chandrakanth
-
నా జీవితాన్ని నాశనం చేశాడు..
-
చంద్రకాంత్ సూసైడ్..పవిత్ర జయరాం యాక్సిడెంట్ కేసులో కీలక మలుపు
-
Serial Actor Chandu: నేను పిచ్చివాడినైపోతా.. నటుడు చందు చివరి మాటలు వైరల్
తెలుగు సీరియల్ నటుడు చంద్రకాంత్ మరణంతో అతడి కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఇటీవల పవిత్రతో కలిసి కారులో ప్రయాణిస్తున్న సమయంలో యాక్సిడెంట్ జరగ్గా అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో నటి పవిత్ర గుండెపోటుతో కన్నుమూసింది. ప్రియురాలి మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన చందు ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఐదేళ్లుగా నటితో సహజీవనంతల్లిని, కట్టుకున్న భార్యను, పిల్లలను వదిలేసి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో అతడి వాట్సాప్ చాట్ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. పవిత్రను ప్రేమించాక భార్యాపిల్లల్ని వదిలేశాడు చందు. ఐదేళ్లుగా నటితోనే కలిసుంటున్నాడు. సడన్‌గా ఆమె తనను వదిలేసి పోవడంతో చందు డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో వాట్సాప్‌లో తన సహనటి కరాటే కల్యాణికి మెసేజ్‌లు చేశాడు.ఈ జన్మకు చాలునేను వెళ్లిపోతాను.. ఈ జన్మకు ఇక చాలు.. కానీ అప్పుడే ఎవరికీ చెప్పకండి అన్నాడు. అలా మాట్లాడొద్దని ఆమె వారిస్తున్నా ఆ మాటల్ని లెక్క చేయలేదు. నేను వెళ్లిపోతేనే కరెక్ట్. లేదంటే నేను పిచ్చోడిని అయిపోతా, తాగుబోతునైపోయి ఇంట్లోవాళ్లను ఇబ్బంది పెడతాను అంటూ ఏడుస్తున్న ఎమోజీని షేర్ చేశాడు. ఈ చాట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.చదవండి: చనిపోతానని ముందే హింటిచ్చిన నటుడు.. ఐదేళ్ల నుంచి పట్టించుకోట్లేదంటూ విలపించిన తల్లి -
చందు వైఫ్ షాకింగ్ కామెంట్స్
-
'తాగొచ్చి భార్యను కొట్టేవాడు, ఎల్ఐసీ డబ్బుల కోసం..' ఏడ్చేసిన నటుడి తల్లి
త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరామ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణిచింది. యాక్సిడెంట్లో ఆమెకు పెద్దగా గాయాలు కానప్పటికీ ఆ సమయంలో గుండెపోటు రావడంతో కన్నుమూసింది. నటి మృతిని ఆమె ప్రియుడు, నటుడు చందు జీర్ణించుకోలేకపోయాడు. పవిత్ర లేకుండా ఉండలేకపోతున్నానంటూ ఇంటర్వ్యూలలో కన్నీరుమున్నీరుగా విలపించాడు.ముందుగానే హింట్త్వరలోనే గుడ్‌న్యూస్ చెప్పబోతున్నానంటూ తన చావును ముందుగానే హింటిచ్చాడు. ఇన్స్టాగ్రామ్ వీడియోలలోనూ ఇంకో రెండు రోజులు మాత్రమే.. అంటూ పవిత్రతో కలిసున్న పిక్స్ షేర్ చేశాడు. చివరికి అన్నంత పనీ చేశాడు. హైదరాబాద్‌లోని తన నివాసంలో శుక్రవారం (మే 17న) ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మరణంపై నటుడి తల్లీభార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.ఐదేళ్లుగా నటితోనే..చందు తల్లి మాట్లాడుతూ.. 'ఐదేళ్ల నుంచి చందు.. పవిత్రతోనే ఉంటున్నాడు. వాళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నామని చెప్పారు. అప్పటినుంచి తను భార్యాపిల్లల్ని పట్టించుకోవడం మానేశాడు. యాక్సిడెంట్ తర్వాత కూడా నా కొడుకు మాతో మాట్లాడలేదు. నా కోడలు, నేను చూడటానికి వెళ్తే దగ్గరకు కూడా రానివ్వలేదు. అతడు భార్యను ఎన్నో ఇబ్బందులు పెట్టాడు. మారతాడనుకున్నాం..తాగి వచ్చి ఆమెను తిట్టేవాడు, కొట్టేవాడు. మారతాడేమోనని అంతా ఎదురుచూశాం. కానీ మారలేదు. యాక్సిడెంట్ తర్వాత అతడి ఫ్రెండ్ వాళ్ల ఇంట్లో ఉన్నాడు. పవిత్ర ఎల్ఐసీ డబ్బుల కోసం వెళ్తున్నా అని చెప్పి బయటకు వెళ్లాడు. మేమెవరం ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఇంతలోనే అతడు ఉరేసుకుని చనిపోయాడని తెలిసింది' అంటూ గుండె పగిలేలా ఏడ్చింది చందు తల్లి. View this post on Instagram A post shared by Challa Chandu II (@chandrakanth_artist)చదవండి: పవిత్రతో గత ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు: చందు భార్య శిల్ప -
చందు సూసైడ్ వెనక సంచలన నిజాలు
-
పవిత్ర భర్త చంద్రకాంత్ సూసైడ్
-
రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
త్రినయని సీరియల్ నటి పవిత్ర గౌడ రెండు రోజుల క్రితం మరణించింది. అయితే తను యాక్సిడెంట్లో మరణించలేదంటున్నాడు నటుడు చంద్రకాంత్. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో పవిత్ర గురించి చెప్తూ కన్నీరుమున్నీరుగా విలపించాడు. 'కన్నడలో ఓ సినిమాకు సంతకం చేసేందుకు మేమంతా బెంగళూరు వెళ్లాం. అక్కడ ప్రాజెక్టుకు ఒప్పుకుని కొంత అడ్వాన్స్ తీసుకుని హైదరాబాద్‌కు తిరుగుప్రయాణమయ్యాము. నటికి గాయాలవలేదు!కారులో నేను, పవిత్ర వెనకాల కూర్చున్నాం. ముందు డ్రైవర్ పక్కన పవిత్ర సోదరి కూతురు ఉంది. అందరమూ గాఢ నిద్రలో ఉన్నాం. బస్ మమ్మల్ని ఓవర్టేక్ చేసే క్రమంలో మా కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. అప్పుడు నా ఒక్కడికి మాత్రమే తీవ్ర గాయాలయ్యాయి. పవిత్రకు ఒక్క దెబ్బ కూడా తగల్లేదు. నన్ను రక్తపు మడుగులో చూసేసరికి నాన్నా ఏమైందంటూ షాక్‌లోకి వెళ్లిపోయింది. అంబులెన్స్ ఆలస్యంగా రావడం వల్లే తను మరణించింది. అంబులెన్స్ సమయానికి వచ్చుంటే తను బతికేది. గుండెపోటు వల్లే తన ఊపిరి ఆగిపోయిందని వైద్యులు పేర్కొన్నారు.ఇంతలోనే..మేము భార్యాభర్తలమన్న విషయాన్ని అధికారికంగా చెప్దామనుకున్నాము. ఇంతలోనే తను నన్ను మోసం చేసి వెళ్లిపోయింది. నా జీవితం ఎటు కాకుండా పోయింది. ఆ దేవుడు తనను అలాగే ఉంచి నన్ను తీసుకెళ్లినా బాగుండేది. నా పవిత్ర గురించి తప్పుడుగా ప్రచారం చేయకండి.. అది చాలా మంచి మనిషి' అని చంద్రకాంత్ కన్నీరుమున్నీరుగా విలపించాడు.చదవండి: గాయపడిన ఐశ్వర్య రాయ్.. అయినా అక్కడికి ప్రయాణం -
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్ (ఫోటోలు)
-
రూ.2.5 కోట్ల బడ్జెట్‌తో ‘చీటర్’
చంద్రకాంత్ దూత్త, రేఖ నిరోషా హీరో హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం ‘చీటర్’. ఎస్ ఆర్ ఆర్ ప్రొడక్షన్స్ పతకం పై పరుపతి శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నారాయణ బర్ల దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ చిత్రం గురించి దర్శకుడు నారాయణ బర్ల మాట్లాడుతూ.. ‘మంచి యాక్షన్ సనివేషాలతో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. సినిమా చాలా రిచ్ గా వచ్చింది. అద్భుతమైన కథ కథనం తో సినిమా షూటింగ్ పూర్తి చేశాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. త్వరలో విడుదల తేదిని ప్రకటిస్తాం’అన్నారు. ‘రూ.2.5 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. గోవా, ఆరాకు, హైదరాబాద్ లో షూటింగ్ చేశాం. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను తెరకెక్కించాం’అని నిర్మాత పరుపతి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాధికా, అనిత, బాబు రావు, గౌతి రాజు, మల్లేష్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అర్జున్ సంగీతం అందిస్తున్నారు. -
అపూర్వ విజయం.. అద్భుతంగా సాగిన మధ్య ప్రదేశ్ గెలుపు ప్రస్థానం
ఏప్రిల్ 1999... ఇదే బెంగళూరు, ఇదే చిన్నస్వామి స్టేడియం... కర్ణాటకతో రంజీ ట్రోఫీ ఫైనల్లో మధ్యప్రదేశ్‌కు 75 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. 247 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి రోజు ఆలౌట్ కాకుండా జాగ్రత్తగా ఆడుకుంటే టైటిల్ దక్కేది. కానీ అనూహ్యంగా కుప్పకూలిన మధ్యప్రదేశ్ మ్యాచ్ మరో 5.1 ఓవర్లు మిగిలి ఉండగా ఆలౌటైంది. అయితే ఈ సారి ఆ జట్టు ఎలాంటి తప్పూ చేయలేదు. భారీ ఆధిక్యాన్ని సాధించిన తర్వాత కూడా పట్టు జారకుండా చూసుకుంది. తొలిసారి రంజీ చాంపియన్‌గా నిలిచింది. నాడు కెప్టెన్‌గా ఓటమి వేదన అనుభవించిన చంద్రకాంత్ పండిత్ 23 ఏళ్ల తర్వాత ఇప్పుడు అదే మధ్యప్రదేశ్ కోచ్‌గా విజయానందాన్ని ప్రదర్శించాడు! సీజన్ తొలి మ్యాచ్ నుంచి విజేతగా నిలిచే వరకు ఆటగాళ్ల చక్కటి ప్రదర్శనతో పాటు కోచ్‌గా చంద్రకాంత్ దూరదృష్టి, వ్యూహాలు టీమ్‌ను ముందుకు నడిపించాయి. నరేంద్ర హిర్వాణీ, రాజేశ్ చౌహాన్, అమయ్ ఖురాసియా, నమన్ ఓజా, దేవేంద్ర బుందేలా, జలజ్ సక్సేనా... సుదీర్ఘ కాలం పాటు మధ్యప్రదేశ్ జట్టుకు ఆడి తమ సర్వస్వం ధారబోసినా రంజీ టైటిల్ విజయాన్ని మాత్రం వారంతా రుచి చూడలేకపోయారు. జట్టును ఈ స్థాయికి చేర్చడంలో ఇన్నేళ్లలో వీరంతా కీలక పాత్ర పోషించారు. వారంతా గర్వపడే క్షణమిది. తాజా సీజన్లో ముగ్గురు బ్యాటర్లు ప్రధానంగా జట్టు భారాన్ని మోశారు. ఐపీఎల్ ప్రదర్శన గాలివాటం కాదని నిరూపిస్తూ రజత్ పటిదార్ (మొత్తం 658 పరుగులు) అందరికంటే ముందుండగా... యశ్ దూబే (614), శుభమ్ శర్మ (608) దేశవాళీ క్రికెట్లో ఇప్పుడు తమపై దృష్టి పడేలా చేసుకున్నారు. హిమాన్షు మంత్రి (375) కీలక సమయాల్లో రాణించగా, కోచ్ నమ్మకముంచిన 18 ఏళ్ల అక్షత్ రఘువంశీ 6 ఇన్నింగ్స్‌లలోనే 1 సెంచరీ, 3 అర్ధ సెంచరీలతో 295 పరుగులు చేయడం విశేషం. బౌలింగ్‌లో లెఫ్టార్మ్ స్పిన్నర్ కుమార్ కార్తికేయ (32 వికెట్లు), పేసర్ గౌరవ్ యాదవ్ (23 వికెట్లు) ఆరంభంలోనే వికెట్లతో ప్రత్యర్థిపై పైచేయి సాధించడంలో తమ వంతు పాత్ర పోషించారు. విడిగా చూస్తే ఏ ఒక్కరూ అసాధారణ ఆటగాళ్లు కాదు. కానీ జట్టుగా, సమష్టిగా వీరంతా సత్తా చాటడంతో మధ్యప్రదేశ్ టీమ్ కల నెరవేరింది. భారత జట్టుకు ఎంపిక కావడంతో ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు వెంకటేశ్ అయ్యర్, అవేశ్ ఖాన్ టీమ్‌కు దూరమైనా ఆ ప్రభావం పడకుండా కుర్రాళ్లు చూసుకోగలిగారు. మైదానంలో జట్టులో స్ఫూర్తి నింపడంలో కెప్టెన్ ఆదిత్య శ్రీవాస్తవది కూడా కీలక పాత్ర. ‘నేను ఒక ప్లేయర్‌ను చెంపదెబ్బ కొట్టినా దానికో కారణం ఉంటుంది. ఆటగాడు కూడా అర్థం చేసుకుంటాడు. ఇది నా కోచింగ్ శైలి’ అంటూ చంద్రకాంత్ పండిత్ చెప్పుకున్నారు. టైమ్ మేనేజ్మెంట్, ప్రణాళికలు, సన్నద్ధత విషయంలో ఆయన ఇచ్చిన ‘బ్లూ ప్రింట్’ను జట్టు సభ్యులు సమర్థంగా అమలు చేశారు. వికెట్ కీపర్‌గా భారత్ తరఫున 5 టెస్టులు, 36 వన్డేలు ఆడిన పండిత్ కోచింగ్ రికార్డు అద్భుతం. ముంబై చివరిసారి విజేతగా నిలిచిన 2015–16 సీజన్లో ఆయన ఆ టీమ్‌కు కోచ్‌గా ఉన్నారు. రంజీ దిగ్గజ జట్టే కాదు ఎలాంటి టీమ్‌నైనా నేను నడిపించగలను అన్నట్లుగా చాలెంజ్ చేస్తూ విదర్భ టీమ్‌కు పండిత్ వెళ్లారు. అప్పటి వరకు దిగువ స్థాయికే పరిమితమవుతూ గుర్తింపే లేని విదర్భ కూడా ఆయన మార్గనిర్దేశనంలో తొలి టైటిల్ సాధించడంతో పాటు తర్వాతి ఏడాది దానిని నిలబెట్టుకోవడం విశేషం. ఇప్పుడు కూడా అదే తరహాలో తొలి ప్రయత్నంలోనే జట్టును విజేతగా నిలపగలిగారు. తాజా గెలుపుతో మున్ముందు భారత దేశవాళీ క్రికెట్లో మధ్యప్రదేశ్ మరింతగా దూసుకుపోవడం ఖాయం. చదవండి: Ranji Trophy 2022: రంజీ ట్రోఫీ 2022లో అదరగొట్టిన హీరోలు వీళ్లే..! -
15 రోజుల్లో ఇద్దరు మంత్రులు రాజీనామా చేస్తారు: బీజేపీ
ముంబై: మహారాష్ట్రలో రెండు వారాల్లోపు మరో ఇద్దరు మంత్రులు రాజీనామా చేస్తారని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ గురువారం జోస్యం చెప్పారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తనను సర్వీస్‌లో కొనసాగించేందుకు రూ. 2 కోట్లు డిమాండ్ చేశారని సస్పెండైన పోలీస్ అధికారి సచిన్‌వాజే బుధవారం ఆరోపణలు చేశాడు. అలాగే, కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేయాలని మరో మంత్రి, శివసేన నాయకుడు అనిల్ పరబ్ తనను ఆదేశించారని వాజే వెల్లడించారు. వాజే ఈ ఆరోపణలు చేసిన మర్నాడు పాటిల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తనపై వచ్చిన ఆరోపణలను అనిల్ పరబ్ తోసి పుచ్చారు. ఈ నేపథ్యంలో ‘రాష్ట్రంలో భవిష్యత్తులో ఏం జరగబోతోందో ఎవరైనా ఊహించగలరు. ఇద్దరు మంత్రుల అవినీతిపై కొందరు కోర్టుకు వెళ్తారు. ఆ మంత్రులు మరో 15 రోజుల్లో రాజీనామా చేస్తారు’ అని చంద్రకాంత్ పాటిల్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు కుట్ర ►శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆగ్రహం ముంబై: మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు కుట్ర పన్నుతున్నారని, నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రలు సాగబోవని హెచ్చరించారు. జైల్లో ఉన్న వారి నుంచి లెటర్లు రాసుకొచ్చే కొత్త ట్రెండ్ నడుస్తోందని విమర్శించారు. వ్యక్తిత్వ హననానికి, రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలను, ఆదాయపు పన్ను శాఖను వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ రూ.2 కోట్లు డిమాండ్ చేశాడని సస్పెండైన పోలీసు అధికారి సచిన్ వాజే బు«ధవారం ఆరోపించిన విషయం తెలిసిందే. -
‘మహా’ పొత్తు కుదిరింది
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేయనున్నాయి. సీట్ల సర్దుబాటుపై అవగాహనకు వచ్చామని, ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనేది ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ప్రకటిస్తారని బీజేపీ నేత చంద్రకాంత్ పాటిల్ సోమవారం ప్రకటించారు. తమ కూటమిలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, రాష్ట్రీయ సమాజ్ ప„ŠS, శివ సంగ్రామ్ సంఘటన్, రైతు క్రాంతి సేన కూడా ఉన్నాయని శివసేన నేత సుభాష్ దేశాయ్ చెప్పారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని శివసేన నేత, ఉద్ధవ్ ఠాక్రే పెద్ద కుమారుడు ఆదిత్య ఠాక్రే ప్రకటించారు. ఠాక్రే కుటుంబం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి వ్యక్తి ఆదిత్య ఠాక్రేనే కావడం విశేషం. ముంబైలోని వర్లి స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు ఆదిత్య వెల్లడించారు. వర్లి సేన బలంగా ఉన్న స్థానాల్లో ఒకటి. 1966లో బాల్ ఠాక్రే శివసేనను స్థాపించినప్పటి నుంచి ఆ కుటుంబసభ్యులెవరూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. రాజ్యాంగ పదవులు పొందలేదు. మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే (బాల్ ఠాక్రే సోదరుడి కుమారుడు) 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు కానీ తరువాత మనసు మార్చుకున్నారు. ఎక్కువ స్థానాల్లో శివసేన గెలిస్తే ఆదిత్య ఠాక్రే సీఎం అవుతారని సేన వర్గాలు చెబుతున్నాయి. ఒక శివసైనికుడిని సీఎం చేస్తానని తన తండ్రి దివంగత బాల్ ఠాక్రేకు హామీ ఇచ్చానని శనివారం ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించడం గమనార్హం. 2014 ఎన్నికల్లో బీజేపీ, శివసేన వేర్వేరుగా పోటీ చేశాయి. ఫలితాల అనంతరం అదే సంవత్సరం డిసెంబర్లో బీజేపీ ప్రభుత్వంలో శివసేన చేరింది. ఎంఎన్ఎస్ పోటీ ఈ ఎన్నికల్లో మహారాష్ట్ర నవ నిర్మాణ సేన పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే ప్రకటించారు. ‘ఈ ఎన్నికల్లో పోటీ చేస్తాం. గెలుస్తాం’ అని ఆయన సోమవారం ప్రకటించారు. ఎన్ని స్థానాల్లో పోటీ చేయనున్నది ఆయన ప్రకటించలేదు. కానీ సుమారు 125 సీట్లలో ఎంఎన్ఎస్ పోటీ చేయొచ్చని ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు. ముంబై, పుణె, నాసిక్, థానె, పాల్ఘార్.. తదితర పట్టణ ప్రాంతాల్లోనే ఆ పార్టీ బరిలో నిలిచే అవకాశముంది. అయితే, ఆదిత్య ఠాక్రే పోటీ చేస్తున్న ముంబైలోని వర్లి స్థానంలో ఎంఎన్ఎస్ అభ్యర్థిని నిలుపుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. -
ఒక రాణి ఇద్దరు రాజులు
ఇండియన్ టెలివిజన్ సిరీస్‌లో మెగా బడ్జెట్ ఫాంటసీ సీరియల్ గురించి చెప్పుకోవాలంటే ప్రప్రథమంగా చంద్రకాంతనే గుర్తు చేసుకోవాలి. ఈ సీరియల్ సృష్టికర్త, రచయిత, నిర్మాత, దర్శకుడు నీర్జా గులేరీ బుల్లితెర మీద ఓ మెగా మాయను సృష్టించారు. మంత్ర తంత్ర విద్యలను కళ్లకు కట్టారు. రాజులు–రాజ్యాల మధ్య జరిగిన యుద్ధ హోరుతో ప్రేక్షకులను కట్టడి చేశారు. ఈ మెగా సీరియల్ ఇండియన్ టెలివిజన్‌లోనే బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కథనం హోరు ‘చంద్రకాంత’ ఓ ఊహాజనిత ప్రేమ కథనం. విజయ్‌గఢ్ యువరాణి చంద్రకాంత. అపూర్వ సౌందర్యరాశి. అసామాన్యమైన తెలివితేటలు. రూపంలోనూ, వ్యక్తిత్వంలోనూ దేశదేశాల్లో ఆమె పేరు మార్మోగుతుంటుంది. నవ్‌గఢ్ రాజు వీరేంద్రసింగ్ చంద్రకాంతను ప్రేమిస్తాడు. విజయగఢ్కు పొరుగుననే ఉన్న చునాడ్గఢ్ రాజు శివదత్తుడూ చంద్రకాంతను మోహిస్తాడు. ఒక రాణి కోసం ఈ రెండు ప్రత్యర్థి రాజ్యాల రాజుల మధ్య జరిగిన ప్రేమ పోరాటం కథనమే చంద్రకాంత సీరియల్. కట్టడి చేసే మాయోపాయాలు యువరాణి చంద్రకాంత ఉన్న విజయగఢ్ కోటలోనే క్రూర్సింగ్ అనే వ్యక్తి ఆమెను పెళ్లిచేసుకొని, రాజ్య కిరీటం సొంతం చేసుకోవాలని కలలు కంటుంటాడు. అయితే, పొరుగున ఉన్న చునాడ్గఢ్ రాజు శివదత్తు శక్తివంతమైన రాజు కావడంతో తన పాచికలు పారవని గ్రహించి, అతనికి నమ్మిన బంటుగా మారిపోతాడు. క్రూర్సింగ్ మాయోపాయాలు పన్ని చంద్రకాంతను శివదత్తుని చేత బంధించడానికి సకల ప్రయత్నాలు చేస్తాడు. శివదత్తుడి మాయోపాయాలు, మంత్రతంత్రాలతో చంద్రకాంతను బందీ చేస్తాడు. అతని బందిఖానా నుంచి బయటపడి, పారిపోతున్న చంద్రకాంత్‌ను గుర్తించి శివదత్తకు సమాచారం చేరవేస్తాడు క్రూర్సింగ్. విషయమంతా తెలుసుకున్న వీరేంద్రసింగ్ అయ్యర్ల (గూఢచారులు+సైనికులు) సాయంతో శివదత్తతో పోరాడుతాడు. ఈ కథనం అంతా చంద్రకాంత అపహరణ, ఆమెను కాపాడటం.. వంటివాటితో నడుస్తుంది. చంద్రకాంతను ట్రాప్ చేయడానికి మాయలు, మంత్రవిద్యలు ప్రయోగించడం... వాటిని రాజు వీరేంద్ర తిప్పికొట్టే విధానాలతో నడుస్తుంది. శివదత్తుని మాయోపాయాలన్నీ వీరేంద్ర కనిపెట్టి, వాటిని తిప్పి కొట్టడంతో శివదత్తుడు వెనక్కి తగ్గుతాడు. ఈ పోరాటంలో శివదత్తు తన చునాడ్గడ్ కోటని వదులుకొని వెనుతిరగాల్సి వస్తుంది. వీరేంద్రసింగ్ చంద్రకాంతను పెళ్లి చేసుకొని విజయ్గఢ్ను, తన రాజ్యమైన నవగఢ్ను, శివదత్తుని రాజ్యమైన చునాడ్గఢ్ను కూడా సొంతం చేసుకొని పరిపాలిస్తుంటాడు. దీంతో విధిలేక శివగఢ్ నుంచి పరిపాలన కొనసాగిస్తుంటాడు శివదత్తు. అంతటితో ఊరుకోకుండా వీరేంద్రసింగ్, చంద్రకాంతలపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. శివదత్తు పాలనా వ్యవహారాలను చూస్తున్న పండిట్ జగన్నాథ్ చునాడ్గఢ్ని, చంద్రకాంతను ఎలా కైవసం చేసుకోవాలో భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తుంటాడు. అనుచరులు క్రూర్సింగ్, అహ్మద్, నజిమ్లు వీరేంద్రసింగ్ మీద ప్రతీకారం తీర్చుకోమని శివదత్తుని ప్రేరేపిస్తుంటారు. వీరేంద్రసింగ్‌ను చంపి చంద్రకాంతను పెళ్లి చేసుకోవడానికి శివదత్తే కాదు క్రూర్సింగ్ కూడా ప్రయత్నిస్తుంటాడు. మూలకథకు చాలా దూరం ‘చంద్రకాంత’ నవల నుంచి స్టోరీ లైన్‌ని తీసుకున్నప్పటికీ నవలకి– సీరియల్‌కి పూర్తి భిన్నంగా నడుస్తుంది కథనం. ఈ సీరియల్ ఎన్నో కొత్త కొత్త పాత్రలను పరిచయం చేసింది. చంద్రకాంత మూల కథ రచయిత దేవకి నందన్ ఖత్రీ. ఇతను హిందీ భాషలో మొదటి తరానికి చెందిన ప్రసిద్ధ రచయిత. ఇతను మిస్టరీ నావలిస్ట్‌గా కూడా ప్రసిద్ధి. చంద్రకాంత సీరియల్‌ను 1994 నుంచి 1996 వరకు 130 ఎపిసోడ్లను దూరదర్శన్ ప్రసారం చేసింది. ఈ సీరియల్ నిర్మాత, దర్శకులు నిర్జా గులేరీ, సునీల్ అగ్నిహోత్రి. ఈ సీరియల్ ఒకదశలో వివాదాస్పదం కావడంతో పునః ప్రసారానికి నిర్మాతలు సుప్రీమ్‌కోర్టులో దావా వేశారు. దీంతో 1999లో చంద్రకాంత సీరియల్‌ని తిరిగి ప్రసారం చేశారు. ఇతర టీవీలలో ఆ తర్వాత స్టార్ ప్లస్, సోనీ టెలివిజన్లలోనూ చంద్రకాంత సీరియల్ ప్రసారమైంది. ‘కహానీ చంద్రకాంతకి’ సీరియల్ 2011లో సహారా ఒన్‌లో ప్రసారమయ్యింది. ఆ తర్వాత ‘చంద్రకాంత సంతతి’ పేరుతో దర్శకులు సునిల్ అగ్నిహోత్రి సీరియల్‌గా తీశారు. ఇది దేవకీ నందన్ ఖత్రీ నవలకు అసలు సిసలు రూపం. అయితే, ‘చంద్రకాంత సంతతి’ కథకి, టీవీ సీరియల్ ‘కహానీ చంద్రకాంత’కి చాలా భిన్న సారుప్యాలు ఉన్నాయి. 2017లో స్టార్ భారత్ ‘ప్రేమ్ యా పహేలీ –చంద్రకాంత’ అని మళ్లీ ఈ కథను పరిచయం చేసింది. ఏక్తాకపూర్ తీసిన ‘చంద్రకాంత’ సీరియల్ కలర్స్ టీవీ ప్రసారం చేసింది. విమర్శనాస్త్రాలు నవలా రచయిత దేవకీ నందన్ ఖత్రీ మనవడు కమలపతి ఖత్రీ ‘చంద్రకాంత’ సీరియల్‌కి దర్శకుడు నీర్జాగులేరి న్యాయం చేయలేదని విమర్శించాడు. నవలలోని చిట్టడవి, గూఢచర్యం, మంత్రవిద్యలు వంటి ప్రధానాంశాల పట్ల నిర్లక్ష్యం చేశారని ఆరోపించాడు. చునాగఢ్ కోటలోని పాత్రలు, వరసలను విమర్శిస్తూ అతిశయోక్తిగా ఉందని, అసలు చంద్రకాంతకు ఎంతోదూరం ఉందని అభిప్రాయపడ్డారు. ఒక ప్రేమ కథకు రూపాలు ఎన్నో ‘చంద్రకాంత’ స్టోరీలైన్ ఒకటే అయినా ఆ తర్వాత రకరకాల రూపాలను నింపుకున్న నవలలు ఎన్నో వచ్చాయి. వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగినవి చంద్రకాంత – వీరేంద్రసింగ్ పిల్లల సాహసకృత్యాలతో కూడిన సిరీస్. సినిమా విరమణ ప్రముఖ సినీ నిర్మాత విధు వినోద చోప్రా ‘చంద్రకాంత’ని సినిమాగా తీయాలని ప్లాన్ చేశారు. అమితాబ్‌బచ్చన్, అభిషేక్ బచ్చన్లను ప్రధాన పాత్రలుగా తీసుకోవడానికి సిద్ధమయ్యారు. దర్శకుడు రామ్మద్వని ఓకే అనుకున్నారు. కానీ, చివరకు చంద్రకాంత సెట్స్ మీదకు వెళ్లలేకపోయింది. – ఎన్.ఆర్ వీరేంద్ర–చంద్రకాంత వీరేంద్రసింగ్గా మెప్పించిన నటుడు షహబజ్ఖాన్. చంద్రకాంతతో పాటు బేతాల్ పచ్చీసి, యుగ్, ది స్వరోద్ టిప్పు సుల్తాన్.. వంటి వాటిలో నటించి ప్రఖ్యాతి చెందాడు. 2018లో చైనీస్ బ్లాక్‌బస్టర్ సినిమా ‘డైయింగ్ టు సర్వైవ్’లో నటించాడు. చంద్రకాంత హీరోయిన్ షిఖా స్వరూప్. 1988 మిస్ ఇండియా ఇంటర్నేషనల్ విజేత షిఖా. మోడల్, బాడ్మింటన్ ప్లేయర్ కూడా. టీవీ సీరియల్స్‌లోనే కాకుండా దాదాపు 11 సినిమాలో నటించి, ప్రేక్షకుల మెప్పు పొందారు షిఖా. -
మనిషిని దెయ్యం ప్రేమిస్తే...
‘‘ఈ రోజుల్లో చిన్న సినిమాలు విడుదల కావడం చాలా కష్టంగా మారింది. వీటి మనుగడ ఉన్నప్పుడే పరిశ్రమ పచ్చగా ఉంటుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం చిన్న సినిమాల కోసం ఓ ప్రత్యేక చానల్‌ను ఏర్పాటు చేస్తోంది. శాటిలైట్ రైట్స్ వైజ్‌గా చిన్న సినిమాలకు ఇది మంచి అవకాశం’’ అని నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. సుజయ్, చంద్రకాంత్, తనిష్క, రష్మీ, సోని ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘నాకు మనసున్నది’. రాజశేఖర్ దర్శకత్వంలో సాయి హాసిని ప్రొడక్షన్స్ పతాకంపై నాన్చేరి దేవా శంకర్‌గౌడ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణ గౌడ్ ట్రైలర్ రిలీజ్ చేసారు. రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘ఒక దెయ్యం మనిషిని ప్రేమిస్తే ఎలా ఉంటుందన్న ఆసక్తికర కథాంశంతో సాగే సినిమా ఇది. సినిమా పూర్తయి చాలా రోజులవుతున్నా విడుదల పెద్ద టెన్షన్‌గా మారింది. నిర్మాత సాయి వెంకట్‌గారు, ప్రతానిగారు, డైరెక్టర్ సిరాజ్ సపోర్ట్‌తో ఈ నెల 20న విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఇప్పటి వరకూ ఎన్నో దెయ్యం సినిమాలు వచ్చాయి. కానీ, మా సినిమా చాలా కొత్తగా ఉంటుంది’’ అన్నారు చిత్ర నిర్మాత శంకర్ గౌడ్. నిర్మాత సాయి వెంకట్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఉదయ్ శంకర్, కెమెరా: వెంకీ పెద్దాడ. -
ప్రియురాలు కఠినం!
‘‘ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం’ టైటిల్ చక్కగా ఉంది. టీజర్, ట్రైలర్ చూస్తుంటే సినిమా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. పాటలు చాలా బాగున్నాయి. గోవర్ధన్‌కి ఈ సినిమా మంచి పేరు తీసుకురావడం ఖాయం’’ అని నిర్మాత బెక్కెం వేణుగోపాల్ (గోపి) అన్నారు. చంద్రకాంత్ హీరోగా, రాధిక, పల్లవి డోరా హీరోయిన్లుగా గోవర్ధన్ గజ్జల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం’. రఘురామ్ రొయ్యూరు, శ్రీకాంత్ పద్మనాభం, గోవర్ధన్ గజ్జల నిర్మాతలు. నేడు విడుదలవుతోన్న ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ‘‘అందమైన రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రమిది. షూటింగ్ మొత్తం అమెరికాలో జరిగింది. మా చిత్రంలో నటించినవారు, పని చేసినవారు అమెరికాలోని తెలుగువారే కావడం విశేషం’’ అన్నారు దర్శకుడు. ‘‘మంచి సబ్జెక్ట్. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు చంద్రకాంత్. -
చాలా త్యాగాలు చేశా!
‘‘సినిమా మీద ప్రేమతో మంచి ఉద్యోగాన్ని వదులుకున్నాను. కలను సాకారం చేసుకునేందుకు లాస్ ఏంజిల్స్‌లో ఫిల్మ్‌మేకింగ్ కోర్స్ నేర్చుకున్నాను. నేను తీసిన షార్ట్ ఫిల్మ్స్‌కి వచ్చిన ప్రసంశలు, ప్రోత్సాహంతో ఈ సినిమాను రూపొందించా’’ అన్నారు దర్శక–నిర్మాత గోవర్థన్ గజ్జల. చంద్రకాంత్, రాధికా మెహరోత్రా, పల్లవి డోరా ముఖ్య పాత్రల్లో మిత్రుల సహకారంతో ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘ప్రేమ ఎంత మధురం... ప్రియురాలు అంత కఠినం’. తనికెళ్ళ భరణి, తులసి, ‘జెమిని’ సురేశ్ నటించిన ఈ చిత్రం ఈ నెల 17 విడుదల కానుంది. గోవర్థన్ మాట్లాడుతూ– ‘‘కొందరు సినిమా ప్రముఖులకు, సన్నిహితులకు సినిమా చూపించాను. బాగుందని మెచ్చుకున్నారు. లవ్‌లో సక్సెస్ అయ్యేందుకు అమెరికా వెళ్లిన ఓ కుర్రాడి జీవితంలోకి మరో అమ్మాయి వస్తుంది. అప్పుడు అతని జీవితం ఎలాంటి టర్నింగ్స్ తీసుకున్నది అన్నదే చిత్రకథ. ఇది ట్రయాంగిల్ లవ్‌స్టోరీ కాదు. ఈ సినిమా విడుదల విషయంలో నిర్మాత బెక్కం వేణుగోపాల్ అందించిన ప్రోత్సాహానికి రుణపడి ఉంటాను. ఈ సినిమా కోసం వృత్తిపరంగా, వ్యక్తిగతంగా చాలా త్యాగాలు చేశాను. అవుట్‌పుట్ చూశాక నేను పడిన కష్టాలన్నింటినీ మరచిపోయాను’’ అన్నారు. -
మనుషులను ప్రేమించే దెయ్యం
సుజయ్, తనిష్క, చంద్రకాంత్, రష్మీ, సోని ముఖ్యతారలుగా రాజశేఖర్ దర్శకత్వంలో దేవశంకర్ గౌడ్ నిర్మింంచిన సినిమా ‘నాకూ మనసున్నది’. ఉదయ్‌కిరణ్ స్వరపరచిన ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ– ‘‘పాటలు వినసొంపుగా ఉన్నాయి. ఈ సిన్మా విజయవంతమై నిర్మాతకు లాభాలు రావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘దెయ్యం మనుషుల్ని ప్రేమించడమనేది కొత్త కాన్సెప్ట్. ట్రైలర్ బాగుంది’’ అన్నారు సాయి వెంకట్. నటి కవిత, నటుడు బానుచందర్, నిర్మాత టి. రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: పెద్దాడ వెంకట రమణ.