చోళ రాజుల కథలో... | Jayaram to star in Mani Ratnam's film Ponniyin Selvan | Sakshi
Sakshi News home page

చోళ రాజుల కథలో...

Aug 30 2019 1:50 AM | Updated on Aug 30 2019 1:50 AM

Jayaram to star in Mani Ratnam's film Ponniyin Selvan - Sakshi

జయరామ్‌

ప్రస్తుతం తమిళంలో అందరి చూపు మణిరత్నం తెరకెక్కించబోయే ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ మీదే ఉందని చెప్పొచ్చు. చోళుల కథ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఐశ్వర్యా రాయ్, విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, నయనతార, అనుష్క, కీర్తీ సురేశ్, అమలా పాల్‌ వంటి నటీనటులు ఈ సినిమాలో కనిపించబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. తాజాగా ఈ సినిమాలో మలయాళ నటుడు జయరామ్‌ కూడా కనిపిస్తారని తెలిసింది. ఓ ఇంటర్వ్యూలో ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చేస్తున్నట్టు జయరామ్‌ ప్రకటించారు. తన పాత్ర ఎలా ఉంటుందనే విషయం మాత్రం చెప్పలేదు. జయరామ్‌ ప్రస్తుతం తెలుగులో ‘అల వైకుంఠపురములో’ యాక్ట్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement