Manirathanam
-
థగ్‌లైఫ్ షూటింగ్ పూర్తి.. భారీ ధరకు డిజిటల్ రైట్స్
కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం థగ్‌లైఫ్. మణిరత్రం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటుడు శింబు, నటి త్రిష, జోజూ జార్జ్, ఐశ్వర్య లక్ష్మీ, గౌతమ్ కార్తీక్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని కమలహాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, మణిరత్నంకు చెందిన మద్రాస్ టాకీస్, రెడ్‌జెయింట్ మూవీస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. 36 ఏళ్ల క్రితం మణిరత్నం, కమలహాసన్ కాంబోలో రూపొందిన చిత్రం నాయకన్ (నాయకుడు). ఆ తరువాత ఇన్నాళ్లకు వీరి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం థగ్ లైఫ్. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. కాగా ఇది నటుడు కమలహాసన్ నటిస్తున్న 233వ చిత్రం కావడం గమనార్హం. అదే విధంగా ఆయన ఇందులో 3 పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో దానికి సంబందించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. థగ్‌లైఫ్ చిత్రం వ్యాపారం మొదలైందని సమాచారం. ఈ చిత్ర డిజిటల్ హాక్కులను రూ.150 కోట్లకు విక్రయించినట్లు తాజాగా సమాచారం. ఇంత పెద్దమొత్తంలో డిజిటల్ వ్యాపారం ఇంతకు ముందు ఏ చిత్రానికి జరగలేదనే ప్రచారం సాగుతోంది. కాగా థగ్‌లైఫ్ చిత్రాన్ని వచ్చే ఏడాది మేలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను చిత్ర వర్గాలు త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. -
దిల్ రాజు మాటలకు ఐశ్వర్య రాయ్ ఎలా నవ్వుతుందో చుడండి..
-
మణిరత్నం మకాం మధ్యప్రదేశ్‌కు..
త్వరలో మధ్యప్రదేశ్‌కు మకాం మార్చాలనుకుంటున్నారు దర్శకుడు మణిరత్నం. విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, త్రిష, ఐశ్వర్యా రాయ్, శోభితా ధూళిపాళ ప్రధాన పాత్రల్లో మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఈ నెలలో మధ్యప్రదేశ్‌లో ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ఆరంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్, మాండ్వా, మహేశ్వర్ లొకేషన్స్‌లో ఈ సినిమా చిత్రీకరణను జరపాలనుకుంటున్నారట. ఈ షెడ్యూల్లో ముఖ్యంగా విక్రమ్, ఐశ్వర్యా రాయ్‌ల మధ్య వచ్చే సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. అంతేకాదు.. ఈ సన్నివేశాలకు భారీగా జూనియర్ ఆర్టిస్టులు కావాలట. ఇందుకోసం ఎక్కువగా అక్కడి స్థానికులను తీసుకోవాలని చిత్రబృందం ఆలోచిస్తోందని తెలిసింది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
అరవై రోజుల ఆనందం
షూటింగ్ షెడ్యూల్స్ అనుకున్నట్లు సజావుగా జరిగితే చిత్రబృందం ఆనందానికి అవధులు ఉండవు. ప్రస్తుతం ‘పొన్నియిన్ సెల్వన్’ యూనిట్ ఆ ఆనందంలోనే ఉంది. మణిరత్నం దర్శకత్వంలో ఈ భారీ పీరియాడికల్ చిత్రానికి సంబంధించిన భారీ షెడ్యూల్ ముగిసింది. దాదాపు అరవై రోజులుగా హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ఈ షెడ్యూల్లో తీసినవాటిలో విక్రమ్–ఐశ్వర్యా రాయ్‌పై కీలక సన్నివేశాలు ఉన్నాయని, ప్రధాన తారాగణమంతా పాల్గొన్న ఓ పాట ఉందని సమాచారం. కార్తీ, ‘జయం’ రవి, శరత్‌కుమార్, అర్జున్, త్రిష తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలో ‘సఖి’ ఫేమ్, నటుడు అజిత్ భార్య షాలిని కీలక పాత్ర చేస్తున్నారట. కాగా, హైదరాబాద్ షెడ్యూల్ ముగిసిన విషయాన్ని సినిమా కాస్ట్యూమ్ డిజైనర్ ఏకా లఖానీ తెలిపారు. ‘‘రాక్షస షెడ్యూల్ ముగిసింది. ఈ కోవిడ్ టైమ్‌లో ఇంత పెద్ద షెడ్యూల్‌ని విజయవంతంగా పూర్తి చేయగలిగామంటే నమ్మకలేకపోతున్నాం’’ అన్నారు ఏకా. రెండు భాగాలుగా ఈ సినిమాని ప్లాన్ చేశారు మణి రత్నం. -
అందుకే తప్పుకున్నా
మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, ఐశ్వర్యా రాయ్, త్రిష, కార్తీ, ‘జయం’ రవి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న తమిళ చిత్రం ’పొన్నియిన్ సెల్వన్’. ప్రముఖ రచయిత కల్కి కష్ణమూర్తి రచించిన పాపులర్ నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో అమలా పాల్ కూడా నటించాల్సి ఉంది. కానీ షూటింగ్ ప్రారంభం కాకముందే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారామె. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా చేయకపోవడానికి గల కారణాన్ని తెలిపారామె. ‘మనకి ఆఫర్ చేసిన అన్ని సినిమాల్లో నటించలేము. ’పొన్నియిన్ సెల్వన్’లోని పాత్రకు నేను సరిపోను అనిపించింది. న్యాయం చేయలేము అనిపించినప్పుడు చేయకపోవడం ఉత్తమం. అందుకే ఆ సినిమా నుంచి బయటకు వచ్చేశాను. మణిరత్నంగారి సినిమాలో నటించే అవకాశం మళ్లీ వస్తుందని భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు అమలా పాల్. -
ఆరు గంటలకు టేక్
ఉదయం మూడు గంటలకే మేకప్ చైర్లో కూర్చుని, ఆరు గంటలకల్లా షూట్‌కు సిద్ధంగా ఉంటున్నారట కార్తీ, ‘జయం’ రవి. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాని దర్శకుడు మణిరత్నం ఆర్డర్ ఇది. ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా ఆయన దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, ఐశ్వర్యారాయ్, త్రిష ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ థాయ్‌ల్యాండ్‌లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కార్తీ, ‘జయం’ రవిలపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. సూర్యోదయం సన్నివేశాలను తీస్తున్నారట మణిరత్నం. ఇది చారిత్రాత్మక చిత్రం కావడంతో నటీనటులు గెటప్పులు భిన్నంగా ఉంటాయి. అందుకే కార్తీ, ‘జయం’ రవి ఉదయం మూడు గంటలకల్లా మేకప్ రూమ్‌కి ఎటెండ్ అయిపోతున్నారు. అలాగే సహజమైన లైటింగ్‌లో సన్నివేశాలను తీయాలని మణిరత్నం ప్లాన్ చేసుకున్నారట. అందుకని ఉదయం 6 గంటలకు ఫస్ట్ షాట్‌కి టేక్ చెబుతున్నారట. సూర్యాస్తమయం లోపు షూటింగ్ ప్యాకప్ చెబుతున్నారని సమాచారం. ఈ భారీ షెడ్యూల్ ఫిబ్రవరి వరకు థాయ్‌ల్యాండ్‌లోనే జరుగుతుందట. ఈ షెడ్యూల్ ముగిసిన తర్వాత త్రిష, విక్రమ్‌లపై సన్నివేశాలను ప్లాన్ చేశారట. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తుందనే ప్రచారం జరుగుతోంది. -
చోళ రాజుల కథలో...
ప్రస్తుతం తమిళంలో అందరి చూపు మణిరత్నం తెరకెక్కించబోయే ‘పొన్నియిన్ సెల్వన్’ మీదే ఉందని చెప్పొచ్చు. చోళుల కథ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఐశ్వర్యా రాయ్, విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, నయనతార, అనుష్క, కీర్తీ సురేశ్, అమలా పాల్ వంటి నటీనటులు ఈ సినిమాలో కనిపించబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. తాజాగా ఈ సినిమాలో మలయాళ నటుడు జయరామ్ కూడా కనిపిస్తారని తెలిసింది. ఓ ఇంటర్వ్యూలో ‘పొన్నియిన్ సెల్వన్’ చేస్తున్నట్టు జయరామ్ ప్రకటించారు. తన పాత్ర ఎలా ఉంటుందనే విషయం మాత్రం చెప్పలేదు. జయరామ్ ప్రస్తుతం తెలుగులో ‘అల వైకుంఠపురములో’ యాక్ట్ చేస్తున్నారు. -
పచ్చడి తిని ఆఫీసుకెళ్లారు
ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఆరోగ్యం విషయంలో అడపా దడపా అభిమానులు షాక్‌కి గురయ్యే వార్తలు బయటికొస్తుంటాయి. తాజాగా ఆయన చెనై్నలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేరారనే వార్త ఫ్యాన్స్‌ని కలవరానికి గురి చేసింది. గత ఏడాది మణిరత్నంకు గుండె పోటు వచ్చిన విషయం తెలిసిందే. చికిత్స తీసుకున్న ఆయన కోలుకున్నారు. ఇప్పుడు భారీ మల్టీస్టారర్ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ పనుల్లో ఉన్న మణి ఆస్పత్రిలో చేరారని వార్త రావడంతో ఏమై ఉంటుంది? అనే చర్చలు మొదలయ్యాయి. అయితే ‘ఆల్ ఈజ్ వెల్’ అని స్పష్టం చేశారు మణిరత్నం సతీమణి, నటి సుహాసిని. ‘‘నా భర్త ఈ రోజు (సోమవారం) ఉదయం పని చేయడానికి వెళ్లారు. ‘నామ్ ఉమన్’ ట్రస్ట్ కోసం మా ఇంట్లో వర్క్‌షాప్ ఏర్పాటు చేశాను. ట్రస్ట్ కోచ్ రూపా రోటీలు, మామిడికాయ పచ్చడి తీసుకొస్తే, ఆయన ఇష్టంగా తిని, స్క్రిప్ట్‌లో మరింత స్పైస్ యాడ్ చేయడం కోసం ఆఫీస్‌కి వెళ్లారు’’ అని సుహాసినీ మణిరత్నం తెలిపారు. ఇక ‘పొన్నియిన్ సెల్వన్’ విషయానికి వస్తే.. ప్రముఖ తమిళ నవల ఆధారంగా రూపొందనున్న ఈ చిత్రంలో మోహన్‌బాబు, ఐశ్వర్యా రాయ్, అనుష్క, శింబు, కార్తీ, కీర్తీ సురేష్.. ఇలా పలువురు ప్రముఖ తారలు నటించనున్నారని సమాచారం. నటీనటుల గురించి ఇంకా మణిరత్నం అధికారికంగా ప్రకటించలేదు. -
బడ్జెట్ వెయ్యి కోట్లు!
చోళుల చరిత్రతో ప్రముఖ తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ‘పొన్నియిన్ సెల్వన్’. ఈ నవల ఆధారంగా సినిమా తీయడానికి ఇప్పటివరకూ తమిళ పరిశ్రమలో దివంగత నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్, ఆ తర్వాత నటుడు కమల్‌హాసన్, ఆ తర్వాత దర్శకుడు భారతీరాజా.. ఇలా పలువురు ప్రముఖులు ట్రై చేశారట. అవేవీ నెరవేరలేదు. ఇప్పుడు మణిరత్నం ఈ ప్రయత్నం మొదలుపెట్టారు. అత్యంత పెద్ద బడ్జెట్‌తో ఈ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కనుంది. రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కించాలని మణిరత్నం అనుకుంటున్నారట. బడ్జెట్ 800 నుంచి 1000 కోట్లు అని కోలీవుడ్ తాజా టాక్. మోహన్‌బాబు, విక్రమ్, ఐశ్వర్యా రాయ్, శింబు, కార్తీ, కీర్తీ సురేష్.. ఇలా పలువురు ప్రముఖ తారాగణంతో ఈ చిత్రాన్ని త్వరలో మొదలుపెట్టనున్నారట. అన్నట్లు రాణి పూంగుళలి పాత్రకు అనుష్కను తీసుకున్నారనే వార్త వినిపిస్తోంది. -
యస్ 25
ఇండియన్ స్క్రీన్‌పై టెక్నాల జీని, భారీ హంగును చూపించిన దర్శకుడు శంకర్. భారీ ఖర్చుతో భారీ చిత్రాలను తెరకెక్కిస్తాడని పేరు. ఆయన ఇండస్ట్రీలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు మిస్కిన్ సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో కోలీవుడ్ దర్శకులు మణిరత్నం, కరుణాకరన్, గౌతమ్ మీనన్, లింగుస్వామి, బాలాజీ శక్తివేల్, పాండీరాజ్, అట్లీ, వసంత్ బాలన్, పా. రంజిత్ పాల్గొన్నారు. అందరూ ‘యస్ 25’ అనే లోగో ముద్రించి ఉన్న బ్లూ కలర్ టీ షర్ట్స్‌ను ధరించారు. స్పెషల్‌గా డిజైన్ చేయించిన కేక్‌ను శంకర్ కట్ చేశారు. ∙మణిరత్నం, మిస్కిన్, శంకర్ -
మామా కోడలు మళ్లీ కలిసే?
‘కజ్రారే కజ్రారే.. ’ పాటలో కలసి స్టెప్స్ వేశారు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్. ఆ తర్వాత ‘సర్కార్ రాజ్’ చిత్రంలోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు మరొక్కసారి స్క్రీన్‌పై కలసి యాక్ట్ చేయబోతున్నారని బాలీవుడ్ టాక్. దర్శకుడు మణిరత్నం ప్రస్తుతం తమిళ ఫేమస్ నవల ‘పొన్నియిన్ సెల్వన్’ని సినిమాగా తీయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కథని గతంలో చాలాసార్లు సిల్వర్ స్క్రీన్ మీద చూపించాలని ప్రయత్నించారీ దర్శకుడు. కానీ కుదర్లేదు. లేటైనా లేటెస్ట్గా వస్తుంది అన్నట్లు ఈ సినిమాలో టాప్ నటీనటులను ఎంపిక చేసే పనిలో పడ్డారు. ఆల్రెడీ తమిళ హీరో విక్రమ్ ఓకే అయ్యారు. విజయ్, శింబు కూడా ఈ ప్రాజెక్ట్‌లో ఉంటారని వార్త. ఈ ప్రాజెక్ట్‌లో కీలక పాత్రల కోసం అమితాబ్ బచ్చన్‌ను, ఐశ్వర్యా రాయ్‌ను సంప్రదించారట మణి. ఆల్రెడీ మణి దర్శకత్వంలో రూపొందిన ‘ఇద్దరు, గురు, రావణ్’ సినిమాలలో యాక్ట్ చేశారు ఐష్. అమితాబ్ బచ్చన్–మణిరత్నం కాంబినేషన్ మాత్రం ఫస్ట్ టైమ్. మరి.. మామా కోడలు చాలా కాలం తర్వాత ఈ సినిమాలో కనిపిస్తారన్న వార్త నిజమేనా? అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే. -
ఒక స్టార్ ఫిక్స్?
తమిళంలో ఫేమస్ నవల ‘పొన్నియిన్ సెల్వమ్’. ఈ నవలకు ఎప్పటినుంచో దృశ్యరూపం ఇవ్వాలనుకుంటున్నారు దర్శకుడు మణి రత్నం. ఇప్పుడు దానికి ముహూర్తం కుదిరింది. ప్రస్తుతం ఈ నవలను సినిమాగా రూపొందించే ప్లాన్‌లో ఉన్నారు మణి. ఈ ప్రాజెక్ట్ కోసం భారీ తారాగణాన్ని ఎంపిక చేసే పనిలో పడ్డారు. విజయ్, విక్రమ్, శింబు, ‘జయం’ రవిలను ముఖ్య తారలుగా నటింపజేయాలనే ప్లాన్‌లో మణి ఉన్నారని కోలీవుడ్ టాక్. తాజా సమాచారం ఏంటంటే.. ఈ ప్రాజెక్ట్‌కు విక్రమ్ ఓకే చెప్పినట్టు సమాచారం. ఆల్రెడీ మణిరత్నం దర్శకత్వంలో ‘రావణ్’ చిత్రంలో యాక్ట్ చేశారు విక్రమ్. వచ్చే ఏడాది స్టార్ట్ కానున్న ‘పొన్నియిన్ సెల్వమ్’ ప్రాజెక్ట్‌కి మిగతా హీరోలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేదా చూడాలి. -
ఆమె కోరిక తీరేనా?
సినిమా: నటి తాప్సీ తన ధైర్యసాహసాల పురాణం మళ్లీ మొదలెట్టింది. ఏదో ఒక కథ చెబుతూ వార్తల్లో ఉండాలని తాపత్రయపడే ఈ సంచలన తార ఒక్కోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో బుక్కైపోతుంటుంది కూడా. టాలీవుడ్, కోలీవుఢ్ దాటి బాలీవుడ్లో నటిగా రాణిస్తున్న ఈ అమ్మడు తాజాగా దక్షిణాదిలో ఒక ద్విభాషా చిత్రం చేస్తోంది. గేమ్ ఓవర్ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఈ సందర్భంగా ఒక భేటీలో నటి తాప్సీ పేర్కొంటూ ఒకప్పుడు తాను దుడుకుగా ప్రవర్తించేదానినని చెప్పుకొచ్చింది. అసాధారణం అని భావించే విషయాలను ధైర్యంగా చేసేదాన్నని, అయితే ఇప్పుడు దాన్ని తగ్గించానని అంది. తాను ఢిల్లీలో నివసించినప్పుడు మధ్య ఢిల్లీలోని ఒక అటవి ప్రాంతం గురించి కథలు కథలుగా చెప్పేవారని అంది. అది అమానుషాలతో కూడిన భయంకరమైన ప్రాంతంగా చెప్పుకునేవారని, దీంతో ఆ సంగతేంటో తెలుసుకోవాలని, తాను ఒంటరిగా ఆ ప్రాంతానికి వెళ్లొచ్చానని చెప్పింది. ఇకపోతే తాను నటినవుతానని ఊహించలేదంది. ఎంబీఏ పూర్తి చేసి ఏదైనా మంచి ఉద్యోగం చేసుకుంటూ జీవితంలో సెటిల్ అవ్వాలని ఆశించానని చెప్పింది. అలాంటిది నటిగా అవకాశాలు వచ్చాయని తెలిపింది. కొత్త విషయాలపై ఆసక్తి మెండు కావడంతో నటించడానికి రెడీ అయిపోయానని చెప్పింది. అలా తెలుగు, తమిళం భాషల్లో నటించడం మొదలెట్టానని అంది. పలు భాషల్లో పలు చిత్రాల్లో నటించినా తీరని కోరిక ఒకటి మిగిలిపోయిందని చెప్పింది. అదే దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో నటించాలని, మణిరత్నం హీరోయిన్ అనిపించుకోవాలన్నదేనని పేర్కొంది. ఆ దర్శకుడు చిత్రాల్లో పాత్రలు వైవిధ్యంగా ఉంటాయని, నటనకు అవకాశం ఉంటుందని చెప్పింది. ఎప్పటికైనా మణిరత్నం దర్శకత్వంలో నటిస్తాననే ఆశాభావాన్ని నటి తాప్సీ వ్యక్తం చేసింది. మరి ఈమె తీరని కోరిక మణిరత్నం దృష్టికి చేరేనా? ఈ అమ్మడి ఆశ నెరవేరేనా? అన్నది వేచి చూడాల్సిందే. -
శింబు ఫిక్స్
‘ముందుగా అనుకున్న అందరూ ఉన్నారు. ఆ హీరో ప్లేస్ ఒక్కటే డౌట్. మలయాళ హీరో నివిన్ పౌలీని అతని ప్లేస్‌లో సంప్రదించారు’... ఇది నిన్న మొన్నటి వరకు కోలీవుడ్‌లో మణిరత్నం మెగా మల్టీస్టారర్ సినిమా గురించి వినిపించిన వార్త. అతను శింబు అని ఊహించే ఉంటారు. శింబు, విజయ్ సేతుపతి, జ్యోతిక, అరవింద్ స్వామి, ఐశ్యర్య రాజేష్, ఫాజిల్ ముఖ్య పాత్రల్లో మణిరత్నం ఓ మెగా మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే శింబు ఈ ప్రాజెక్ట్‌లో ఉంటారా? లేదా అనే సందేహం చాలామందికి ఉండేది. దానికి కారణం అతను తమిళంలో చేసిన ‘అన్బానవన్ అసరాదవన్, అడంగాదవన్ (ఏఏఏ) సినిమా వివాదంలో చిక్కుకుంది. శింబుపై ఈ చిత్రనిర్మాత మైఖేల్ రాయప్పన్ కొన్ని ఆరోపణలు చేశారు. దీంతో ఈ హీరోగారిపై కోలీవుడ్‌లో కొంతకాలం వేటు పడుతుందన్న వార్తలు వచ్చాయి. అయితే ఈ వివాదం ఇప్పుడు సద్దుమణిగింది. దాంతో మణిరత్నం మెగా మల్టీస్టారర్ మూవీలో శింబునే ఫైనల్ అయ్యారు. అంతేకాదు మణిరత్నం స్టార్ట్ చేసిన యాక్టర్స్ వర్క్ షాష్‌కు కూడా శింబు హాజరవుతున్నారు. జనవరిలో షూటింగ్ ఆరంభం కానుంది. -
మణిరత్నం సినిమాలో మళ్లీ!
‘హిట్ పెయిర్’ పేరుతో ఓ జంట మళ్లీ మళ్లీ స్క్రీన్‌పై కన్పిస్తుంటే కొన్నాళ్లకు బోర్ కొట్టేస్తారు. కానీ, ఎన్నేళ్లైనా వెండితెరపై వన్నె తరగని జంటలు కొన్ని ఉంటాయి. విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్, సహజ నటి జయసుధలది అలాంటి జంటే. ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’, ‘బొమ్మరిల్లు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’.. ఇలా చెప్పుకోవడానికి చాలా సినిమాలున్నాయి! గతేడాది జాతీయ అవార్డు సాధించిన ‘శతమానం భవతి’తో సహా! జయసుధ, ప్రకాశ్‌రాజ్‌లు వైఫ్ అండ్ హజ్బెండ్‌గా నటించిన ప్రతి సిన్మాలోనూ ప్రేక్షకులను తమ నటనతో మెస్మరైజ్ చేశారు. ‘హిట్ పెయిర్’ అనే పదానికి కరెక్ట్ ఎగ్జాంపుల్‌గా నిలుస్తున్నారు. తాజాగా మణిరత్నం దర్శకత్వం వహించనున్న తమిళ సినిమాలోనూ ఈ ‘హిట్ పెయిర్’ వైఫ్ అండ్ హజ్బెండ్‌గా నటించేందుకు అంగీకరించారు. హీరోలు అరవింద్ స్వామి, శింబు, ఫాహద్ ఫాజిల్ వీళ్ల తనయులుగా కనిపిస్తారట. మరో హీరో విజయ్ సేతుపతి ఇన్స్పెక్టర్గా నటించనున్న ఈ సినిమాలో హీరోయిన్లు జ్యోతిక, ఐశ్వర్యా రాజేశ్‌లు కీలక పాత్రధారులు. జనవరిలో సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది!! -
పంచామృతం: అన్నీ ఉన్నా... కష్టపడి పైకొచ్చారు
ఎంత కష్టమైనా పడి సక్సెస్‌ను సాధించాలని తపన ఉండటం మానవ సహజనైజం. అయితే సేఫ్జోన్లో ఉన్నప్పుడు కష్టపడానికి మనసు ఒప్పుకోకపోవచ్చు, శరీరం సహకరించకపోవచ్చు. సక్సెస్ సాధిస్తే పేరొస్తుంది, తద్వారా డబ్బు వస్తుంది. మరి అలాంటి డబ్బు చేతిలో ఉండగా కూడా కష్టపడే తత్వం కొంతమందికే ఉంటుంది. దుర్భరమైన పరిస్థితుల్లో కష్టపడి డబ్బు సంపాదించి ఎదగడం ఒక విధమైన సక్సెస్ అయితే.. అన్నీ అమరినా కూడా వ్యక్తిగతంగా కష్టపడి ఎదగడం మరో విధమైన విజయగాధ అవుతుంది. అలాంటి వారిలో కొంతమంది సెలబ్రిటీలు వీళ్లు. కరణ్ జోహార్: ఈ బాలీవుడ్ దర్శకుడి నేపథ్యం గురించి చెప్పేటప్పుడు ‘బార్న్ విత్ ఏ సిల్వర్ స్పూన్’ అనే ఇంగ్లిష్ ఇడియంను కచ్చితంగా ఉపయోగింవచ్చు. ఈ డెరైక్టర్ సినిమాల్లో కథాంశాలు ఎంత రిచ్‌గా ఉంటాయో... కనిపించే పాత్రల్లో ఎంత కార్పొరేట్ లుక్ ఉంటుందో.. ఇతడి నేపథ్యం కూడా అదే స్థాయిలో ఉంటుంది. తండ్రి యశ్ జోహర్ బాలీవుడ్లో ఒక ప్రఖ్యాత నిర్మాత. ఆయన అడుగు జాడల్లోనే నడకమొదలు పెట్టి తన సృజనాత్మక శైలితో దర్శకుడిగా అటుపై నిర్మాతగా సక్సెస్‌ను సాధించాడు కరణ్ జోహార్. మణిరత్నం: ఈ సృజనాత్మక సినీ మేధావి కూడా ఆర్థికంగా ఒక ఉన్నత స్థాయి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే. మణిరత్నం తండ్రి రత్నం అయ్యర్ ఒక సినీ నిర్మాత. మద్రాస్‌లో థియేటర్లు కూడా ఉన్నాయి వీళ్ల కుటుంబానికి. అయితే అలాంటి సినీ నేపథ్యాన్ని తన కెరీర్‌కు బేస్ చేసుకోవాలని మణి అనుకోలేదు. మొదట జమ్నాలాల్ బజాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్‌లో ఎంబీఏపూర్తి చేశాడు. ఆ తర్వాత కుటుంబ నేపథ్యానికి దూరంగా వెళ్లి కన్నడలో సినిమాలు తీయడం ద్వారా వెలుగులోకి వచ్చాడు. ఏక్తాకపూర్: ఒకవేళ ఏక్తా కపూర్ గనుక బాలీవుడ్‌పై తన మార్కును చూపలేకపోయుంటే ఈ పాటికి అక్కడ జితేంద్ర ఉనికి కూడా ఒక గతంగానే మారిపోయేదేమో! అలనాటి ఆ లెజెండరీ హీరోకి ఏక్తాతో పుత్రికోత్సాహం లభిస్తోంది. సినీ నేపథ్యం నుంచినే వచ్చినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకొంది ఏక్తా. బాలాజీ టెలిఫిలిమ్స్‌తో సీరియల్ ప్రొడ్యూసర్‌గా మారి వైవిధ్యమైన రీతిలో పేరు, డబ్బును సంపాదించింది. అటు నుంచి ‘డర్టీపిక్చర్’లాంటి సినిమాల ద్వారా నిర్మాతగా జాతీయ స్థాయిలో స్టార్ అయ్యింది. విశాల్: తెలుగు వాడే అయిన ఈ తమిళ హీరో విశాల్ తండ్రి కూడా సినీ నిర్మాత, వ్యాపారవేత్త. అయితే కుటుంబ నేపథ్యాన్ని పూర్తిగా పక్కనపెట్టి హీరో అర్జున్ వద్ద అసిస్టెంట్ దర్శకుడిగా చేరిపోయాడు. అదే సమయంలో విశాల్ నేపథ్యాన్ని చూసిగాక అతడి రూపాన్ని చూసి ’ప్రేమ చదరంగం’ సినిమాలో నటించే అవకాశం లభించింది. అప్పటికీ కొంత ఆత్మనూన్యతాభావంతోనే ఆ సినిమాలో నటించాడట. అయితే ఆ సినిమా తమిళంలో హిట్ కావడంతో విశాల్ దశ తిరిగింది. నిర్మాత అయిన తండ్రి పేరుతో అవసరం లేకుండా విశాల్ పేరే ఒక బ్రాండ్ అయ్యింది. అజయ్ జడేజా ఈ తరం దాదాపుగా మరిచిపోయిన క్రికెటర్ జడేజా. ఇండియన్ నేషనల్ క్రికె ట్ టీమ్‌కు కొన్ని మ్యాచ్‌లలో కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన జడేజా కెరీర్ అనేక వివాదాల పాలై అంతమైంది. నవానగర్ రాజవంశానికి చెందిన జడేజా క్రికెట్ నైపుణ్యంతో జాతీయ జట్టులో స్థానం సంపాదించుకొని తన ఆట తీరుతో అందరినీ తన అభిమానులుగా మార్చుకొన్నాడు. వైస్‌కెప్టెన్, కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. తన తరంలో ప్రపంచంలోని ప్రముఖ పేరున్న క్రికెటర్‌గా నిలిచాడు. -
ఐశ్వర్య రీ ఎంట్రీ
మణిరత్నం చిత్రం ద్వారా మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ తమిళ తెరపై రీఎంట్రీకి సిద్ధమవుతున్నారు. కోలీవుడ్‌లో ఇరువర్ చిత్రం ద్వారా రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీని పరిచయం చేసింది మణిరత్నమే. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించిన ఐశ్వర్యా రాయ్ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌ను పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తల్లి అయ్యారు. దీంతో నటనకు కొంత కాలం గ్యాప్ ఇచ్చిన ముద్దుగుమ్మ తాజాగా మళ్లీ నటించడానికి సిద్ధం అయ్యారు. అయితే ఇప్పటికే పలు చిత్రాల్లో నటించనున్నట్లు ప్రచారం కూడా ముమ్మరంగా సాగింది. అయితే తనకు అత్యంత ఇష్టమైన దర్శకులు సంజయ్ లీలా బన్సాలీ, మణిరత్నం అని ఐశ్వర్యా రాయ్ ప్రకటించారు. వీరిలో ఎవరో ఒకరి దర్శకత్వంలో మళ్లీ తెరంగేట్రం చేయాలని భావించిన ఐశ్వర్యారాయ్ సంజయ్ లీలా భన్సాలీ చిత్రం రామ్ లీలాలో ఒక పాటకు డ్యాన్స చేయాలని అడిగారు. అందుకామె ఆ పాటలోని కొన్ని పదాలను మార్చమని సూచించగా, అందుకు సంజయ్ లీలా బన్సాలీ నిరాకరించారు. దీంతో ఆ చిత్రం నుంచి ఐశ్వర్యా రాయ్ వైదొలిగారు. తాజాగా మణిరత్నం దర్శకత్వం వహించనున్న చిత్రంలో ఐశ్వర్యారాయ్ ప్రముఖ పాత్రను పోషించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారన్నది కోలీవుడ్ తాజా సమాచారం.