
సూర్యదేవర నాగవంశీ
ఈ ఏడాది మార్చిలో విడుదలైన మలయాళ చిత్రం ‘కప్పెల’ మంచి విజయం సాధించింది. ముహమ్మద్ ముస్తఫా దర్శకత్వంలో అన్నా బెన్, శ్రీనాథ్ భసి, రోషన్ మాథ్యూ ముఖ్యతారాగణంగా రూపొందిన చిత్రం ఇది. ఈ సినిమా తెలుగులో రీమేక్ కానుంది. మలయాళ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ను తెలుగులో రీమేక్ చేయనున్న సితార ఎంటర్‌టైన్మెంట్ అధినేతలు ఎస్. రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ ‘కప్పెల’ తెలుగు రీమేక్ హక్కులను కూడా సొంతం చేసుకోవడం విశేషం. ఓ ఇద్దరు ప్రముఖ హీరోలు నటించే ఈ చిత్రానికి ఒక యువదర్శకుడు దర్శకత్వం వహిస్తారని తెలిసింది. మరోవైపు ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్‌లో రవితేజ, రానా హీరోలుగా నటించబోతున్నారని టాక్. మలయాళ హిట్ ‘ప్రేమమ్’ను కూడా సితార ఎంటర్‌టైన్మెంట్స్ తెలుగులో రీమేక్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment