ఉత్తమవిలన్లో కమల్హాసన్, జయరాం
పంచతంత్రం సినిమాలో విజయవంతంగా కామెడీని పండించిన కమల్హాసన్, జయరాం ఇప్పుడు కొత్తగా రూపొందుతున్న ఉత్తమవిలన్ చిత్రంలోనూ కలిసి కనిపించబోతున్నారు. ఉళగనాయకన్ (అంతర్జాతీయ హీరో) కమల్హాసన్తో కలిసి ఉత్తమవిలన్ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు జయరాం తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫొటోను కూడా అందులో పోస్ట్ చేశాడు.
పంచతంత్రం సినిమాలో వీళ్లిద్దరూ కలిసి నటించిన పలు సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. వయసు మీరిపోతున్న సూపర్స్టార్ పాత్రను ఉత్తమవిలన్ చిత్రంలో కమల్ పోషిస్తున్నాడు. కమల్ స్వయంగా కథ అందించిన ఈ సినిమాకు కన్నడ నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ ఓ ముఖ్యపాత్రలో కనిపిస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరులో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.
By mistake my previous tweets got deleted.. Posting again my snap from Kamal Haasan's @Uttama_Villain :) :) pic.twitter.com/ykbRROE66x
— Jayaram (@UrsJayaramActor) March 12, 2014