
విక్రమ్
తమిళంలో ఫేమస్ నవల ‘పొన్నియిన్ సెల్వమ్’. ఈ నవలకు ఎప్పటినుంచో దృశ్యరూపం ఇవ్వాలనుకుంటున్నారు దర్శకుడు మణి రత్నం. ఇప్పుడు దానికి ముహూర్తం కుదిరింది. ప్రస్తుతం ఈ నవలను సినిమాగా రూపొందించే ప్లాన్‌లో ఉన్నారు మణి. ఈ ప్రాజెక్ట్ కోసం భారీ తారాగణాన్ని ఎంపిక చేసే పనిలో పడ్డారు. విజయ్, విక్రమ్, శింబు, ‘జయం’ రవిలను ముఖ్య తారలుగా నటింపజేయాలనే ప్లాన్‌లో మణి ఉన్నారని కోలీవుడ్ టాక్. తాజా సమాచారం ఏంటంటే.. ఈ ప్రాజెక్ట్‌కు విక్రమ్ ఓకే చెప్పినట్టు సమాచారం. ఆల్రెడీ మణిరత్నం దర్శకత్వంలో ‘రావణ్’ చిత్రంలో యాక్ట్ చేశారు విక్రమ్. వచ్చే ఏడాది స్టార్ట్ కానున్న ‘పొన్నియిన్ సెల్వమ్’ ప్రాజెక్ట్‌కి మిగతా హీరోలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేదా చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment