త్వరలో మధ్యప్రదేశ్‌కు మకాం మార్చాలనుకుంటున్నారు దర్శకుడు మణిరత్నం. విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, త్రిష, ఐశ్వర్యా రాయ్, శోభితా ధూళిపాళ ప్రధాన పాత్రల్లో మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఈ నెలలో మధ్యప్రదేశ్‌లో ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ఆరంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్, మాండ్వా, మహేశ్వర్ లొకేషన్స్‌లో ఈ సినిమా చిత్రీకరణను జరపాలనుకుంటున్నారట. ఈ షెడ్యూల్‌లో ముఖ్యంగా విక్రమ్, ఐశ్వర్యా రాయ్‌ల మధ్య వచ్చే సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. అంతేకాదు.. ఈ సన్నివేశాలకు భారీగా జూనియర్ ఆర్టిస్టులు కావాలట. ఇందుకోసం ఎక్కువగా అక్కడి స్థానికులను తీసుకోవాలని చిత్రబృందం ఆలోచిస్తోందని తెలిసింది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment