![Amitabh Bachchan and Aishwarya Rai in Mani Ratnam's next movie - Sakshi](/styles/webp/s3/article_images/2019/01/5/amitab-bachhan.jpg.webp?itok=FfUx9OSi)
ఐశ్వర్యారాయ్, అమితాబ్ బచ్చన్
‘కజ్‌రారే కజ్‌రారే.. ’ పాటలో కలసి స్టెప్స్ వేశారు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్. ఆ తర్వాత ‘సర్కార్ రాజ్’ చిత్రంలోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు మరొక్కసారి స్క్రీన్‌పై కలసి యాక్ట్ చేయబోతున్నారని బాలీవుడ్ టాక్. దర్శకుడు మణిరత్నం ప్రస్తుతం తమిళ ఫేమస్ నవల ‘పొన్నియిన్ సెల్వన్’ని సినిమాగా తీయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కథని గతంలో చాలాసార్లు సిల్వర్ స్క్రీన్ మీద చూపించాలని ప్రయత్నించారీ దర్శకుడు. కానీ కుదర్లేదు. లేటైనా లేటెస్ట్‌గా వస్తుంది అన్నట్లు ఈ సినిమాలో టాప్ నటీనటులను ఎంపిక చేసే పనిలో పడ్డారు.
ఆల్రెడీ తమిళ హీరో విక్రమ్ ఓకే అయ్యారు. విజయ్, శింబు కూడా ఈ ప్రాజెక్ట్‌లో ఉంటారని వార్త. ఈ ప్రాజెక్ట్‌లో కీలక పాత్రల కోసం అమితాబ్ బచ్చన్‌ను, ఐశ్వర్యా రాయ్‌ను సంప్రదించారట మణి. ఆల్రెడీ మణి దర్శకత్వంలో రూపొందిన ‘ఇద్దరు, గురు, రావణ్’ సినిమాలలో యాక్ట్ చేశారు ఐష్. అమితాబ్ బచ్చన్–మణిరత్నం కాంబినేషన్ మాత్రం ఫస్ట్ టైమ్. మరి.. మామా కోడలు చాలా కాలం తర్వాత ఈ సినిమాలో కనిపిస్తారన్న వార్త నిజమేనా? అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment