స్కూల్ బెంచ్ పై నుంచి కిందపడి ఓ చిన్నారి మృతి చెందింది. ఖమ్మం జిల్లా రూరల్ మండలం రేగళ్ల గ్రామానికి చెందిన దరావత్ ఇంద్రజ(5)ప్రమాదవ వశాత్తు బెంచి పై నుంచి పడి మరణించింది.
స్కూల్ బెంచ్ పై నుంచి కిందపడి ఓ చిన్నారి మృతి చెందింది. ఖమ్మం జిల్లా రూరల్ మండలం రేగళ్ల గ్రామానికి చెందిన దరావత్ ఇంద్రజ(5) ఎల్ కేజీ చదువుతోంది. అయితే శుక్రవారం ప్రమాద వశాత్తు స్కూల్ బెంచ్ పై నుంచి కిందపడింది. ఆమెకు ఫిట్స్ రావడంతో స్కూల్ యాజమాన్యం స్థానిక ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించారు. అయితే పరిస్థితి విషమించడంతో.. చిన్నారిని వరంగల్ ఎంజీఎం కు తరలించారు. చిన్నారి చికిత్స పొందుతూ.. ఇవాళ మృతి చెందింది. ముద్దులోలికే చిన్నారి మరణంతో కుటుంబం విషాదంలో నెలకొంది.