దర్శకుడు మణిరత్నం ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన చిత్రం 'పొన్నియన్ సెల్వన్'. పదో శతాబ్దంలోని చోళరాజుల ఇతివృత్తంతో ఈ మూవీని రూపొందించారాయన. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల మొదటి భాగం షూటింగ్ పూర్తవ్వగా.. అందుకు సంబంధించిన నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా పొన్నియిన్ సెల్వన్ సినిమా కోసం ప్రచార కార్యక్రమాలను కూడా ముమ్మరం చేసింది చిత్రబృందం. సెప్టెంబర్ 30న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాళ భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
(చదవండి: పొన‍్నియన్ సెల్వన్- పార్ట్ 2 ఎప్పుడో చెప్పేసిన మణిరత్నం)
అయితే ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాయ్ పాత్ర కోసం మీరు ఎవరినైనా ఎంపిక చేయాలనుకున్నారా అని అడిగిన ప్రశ్నకు మణిరత్నం స్పందించారు. ఆ పాత్రకు అప్పట్లో రేఖను ఎంపిక చేయాలనుకున్నట్లు తన మనసులో మాటను బయటపెట్టారు దర్శకధీరుడు మణిరత్నం. తొలిసారి కమల్ హాసన్‌తో కలిసి ఈ చిత్రాన్ని తీయాలనుకున్నట్లు తెలిపారు.
1994, 2011లో ఈ చిత్రం చేయడానికి ప్రయత్నించగా.. ప్రాజెక్ట్ అనుకున్నట్లుగా టేకాఫ్ కాలేదని వివరించారు. కాగా పొన్నియన్ సెల్వన్ -1లో ఐశ్వర్రాయ ద్విపాత్రాభినయం చేస్తోంది. నందిని, ఆమెకు మూగ తల్లిగా మందాకిని దేవి పాత్రల్లో కనిపించనుంది. జూలైలో ఐశ్వర్య పాత్రకు చెందిన నందిని ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ చిత్రానికి సంబంధించి యుద్ధ సన్నివేశాలను ఎక్కువ భాగం థాయ్‌లాండ్‌లో చిత్రీకరించారు. ఈ సినిమాలో విక్రమ్, జయం రవి, కార్తీ, త్రిష, శోభితా ధూళిపాళ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment