త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరామ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణిచింది. యాక్సిడెంట్‌లో ఆమెకు పెద్దగా గాయాలు కానప్పటికీ ఆ సమయంలో గుండెపోటు రావడంతో కన్నుమూసింది. నటి మృతిని ఆమె ప్రియుడు, నటుడు చందు జీర్ణించుకోలేకపోయాడు. పవిత్ర లేకుండా ఉండలేకపోతున్నానంటూ ఇంటర్వ్యూలలో కన్నీరుమున్నీరుగా విలపించాడు.
ముందుగానే హింట్
త్వరలోనే గుడ్‌న్యూస్ చెప్పబోతున్నానంటూ తన చావును ముందుగానే హింటిచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్ వీడియోలలోనూ ఇంకో రెండు రోజులు మాత్రమే.. అంటూ పవిత్రతో కలిసున్న పిక్స్ షేర్ చేశాడు. చివరికి అన్నంత పనీ చేశాడు. హైదరాబాద్‌లోని తన నివాసంలో శుక్రవారం (మే 17న) ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మరణంపై నటుడి తల్లీభార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఐదేళ్లుగా నటితోనే..
చందు తల్లి మాట్లాడుతూ.. 'ఐదేళ్ల నుంచి చందు.. పవిత్రతోనే ఉంటున్నాడు. వాళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నామని చెప్పారు. అప్పటినుంచి తను భార్యాపిల్లల్ని పట్టించుకోవడం మానేశాడు. యాక్సిడెంట్ తర్వాత కూడా నా కొడుకు మాతో మాట్లాడలేదు. నా కోడలు, నేను చూడటానికి వెళ్తే దగ్గరకు కూడా రానివ్వలేదు. అతడు భార్యను ఎన్నో ఇబ్బందులు పెట్టాడు.
మారతాడనుకున్నాం..
తాగి వచ్చి ఆమెను తిట్టేవాడు, కొట్టేవాడు. మారతాడేమోనని అంతా ఎదురుచూశాం. కానీ మారలేదు. యాక్సిడెంట్ తర్వాత అతడి ఫ్రెండ్ వాళ్ల ఇంట్లో ఉన్నాడు. పవిత్ర ఎల్‌ఐసీ డబ్బుల కోసం వెళ్తున్నా అని చెప్పి బయటకు వెళ్లాడు. మేమెవరం ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఇంతలోనే అతడు ఉరేసుకుని చనిపోయాడని తెలిసింది' అంటూ గుండె పగిలేలా ఏడ్చింది చందు తల్లి.
చదవండి: పవిత్రతో గత ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు: చందు భార్య శిల్ప
Comments
Please login to add a commentAdd a comment