సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్న 'విక్రమ్' నటుడు.. అమ్మాయి ఎవరంటే? | Actor Kalidas Jayaram Engagement With GirlFriend Tarini Kalingarayar | Sakshi
Sakshi News home page

Kalidas Jayaram: లాంగ్ టైమ్ గర్ల్‌ఫ్రెండ్‌తో యంగ్ హీరో ఎంగేజ్‌మెంట్

Published Sat, Nov 11 2023 6:09 PM | Last Updated on Sat, Nov 11 2023 6:27 PM

Actor Kalidas Jayaram Engagement With GirlFriend Tarini Kalingarayar - Sakshi

మరో యంగ్ హీరో పెళ్లికి రెడీ అయిపోయాడు. ఎన్నాళ్ల నుంచి సొంత రాష్ట్రానికి చెందిన మోడల్ తో ప్రేమలో ఉన్నాడు. ఈ విషయం కొన్నాళ్ల ముందు బయటపెట్టాడు. ఇప్పుడు పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ వేడుక రహస్యంగా జరిగింది. ఆ తర్వాత ఇందుకు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇవి వైరల్‌గా మారాయి.

(ఇదీ చదవండి: తెలుగులో చేగువేరా బయోపిక్.. రిలీజ్ డేట్ ఫిక్స్)

మలయాళ నటుడు జయరాయ్ కొడుకు కాళీదాస్ ప్రస్తుతం హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పలు తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తున్నాడు. గతేడాది రిలీజైన 'విక్రమ్'లో కమల్ హాసన్ కొడుకుగా నటించింది ఇతడే. ఇప్పుడు ఈ నటుడు.. చాలారోజుల నుంచి మోడల్ తరిణి కళింగరాయర్‌తో ప్రేమలో ఉన్నాడు. ఇప్పుడు వీళ్లిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఇక కాళీదాస్ తండ్రి జయరామ్.. అనుష్క 'భాగమతి' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత అల వైకుంఠపురములో, రాధేశ్యామ్, రావణాసుర, ధమాకా, ఖుషి తదితర చిత్రాల్లో కీలక పాత్రలు చేశారు. ఇప్పుడు కొడుకు ఎంగేజ్‌మెంట్‌తో ఫుల్ ఖుషీలో ఉన్నారు. డిసెంబరులో లేదంటే వచ్చే ఏడాది ప్రారంభంలో కాళీదాస్-తరిణి పెళ్లి జరిగే అవకాశాలున్నాయి.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ 7: పదో వారం ఆ కంటెస్టెంట్‌ ఎలిమినేట్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement