ramesh arvind
-
సెన్సార్ సమస్యల్లో కాజల్ ‘క్వీన్’!
బాలీవుడ్లో ఘన విజయం సాధించిన క్వీన్ సినిమాను సౌత్ లో నాలుగు భాషల్లో ఒకేసారి రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో తమన్నా, తమిళ్లో కాజల్, కన్నడలో పరూల్ యాదవ్, మలయాళంలో మంజిమా మోహన్‌లు లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలోనే షూటింగ్ పూర్తయినా రిలీజ్ విషయంలో మాత్రం చిత్రయూనిట్ ఆలస్యం చేస్తున్నారు. తాజాగా తమిళ వర్షనకు సంబంధించిన అప్డేట్ ఒకటి మీడియా సర్కిల్స్‌లో వినిపిస్తోంది. పారిస్ పారిస్ పేరుతో రూపొందిన ఈ సినిమాకు సెన్సార్ ఇబ్బందులు ఎదురవుతున్నట్టుగా తెలుస్తోంది. బోల్డ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా కావటంతో చాలా డైలాగ్స్‌ను తొలగించాల్సిందిగా సెన్సార్ సభ్యులు సూచించారు. అంతేకాదు సీన్స్‌ను బ్లర్ చేయాలని చెప్పటంతో చిత్రయూనిట్ రివైజ్ కమిటీని ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి రివైజింగ్ కమిటీ తమిళ క్వీన్‌కు క్లియరెన్స్ ఇస్తుందేమో చూడాలి. రమేష్ అరవింద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మను కుమరన్ నిర్మిస్తున్నారు. -
హమ్మయ్య.. సౌత్ 'క్వీన్' పట్టాలెక్కింది..!
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ క్వీన్ సినిమాను సౌత్‌లో రీమేక్ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముందుగా ఈ సినిమా తమన్నా లీడ్ రోల్ లో తెరకెక్కుతుందన్న టాక్ వినిపించింది. అయితే తమన్నా భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయటంతో క్వీన్ తమిళ రీమేక్ ను పక్కన పెట్టేశారు. అయితే ఇప్పటికే పరుల్ యాదవ్ లీడ్ రోల్ లో కన్నడలో ఈ సినిమా రీమేక్ పనులు జరుగుతుండగా తాజాగా తమిళ క్వీన్ కూడా పట్టాలెక్కేసింది. తమన్నా తరువాత తెరమీదకు వచ్చిన కాజల్ క్వీన్ గా నటించేందుకు అంగీకరించింది. నటుడు, దర్శకుడు రమేష్ అరవింద్ ఈ రీమేక్ కు దర్శకత్వం వహిస్తున్నాడు. 'పారిస్ పారిస్' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా లాంచింగ్ సందర్భంగా ఈ సందర్భంగా తాను ఎవరినీ అనుకరించనని.. తన స్టైల్ లోనూ క్వీన్ పాత్రలో నటిస్తానని తెలిపింది కాజల్. అంతేకాదు ఒరిజినల్ వర్షన్ నుంచి కేవలం కథను మాత్రమే తీసుకొని కొత్త తరహా టేకింగ్ తో సినిమాను రూపొందిస్తున్నారట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఆదివారం ఉదయం ప్రారంభించారు. -
పార్టీల కోసమో.. మతాల కోసమో..నేను సినిమాలు తీయడం లేదు!
- కమల్ హాసన్ ‘‘సినిమా ఎలా చేయాలో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. ఈ పరిస్థితిలో తీసిన సినిమాను ప్రతి ఒక్కరికీ చూపించాల్సి వస్తోంది. అది కూడా ఉచితంగా! ఆ సినిమా చూసి, వాళ్లు విడుదల చేసుకోమంటే చేసుకోవాలట! ఈ పరిస్థితి బాధాకరం’’ అని కమల్‌హాసన్ అన్నారు. రమేశ్ అరవింద్ దర్శకత్వంలో ఆయన హీరోగా రూపొందిన చిత్రం ‘ఉత్తమ విలన్’. పూజా కుమార్, ఆండ్రియా నాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులోకి సి. కల్యాణ్ విడుదల చేస్తున్నారు. మే 1న చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో కమల్‌హాసన్, సి. కల్యాణ్, రమేశ్ అరవింద్, నాజర్, పూజాకుమార్లు సోమవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ‘విడుదలకు ముందే మీ సినిమాలు వివాదాల్లో ఇరుక్కుంటున్నాయి కదా!’ అనే ప్రశ్నకు కమల్ పై విధంగా స్పందించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ - ‘‘భారతదేశంలో హిందువుల సంఖ్య ఎక్కువ. వాళ్లను వద్దనుకుని సినిమా తీయడం ఎలా? అలాగని ముస్లిమ్ ప్రేక్షకులను నేను వద్దనుకోవడం లేదు. వాళ్లూ ముఖ్యమే. ఈ రెండు వర్గాలతో పాటు అన్ని మతాల కుటుంబాలూ నాకు అవసరమే! నేను కాంగ్రెస్ కోసమో, బీజేపీ కోసమో... వేరే రాజకీయ పార్టీల కోసమో సినిమాలు తీయడం లేదు. ‘ప్రజల సినిమా’ తీస్తున్నా’’ అన్నారు. కళాకారులం తక్కువ సంఖ్యలో ఉన్నాం. అందుకే మమ్మల్ని మైనార్టీలుగా చూడమంటున్నానని కమల్ చెబుతూ -‘‘మేం గొప్ప అనడం లేదు. చాలా చాలా తక్కువ. అందుకే, దయచేసి మమ్మల్ని బాధపెట్టకండి. మాకు వచ్చిన కళను మీకు చూపించాలన్నదే మా తాపత్రయం తప్ప వేరే ఉద్దేశం లేదు. ఆ కళను ఆదరించండి. మమ్మల్ని ఆదరించండి. మమ్మల్ని అభిమానించడం ద్వారా మీకు మంచి పేరే వస్తుంది తప్ప చెడ్డ పేరు రాదు’’ అన్నారు. గెటప్స్ కోసం ఎప్పుడూ సినిమా చేయలేదని కమల్ చెబుతూ -‘‘కథ ఏ గెటప్ డిమాండ్ చేస్తే అదే చేస్తున్నాను. అప్పుడు ‘భారతీయుడు’, ‘భామనే సత్యభామనే’ - ఇలా ఏది చేసినా అందులో నేను వేసిన గెటప్స్ కథానుగుణంగానే ఉంటాయి. అవి బాగుండడంతో గుర్తుండిపోయాయి. ఇప్పుడు ‘ఉత్తమ విలన్’ ఓ సినిమా కళాకారుడి జీవితం నేపథ్యంలో సాగుతుంది. ఓ కళాకారుడిగా ఒక్క గెటప్‌లో కనిపించలేం కదా! ‘ఉత్తమ విలన్’ ఏంటి? అని చాలామంది అడుగుతున్నారు. నా దృష్టికోణంలో విలన్‌గా కనిపించేవాళ్లు.. మరొకరి దృష్టి కోణానికి హీరోలా కనిపిస్తారు. ఈ చిత్రంలో నా పాత్ర అలానే ఉంటుంది’’ అన్నారు. ఆండ్రియా, పూజా కుమార్‌లతో మళ్లీ సినిమా చేయడం గురించి అడగ్గా - ‘‘శ్రీదేవితో 27, శ్రీప్రియతో 27 సినిమాలు చేశాను. ఖుష్బూతో ఆరేడు సినిమాలు చేశాను. ఇప్పుడు ఆండ్రియా, పూజాకుమార్‌లతో మళ్లీ సినిమా చేయడానికి కారణం వాళ్ల ప్రతిభ. ఈ చిత్రంలోని పాత్రలకు వాళ్లే సరిపోతారు. అంతే తప్ప వేరే ఏమీ లేదు’’ అని నవ్వుతూ అన్నారు. అరవైఏళ్ల వయసులోనూ ఎనర్జిటిక్‌గా ఎలా ఉన్నారని కమల్‌ను అడిగితే - ‘‘వయసు శరీరానికే. మనసుకు కాదు. మన మనసుకు మనమే వయసు ఫిక్స్ చేసుకోవాలి’’ అన్నారు. సి. కల్యాణ్ మాట్లాడుతూ -‘‘ఇప్పటివరకూ 54 సినిమాలు చేశాను. పలు విజయాలు చవి చూశాను. కానీ, ఈ చిత్రం నాకు ప్రత్యేకం’’ అని వ్యాఖ్యానించారు. -
డైలాగ్ రైటర్‌గా కమల్‌హాసన్
‘సకలకళావల్లభన్’ అనే బిరుదుకు సార్థకతను తెచ్చిన వ్యక్తి కమల్‌హాసన్. నటుడిగా ఆయన చేసినన్ని ప్రయోగాలు.. ఆయన తరంలో కానీ, నేటి తరంలో కానీ ఎవరూ లేరన్నది నిజం. అభినయం పరంగానే కాకుండా, దర్శకునిగా, కథకునిగా, గాయకునిగా, నృత్యకారునిగా, గీత రచయితగా, సంభాషణల రచయితగా, నిర్మాతగా... పలు రంగాల్లో ప్రజ్ఞను చాటిన కళాకారుడు కమల్. ప్రస్తుతం ఆయన ‘ఉత్తమవిలన్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. నటుడు రమేశ్ అరవింద్ దర్శకత్వంలో.. దర్శకుడు లింగుస్వామితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడంతో పాటు కమల్ సంభాషణలు కూడా అందించడం విశేషం. తొలుత క్రేజీ మోహన్‌తో సంభాషణలు రాయించాలనుకున్నారాయన. అయితే.. కథ తనదే కాబట్టి తానే స్వయంగా సంభాషణలు రాస్తే బావుంటుందని కమల్ భావించడంతో కొంత విరామం తర్వాత ఆయన కలం చేతబట్టారట. ఓ సీనియర్ సూపర్‌స్టార్ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో కమల్‌హాసన్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రంలో కమల్ అభినయం ప్రేక్షకుల్ని తన్మయత్వానికి లోను చేస్తుందని చెన్నయ్ టాక్. ఆండ్రియా, పూజాకుమార్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్‌దత్, సంగీతం: గిబ్రన్. -
మళ్లీ పెన్ను పట్టనున్న కమల్ హాసన్
చెన్నై: సకల కళ వల్లభుడు కమల్ హాసన్ మళ్లీ పెన్ను పట్టనున్నారు. కమల్ హాసన్ హీరోగా తాజాగా తమిళంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఉత్తమ విలన్'. ఆ చిత్రానికి కమల్ మాటలు అందించనున్నారని ప్రముఖ నటుడు, ఆ చిత్ర దర్శకుడు రమేష్ అరవింద్ వెల్లడించారు. ఈ చిత్రానికి మాటలు రాసేందుకు ముందుగా క్రేజీ మోహన్‌ను అనుకున్నామని కానీ కమల్‌ను ఎంచుకున్నామని చెప్పారు. మాటల రచయితగా కమల్ వంద శాతం న్యాయం చేస్తారని ఆయన చెప్పారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేయనున్నారని ఆయన వివరించారు. మలయాళంలో రూపొందించిన దృశ్యం చిత్రం రీమేక్ పాపనాశమా తమిళ థ్రిల్లర్‌లో నటిస్తూ కమల్ యమా బిజీగా ఉన్నారని రమేష్ అరవింద్ చెప్పారు. -
ఉత్తమవిలన్‌లో కమల్‌హాసన్, జయరాం
పంచతంత్రం సినిమాలో విజయవంతంగా కామెడీని పండించిన కమల్‌హాసన్, జయరాం ఇప్పుడు కొత్తగా రూపొందుతున్న ఉత్తమవిలన్ చిత్రంలోనూ కలిసి కనిపించబోతున్నారు. ఉళగనాయకన్ (అంతర్జాతీయ హీరో) కమల్‌హాసన్‌తో కలిసి ఉత్తమవిలన్ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు జయరాం తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫొటోను కూడా అందులో పోస్ట్ చేశాడు. పంచతంత్రం సినిమాలో వీళ్లిద్దరూ కలిసి నటించిన పలు సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. వయసు మీరిపోతున్న సూపర్‌స్టార్ పాత్రను ఉత్తమవిలన్ చిత్రంలో కమల్ పోషిస్తున్నాడు. కమల్ స్వయంగా కథ అందించిన ఈ సినిమాకు కన్నడ నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ ఓ ముఖ్యపాత్రలో కనిపిస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరులో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. By mistake my previous tweets got deleted.. Posting again my snap from Kamal Haasan's @Uttama_Villain :) :) pic.twitter.com/ykbRROE66x — Jayaram (@UrsJayaramActor) March 12, 2014 -
కమల్ 'ఉత్తమ విలన్' పోస్టర్ కాపీయా?
విశ్వరూపం లాంటి సీరియస్ చిత్రం తర్వాత కమల్‌హాసన్ తీస్తున్న కామెడీ చిత్రం ఉత్తమవిలన్ షూటింగ్ ప్రారంభమైంది. కమల్ స్నేహితుడు, కన్నడ నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండు షెడ్యూళ్లలోనే పూర్తవుతుంది. అయితే, ఉత్తమ విలన్ పోస్టర్ విడుదల కాగానే విమర్శకులు దాన్ని కాపీగా అనుమానిస్తున్నారు. ఫ్రెంచి ఫొటోగ్రాఫర్ ఎరిక్ లాఫోర్గ్ కేరళకు చెందిన తెయ్యం అనే నృత్యరూపాన్ని ఫొటో తీయగా.. అచ్చం అలాగే కమల్ తన మేకప్ చేయించుకున్నారని అంటున్నారు. ''రెగ్యులర్ షూటింగ్ బెంగళూరులో ప్రారంభమైంది. కమల్ సార్ రెండు నాన్ స్టాప్ షెడ్యూళ్లలోనే సినిమా మొత్తం తీసేద్దామంటున్నారు. గత రెండు వారాలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో లొకేషన్లు వెతకడంలోనే ఆయన గడిపారు'' అని ఈ సినిమా ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ చిత్రంలో హీరోయిన్ సహా ప్రధాన పాత్రలు పోషించేది ఎవరన్న విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే.. ప్రముఖ దర్శకుడు, తన గురువు కె.బాలచందర్‌ను మాత్రం ఓ ముఖ్యపాత్రలో నటింపజేస్తున్నారు. గతంలో పంచతంత్రం, వసూల్‌రాజా ఎంబీబీఎస్ లాంటి కమల్ చిత్రాలకు సంభాషణలు అందించిన రచయిత క్రేజీ మోహన్ ఈ చిత్రానికి కూడా డైలాగులు అందిస్తున్నారు.