్శించారు. -
స్మతి ఇరానీ.. వివాదాల మహారాణి..!
న్యూఢిల్లీః కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీపై విదేశీ మీడియా విమర్శనాస్త్రాలు గుప్పించింది. ఆమె ఓ పవర్ ఫుల్ మంత్రే కాదు వివాదాల మహరాణి అంటూ ఛలోక్తులు విసిరింది. మీలో ఏ లక్షణాలను గుర్తించి మీకు ప్రధాని నరేంద్రమోదీ మంత్రి పదవిని ఇచ్చారన్న ఓ టెలివిజన్ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించిన తీరు.. మరోసారి వివాదాన్ని తెచ్చిపెట్టింది. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోగా స్టూడియోలో ప్రేక్షకుల ముందు ఆమె అదే ప్రశ్నను పునరావృతం చేసి అక్కడివారిని రెచ్చగొట్టిన తీరుపై ఫారెన్ మీడియా మండి పడుతోంది. ఇప్పటికే నకిలీ డిగ్రీ ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రి స్మతి ఇరానీపై విదేశీ మీడియా విమర్శలు ఎక్కుపెట్టింది. ఓ టీవీ స్టూడియోలో ఆమె ప్రవర్తించిన తీరును తప్పుపడుతోంది. టీవీ స్టూడియోలో స్మృతిని పాత్రికేయుడు అడిగిన ప్రశ్ననే... ఆమె రిపీట్ చేసి.. అక్కడున్న వారిని రెచ్చగొట్టడంతో వారంతా సదరు జర్నలిస్టుపైకి దూసుకొచ్చి.. దాదాపు కొట్టినంత పనిచేసిన నేపథ్యంలో విదేశీ మీడియా విరుచుకుపడుతోంది. మీలో ఎటువంటి లక్షణాలను గుర్తించి మీకు మంత్రి పదవి ఇచ్చారంటూ సదరు జర్నలిస్టు అడిగిన ప్రశ్న ఆమెలో ఆగ్రహాన్ని తెప్పించిందో.. లేదా ఉద్దేశపూర్వకంగానే ఆమె ఆలా ప్రవర్తించిందో తెలియదు గానీ... అతడు అడిగిన ప్రశ్ననే స్టూడియోలోని ప్రేక్షకులముందు రిపీట్ చేసింది. దీంతో రెచ్చిపోయిన అక్కడి జనం.. కుర్చీలపైనుంచి దూకి.. వేదికపైకి దూసుకొచ్చిన పాత్రికేయుడ్ని కొట్టినంత పని చేశారు. అయితే అంతటి వ్యతిరేకత వస్తుందని ఆమె అనుకుందో లేదో గాని... వారి అభిమానానికి ఓ పక్క ఆనందించినా పరిస్థితులు అదుపు తప్పడంతో స్టేజిపైకి వచ్చిన వారిని వారించి, సదరు జర్నలిస్టును కొట్టకుండా కాపాడింది. ప్రముఖ రాజకీయ నాయకురాలు, నరేంద్రమోదీ ప్రభుత్వంలో మానవవనరుల శాఖామంత్రిగా కొనసాగుతున్న 40 ఏళ్ళ స్మృతి ఇరానీ.. తన విద్యార్హతల విషయంలో ఇప్పటికే పలు వివాదాలు ఎదుర్కొంటున్నారు. ప్రఖ్యాత టీవీ నటిగా ఎన్నో అవార్డులు, రివార్డులూ అందుకున్న ఆమె... రాజకీయాల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకొన్నారు. దీనికి తోడు ఎప్పుడూ తన పదునైన ప్రసంగాలతో వివాదాలకు కేంద్ర బిందువుగా మారడం కూడ ఆమెలోని మరో ప్రత్యేకతగా చెప్పాలి. లోక్ సభ, రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కేంద్రమంత్రి... ఎన్నికల కమిషన్ కు సమర్పించిన మూడు అఫిడవిట్లలో తన విద్యార్హతలు ఒక్కోదాంట్లో ఒక్కో విధంగా ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆమెను మంత్రి పదవినుంచీ తొలగించాలన్న డిమాండ్లుకూడ వెల్లువెత్తాయి. ఫిబ్రవరి నెలలో జరిగిన సుమారు 42 విశ్వవిద్యాలయాలకు చెందిన అధిపతుల సమావేశంలోనూ స్మృతి ప్రవర్తించిన తీరు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతేకాదు ఆమెను ఫోటో తీయాలని చూసిన ఓ ప్రొఫెసర్ ను దురుసుగా తోసేయడంకూడ పెద్ద దుమారమే రేపింది. అయితే ఆమె అజ్ఞానం, అహంకారం కలసి ప్రమాదకరంగా మారుతున్నాయంటూ అప్పట్లో రామచంద్ర గుహ అనే ఓ రాజకీయ చరిత్రకారుడు సైతం విమర్శించడం విశేషం. ఏదై ఏమైనా స్మృతి ఇరానీ ఇప్పుడు విదేశీ మీడియా దృష్టిలో పడి మరోసారి వివాదాలు ఎదుర్కొంటున్నారు. -
ఇంటర్నెట్ ను బ్రేక్ చేసిన బ్యూటీ!
ఆమె ఓ టాప్ మోడల్. తన అందాలతో ఏకంగా ఓ దేశాన్నే ఆకట్టుకున్న బ్యూటీ క్వీన్ షాంజీ హయత్. మూడేళ్ళక్రితం ర్యాంపుపై ఒయ్యారాలు వొలకబోసి, తన అందంతో అందర్నీ కట్టిపడేసిన ఆమె.. మిస్ పాకిస్తాన్ వరల్డ్ 2013 గా ఎంపికైంది. ఇంతకూ ఆమె కథ ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారా? ఆ అందాల భామ.. ఇప్పుడు ఇంటర్నెట్ లో ఓ హాట్ టాపిక్ గా మారింది. తన అందాలను ఆరబోస్తూ.. వివిధ భంగిమల్లోని ఫోటోలను పోస్టు చేసి అందర్నీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఎప్పుడూ ఎంతో ఆత్మస్థైర్యంతో, వినమ్రతతో కనిపించే ఆ అందాల రాణి.. ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన చిత్రాలను చూసినవారికి మాత్రం... ఆమె అందం.. ఓ అద్భుతం అనిపించక మానదు...ఐదడుగుల ఏడంగుళాల ఎత్తు, బంగారు తీగలా మెరిసిపోయే శరీరం. చూసినవారు కలా.. నిజమా అంటూ కళ్ళప్పజెప్పాల్సిందే... -
ఎలిజబెత్ కు ఎయిర్ ఇండియా స్మారక ఆల్బమ్!
లండన్: క్వీన్ ఎలిజబెత్ 90వ పుట్టినరోజు వేడుకలకు గుర్తుగా ఎయిర్ ఇండియా ఓ అధికారిక స్మారక ఆల్బమ్ ను వెలువరించనుంది. ప్రచురణకర్త సెయింట్ జేమ్స్ హౌస్ ద్వారా ఆల్బమ్.. ఈ వారం విడుదల కానుంది. లండన్ లోని విండర్స్ కాసిల్ హోం పార్క్ లో మే 12-15 మధ్య జరిగే రాయల్ ఈవెంట్స్ సందర్భంలో పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేసింది. క్వీన్ ఎలిజబెత్ రాచరికపు జీవితంపై లండన్ లో నాలుగు రోజులపాటు నిర్వహించనున్న వేడుకల్లో కామన్వెల్త్, అంతర్జాతీయ వ్యవహారాల్లో ఆమె అంకితమైన తీరు, సాయుధ దళాలపై సారించిన దృష్టి, గుర్రాలపై చూపించిన ప్రేమ తదితర విషయాలు ప్రముఖంగా ఉంటాయని తెలుస్తోంది. కార్యక్రమానికి హాజరయ్యే వీవీఐపీ, వీఐపీలకు స్మారక ఆల్బమ్ ను బహుమతిగా ఇవ్వనున్నట్లు సెయింట్ జేమ్స్ హౌస్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ ఫ్రీడ్ తెలిపారు. అంతేకాకుండా ప్రపంచ ప్రముఖులు, సంస్థలు, రాష్ట్ర అధిపతులు, నాయకులు, పారిశ్రామిక వేత్తలకు ఈ పుస్తకాల కాపీలు అందజేయనున్నట్లు చెప్పారు. ఆల్బమ్ సంపాదకీయ భాగస్వాముల కోసం వెతుకుతున్నపుడు తమకు ఎయిర్ ఇండియా యూకె సహకరించేందుకు ముందుకు వచ్చిందని, అదే తమకు మైలురాయిగా చెప్పాలని ఫ్రీడ్ తెలిపారు. క్వీన్ పుట్టినరోజు వేడుకల సందర్భంలో భారతదేశానికి బ్రిటన్ తో ఉన్న బలమైన సంబంధాలు మరోసారి వ్యక్తమౌతున్నాయని, సెయింట్ జేమ్స్ హౌస్.. ఎయిర్ ఇండియా యూకె ను మంచి సంపాదకీయులుగా గుర్తించి చారిత్రక ఉత్సవాలకు ఆహ్వానించడం ఎంతో గర్వంగా చెప్పుకోవాలని బ్రిటన్ లోని ఎయిర్ ఇండియా రీజినల్ మేనేజర్ తారా నాయుడు అన్నారు. ముఖ్యంగా ఎయిర్ ఇండియా బ్రిటన్ తో చారిత్రక సంబంధాలు కలిగి ఉందని, అందుకు 1948 జూన్ 8న నాలుగు ఇంజన్ల తో కూడిన మొదటి విమానాన్ని కెయిరో జెనీవాల మీదుగా లండన్ కు పంపడమే పెద్ద ఉదాహరణగా చెప్పాలని ఆమె అన్నారు. ప్రస్తుతం భారతదేశంనుంచి ఐదు రోజువారీ విమానాలను ఎయిర్ ఇండియా లండన్ బర్మింగ్ హామ్ కు నడుపుతోన్నట్లు తెలిపారు. -
కంగనా రనౌత్ (నటి) రాయని డైరీ
పెళ్లంటే ఇంట్రస్ట్ లేని అమ్మాయిపై.. పెళ్లయిన మగాళ్లకు ఎక్కడలేని ఇంట్రస్ట్ కలుగుతుంది! ఆ పిల్ల ధైర్యంపై వీళ్లు బతికేయొచ్చు కదా.. అందుకు. ‘నీ మీద ఉన్నది లస్ట్ కాదు.. లవ్’ అని మొదలుపెట్టేస్తారు. జాగ్రత్తగా లవ్ చేస్తారు. నెక్ టై వదులైనట్టు కూడా కనిపించదు. పాపం ఏం చేస్తారు మరి! సాయంత్రానికల్లా ఇంటికి చేరాలి. జెంటిల్మన్లా చేరాలి. అక్కడ మళ్లీ పెళ్లాన్ని లవ్ చెయ్యాలి. రాత్రి షూటింగ్ నుంచి వచ్చేసరికి బాగా లేటయింది. బతికిపోయాను! నా కోసం ఎదురు చూస్తూ ఉండే మగదిక్కు ఒకడు నా ఇంట్లో లేడు. నేను, నా ఇల్లు. అందులో స్వామీ వివేకానంద, స్క్రీన్ ప్లే రైటింగ్ కోర్సు పుస్తకాలు, కథక్ డ్యాన్స్ సరంజామా, ఫ్రిజ్‌లో కొన్ని ఆకుకూరలు, హాయిగా తలదిమ్మంతా వదిలించుకోడానికి శుభ్రమైన స్నానాల గది. మనిషిగా ఎదగడానికి, నేర్చుకోడానికి ఒక సామాన్యురాలిగా నాకున్న హక్కును వదులుకోవలసి వస్తే సినిమాల నుండి బయటికి వచ్చేస్తాను తప్ప, నా ఇంటిని వదిలి నేను ఎక్కడికీ వెళ్లను. రంగూన్ సెట్లో సైఫ్ పెట్టిన చికాకు గుర్తొచ్చి మళ్లీ ఇంకోసారి స్నానం చేయాలనిపిస్తోంది. రెండు పెళ్లిళ్లు అయినవాడిలో అంత బుద్ధిహీనత ఏమిటో?! పడగ్గది సీన్లో యాక్ట్ చేస్తున్నాం ఇద్దరం. కెమెరా అతడి ముఖం మీదకు జూమ్ అయింది. యాక్ట్ చెయ్యాలి. చెయ్యట్లేదు. నా వైపు తిరిగి పిచ్చిపిచ్చి ఫీలింగ్స్ పెట్టేస్తున్నాడు! డిజ్గస్టింగ్. ఇంపార్టెంట్ సీన్లో ఒక ప్రొఫెషనల్ అలా ఎలా ఉంటాడు? పెద్దగా అరిచేశాను. విశాల్ పరిగెత్తుకొచ్చాడు. ‘రిలాక్స్ కంగనా.. సైఫ్ ఈజ్ జస్ట్ జోకింగ్’ అంటాడు. రిలాక్స్డ్గా ఉండనిస్తారా ఈ మగాళ్లు! నాలుగు రోజులు కలిసి పనిచేస్తే చాలు.. ‘నీకోసం ఏమైనా చేసేస్తా’నని ఇంట్లోంచి చాప, దిండు పట్టుకొచ్చేస్తారు.. నా భార్య నా పక్కనే ఉన్నా నువ్వే గుర్తొస్తున్నావని! ఆదిత్య నా గాడ్‌ఫాదర్. నాకన్నా ఇరవై ఏళ్లు పెద్ద. ‘నువ్వు లేకుండా నేను లేను’ అన్నాడు ఓ రోజు.. వాళ్ల ఆవిడ లేకుండా చూసి! ‘నీకు నేనున్నాను’ అన్న పెద్ద మనిషి ‘నువ్వు లేకుండా నేను లేను’ అంటున్నాడు! టార్చర్. బయటికి వచ్చేశాను. ఇప్పుడు హృతిక్! నా ఈ మెయిళ్లు, నా పర్సనల్ ఫొటోలు ముంబై అంతా పంచిపెడుతున్నాడు. ప్రేమ కోసం నేను అతడిని వేధించానని తన భార్యను నమ్మించడానికి ఇవన్నీ అతడు పోగేసుకున్న సాక్ష్యాలు, ఆధారాలు! నవ్వొస్తోంది. మనిషంటే నికోలాస్! ఇంగ్లిష్ డెరైక్టర్. కొన్నాళ్లు కలిసి ఉన్నాం. ‘ఎప్పటికీ కలిసే ఉందాం’ అన్నాడు ఒక రోజు. ‘పెళ్లిలో పడడం నాకిష్టం లేదు’ అని చెప్పాను. ఈ పెళ్లయిన మగాళ్లలా అతడు హర్ట్ అవలేదు. బై చెప్పాడు. నవ్వుతూ చెప్పాడు! ఒక ‘మోస్ట్ నార్మల్’ రిలేషన్షిప్ చుట్టూ అందమైన ప్రేమ గూడు కట్టుకునేది కాన్ఫిడెన్స్ లేని మగాళ్లే. గుండెల నిండా ప్రేమను కోరుకునే అమ్మాయిలకు ఆ ప్రేమగూడులో ఊపిరితిత్తులు పనిచేయవు! -
నాకు ఇంగ్లీష్ ఒక్కముక్క రాదు!
ఇవాళ దేశమంతటా చెప్పుకుంటున్న హీరోయిన్లలో రింగు రింగుల జుట్టు కంగనా రనౌత్ ఒకరు. ప్రస్తుతం ఆమెను అందరూ హిందీ సినీసీమకు ‘క్వీన్’ అంటున్నారు. కానీ, ఈ సక్సెస్ సాధించడం ఆమెకు అంత సులభమేమీ కాలేదు. ఆ సంగతే చెబుతూ, ‘‘నా జీవితమేమీ అంత హాయిగా, జానపదకథలా సాగిపోలేదు. దాదాపు పదేళ్ళ పాటు నానా కష్టాలు పడ్డాను. ఇవాళ నేను ఉంటున్నదానికీ, అప్పటికీ సంబంధమే లేదంటే నమ్మండి’’ అని కంగనా రనౌత్ అన్నారు. ‘‘అప్పట్లో నాకు అస్సలు ఒక్కముక్క కూడా ఇంగ్లీష్ రాదు. ఆ మాట చెబితే - ఇంగ్లండ్‌లోని జనమైనా సానుభూతితో అర్థం చేసుకుంటారేమో కానీ, ముంబయ్‌లో పరిస్థితి వేరు. మీకు ఇంగ్లీష్ రాదంటే, ‘ఆమె హిందీ సినిమాల్లో ఇంకెలా పనిచేస్తుంది’ అని అంటారు. కానీ, వాటన్నిటినీ తట్టుకొని నిలబడ్డాను. నా మీద నాకున్న అవగాహన మారకపోవడం వల్లే నేనివాళ ఈ స్థితిలో ఉన్నా’’ అని కంగన చెప్పుకొచ్చారు. ఉత్తరాదిలో ఒక చిన్న పట్నంలో పెరిగిన ఈ అభినయ తారకు మొదటి నుంచీ ఆడవాళ్ళ పట్ల మన దేశంలో ఉన్న అభిప్రాయంతో విభేదాలున్నాయి. ‘‘ఆడపిల్ల అంటే, ఎర్రగా, బుర్రగా, అందంగా ఉండాలనీ, అలా పెరగాలనీ, అందుకు తగ్గ జీవిత భాగస్వామిని పొందితే చాలనీ పెద్దలు చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ, అది చెప్పుకోలేనంత బాధ. అందుకే, మన దేశపు తల్లితండ్రులు కోరుకొనే తరహా పిల్లను కాదు నేను’’ అని కంగన చెప్పుకొచ్చారు. మొత్తానికి, కంగన మాటల్లో నిజం ఎంత ఉందో, నివ్వెరపరిచే అంశాలూ అన్నే ఉన్నాయి కదూ! -
క్వీన్ ఎవరో?
నయన క్వీనా? ఈ విషయం గురించి సినీ పరిశ్రమలో రకరకాల ప్రచారం జరుగుతోంది. నటిగా ప్రస్తుతం దక్షిణాదిలో నయనతారనే రాణిగా వెలుగొందుతున్నారన్నది వాస్తవం. ఆమె చిత్రానికి మూడు కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు టాక్. తాజాగా తెలుగులో చిరంజీవికి జంటగా నటించనున్న చిత్రానికి నయనతార మూడు కోట్లు పుచ్చుకుంటున్నట్లు సినీ వర్గాల సమాచారం. అయితే ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఇది కాదు. నయనతార హిందీ చిత్రం క్వీన్‌లో నటించనున్నారా? అన్నది. హిందిలో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం క్వీన్. ఈ సంచలన విజయం సాధించి ఆమెను ఉన్నత స్థానంలో కూర్చోబెట్టిన చిత్రం ఇది. దీని దక్షిణాది పునర్ నిర్మాణ హక్కుల్ని సీనియర్ నటుడు, దర్శక నిర్మాత త్యాగరాజన్ ఫ్యాన్సీ ఆఫర్‌తో సొంతం చేసుకున్నారు. అయితే ఈ చిత్రంలో కంగనా రనౌత్ పాత్రలో నటించాలన్న ఆ కాంక్షను దక్షిణాదికి చెందిన చాలా మంది ప్రముఖ నాయికలు వ్యక్తం చేశారు. అదే విధంగా చాలా మంది ప్రముఖ నటీమణుల పేర్లను నిర్మాత వర్గం పరిశీలిస్తున్నట్లు సమాచారం. నయనకు ఆఫర్? ఈ నేపథ్యంలో ప్రస్తుత టాప్ హీరోయిన్ నయనతారకు క్వీన్ చిత్రంలో నటించే అవకాశం వచ్చినట్లు, ఆమె కూడా క్వీన్‌గా మారడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు,అయితే చిత్ర వర్గం అడిగిన కాల్షీట్స్ సర్దుబాటు కాకపోవడంతో అంగీకరించలేక పోయినట్లు రకరకాల ప్రచారం మీడియాలో హల్చల్ చేస్తోంది. నాయకి ఎంపిక జరగలేదు క్వీన్ చిత్రాన్ని నిర్మించనున్న త్యాగరాజన్ అవాస్తవ ప్రచారాలకు పుల్‌స్టాప్ పెట్టే విధంగా తామింకా చిత్ర కథానాయకిని ఎంపిక చేయలేదని స్పష్టం చేశారు. క్వీన్ చిత్రం భారీ నిర్మాణంతో కూడిందన్నారు. చిత్ర షూటింగ్ పూర్తిగా ఐరోపా దేశాల్లో చిత్రీకరించాల్సి ఉందన్నారు. అందుకు లొకేషన్స్ ఎంపిక చేయడానికి ఆ దేశాల అనుమతి పొందాల్సి ఉందని తెలిపారు.ఈ చిత్రంలో నటించనున్న హీరోయిన్ గురించి రకరకాల ప్రచారం జరుగుతుండడంతో తాను స్పందిచాల్సి వచ్చిందని, క్వీన్ చిత్రంలో నటించే హీరోయిన్ను ఎంపిక ఇంకా జరగలేదనీ స్పష్టం చేశారు. ఈ చిత్రం హీరోయిన్ చుట్టూ తిరిగే కథ కావడంతో ఇందులో నటించే నాయకి కాల్షీట్స్ 120 వరకూ అవసరం అవుతుందన్నారు.ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని హీరోయిన్ ఎంపిక ఉంటుందనీ ఈ చిత్రంలో ప్రశాత్ నటించడం లేదని తెలిపారు. దీనికి సీనియర్ నటి రేవతి దర్శకత్వం బాధ్యతల్ని, నటి సుహాసిని సంభాషణలు అందిస్తున్నారని, చిత్ర షూటింగ్‌ను మేలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. -
'ఆ హీరోయిన్ కోసం ఇక ఆగలేను'
ముంబై: 'క్వీన్' ఫేమ్ కంగనా రనౌత్ తో కలిసి పనిచేయాలని ఉందని బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహర్ అన్నాడు. జాతీయ అవార్డు గ్రహిత కంగనాతో కలిసి త్వరగా ఏదైనా మూవీ చేయాలని, అందుకు తాను ఇక ఆగలేనంటున్నాడు. అభిమానులతో ట్విట్టర్ లో చిట్ చాట్ ప్రోగ్రామ్ లో భాగంగా కరణ్ ఈ విధంగా వ్యాఖ్యలు చేశాడు. కంగనాతో మూవీ చేయాలనుకుంటున్నారా అని ఓ అభిమాని కరణ్ ను ప్రశ్నించాడు. వెంటనే స్పందించిన కరణ్... ఆమెతో మూవీ చేయడానికి ఇంకా తాను ఆగలేనని, ఎక్కువ కాలం ఎదురుచూడాలనుకోవడం లేదన్నాడు. అయన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా ఓ మూవీని ప్రారంభించనున్నట్లు కరణ్ చెప్పుకొచ్చాడు. ఈ మూవీకి టైటిల్ ఇంకా ఖరారు చేయలేదని వచ్చే ఏడాది విడుదల చేస్తామన్నాడు. 2001లో తీసిన 'కభీ ఖుషీ కభీ ఘమ్' మూవీకి సీక్వెల్ తీయాలని ఇప్పటివరకైతే ఆలోచించలేదని తెలిపాడు. భవిష్యత్తులో ఈ సినిమా పట్టాలెక్కినా ఎక్కవచ్చు చేప్పలేం అని అభిమానులతో చిట్ చాట్ సందర్భంగా కరణ్ జోహర్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. -
రేవతి దర్శకత్వంలో సౌత్ 'క్వీన్'
2013లో బాలీవుడ్లో రిలీజ్ అయి ఘనవిజయం సాధించిన కామెడీ డ్రామా.. క్వీన్. లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కి 100 కోట్ల క్లబ్లో చేరిన తొలి సినిమాగా సంచలనం సృష్టించిన ఈ సినిమా, నటిగా కంగనా రనౌత్‌కు జాతీయస్థాయిలో మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అప్పటినుంచే ఈ సినిమా సౌత్ రీమేక్‌పై వార్తలు వినిపిస్తున్నా సరైన నటీనటులు, సాంకేతిక నిపుణులు కుదరకపోవటంతో పట్టాలెక్కలేదు. ప్రస్తుతం ఈ సినిమాను సీనియర్ నటి, దర్శకురాలు రేవతి డైరెక్షన్లో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రీమేక్ చేయనున్నారు. కోలీవుడ్ నిర్మాత త్యాగరాజన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు నటి సుహాసిని రచనా సహకారం అందిస్తున్నారు. ఇప్పటికే ఫైనల్ అయిన ఈ ప్రాజెక్ట్‌కు ప్రస్తుతం నటీనటుల ఎంపిక కొనసాగుతోంది. ఈ ఏడాది అక్టోబర్ లో షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
ఆ పాట.. నా అంత్యక్రియల్లో వినిపించండి!
అందాల తార.. అమందా హోల్డెన్... ఇప్పుడో విచిత్ర ప్రకటన చేసి వార్తల్లో నిలిచింది. తనకు ఇష్టమైన అబ్బా డ్యాన్సింగ్ క్వీన్ సాంగ్ ను తన అంత్య క్రియల సమయంలో ప్లే చేయాలంటూ వేదికపై వెల్లడించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. బ్రిటన్ గాట్ ట్యాలెంట్ షో ఆడిషన్స్ జరుగుతుండగా ఆ పాటను ఎంతో ఉద్వేగంగా పాడిన ఆమె... ఆ తర్వాత అదే సాంగ్ తనను సమాధిలో ఉంచే సమయంలో పాడాలంటూ కోరడం విన్నవారికి విస్మయం కలిగించింది. ఇంతకూ అమందా ఆవేదన వెనుక కారణం ఏమయ్యుంటుంది? హాలీవుడ్ ప్రేక్షకుల మదిని దోచే అందాల నటిగానే కాక, మంచి సింగర్ గానూ, ప్రెజెంటర్ గానూ పేరుతెచ్చుకున్న 'అమందా లూయిస్ హోల్డెన్'... బ్రిటన్ ఐటీవీ కార్యక్రమం 'బ్రిటన్ గాట్ ట్యాలెంట్' షోలో జడ్జిగా కూడా ప్రత్యేక ప్రశంసలందుకుంటోంది. ఇప్పుడు అదే వేదికపై టాలెంట్ షో ఆడిషన్ కు ముందు తనకు ఎంతో ఇష్టమైన, తాను మొదటిసారి మనసుకు నచ్చి, మెచ్చి పాడుకున్న పాట (అబ్బా డ్యాన్సింగ్ క్వీన్) ఎంతో శ్రావ్యంగా ఆలపించింది. ఇంతలో ఏమైందో ఏమో ''ఇది నాకు ఎప్పటికీ ఇష్టమైన పాట. నా మనసునుంచి జాలువారిన గీతం. నా మరణానంతరం నన్ను సమాధిలో ఉంచే సమయంలో ఈ పాటను ప్లే చేయండి'' అంటూ అమందా వెల్లడించింది. కార్యక్రమం ప్రారంభం అవుతున్న సమయంలో సహ జడ్జి సైమన్ కోవెల్ చేసిన సరదా కామెంటే ఆమె అప్రస్తుత ప్రకటన వెనుక కారణమై ఉండొచ్చని అంతా అనుకుంటున్నారు. బిజిటి ఆడిషన్స్ సమయంలో సైమన్ కోవెల్... అమందా మాజీ భర్త.. హాస్యనటుడు లెస్ డెన్నిస్ పై చేసిన సరదా కామెంట్.. ఆమెకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. ఊహించని ఉద్వేగానికి లోనయ్యింది. అదే సమయంలో డైనోసార్ డ్రెస్ తో డ్యాన్స్ ట్రూప్ స్టేజ్ పైకి రావడం ఆమెకు కలసి వచ్చింది. ఇంకేముందీ... వారికి ఓ పక్క అభినందనలు తెలుపుతూనే ఆ డైనోసార్ నావైపే చూస్తోందని, దాని మోసపూరిత ప్రవర్తన గురించి నాకు ఎప్పుడో తెలుసునని మిస్టర్ నాస్టీగా కూడా దానికి పేరు అందుకే వచ్చిందని ఇలా అనేక వ్యంగ్యాస్త్రాలు సంధించింది. సమయానికి డెన్నిస్ వేదిక ముందు ఉండటం.. సైమన్ వెక్కిరించడం ఆమెను ఆవేశానికి గురి చేశాయి. ఆమె ప్రవర్తనకు సర్ది చెబుతూ 'లీవ్ లెస్ ఎలోన్' అంటూ డెన్నిస్ ను ఉద్దేశించి సైమన్ అనడం కూడా అమందాను పట్టలేని ఉద్వేగానికి లోను చేశాయి. ఆమె చేతిలో సుమారు ఏభై వేల రూపాయల ఖరీదైన ఫోన్ ను విసిరికొట్టి నాశనం చేయడమే కాక, అక్కడున్న గ్లాసుల్లో నీటిని కూడా సైమన్ పై పోసి నానా హంగామా చేసింది. అమందా ప్రవర్తనపై ఇంతకు ముందే ఓసారి అనుభవం ఉండటంతో ఆ సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకుంటూ సైమన్ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. గతంలో బ్రిటన్ గాట్ మోర్ ట్యాలెంట్ సమయంలో కూడా అమందా ఇలాగే ప్రవర్తించింది. అప్పట్లో అతిథిగా వచ్చిన స్టీఫెన్ ముల్లెన్... అమందాను.. న్యూయార్క్ సామాజిక వేత్త జోస్లిన్ వైల్డెన్ స్టిన్ తో పోలుస్తూ వెక్కిరించడం ఆమెకు ఆగ్రహం తెప్పించింది. నట జీవితంలోనూ, సింగర్ గానూ, జడ్జిగానూ ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన అమందా వివాహ జీవితం మాత్రం ఎన్నో మలుపులు తిరగడం, ఎన్నోసార్లు మోసపోవడం కూడా ఆమె కోపం వెనుక కారణాలై ఉండొచ్చని అంతా అనుకుంటున్నారు. 1995 లో లెస్ డెన్నిస్ ను వివాహమాడిన అమందా ఎనిమిదేళ్ళ తర్వాత ఇద్దరి మధ్యా విభేదాలు రావడంతో 2003 లో విడిపోయారు. అనంతరం 2008 లో తిరిగి క్రిస్ హూగ్స్ ను పెళ్ళి చేసుకుంది. 44 ఏళ్ళ అమందాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం బ్రిటన్ గాట్ ట్యాలెంట్ షో జడ్జింగ్ ప్యానెల్ లో సైమన్ తో పాటు... అంమందా కూడా జడ్జిగా కొనసాగుతోంది. -
'క్వీన్' ఆత్మకథ
వరుస బ్లాక్ బస్టర్స్‌తో బాలీవుడ్ స్టార్ హీరోలను కూడా సవాల్ చేసిన హాట్ బ్యూటీ కంగనా రనౌత్. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా బాలీవుడ్లో అడుగు పెట్టిన ఈ ఫ్యాషన్ గాళ్ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా నిరూపించుకుంది. లేడీ ఓరియంటెడ్ సినిమాతో కూడా 100 కోట్ల వసూళ్లు సాధ్యమే అని నిరూపించిన కంగనా మరో సంచలనానికి రెడీ అవుతోంది. కెరీర్ స్టార్టింగ్‌లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న కంగనా, తన అనుభవాలను పుస్తక రూపంలో తీసుకురావటానికి ప్రయత్నిస్తుందట. బర్తాదత్ రాసిన 'ద అన్క్వయిట్ ఇండియా' బుక్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న కంగనా రనౌత్, ఈ విషయాన్ని ప్రకటించింది. అంతేకాదు కెరీర్ స్టార్టింగ్‌లో తనను ఇబ్బంది పెట్టిన కొన్ని విషయాలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది. -
మనస్తాపంతో భర్త ఆత్మహత్య
జనగామ : భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలోని బాణాపురంలో మంగళవారం రాత్రి జరిగింది. మృతుడి తండ్రి నర్సయ్య, ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. 21వ వార్డు బాణాపురం కాలనీకి చెందిన దేవరాయ రామకృష్ణ(24)కు మెదక్ జిల్లా సిద్ధిపేటకు చెందిన రాణితో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వారికి కుమారుడు, కూతురు ఉన్నారు. 15 రోజుల క్రితం భార్య,భర్తలు గొడవ పడడంతో రాణి పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను తీసుకొచ్చేందుకు భర్త వెళ్లగా నిరాకరించడంతో తల్లిని పంపించినా ఫలితం లేకపోయింది. దీంతో మానసిక వేదనకు గురైన రామకృష్ణ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహ త్య చేసుకున్నాడు. ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు ఫ్యాన్‌కు వేలాడుతున్న కొడుకున చూసి బోరున విలపించారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తలరించారు. -
హీరో పోలికల్లో లండన్ రాణి!
చైనీస్ కళాకారుడు డాపెంగ్ రూపొందించి.. ప్రదర్శించిన బ్రిటన్ రాణి మట్టిప్రతిమ... ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. లండన్ సామ్రాజ్యాన్ని సుదీర్ఘకాలం పాలించిన రాణిగా ఇటీవల రికార్డు సృష్టించిన రెండో ఎలిజబెత్ శిల్పం... లండన్ వింటర్ ఆర్ట్ అండ్ యాంటిక్ ఫెయిర్‌లో గత నెల్లో ప్రదర్శనకు ఉంచారు. అయితే ఆమె.. ప్రముఖ నటుడు టామ్ హాంక్స్ పోలికలతో ఉండటం విమర్శకులను ఆశ్చర్యపరచింది. ఆమె రూపాన్ని చూసి అంతా భయపడ్డారు. అసలు ఆమె మహారాణిలాగానే కనిపించడం లేదన్నారు... ఆర్ట్ క్రిటిక్ మార్క్ హడ్సన్. తల వెనుక భాగం చాలా పెద్దగా ఉండి, బాక్సర్ గడ్డంతో చూసేందుకు టామ్ హాంక్స్లా కనిపిస్తోందని ఆయన విమర్శించారు. నిజానికి మహారాణి ప్రతిమను తయారుచేసేందుకు కళాకారుడు డాపెంగ్ మూడునెలల సమయంలో 13 సార్లు మార్పులు చేర్పులు చేశాడన్నారు. 20 కేజీల బరువున్నశిల్పం.. ముఖం కూడా చాలా మందంగా కనిపిస్తోందని, జుట్టు మాత్రమే రాణి పోలికల్లో ఉందని విమర్శకులు అంటున్నారు. -
40ల నాటి ప్రేమ కథలో కంగనా
ఇండియన్ సినిమా తెర మీద పీరియాడిక్ సినిమాల హవా కొనసాగుతుంది. హీరోలు మాత్రమే కాదు మంచి కలెక్షన్ స్టామినా ఉన్న హీరోయిన్లు కూడా పీరియాడిక్ డ్రామాల వైపే మొగ్గు చూపుతున్నారు. బాలీవుడ్ క్వీన్ కంగాన కూడా ఈ జాబితా లో చేరిపోయింది. 1940 లలో జరిగే ఓ రొమాంటిక్ డ్రామాలో నటించనుంది కంగనా. రంగూన్ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటి కంగనా అయితేనే సరైన న్యాయం చేయగలదని భావిస్తున్నాడట దర్శకుడు విశాల్ భరద్వాజ్. ఈ సినిమా కథ రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి పరిస్థితులపై తెరకెక్కనుంది. ఆ సమయంలో ఓ ప్రఖ్యాత నటి, ఆమె గురువు కు మధ్య ఉన్న సంబంధం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోలు సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్ లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే సినిమా కథ అంతా ఓ నటి, ఆమె గురువు, అలాగే ఓ సైనికుడి మధ్య జరుగుతుంది. అంటే ఇప్పటికే ప్రకటించిన కంగనా, సైఫ్, షాహిద్ లు ఈ మూడు పాత్రలోనే కనిపించనున్నారు. ప్రస్తుతం 'కట్టి బట్టి' సినిమా ప్రచారం లో బిజీగా ఉన్న క్వీన్ ఆ మూవీ విడుదల తరువాత రంగూన్ చిత్రీకరణకు రెడీ అవుతోంది. ఈ లోగా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా రంగూన్ టీం పూర్తి చేయనుంది. -
వాళ్లున్నారే... భలే కుళ్లుబోతులు!
గాసిప్ ‘క్వీన్’, ‘తనూ వెడ్స్ మనూ’ సినిమాలతో కంగనా రనౌత్ దశ తిరిగింది. ఒకప్పుడు ఆమెను పట్టించుకోని వాళ్లు, చిన్నచూపు చూసిన వాళ్లు కూడా ఇప్పుడు సందర్భం కలిపించుకొని మరీ కంగనాను పొగుడుతున్నారు. అయితే అలాంటివి కంగనా చెవికెక్కించుకుందో లేదో తెలియదు. ముక్కుసూటిగా మాట్లాడుతుందని కంగనాకు పేరు. ఎన్నో సార్లు ఈ విషయం రుజువైంది. ‘‘మిమ్మల్ని చూసి కుళ్లుకునే వాళ్లు ఉన్నారా?’’ అనే ప్రశ్నకు- ‘‘లేకేం... చాలామంది ఉన్నారు... నేను అంటే ఎక్కడ లేని కుళ్లు వాళ్లకి...’’ అని సమాధానం చెప్పింది. ఒక ప్రముఖ దర్శకుడిని ఉద్దేశించి కంగనా ఆ మాట అన్నదని, అదేమీ కాదు... తన గురించి తేలిగ్గా మాట్లాడిన ఒక ప్రముఖ హీరో గురించి మాట్లాడిందని... ఇలా ఏవేవో పేర్లు వినిపిస్తున్నాయి. ప్రియాంక చోప్రా, దీపికా పడుకోన్లపైనే తన కోపాన్ని చాటుకుందని అత్యధికులు అంటున్నారు. నిజాలు మనకేం ఎరుక? కంగనాకే ఎరుక! -
రేటు రెండింతలు!
మార్కెట్ ఉన్నప్పుడే పారితోషికం పెంచాలి... లైమ్‌లైట్‌లో ఉన్నప్పుడే బెట్టు చేయాలి... కొంతమంది తారలు ఫాలో అయ్యే సూత్రాలివి. తాజాగా ఈ జాబితాలో కంగనా రనౌత్ కూడా చేరిపోయారు. వరుస విజయాలతో పట్టరానంత సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కంగనా, తన మార్కెట్‌ని సొమ్ము చేసుకోవాలని డిసైడ్ అయిపోయారు. ఇప్పటివరకూ ఆమె ఒక సినిమాకి దాదాపు మూడు కోట్ల రూపాయలు తీసుకునేవారట. కానీ ‘క్వీన్’, ‘తను వెడ్స్ మను’ రెండు భాగాలు.. ఇలా వరుసగా విజయవంతమైన చిత్రాల్లో నటించారు కాబట్టి, పారితోషికం పెంచాలనుకున్నారట. మూడు కోట్లకు అదనంగా ఇంకో అర కోటి, ఒక కోటీ కాదు.. ఏకంగా రేటు రెండింతలు చేసేశారట. ఒక సినిమాకి ఆరు కోట్లు ఇస్తేనే అంగీకరిస్తా, లేకపోతే వేరే కథానాయికను చూసుకోండి అని నిర్మొహమాటంగా చెబుతున్నారని హిందీ రంగంలో ఓ వార్త ప్రచారమవుతోంది. కొంచెం అటూ ఇటూగా ఐదు కోట్లకు ఒప్పుకోండి మేడమ్ అంటే.. అలా అడగడానికి ఎంత ధైర్యం అన్నట్లు నిర్మాతల వైపు గుర్రుగా చూస్తున్నారట కంగనా. ఏం చేస్తాం? అంతా మార్కెట్ మహిమ అని నిర్మాతలు చెప్పుకుంటున్నారని భోగట్టా. చివరికి కంగనా అడిగినంత ఇవ్వడానికి సిద్ధపడుతున్నారట. -
కామన్ క్వీన్
‘క్వీన్’ సినిమాలో కంగనా రనౌత్ క్వీన్ కాదు. కానీ సినిమాల్లోకి రాకముందు, సినిమాల్లోకి వచ్చాకా ఆమె క్వీనే. కంగనా... రాజపుత్రుల వంశంలో ఒక రాజపుత్రిక. అక్కణ్ణుంచి ఒక మామూలు అమ్మాయిగా సినిమాల్లోకి వచ్చింది. బాలీవుడ్లో ఇప్పుడు కొత్తగా వెలిగిపోతున్న క్వీన్ అయింది. అయినా మామూలు అమ్మాయిగానే కనిపిస్తుంది. అందుకే కంగనా రనౌత్ ఒక సాధారణ మహారాణి. కామన్ క్వీన్. 2014. వేసవి. ‘క్వీన్’ రిలీజ్ అయ్యింది. చిన్న బడ్జెట్‌తో దర్శకుడు అనురాగ్ కశ్యప్ తీసిన సినిమా. కథాంశం: పెళ్లి ఆగిపోయి తీవ్ర నిస్పృహల్లోకి వెళ్లిన ఒక అమ్మాయి ఆ డిప్రెషన్ నుంచి బయటపడటానికి ఒక్కత్తే హనీమూన్‌కు యూరప్ వెళ్లడం. కన్నీరు మున్నీరు అవుతూ విమానం ఎక్కిన ఆ అమ్మాయి కొత్త స్నేహాలు, పరిచయాలు, ప్రపంచాలు చూసి ఆత్మవిశ్వాసం తెచ్చుకుని, జీవితాన్ని ఎదుర్కొనడం తెలుసుకొని, ఎవడైతే కాదన్నాడో వాడు ఆమె ముందు తనను తాను మరుగుజ్జుగా భావించేంతగా ఎదుగుతుంది. కథ గొప్పదే. కాని తెరకెక్కించడానికి డబ్బులే లేవు. అప్పుడొక లక్ష, అక్కడొక లక్ష దొరికినప్పుడే షూటింగ్ చేశారు. ప్రతి క్షణం సినిమా ఆగిపోతుందేమోనన్న భయం. కాని ప్రతి సందర్భంలోనూ కంగనా ఉందన్న ధైర్యం. తను ఉంటే ఎనర్జీ. మరేం పర్వాలేదనే ధైర్యం. తనే యూనిట్‌ని డ్రైవ్ చేస్తుంది. షెడ్యూల్స్ వేస్తుంది. అంతెందుకు, కొన్ని సీన్లకు స్క్రిప్ట్, డైలాగ్స్ కూడా రాసి డెరైక్టర్ చేతికిచ్చింది. ఇది ఆమె ప్రోడక్ట్. రిలీజ్ మీద భవిష్యత్తు అంతా ఆధారపడి ఉంది. అలాంటి ‘క్వీన్’ రిలీజయ్యింది. మొదటి రోజు నుంచే మీడియాలో రేటింగ్స్. హిట్ సూపర్ హిట్... అంటూ ప్రశంసలు. కొత్త ప్రొడ్యూసర్ల ఆఫర్లు. 100 కోట్ల కలెక్షన్లు. కంగనా ఫోన్‌కు ఊపిరే సలపడం లేదు. కాని అంతటి రద్దీలోనూ కంగనా ఒక ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంది. అది రాలేదు. సంవత్సరం గడిచిపోయింది. 2015, వేసవి.నేషనల్ అవార్డ్స్ ప్రకటన వెలువడింది. కంగనా జాతీయ ఉత్తమ నటి. ‘క్వీన్’లో ఆమె నటన చూసి యునానిమస్‌గా ఓటేసిన జ్యూరీ. మళ్లీ కంగనాకు ఫోన్ల వరద. అన్ని ఫోన్లను కంగనా ఆన్సర్ చేస్తూ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన నంబర్‌కు ఆమె గుండె గబగబా కొట్టుకుంది. తాను ఎదురు చూస్తున్న ఫోన్ అదే. ఆన్సర్ బటన్ నొక్కి ‘నాన్నా’.. అంది. అవతల వైపు ఏం మాట లేదు. బహుశా ఆయన కంఠం రుద్ధమై ఉండాలి. చాలా ప్రయత్నం మీద గొంతు పెగిలింది. ‘సాధించావమ్మా’.అంతే. కంగనా తన చేతిలో ఉన్న ఫోన్ పక్కన పడేసి సోఫాలో కూలబడి రెండు చేతులనూ ముఖానికి కప్పుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. 2003. వేసవి. సెలవులకు కంగనా చండీగఢ్ నుంచి హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న తన సొంత ఊరు భామ్బ్లా వచ్చింది. అప్పటికే ఇంటర్ పరీక్షల రిజల్ట్స్ వచ్చాయి. తాను కెమిస్ట్రీ తప్పింది. అది తండ్రికి పెద్ద వార్త కాదు. ఏదో నాలుగు ముక్కలు చదివించి పెళ్లి చేద్దామని ఆయన ఉద్దేశం. కాని కంగనా చదువు మానేసి సినిమాల్లో చేరదల్చుకుంది. ఇది మాత్రం పిడుగు. అసలే వాళ్లు కొండ ప్రాంతం వాళ్లు. సిమ్లాలో తప్ప ఎక్కడా సినిమా థియేటర్ కూడా చూసి ఎరగరు. అలాంటిది తన కూతురు వెళ్లి సినిమాల్లో చేరుతుందా? తండ్రి మాత్రమే కాదు, అన్న, చుట్టుపక్కల బంధువులు అందరూ పోగయ్యారు. ఇప్పుడు కంగనా నిర్ణయం మీద మొత్తం సమూహపు గౌరవమే ఆధారపడి ఉంది. ఎందుకంటే వాళ్లు రాజపుత్రులు. ‘రాణులు, మహరాణులు ఉన్న క్షత్రియజాతి మనది. ఈ జాతి నుంచి వెళ్లి నువ్వు తెర మీద తైతక్కలాడతావా’ ఎవరో అన్నారు. ‘ఆడతాను’ ‘నోర్ముయ్’ తండ్రి గద్దించాడు. ఆ వెంటనే ఆమె చెంప ఛెళ్లుమంది. తండ్రిలో ప్రవహిస్తోంది క్షత్రియ రక్తం అయినప్పుడు కూతురిలో పరుగులెత్తేది క్షత్రియ రక్తం కాదా? కంగనా ఒక్క నిమిషం కూడా ఆగకుండా బ్యాగ్ సర్దుకుంది. ‘నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నాను’ ప్రకటించింది. గడప దాటుతూ తండ్రి వైపు చూసి అంది- ‘మనలో రాణులు మహరాణులు ఇప్పుడు లేరు. పోయారు. వెండితెర మీద నేనే కాబోయే మహరాణిని. నన్ను చూసి మీరు గర్వపడేరోజు త్వరలోనే వస్తుంది’...బంధువులు ఎగతాళిగా నవ్వారు.తండ్రి ఆమెకు ఇంటి గడప వైపు దారి చూపించాడు. అదంతా గుర్తుకు వచ్చి కంగనా ఏడ్చింది. ఇంతకాలం రచ్చ గెలిచింది. అది విజయం కాదు. ఇప్పుడు ఇంట గెలిచింది. అదే అసలైన విజయం. కాని అది అంత సులభంగా రాలేదు. ఆ సంవత్సరమే. అదే వేసవి. కంగనా ఢిల్లీ వచ్చింది. ఏం చేయాలో తెలియదు. ఎలా బతకాలో తెలియదు. యాక్టర్ అవ్వాలంటే ఎవరిని కలవాలో తెలియదు. అందుకని అక్కడ చురుగ్గా పని చేస్తున్న ‘అస్మిత’ అనే థియేటర్ గ్రూప్‌లో జాయిన్ అయ్యింది. దాని స్థాపకుడు అరవింద్ గౌర్ చాలా పెద్ద థియేటర్ పర్సనాలిటీ. కంగనాను చూసి అతడు ఒకటే ప్రశ్న అడిగాడు- నీకు యాక్టింగ్ గురించి ఏం తెలుసు? దానికి కంగనా జవాబు: ఏమీ తెలియదు. కాని నేను బ్లాటింగ్ పేపర్లాంటిదాన్ని. మీరు ఏది చూపించినా లాగేస్తాను. సరిగ్గా ఒక సంవత్సరానికి మించి కంగనా ఢిల్లీలో ఉండలేదు. పదిహేడేళ్ల అగ్గిబరాటా లాంటి అమ్మాయి. ముంబైని తగలెట్టడానికి బయలుదేరింది. 2006. వేసవి. కంగనా నటించిన తొలి సినిమా- గ్యాంగ్‌స్టర్ విడుదలయ్యింది. మహేష్‌భట్ ప్రొడ్యూసర్‌గా లాంచ్ చేస్తున్న హీరోయిన్. వేల మందిని ఆడిషన్లో ఫెయిల్ చేసి డెరైక్టర్ అనురాగ్ బాసు సెలెక్ట్ చేసుకున్న హీరోయిన్. కాని మొదటి అడుగు అలా పడాల్సింది లేదా అంత బలంగా పడాల్సింది కాదు. స్క్రీన్ మీద ఆల్కహాలిక్‌గా గతంలో మీనాకుమారి వంటి అతి తక్కువ మందే మార్కులు కొట్టేశారు. కాని తాగుబోతు స్త్రీగా కంగనా చూపించిన నటన అందరికీ అద్భుతంగా అనిపించింది. ఒక మార్కు పడితే అదే మార్కు వెంటపడుతుంది. లైఫ్ ఇన్ ఏ మెట్రో, ఫ్యాషన్... రెండూ హిట్ సినిమాలే. కాని కంగనా చేసింది మాత్రం నెగెటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్లు. డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్... ఇలాంటి క్యారెక్టర్ ఉన్న పాత్రల కోసం అందరూ కంగనాను అడగడం మొదలుపెట్టారు. అసలు నిజ జీవితంలో కూడా కంగనా అలాంటి అమ్మాయే అని బయట ప్రచారం. అంతా మబ్బుమబ్బుగా అనిపిస్తోంది. మూసుకు వస్తున్నట్టుగా భయమేస్తోంది. మళ్లీ వేసవి రావాలి. వచ్చింది. 2011. మరో వారంలో వేసవి మొదలవుతుంది. ‘తను వెడ్స్ మను’ రిలీజ్ అయ్యింది. ఆనంద్ రాయ్ అనే కుర్రాడు ఉత్తరప్రదేశ్ లైఫ్‌ని, అక్కడి మిడిల్‌క్లాస్ పెళ్లిళ్లని రియలిస్టిక్‌గా చూపించిన సినిమా. ఏమీ తెలియకపోయినా అన్నీ తెలుసు అనుకుంటూ దాదాపు జీవితం నాశనం చేసుకోబోయిన ఆరిందా అమ్మాయి పాత్రలో కంగనా నటన ఆమెలో ఉన్న డిప్రెసివ్ కోణాన్ని శాశ్వతంగా తుడిచి పెట్టేసింది. మరో రెండేళ్లకు వచ్చిన క్రిష్ 3- కంగనా సైఫై క్యారెక్టర్లు కూడా ఎంత బాగా చేయగలదో చూపించింది. క్వీన్ ఆమె స్థాయిని స్థిర పరిచింది. దాదాపు శిఖరం చేరినట్టే. కాని అక్కడ నిలబడే సత్తా ఆమెలో ఉందా లేదా అనే సందేహాన్ని తీరుస్తూ 2015 వేసవి ఆమె కోసం ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ తీసుకొచ్చింది. గతంలో హేమమాలిని, శ్రీదేవి డ్యూయెల్ రోల్స్ చేసి మెప్పించారు. ఇంకెవ్వరికీ అది సాధ్యం కాలేదు. కంగనా ఈ సినిమాలో దానిని నమ్మశక్యం కాని రీతిలో చూపించింది. గృహిణిగా ఒకపాత్ర, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం తెచ్చుకున్న హర్యానా అమ్మాయిగా మరో పాత్ర.... ఒకే తెర మీద ఒకే సమయంలో ఇద్దరు వేరు వేరు వ్యక్తులు చేస్తున్నట్టుగా భ్రాంతి కలిగించింది. కలెక్షన్లు మోగిపోయాయి. మూడు వారాల్లో వందకోట్లు. కంగనా- ఇవాళ వెండితెర క్వీన్. అయితే అది వారసత్వంగా వచ్చిన సింహాసనం కాదు. ప్రేక్షకులు ప్రేమగా ఇచ్చిన సింహాసనం. తమను మెప్పించినందుకు కృతజ్ఞతగా ఇచ్చిన సింహాసనం. బహుశా- ఇప్పట్లో దానికి ఎండ తగలనట్టే. - సాక్షి ఫీచర్స్ ప్రతినిధి కంగనా ఉత్త నటి మాత్రమే కాదు. ఇవాళ ఆమె మాటకు ఒక విలువ ఉంది. సామాజిక పరిణామాల మీద, ధోరణుల మీద, వేళ్లూనుకున్న వ్యవస్థల మీద, ముఖ్యంగా స్త్రీల పట్ల ఉన్న చిన్నచూపు మీద ఆమె చేసే వ్యాఖ్యలను జాగ్రత్తగా వినేవాళ్లు ఉన్నారు. కొత్తతరం ఆమెను స్ఫూర్తిగా తీసుకుంటోంది. పాతతరం ఆమెతో కలిసి పని చేయాలనుకుంటోంది. ‘నిన్ను నువ్వు నమ్ము’ అనే సూత్రానికి దక్కిన విజయం ఇది. -
అంత కసి ఎందుకు కంగనా?!
గాసిప్ కంగనా రనౌత్ అంటే గ్లామర్ స్టార్ అనేవారు మొదట్లో. కానీ ఇప్పుడు పర్ఫార్మెన్స్ క్వీన్ అంటున్నారు. ఫ్యాషన్, తను వెడ్స్ మను, క్వీన్ లాంటి చిత్రాలతో నటిగా తన విశ్వరూపాన్ని ప్రదర్శించి జాతీయ అవార్డును సైతం అందుకుంది కంగనా. అయితే అందుకు సంతోషపడాల్సింది పోయి... అనవసరంగా పాత విషయాలన్నీ తవ్వుతోంది. ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకున్న నాటి నుంచి ప్రతి ఇంటర్వ్యూలోనూ తనను చాలామంది ఎదగనివ్వలేదని, అయినా కష్టపడి ఎదిగానని చెప్పుకుంటోంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అయితే... నన్ను వెన్నుపోటు పొడవాలని చూసినవాళ్లు, వెనక్కి లాగాలని చూసినవాళ్లు అంటూ ఇండస్ట్రీలోని కొన్ని పెద్ద తలకాయలను టార్గెట్ చేసి మాట్లాడింది. దాంతో ఆ పెద్దలు రుసరుసలాడుతున్నారని సమాచారం. ఇక్కడ నటించడం తెలిస్తే చాలదు, ప్రవర్తించడం కూడా తెలియాలి అని కొందరు కంగనాకి సలహా కూడా ఇస్తున్నారట. కంగనా ఆ సలహాను పాటిస్తుందో లేదో మరి! -
నన్ను నాశనం చేయడానికి డబ్బు ఖర్చుపెట్టారు!
‘‘ఇప్పుడందరూ నన్ను ‘క్వీన్’ కంగనా అంటున్నారు. పొగడ్తలూ పూలదండలూ విరజిమ్ముతున్నారు. కానీ, నేను సినిమాల్లోకొచ్చిన కొత్తలో చాలామంది నన్ను పలకరించడానికి కూడా ఇష్టపడేవాళ్లు కాదు. ఎందుకంటే, హిమాచల్ ప్రదేశ్ వంటి చిన్న టౌన్ నుంచి వచ్చానని నన్ను చిన్న చూపు చూసేవాళ్లు. సినిమా పరిశ్రమకు సంబంధం లేనివాళ్లు ఇక్కడ నిలదొక్కుకోవడం చాలా కష్టం. బయటివాళ్లను తొక్కేయాలనుకుంటారు. నన్ను నాశనం చేయడానికి చాలామంది డబ్బు ఖర్చుపెట్టడానికి కూడా వెనకాడలేదు. దానికోసం ఎంతో సమయం కూడా కేటాయించారు. కానీ, ఒకరి ఎదుగుదలను ఎవరూ ఆపలేరు. వాస్తవానికి నా మీద కుట్రలు జరుగుతున్నాయని గ్రహించే వయసు, అనుభవం ఉండేది కాదు. నా పదహేడవ ఏట సినిమాల్లోకొచ్చాను. ఆ వయసులో ఎవరు తప్పు? ఎవరు సరి అని ఎలా తెలుస్తుంది? తప్పుడు వ్యక్తులెవరో తెలుసుకుని, వాళ్లకు దూరంగా ఉండటానికి నాకు చాలా సమయం పట్టింది. మనుషుల మనస్తత్వాలను గ్రహించేంత నేర్పు వచ్చేసింది. ఇప్పుడు నన్నెవరూ తప్పుదారి పట్టించలేరు. ఆ మాటకొస్తే ఏమీ చేయలేరు.’’ - కంగనా రనౌత్ -
దక్షిణాది చిత్రాలకు నో
టీనగర్: జాతీయ అవార్డు తర్వాత తమిళ చిత్రావకాశాలు అధికంగా వస్తున్నాయని నటి కంగనా రణావత్ తెలిపారు. ఫ్యాషన్, క్వీన్ అనే రెండు చిత్రాలకు వరుసగా జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న ప్రముఖ నటి కంగనా రణావత్. ‘దామ్ధూం’ చిత్రం లో జయంరవికి జంటగా నటించారు. ఆ తర్వాత ఆమెకు చిత్రావకాశాలు లభించలేదు. ‘క్వీన్’ చిత్రం జాతీయ అవార్డు పొందిన తర్వాత అనేక తమిళ చిత్ర అవకాశాలు వస్తున్నట్లు కంగ నా రణావత్ తెలిపారు. తెలుగు చిత్రరంగం నుంచి కూడా అనేక అవకాశాలు వ స్తున్నట్లు తెలిపారు. అన్నీ కథానాయకి ప్రాముఖ్యత కలిగిన చిత్రాలయినప్పటికీ కంగనా రణావత్ ఇంతవరకు దక్షిణ భారత చిత్రాలను ఒప్పుకోనట్లు సమాచారం. -
వరించి వచ్చిన పాత్ర
హిందీ రంగంలో ఇప్పుడు నటనకు అవకాశమున్న పాత్రలంటే చాలామంది దర్శక, నిర్మాతలు కంగనా రనౌత్‌ని ఎంపిక చేసుకుంటున్నారు. ‘తను వెడ్స్ మను, క్వీన్, రజ్జో’ చిత్రాల్లో కంగన ప్రదర్శించిన అభినయం అలాంటిది. ‘క్వీన్’లో నటనకు తాజాగా జాతీయ అవార్డునూ ఆమె అందుకున్నారు. అందుకు తగ్గట్లే తాజా అవకాశాల్లో అందాల అభినేత్రి మీనాకుమారి జీవితం ఆధారంగా రూపొందనున్న చిత్రం ఒకటి. ఈ చిత్రానికి తిగ్మాంషు ధూలియా దర్శకత్వం వహించనున్నారు. మీనాకుమారి పాత్రకు ముందు విద్యాబాలన్‌ను తీసుకోవాలనుకున్నారనే వార్త వినిపించింది. ఆ తర్వాత దీపికా పదుకొనే పేరు కూడా ప్రచారంలోకొచ్చింది. చివరికి ఈ అవకాశం కంగనాను వరించింది. ఈ విషయాన్ని స్వయంగా కంగనానే ధ్రువీకరించారు. ‘‘మీనాకుమారి జీవితం ఆధారంగా రూపొందనున్న చిత్రంలో టైటిల్ రోల్ చేయనున్నా. అయితే ఆ చిత్రం ఇప్పుడే ఆరంభం కాదు. ఎందుకంటే ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నా. అవి పూర్తయ్యేసరికి మరో ఏడాది పడుతుంది. అందుకని మీనాకుమారి చిత్రం వచ్చే ఏడాది వేసవి తర్వాతే మొదలవుతుంది’’ అని కంగన పేర్కొన్నారు. ఈలోపు మీనాకుమారి జీవితం గురించి పూర్తిగా తెలుసు కోవాలనుకుంటున్నారామె. -
ట్రావెల్ క్వీన్స్
ప్రయాణం.. పుస్తకాన్ని మించి జ్ఞానాన్ని పంచుతుంది. జీవితాన్ని చదవడంలో ప్రయాణం కూడా ఓ చాప్టరే. ఇక, సోలో జర్నీ అయితే నీలోకి నిన్ను తీసుకెళ్తుంది. మనసుకి రెక్కలు కట్టి ప్రకృతి రాజ్యానికి క్వీన్‌ను చేస్తుంది!. అందుకే ప్రయాణానికి మజిలీలే కాని లక్ష్యం ఉండకూడదంటారు!. ఆ లస్ట్ని శ్వాసిస్తున్న భాగ్యవంతుల్లో మన భాగ్యనగర మహిళలూ ఉన్నారు!!. కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా, ఇండియాలో ఈస్ట్ టు వెస్ట్‌కి వరల్డ్‌లో హాయిగా విహరిస్తున్న ఆ క్వీన్స్ పరిచయం.. ..:: సరస్వతి రమ సోలో ఉమన్ ట్రావెలర్‌కు మెట్రో కల్చర్ ఇప్పుడిస్తున్న పర్యాయపదం.. క్వీన్! కారణం.. బాలీవుడ్ ‘క్వీన్’ మూవీ. పెళ్లిరోజు పెళ్లికూతురికి పెళ్లికొడుకు ‘నీకు, నాకు సరిపడదు’ అని షాక్ ఇస్తాడు. బ్యాండ్, బాజా, బారాత్ ఆగిపోతాయ్. కానీ పెళ్లికూతురు అక్కడే ఆగిపోదు.. లండన్‌కు సాగిపోతుంది మొండిగా.. సోలో హానీమూన్ కోసం! ఆత్మవిశ్వాసంతో తిరిగొస్తుంది. ఇదీ ఆ సినిమా లైన్. ‘సోలో ఉమన్ ట్రావెలింగ్’ అనే ఈ లైనే ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టొస్తున్న మహిళలను మహారాణుల్ని చేస్తోంది. ఈ అడ్వంచర్, సెల్ఫ్‌కాన్ఫిడెన్స్ జర్నీ నగరంలోనూ టేకాఫ్ అవుతోంది. హైదరాబాద్ వాండరర్స్‌లో గరిమెళ్ల గౌరి, అనూషా తివారి ఉన్నారు. సింగిల్ జర్నీలో ఉన్న మజా.. ప్రయాణం వీళ్లకు ప్రహసనం కాదు.. ఉల్లాసం, ఉత్సాహం. గరిమెళ్ల గౌరి వారం కిందటే రాజస్థాన్‌లోని బార్మేర్కి వెళ్లారు కేర్ఇండియాలో ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా కొలువులో చేరడానికి. తన సోలో ట్రావెల్ హాబీ గురించి చెప్తూ ‘నేను డిగ్రీ నాటి నుంచే సోలో ట్రావెల్ చేస్తున్నాను. బేసిగ్గా నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. కొత్త ప్రదేశాలు చూడటం, కొత్తవాళ్లతో పరిచయాలు, భిన్న సంస్కృతుల అధ్యయనం అంటే పిచ్చి. నా ఫస్ట్ సోలో జర్నీ డిగ్రీ సెకండియర్‌లో ఉన్నప్పుడు హైదరాబాద్ టు షిరిడీ. ఫ్యామిలీతో వెళ్లాల్సిన నేను ఏవో అవాంతరాల వల్ల ఒక్కదానినే మొండిగా షిరిడీ ప్రయాణమై.. హ్యాపీగా తిరిగొచ్చాను. ఆ జర్నీ నాకు బోలెడంత కాన్ఫిడెన్స్ ఇచ్చింది’ అని గతాన్ని గుర్తుచేసుకున్నారు గౌరి. ఒంటరి ప్రయాణంలో మజా తెలిశాక నా ప్రయాణాల పరంపర ఆగలేదు. పీజీలో ఉండగా సౌతిండియా టూర్ మొత్తం ఒంటరిగానే చేశాను. ఇది ఎండాఫ్ నైంటీస్ విషయం. అప్పట్లో ఇన్ని ట్రావెల్ ఏజెన్సీలు లేవు. ఫ్లయిట్ జ ర్నీ లగ్జరీగానే ఉండేది. ఇప్పటికీ ఒకరోజు హాలిడే దొరికినా, రొటీన్ వర్క్ నుంచి బ్రేక్ కావాలనుకున్నా నచ్చినప్లేస్కి వెళ్లిపోతాను. వెళ్లేటప్పుడు కొన్ని సేఫ్టీ మెథడ్స్ తీసుకుంటాను. నా బడ్జెట్లో హోటల్‌ను బుక్ చేసుకుంటాను. ఆ ఏరియా పోలీస్ స్టేషన్ నెంబర్లు, ఇతర అధికారుల నంబర్లు తీసుకుంటాను. ఫ్యామిలీతో టచ్‌లో ఉంటాను. కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా, ఇటు వెస్ట్ టు ఈస్ట్ ఇప్పటి దాకా కనీసం నాలుగుసార్లయినా టూర్ చేసి ఉంటాను. ఈ జర్నీలో ఎన్నో ఎక్స్‌పీరియెన్స్.. వెంట ఎవరూ ఉండరు కాబట్టి నాపై ఎవరో అటెన్షన్ పే చేస్తున్నారనే భావన ఉండదు. ఇప్పుడు మా అక్కయ్య పిల్లలూ నాలా సోలో ట్రిప్స్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సమ్మర్లో యూరప్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నాను’ అన్నారు గౌరి. జర్నీ టు కాన్ఫిడెన్స్ అనూషా తివారి.. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పట్టభద్రురాలు. తర్వాత ఏంబీఏ చేసి ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తోంది. తన సోలో జర్నీ అభిరుచిని అభివర్ణిస్తూ ‘ఇంజనీరింగ్ తరువాత సడెన్‌గా డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. ఒంటరిగా లాంగ్ జర్నీ చేయాలనిపించేది. అప్పుడే ఎమ్మెస్ కోసం యూఎస్ వెళ్లిన నా ఫ్రెండ్‌కి మెయిల్ పెట్టాను నా పరిస్థితి గురించి. ఆమె తన అంకుల్ వాళ్ల ద్వారా నాకు టూరిస్ట్ వీసా వచ్చేలా హెల్ప్ చేసింది. ఇంట్లో వద్దన్నా వినకుండా యూఎస్ వెళ్లాను. పేరుకే ఫ్రెండ్ దగ్గర అకామిడేషన్ కానీ దాదాపు ఫార్టీ డేస్ ఒక్కదాన్నే న్యూయార్క్, న్యూజెర్సీ, లాస్‌వెగాస్, బోస్టన్, నయాగరా, గ్రాండ్కెన్యన్, ఆరిజోనా, ఫ్లోరిడా.. వంటి ప్లేసెస్‌కి వెళ్లాను. కొత్త మనుషులు, కొత్త విషయాలు నా పర్సెప్షన్‌ను మార్చేశాయి. లైఫ్‌పై ఇంట్రెస్ట్ పెరిగింది. సోలో జర్నీ అప్పట్నుంచి హాబీ అయింది. సిటీకొచ్చాక ఆరు నెలలు ఇండియాలో డిఫరెంట్ ప్లేసెస్‌కి వెళ్లాను. వారం రోజులున్నా అక్కడ ఏదో ఒక జాబ్ చేసేదాన్ని. ఆ చిన్న, షార్ట్‌టైమ్ ఉద్యోగాలు నాలో కాన్ఫిడెన్స్ పెంచాయి. శ్రమ విలువను తెలిపాయి. ఆ సిక్స్ మంత్స్ పీరియడ్ నాకు చాలా క్రూషియల్. తిరిగొచ్చాకే ఎంబీఏ చేశాను. మంచి జాబ్ సంపాదించుకున్నాను. ఇప్పుడు టెక్సాస్‌లో బీఎండబ్ల్యూ కంపెనీలో జాబ్ వచ్చింది. వచ్చే నెల వెళ్తున్నా. అయిదేళ్లుగా ప్రతి ట్రిప్‌ని సోలోగానే ఎంజాయ్ చేస్తున్నా. లాస్ట్ సమ్మర్ స్విట్జర్లాండ్ వెళ్లా. అబ్రాడ్‌లో సేఫ్టీ కూడా ఎక్కువ. నాకు స్విట్జర్లాండ్, అరిజోనా బాగా నచ్చే ప్లేసెస్. ఐ లవ్ టు బీ దేర్.. ఆరిజోనాను అందరూ ఎడారి అంటారు కానీ ఆసమ్ ప్లేస్. ఆ దారి ఎప్పుడు మొదలవుతుందో.. ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు. అంతలా ఆ నేచర్‌లో ఇన్వాల్వ్ అవుతాం’ అంటుంది అనూషా తివారి. సెర్చ్ అండ్ గైడ్.. ‘ఈ రోజుల్లో చాలా సమాచారం ఇంటర్నెట్లో దొరుకుతుంది. అందువల్ల ఆ ప్రాంతం, అక్కడి పరిస్థితులు, తిండి గురించి ముందే తెలుసుకోవచ్చు. అందుకే వెళ్లే ముందు రీసెర్చ్ చెయ్యాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్లాక మన ఇన్స్టింక్ట్ మనని గైడ్ చేస్తూనే ఉంటుంది. అవసరమైన చోట ఆ ప్రాంతం వాళ్ల హెల్ప్ తీసుకోవాలి’ అని చెబుతున్నారు 50 దేశాలు చుట్టొచ్చిన ప్రముఖ సోలో ట్రావెలర్ అంశుగుప్త. ప్రతి ప్రయాణం నూతనం.. క్వీన్ సినిమా ముంబైలో చూసిన ఒక మిత్రుడు ‘నువ్వూ, నీ కథలో అమ్మాయిలు గుర్తొచ్చారు’ అని ఫోన్లో చెప్పినప్పుడు, ఆ కథని చెప్పమని అడిగితే అతను చెప్పారు. థ్రిల్డ్. తర్వాత క్వీన్ చూసి సంబరపడి ఫేస్బుక్లో పోస్ట్ చేశాను. కంగనాని అనుపమా చోప్రా చేసిన ఇంటర్వ్యూ చూశాను. జీవితంలో మనం ఎన్నో ప్రయాణాలు చేస్తాం. అనేక పాత్ర ల్లో ప్రయాణిస్తాం. నాకు గుర్తున్నంత వరకు పదమూడేళ్లప్పుడు ఒక్కదాన్నే చేసిన మొదటి ప్రయాణం గోదావరిపై పడవలో ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి చేరుకుని, లంకలోకి వెళ్లటం, లంకలో ఒక్కదాన్నే తిరగటం పూర్తిగా సరికొత్త అనుభవం. ఆ తర్వాత ఒంటరిగా నా 19వ ఏట ముంబైకి వెళ్లాను. ఆ ప్రయాణం ఎన్నడూ మరువలేను. ఒంటరి ప్రయాణాలెన్నో చేశాను. ఈ పయనంలో ఎదురైన రకరకాల మనుషులు, పచ్చని ప్రకృతి నాలో ఉత్తేజాన్ని నింపుతాయి. ప్రతి జర్నీ నూతన జీవన సౌందర్యాన్ని పరిచయం చేస్తుంది. - కుప్పిలి పద్మ, రచయిత్రి -
అద్వితీయ నటనకు రెండోసారి గుర్తింపు
ఉత్తమ నటి - కంగనా రనౌత్ (హిందీ చిత్రం ‘క్వీన్’) ‘క్వీన్’ చిత్రం ద్వారా జాతీయస్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షించిన కంగనా రనౌత్ మరోసారి దేశమంతటా వార్తల్లో నిలిచారు. వికాస్ బహ్ల్ దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రంలో రాజౌరీ ప్రాంతానికి చెందిన రాణిగా ఆమె చేసిన అభినయం తాజాగా జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. కంగనా రనౌత్‌కు జాతీయ అవార్డు రావడం ఇది రెండోసారి. మధుర్ భండార్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఫ్యాషన్’ (2008) చిత్రంలో మాదక ద్రవ్యాలకు బానిసైన మోడల్‌గా చూపిన అభినయానికి గతంలో ఆమె ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డును గెల్చుకున్నారు. ఇప్పుడు ‘క్వీన్’తో ఏకంగా ఉత్తమ నటి కిరీటం అందుకోనున్నారు. సర్వసాధారణంగా హిందీ సినీ అవార్డు షోలకు హాజరయ్యే అలవాటు లేని కంగన ఈ సారి జాతీయ అవార్డు రేసులో తాను ఉన్న సంగతే తెలియదన్నారు. ఈ ఏడాది ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు వచ్చినా, పురస్కారం అందుకోవడానికి వెళ్ళని ఆమె జాతీయ అవార్డును తీసుకోవడానికి వ్యక్తిగతంగా హాజరవుతానన్నారు. -
ముగ్గురు రాణులు..
మనసును హత్తుకున్న మహిళా ప్రధాన చిత్రాలు.. కీలక సమస్యల్ని చర్చించిన సినిమాలకు పెద్దపీట వేస్తూ మంగళవారం కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉత్తమ సినీ అవార్డులను ప్రకటించింది. ఫీచర్, నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగాలు కలిపి మొత్తం 60కి పైగా కేటగిరీల్లో పలువురికి ఉత్తమ అవార్డులు దక్కాయి. జాతీయ ఉత్తమ చిత్రంగా మరాఠీ చిత్రం కోర్ట్ నిలిచింది. 'క్వీన్' సినిమాలో అధ్బుతన నటనను ప్రదర్శించిన కంగనా రనౌత్ ఉత్తమ నటిగా ఎంపికవ్వగా, ప్రియాంకా చోప్రా నటించిన 'మేరీకోమ్' బెస్ట్ ఎంటర్ టైనర్ గా నిలిచింది. టాలీవుడ్ నటి మంచులక్ష్మి నటించిన' చందమామ కథలు' ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా అవార్డు పొందింది. 'నాన్ అవనాల్ అవలు' చిత్రానికిగానూ కన్నడ నటుడు విజయ్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్నాడు. మే 3న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విజేతలకు అవార్డులు ప్రదానం చేస్తారు. అవార్డుల వివరాలు జాతీయ ఉత్తమ చిత్రం- కోర్ట్ (మరాఠి) జాతీయ ఉత్తమ నటి- కంగనా రనౌత్ (క్వీన్) జాతీయ ఉత్తమ నటుడు- విజయ్ (కన్నడ) ఉత్తమ దర్శకుడు- శ్రీజిత్ ముఖర్జీ (బెంగాలీ చిత్రం- ఛొటుష్కొనే) ఉత్తమ సహాయ నటి- బల్జిందర్ కౌర్ (హర్యాన్వీ చిత్రం పగ్డీకి గాను) ఉత్తమ సహాయ నటుడు- బాబీ సింహా (తమిళ చిత్రం జిగర్తండా) జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం- మేరీకోమ్ ఉత్తమ సంగీత దర్శకుడు- విశాల్ భరద్వాజ్ (హైదర్) ఉత్తమ నేపథ్య గాయని- ఉత్తరా ఉన్నికృష్ణన్ (తమిళ చిత్రం- శైవం) ఉత్తమ గాయకుడు- సుఖ్వీందర్ సింగ్ (హిందీ చిత్రం హైదర్) ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్- డోలీ అహ్లువాలియా (హైదర్) ఉత్తమ పర్యావరణహిత చిత్రం- ఒత్తాళ్ (మళయాళం) ఇందిరా గాంధీ అవార్డ్ ఫర్ డెబ్యూ ఫిల్మ్ ఆఫ్ డైరెక్టర్- ఆశా జావోర్ మఝే (బెంగాలీ) ఉత్తమ పరిశోథనాత్మక చిత్రం- ఫుమ్ షంగ్ ఉత్తమ యానిమేషన్ చిత్రం- సౌండ్ ఆఫ్ జాయ్ ఉత్తమ సినీ రచన- సైలెంట్ సినిమా:1895-1930 (రచయిత- పసుపులేటి పూర్ణచందర్ రావు) ఉత్తమ సినీ విమర్శకుడు- తనుల్ ఠాకూర్ ప్రత్యేక విభాగంలో అవార్డు సాధించిన సినిమాలు భూత్నాథ్ రిటర్న్స్ ( హిందీ) అయిన్ (మళయాలం) నచోమ్ ఐఏ కుంపసర్ (కొంకణి) ఖిల్లా- (మరాఠి) ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రాలు చందమామ కథలు (తెలుగు) నిర్భాషితో (బెంగాలి) ఒథెల్లో (అస్సామీ) నచోమ్ ఐఏ కుమపసర్ (కొంకణి) ఆదిమ్ విచార్ (ఒడియా) ఖిల్లా (మరాఠి) ఆయిన్ (మళయాలి) కుత్రం కడిత్తల్ (తమిళ్) పంజాబ్ 1984 (పంజాబీ) పగ్డీ (హర్యాన్వీ) -
క్వీన్ రీమేక్‌లో నిత్యామీనన్
-
ఫిల్మ్‌ఫేర్ అవార్డులు : క్వీన్.. నిజంగానే క్వీన్!
ముంబై: సినీ పరిశ్రమలో జాతీయ అవార్డుల తర్వాత ఆ స్థాయి పేరున్న అవార్డులు.. ఫిల్మ్‌ఫేర్ అవార్డులు. దక్షిణ భారతదేశ చిత్రాలకు, బాలీవుడ్ చిత్రాలకు వేర్వేరుగా ప్రకటించే ఈ అవార్డుల్లో.. బాలీవుడ్‌కు సంబంధించి, 2014లో విడుదలైన సినిమాలకు గానూ అవార్డులను ప్రదానం చేశారు. ఈ అవార్డుల్లో విమర్శకుల ప్రశంసల పరంగానూ, బాక్సాఫీస్ పరంగానూ ఘన విజయం సాధించిన 'క్వీన్', 'హైదర్' సినిమాలు సత్తా చాటాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి విభాగాల్లో అవార్డులతో పాటు మొత్తం 6 అవార్డులను సొంతం చేసుకొని, క్వీన్ నిజంగానే క్వీన్‌గా నిలబడింది. ఇక హైదర్ విషయానికి వస్తే.. ఉత్తమ నటుడి విభాగంలో అవార్డుతో పాటు మొత్తం 5 అవార్డులను సొంతం చేసుకుందీ సినిమా. ఆమీర్ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణీల తాజా సంచలనం పీకే.. ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ సంభాషణల విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకొంది. ఇక గతేడాది విడుదలైన చెప్పుకోదగ్గ సినిమాల్లో మొదటి వరుసలో ఉన్న హైవే సినిమాకు గానూ, ఆలియాభట్, ఉత్తమ నటి (క్రిటిక్స్ క్యాటగిరీ) అవార్డును సొంతం చేసుకున్నారు. అలనాటి మేటి నటి కామిని కౌషల్.. జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. ముంబైలో అంగరంగ వైభవంగా సాగిన 60వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వివరాలిలా ఉన్నాయి... ఉత్తమ చిత్రం : క్వీన్ ఉత్తమ దర్శకుడు : వికాస్ భాల్ (క్వీన్) ఉత్తమ నటుడు : షాహిద్ కపూర్ (హైదర్) ఉత్తమ నటి : కంగనా రనౌత్ (క్వీన్) ఉత్తమ సంగీతం : శంకర్-ఏషాన్-లాయ్ (2 స్టేట్స్) ఉత్తమ నేపథ్య సంగీతం : అమిత్ త్రివేది (క్వీన్) ఉత్తమ సినిమాటోగ్రఫీ : బాబీ సింగ్, సిద్ధార్థ్ దివన్ (క్వీన్) ఉత్తమ ఎడిటింగ్ : అభిజిత్ కొకాటే, అనురాగ్ కష్యప్ (క్వీన్) ఉత్తమ సంభాషణలు, ఉత్తమ స్క్రీన్‌ప్లే : అభిజిత్ జోషీ, రాజ్‌కుమార్ హిరాణీ (పీకే) ఉత్తమ కథ : రజత్ కపూర్ (ఆంఖో దేఖీ) -
తెలుగు క్వీన్ సమంతే(నా)..!!
-
వందకోట్ల క్లబ్లో హల్చల్ చేస్తోన్న దీపికా
-
రొమాంటిక్ సినిమాకు డెరైక్షన్..!
‘క్వీన్’ సినిమాతో బాలీవుడ్ క్వీన్ అనిపించుకున్నారు కంగనారనౌత్. నటిగా ఆమెను మరో మెట్టుపైన కూర్చోబెట్టిందా సినిమా. ‘‘ ‘క్వీన్’ తెచ్చిన గౌరవాన్ని పోగొట్టుకోలేను. అందుకే... ఇక నుంచి అభినయానికి ఆస్కారమున్న ప్రయోగాత్మక పాత్రలకే పెద్దపీట వేయాలనుకుంటున్నా’’ అని కంగనా ఆ మధ్య మీడియాతో చెప్పారు. దానితో పాటు మరో కొత్త నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు కంగనా. అదేంటంటే... త్వరలోనే ఆమె మెగా ఫోన్ పట్టబోతున్నారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ద్వారా తెలియజేశారు. ‘‘త్వరలోనే నా దర్శకత్వంలో సినిమా ఉంటుంది. కథ కూడా సిద్ధమైంది. రొమాంటిక్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాను. మరో విషయం ఏంటంటే... నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఈ సినిమాలో చూపించబోతున్నాను. అందుకని నా లైఫ్‌నే సినిమాగా తీస్తున్నానని అనుకోవద్దు. ఇది కల్పిత కథే. అయితే... నా జీవిత సంఘటనలు ఈ కథకు వన్నె తెస్తాయి. అందుకే ఇందులో చేర్చాను. వాటి వివరాలు ముందు చెప్పను. సినిమా విడుదలయ్యాకే తెలియజేస్తా’’ అని కంగనా చెప్పారు. -
‘క్వీన్’కి ఇంకా అడగనే లేదట!
హిందీలో ఘనవిజయం సాధించిన ఇటీవలి చిత్రాలు తెలుగులో వరుసగా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ వరుసలో ‘క్వీన్’ చిత్రం కూడా దక్షిణాది భాషల్లో రానుంది. అయితే, కంగనా రనౌత్‌కు ఒక్కసారిగా ఎంతో పేరు తెచ్చిపెట్టిన ఆ ‘క్వీన్’ పాత్రను ఎవరు పోషిస్తారనే అంశం ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది. త్రిష, శ్రీయ, నయనతార... ఇలా పలువురి నటీమణుల పేర్లు వినిపిస్తూ వచ్చాయి. లేటెస్ట్గా, ఈ పాత్ర పంజాబీ పిల్ల ఛార్మిని వరించిందంటూ కొన్ని పత్రికలు, మీడియా ప్రచారం చేశాయి. ‘‘నాయికా ప్రధానమైన సినిమాల్లో నటించడం, అలాంటి పాత్రలు పోషించడం ఛార్మికి కొట్టిన పిండి. ‘క్వీన్’లోని రాణి పాత్రలో అటు అందంగానూ, ఇటు అభినయ ప్రధానంగానూ కనిపించాలంటే ఆమే కరెక్ట్’’ అని ఈ రీమేక్ తీస్తున్న నిర్మాతలు భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. అయితే, అసలు సంగతి ఏమిటని ‘సాక్షి’ ఆరా తీస్తే, ఈ వార్తల్లో పస లేదని తేలింది. ‘‘ఈ వార్తలు ఎలా ప్రచారంలోకి వచ్చాయో తెలీదు. ‘క్వీన్’ రీమేక్ కోసమైతే, ఇప్పటి దాకా ఛార్మిని ఎవరూ సంప్రతించలేదు’’ అని ఛార్మి సన్నిహిత వర్గాలు ‘సాక్షి’కి స్పష్టం చేశాయి. అయితే, ఒకటి మాత్రం నిజం. ఇంకా అడగలేదన్న మాటే కానీ, ‘క్వీన్’ లాంటి చక్కటి కథతో, పాత్రతో ఎవరైనా సంప్రతిస్తే నటించడానికి ఛార్మికి అభ్యంతరం ఉండదని వేరే చెప్పాలా? -
11 ఏళ్ల వయస్సులోనే అతన్ని ప్రేమించాను: ఆలియా
ముంబై: బాలీవుడ్ నటుడు షాహీద్ కపూర్ కు పెద్ద ఫ్యాన్ అని సినీనటి ఆలియా భట్ వెల్లడించింది. తన వయస్సు పదకొండేళ్లు ఉన్నపుడే తాను షాహిద్ కపూర్ ను ప్రేమించానని ఆలియా తెలిపింది. అప్పుడే ముంబైలోని జెయిటీ గెలాక్సీ థియేటర్ లో షాహీద్ నటించిన ఇష్క్ విష్క్ చిత్రం చూశానన్నారు. షాహీద్ లో గొప్ప నటుడు ఉన్నాడని ఆలియా తెలిపింది. తాజాగా వికాస్ బెహల్ నిర్మిస్తున్న షాందార్ చిత్రంలో షాహీద్ సరసన నటించేందుకు అంగీకారం తెలిపినట్టు వచ్చిన వార్త నిజమేనంటూ ఆలియా ధృవీకరించింది. షాహీద్ ను సీనియర్ నటుడిగా చూడటం లేదని.. తాను రణదీప్ హుడాతో హైవే చిత్రంలో నటించిన విషయాన్ని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. ఇటీవల తాను నటించిన వరుణ్ ధావన్, అర్జున్ కపూర్, సిద్దార్థ్ మల్హోత్రాలకు సమకాలీకుడిగానే కనిపిస్తాడని షాహీద్ కు ఆలియా కితాబిచ్చింది. క్వీన్ చిత్రాన్ని అందించిన వికాస్ రూపొందిస్తున్న షాందార్ లో నటించడం తనకు ఆనందంగా ఉందని ఆలియా తెలిపింది. -
దక్షిణాదిన అంతటి నటి ఎవరు?
హిందీలో ఘనవిజయం సాధించిన 'క్వీన్' సినిమా రీమేక్ హక్కులను తమిళ హీరో ప్రశాంత్ తండ్రి, నటుడు, దర్శకుడు, నిర్మాత త్యాగరాజన్ సొంతం చేసుకున్నారు. హిందీలో వికాస్ భల్ దర్శకత్వం కంగనా రనౌత్ అద్భుతంగా నటించారు. ఓ నటికి సవాల్ లాంటి పాత్ర ఇది. ఇందులో కంగనా రనౌత్ విజృంభించి నటించారు. అందరి ప్రశంసలు అందుకున్నారు. దీని రీమేక్ హక్కులకు పెద్ద పోటీ ఏర్పడింది. దక్షిణాదిలోని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో ఈ చిత్రాన్ని నిర్మించాలన్న ఉద్దేశంతో త్యాగరాజన్ దీని హక్కులు చేజిక్కించుకున్నారు. కథాపరంగా దక్షిణాదికి అనుగుణంగా కొన్ని మార్పులుచేర్పులు చేసి నిర్మించడానికి ఆయన సిద్దమయ్యారు. అయితే ఇందులో క్వీన్ పాత్రదారిని ఎంపికచేయడం ప్రధానం. ప్రస్తుతం త్యాగరాజన్ ఆ వేటలోనే ఉన్నారు. ఆయన మనసులో ఉన్న హీరోయిన్లను సంప్రదించే పనిలో పడ్డారు. నాలుగు భాషల్లో హీరోలు మారతారు. హీరోయిన్ మాత్రం ఒక్కరే ఉంటారు. అందువల్ల ఆ పాత్రకి తగిన, అన్ని భాషలవారికి నచ్చే హీరోయిన్ను ఎంపిక చేయవలసి ఉంది. ఈ పాత్ర కోసం పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ, కొంతమంది హీరోయిన్లు ఈ పాత్ర చేయడానికి ఇష్టపడుతుంటే, మరి కొందరు భయపడుతున్నారు. కంగనా రనౌత్ అంతటి స్థాయిలో ఆ చిత్రంలో నటించి మెప్పించారు. కొందరు హీరోయిన్లకు నటించాలన్న ఆసక్తి ఉన్నా, వారికి సమయం చిక్కడంలేదు. దాంతో కొంత సమయం అడుగుతున్నారు. మరికొందరు భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇంకొందరు రీమేక్ అని ధైర్యం చేయలేకపోతున్నారు. క్వీన్ పాత్ర కోసం మలయాళీ ముద్దుగుమ్మ అసిన్‌ని నిర్మాత సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే, బాలీవుడ్ సినిమాపై దృష్టి పెట్టిన అసిన్, ఈ చిత్రంలో నటించడం తన వల్ల కాదని తేల్చి చెప్పేసినట్లు సమాచారం. బాలీవుడ్ క్వీన్‌గా నటించిన కంగనా రనౌత్ మాదిరి దక్షిణాదిలో కూడా నటించడం అంటే కుదరని పని. అలా నటించకపోతే ప్రేక్షకులకు నచ్చదు. అదే పాత్రను కొత్తగా నటించి ప్రేక్షకులను మెప్పించడం కష్టం. అందుకే క్వీన్‌లో నటించలేనని అసిన్ త్యాగరాజన్‌కు సారీ చెప్పినట్లు కోలీవుడ్ సమాచారం. బాలీవుడ్లో అరకొర అవకాశాలతో సర్ధుకుంటున్న అసిన్, దక్షిణాది 'క్వీన్' వంటి సినిమాలో నటించడానికి ఆసక్తి కనబరచకపోవడంపై పలువురు సినీ విశ్లేషకులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దక్షిణాదిలో ఓ వెలుగు వెలుగుతున్న హీరోయిన్ సమంత ఈ చిత్రంలో నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలలో నిజంలేదని సమంత స్పష్టం చేశారు. ఈ చిత్రం కథలో మార్పులు చేర్పులు చేయవలసి ఉంటుందని, ఆ విషయంలో దర్శక, నిర్మాతలకు నచ్చజెప్పడం సాధ్యం కాదని, అందువల్ల ఆ 'యువరాణి'ని తాను కాదని సమంత తన ట్విట్టర్లో పోస్టు చేశారు. కంగనా స్థాయిలో దక్షిణాదిన నటించగల సత్తా త్రిషకు ఉందని పలువురు భావిస్తున్నారు. త్యాగరాజన్ కూడా అదే ఆలోచనతో ఉన్నారు. ప్రస్తుతానికి ఈ పాత్రకు త్రిష పేరు పరిశీలనలో ఉన్నట్లు ఆయనే స్వయంగా చెప్పారు. ఈ పాత్రకి ఇంకా నయనతార, అనుష్క, కాజల్ - తమన్నా- కలర్స్ స్వాతి, తాప్సీ, నిత్యామీనన్... పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి తాను దర్శకత్వం వహించనని త్యాగరాజన్ చెప్పారు. అయితే మరో దర్శకుని పేరుని మాత్రం ఆయన ఇంకా ప్రకటించలేదు. -ఎస్ఎన్ఆర్ -
అక్షయ్ హిందీ నేర్పాడు..
న్యూఢిల్లీ: ‘నేను పుట్టి పెరిగింది ఆస్ట్రేలియాలో.. మోడలింగ్ రంగం నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టా.. నాలుగు సినిమాలు చేశా.. ప్రస్తుతం నా హిందీ బాగా మెరుగుపడింది. దీని క్రెడిట్ అంతా అక్షయ్‌కే దక్కుతుంది..’ అని ప్రముఖ మోడల్, నటి లిసా హైడన్ ముద్దుగా హిందీలో చెప్పింది. త్వరలో విడుదల కాబోతున్న ‘షౌకీన్’లో ఆమె హీరోయిన్గా నటించింది. ఇది 1982లో విడుదలైన సూపర్‌హిట్ రొమేంటిక్ కామెడీ సినిమా ‘షౌకీన్’కు రీమేక్. ఇందులో సూపర్‌స్టార్ అక్షయ్‌కుమార్‌తోపాటు, పరేష్ రావల్, అనుపమ్ ఖేర్, అన్నూకపూర్ వంటి సీనియర్ నటులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను హిందీలో అనర్గళంగా మాట్లాడగలిగేలా అక్షయ్ సాయం చేశాడని లిసా పేర్కొంది. ‘అక్షయ్ హిందీ చాలా బాగుంటుంది.. అతడు చాలా ఎనర్జిటిక్ యాక్టర్.. ఎప్పుడూ నవ్వుతూ, పక్కవాళ్లను నవ్వి స్తూ ఉంటాడు.. నాతో అతడు ఎప్పుడూ హిందీలోనే మాట్లాడేవాడు.. దాంతో నాకు ఆ భాషపై త్వరగానే పట్టు దొరికింది..’ అని లిసా నవ్వుతూ చెప్పింది. ‘షౌకీన్’లో రతీ అగ్నిహోత్రి పోషించిన పాత్రను ప్రస్తుతం రీమేక్‌లో లిసా పోషిస్తోంది. ఈ పాత్రకు మొదట నర్గిస్ ఫక్రిని తీసుకోవాలని అనుకున్నారు.. అయితే అప్పటికే ఆమె హాలీవుడ్ సినిమా ‘స్పై’కి ఒప్పందం చేసుకుని ఉండటంతో డేట్స్ కేటాయించలేకపోయింది. దాంతో ‘షౌకీన్’ అవకాశం లిసాను వరించింది. అయితే ఇవేమీ తనకు పట్టవని ఆమె చెప్పింది. ‘నాకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడమే నా డ్యూటీ. అంతే తప్ప దాని ముందు వెనుక కథలను పట్టించుకోన’ని లిసా స్పష్టం చేసింది. కాగా, ఇంతకుముందు తాను నటించిన ‘క్వీన్’ సినిమా కూడా తనకు మంచి పేరు తెచ్చి పెట్టిందని, ప్రస్తుతం అందరూ తనను గుర్తు పడుతున్నారని లిసా ఆనందం వ్యక్తం చేసింది. -
రెండు కోట్లు ఇస్తే బాగానే ఉంటుంది కానీ...
ఈ తరం కథానాయికల్లో అగ్రస్థానం సమంతదే.అందాలతారగా కెరీర్ ఆరంభించి, అభినయ తారగా ఒదిగి, ప్రేక్షకుల అభిమాన తారగా ఎదిగిన సమంత... అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ బిజీగా ఉన్నారు. ఇటీవలే ‘ఆటోనగర్ సూర్య’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సమంత పత్రికలవారితో ముచ్చటించారు. ‘ఆటోనగర్ సూర్య’ అనుభవం ఎలా ఉంది? ‘బృందావనం’ తర్వాత ఒప్పుకున్న సినిమా ఇది. నిర్మాణానికి, విడుదలకు మూడేళ్లు పట్టింది. ఫలితం ఎలా ఉన్నా ముందు విడుదలైంది... అదీ ఆనందం. ఈ సినిమా విషయంలో నిర్మాతలు అనుభవించిన కష్టాన్ని కళ్లారా చూశాను. చాలా బాధ అనిపించింది. చైతూ కూడా చాలా కష్టపడి ఇందులోని సూర్య పాత్ర చేశారు. నా పాత్ర అయితే... పక్కింటి అమ్మాయిలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరూ చాలా బాగుందని అభినందిస్తున్నారు. ఇందులో మీకు నచ్చిన డైలాగ్? ఇప్పటివరకూ నేను చెప్పిన ఏ డైలాగూ నాకు గుర్తుండదు. కానీ... ఇందులో ఓ డైలాగ్ మాత్రం లైఫ్‌లో మరిచిపోలేను. ‘పెళ్లి ఎవర్ని చేసుకున్నా... పిల్లల పోలికలు మాత్రం అతనివే వస్తాయ్’ అంటాను ఓ సందర్భంలో. నాకు తెగ నచ్చేసిన డైలాగ్ ఇది(నవ్వుతూ). ‘ఏమాయ చేశావె’ నాటికీ నేటికీ నాగచైతన్యలో ఏమైనా తేడా గమనించారా? చాలా. ముఖ్యంగా అతని డైలాగ్ డిక్షన్లో చాలా తేడా వచ్చింది. సినిమా సినిమాకు ఇంప్రూవ్ అవుతున్నాడు. తెలుగులో నా కెరీర్లో చైతూతోనే మొదలైంది. ఇది తనతో నేను చేసిన మూడో సినిమా. ముఖ్యంగా స్క్రీన్‌పై మా ఇద్దరి కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. ఈ మధ్య అభినయానికి పెద్ద పీట వేస్తున్నట్లున్నారు? అవును... ఎప్పుడూ గ్లామర్ పాత్రలే అయితే ఎలా. ఎక్కువకాలం ప్రేక్షకుల హృదయాల్లో నిలవాలంటే.. నటనకు ఆస్కారమున్న పాత్రలు చేయాలి. నా కెరీర్లో నటన పరంగా బెస్ట్ కేరక్టర్ అంటే ‘మనం’లోని పాత్రనే చెప్పుకోవాలి. ఆ పాత్ర మంచి గుర్తింపునిచ్చింది. టాప్‌స్టార్‌గా వెలుగొందుతున్న మీరు.. ‘అల్లుడు శీను’లో ఓ కొత్త హీరోతో నటించారు. దానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? ఆ సినిమాకు రెండు కోట్ల రూపాయలు తీసుకున్నారట కదా? రెండు కోట్లు ఇస్తే బాగానే ఉంటుందండీ(నవ్వుతూ). కానీ ఇవ్వలేదు. మిగిలిన సినిమాలకు ఎంత ఇచ్చారో ‘అల్లుడు శీను’కీ అంతే ఇచ్చారు. నేను హీరోలను బట్టి సినిమాలను అంగీకరించను. దర్శకుడు, కథ, పాత్ర... ఈ మూడింటిని బట్టే సినిమాను ‘ఓకే’ చేస్తాను. ‘అల్లుడు శీను’ని వి.వి.వినాయక్ అద్భుతంగా మలిచారు. అందరితో కూల్‌గా వర్క్ చేయించుకున్నారు. తొలి సినిమాలా పనిచేశారు. కచ్చితంగా ఆ సినిమా పెద్ద హిట్. మరి ‘రభస’ ఎలా ఉండబోతోంది? ఆ సినిమా ఫుల్‌మీల్స్. తారక్‌తో నేను చేస్తున్న మూడో సినిమా ఇది. అభిమానులు పండగ చేసుకునేలా ఈ సినిమా ఉంటుంది. ప్రస్తుతం ఏ ఏ సినిమాలు చేస్తున్నారు? ఈ ఏడాది ఏడు సినిమాల్లో నటిస్తున్నాను. తమిళంలో విజయ్, విక్రమ్, సూర్య చిత్రాల్లో నటిస్తున్నా. తెలుగు, తమిళ భాషల్లో ఇంత మంది స్టార్హీరోలతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. ఈ సినిమాల వల్ల ఈ ఏడాది చాలా ఈవెంట్లకు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అందుకే ఫ్యాషన్‌పై దృష్టి పెట్టాను. ‘క్వీన్’ రీమేక్‌లో నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. నిజమేనా? లేదు. నేను చేయట్లేదు. ‘క్వీన్’ బాలీవుడ్లో ప్రూవ్ చేసుకున్న సినిమా. గొప్ప సినిమా. దాన్ని దక్షిణాదిన రీమేక్ చేయాలంటే.. ఇక్కడకు తగ్గట్టు కొన్ని మార్పులు అవసరం. సదరు దర్శక, నిర్మాతలు చేసిన మార్పులు నాకు నచ్చలేదు. అందుకే వద్దనుకున్నా. మహేశ్‌బాబు ‘1’ సినిమా పోస్టర్ విషయంలో సీరియస్‌గా ట్విట్టర్లో స్పందించారు. మరి ఇప్పుడు మీ ‘ఆంజాన్’ చిత్రం స్టిల్ కూడా దుమారం లేపుతోంది. దానికి మీ సమాధానం? నో కామెంట్. -
ఆ లక్కీ హీరోయిన్ ఎవరు?
ఒక మంచి చిత్రం ఏ భాషలో వచ్చినా దాన్ని ఇతర భాషల్లో రూపొందించడం తప్పు కాదంటారు సినీ విజ్ఞులు. అయితే ప్రస్తుతం సినిమాలన్నీ రీమేక్‌ల మయంగా మారాయి. సొంత కథలతో రిస్క్ చేసేకంటే ఇతర భాషల్లో హిట్ అయిన చిత్రాలను రీమేక్ చేసుకోవడం సేఫ్ అనే భావన దర్శక నిర్మాతల్లో వ్యక్తమవుతోంది. ఇంతకుముందు దక్షి ణాది చిత్రాలు హిందీలో వరుసగా రీమేక్ అయ్యాయి. గజిని, పోకిరి, కిక్, విక్రమార్కుడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలు బాలీవుడ్లో రీమేక్ అయ్యాయి. అయితే ప్రస్తుతం సీన్ రివర్స్ అయ్యింది బాలీవుడ్ హిట్ చిత్రాలకు దక్షిణాది దర్శక నిర్మాతలు రీమేక్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ మధ్య విద్యాబాలన్ నటించిన హిందీ చిత్రం కహాని తమిళ, తెలుగు భాషల్లో రీమేక్ చేయగా నయనతార నటించారు. ఓమైగాడ్ చిత్రం తెలుగులో వెంకటేష్, పవన్‌కల్యాణ్ హీరోలుగాపునర్నిర్మాణం కానుంది. కంగనా రనౌత్ నటించిన క్వీన్ చిత్రం దక్షిణాది రీమేక్ హక్కులను సీనియర్ దర్శక, నిర్మాత, నటుడు త్యాగరాజన్ పొందారు. ఈ చిత్ర ప్రారంభోత్సవాన్ని భారీ స్థాయిలో నిర్వహించడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో హీరోయిన్గా నటించడానికి ప్రముఖ హీరోయిన్లు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఆ అదృష్టం ఎవరికి దక్కుతుందనేది త్వరలోనే తేలనుంది. అయితే తాజాగా మరో బాలీవుడ్ చిత్రం దక్షిణాది రీమేక్ హక్కుల కోసం పోటీ నెలకొందని సమాచారం. హిందీలో సంచలన నటి విద్యాబాలన్ నటించిన బాబి జసూస్ ఈ జూలై4న విడుదల కానుంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రాన్ని దియ మిర్జ్జా నిర్మించారు. ఇందులో విద్యాబాలన్ లేడీ డిటె క్టివ్‌గా విభిన్న పాత్రను పోషించారు. ఆమె ఈ చిత్రంలో పలు గెటప్పుల్లో అలరిస్తారట. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో నెంబర్ వన్ డిటెక్టివ్‌గా పేరు తెచ్చుకోవాలని ఆశించే బాబిగా విద్యాబాలన్ నటనహైలెట్గా ఉంటుందట. మరి అలాంటి పాత్రకు దక్షిణాదిలో పోషించే లక్కీ హీరోయిన్ ఎవరన్నది ఆసక్తిగా మారింది. -
వాళ్లు ఏడిస్తేనే నాకు ఆనందం!
‘‘వెండితెరపై మనం చూసే రెండున్నర గంటల సినిమా నిజం కాదు. కేవలం ఓ కథ. కానీ, సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయి, ‘నిజంగా జరుగుతోంది’ అని ఫీలైతే, ఆ సినిమా సక్సెస్ కిందే లెక్క’’ అంటున్నారు కంగనా రనౌత్. క్వీన్, రజ్జో, రివాల్వర్ రాణి.. ఇలా వరుస విజయాలతో దూసుకెళుతున్నారు ఈ బ్యూటీ. పైగా... అన్నీ కథానాయిక పాత్ర ప్రాధాన్యంగా సాగే సినిమాలు కావడంతో కంగన చాలా ఆనందంగా ఉన్నారు. ఓ సినిమా చేస్తున్నప్పుడు, ఆ సినిమాలోని పాత్రగా తాను మారిపోతానని చెబుతూ -‘‘కెమెరా ముందుకెళ్లిన తర్వాత నేను కంగన అనే విషయం మర్చిపోతాను. అది ఎలాంటి సన్నివేశం అయినా వంద శాతం న్యాయం చేయడానికి కృషి చేస్తాను. ఉదాహరణకు... ఏడ్చే సన్నివేశాన్ని తీసుకుందాం. గ్లిజరిన్ వాడకుండానే ఏడ్చేస్తాను. నేను యాక్ట్ చేసిన చిత్రాల్లో కొన్నింటిని పబ్లిక్ థియేటర్లో చూస్తాను. అప్పుడు ప్రేక్షకుల హావభావాలు క్షుణ్ణంగా గమనిస్తాను. తెరపై నేను ఏడవడం చూసి, థియేటర్లో ప్రేక్షకులు కంట తడిపెట్టుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నేను నవ్వినప్పుడు వాళ్లూ నవ్వితే చెప్పలేనంత సంతోషంగా ఉంటుంది. ఇలాంటి ఆనందాలు నాకు చాలానే మిగిలాయి. సో.. నటిగా నేను సక్సెస్ అయినట్లేగా. ఇంకో విషయం ఏంటంటే.. ‘కంగన ఇటు గ్లామరస్ అటు పర్ఫార్మెన్స్కి అవకాశం ఉన్న పాత్రలు చేస్తుంది. మనం కూడా అలానే చేయాలి. కేవలం గ్లామర్‌కి పరిమితం అయిపోకూడదు’ అని కొత్త తారలు నన్ను రోల్ మోడల్‌గా తీసుకోవాలన్నది నా ఆకాంక్ష. సినిమాలు ఎంపిక చేసుకునేటప్పుడు ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటా’’ అని చెప్పారు కంగనా. -
‘క్వీన్’గా ఎవర్నీ ఖరారు చేయలేదు
కంగనా రనౌత్ కథానాయికగా వికాస్ బాల్ దర్శకత్వటంలో రూపొంది, ఘనవిజయం సాధించిన హిందీ చిత్రం ‘క్వీన్’ దక్షిణాది రీమేక్ హక్కుల్ని ప్రముఖ నటుడు, దర్శక, నిర్మాత త్యాగరాజన్ చేజిక్కించుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని ఆయన రూపొందించనున్నారు. ఈ సందర్భంగా త్యాగరాజన్ మాట్లాడుతూ -‘‘కథానాయికలుగా అనుష్క. కాజల్, తమన్నాలను పరిశీలిస్తున్నాం అనే వార్త ప్రచారంలో ఉంది. వాస్తవానికి త్రిష పేరుని పరిశీలిస్తున్నాం. హిందీలో కంగనా అద్భుతంగా నటించింది. దక్షిణాది రాణిగా ఎవరు నప్పుతారు? అనే విషయాన్ని చర్చిస్తున్నాం. త్వరలో కథానాయికను ఖరారు చేస్తాం’’ అన్నారు. ఈ రీమేక్‌లో మీ అబ్బాయి, హీరో ప్రశాంత్ నటిస్తారా? అనడిగితే -‘‘తను నటిస్తానంటే నాకభ్యతరం లేదు. ప్రస్తుతం తను ‘జులాయి’ రీమేక్‌లో నటిస్తున్నాడు’’ అని చెప్పారు. ప్రస్తుతం ‘జీన్స్ 2’కి సన్నాహాలు చేస్తున్నానని, ఆ చిత్రవిశేషాలు కూడా త్వరలో తెలియజేస్తానని త్యాగరాజన్ తెలిపారు. -
దక్షిణాది రాణి!
ఏ నటికైనా సవాల్ లాంటి పాత్ర వస్తే.. నటనాపరంగా విజృంభించేస్తారు. ‘క్వీన్’ చిత్రంలో కంగనా రనౌత్ అదే చేశారు. మొదట్లో గ్లామర్ డాల్ అనిపించుకున్నప్పటికీ రాను రాను తనలో ఎంత మంచి నటి ఉందో నిరూపించుకుంటున్నారు కంగనా. ముఖ్యంగా ‘క్వీన్’లో ఆమె ప్రదర్శించిన నటనను అమితాబ్ బచ్చన్ వంటివారే సైతం మెచ్చుకున్నారు. ఈ సినిమా కంగనా తప్ప ఎవరూ చేయలేరు? అని కూడా చాలామంది ఫిక్స్ అయిపోయారు. ఎంతో పోటీ మధ్య తమిళ నటుడు, దర్శక, నిర్మాత త్యాగరాజన్ (హీరో ప్రశాంత్ తండ్రి) ‘క్వీన్’ దక్షిణాది రీమేక్ హక్కులు సాధించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని పునర్నిర్మించాలనుకుంటున్నారు. కంగనా స్థాయిలో దక్షిణాదిన నటించే సత్తా ఎవరికుంది? అంటూ.. రకరకాల తారల పేర్లు అనుకున్నారు. ఎంతమందిని అనుకున్నా ఎక్కువ శాతం మార్కులు త్రిషకే వేస్తున్నారట. త్యాగరాజన్ మనసులో కూడా త్రిషానే ఉందని సమాచారం. ఈ చిత్రానికి రాధామోహన్ లేక అహ్మద్ దర్శకత్వం వహిస్తారని వినికిడి. రాధామోహన్ దర్శకత్వంలో రూపొందిన ‘అభియుమ్ నానుమ్’ అనే చిత్రంలో త్రిష అద్భుతంగా నటించారు. అలాగే, అహ్మద్ దర్శకత్వం వహించిన ‘ఎండ్రెండ్రుమ్ పున్నగై’లో కూడా నటనకు అవకాశం ఉన్న పాత్ర చేశారామె. ఆ విధంగా ఈ ఇద్దరు దర్శకులకు త్రిష నటనపై మంచి అభిప్రాయం ఉంది. అందుకని, తెలుగు, తమిళ భాషలకు సంబంధించిన ‘క్వీన్’ రీమేక్‌లో త్రిషకే ఎక్కువ అవకాశం ఉంది. మరి.. క్వీన్‌గా ఎవరు ఒదిగిపోతారో వేచి చూడాలి. -
దక్షిణాది తెరపై క్వీన్ ఎవరు?
దక్షిణాది వెండితెరపై క్వీన్ అవతారమెత్తాలని చాలా మంది కథానాయికలు కోరుకుంటున్నారు. ఇంతకీ ఆ క్వీన్ ఎవరు? ఆ అదృష్టం ఎవరిని వరించనుంది? అన్నది త్వరలోనే తేలనుంది. అసలు ఈ క్వీన్ సంగతేమిటంటారా. బాలీవుడ్లో సంచలన విజయం సాధించిన చిత్రం క్వీన్. క్రేజీ నటి కంగనా రనౌత్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని దక్షిణాది భాషల్లో రీమేక్ చేయూలని చాలా మంది నిర్మాతలు ప్రయత్నించారు. ఈ సంచలన చిత్రం దక్షిణాది హక్కులను సీనియర్ నటుడు, నిర్మాత, దర్శకుడు త్యాగరాజన్ సొంతం చేసుకున్నారు. ఈయన ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో రీమేక్‌కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా త్యాగరాజన్ మాట్లాడుతూ క్వీన్ చిత్రం కంటెంట్ తనకు బాగా నచ్చిందన్నారు. ఒక యువతి జీవితంలో తనకెదురైన అవాంతరాలను ఎలా ఎదురొడ్డి పోరాడిందన్నదే చిత్ర కథ అన్నారు. ఇది యూనివర్శిటీ సబ్జెక్ట్. దక్షిణాది భాషలన్నింటిలోనూ నిర్మించడానికి హక్కులు పొందినట్లు వెల్లడించారు. కంగనా పాత్రను ఒక ప్రముఖ కోలీవుడ్ హీరోయిన్ పోషించనున్నారని తెలిపారు. ఇక కంగనాకు ఫ్రెండ్‌గా నటించిన లిసా హైడన్ దక్షిణాదిలోనూ నటించనున్నారని చెప్పారు. ‘‘మీ అబ్బాయి నటుడు ప్రశాంత్ ఈ చిత్రంలో నటించే అవకాశం ఉందా?’’ అన్న ప్రశ్నకు నెగిటివ్ షేడ్స్ ఉన్న ఒక వైవిధ్యభరిత పాత్రను ప్రశాంత్‌తో నటింప జేయాలనుకుంటున్నట్లు త్యాగరాజన్ తెలిపారు. అయితే ఇది ప్రశాంత్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. తను ప్రస్తుతం తమిళ చిత్రం సాహసంలో నటిస్తున్నారని తదుపరి ఒక భారీ బాలీవుడ్ చిత్రం చేయనున్నారని వివరించారు. నాలుగు భాషల్లోనూ ఏక కాలంలో తెరకెక్కనున్న ఈ చిత్ర షూటింగ్‌ను ప్యారిస్, ఆమ్స్టర్డమ్, స్పెయిన్ దేశంలో నిర్వహించనున్నట్లు త్యాగరాజన్ వెల్లడించారు. -
కోట్లకూ లొంగని కంగన
సినిమాల్లో భారీ పారితోషికాలు... మరో వైపు వాణిజ్య ప్రకటనల్లో నటించడం ద్వారా వచ్చే ఆదాయం, అడపాదడపా షోరూమ్‌ల ప్రారంభోత్సవాలు... ఇలా నాలుగు చేతులా తెగ సంపాదించేస్తుంటారు కథానాయికలు. లైమ్‌లైట్‌లో ఉన్న ప్రతి కథానాయికకూ ఇవి మామూలే. అయితే... బాలీవుడ్ కథానాయికలకు మరో రూపంలో కూడా ఆదాయం వస్తూ ఉంటుంది. అదే... ‘పెళ్లి వేడుకల్లో డాన్స్’. కోటీశ్వరుల ఇళ్లల్లో జరిగే వేడుకల్లో స్టార్ హీరోయిన్ల డాన్స్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఉత్తరాదిన సర్వసాధారణం. కరీనా, కత్రినా, దీపిక... ఇలా స్టార్ హీరోయిన్లందరూ ఇలా ప్రైవేటు వేడుకల్లో పదం కలిపిన వారే. ఇలా డాన్స్ చేయడం వల్ల సదరు కథానాయికలకు భారీ మొత్తంగా పారితోషికాలు అందుతూ ఉంటాయి. ఇటీవలే ఇలాంటి అవకాశమే ‘క్వీన్’ కంగనా రనౌత్ తలుపు తట్టింది. ఢిల్లీలో జరిగే ఓ పెళ్లి కార్యక్రమంలో డాన్స్ చేస్తే... మూడు కోట్ల రూపాయలు పారితోషికంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పినా... అంతటి ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించారట కంగనా. ‘క్వీన్’ తర్వాత కంగనా ఖ్యాతి దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. దీంతో... ఈవెంట్స్‌లో, పెళ్లిళ్లలో కంగనాతో డాన్స్ చేయించాలని ఉత్తరాదిన చాలామంది పోటీ పడుతున్నారట. అయితే... కంగనా మాత్రం ‘నేను చేయను’ అని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారని స్వయానా కంగనా సోదరి రంగోలి ఇటీవల ఓ సందర్భంలో తెలిపారు. ‘క్వీన్’కి ముందు కూడా కంగనాకు ఇలాంటి ఆఫర్లు వచ్చాయని, అయితే... ఆమె మాత్రం వేటికీ అంగీకారం తెలుపలేదని, కంగనా దృష్టి మొత్తం పాత్రలపైనే ఉంటుందని రంగోలి అన్నారు. -
తమిళ, తెలుగు భాషల్లో 'క్వీన్'
బాలీవుడ్ లో విమర్శకుల ప్రశంసలందుకున్న క్వీన్ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మించనున్నట్టు ఆ చిత్ర దర్శకుడు వికాస్ బెహల్ తెలిపారు. రాణి అనే పేరు చాలా సాధారణమైందని, అందర్ని ఆకట్టుకోవడం చాలా సులభమన్నారు. ఓ అమ్మాయి ఒంటరిగా సాగించిన హానిమూన్ కథగా తెరకెక్కిన క్వీన్ చిత్రంలో కంగనా రనౌత్ హీరోయిన్ గా నటించింది. బుసాన్ చలన చిత్రోత్సవంలో క్వీన్ చిత్రానికి ప్రశంసలు లభించాయిని వికాస్ తెలిపారు. ఈ చిత్రాన్ని తెలుగు,తమిళ భాషల్లో రూపొందించడానికి పయత్నాలు జరుగుతున్నాయన్నారు. వివిధ భాషల్లో రూపొందిస్తామన్నారు. క్వీన్ చిత్రంలో కంగనా రనౌత్, రాజ్ కుమార్ యాదవ్, లిసా హెడెన్ తదితరులు నటించారు. -
బికిని ఫొటో షూట్ తో మత్తెక్కించిన క్వీన్ కంగనా రనౌత్
-
అప్పుడు అవమానాలు...ఇప్పుడు గౌరవ మర్యాదలు!
‘‘బక్కపల్చని శరీరాకృతి.. చెప్పుకోదగ్గ అందగత్తె కూడా కాదు. అభినయం కూడా అంతంత మాత్రమే. మహా అయితే మూడు నాలుగేళ్లు ఉంటుందేమో.. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్‌కి వెళ్లిపోవాల్సిందే’’... కథానాయికగా కంగనా రనౌత్ వచ్చినప్పుడు చాలామంది చేసిన విమర్శలివి. అవి కంగన వరకూ వెళ్లాయి కూడా. ఆ సమయంలో ఆమె ఆత్మవిశ్వాసం కోల్పోయి ఉంటే.. నిజంగానే తన ఊరు హిమాచల్‌ప్రదేశ్ వెళ్లిపోయేవారు కంగన. అయితే, తను చాలా డేరింగ్ అండ్ డాషింగ్. తనదాకా వచ్చిన సినిమాలేవీ కాదనకుండా చేశారు. వాటిలో ఎక్కువ శాతం అపజయాలపాలైనవే ఉన్నాయి. అప్పుడెన్నో అవమానాలకు గురయ్యాయనని, అవే తన మనసుని రాటుదేలేలా చేశాయని కంగన అన్నారు. ‘తను వెడ్స్ మను, క్వీన్, రివాల్వర్ రాణి’ విజయాలతో కంగన సీన్ మారిపోయింది. ఎవరైతే విమర్శించారో వాళ్లే ‘కంగనలో అద్భుతమైన నటి ఉంది. మునుపటికన్నా చాలా అందంగా ఉంది’ అని అభినందించడం మొదలుపెట్టారు. దాని గురించి చెబుతూ - ‘‘ఒకప్పుడు హేళన చేసినవాళ్లే ఇప్పుడు గౌరవిస్తున్నారు. ఈ మార్పుని నేనూహించలేదు. ‘మీరు మంచి ఆర్టిస్ట్ మేడమ్’ అని అభినందిస్తున్నారు. నిజానికి అపజయం సాధించిన సినిమాల్లోనూ బాగానే యాక్ట్ చేశాను. కానీ, అదెవరూ గుర్తించలేదు. ఇప్పుడు విజయాల శాతం ఎక్కువైంది కాబట్టి, అభినందిస్తున్నారు. బలమైన పాత్రలు పడ్డాయి కాబట్టే, నిరూపించుకోగలిగాను. ఆ పాత్రలు సృష్టించిన రచయితలు, దర్శకులకే ఈ ఘనత దక్కుతుంది. ఈ మధ్య కాలంలో కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలు ఎక్కువయ్యాయి. ఈ మార్పు ఆహ్వానించదగ్గది. ఇలాంటి సినిమాల వల్ల కథానాయికలందరికీ గౌరవం పెరుగుతుందని అనుకుంటున్నా’’ అన్నారు కంగన. -
ఓ పాతిక వదిలేశా!
‘క్వీన్’, రివాల్వర్ రాణి’లాంటి నాయికా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటించి, తనలో హాట్ గాళ్ మాత్రమే కాదు.. మంచి నటి కూడా ఉందని కంగనా రనౌత్ నిరూపించుకున్నారు. సినిమా మొత్తాన్ని సునాయాసంగా తన భుజాల మీద నడిపించేస్తారనే నమ్మకాన్ని దర్శక, నిర్మాతలకు కలగజేశారు ఈ హాట్ బ్యూటీ. దీని గురించి కంగనా మాట్లాడుతూ -‘‘ఎవరికైనా సరే బలమైన పాత్రలు చేయాలని ఉంటుంది. కానీ, దర్శక, నిర్మాతలు నమ్మాలి. నమ్మి అవకాశం ఇస్తే, ఎవరైనా నిరూపించుకుంటారు. నన్ను నమ్మి క్వీన్, రివాల్వర్ రాణి చిత్రాలకు అవకాశాలు ఇచ్చారు కాబట్టి, నా ప్రతిభ ఏంటో అందరికీ తెలిసింది. ఏదేమైనా ఈ చిత్రాలిచ్చిన ఉత్సాహంతో నాకిప్పుడు టైటిల్ రోల్స్‌తో రూపొందే చిత్రాలే ఎక్కువగా చేయాలని ఉంది. ఆ తరహా చిత్రాలు ఈ మధ్య కుప్పలు తెప్పలుగా వచ్చాయి. కానీ, ఏది పడితే అది చేస్తే ఇమేజ్ డామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే, దాదాపు 25 సినిమాలు తిరస్కరించా’’ అని చెప్పారు. మీరు అదృష్టాన్ని నమ్ముతారా అనే ప్రశ్నకు సమాధానంగా -‘‘అస్సలు నమ్మను. నా కష్టాన్ని మాత్రమే నమ్ముతాను. ఒకవేళ అదృష్టం కనుక నావైపు ఉండి ఉంటే నా మొదటి సినిమానే విజయం సాధించి ఉండేది. కానీ, అలా జరగలేదు కదా. విజయం తాలూకు రుచి ఎలా ఉంటుందో చూడటానికి నాకు ఎనిమిదేళ్లు పట్టింది. అది కూడా నేను క్లిష్టమైన పాత్రలను కష్టపడి చేయడంవల్లే’’ అని చెప్పారు. -
ఆ విషయంలో నోరు జారింది..!
‘క్వీన్’తో కంగనా రనౌత్ గొప్ప నటీమణుల జాబితాలో చేరిపోయారు. ‘ఆ పాత్ర నాకొచ్చివుంటే బావుండు’ అని ఓ హీరోయిన్ అంటే, ‘ఆ పాత్రను కంగనా తప్ప ఇంకెవరూ చేయలేరు?’ అని ఇంకో హీరోయిన్ అనడం, ‘దాన్ని రీమేక్ చేస్తే ఆ పాత్ర చేయడానికి నేను రెడీ..’ అని మన దక్షిణాదికి చెందిన ఓ హీరోయిన్ అంటే... మళ్లీ తీస్తే ఆ సినిమా ఆత్మ దెబ్బ తింటుందని, ఆ సినిమాకు సంబంధించినంతవరకూ ఏది మారినా.. సినిమా పండదని మరో హీరోయిన్ అనడం... ఇలా ‘క్వీన్’పై సినీరంగంలోనే విపరీతమైన చర్చలు. ఒక్క సినిమాతో నటిగా అందనంత ఎత్తులో కూర్చున్నారు కంగనా. ఈ దఫా జాతీయ అవార్డు రావడం ఖాయం అని సినీ మేధావులు సైతం ఢంకా బజాయించి మరీ చెబుతున్నారంటే ‘క్వీన్’గా కంగనా నటన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే... లెక్కలేనన్ని ప్రశంసలందుకుంటున్న ఈ సమయంలోనే అనుకోకుండా కంగనాకు విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. వివరాల్లోకెళ్తే ఇటీవల ‘క్వీన్’ చిత్రాన్ని ఆమిర్‌ఖాన్ చూశారట. ఆ సినిమాలో కంగనా నటన చూసి ఫిదా అయిపోయారు. ‘అవకాశం వస్తే కంగనాతో నటించాలని ఉంది’ అని మీడియా సాక్షిగా స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. ఆమిర్ కోర్కెను మీడియా కంగనా ముందుంచితే ‘‘ఆమిర్‌తో నటించాలి, సల్మాన్‌తో నటించాలి... ఇలాంటివి నేను కోరుకోను. మంచి పాత్రల్ని కోరుకుంటానంతే. ఈ క్రమంలో వారితో చేయాల్సి వస్తే చేస్తాను.. దట్సాల్’’ అని కరాఖండిగా చెప్పేశారట. ఈ మాటలే కంగనా విమర్శలు ఎదుర్కోవడానికి కారణమయ్యాయి. ‘ఆమిర్ లాంటి గొప్ప నటుడు ఒక మెట్టు దిగి నీ నటనను అంతగా మెచ్చుకుంటే... నువ్వు ఇలా నోరు జారి స్పందిస్తావా’ అని బాలీవుడ్లో బాహాటంగానే కంగనాను విమర్శిస్తున్నారట. -
క్వీన్‌పై నయన కన్ను
క్వీన్‌పై నయనతార కన్నేశారనగానే ఆమె రాణి కావాలనుకుంటున్నారా? అనే ఆలోచన కలుగుతుందా? ఒక రకంగా ఆమె కోరిక అదే. అయితే ఈ బ్యూటీ సినిమాలో క్వీన్‌గా జీవించాలనుకుంటున్నారు. అర్థం కాలేదా? అయితే చదవండి. నయనతార హీరోయిన్గా సెకండ్ ఇన్నింగ్‌లో ఆరంభం, రాజారాణి, ఇదు కదిర్ వేళన్ కాదల్ అంటూ వరుసగా హ్యాట్రిక్ కొట్టారు. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ సరసన నన్భేండా, శింబుకు జంటగా ఇదు నమ్మాళు చిత్రాలతోపాటు టాలీవుడ్ నటుడు గోపిచంద్‌తో ద్విభాషా చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. మరో చిత్రం నీ ఎంగే ఎన్ అన్భే త్వరలో తెరపైకి రానుంది.ఇది హిందీ చిత్రం కహానికి రీమేక్. హిందీలో విద్యాబాలన్ నటించిన పాత్రను నయనతార పోషించారు. ముఖ్యపాత్రలో వైభవ్ నటించిన ఈ చిత్రానికి టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. తాజాగా నయనతార కన్ను బాలీవుడ్ చిత్రం క్వీన్‌పై పడింది. చిత్రం ఈ అమ్మడికి పిచ్చపిచ్చగా నచ్చేసిందట. హిందీలో కంగనా రనౌత్ నటించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ పాత్రను దక్షిణాదిలో నయనతార పోషించాలని ఆశపడుతున్నారట. ఈ చిత్ర రీమేక్ హక్కులు కొనుగోలు చేయూలని తనకు బాగా సన్నిహితులైన ఇద్దరు నిర్మాతలకు చెప్పారట. ఈ బ్యూటీతో పాటు క్వీన్ చిత్రంతో నటించాలని ఆశిస్తున్న హీరోయిన్ల వరుసలో సమంత కూడా ఉండడం విశేషం. ఇటీవల క్వీన్ చిత్రం చూసిన ఈ భామ కంగనా రనౌత్ నటనపై ప్రశంసల జల్లు కురిపించింది. ఇలాంటి పరిస్థితిలో మరి దక్షిణాది క్వీన్ ఎవరవుతారన్నది వేచి చూడాల్సిందే. -
ఆ సినిమా చూస్తే... నన్నెవరు చేసుకుంటారు?
పెళ్లీడుకొచ్చిన ఏ అమ్మాయి, అబ్బాయి అయినా తమలో ఉన్న ప్లస్ పాయింట్స్‌ను బయటికి చెప్పుకుంటారు. మైనస్సులను మనసులోనే దాచేసుకుంటారు. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేనివాళ్లు ఈ రెండింటిలో ఏ కోణాన్నయినా నిర్భయంగా బయటపెట్టేస్తారు. ఆ సంగతి అలా ఉంచితే, పెళ్లీడులో ఉన్న కంగనా రనౌత్ మాత్రం తాను నటించిన తాజా చిత్రం ‘రివాల్వర్ రాణి’ చూస్తే, తననెవరూ పెళ్లి చేసుకోరని ఓ ప్రకటన ఇచ్చేశారు. ఎందుకలా అంటున్నారు? అనడిగితే.. సినిమా చూడాల్సిందే అని పేర్కొన్నారు. సినిమా ప్రచారం కోసమే కంగనా ఇలా అంటున్నారేమో అనుకుంటే, తన వ్యక్తిగత జీవితానికి మైనస్ అయ్యేలా ఎందుకు మాట్లాడతారు? సో.. ఈ సినిమాలో కంగనా రొటీన్‌కి భిన్నంగా, చెయ్యకూడని పాత్ర ఏదో చేసి ఉంటారని ఊహించవచ్చు. బాలీవుడ్ టాక్ ప్రకారం.. ఇందులో ఆమె ఓ రాజకీయ నాయకురాలి పాత్ర చేశారని, ఓ సినిమా హీరో మీద మనసు పడతారని తెలిసింది. కంగనాపై పగ తీర్చుకోవడానికి ప్రత్యర్థులు ఆ సినిమా హీరోని కిడ్నాప్ చేస్తే, అతణ్ణి కాపాడుకోవడానికి ఆమె రంగంలోకి దిగుతారట. కాబట్టి, ఆమెది చాలా బోల్డ్ కేరక్టర్ అని అర్థమవుతుంది. ఈ పాత్రలో కంగన గ్లామరస్‌గా కనిపించడం మాత్రమే కాదు... వీరోచిత పోరాటాలు కూడా చేశారట. బహుశా కరడు గట్టిన వనితలా కనిపిస్తారేమో. అందుకే, ఈ సినిమా చూశాక తననెవరూ పెళ్లి చేసుకోవడా నికి ముందుకు రారని చెప్పి ఉంటారు. ఇటీవల కంగన నటించిన ‘క్వీన్’ విజయపథంలో దూసుకెళుతోంది. నటిగా ఆమెకు మంచి మార్కులు తెచ్చిపెట్టిందీ సినిమా. ‘రివాల్వర్ రాణి’ రెట్టింపు పేరు తెస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు కంగనా రనౌత్. -
అవార్డులకు ప్రాధాన్యత ఇవ్వను: కంగనా రనౌత్
ముంబై: అవార్డులకు ప్రాధాన్యత ఇవ్వనని బాలీవుడ్ తార కంగనా రనౌత్ తెలిపారు. క్వీన్ చిత్రంలో తన నటన ద్వారా విమర్శకుల ప్రశంసలందుకున్న సంగతి తెలిసిందే. ఈ రోజుల్లో చాలా అవార్డుల కార్యక్రమాలున్నాయని.. తనకు తెలిసినవే 16 వరకు ఉన్నాయన్నారు. ప్రతి అవార్డు కార్యక్రమంలో ఐదు ఆరు గంటలు కూర్చోవాల్సి ఉంటుందన్నారు. అంతేకాకుండా అవార్డుల కార్యక్రమం కోసం రెండు, మూడు గంటలపాటు మేకప్ వేసుకోవాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. అవార్డుల కార్యక్రమం కోసం చాలా శ్రమ పడాల్సిఉంటుందన్నారు. తనకు గ్యాంగ్ స్టర్, ఫ్యాషన్ చిత్రాలకు అవార్డులు లభించాయన్నారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవార్డు లభిస్తోందని కంగనా తెలిపారు. -
అమీర్ తో నటించడమే లక్ష్యం కాదు: కంగనా
బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ తో నటించడమే లక్ష్యం కాదని 'క్వీన్' కంగనా రనౌత్ అన్నారు. క్వీన్ చిత్రంతో అభిమానులు, సహ నటుల్నే కాకుండా విమర్శకుల్ని సైతం కంగనా మెప్పించారు. క్వీన్ లో నటన చూసిన తర్వాత కంగనతో నటించాలని అమీర్ ఖాన్ మనసులో మాట బయటపెట్టారు. అమీర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఇప్పటికిప్పుడే ఓ చిత్రంలో నటించడం కుదరని పని అన్నారు. అందర్ని ఆకట్టుకునే కథ దొరికితే, ఇద్దరం కలిసి నటించే అవకాశం కోసం వేచి చూస్తానని కంగనా తెలిపారు. క్వీన్ చిత్రం తర్వాత కంగనా రివాల్వర్ రాణి చిత్రంలో నటించింది. రివాల్వర్ రాణి ఏప్రిల్ 25 తేదిన విడుదల కానుంది. -
ఆ లేఖ చదువుతుంటే పెదవులు వణికాయి!
గత పదిహేను రోజులుగా కంగనా రనౌత్ ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. అభినందనల సముద్రంలో తడిసి ముద్దయిపోతున్నారు. దానికి కారణం ‘క్వీన్’ చిత్రం. కంగనా నాయికగా నటించిన ఈ చిత్రం విజయవిహారం చేయడంతో పాటు నటిగా ఆమెకు మంచి మార్కులు తెచ్చిపెట్టింది. నిన్న మొన్నటివరకు కంగనా ఓ మోస్తరు నటి మాత్రమే అన్నవాళ్లు సైతం ‘క్వీన్’ చూసి కంగనా ‘అద్భుతమైన నటి’ అని ప్రశంసించేస్తున్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఏకంగా ఓ ఫ్లవర్ బొకే, స్వహస్తాలతో రాసిన ఓ అభినందన లేఖ కంగనాకి పంపించారు. ఆ విషయం గురించి చెబుతూ -‘‘ఆ రోజు మా ఇంటి కాలింగ్ బెల్ మోగితే, నా సోదరి రంగోలి వెళ్లి తీసింది. నా పేరుతో ఉన్న ఓ బొకే, లెటర్ని డెలివరీ బోయ్ అందజేశాడు. ‘నీ కోసం ప్రత్యేకంగా వచ్చిన బహుమతి ఇది’ అంటూ రంగోలి నా చేతికిచ్చింది. పూల బొకే చాలా అందంగా ఉంది. దాన్ని పక్కన పెట్టి, లెటర్ విప్పాను. నన్ను ప్రశంసిస్తూ అమితాబ్‌గారు రాసిన ఆ ఉత్తరం చదువుతుంటే పెదాలు వణికాయి. భారతీయ సినిమా చరిత్రలో భేష్ అనదగ్గ నటుల్లో అమితాబ్‌గారు ఒకరు. ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన ఆయన ‘రాణీగా నువ్వు జీవించావు’ అంటూ.. ఇంకా నా నటన గురించి అద్భుతమైన పదాలతో ప్రశంసిస్తూ రాశారు. నాకైతే అంతా కలలా అనిపించింది. సినిమా పరిశ్రమలో గౌరవంతో పాటు ప్రేమాభిమానాలను కూడా పొందగలుగుతానని నేనూహించలేదు. అమితాబ్‌గారు మాత్రమే కాదు... సల్మాన్, షారుక్, ఆమిర్‌ఖాన్ ఇలా అందరూ అభినందించారు. చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు. -
డైలాగ్ రైటర్‌గా కంగనా
‘‘నేను మైనపు ముద్దలాంటిదాన్ని. ఓ పాత్ర ఎలా డిమాండ్ చేస్తే అలా మౌల్డ్ అయిపోతాను’’ అని పలు సందర్భాల్లో కంగనా రనౌత్ పేర్కొన్నారు, హాట్ గాళ్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న కంగనా ‘తను వెడ్స్ మను’తో పక్కింటి అమ్మాయిలా ఉందని కూడా అనిపించుకున్నారు. ఇక ఇటీవల విడుదలైన ‘రజ్జో’లో బ్రహ్మాండంగా నటించారు. కేరక్టర్ ఇన్‌స్పయిర్ చేస్తే చాలు... ఏమైనా చేయడానికి వెనకాడరు కంగనా. ప్రస్తుతం ‘క్వీన్’లో తాను పోషిస్తున్న పాత్ర ఈ బ్యూటీ క్వీన్‌కి బాగా నచ్చింది. దాంతో ఆ పాత్రకు డైలాగులు తానే రాస్తే బాగుంటుందని భావించారామె! అంతేకాదు... ఆ పని చేసి చూపించారు కూడా! దీనిపై చిత్రదర్శకుడు వికాస్ బాల్ మాట్లాడుతూ - ‘‘ఇందులో కంగనా ఒక చిన్న పట్టణానికి చెందిన అమ్మాయిగా నటిస్తోంది. బిడియం, అమాయకత్వం కలగలసిన పాత్ర ఇది. ఈ పాత్ర ఎలా మాట్లాడితే బాగుంటుందో కంగనా బాగా అవగాహన చేసుకుంది. దాంతో డైలాగ్స్ రాసింది. తను రాసిన డైలాగ్స్ కథ మరింత మెరుగవడానికి దోహదపడ్డాయి’’ అని చెప్పారు. కేవలం నటనే కాకుండా సినిమాకి సంబంధించిన ఇతర శాఖలంటే కూడా కంగనాకి ఇష్టం. అందుకే, త్వరలో షూటింగ్స్ నుంచి ఓ చిన్న బ్రేక్ తీసుకుని విదేశాలకెళ్లి, స్క్రీన్‌ప్లే, డెరైక్షన్ కోర్స్ కూడా చేయాలనుకుంటున్నారు కంగనా. సో.. భవిష్యత్తులో కంగనా మెగాఫోన్ పట్టినా కూడా ఆశ్చర్య పోనక్కర్లేదు మరి!.