సెన్సార్‌ సమస్యల్లో కాజల్‌ ‘క్వీన్‌’! | Queen Remake Paris Paris In Censor Trouble | Sakshi
Sakshi News home page

సెన్సార్‌ సమస్యల్లో కాజల్‌ ‘క్వీన్‌’!

Published Tue, Aug 6 2019 12:26 PM | Last Updated on Tue, Aug 6 2019 1:29 PM

Queen Remake Paris Paris In Censor Trouble - Sakshi

బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన క్వీన్‌ సినిమాను సౌత్ లో నాలుగు భాషల్లో ఒకేసారి రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో తమన్నా, తమిళ్‌లో కాజల్‌, కన్నడలో పరూల్‌ యాదవ్‌, మలయాళంలో మంజిమా మోహన్‌లు లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలోనే షూటింగ్ పూర్తయినా రిలీజ్ విషయంలో మాత్రం చిత్రయూనిట్ ఆలస్యం చేస్తున్నారు.

తాజాగా తమిళ వర్షనకు సంబంధించిన అప్‌డేట్‌ ఒకటి మీడియా సర్కిల్స్‌లో వినిపిస్తోంది. పారిస్‌ పారిస్‌ పేరుతో రూపొందిన ఈ సినిమాకు సెన్సార్‌ ఇబ్బందులు ఎదురవుతున్నట్టుగా తెలుస్తోంది. బోల్డ్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన  సినిమా కావటంతో చాలా డైలాగ్స్‌ను తొలగించాల్సిందిగా సెన్సార్‌ సభ్యులు సూచించారు.

అంతేకాదు సీన్స్‌ను బ్లర్‌ చేయాలని చెప్పటంతో చిత్రయూనిట్ రివైజ్‌ కమిటీని ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి రివైజింగ్‌ కమిటీ తమిళ క్వీన్‌కు క్లియరెన్స్‌ ఇస్తుందేమో చూడాలి. రమేష్‌ అరవింద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మను కుమరన్‌ నిర్మిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement