పొలంలో పత్తి పంటను ట్రాక్టర్ తో తొలగించే పనుల సందర్భంగా విషాదం చోటు చేసుకుంది.
పొలంలో పత్తి పంటను ట్రాక్టర్ తో తొలగించే పనుల సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. పొలంలోనే ఉన్న బావిలో ట్రాక్టర్ పడి పోవడంతో.. డ్రైవర్ జర్కుల జయరామ్( 22) మృతి చెందాడు. ఖమ్మం జిల్లా కొత్త గూడెం రూరల్ పరిధిలోని సర్వారం పంచాయతీ కోయగూడెం గ్రామంలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. శుక్రవారం ఉదయం గుర్తించగా.. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.