Jayaram
-
అతిగా రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతా.. : ఎమ్మెల్యే గుమ్మనూరు
సాక్షి ప్రతినిధి, అనంతపురం/గుంతకల్లు: పత్రికల్లో ఇష్టమొచ్చినట్టు రాసుకుంటూ వెళితే రైలు పట్టాలపై పడుకోబెడతానని అనంతపురం జిల్లా గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ పాత్రికేయులను హెచ్చరించారు. గుంతకల్లులో టీడీపీ ప్రతినిధుల సమక్షంలో ఆయన మాట్లాడిన వీడియో టేపులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఒక టీవీ చానల్ (సాక్షి టీవీ కాదు)లో గుమ్మనూరు జయరాం సోదరులు రైలు పట్టాలపై పడుకోబెట్టి చంపుతున్నారన్నట్టుగా వార్తలొచ్చాయని, వాటిని నిరూపించాలని అన్నారు. తనకు మీడియా అంటే లెక్కలేదని, ఏదైనా అతిగా రాస్తే నిజంగానే రైలు పట్టాలపై పడుకోబెడతానని హెచ్చరించారు. ‘నేను అన్నీ చేసి వచ్చాను. ఇది నాకు పెద్ద లెక్క కాదు’ అని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. తన సోదరులు రాజకీయ పెత్తనం చేస్తున్నారని చాలామంది అంటున్నారని, అవసరమైతే వారిని పక్కనపెట్టి తానే రాజకీయం చేస్తానని అన్నారు. తనపై వార్తలు రాస్తే తాట తీస్తానని వార్నింగ్ ఇచ్చారు. తనపై కొంతమంది పనిగట్టుకుని వ్యతిరేక వార్తలు రాస్తున్నారని, వాటిని నిరూపించలేకపోతే నిజంగానే రైలు పట్టాలపై పడుకోబెడతానని అన్నారు. తాను ఫ్రెండ్లీగానే అడుగుతున్నానని, ఏదైనా రాసేట్టయితే చెప్పండని, తాను వెళ్లిపోయాక ఏవేవో రాయొద్దని అన్నారు. బుధవారం సాయంత్రం గుంతకల్లులో మీడియాతో మాట్లాడుతూ.. తనపై మీడియా చానళ్లు అసత్య ప్రసారాలు చేస్తున్నాయని, రైలు పట్టాలపై పడుకోబెట్టి చంపుతానంటూ ప్రసారాలు చేయడం కరెక్ట్ కాదని అన్నారు. ఇలాంటి ప్రసారాలను చేస్తే ఇదే తరహాలో ప్రవర్తించాల్సి వస్తుందని మీడియాకు వార్నింగ్ ఇచ్చారు. -
మోడల్ని పెళ్లి చేసుకున్న నటుడు జయరామ్ కొడుకు (ఫొటోలు)
-
ప్రముఖ నటుడు జయరామ్ ఇంట పెళ్లి సందడి
నటుడు జయరామ్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈయన మలయాళ నటుడే అయినా, తెలుగు, తమిళం తదితర భాషల్లోనూ సుపరిచితుడే. కథానాయకుడిగా పలు చిత్రాల్లో నటించినా, ఆ తరువాత వివిధ రకాల పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో ఈయన పోషించిన హాస్యపాత్ర అందరినీ అలరించింది. తెలుగులోనూ అల వైకుంఠపురం వంటి చిత్రాల్లో నటించారు. ఇకపోతే ఈయన భార్య పార్వతి కూడా నటినేన్నది గమనార్హం. పలు మలయాళ చిత్రాల్లో నటించారు. అంతే కాకుండా ఈమె ప్రముఖ నృత్యకళాకారిణిగా మెప్పించారు. వీరి కుమారుడు కాళిదాస్ జయరామ్ కూడా వర్ధమాన నటుడిగా రాణిస్తున్నారు. కాగా కాళిదాస్ జయరామ్ ఇప్పుడు పెళ్లి కొడుకు అవుతున్నారు. ధారణి అనే చిరకాల ప్రేమికురాలితో జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధం అవుతున్నారు. వీరి పెళ్లి డిసెంబర్ 8న ఆదివారం గురువాయూర్ ఆలయంలో జరగనుంది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం చైన్నెలో వీరి ఫ్రీ వెడ్డింగ్ వేడుక నిర్వహించారు. కాళిదాస్ జయరామ్, ధారణిల వివాహానికి ఇప్పటికే ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్, రజనీకాంత్, దర్శకుడు మణిరత్నం వంటి ప్రముఖులకు జయరామ్ దంపతులు శుభలేఖలను అందించి, ఆహ్వానించారన్నది గమనార్హం. నటుడు కాళిదాస్ ఇటీవల నటుడు ధనుష్ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన రాయన్ చిత్రంలో ఆయనకు తమ్ముడిగా ముఖ్యపాత్రను పోషించారన్నది గమనార్హం. ఇకపోతే ధారణి కూడా తన కళాశాల కాలం నుంచే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించారు. ఫ్యాషన్ షోలు, వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నారు. అంతే కాకుండా మిస్ తమిళనాడు, మిస్ సౌత్ ఇండియా అందాల పోటీల్లో రన్నర్ అప్‌గా నిలిచారు. కాగా కొన్నేళ్లుగా నటుడు కాళిదాస్, ధారణిలు ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి ఇరుకుటుంబ పెద్దలు పచ్చజెండా ఊపడంతో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ నెల 8వ తేదీన పెళ్లి జరగనుంది. వీరి వివాహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. -
జయరామ్ కుమారుడి ఇంట పెళ్లి సందడి.. కాబోయే కోడల్ని కూతురు అన్న నటుడు (ఫోటోలు)
-
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్ (ఫోటోలు)
-
గ్రాండ్‌గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
ప్రముఖ మలయాళ నటుడు జయరాం కుమార్తె మాళవిక ఇటీవలే వివాహబంధంలోకి అడుగుపెట్టింది. జయరాం-పార్వతి ముద్దులక కూతురైన మాళివిక నవనీత్‌ను పెళ్లాడింది. వీరి వివాహం బంధువులు, సన్నిహితుల సమక్షంలో త్రిసూర్‌లోని గురువాయూర్ ఆలయంలో చాలా సింపుల్‌గా జరిగింది. అయితే తాజాగా వీరి వివాహా రిసెప్షన్ ఘనంగా నిర్వహించారు.కొచ్చిలోని ప్రముఖ హోటల్లో మాళవిక-నవనీత్ రిసెప్షన్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి మలయాళ సినీ తారలు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈవేడుకలో మమ్ముట్టి, దిలీప్, జాకీ ష్రాఫ్, పృథ్వీరాజ్ సుకుమారన్, మీనాక్షి, శోభన, ఖుష్బు సుందర్ లాంటి ప్రముఖల తారలందరూ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. .@mammukka #yusufAli @PrithviOfficial #Supriya @ #Jayaram’s daughter Malavika’s wedding reception in Kochi pic.twitter.com/ff1VoT9mVk— sridevi sreedhar (@sridevisreedhar) May 5, 2024 -
గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
-
గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు
ప్రముఖ నటుడు జయరాం ఇంట పెళ్లి బాజాలు మోగాయి. జయరాం- పార్వతి దంపతుల కూతురు మాళవిక పెళ్లి ఎంతో సింపుల్‌గా జరిగింది. పాలక్కడ్‌కు చెందిన నవనీత్ గిరీశ్‌తో ఏడడుగులు వేసింది. శుక్రవారం నాడు కేరళలోని గురువాయూర్ ఆలయంలో జరిగిన ఈ వివాహానికి ఇరు కుటుంబసభ్యులు సహా బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కేరళ సీఎం పినరయి విజయన్ సహా ఇతర రాజకీయ, సినీ సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వరుడు నవనీత్ గిరీశ్ విషయానికి వస్తే.. అతడు ప్రస్తుతం యూకేలో చార్టెడ్ అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు.మాళవిక విషయానికి వస్తే.. ఆమె వేల్స్ దేశంలో స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ పూర్తి చేసింది. మాళవిక- నవనీత్ల ఎంగేజ్మెంట్ కర్ణాటకలోని మడికెరిలో గతేడాది డిసెంబర్లో జరిగింది. -
ఓటీటీకి సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, జయరాం, అనూప్ మేనన్, అనస్వర రాజన్ కీలకపాత్రల్లో నటించిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ అబ్రహాం ఓజ్లర్. ఈ చిత్రానికి మిథున్ మాన్యువల్ థామస్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. దాదాపు రూ.40 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మార్చి 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ తాజాగా రివీల్ చేసింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. మిధున్ మాన్యువల్ థామస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జయరామ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో అర్జున్ అశోకన్, ఆర్య సలీం, సైజు కురుప్, సెంథిల్ కృష్ణ కీలక పాత్రలు పోషించారు. మలయాళంలో సూపర్ హిట్ కావడంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. pic.twitter.com/zMSmETJMBw — Disney+ Hotstar (@DisneyPlusHS) March 1, 2024 -
సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అతిథి పాత్రలో నటించిన 'అబ్రహం ఓజ్లర్'. సైకలాజికల్ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రంలో జయరాం హీరోగా నటించారు. ఈ సినిమాలో మమ్ముట్టి సీరియల్ కిల్లర్‌గా నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్లో కనిపించారు. గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఎలాంటి అంచనాలు లేకపోయినా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.37 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రానికి మిధున్ మాన్యుల్ థామస్ దర్శకత్వం వహించారు. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేసింది. ఎలాంటి హడావుడి లేకుండా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో జయరాం కెరీర్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. అలెగ్జాండర్ జోసెఫ్ అనే సీరియల్ కిల్లర్ పాత్రలో మెగాస్టార్ మమ్ముట్టి కనిపించారు. కాగా.. జయరాం రెండు సినిమాలు ఒకే రోజు ఓటీటీలోకి వచ్చాయి. అబ్రహం ఓజ్లర్ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజవ్వగా.. తెలుగు మూవీ గుంటూరు కారం మూవీ నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ఆడియెన్స్ ముందుకు వచ్చింది. గుంటూరు కారం మూవీలో మహేష్ బాబు తండ్రిగా మెప్పించారు. ఈ సినిమాలో అనశ్వర రాజన్, అర్జున్ అశోకన్, అనూప్ మీనన్, ఆర్య సలీం, సైజు కురుప్, సెంథిల్ కృష్ణ కీలక పాత్రల్లో నటించారు. భాగమతి సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన జయరాం.. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తోన్న గేమ్ ఛేంజర్‌లో కనిపించనున్నారు. -
కన్నీళ్లు తెప్పిస్తున్న చిన్నారుల బాధ.. భారీ సాయం చేసిన హీరో
కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన వెల్లియామామట్‌లో సుమారు 15 ఆవులు మృతి చెందాయి. ఎండిన పచ్చిమిర్చి పొట్టుతో పాటు కలుషితమైన ఆహారం తినడం వల్లే అవి మృతి చెందాయని తెలుస్తోంది. ఈ పశువులు ఇద్దరు యువకులు జార్జ్ (18), మాథ్యూ (15)లకు చెందినవి. తన తండ్రి మరణం తరువాత వారిద్దరూ సుమారు 3 ఏళ్ల నుంచి ఆవులను పెంచుకుంటున్నారు. పాఠశాలకు వెళ్తూనే డెయిరీ రంగంలోకి వారు కష్టపడుతున్నారు. మాథ్యూ చదువుతో పాటు ఆవులను కూడా పెంచుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ సమయంలో వారి ఆవులు చనిపోవడంతో మాథ్యూ, జార్జ్‌తో పాటు వారి తల్లి కుంగిపోవడం ఆపై వారు ఆస్పత్రి పాలు కావడం జరిగింది. గతంలో వీరు రాష్ట్ర ఉత్తమ బాల పాడి రైతుగా అవార్డును గెలుచుకున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న డైరీ ఫామ్‌లలో వీరిది ఒకటి. డిసెంబర్ 31న వారి ఆవులు చనిపోవడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా రోడ్డున పడింది. ఆ కుటుంబం ఇబ్బందిని తెలుసుకున్న మలయాళ నటీనటులు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ప్రముఖ నటుడు జయరామ్ వారికి భారీ సాయం అందించారు. తాజాగా ఆయనే స్వయంగా వారి ఇంటికి చేరుకుని రూ. 5 లక్షలు అందించడం విశేషం. జయరామ్‌కు తెలుగు చిత్ర సీమలో కూడా మంచి గుర్తింపు ఉంది. అల్లు అర్జున్ ‘అలా వైకుంఠపురంలో’ సినిమాలో తండ్రిగా నటించిన విషయం తెలిసిందే. ఆ చిన్నారుల కుటుంబానికి సాయంగా మలయాళ స్టార్ నటుడు మమ్ముట్టి కూడా రూ. లక్ష, సలార్ నటుడు పృథ్వీరాజ్ రూ.2 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారని జయరామ్ పేర్కొన్నారు. ఈ రోజు సాయంత్రం ఇద్దరూ పిల్లలకు ఆ డబ్బు కూడా అందజేయనున్నట్లు తెలుస్తోంది. జయరామ్ ఆర్థిక సాయం చేసిన డబ్బు తన కొత్త సినిమా ట్రైలర్ లాంచ్ కోసం ఏర్పాటు చేసుకున్న డబ్బు అని ఆయన తెలిపారు. గతంలో తాను ఎంతో ప్రేమతో పెంచుకున్న ఆవులు కూడా కొన్ని కారణాల వల్ల మృత్యువాత పడ్డాయని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తాను, తన భార్య ఎంతో బాధపడ్డామని ఆయన తెలిపారు. మరోవైపు కేరళ పశుసంవర్ధక శాఖ మంత్రి చించు రాణి, జలవనరుల శాఖ మంత్రి రోషి అగస్టిన్ ఆ యువ రైతుల కుటుంబానికి చేరుకున్నారు. బీమాతో కూడిన ఐదు ఆవులను రైతులకు అందజేయనున్నట్లు మంత్రి హామీనిచ్చినట్టు తెలుస్తోంది. ఆపై ఆ కుటుంబానికి తక్షణ సాయంగా రూ. 50,000 అందించారని సమాచారం. -
Malavika Jayaram Engagement: అల వైకుంఠపురములో నటుడు జయరాం కూతురి నిశ్చితార్థం (ఫొటోలు)
-
సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్న 'విక్రమ్' నటుడు.. అమ్మాయి ఎవరంటే?
మరో యంగ్ హీరో పెళ్లికి రెడీ అయిపోయాడు. ఎన్నాళ్ల నుంచి సొంత రాష్ట్రానికి చెందిన మోడల్ తో ప్రేమలో ఉన్నాడు. ఈ విషయం కొన్నాళ్ల ముందు బయటపెట్టాడు. ఇప్పుడు పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ వేడుక రహస్యంగా జరిగింది. ఆ తర్వాత ఇందుకు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇవి వైరల్‌గా మారాయి. (ఇదీ చదవండి: తెలుగులో చేగువేరా బయోపిక్.. రిలీజ్ డేట్ ఫిక్స్) మలయాళ నటుడు జయరాయ్ కొడుకు కాళీదాస్ ప్రస్తుతం హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పలు తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తున్నాడు. గతేడాది రిలీజైన 'విక్రమ్'లో కమల్ హాసన్ కొడుకుగా నటించింది ఇతడే. ఇప్పుడు ఈ నటుడు.. చాలారోజుల నుంచి మోడల్ తరిణి కళింగరాయర్తో ప్రేమలో ఉన్నాడు. ఇప్పుడు వీళ్లిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక కాళీదాస్ తండ్రి జయరామ్.. అనుష్క 'భాగమతి' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత అల వైకుంఠపురములో, రాధేశ్యామ్, రావణాసుర, ధమాకా, ఖుషి తదితర చిత్రాల్లో కీలక పాత్రలు చేశారు. ఇప్పుడు కొడుకు ఎంగేజ్మెంట్తో ఫుల్ ఖుషీలో ఉన్నారు. డిసెంబరులో లేదంటే వచ్చే ఏడాది ప్రారంభంలో కాళీదాస్-తరిణి పెళ్లి జరిగే అవకాశాలున్నాయి. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7: పదో వారం ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్!) View this post on Instagram A post shared by Kalidas Jayaram (@kalidas_jayaram) -
భారత క్రికెట్లో విషాదం.. మాజీ కెప్టెన్ మృతి!
కేరళ మాజీ కెప్టెన్, కెసీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు కె జయరామన్(67) గుండెపోటుతో మృతి చెందారు. ఆయన శనివారం రాత్రి తిరువనంతపురంలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. 1980లలో కేరళ రంజీ జట్టు తరపున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లలో జయరామన్ ఒకరు. 1986-87 రంజీల సీజన్లో ఆయన వరుసగా నాలుగు సెంచరీలు సాధించి, భారత సీనియర్ జట్టుకు ఎంపికయ్యే స్థాయికి చేరుకున్నారు. కానీ దురదృష్టవశాత్తూ అతడికి భారత జట్టులో చోటుదక్కలేదు. జయరామన్ కేరళ సీనియర్, జూనియర్ జట్లకు కెప్టెన్‌గా కూడా పనిచేశారు. తన కెరీర్లో 44 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన జయరామ్ 5 సెంచరీలు, 10 అర్ధసెంచరీలతో 2,358 పరుగులు చేశారు. దులీప్ ట్రోఫీలో సౌత్ జోన్ తరఫున కూడా ఆడారు. ఇక ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత చాలా కాలం పాటు కేరళ జట్టుకు చీఫ్ సెలెక్టర్‌గా పనిచేశారు. అదే విధంగా అండర్-22, అండర్-25 జట్లకు చీఫ్ సెలెక్టర్‌గా కూడా పనిచేశారు. 2010లో బీసీసీఐ మ్యాచ్ రిఫరీగా కూడా జయరామన్ పనిచేశారు. ఇక జయరామ్ మృతిపట్ల బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ సంతాపం వ్యక్తం చేశారు. చదవండి: WTC Cycle 2023-25: వెస్టిండీస్‌పై ఘన విజయం.. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టిన టీమిండియా -
అయ్యో బాబోయ్ వీళ్ల ఆన్సర్స్ చూస్తే ఎలాంటివాడైన పడి పడి నవ్వాల్సిందే...!
-
ఈ ఇంటర్వ్యూ ఒక లెక్క అయితే వీళ్ళు ఆడిన గేమ్ నెక్స్ట్ లెవెల్..!
-
సస్పెన్స్.. థ్రిల్
జయరామ్ తేజ లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘హింట్’. చందూ బిజుగ దర్శకత్వంలో మైత్రీరెడ్డి, రిజ్వాన్ అహ్మద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని నవ్యాంద్ర ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు ఎస్వీఎన్ రావు రిలీజ్ చేశారు. ‘హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది’’ అన్నారు చందూ. ‘‘టీవీ సీరియల్స్‌లో నటిస్తున్న నాకు హీరోగా చాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు జయరామ్ తేజ. ‘‘సింగిల్ షెడ్యూల్లో చిత్రాన్ని పూర్తి చేస్తాం’’ అన్నారు మైత్రీ రెడ్డి. -
టాలీలో మాలీ హవా
‘ప్రతిభకి భాషతో సంబంధం లేదు’ అనే మాట చిత్ర పరిశ్రమలో తరచుగా వినిపిస్తుంటుంది. టాలెంటెడ్ ఆర్టిస్ట్‌లు ఏ భాషలో ఉన్నా తెలుగు పరిశ్రమ సాదర స్వాగతం పలుకుతుంది. ప్రస్తుతం తెలుగులో సెట్స్‌పై ఉన్న పలు చిత్రాల్లో జయరామ్, పృథ్వీరాజ్ సుకుమారన్, ఫాహద్ ఫాజిల్, దేవ్ మోహన్, జోజూ జార్జ్, సుదేష్ నాయర్.. వంటి పలువురు మలయాళ నటులు కీలక పాత్రలతో హవా సాగిస్తున్నారు. ఈ మాలీవుడ్ నటులు చేస్తున్న తెలుగు చిత్రాలపై ఓ లుక్కేద్దాం. బిజీ బిజీగా... ‘భాగమతి.. అల వైకుంఠపురములో, రాధేశ్యామ్, ధమాకా... ఇలా వరుసగా తెలుగు సినిమాలు చేశారు మలయాళ సీనియర్ నటుడు జయరామ్. నెగటివ్, పాజిటివ్ క్యారెక్టర్స్‌తో తెలుగులో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శ కత్వం వహిస్తున్న ‘గేమ్ ఛేంజర్’తో పాటు మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రంలో జయరామ్ కీలక పాత్ర చేస్తున్నారు. అదిరే ఎంట్రీ మలయాళం స్టార్ హీరోల్లో ఒకరైన ఫాహద్ ఫాజిల్ ‘పార్టీ లేదా పుష్పా..’ అంటూ తెలుగులోకి అడుగుపెట్టారు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప: ది రైజ్’ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రతో అదిరే ఎంట్రీ ఇచ్చారు ఫాహద్. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ చిత్రంలోనూ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో నటిస్తున్నారు ఫాహద్ ఫాజిల్. ‘పుష్ప’ మొదటి భాగంలో ఆయన పాత్ర నిడివి తక్కువగానే ఉన్నా రెండో భాగంలో మాత్రం పూర్తి స్థాయిలో ఉంటుందని టాక్. పదమూడేళ్ల తర్వాత... మాలీవుడ్‌లో ఓ వైపు స్టార్ హీరోగా దూసుకెళుతూ మరోవైపు డైరెక్టర్‌గా (లూసిఫర్, బ్రో డాడీ) ప్రతిభ చూపిస్తున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్. కాగా మన్మోహన్ చల్లా దర్శకత్వం వహించిన ‘పోలీస్ పోలీస్’ (2010) చిత్రం ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చారు పృథ్వీరాజ్. ఆ చిత్రంలో ఓ హీరోగా నటించిన ఆయన పదమూడేళ్ల గ్యాప్ తర్వాత మరో తెలుగు చిత్రంలో (‘సలార్’) నటిస్తున్నారు. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో జగపతిబాబు ఓ విలన్‌గా నటిస్తుండగా ఆయన తనయుని పాత్రలో పృథ్వీరాజ్ నటిస్తున్నారట. పృథ్వీ పాత్ర నెగటివ్ టచ్‌తో ఉంటుందని టాక్. సెప్టెంబర్ 28న ‘సలార్’ విడుదల కానుంది. ‘శాకుంతలం’తో వచ్చి... గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ‘శాకుంతలం’తో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు దేవ్ మోహన్. మలయాళంలో నటించింది కొన్ని సినిమాలే అయినా తొలి తెలుగు చిత్రంలోనే సమంత వంటి స్టార్ హీరోయిన్‌కి జోడీగా నటించే అవకాశం అందుకున్నారు దేవ్ మోహన్. ఈ సినిమాలో దుష్యంత మహారాజుగా నటించి, మెప్పించారు దేవ్. ఇలా ‘శాకుంతలం’తో తెలుగుకి వచ్చి, రెండో తెలుగు సినిమా ‘రెయిన్బో’లోనూ మరో స్టార్ హీరోయిన్ రష్మికా మందన్నాకి జోడీగా నటించే చాన్స్ అందుకున్నారు దేవ్. శాంతరూబన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. జోజు.. సుదేష్ కూడా... మలయాళంలో నటుడిగా, నిర్మాతగా, గాయకుడిగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న జోజూ జార్జ్ ‘ఆది కేశవ’ సినిమాతో తెలుగులోకి అడుగుపెడుతున్నారు. వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో విలన్‌గా నటిస్తున్నారు జోజూ. అలాగే నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న సినిమా ద్వారా సుదేష్ నాయర్ తెలుగుకి ఎంట్రీ ఇస్తున్నారని టాక్. ఈ చిత్రంలో ఆయన స్టైలిష్ విలన్ పాత్రలో కనిపిస్తారట. వీళ్లే కాదు.. మరికొందరు మలయాళ నటులు కూడా తెలుగు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
SSMB28: మహేశ్ మూవీకి తప్పని లీకుల బెడద.. కన్ప్యూజన్లో ఫ్యాన్స్!
సెల్‌ఫోన్, సోషల్ మీడియా వచ్చిన తర్వాత షూటింగ్ లోకేషన్స్ నుంచి లీక్స్ కామన్ అయిపోయాయి. చిన్న బడ్జెట్ సినిమాల సంగతి పక్కన పెడితే..భారీ బడ్జెట్ సినిమాలు ఈ లీకుల బెడద నుంచి తప్పించుకోవటానికి ఎంత ప్రయత్నించినా...అవి ఆపటం ఎవరి వల్ల కావటం లేదు. పుష్ప2, సలార్ సినిమా షూటింగ్ లోకేషన్స్ నుంచి పోటోలు , వీడియో క్లిప్స్ లీక్స్ అయ్యాయి. ఇప్పుడు మాటలమాంత్రికుడు త్రివిక్రమ్-సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న #ssmb 28 మూవీ నుంచి మహేష్ బాబు ఫస్ట్ లుక్ లీక్ అయింది. ప్రజెంట్ సోషల్ మీడియాలో మహేష్ బాబు #ssmb 28 ఫస్ట్ లుక్ వైరల్ గా మారింది. పుష్ప 2, సలార్ మూవీ షూటింగ్ లోకేషన్స్ నుంచి ఆ క్లిప్స్ ఎవరు లీక్ చేశారో తెలియదు. కానీ #ssmb 28 మూవీలోని మహేష్ బాబు లుక్ ఎవరు లీక్ చేశారో తెలిసిపోయింది. ఈ సినిమాలో మలయాళ నటుడు జయరామ్ ఓ ఇంపార్టెంట్ రోల్ లో నటించనున్నాడు. గతంలో జయరామ్ త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అల వైకుంఠపురంలో కూడా నటించాడు.ఇప్పుడు #ssmb 28 లో మహేష్ తో కలిసి నటించనున్నాడు. యాక్టర్ జయరామ్, మహేష్ బాబు తో కలిసి నటించటం ఇదే మొదటిసారి. ఇక తను #ssmb 28లో నటిస్తున్నట్లుగా జయరామ్ కన్ఫర్మ్ చేశాడు. అంతేకాదు త్రివిక్రమ్, మహేష్ బాబుతో కలిసి దిగిన పోటో తన ఇన్ స్టాలో షేర్ చేశాడు. అలాగే ధియేటర్స్ లో కృష్ణ గారి సినిమాలు చూస్తూ పెరిగాను...ఇప్పుడు ఆయన కొడుకు మహేష్‌తో కలిసి నటించటం సంతోషంగా వుందంటూ రాసుకొచ్చాడు. జయరామ్ తను మహేశ్ తో నటిస్తున్న సంగతి చెప్పడం ఏమో గానీ....నెటిజన్స్ అయితే #ssmb 28లో మహేశ్ బాబు ఫస్ట్ లుక్ లీక్ చేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య పబ్లిక్ ఈవెంట్స్ లో కనిపించినప్పుడు మహేశ్ కు కొంచెం హెయిర్ ఎక్కువగానే ఉంటుంది. ఆ లుక్ త్రివిక్రమ్ మూవీ కోసమే అని అందరికీ అర్ధమైంది. ఇప్పుడు జయరామ్ సెట్స్ నుంచి మహేష్ తో దిగిన పోటో షేర్ చేయటంతో...లుక్ పై మహేష్ ప్యాన్స్ కి ఒక క్లారిటీ వచ్చేసింది. దసరా సీజన్ లో రిలీజ్ చేయాలను కుంటున్న ఈ సినిమా షూటింగ్ ను ఏప్రిల్ ఎండింగ్ కల్లా పాటలు, ఒక ఫైట్ మినహా మిగిలిన టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేశాడు త్రివిక్రమ్. ఈ సినిమా టైటిల్ పై సోషల్ మీడియా తెగ డిస్కషన్ నడుస్తోంది. అయోధ్యలో అర్జునుడు, ఆరంభం, అతడే తన సైన్యం వంటి టైటిల్స్ పరిశీలన ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మూడు టైటిల్స్ కాకుండా కొత్త టైటిల్ ను ఉగాది రోజు అనౌన్స్ చేయనున్నారట మేకర్స్.మహేశ్‌బాబు కూడా ఈ సినిమా త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నాడు.ఈ సినిమా తర్వాత మహేశ్.. రాజమౌళి దర్శకత్వంలో నటిస్తాడు. పాన్ వరల్డ్ మూవీ గా తెరకెక్కించబోయే ఈ సినిమా ఓపెనింగ్ ఆగస్ట్ లో జరుగుతుందనే మాట టి.టౌన్ లో వినబడుతోంది. View this post on Instagram A post shared by Jayaram (@actorjayaram_official) -
పారిశ్రామికవేత్త జయరాం హత్య కేసు.. రాకేష్‌రెడ్డిని దోషిగా తేల్చిన కోర్టు..
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. నిందితుడు రాకేష్ రెడ్డిని దోషిగా తేల్చింది. ఈనెల 9న శిక్షను ఖరారు చేయనుంది. 2019 జనవరి 31న జయరాం దారణహత్యకు గురయ్యారు. ఈయనను హత్య చేసిన రాకేష్ రెడ్డి.. తన స్నేహితులతో కలిసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. జయరాం మృతదేహాన్ని విజయవాడలోని నందిగామ రహదారిపై వాహనంలో ఉంచారు. నాలుగేళ్లుగా విచారణ సాగుతున్న ఈ కేసులో 11 మంది నిందితులపై కేసు కొట్టివేసింది న్యాయస్థానం. రాకేష్ రెడ్డే కుట్ర చేసి జయరాంను హత్యచేసినట్లు నిర్ధరించి అతడ్ని దోషిగా తేల్చింది. ఏసీపీ మల్లారెడ్డితో పాటు మరో ఇద్దరు సీఐలను నిర్దోషులుగా ప్రకటించింది. మొత్తం 73 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది. చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో గోరంట్ల బుచ్చిబాబుకు బెయిల్ -
కాంగ్రెస్ నాయకుడి తులసీరెడ్డిపై మండిపడ్డా మంత్రి జయరాం
-
కెమెరామ్యాన్ జయరాం కన్నుమూత
‘మేజర్ చంద్రకాంత్, పెళ్లిసందడి’ తదితర చిత్రాల ఛాయాగ్రాహకుడు వెంగల జయరాం (70) కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడ్డ ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. జయరాం స్వస్థలం వరంగల్. దివంగత ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం. 1960లో ‘ఇల్లరికం’ సినిమాను దాదాపు 15 సార్లు చూశారట.. అప్పుడే ఆయనకు సినిమాలపై ఆసక్తి పెరిగింది. టైటిల్స్‌లో ఛాయాగ్రాహకుడు విన్సెంట్ సుందరం పేరు చదివేవారు. ఆ తర్వాతి కాలంలో ఆయనకు శిష్యుడు అయ్యారు జయరాం. సినిమా ఇండస్ట్రీలో ఏదో చేయాలనే లక్ష్యంతో 13 ఏళ్ల వయసులో ఇంట్లో చెప్పకుండా పారిపోయి చెన్నై చేరారు. అక్కడ దర్శకుడు గుత్తా రామినీడు సిఫారసుతో ఆంధ్రా క్లబ్లో ఓ చిన్న ఉద్యోగం వచ్చింది. జయరాం ఫ్రెండ్ వి. అంకిరెడ్డి ఎడిటర్. జయరాంలోని ఆసక్తి గమనించిన రామినీడు ‘పగలు నీ జాబ్ చేసుకో.. రాత్రి ఈ వర్క్ నేర్చుకో’ అన్నారు. ఆంధ్రా క్లబ్లో క్యాషియర్ స్థాయికి ఎదిగారు జయరాం. ఆ తర్వాత అవుట్ డోర్ యూనిట్ నుంచి కెమెరా అసిస్టెంట్, ఆ తర్వాత కెమెరామ్యాన్ స్థాయికి ఎదిగారాయన. కెమెరామేన్‌గా ఆయన మొదటి సినిమా చిరంజీవి హీరోగా నటించిన ‘చిరంజీవి’. ‘శ్రీ షిర్డీ సాయిబాబా మహాత్మ్యం’ ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ‘1921’ అనే మలయాళ సినిమా జయరాంకు అవార్డును తెచ్చిపెట్టింది. తన అభిమాన హీరో ఎన్టీఆర్‌తో ‘మంచికి మరోపేరు, డ్రైవర్ రాముడు, వేటగాడు, సింహబలుడు’, ఏయన్నార్, కృష్ణ, మలయాళంలో మమ్ముట్టి, మోహన్‌లాల్ తదితర హీరోల చిత్రాలకు చేశారు. మోహన్‌బాబు సొంత బ్యానర్లో నిర్మించిన ఎన్నో చిత్రాలకు పనిచేశారు. తెలుగు, మలయాళ ఇండస్ట్రీల్లో పలు అవార్డులు, రివార్డులు అందుకున్నారాయన. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. జయరాం మృతి పట్ల తెలంగాణ ఫిలిం సొసైటీ ఫౌండర్ సెక్రటరీ డా. కొణతం కృష్ణ, కార్యవర్గ సభ్యులు రవి, రమేష్ వరంగల్‌లో నివాసం ఉంటున్న జయరాం సోదరిని కలిసి సంతాపం వ్యక్తం చేశారు. ఇంకా పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. -
టాలీవుడ్లో మరో విషాదం.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కన్నుమూత
కరోనా మహమ్మారి తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు నింపుతోంది. కోవిడ్ బారిన పడి ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు మృతి చెందారు. తాజాగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వి. జయరాం కరోనాతో కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడిన, చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. తెలుగు,మలయాళ చిత్రాలకు ఆయన సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. టాలీవుడ్లో నందమూరి తారక రామారావు, కృష్ణ, అక్కినేని నాగేశ్వర రావు, చిరంజీవి, మోహన్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలకు పనిచేశారు. అలాగే మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్, సురేష్ గోపి లాంటి హీరోల సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసి మంచి గుర్తింపు తెచుకున్నారు. ‘పెళ్లి సందడి’, ‘మేజర్ చంద్రకాంత్’లాంటి సూపర్ హిట్ చిత్రాలకు ఆయన సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. .జయరామ్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. చదవండి: కరోనాతో యు. విశ్వేశ్వరరావు కన్నుమూత -
సర్కారు వారిపాట: మహేశ్‌కి తండ్రిగా సీనియర్ హీరో
అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రంలో వ్యాపారవేత్త రామచంద్రగా తండ్రి పాత్ర పోషించారు మలయాళ నటుడు జయరామ్. తాజాగా మరోసారి ఆయన తండ్రి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. మహేశ్‌బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారిపాట’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జయరామ్ నటిస్తున్నారు. అయితే ఆయన ఏ పాత్ర చేస్తున్నారనేది బయటకు రాలేదు. తాజా సమాచారం ప్రకారం మహేశ్‌బాబు తండ్రి పాత్రను జయరామ్ చేస్తున్నారట. జయరామ్ బ్యాంక్ మేనేజర్ అని టాక్. ఈ సినిమా బ్యాంకు మోసాలకు సంబంధించిన కథాంశంతో తెరకెక్కుతోంది. ఇందులో మహేశ్ సరసన కీర్తీ సురేష్ నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఇక జయరామ్ విషయానికొస్తే.. అనుష్క టైటిల్ రోల్ చేసిన ‘భాగమతి’ చిత్రంలో ఆయన నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్’, మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇవి కాకుండా మలయాళంలో కొన్ని చిత్రాల్లో నటిస్తున్నారు. -
రేడియో మాధవ్
తమిళ నటుడు విజయ్ సేతుపతి నటించిన తొలి మలయాళ చిత్రం ‘మార్కొని మతాయ్’. జయరామ్ మరో హీరోగా నటించిన ఈ సినిమాకి సనల్ కలతిల్ దర్శకత్వం వహించారు. లక్ష్మీ చెన్న కేశవ బ్యానర్‌పై నిర్మాత కృష్ణస్వామి ఈ చిత్రాన్ని ‘రేడియో మాధవ్’ టైటిల్‌తో తెలుగులో అనువదిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను హీరో శ్రీవిష్ణు విడుదల చేసి, ‘నిర్మాతలకు ఆల్ ది బెస్ట్. సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది’ అన్నారు. ‘ఫస్ట్ లుక్ విడుదల చేసినందుకు శ్రీ విష్ణుగారికి కృతజ్ఞతలు. గతంలో దుల్కర్ చేసిన ‘కలి’ చిత్రాన్ని ‘హే పిల్లగాడ’గా విడుదల చేశాం. ఇప్పుడు మంచి కథాంశంతో రూపొందిన ‘రేడియో మాధవ్’ని అందిస్తున్నాం. రేడియో స్టేషన్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే చిత్రమిది’ అన్నారు కృష్ణస్వామి. ‘థియేటర్స్ పరిస్థితిని బట్టి విడుదల తేదీపై ఓ నిర్ణయం తీసుకుంటాం’ అన్నారు సహనిర్మాత చలం. చిత్ర నిర్వాహకుడు శ్రీనివాస మూర్తి, మాటల రచయిత భాష్య శ్రీ మాట్లాడారు. -
అయ్యన్నకు మతి భ్రమించింది: జయరాం
సాక్షి, అమరావతి: ‘పచ్చ’ కళ్ల వానికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని ఉద్దేశించి రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ విమర్శించారు. తాడేపల్లిలో మంగళవారం ఆయన తనను కలిసిన మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. టీడీపీ అధికారం కోల్పోయాక మంత్రులుగా పనిచేసిన మాజీలకు పూర్తిగా మతిభ్రమించిందన్నారు. ఆలూరు నియోజకవర్గం వచ్చి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. నిరాధార ఆరోపణలు చేస్తే పరువు నష్టం కేసు వేస్తానని మంత్రి హెచ్చరించారు. ఫ్యాక్టరీ పెట్టాలనే తలంపుతో 15 ఏళ్ల క్రితం మంజునాథ్, మను అనే సోదరులు రైతుల వద్ద భూమిని కొనుగోలు చేశారని తెలిపారు. తరువాత వారి మధ్య విభేదాలు రావడంతో అందులో కొద్దిపాటి భూమిని మాత్రమే మంజునాథ వద్ద తాను కొన్నానని వివరించారు. ఒక బీసీ రైతు 30 ఎకరాలు కొనుగోలు చేయకూడదా అని ప్రశ్నించారు. రెండెకరాల చంద్రబాబు రూ.వేల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించాడో అయ్యన్నపాత్రుడు సమాధానం చెప్పాలని నిలదీశారు. -
లాక్డౌన్ ఉల్లంఘించి.. ఎమ్మెల్యే బర్త్‌డే పార్టీ
బెంగళూరు : దేశంలో లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలుచేస్తున్నా.. మరోవైపు నిబంధనలను అతిక్రమిస్తూనే ఉన్నారు. పని ఉన్నా లేకున్నా అనవసరంగా రోడ్లపైకి వచ్చి తిరుగుతూ. నానా హంగామా చేస్తున్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం నొక్కి చెబుతునప్పటికీ ప్రజలు చెవినకెక్కించుకోవడం లేదు. లాక్డౌన్ కాలంలో ప్రజలు గుమిగూడి వివాహాలు, వేడుకలు, వినోదాలకు దూరంగా ఉన్నాలని ప్రభుత్వం తెలియజేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ నిబంధనలు అతిక్రమిస్తున్నారు. సాధారణ ప్రజలతోపాటు ఈ జాబితాలోకి రాజకీయ నాయకులు కూడా చేరిపోయారు. తాజాగా కర్ణాటకలోని ఓ బీజేపీ ఎమ్మెల్యే తన పుట్టినరోజును అనేకమంది గ్రామస్తుల సమక్షంలో జరుపుకున్నారు. (కరోనాపై పోరులో చిరంజీవి తల్లి ) తుమకూరు జిల్లా తురువెకెరె నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం జయరామ్ గుబ్బి ప్రాంతంలో శుక్రవారం పుట్టిన రోజును జరుపుకున్నారు. స్థానికుల సమక్షంలో నిర్వహించిన ఈ వేడుకకు కరోనాకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే వారంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరిలో చిన్నారులు కూడా ఉండటం గమనార్హం. అంతేగాక అందరి సమక్షంలో కేక్ కట్ చేసి, అనంతరం వారికి బిర్యానీతో విందును ఏర్పాటు చేశారు. దీంతో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో నిబంధనలు పాటించని బీజేపీ ఎమ్మెల్యే సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా కర్ణాటకలో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం ఇదేం మొదటిసారి కాదు. గత నెలలో ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సైతం ఓ పెళ్లికి హాజరై విమర్శలు ఎదుర్కొన్నారు. (‘అమెరికా పౌరులను అడ్డుకుంటే చర్యలు తప్పవు’) ప్రస్తుతం కర్ణాటకలో 200కు పైగా కరోనా కేసులు నమోదవ్వగా.. ఆరుగురు మరణించారు. కాగా మూడు వారాలపాటు విధించిన లాక్‌డౌన్‌ను పొడిగించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే అంతిమ నిర్ణయం ప్రధాని నరేంద్ర మోదీని సంప్రదించిన తర్వాతే ముఖ్యమంత్రి యడియూరప్ప ఓ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇక దేశంలో మొత్తం కరోనా కేసులు 6761కు చేరగా.. 206 మంది మృత్యువాత పడ్డారు. (కరోనా: ఒకే ఇంట్లో ఐదుగురికి సోకిన వైరస్ ) -
కార్మిక శాఖలో ప్రక్షాళన ప్రారంభమయ్యింది
-
రాజన్న కలలను నెరవేరుస్తున్నారు
-
తెలుగోడికి ఓటేసి గెలిపించండి..
ప్రయాణం.. కొందరికి అవసరం, మరికొందరికి సరదా.. కానీ కొంతమందికి మాత్రం అది ప్యాషన్. గేదెల జయరాజ్ ఇలాంటి కోవకే చెందుతాడు. అతనికి ట్రావెలింగ్‌పై ఉన్న ఇష్టంతో ఇప్పటికే ఎన్నో ప్రదేశాలు చుట్టొచ్చాడు. కానీ భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ అంతర్జాతీయ పోటీ ‘ఫాల్‌రవెన్ పోలార్’లో పాల్గొనాలన్నది ఆయన లక్ష్యం. ‘ఫాల్‌రవెన్ పోలార్’ అనేది అంతర్జాతీయ ట్రావెలింగ్ పోటీ. ఈ పోటీకి వందకు పైగా దేశాల్లోనుంచి వేలల్లో ఎంట్రీలు వస్తే కేవలం పది మందిని మాత్రమే ఎంపిక చేస్తారు. ఇలాంటి పోటీకి వెళ్లాలని రెండేళ్ల క్రితమే కంకణం కట్టుకున్న వ్యక్తి జయరాజ్ గేదెల. మీరూ ఓటు వేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి - Vote For 'Jayaraj Gedela' పైసా లేకుండా ప్రయాణం జయరాజ్ స్వస్థలం వైజాగ్. అతనికి ఉన్న దృష్టిలోపాన్ని చూసి తోటి విద్యార్థులు హేళన చేసేవారు. కానీ అతను అవన్నీ పట్టించుకోకుండా చదువుపై ఏకాగ్రత పెంచుకుంటూ పదవ తరగతిలో స్కూలు టాపర్‌గా నిలిచాడు. ఇంటర్‌లోనూ ఫస్ట్‌క్లాస్‌లో పాస్ అయ్యాడు. అయితే ఇంటర్ మిత్రుడు పవన్ పప్పల ట్రావెలింగ్‌ను పరిచయం చేయడంతో అతని జీవితం మలుపు తిరిగింది. ప్రయాణంపై ఉన్న ఆసక్తితో 2014లో మొదటిసారి హిప్పీ ట్రావెలింగ్ చేశాడు. వెంట పైసా తీసుకెళ్లకుండా ప్రయాణం చేయడమే హిప్పీ ట్రావెలింగ్. విశాఖ నుంచి కాశీ వరకు ఖాళీ జేబుతోనే ప్రయాణించాడు. జీవితంలో ట్రావెలర్ బ్లాగర్‌గా స్థిరపడాలన్నది అతని కోరిక. అంతకన్నా ముందు ఫాల్‌రవెన్ పోలార్ పోటీకి వెళ్లాలన్నది అతని మరో లక్ష్యం. ఈ పోటీలు సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరుగుతాయి. ఈ పోటీలో కొన్నిసార్లు -30, -50 డిగ్రీల ఉష్ణోగ్రతనూ తట్టుకుని నిలబడాల్సి ఉంటుంది. ఈసారైనా... ఈ పోటీలో పాల్గొనేందుకు జయరామ్ గత రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. టాలీవుడ్ ప్రముఖులు సమంత, వరుణ్‌తేజ్, సుకుమార్ ఇలా చాలామందే సోషల్ మీడియాలో ఆయనకు మద్దతు పలికారు. అయినప్పటికీ చివరి నిమిషంలో అతడికి అవకాశం చేజారింది. కనీసం ఈ సారైనా జయరామ్‌కి ఓటేసి గెలిపిస్తే భారతదేశం తరపున ఓ వ్యక్తి అంతర్జాతీయ పోటీలో పాల్గొనే అవకాశం లభిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ పోటీలకు ఆఖరి గడువు నేటితో ముగియనుండటంతో ట్విటర్లో #VoteForJayaraj అనే హ్యాష్‌ట్యాగ్‌ను హోరెత్తిస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన ఓట్ల ప్రకారం జయరాజ్ రెండో స్థానంలో కొనసాగుతుండగా.. కేరళకు చెందిన అష్రఫ్ అలీ మొదటి స్థానంలో నిలిచాడు. ఇంకెందుకాలస్యం.. మీరు జయరాజ్‌కు ఓటు వేయాలనుకుంటే ఈ కింది లింక్‌ను క్లిక్ చేయండి - http://bit.ly/voteforjayaraj -
హిమాచల్ గవర్నర్‌గా దత్తాత్రేయ
సాక్షి, న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్ 27వ గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం ఉదయం 10.30కి సిమ్లాలోని రాజ్‌భవన్‌లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ధరమ్ చంద్ చౌదరి.. దత్తాత్రేయతో ప్రమాణం చేయించారు. అంతకుముందు హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా దత్తాత్రేయను నియమిస్తూ రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను ఉన్నతాధికారి చదివి వినిపించారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఫైలుపై సంతకం చేసి దత్తాత్రేయ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయరాం ఠాకూర్ నూతన గవర్నర్ దత్తాత్రేయకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దత్తాత్రేయ కుటుంబసభ్యులతోపాటు, హిమాచల్‌ప్రదేశ్ మంత్రివర్గ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, పార్టీ నేతలు చింతల రామచంద్రారెడ్డి, జితేందర్‌రెడ్డి, డీకే అరుణ తదితరులు కార్యక్రమంలో పాల్గొని దత్తాత్రేయకు శుభాకాంక్షలు తెలిపారు. దత్తన్నకు బీజేపీ నేతల అభినందనలు సాక్షి, హైదరాబాద్: సిమ్లాలో హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేసిన దత్తాత్రేయ కు రాష్ట్ర బీజేపీ నాయకులు నల్లు ఇంద్రసేనారెడ్డి, ఇ.పెద్దిరెడ్డి, జి.వివేక్, టి.రాజేశ్వరరావు, ధర్మారా వు, సంకినేని వెంకటేశ్వరరావు, కాసం వెంకటేశ్వ ర్లు, చింతా సాంబమూర్తి, ప్రేమేందర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి తదితరులు అభినందనలు తెలిపారు. జీవితంలో కొత్త అధ్యాయం: దత్తాత్రేయ హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టడం తన జీవితంలో కొత్త అధ్యాయంగా భావిస్తున్నట్లు దత్తాత్రేయ పేర్కొన్నారు. గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. 35 ఏళ్లపాటు రాజకీయాల్లో ఉన్న తాను ప్రజా జీవితంలో ఎల్లప్పుడూ అంకితభావంతో పనిచేశానని, ఇప్పుడు దక్కిన ఈ రాజ్యాంగబద్ధమైన పదవి తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. ఈ అవ కాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని చెప్పారు. దైవభూమిగా పేరుగాంచిన హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేసే అవ కాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాలకు కృతజ్ఞతలు తెలిపారు. -
ఈఎస్ఐలో రూ.300 కోట్ల అవినీతిపై విచారణకు మంత్రి ఆదేశం
-
ఈఎస్ఐ అవినీతిపై విచారణకు ఆదేశం
సాక్షి, అమరావతి : ఈఎస్ఐలో జరిగిన రూ.300 కోట్ల మేర అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ ఆదేశించారు. టీడీపీ ప్రభుత్వంలో ఈఎస్ఐ మందుల కొనుగోళ్లులో భారీగా అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. మంత్రుల అండదండలతో మందులను సరఫరా చేయకుండానే బిల్లులను నమోదు చేసి పెద్ద ఎత్తున అధికారులు అక్రమాలకు పాల్పడ్డారు. అవసరంలేని, గడువు ముగిసిపోయే మందులను సరఫరా చేసి ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు. ఆస్పత్రులకు మందులు సరఫరా చేయకుండానే కోట్ల రూపాయాల ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు సరఫరాదారులతో అధికారులు కుమ్మకమయ్యారు. ఈఎస్ఐ కార్యాలయం అద్దెలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఈ కుంభకోణంలో రూ.300 కోట్లకు పైగా సొమ్మును స్వాహా చేసుకున్నారని గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. దీంతో ఈఎస్ఐ అవినీతిపై విచారణ జరిపించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని మంత్రి జయరామ్ శనివారం అధికారులను ఆదేశించారు. ఈ విచారణ బాధ్యతను కార్మిక శాఖ డైరెక్టర్‌కు అప్పగించారు. -
ఫుల్ స్పీడ్
సగానికి పైనే ప్రయాణాన్ని పూర్తి చేసింది ‘అల వైకుంఠపురములో’ టీమ్. మిగతా భాగాన్ని కూడా ఫుల్ స్పీడ్‌లో పూర్తి చేస్తోంది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. అల్లు అరవింద్, యస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజాహెగ్డే కథానాయిక. టబు, జయరామ్, నివేదా పేతురాజ్, సుశాంత్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన ఇంటి సెట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. ఈ షెడ్యూల్ మరికొన్ని రోజులు సాగుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకుడు. -
చోళ రాజుల కథలో...
ప్రస్తుతం తమిళంలో అందరి చూపు మణిరత్నం తెరకెక్కించబోయే ‘పొన్నియిన్ సెల్వన్’ మీదే ఉందని చెప్పొచ్చు. చోళుల కథ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఐశ్వర్యా రాయ్, విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, నయనతార, అనుష్క, కీర్తీ సురేశ్, అమలా పాల్ వంటి నటీనటులు ఈ సినిమాలో కనిపించబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. తాజాగా ఈ సినిమాలో మలయాళ నటుడు జయరామ్ కూడా కనిపిస్తారని తెలిసింది. ఓ ఇంటర్వ్యూలో ‘పొన్నియిన్ సెల్వన్’ చేస్తున్నట్టు జయరామ్ ప్రకటించారు. తన పాత్ర ఎలా ఉంటుందనే విషయం మాత్రం చెప్పలేదు. జయరామ్ ప్రస్తుతం తెలుగులో ‘అల వైకుంఠపురములో’ యాక్ట్ చేస్తున్నారు. -
ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన గుమ్మనూరు జయరామ్
-
జీరో నుంచి మొదలయ్యా
‘‘నేను 1998లో ‘పెళ్లి పందిరి, పవన్‌కల్యాణ్ ‘తొలిప్రేమ’ చిత్రాలతో డిస్ట్రిబ్యూటర్‌గా సక్సెస్ అవుతున్న టైమ్. అప్పుడు ఉపేంద్రగారి సినిమాలను ‘తొలిప్రేమ’తో కంపేర్ చేస్తే.. పిచ్చి సినిమాలుగా అనిపించాయి. ‘ఇలాంటి సినిమాలు ప్రేక్షకులు చూస్తారా?’ అనుకునేవాణ్ణి. తర్వాత ‘ఆర్య’ స్క్రిప్ట్ చూసినప్పుడు ఉపేంద్రగారి సినిమాలు చూశా. ఆయన ఎలా చేశారు? బోల్డ్‌గా, నెగిటివ్‌గా వెళుతున్నప్పుడు క్యారెక్టర్‌ను ఎలా బ్యాలెన్స్ చేశారు? అనేది చూశాను. ఈరోజు ఆయన సినిమా ఫంక్షన్‌కి రావడం సంతోషంగా ఉంది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. ఉపేంద్ర హీరోగా నటించిన చిత్రం ‘ఐ లవ్ యు’. ‘నన్నే... ప్రేమించు’ అనేది క్యాప్షన్. రచితారామ్ హీరోయిన్. ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’తో తెలుగు పరిశ్రమకు దర్శకుడిగా పరిచయమైన ఆర్. చంద్రు స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మించారు. హైదరాబాద్‌లో ఈ సినిమా తెలుగు టీజర్ విడుదల చేశారు. ఉపేంద్ర మాట్లాడుతూ– ‘‘పెద్ద మనుషులు ఉంటేనే ఇండస్ట్రీ మరింత పెద్దది అవుతుంది. ఈ రోజు పెద్ద నిర్మాతలు, దర్శకులు, రచయితలు మా ఫంక్షన్‌కి వచ్చి, నా గురించి గొప్పగా మాట్లాడుతుంటే నేను ఇంకా మంచి సినిమాలు చేయాలని ఇన్స్పైర్ అవుతున్నా. ఇప్పటికీ ఇంత యంగ్‌గా ఎలా ఉన్నారని అందరూ అడుగుతున్నారు. నా సీక్రెట్ ఒక్కటే... నేను ప్రతిదీ జీరో నుంచి మొదలుపెట్టా. మన దగ్గర ఏమీ లేదంటే అప్పుడు క్రియేటివిటీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు జీరో నుంచి పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేశా. రాజకీయాల్లో డబ్బులే సమస్య. రాజకీయాలు వ్యాపారంగా మారడంతో 80 శాతం మంది ఇన్నోసెంట్ పీపుల్ని 20 శాతం మంది రూల్ చేస్తున్నారు. అది మారాలని పార్టీ పెట్టాను’’ అన్నారు. ‘‘నన్నే.. ప్రేమించు’ లాంటి ట్యాగ్ ఉపేంద్రగారికి మాత్రమే సరిపోతుంది. ‘అర్జున్‌రెడ్డి, ఆర్ఎక్స్ 100’ వంటి కల్ట్ మూవీస్ జాబితాలోకి ఈ సినిమా చేరుతుంది’’ అన్నారు నిర్మాత లగడపాటి శ్రీధర్. ‘‘అర్జున్‌రెడ్డి, ఆర్ఎక్స్ 100’ సినిమాలకి తాత ముత్తాత లాంటి సినిమాలను ఉపేంద్రగారు ఎప్పుడో తీశారు. ‘ఏ’, ‘ఓం’, ‘ఉపేంద్ర’ సినిమాలు చూస్తే ఆశ్చర్యం కలిగేది. ఉపేంద్ర, పూరి జగన్నాథ్‌గార్ల ఆలోచనలు దగ్గరగా ఉంటాయి. నేను కో డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఉపేంద్రగారితో పనిచేసే అదృష్టం కలిగింది’’ అని దర్శక–నిర్మాత వైవీయస్ చౌదరి అన్నారు. ‘‘నన్ను తెలుగుకు పరిచయం చేసిన లగడపాటి శ్రీధర్‌గారికి నేను రుణపడి ఉంటాను. ఇండియాలో టాప్ టెన్ దర్శకుల్లో ఉపేంద్రసార్ ఉంటారు అని డైరెక్టర్ శంకర్‌గారు ఓ సందర్భంలో చెప్పారు. అటువంటి గొప్ప దర్శకుణ్ణి రెండోసారి దర్శకత్వం చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. కథ విన్న ఉపేంద్రగారు ‘ఇది ఒక ‘గీతాంజలి’ అవుతుంది’ అన్నారు’’ అన్నారు ఆర్. చంద్రు. హీరో సుధాకర్ కోమాకుల, నటి సంజన, హైకోర్టు లాయర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మునీంద్ర కె. పుర, కెమెరా: సుజ్ఞాన్, లైన్ ప్రొడ్యూసర్: విజయ్ సూర్య, సంగీతం: డా. కిరణ్. -
జయరామ్ హత్య కేసులో మరో కోణం
-
ప్రిక్వార్టర్స్‌లో జయరామ్, రితూపర్ణ
హో చీ మిన్ (వియత్నాం): భారత షట్లర్లు అజయ్ జయరామ్, రితూపర్ణ దాస్ వియత్నాం ఓపెన్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో జయరామ్ 21–17, 21–16తో పిలియాంగ్ ఫిఖీలా (ఇండోనేసియా)పై... మహిళల సింగిల్స్‌లో రితూపర్ణ 21–13, 21–14తో షియోరి సైటో (జపాన్)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌కు చేరారు. మరో భారత ఆటగాడు కార్తీక్ జిందాల్ 9–21, 21–16, 21–16తో జూలియన్ పాల్ (మారిషస్)పై గెలిచి ప్రిక్వార్టర్స్ చేరాడు. ఇతర మ్యాచ్‌ల్లో సిరిల్ వర్మ తొలి రౌండ్లో 21–17, 21–16తో శ్రేయాన్‡్ష జైస్వాల్ (భారత్)పై గెలిచి... రెండో రౌండ్లో 20–22, 21–17, 17–21తో టాప్ సీడ్ యగోర్ కొలెహో (బ్రెజిల్) చేతిలో ఓడాడు. శివాని ఓటమి: తెలంగాణ యువ క్రీడాకారిణి రుత్విక శివాని మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో 19–21, 17–21తో యిన్ ఫన్ లిమ్ (మలేసియా) చేతిలో ఓడింది. ఇతర మ్యాచ్‌ల్లో రసిక రాజే, ముగ్ధ, వైదేహి కూడా పరాజయం పాలయ్యారు. మిక్స్డ్ డబుల్స్‌లో భారత్ పోరాటం ముగిసింది. తొలి రౌండ్లో ధ్రువ్ కపిల–జక్కంపూడి మేఘన జంట 17–21, 21–18, 21–23తో జియాంగ్ జెన్‌బాంగ్–చెన్ యింగెక్సూ(చైనా) జోడీ చేతిలో, శివమ్ శర్మ– పూర్విషా ద్వయం 15–21, 16–21తో తడయూకీ ఉరాయి– మియౌర (జపాన్) జంట చేతిలో ఓడింది. -
మాలీవుడ్ కాలింగ్
సన్నీ లియోన్.. నేషనల్ వైడ్‌గా ఫాలోయింగ్ ఉన్న హాట్ స్టార్. బాలీవుడ్ మాత్రమే కాకుండా తెలుగు, కన్నడ భాషల్లో స్పెషల్ సాంగ్స్‌తో ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో ‘వీర మహాదేవి’లో హీరోయిన్గా చేస్తున్నారు. ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీ సన్నీకి స్వాగతం పలికిందట. ‘ఒరు అడార్ లవ్’ రూపొందించిన ఒమర్ లులూ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారట. ప్రియా ప్రకాశ్ వారియర్ కొంటెగా కన్ను కొట్టి నేషనల్ పాపులారిటీ వచ్చేసింది ‘ఒరు అడార్ లవ్’ సినిమాకే. రంజాన్ పండుగకే ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. అనుకోని కారణాల వల్ల లేట్ అవుతూ వస్తోంది. ఒమర్ తెరకెక్కించే తదుపరి చిత్రంలో ఓ కీలక పాత్ర చేయనున్నారట సన్నీ. జయరామ్, హనీ రోస్ ముఖ్య తారలు. -
మోసం.. బాబు నైజం
సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వేదవతి నదిపై సాగునీటి ప్రాజెక్టు నిర్మించాలని కోరుతూ ఆదివారం హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం దీక్ష చేపట్టారు. దీక్షకు భారీ సంఖ్యలో రైతులు మద్దతు తెలిపారు. ఆలూరు: ప్రజలను మోసం చేయడం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి నైజమని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం విమర్శించారు. వేదవతి నదిపై ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని కోరుతూ ఆదివారం.. హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో ఒక రోజు దీక్ష నిర్వహించారు. ముందుగా వేదవతి నదిలో పూజలు జరిపారు. అనంతరం ర్యాలీగా స్టేజి వద్దకు చేరుకున్నారు. దీక్షకు ఆదోని, మంత్రాలయం, ఉరవకొండ ఎమ్మెల్యేలు సాయిప్రసాద్‌రెడ్డి, వై.బాలనాగిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా దీక్షను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయిందని, హామీలు ఇచ్చి అమలు చేయకపోవడంలో ఆయన నంబర్ వన్‌గా నిలిచారన్నారు. నీరు–చెట్టు కార్యక్రమంలో భాగంగా ఆలూరు నియోజకవర్గం కురువళ్లి గ్రామానికి వచ్చి..వేదవతి నదిపై ప్రాజెక్టు నిర్మాణానికి రూ.300 కోట్లు కేటాయిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. హామీ ఇచ్చి రెండేళ్లు పూర్తయినా నేటికీ అమలు చేయలేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి సర్వే చేయడానికి అధికారులు రూ.6 కోట్లు కావాలని ప్రతిపాదనలు పంపిస్తే ప్రభుత్వం రూ.2 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఆ నిధులు సరిపోవని, అధికారులు సర్వే పనులు కూడా ప్రారంభించలేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా నేటికీ రైతులకు సంతృప్తిగా రుణమాఫీ చేయలేదన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై వివక్ష వైఎస్సార్ హయాంలో పార్టీలకు అతీతంగా నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు మంజూరు అయ్యేవని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు నిధులు విడుదల చేయకుండా వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. ఆలూరు నియోజకవర్గంలో తన సొంత నిధులతో తాగునీరు, సీసీ రోడ్ల సమస్య పరిష్కరించానన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందన్నారు. టీడీపీ ప్రభుత్వ పాలనతో ప్రజలు విసుగుచెందారన్నారు. వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి చేద్దాం రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని ప్రజలకు ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి పిలుపునిచ్చారు. దీక్షనుద్దేశించి ఆయన మాట్లాడారు. వేదవతినదిపై ప్రాజెక్టు నిర్మించి తీరుతామని ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు ఎందుకు నెరవేర్చడం లేదో ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు. -
సీఎం మాటలు ఉత్తుత్తే!
హొళగుంద: నియోజకవర్గంలో వేదావతి నదిపై ప్రాజెక్ట్ నిర్మాణం , దేవరగట్టులో జింకల పార్కు ఏర్పాటుపై సీఎం చంద్రబాబు నాయుడు ఉత్తుత్తి మాటలు చెబుతున్నారని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం విమర్శించారు. గురువారం హొళగుంద, నాగరకణ్వీ గ్రామాల్లో జరిగిన వివాహ కార్యక్రమాలకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు అరికెర సభలో వేదావతి నదిపై ప్రాజెక్ట్ నిర్మాణం కోసం సర్వేకు రూ.250 కోట్లు విడుదల చేస్తానని పైసా కూడా వెచ్చించలేదన్నారు. దాదాపు నాలుగేళ్లు దాటి పోయినా నేటి వరకు అవే హామీలు, అబద్దాలు చెబుతూ ప్రజలను, రైతులను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతులను ఆదుకునే చిత్తశుద్ది టీడీపీ ప్రభుత్వానికి లేదన్నారు. పట్టిసీమా వల్ల ప్రయోజనం లేదని, పోలవరం ప్రాజెక్ట్ కూడా వైఎస్ రాజశేఖ్‌రెడ్డి పాలనలోనే సగం పూర్తియితే నాలుగేళ్లయినా మిగిలిన దాన్ని పూర్తి చేయలేక పోతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు బాగు పడాలన్నా, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలన్నా వైఎస్.జగన్మోహన్రెడ్డి వల్లే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. అలాగే ఈ నెల 8న వేదావతి నది నుంచి చేపట్టే పాదయాత్ర, గూళ్యంలో జరిగే ధర్నాకు పార్టీశ్రేణులు, రైతులు, కార్యాకర్తలు పెద్ద ఎత్తున తరలి విజయవంత చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మెల్యే సోదరుడు గుమ్మనూరు శ్రీనివాసులు, హొళగుంద, హాలహర్వీ మండలాల కన్వీనర్లు షఫియుల్లా, బీమప్పచౌదరి, ఎంపీటీసీ సభ్యులు మల్లికార్జున, గజ్జెళ్లీ కెంచప్ప, నాయకులు పాల్తూరు గోవిందు, కుమారస్వామి, రామకృష్ణ, మాజీ సర్పంచ్ అయ్యాళప్ప, ఉప సర్పంచ్ జెండే శేకన్న, మారుతి, కిష్టప్ప, ఆటోమల్లి, సిద్దప్ప తదితరులు పాల్గొన్నారు. -
భాగమతి కమింగ్
డిసెంబర్లో రిలీజ్ చేస్తారా? గ్రాఫిక్స్ వర్క్స్ ఉన్నాయట కదా.. డిసెంబర్లో కష్టం. సంక్రాంతికి రేస్‌లో ఉంటుందేమో? ఊహూ.. సమ్మర్‌కి వస్తుందేమో? – ఇదిగో ఇలాంటి చర్చలే ‘భాగమతి’ సినిమా రిలీజ్ గురించి ఫిల్మ్‌నగర్‌లో వినిపించాయి. ఆ చర్చలకు ఫుల్స్టాప్ పెట్టేయొచ్చు. ఎందుకంటే... ‘భాగమతి’ని వచ్చే ఏడాది జనవరి 26న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ‘పిల్ల జమీందార్’ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో అనుష్క ముఖ్యపాత్రలో రూపొందుతున్న సినిమా ‘భాగమతి’. ఉన్ని ముకుందన్, జయరామ్, ఆషా శరత్, మురళీ శర్మ కీలక పాత్రలు చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళంలో విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘సూపర్‌ఫామ్‌లో ఉన్న అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘భాగమతి’ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఫస్ట్ లుక్‌కి వచ్చిన స్పందన చిత్రబృందానికి మంచి ఎనర్జీ ఇచ్చింది. దర్శకుడు అశోక్ అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. అనుష్క నటన సినిమాకు హైలైట్. మథి కెమెరా వర్క్ స్పెషల్ ఎట్రాక్షన్. తమన్ సంగీతం సూపర్. సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది’’ అన్నారు నిర్మాతలు. -
శ్రుతి బాటలో హన్సిక
తమిళసినిమా: సంచలన హీరోయిన్లలో నటి శ్రుతీహాసన్ ఒకరు. నిజం చెప్పాలంటే కోలీవుడ్‌లో చాలా చిత్రాల్లో నటించినా సరైన విజయం తన ఖాతాలో ఇప్పటికీ పడలేదనే చెప్పాలి. ప్రస్తుతం చేతిలో తన తండ్రితో నటిస్తున్న చిత్రం మినహా వేరే చిత్రం కూడా లేదు. మంచి అవకాశం శ్రుతీహాసన్కిప్పుడు చాలా అవసరం అని చెప్పకతప్పదు. అదే విధంగా నటి హన్సిక పరిస్థితి దాదాపు అలానే ఉంది. చేతిలో పెద్దగా చిత్రాలు లేవు. మలయాళంలో మోహన్‌లాల్‌తో విలన్ అనే చిత్రంలో నటిస్తోంది. విషయం ఏమిటంటే శ్రుతీహాసన్ దర్శకుడు సుందర్.సీ తెరకెక్కించనున్న భారీ చారిత్రాత్మక కథా చిత్రం సంఘమిత్రలో నటించడానికి ఎంపికై, గత మేలో ఫ్రాన్స్‌లో జరిగిన కేన్స్ అంతర్జాతీయ చిత్రోత్సవాల వేదికపై జరిగిన లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఆ తరువాత అనూహ్యంగా ఆ చిత్రం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి సంచలనానికి తెరలేపారు. ఆ విషయం పెద్ద వివాదానికి దారి తీసిందన్నది వేరే విషయం. తరువాత సంఘమిత్ర చిత్రంలో శ్రుతీహాసన్ ప్లేస్‌ను నటి హన్సిక భర్తీ చేస్తుందనే ప్రచారం జోరందుకుంది. సుందర్.సీ. ఫేవరేట్ నటిగా ముద్రపడిన హన్సికతో ఫొటో సెషన్ కూడా చేశారనే ప్రచారం జరిగింది. జయంరవి, ఆర్య కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీత మాంత్రికుడు ఏఆర్.రెహ్మాన్ భాణీలు కడుతున్నారు. ఇక షూటింగే తరువాయి అనుకుంటున్న తరుణంలో చిత్రం నుంచి హన్సిక కూడా నటించడం లేదనే ప్రచారం తాజాగా సామాజక మాద్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో మళ్లీ కథ మొదటి కొచ్చిందనిపిస్తోంది. అయితే ఈ విషయమై చిత్ర వర్గాలు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. -
భారీగా ఇస్తాం నటించవా ప్లీజ్!
కావాలంటే పారితోషికాన్ని భారీగానే ముట్టజెబుతాం.అని నయనతారను దర్శక నిర్మాతలు బ్రతిమలాడుతున్నారట. ఇది నిజమేనా? సంగతేమిటంటే సంఘమిత్ర చిత్రానికింకా నాయకి దొరకలేదట. శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మించితలపెట్టిన భారీ చారిత్రాత్మక కథా చిత్రం సంఘమిత్ర. సుందర్.సీ కథ, కథనం,దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రంలో కథానాయకులను ఎంపిక చేయడానికి చాలానే తర్జన భర్జనలు పడాల్సి వచ్చింది. విజయ్, అజిత్, టాలీవుడ్ స్టార్ నటుడు మహేశ్‌బాబు వరకూ చర్చలు జరిగాయి. వారందరూ కథ బ్రహ్మాండం అన్నారే కానీ, అందులో నటించడానికి సాహసించలేదు. అందుకు వారు చెప్పిన కారణం రెండేళ్ల పాటు సంఘమిత్ర కోసం కాల్షీట్స్ను కేటాయించలేమన్నదే. ఎట్టకేలకు జయంరవి, ఆర్య కథానాయకులుగా సెట్ అయ్యారు. ఇక కథానాయకి ఎంపికకు అదే పరిస్థితి. నటి శ్రుతీహాసన్ నటించడానికి సమ్మతించి చివరి క్షణంలో వైదొలిగారు. ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం సద్దుమణిగినా నాయకి ఎవరన్నది ప్రశ్నగానే మారింది. బాహుబలి ఫేమ్ అనుష్కను నటింపజేసే ప్రయత్నం జరిగింది. తను ఇప్పటికే బాహుబలి చిత్రం కోసం రెండేళ్లకు పైగా సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. మళ్లీ అన్ని కాల్షీట్స్తో తానీ చిత్రం చేయలేనని చేతులెత్తేసినట్లు సమాచారం. దీంతో దర్శకుడు సుందర్.సీ.తన ఆస్థాన కథానాయకి హన్సిక పేరును సిఫారసు చేసినా, నిర్మాత అందుకు సమ్మతించలేదనే టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఒక దశలో బాలీవుడ్ భామను నటింపజేసే ఆలోచన జరిగిందట. అదీ వర్కౌట్ కాకపోవడంతో నటి నయనతారపై దృష్టిసారించినట్లు తాజా సమాచారం.అయితే ఈ టాప్ హీరోయిన్ చేతి నిండా చిత్రాలతో చాలా బిజీగా ఉన్నారు. అయినా భారీ పారితోషికం ముట్టజెబుతాం సంఘమిత్రలో రాణి కావాలంటూ బ్రతిమలాడే ధోరణికి దిగారని సోషల్ మీడియాలో తాజాప్రచారం. కాగా తాను ఇప్పటికే అంగీకరించిన చిత్రాలకు ఎలాంటి ఇబ్బంది కలగని రీతిలో కాలషీట్స్ కోరితే సంఘమిత్రలో నటించడానికి రెడీ అని నయనతార అన్నట్లు లేటెస్ట్ న్యూస్. ఏదేమైనా ఈ విషయంలో క్లారిటీ రావడానికి మరి కొంత సమయం పడుతుందని చెప్పవచ్చు. -
అలాంటి వ్యక్తితో నేను చేయలేను!
పురుషాధిక్యం గల నిర్మాతతో కలిసి పని చేయలేనని నటి వరలక్ష్మీశరత్‌కుమార్ అన్నారు.ఈ సంచలన నటి ఎవరి గురించి మాట్లాడుతున్నారన్నదేగా మీ ఆసక్తి. ఆ మధ్య నటుడు విశాల్‌తో ప్రేమాయణం, ఆ తరువాత అది మనస్పర్థల కారణంగా ముగిసిందనే ప్రచారం మీడియాలో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ఇక నటిగా తారాతప్పట్టై చిత్రంలో గరగాట కళాకారిణిగా నటించి అందరి ప్రశంసలు అందుకున్న వరలక్ష్మీశరత్‌కుమార్‌కు ఈ తరువాత వరుసగా అవకాశాలు రావడం మొదలెట్టాయి. ప్రస్తుతం అమ్మాయి వంటి హారర్ కథా చిత్రంతో పాటు కొన్ని చిత్రాల్లో నటిస్తున్న వరలక్ష్మీశరత్‌కుమార్‌కు మాలీవుడ్‌లో రంగప్రవేశం చేసే అవకాశం వచ్చింది. తమిళంలో సముద్రకని స్వీయదర్శకత్వంలో నిర్మించి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అప్పా. ఈ చిత్రం మలయాళంలో రీమేక్ అవుతోంది. సముద్రకనినే దర్శకత్వం వహిస్తున్న ఇందులో జయరామ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆయనకు జంటగా ఇద్దరు పిల్లల తల్లిగా నటి వరలక్ష్మీశరత్‌కుమార్ నటించడానికి అంగీకరించారు.ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. కొన్ని సన్నివేశాల్లో నటించిన వరలక్ష్మీశరత్‌కుమార్ సముద్రకని దర్శకత్వంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అలాంటిది అనూహ్యంగా ఆ చిత్రం నుంచి వైదొలిగారు. కారణం ఏమిటన్న ప్రశ్నకు పురుషాధిక్యం, మానవ విలువలు లేని నిర్మాత చిత్రం లో నటించడం తన వల్ల కాదని పేర్కొన్నారు. తన నిర్ణయాన్ని సమర్థించిన దర్శకుడు సముద్రకని, నటుడు జయరామ్‌లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని అన్నారు. ఇంతకీ ఆ చిత్ర నిర్మాతకు నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌కు మధ్య ఏంజరిగిందన్నది మాత్రం చిత్ర వర్గాల్లో ఆసక్తిగా మారింది. -
జయ ప్రస్థానమిదీ...
► 1948 :ఫిబ్రవరి 24: అప్పటి మైసూరు రాష్ట్రంలోనే మేల్కొటేలో జయలలిత జననం. ► 1950: తండ్రి జయరామ్ మరణం. మాతామహుల ఇంటికి బెంగళూరు చేరిన తల్లి వేదవల్లి. ► 1950-58: తల్లి చెన్నై వెళ్లిపోవడంతో మాతామహుల ఇంటివద్దే పెరిగిన జయలలిత. ► 1958: తిరిగి చెన్నైలోని తల్లి వద్దకు చేరిక ► 1961: కన్నడ సినిమా ‘శ్రీశైల మహాత్మే’తో బాలనటిగా వెండితెరపై అరంగేట్రం ► 1964: హీరోయిన్గా నటించిన తొలి కన్నడ సినిమా ‘చిన్నాడ గోంబే’ బ్లాక్‌బస్టర్. ► 1965: తెలుగు, తమిళ భాషల్లో కథనాయికగా అరంగేట్రం ► 1974: నటిగా 100 సినిమాలు పూర్తి. ► 1980: సినిమాలకు స్వస్తి. కథానాయికగా ఆఖరి సినిమా విడుదల. ► 1982: అన్నా డీఎంకే వ్యవస్థాపకుడు ఎం.జి.రామచంద్రన్ ఆహ్వానం మేరకు పార్టీ సభ్యురాలిగా రాజకీయ రంగ ప్రవేశం. ► 1983: అన్నా డీఎంకే పార్టీ ప్రచార కార్యదర్శిగా బాధ్యతల స్వీకరణ. ► 1984: రాజ్యసభ సభ్యత్వం. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం, పార్టీ విజయం. ► 1987: ఎంజీఆర్ మరణంతో పార్టీలో చీలిక. జయలలిత మద్దతుదారులపై అనర్హత వేటు. రాష్ట్రపతి పాలన. ► 1987: అన్నాడీఎంకే రెండు వర్గాల పునరైక్యం. తొలి మహిళా ప్రతిపక్ష నేతగా ఎంపిక. ► 1989: శాసనసభలో దుశ్శాసన పర్వం. డీఎంకే సభ్యుడు దురై మురుగన్ జయలలిత చీర లాగారన్న ఆరోపణలు. ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానని జయ శపథం. ► 1991: అన్నాడీఎంకే ఘన విజయం. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం. ► 1995: గిన్నిస్ రికార్డు స్థాయిలో దత్తపుత్రుడు సుధాకరన్ వివాహం. అవినీతి ఆరోపణలు. ► 1996: అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత, పార్టీ ఘోర పరాజయం. అవినీతి ఆరోపణలపై అరెస్టు, 30 రోజుల జ్యుడీషియల్ కస్టడీ. ► 2001: అన్నాడీఎంకే ఘనవిజయం. కేసుల కారణంగా ఎన్నికల్లో పోటీకి అనర్హత. అయినా రెండోసారి సీఎంగా ప్రమాణం. చెల్లదని సుప్రీం తీర్పు. పన్నీరుసెల్వానికి బాధ్యతల అప్పగింత. ► 2003: టాన్సీ భూములు, ప్లెజెంట్ స్టే హోటల్ కేసుల కొట్టివేతను సమర్థించిన సుప్రీంకోర్డు. ముఖ్యమంత్రిగా జయలలిత పగ్గాలు. ఉప ఎన్నికలో పోటీ చేసి అసెంబ్లీకి. ► 2006: శాసనసభ ఎన్నికల్లో ఓటమి. ► 2011: శాసనసభ ఎన్నికల్లో గెలుపు, ముఖ్యమంత్రిగా పగ్గాలు. ► 2014: ఆస్తుల కేసులో జయలలితను దోషిగా పేర్కొంటూ బెంగళూరులోని ప్రత్యేక కోర్టు తీర్పు. నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.100 కోట్ల జరిమానా. మళ్లీ జైలుకు జయలలిత. సీఎంగా పన్నీరుసెల్వం. ► 2015: జయలలితపై ఆరోపణలను కొట్టివేసిన కర్ణాటక హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం. మళ్లీ ముఖ్యమంత్రిగా జయ పగ్గాలు. ► 2016 మే: అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయదుందుభి. ఎంజీఆర్ అనంతరం వరుసగా రెండు పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది రికార్డు. ఐదు నెలలు గడవక ముందే అనారోగ్యం. ► 2016 డిసెంబర్ 5: మరణం -
దాడి కేసులో హీరో అరెస్ట్
సాక్షి, బెంగళూరు: మాస్తిగుడి చిత్రం దుర్ఘటన మరువకముందే కన్నడ హీరో దునియా విజయ్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. మాస్తిగుడి చిత్రం నిర్మాత సుందర్ పీ.గౌడ సోదరుడు శంకర్, హీరో దునియా విజయ్‌లు తన భర్త జయరామ్‌పై దౌర్జన్యం చేసి దాడికి పాల్పడ్డారని జయరామ్ భార్య యశోదా చెన్నమ్మనకెరె అచ్చుకట్టు కెరె పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. మాస్తిగుడి చిత్ర నిర్మాత సుందర్ పీ.గౌడ సోదరుడు శంకర్ నగరానికి చెందిన జయరామ్ అనే వ్యక్తి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన కొద్ది కాలానికే అదనపు కట్నం కోసం తన కూతురిని వేధించేవాడని, తన కుమార్తెను చూడటానికి ఇంటికి కూడా రానిచ్చేవాడు కాదని యశోదా ఆమె భర్త జయరామ్‌లు ఆరోపిస్తున్నారు. ఇటీవల జయరామ్ తన కూతురును చూడడానికి ఆమె ఇంటికి వెళ్లగా తమ అల్లుడు శంకర్ అదనపు కట్నం కోసం తన భర్తతో వాగ్వాదానికి దిగాడని అంతటితో ఆగకుండా హీరో విజయ్ను ఇంటికి పిలిపించి ఇద్దరు కలసి తన భర్తపై జయరామ్‌పై దాడికి పాల్పడ్డారని జయరామ్ భార్య యశోదా ఆరోపిస్తోంది. హీరో దునియా విజయ్ తన భర్త జయరామ్‌ను ఛాతిభాగంలో బలంగా కొట్టడంతో ఎముకలు విరిగాయని, ప్రస్తుతం తన భర్త జయరామ్ శేఖర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని ఆయన భార్య యశోదా తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దునియా విజయ్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తర్వాత బెయిల్ పై అతడికి విడిచిపెట్టారు. -
క్వార్టర్స్‌లో జయరామ్ పరాజయం
సియోల్: కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన ఏకై క భారత ప్లేయర్ అజయ్ జయరామ్ క్వార్టర్ ఫైనల్లో నిష్ర్కమించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో గత ఏడాది రన్నరప్ జయరామ్ 23-25, 13-21తో లీ హున్ (కొరియా) చేతిలో ఓడిపోయాడు. తొలి గేమ్‌లో ఒకదశలో జయరామ్ 14-11తో మూడు పాయి0ట్ల ఆధిక్యంలో ఉన్నాడు. కానీ లీ హున్ వెంటనే తేరుకొని స్కోరును సమం చేయడంతోపాటు 20-17తో ఆధిక్యంలోకి వెళ్లాడు. రెండో గేమ్‌లో లీ హున్ పూర్తి ఆధిపత్యం చలాయి0చి జయరామ్‌కు పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. -
క్వార్టర్ ఫైనల్లో జయరామ్
సియోల్: కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ ఆటగాడు అజయ్ జయరామ్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో అతను వరుస సెట్లలో చైనాకు చెందిన హువాంగ్ యుగ్జింగ్ను కంగుతినిపించాడు. 40 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో జయరామ్ 21-15, 21-18తో గెలిచి... గతేడాది కెనడా ఓపెన్‌లో అతని చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకున్నాడు. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో భారత ఆటగాడు కొరియాకు చెందిన లీ హ్యూన్తో తలపడతాడు. మరో మ్యాచ్‌లో భమిడిపాటి సాయి ప్రణీత్ 9-21, 15-21తో ఆరో సీడ్ సన్ వాన్ హో (కొరియా) చేతిలో ఓడిపోయాడు. ఈ టోర్నీలో భారత మేటి ఆటగాళ్లు కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్ ఇదివరకే నిష్ర్కమించిన సంగతి తెలిసిందే. -
న్యాయం జరిగేవరకూ పోరాటమే!
‘‘బాలు మహేంద్ర దర్శకత్వంలో జయరామ్, సరిత జంటగా నటించిన తమిళ సినిమా ‘జూలీ గణపతి’ని తెలుగులో రీమేక్ చేయాలని డబ్బింగ్, రీమేక్ రైట్స్ కొన్నాను. మా కథను చోరీ చేసి ‘చారుశీల’ తీశారు’’ అని ప్రణతి క్రియేషన్స్ అధినేత కూనిరెడ్డి శ్రీనివాస్ ‘చారుశీల’ బృందంపై ఆరోపణలు చేశారు. ఆధారాలతో సహా ‘చారుశీల’ దర్శక-నిర్మాతలను సంప్రదించగా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని అన్నారు. శనివారం విలేకరుల సమావేశంలో కూనిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ - ‘‘స్టార్ ఆర్టిస్టులతో రీమేక్ చేయాలని డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేయలేదు. ‘శూర్పణక’ టైటిల్ కూడా రిజిస్టర్ చేయించా. మేలో ‘చారుశీల’ స్టిల్స్ చూడగా సందేహం కలిగింది. చిత్ర నిర్మాత సాగర్‌గారిని సంప్రదిస్తే, ఫస్ట్ కాపీ వచ్చాక చూద్దామన్నారు. ట్రైలర్ అయితే మక్కీకి మక్కీ కాపీ. వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో కోర్టును ఆశ్రయించా. ఇంతలో ఈ నెల 18న ‘చారుశీల’ విడుదల అని ప్రకటించారు. బయ్యర్లకు నిజాలు తెలియాలనే ఉద్దేశంతో ప్రెస్‌మీట్ పెట్టాను. న్యాయం జరిగే వరకూ పోరాడతాను’’ అని చెప్పారు. -
సెమీస్‌లో జయరామ్ పరాజయం
ఎల్ మోంటి (అమెరికా): యూఎస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. భారత్ నుంచి బరిలో మిగిలిన అజయ్ జయరామ్ సెమీఫైనల్లో నిష్ర్కమించాడు. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 22వ ర్యాంకర్ జయరామ్ 10-21, 14-21తో కాంటా సునెయామ (జపాన్) చేతిలో ఓడిపోయాడు. తొలి గేమ్‌లో ఒకదశలో జయరామ్ వరుసగా పది పాయింట్లు కోల్పోయాడు. రెండో గేమ్‌లో జయరామ్ కాస్త పోటీనిచ్చినా ఫలితం లేకపోయింది. -
క్వార్టర్స్‌లో జయరామ్, ఆనంద్ పవార్
ఎల్ మాంటె (అమెరికా): భారత షట్లర్లు అజయ్ జయరామ్, ఆనంద్ పవార్ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం అర్ధరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో నాలుగోసీడ్ అజయ్ జయరామ్ 21-11, 21-15తో పెడ్రో మార్టిన్స్ (పోర్చుగల్)పై; ఆనంద్ 21-10, 21-13తో ప్రతుల్ జోషి (భారత్)పై నెగ్గారు. క్వార్టర్స్‌లో ఈ ఇద్దరు తలపడతారు. ఇతర మ్యాచ్‌ల్లో సాయి ప్రణీత్ 21-13, 17-21, 20-22తో కజుమాసా సకాయ్ (జపాన్) చేతిలో; ప్రణయ్ 23-25, 21-23తో లీ హున్ (కొరియా) చేతిలో ఓడారు. పురుషుల డబుల్స్‌లో రెండోసీడ్ మను అత్రి-సుమీత్ రెడ్డి 23-21, 21-13తో మిత్సుహసి-యుటా వాటాంబే (జపాన్)లపై నెగ్గి క్వార్టర్స్‌కు చేరారు. నాలుగోసీడ్ ప్రణయ్ చోప్రా-అక్షయ్ దివాల్కర్ ద్వయం... ప్రత్యర్థులకు వాకోవర్ ఇచ్చింది. మహిళల సింగిల్స్‌లో తన్వీలాడ్ 17-21, 15-21తో ఐదోసీడ్ బీవెన్ జాంగ్ (అమెరికా) చేతిలో ఓడింది. డబుల్స్‌లో పూర్విషా-మేఘన 21-16, 21-16తో ఆరెల లీ-సిడ్నీ లీ (అమెరికా)పై గెలిచి ముందంజ వేయగా, అనారోగ్యం కారణంగా టాప్‌సీడ్ జ్వాల-అశ్విని జోడి ప్రత్యర్థులకు వాకోవర్ ఇచ్చింది. -
ప్రిక్వార్టర్స్‌లో జయరాం, ప్రణయ్
కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్ కాల్గరీ (కెనడా): కెనడా ఓపెన్‌లో భారత షట్లర్లు దూసుకెళుతున్నారు. అజయ్ జయరామ్, హెచ్ఎస్ ప్రణయ్‌లతో పాటు టోర్నీలో పాల్గొంటున్న ఆటగాళ్లంతా మూడో రౌండ్లో ప్రవేశించారు. పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ జయరామ్ 17-21, 21-17, 21-13తో మార్టిన్ గిఫ్రే (కెనడా)పై నెగ్గాడు. రెండో సీడ్ ప్రణయ్ 13-21, 21-11, 21-15తో మట్టియాస్ బోర్గ్ (స్వీడన్)పై గెలిచాడు. మరో మ్యాచ్‌లో గురుసాయిదత్ 21-8, 21-6తో జొనాథన్ లాయ్ (కెనడా)పై, సాయి ప్రణీత్ 26-24, 21-16తో కన్ చావో యు (చైనీస్ తైపీ)పై, ప్రతుల్ జోషి 21-13, 21-12 అలిస్టర్ కేసేపై నెగ్గారు. మహిళల విభాగంలో రుత్విక శివాని 21-14, 21-14తో కైలీగ్ (కెనడా)పై, తన్వీ లాడ్ 21-17, 21-10తో జూలీ ఫిన్నేపై నెగ్గారు. మిక్స్డ్ డబుల్స్‌లో మను అత్రి, అశ్విని పొన్నప్ప జంట 21-13, 21-14తో బైరాన్ హోల్సెక్, ఎరిన్లపై విజయం సాధించింది. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో ఒక వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు వ్యక్తులు గాయాలపాలైన సంఘటన మండలంలోని శెట్టిపల్లి గుండవాగు వద్ద ఆదివారం చోటు చేసుకుంది. వెల్దుర్తి ఎస్సై పెంటయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చిన్నశంకరంపేట మండలం జంగరాయి శివారులోని నాగులమ్మ గిరిజన తాండాకు చెందిన దర్మ, జయరాం, చందర్‌లు మెదక్ మండలం బొల్లారంలో ఓ శుభకార్యానికి వెల్లి బైక్‌పై తిరిగి వస్తుండగా శెట్టిపల్లి గుండవాగు దగ్గర గుర్తు తెలియని వాహ నం ఢీ కొట్టిందన్నారు. దీంతో జయరాంకు(55) తీవ్ర గాయాలు కాగా గాంధీ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు తెలిపారు. దర్మ, చందర్‌లకు గాయాలయ్యాయన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
రైలు ఢీకొని వ్యక్తి మృతి
రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గౌలిగూడ చమన్ ప్రాంతానికి చెందిన ప్రేమ్‌నాథ్ కుమారుడు జయరామ్ (35) కాచిగూడ - మలక్‌పేట రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నారు. -
ట్రాక్టర్ ప్రమాదంలో డ్రైవర్ మృతి
పొలంలో పత్తి పంటను ట్రాక్టర్ తో తొలగించే పనుల సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. పొలంలోనే ఉన్న బావిలో ట్రాక్టర్ పడి పోవడంతో.. డ్రైవర్ జర్కుల జయరామ్( 22) మృతి చెందాడు. ఖమ్మం జిల్లా కొత్త గూడెం రూరల్ పరిధిలోని సర్వారం పంచాయతీ కోయగూడెం గ్రామంలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. శుక్రవారం ఉదయం గుర్తించగా.. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. -
గురుసాయి, జయరామ్ ముందంజ
అల్మెరె: డచ్ ఓపెన్ గ్రాండ్ ప్రీలో భారత షట్లర్లు అజయ్ జయరామ్, గురుసాయి దత్ ప్రీక్వార్టర్స్‌లో ప్రవేశించారు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో జయరామ్ 21-14, 21-10 స్కోరుతో ఫాబియన్ రోత్ (జర్మనీ)పై విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో గురుసాయి 21-14, 21-19తో చున్ వీ చెన్ (చైనీస్ తైపీ)ని ఓడించాడు. ఇక మహిళల సింగిల్స్‌లో పీసీ తులసి 20-22, 21-15, 21-16తో మహులెట్టె (నెదర్లాండ్స్)పై గెలుపొందింది. -
సింధుకు నిరాశ
మలేసియా మాస్టర్స్ టోర్నీ కుచింగ్: బ్యాడ్మింటన్ సీజన్ తొలి అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత క్రీడాకారులెవరూ ఫైనల్ చేరుకోకుండానే ఇంటిముఖం పట్టారు. మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో భారత ఆటగాళ్ల పోరాటం సెమీఫైనల్లోనే ముగిసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ విభాగంలో పి.వి.సింధు 21-19, 13-21, 8-21తో నొజోమి ఒకుహారా (జపాన్) చేతిలో; పురుషుల సింగిల్స్ విభాగంలో అజయ్ జయరామ్ 21-10, 17-21, 16-21తో హ్యోక్ జిన్ జియోన్ (దక్షిణ కొరియా) చేతిలో పోరాడి ఓడిపోయారు. సింధు, జయరామ్‌లిద్దరూ తమ ప్రత్యర్థులపై తొలి గేమ్ గెలిచాక తర్వాతి రెండు గేమ్‌లను చేజార్చుకోవడం గమనార్హం. ప్రపంచ 24వ ర్యాంకర్ ఒకుహారా చేతిలో ప్రపంచ 11వ ర్యాంకర్ సింధుకిది వరుసగా రెండో ఓటమి. గతేడాది హాంకాంగ్ ఓపెన్‌లోనూ ఒకుహారా చేతిలో సింధు ఓడిపోయింది. గంటా 24 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సింధు తొలి రెండు గేముల్లో గట్టిపోటీనే ఇచ్చింది. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో మాత్రం ఒకుహారా స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. రెండుసార్లు వరుసగా నాలుగు పాయింట్ల చొప్పున, మరో రెండుసార్లు వరుసగా మూడు పాయింట్ల చొప్పున ఈ జపాన్ అమ్మాయి పాయింట్లు సాధించి సింధుకు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. సెమీస్‌లో ఓడిన సింధు, జయరామ్‌లకు 1,740 డాలర్ల చొప్పున ప్రైజ్‌మనీ (రూ. లక్షా 7 వేలు)తోపాటు 4,900 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ఒక్క సినిమాకు డెరైక్షన్ చేస్తా!
తెలుగు చిత్రసీమలోని ప్రతిభావంతులైన ఛాయాగ్రాహ కుల్లో జయరామ్ తప్పకుండా ముందు వరుసలో ఉంటారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 110 చిత్రాలకు ఛాయాగ్రహణం అందించారాయన. ఐవీ శశి, కె.రాఘవేంద్రరావు, ఏ.కోదండరామిరెడ్డి, రవిరాజా... ఇలా మేటి దర్శకులతో పనిచేసిన అనుభవం జయరామ్‌ది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఇప్పటికీ ధాటిగా దూసుకుపోతున్న జయరామ్ చదివింది ఎంతో తెలుసా? 5వ తరగతి. అవసరం తనకు అన్నీ నేర్పింది అంటారాయన. ఇంకా తన జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మీకోసం... ఏంటండీ... బిజీగా ఉన్నట్టున్నారు? అవునండీ.. ‘రైటర్’, ‘తొండి’ అనే రెండు సినిమాలు చేస్తున్నాను. ‘రైటర్’ సినిమానైతే... 80 శాతం ఫిలిమ్‌లో తీశాం. నెగిటివ్‌లో తీసిన చివరి సినిమా అదే అవుతుంది. ఈ సినిమాకు కాస్త గ్రాఫిక్ వర్క్ చేయాల్సి ఉంది. అందుకే 20 శాతం డిజిటల్లో తీయాల్సి వచ్చింది. ‘తొండి’ సినిమానైతే పూర్తిగా డిజిటల్లో తీశాను. సినీరంగంలో ఎన్నో విభాగాలుండగా ఛాయాగ్రహణాన్నే ఎందుకు ఎంచుకున్నారు? మొదట్నుంచీ నాకు సినిమాలన్నా, ఫొటోగ్రఫీ అన్నా ఇష్టం. వరంగల్‌లో ఉన్నప్పుడు నాకో ఫోటో స్టూడియో ఉండేది. సినిమాకెళ్లి... సన్నివేశానికి అనుగుణంగా షాట్ ఎలా పెట్టారో, లైటింగ్ ఎలా వేశారో గమనించేవాణ్ణి. సినిమాలో కెమెరా వర్క్ నచ్చితే పదేపదే చూసేవాణ్ణి. 1966లో రామినీడుగారు దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రానికి ఎడిటింగ్ అసిస్టెంట్‌గా చేరాను. ఆయన ప్రోత్సాహంతోనే ఛాయాగ్రహణం వైపు వెళ్లాను. కెమెరా ఎవరెవరి వద్ద నేర్చుకున్నారు? నేను విన్సెంట్‌గారి వీరాభిమానిని. నా అదృష్టం బావుండి నేను తొలుత చేరింది కూడా ఆయన దగ్గరే. విన్సెంట్గారితో చాలా సినిమాలకు పనిచేశాను. వాటిలో ‘అన్నమయ్య’ ఒకటి. కంప్యూటర్ యుగంలో కూడా ఏ మాత్రం టెక్నాలజీని ఉపయోగించకుండా కేవలం ట్రిక్ షాట్స్‌తో ఆ చిత్రం తీసిన ఘనుడు విన్సెంట్‌గారు. ఆ తర్వాత కేఎస్ ప్రకాశ్‌గారు, ముంబయ్ కెమెరామేన్ ఇషాన్ ఆర్య... ఇలా చాలామంది దగ్గర పనిచేశా. కెమెరామేన్‌గా మీ ప్రస్థానం? చిరంజీవితో కైకాల నాగేశ్వరరావు నిర్మించిన ‘చిరంజీవి’(1984) కెమెరామేన్‌గా నా తొలి చిత్రం. అన్ని కెమేరాలతోనూ పని చేశాను. ప్రస్తుతం డిజిటల్లోనే ఎక్కువ చేస్తున్నాం. డిజిటల్లో వర్క్ తగ్గుతుందని అంటుంటారు కానీ... నిజానికి ఫిల్మ్కంటే డిజిటల్కే వర్క్ ఎక్కువ. అదేంటి? 5డి కెమెరా అనగానే... ఆర్టిస్టుల్ని మౌల్డ్ చేయడం గురించి పట్టించుకోవడం లేదు. లైట్ ఉందనగానే తీసేస్తున్నారు. దాని వల్ల బొమ్మ తెలుస్తుంది అంతే. క్రియేషన్ ఆఫ్ లైటింగ్ ఉండదు. ఆర్టిస్టుల మౌల్డింగ్ని చూసుకొని లైటింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి, దాని కోసం తగినంత శ్రమ చేస్తేనే రిజల్ట్. క్వాలిటీ ఆఫ్ ఫొటోగ్రఫీకి కొన్ని పద్ధతులుంటాయి. ఆర్టిస్టుల ముఖానికి తగ్గట్టు లైటింగ్ ఉండాలి. దీంట్లో కూడా గ్లామరస్ లైటింగ్, ఆర్టిస్టిక్ లైటింగ్.. ఇలా చాలా రకాలుంటాయి. కెమెరామేన్ ప్రతిభ కనిపించేది అక్కడే. ఈ మధ్య కొందరు కెమెరాతోనే పనిలేదు... అంటున్నారు కదా? సినిమా అంటేనే ఆడంబరం. ప్రేక్షకులు కాసేపు ఎంజాయ్ చేయడానికి సినిమాకొస్తారు. ఈ సెట్టింగులు, ఈ టెక్నాలజీ, ఈ హంగామా లేకపోతే ఎలా? లైట్ లేకుండా, క్లారిటీ లేకుండా, బొమ్మ కనిపించకుండా సినిమా ఉంటే జనాలు ఎంజాయ్ చేయగలరా? ఇది వరకు ఫిల్మ్‌లో ఓవర్ ఎక్స్పోజ్, అండర్ ఎక్స్పోజ్, కరెక్ట్ ఎక్స్పోజ్ ఇలా మూడు రకాలుండేవి. కరక్ట్ ఎక్స్పోజ్ ఇస్తే ఏ రంగు ఆ రంగులా కనిపించేది. ఓవర్ ఎక్స్పోజ్ అయితే... థిక్‌గా కనిపించేది. అండర్ ఎక్స్పోజ్ చేస్తే బొమ్మ సరిగ్గా కనిపించేది కాదు. దీని కోసం ఎంతో శ్రమించేవాళ్లం. ఎందుకీ కష్టమంతా. టెక్నీషియన్స్‌లో ఒక్కొక్కరిలో ఒక్కో టేస్ట్. దేన్నీ కాదనలేం. కానీ, వారి అభిప్రాయాన్ని వేరొకరిపై రుద్దకూడదు. క్వాలిటీ బట్టే సినిమా . ఒక సీనియర్ కెమెరామేన్‌గా చెప్పండి . సినిమా చేయడానికి ఏ కెమెరా కరెక్ట్? ఏ కెమెరా అయినా సినిమాకు పర్ఫెక్టే. అయితే.. దానికి వాడే లెన్స్‌ను బట్టి క్లారిటీ ఉంటుంది. నాకు తెలిసి బ్లాక్ లెన్స్ పర్ఫెక్ట్. 40 లెన్స్, 50 లెన్స్, 75 లెన్స్ ఇలా మార్చి మార్చి ఏ రేంజ్ కావాలంటే ఆ రేంజ్‌కి తగ్గట్టు వాడొచ్చు. ఈ లెన్స్‌ని రెడ్, ఎలెక్స్... లేటెస్ట్ డిజిటల్ కెమెరాలు.. ఇలా అన్నింటికీ వాడొచ్చు. కేలబిరేషన్ చేస్తే సరిపోతుంది. కెమెరామేన్‌గా మీరు కష్టపడి తీసిన సినిమాలు? మలయాళంలో ఐవీ శశి దర్శకత్వంలో రూపొందిన హిస్టారికల్ మూవీ ‘1921’ నా కెరీర్లో ఛాలెంజ్‌గా తీసుకొని చేసిన సినిమా. స్వాతంత్య్రోద్యమ సమయంలో జరిగిన యథార్థగాథ అది. దానికి కేరళ అవార్డుతో పాటు ఫిలిం క్రిటిక్స్ అవార్డు కూడా దక్కింది. దీని తర్వాత చెప్పుకోవాల్సిన సినిమా ‘షిర్డీ సాయిబాబా మహత్మ్యం’. ఈ సినిమాను హైదరాబాద్ గండిపేట సమీపంలోని మంచిరేవులలో తీశాం. ఉదయిస్తున్న సూర్యుడి నుంచి బాబాగారు ఎంటరయ్యే సన్నివేశాన్ని ఎంతో శ్రమించి తీశాను. అలాగే... బాబా మూడు రోజుల పాటు తన భౌతిక దేహాన్ని వదిలి వెళ్లిపోయినప్పుడు వచ్చే ‘నువు లేక అనాథలం’ పాటను మూడు రోజులు మూడు డిఫరెంట్ లైటింగ్స్‌తో తీశాను. ఆ సినిమా నాకో అద్భుత జ్ఞాపకం. వీటితో పాటు పెళ్లిసందడి, రాయలసీమ రామన్నచౌదరి చిత్రాలు కూడా కష్టపడి చేసినవే. దర్శకత్వం చేసే ఉద్దేశం ఉందా? భవిష్యత్తులో ఒక్క సినిమాకు డెరైక్షన్ చేస్తా. కథ కూడా రెడీ చేస్తున్నా. నిర్మాతలు కూడా రెడీగా ఉన్నారు. చాలామంది గొప్ప దర్శకులతో పనిచేశాను కదా. ఆ అనుభవం కచ్చితంగా ఉపకరిస్తుంది. మీ ఫ్యామిలీ వివరాలు? సినిమాల్లోకి రాకముందు మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. నాన్న వరంగల్‌లోని ప్రభుత్వ బట్టల మిల్లులో సహాయకునిగా పనిచేసేవారు. ప్రస్తుతం మా తమ్ముడు శ్రీనివాస్ కూడా కెమెరా డిపార్ట్మెంట్లోనే పనిచేస్తున్నాడు. నేను చదివింది 5వ తరగతి. హిందూ పేపర్ చదివి ఇంగ్లిష్, మద్రాసులో వాల్‌పోస్టర్లు చూసి తమిళం నేర్చుకున్నా. మలయాళం సినిమాలు చేస్తున్నప్పుడు మలయాళం, కన్నడ సినిమాలు చేస్తున్నప్పుడు కన్నడం నేర్చుకున్నా. బ్రతుకుతెరువే నాకు అన్నీ నేర్పింది. నాకు ఓ అబ్బాయి, ఓ అమ్మాయి. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఉన్నారు. తెలుగు నేలపై ఉన్న మమకారంతో అన్నం పెట్టిన మద్రాసు వదిలి ఇక్కడికొచ్చాం. కానీ ఇక్కడ తెలుగువాళ్లను నిర్లక్ష్యం చేస్తున్నారు. పరాయి రాష్ట్రం వారితో పనిచేయించుకుంటున్నారు. నిర్మాతలది ఏమీ చేయలేని పరిస్థితి. దర్శకులు, హీరోల ప్రోద్భలంతోనే ఇదంతా జరుగుతోంది. ఇకనైనా కళ్లు తెరిచి తెలుగువారిని ప్రోత్సహిస్తే... తెలుగు సినిమా మరింత అభివృద్ధి చెందుతుందని నా నమ్మకం. - బుర్రా నరసింహ -
డచ్ ఓపెన్ ఫైనల్లో జయరామ్
అల్మీరె (నెదర్లాండ్స్): తన విజయపరంపర కొనసాగిస్తూ భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు అజయ్ జయరామ్ డచ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్లో టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 66వ ర్యాంకర్ జయరామ్ 11-8, 11-7, 11-5తో టాప్ సీడ్, ప్రపంచ 29వ ర్యాంకర్ రాజీవ్ ఉసెఫ్ (ఇంగ్లండ్)పై సంచలన విజయం సాధించాడు. తద్వారా తన కెరీర్లో తొలిసారి గ్రాండ్‌ప్రి స్థాయి టోర్నమెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. -
విద్య వ్యాపారం కాకూడదు
స్వర్గీయ శ్రీహరి బావమరిది జయరాం కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘అగ్గిరవ్వ’. ఎ.ఎల్.రాజా దర్శకుడు. నిర్మాత ఎస్.భూపతి. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. నిర్మాత మాట్లాడుతూ- ‘‘తారతమ్యాలు లేకుండా విద్య అందరికీ లభిస్తే... దాని ప్రతిఫలం ఎలా ఉంటుందో తెలిపే కథాంశమిది. విద్య వ్యాపారం కాకూడదని ఇందులో చెప్పాం. ఈ కథను దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి విని అభినందించారు. ఈ నెల 23న పాటల్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. యాక్షన్‌తో కూడిన కుటుంబ కథాచిత్రమిదని, స్విట్జర్లాండ్, ముంబయ్‌లలో పాటల్ని చిత్రీకరించామని, జూలైలో సినిమాను విడుదల చేస్తామని దర్శకుడు చెప్పారు. భానుప్రియ, బ్రహ్మానందం, ఆశిష్ విద్యార్థి తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీకాంత్ దేవా, కెమెరా: శివరాం. -
సమాఖ్యను మార్చేందుకు యత్నం
తిరుపతి కార్పొరేషన్, న్యూస్‌లైన్ : అవినీతి ఆరోపణలు వస్తున్నాయన్న నెపంతో స్వయం సహాయక సంఘానికి చెందిన సమాఖ్య లీడర్‌ను తొలగించి తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ మహిళను అధ్యక్షురాలిగా నియమించేందుకు ప్రయత్నించడంతో పీవో స్థాయి అధికారిని మహిళలు నిలదీశారు. దీంతో సదరు అధికారి వెనుదిరగాల్సి వచ్చింది. బాధిత మహిళల కథనం మేరకు.. తిరుపతి కొర్లగుంట సంజయ్‌గాంధీ కాలనీలో ఆదివారం మదర్‌థెరిస్సా మహిళా సమాఖ్య సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. పట్టణ మెప్మా ఇన్చార్జి అధికారి జయరామ్, సీవో మల్లికార్జున్, సీఆర్పీ పద్మావతి హాజరయ్యారు. ప్రస్తుతం ఉన్న స మాఖ్య అధ్యక్షురాలు ఈ.శాంతిని తొలగిస్తూ, ఆమె స్థానంలో మరొక మహిళను ఎన్నుకునేలా మెప్మా అధికారి జయరామ్ ప్రయత్నం చేశారు. దీంతో సమాఖ్య సభ్యులు ఒక్కసారిగా వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని అధ్యక్షురాలిని ఎందుకు తొలగిస్తారంటూ వాగ్వాదానికి దిగారు. తమ అనుమతి లేకుండా లీడర్లను మారిస్తే ఊరుకోమంటూ హెచ్చరించారు. దీంతో మీకు సంఘాలు జరిపించేది లేదని మెప్మా అధికారి జయరామ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. టీడీపీకి ఓట్లు వేయలేదని: సమాఖ్య సమావేశాన్ని నిర్వహించకుండా అధికారులు వెళ్లిపోవడంతో మహిళలు మీడియాకు సమాచారం అందించారు. అక్కడికి వెళ్లిన విలేకరులతో పలువురు మహిళలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న జరిగిన ఎన్నికలలో తామంతా టీడీపీకి కాకుండా, కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశామని తమపై రాజకీయ ముద్ర వేయడం బాధాకరమన్నారు. టీడీపీకి ఓట్లు వేయలేదు కాబట్టి మీరు లీడర్లుగా వద్దు, మాకు అనుకూలంగా ఉన్న వారిని లీడర్లుగా ఏర్పాటు చేసుకుంటామని మెప్మాలోని అధికారులు చెప్పడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. తమకు రాజకీయరంగు పులమడం ఎంతవరకు సమంజసమని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య అధ్యక్షురాలు ఈ.శాంతి, కార్యదర్శి లీలావతి, కోశాధికారి కళావతి, ఉపాధ్యక్షురాలు సుభాషిణి, ఉప కార్యదర్శి రాజేశ్వరి, ఎస్ఎల్ఆర్పీ పద్మజతో పాటు అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. దీనిపై ఇన్చార్జ్ మెప్మా అధికారి జయరామ్ ‘న్యూస్‌లైన్’ తో మాట్లాడుతూ బైలా ప్రకారం సంఘాల్లోని సభ్యుల వివరాలు సక్రమంగా లేవన్నారు. దీనిపై వివరణ అడిగినా లీడర్లు సమాధానం ఇవ్వడం లేదన్నారు. పైగా తాను రాజకీయాలు మాట్లాడినట్టు ఆరోపించడం బాధాకరమని, తనకు ఆ అవసరం లేదని అన్నారు. -
ఉత్తమవిలన్‌లో కమల్‌హాసన్, జయరాం
పంచతంత్రం సినిమాలో విజయవంతంగా కామెడీని పండించిన కమల్‌హాసన్, జయరాం ఇప్పుడు కొత్తగా రూపొందుతున్న ఉత్తమవిలన్ చిత్రంలోనూ కలిసి కనిపించబోతున్నారు. ఉళగనాయకన్ (అంతర్జాతీయ హీరో) కమల్‌హాసన్‌తో కలిసి ఉత్తమవిలన్ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు జయరాం తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫొటోను కూడా అందులో పోస్ట్ చేశాడు. పంచతంత్రం సినిమాలో వీళ్లిద్దరూ కలిసి నటించిన పలు సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. వయసు మీరిపోతున్న సూపర్‌స్టార్ పాత్రను ఉత్తమవిలన్ చిత్రంలో కమల్ పోషిస్తున్నాడు. కమల్ స్వయంగా కథ అందించిన ఈ సినిమాకు కన్నడ నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ ఓ ముఖ్యపాత్రలో కనిపిస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరులో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. By mistake my previous tweets got deleted.. Posting again my snap from Kamal Haasan's @Uttama_Villain :) :) pic.twitter.com/ykbRROE66x — Jayaram (@UrsJayaramActor) March 12, 2014 -
‘నార్నె ఎస్టేట్స్’కు పంచాయతీ నోటీసులు
జవహర్‌నగర్, న్యూస్‌లైన్: జవహర్‌నగర్ పరిధిలోని నార్నె రంగారావు ఎస్టేట్స్‌కు గ్రామపంచాయతీ అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి జయరాం మాట్లాడుతూ.. ఫైరింగ్రేంజ్ పరిసర ప్రాంతాల్లో వర్షపునీరు దిగువప్రాంతాలకు వెళ్లకుండా ప్రహరీ నిర్మాణం చేపట్టారని ఎక్స్ సర్వీస్‌మెన్ కాలనీ, శ్రీసాయి వెల్ఫేర్ సొసైటీల ఫిర్యాదు మేరకు ఎన్నోసార్లు ఎస్టేట్ వారికి నోటీసులు జారీ చేశామని అన్నారు. అయినా స్పందించలేదని, తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. వారం రోజుల గడువు అనంతరం ప్రహరీ నిర్మాణాన్ని కూల్చివేసి నాలాను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. -
ఆత్మగా మారి...
అతి కిరాతకంగా హత్యకు గురయ్యే ఓ యువతి ఆత్మగా మారి, తనను చంపినవారిపై ఎలా పగ తీర్చుకుంది? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘మాంత్రికన్’. పూనమ్ బజ్వా, జయరామ్, దివ్య ముఖ్య తారలు. తమిళ, మలయాళ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని అదే పేరుతో శ్రీమతి లక్ష్మీ సమర్పణలో బి. సత్యం తెలుగులోకి విడుదల చేస్తున్నారు. వచ్చే నెల మొదటివారంలో రిలీజ్ కానున్న ఈ చిత్రం విశేషాలను నిర్మాత తెలియజేస్తూ -‘‘ఓ జమిందారీ కుటుంబంలోని నలుగురు అన్నదమ్ముల్లో చిన్నవాడు పేదింటి పిల్లను ప్రేమిస్తాడు. అది సహించని అతని అన్నలు ఆ అమ్మాయిని కాల్చి చంపేస్తారు. అదే మంటల్లో ఆ యువకుడు దూకి, చనిపోతాడు. ఆ అమ్మాయి ఆత్మగా మారి, ఓ అన్నను చంపేస్తుంది. ఇది తెలుసుకున్న మిగతా ఇద్దరు సోదరులు ఓ మాంత్రికుని సహాయం తీసుకుంటారు. అనంతరం ఏం జరిగింది? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ చిత్రానికి గ్రాఫిక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. యస్. బాలకృష్ణన్ స్వరపరచిన పాటలు వీనుల విందుగా ఉంటాయి. త్వరలో పాటలను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, చిత్రనిర్వహణ: అడ్డాల వెంకటరావు, రమణ, దర్శకత్వం: అనిల్. -
ముగ్గురూ క్వార్టర్స్‌లోనే...
టోక్యో: తొలిసారి ఓ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ నుంచి ముగ్గురు క్రీడాకారులు క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత పొందినా... ఒక్కరు కూడా ముందంజ వేయలేకపోయారు. శ్రీకాంత్, అజయ్ జయరామ్, ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలవ్వడంతో జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో భారత కథ ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో అన్‌సీడెడ్ కె.శ్రీకాంత్ 18-21, 9-21తో ఏడో సీడ్ కెనిచి టాగో (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. 39 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో శ్రీకాంత్ పోరాట పటిమను కనబర్చాడు. ఓ దశలో 13-18తో వెనుకబడ్డా నెట్ వద్ద మెరుగ్గా ఆడుతూ ప్రత్యర్థి ఆధిక్యాన్ని 17-18కి తగ్గించాడు. అయితే బలమైన స్మాష్‌లతో చెలరేగిన టాగో వరుసగా మూడు పాయింట్లు సాధించి గేమ్‌ను గెలుచుకున్నాడు. రెండో గేమ్‌లో మెరుగైన స్మాష్‌లతో ఆకట్టుకున్న ఈ ఏపీ కుర్రాడు నెట్ వద్ద విఫలమయ్యాడు. దీంతో గట్టిపోటీ ఇవ్వలేకపోయాడు. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రణయ్ 11-21, 22-20, 13-21తో హుయాన్ గో (చైనా) చేతిలో;అజయ్ జయరామ్ 18-21, 13-21తో ఐదోసీడ్ టియాన్ మిన్ గుయాన్ (వియత్నాం) చేతిలో ఓడిపోయారు.