
జగపతిబాబు
హీరో నుంచి విలన్ ట్రాక్‌లోకి వచ్చిన తర్వాత జగపతిబాబు కాల్షీట్ డైరీ ఫుల్‌గా ఉంటోంది. ‘లెజెండ్’, ‘రంగస్థలం’ వంటి చిత్రాల్లో విలన్‌గా జగపతిబాబు నటన అదుర్స్. తాజాగా ఆయన మరో సినిమాలో విలన్‌గా నటించబోతున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. చిరంజీవి హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందనే ప్రచారం జరగుతున్న సంగతి తెలిసిందే. మలయాళ హిట్ ‘లూసిఫర్’కు ఇది రీమేక్. ఇందులోని ఓ కీలక పాత్రకు జగపతిబాబును సంప్రదించారట చిత్రబృందం. అది విలన్ రోల్ అని తెలిసింది. ఇదే చిత్రంలో నటి ఖుష్బూ కూడా ఓ కీలక పాత్ర పోషించనున్నారని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.