
తమిళ నటుడు విజయ్ సేతుపతి నటించిన తొలి మలయాళ చిత్రం ‘మార్కొని మతాయ్’. జయరామ్ మరో హీరోగా నటించిన ఈ సినిమాకి సనల్ కలతిల్ దర్శకత్వం వహించారు. లక్ష్మీ చెన్న కేశవ బ్యానర్‌పై నిర్మాత కృష్ణస్వామి ఈ చిత్రాన్ని ‘రేడియో మాధవ్’ టైటిల్‌తో తెలుగులో అనువదిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను హీరో శ్రీవిష్ణు విడుదల చేసి, ‘నిర్మాతలకు ఆల్ ది బెస్ట్. సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది’ అన్నారు.
‘ఫస్ట్ లుక్ విడుదల చేసినందుకు శ్రీ విష్ణుగారికి కృతజ్ఞతలు. గతంలో దుల్కర్ చేసిన ‘కలి’ చిత్రాన్ని ‘హే పిల్లగాడ’గా విడుదల చేశాం. ఇప్పుడు మంచి కథాంశంతో రూపొందిన ‘రేడియో మాధవ్’ని అందిస్తున్నాం. రేడియో స్టేషన్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే చిత్రమిది’ అన్నారు కృష్ణస్వామి. ‘థియేటర్స్ పరిస్థితిని బట్టి విడుదల తేదీపై ఓ నిర్ణయం తీసుకుంటాం’ అన్నారు సహనిర్మాత చలం. చిత్ర నిర్వాహకుడు శ్రీనివాస మూర్తి, మాటల రచయిత భాష్య శ్రీ మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment