
తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

ఆదివారం (మే 12న) జరిగిన రోడ్డు ప్రమాదంలో సీరియల్ నటి పవిత్ర జయరామ్ మరణించింది.

రోజూ తన కళ్ల ఎదుట నవ్వుతూ కనిపించే పవిత్ర ఇక లేదన్న విషయాన్ని నటుడు చంద్రకాంత్ జీర్ణించుకోలేకపోతున్నాడు.

నాకోసం తిరిగి వచ్చేయంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు.

'నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయావంటే నమ్మలేకపోతున్నాను.

ఒకసారి మామా అని పిలువే ప్లీజ్.. అంటూ ఆమెతో దిగిన చివరి ఫోటో షేర్ చేశాడు. కాగా పవిత్ర జయరామ్ స్వస్థలం కర్ణాటకలోని మాండ్య.

కన్నడ సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రపంచంలోకి అడుగుపెట్టింది. నిన్నే పెళ్లాడతా సీరియల్‌తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.

'త్రినయని' సీరియల్‌లో విలన్ తిలోత్తమ పాత్రతో బాగా పాపులర్ అయింది.

న్నడ సీరియల్స్ చేసినా రాని గుర్తింపు ఈ ఒక్క ధారావాహికతో సంపాదించింది.

చంద్రకాంత్ కూడా ఈ సీరియల్‌లో నటికి సోదరిగా యాక్ట్ చేశాడు.

సన్నిహితురాలి మరణాన్ని తట్టుకోలేకపోతున్న అతడు ఆమెతో కలిసి చేసిన రీల్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు.







