నటుడు జయరామ్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈయన మలయాళ నటుడే అయినా, తెలుగు, తమిళం తదితర భాషల్లోనూ సుపరిచితుడే. కథానాయకుడిగా పలు చిత్రాల్లో నటించినా, ఆ తరువాత వివిధ రకాల పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో ఈయన పోషించిన హాస్యపాత్ర అందరినీ అలరించింది. తెలుగులోనూ అల వైకుంఠపురం వంటి చిత్రాల్లో నటించారు. ఇకపోతే ఈయన భార్య పార్వతి కూడా నటినేన్నది గమనార్హం. పలు మలయాళ చిత్రాల్లో నటించారు. అంతే కాకుండా ఈమె ప్రముఖ నృత్యకళాకారిణిగా మెప్పించారు.
వీరి కుమారుడు కాళిదాస్ జయరామ్ కూడా వర్ధమాన నటుడిగా రాణిస్తున్నారు. కాగా కాళిదాస్ జయరామ్ ఇప్పుడు పెళ్లి కొడుకు అవుతున్నారు. ధారణి అనే చిరకాల ప్రేమికురాలితో జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధం అవుతున్నారు. వీరి పెళ్లి డిసెంబర్ 8న ఆదివారం గురువాయూర్ ఆలయంలో జరగనుంది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం చైన్నెలో వీరి ఫ్రీ వెడ్డింగ్ వేడుక నిర్వహించారు. కాళిదాస్ జయరామ్, ధారణిల వివాహానికి ఇప్పటికే ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్, రజనీకాంత్, దర్శకుడు మణిరత్నం వంటి ప్రముఖులకు జయరామ్ దంపతులు శుభలేఖలను అందించి, ఆహ్వానించారన్నది గమనార్హం. నటుడు కాళిదాస్ ఇటీవల నటుడు ధనుష్ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన రాయన్ చిత్రంలో ఆయనకు తమ్ముడిగా ముఖ్యపాత్రను పోషించారన్నది గమనార్హం.
ఇకపోతే ధారణి కూడా తన కళాశాల కాలం నుంచే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించారు. ఫ్యాషన్ షోలు, వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నారు. అంతే కాకుండా మిస్ తమిళనాడు, మిస్ సౌత్ ఇండియా అందాల పోటీల్లో రన్నర్ అప్‌గా నిలిచారు. కాగా కొన్నేళ్లుగా నటుడు కాళిదాస్, ధారణిలు ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి ఇరుకుటుంబ పెద్దలు పచ్చజెండా ఊపడంతో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ నెల 8వ తేదీన పెళ్లి జరగనుంది. వీరి వివాహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment